25, మార్చి 2020, బుధవారం

శార్వరి ....

శార్వరి  నామ సంవత్సరం  ఎలా మొదలయిందయ్యా అంటే ...

Corona దయవల్ల lockdown అవడం వల్ల... పాలు లేవు... వేప పువ్వు లేదు.. మామిడికాయ లేదు(మొన్నే పప్పులో వేసా! కాస్త దాచిపెట్టానో లేదో గుర్తురావట్లేదు ), కొబ్బరికాయ లేదు.... పనిపిల్ల రాలేదు.... పిల్లలు ఇంట్లో ... అంట్లు సింకులో .... ఆఫీసు పని లాప్టాప్పులో .... అలా మొదలయింది.

దేవుడా! సంవత్సరంలో మొదటిరోజే ఇలా ఉంటే .... ఇక సంవత్సరం అంతా ఎలా ఉంటుందో! అనుకుంటూ లేచా!

ఇంతలోకే ఒక వాఁట్సాప్ మెసేజ్ ....
'వేప పువ్వు ' కావాలా? నేను ఎగిరి గంతేశా !
 'కావాలి... ఎక్కడుంది?'
'బైటికి రా పాపా!'
'వస్తున్నా!'
'మన అపార్ట్మెంట్లోనే ఒక మూల ఉంది ఈ చెట్టు ... ఇంద తీసుకో' అని ఇచ్చింది ఒక దేవత!
'వేప పువ్వు....' ప్చ్! అమెరికాలో కూడా ఇంత ఆనందపడలేదు  దీన్ని చూసి...
'హేయ్.. పనిలో పని... మామిడికాయ కూడా ఇచ్చి పుణ్యం కట్టుకోవచ్చుగా!'
'ఒక్కటె ఉంది.. లేదంటె ఇచ్ఛేదాన్ని !!'
'పర్వాలేదులే ...' నారు పోసినవాడే నీరు పోస్తాడు! అనుకుంటూ లోపలివచ్చా!!

ఇక ఫ్రిడ్జ్ మీద దాడి మొదలు.. అసలే ఈ lockdown దెబ్బకి కొన్న కూరగాయలతో , సరుకులతో నిండిపోయింది! ఆ మహాసముద్రాన్ని ఈది ఎలాగోలా పట్టా!! ఒక మామిడికాయ... మొన్న పప్పులో వేయగా మిగిలింది....

హమ్మయ్య! ఇక ఉగాది పచ్చడి రెడీ!

చందు దయవల్ల ఏదో రెండు పాల పేకెట్లు దొరికాయి!! చుక్క కాఫీ నీళ్లు తాగొచ్చు! పిల్లలకి గుక్కెడు పాలు ఇవ్వొచ్చు!

డిష్ వాషర్ లో డిషెస్ క్లీన్.... పిల్లల హెల్ప్ తో ఇల్లంతా క్లీన్.... తర్వాత ఆఫీసు పనిలో కాసేపు మునిగి తేలి .... పులిహోర, పాయసం,  పచ్చడి చేసి... దేవుడికి పెట్టాం! పిల్లలు, ఆఫీసు వాళ్ళు  ఏమిటో మరి బానే సహకరించారు ఇవాళ! పండగ మహత్యం!

పర్వాలేదు... మరీ అనుకున్నంత దారుణంగా కాకపోయినా ఉగాది బానే జరిగింది! సంవత్సరం మొదటిరోజు బానే మొదలయింది!

సంకల్పం..... ఆ పై దైవ బలం!

ఈ సంకల్పం, ఈ  దైవబలమే మనందరికీ , ఈ ప్రపంచానికి ఈ Corona మహమ్మారి నించి బైట పడేస్తుంది అని నమ్ముతూ ....

ఇంట్లోనే ఉండండి.... జాగ్రత్త గా ఉండండి...

మీ ,

ఇందు :)   

11 కామెంట్‌లు:

రాజ్ కుమార్ చెప్పారు...

పిల్లలు ఏ రకం గా హెల్ప్ చేశారో వివరించగలరు.
ఉగాది శుభాకాంక్షలు.

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

శార్వరీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకూ, చందు గారికి,రోహన్ కి, ప్రణవికి!

NNMuralidhar చెప్పారు...

ఇన్ని వండి, ఇంత పండుగ చేసుకుని లేప్టాప్ లో పని ఎప్పుడు చేసారో ఏం చేసారో వివరించగలరు.

అన్నట్టు శార్వరీ నామ యుగాది శుభాకాంక్షలు 😊

Lalitha చెప్పారు...

భలే! కొత్త సంవత్సరంలో మీ పోస్ట్ చదవడం బావుంది! ఉగాది శుభాకాంక్షలు!

నీహారిక చెప్పారు...

శార్వరి మహాత్యం పాతబ్లాగర్లందరూ బ్లాగు దుమ్ము దులుపుతున్నారన్నమాట ! ఇండియాకి వచ్చేసారా?
ఉగాది శుభాకాంక్షలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

స్వాగతం సుస్వాగతం. బ్లాగ్ లోకానికి పునఃస్వాగతం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ......... మహా

kiran చెప్పారు...

Yelcome indu...happy ugadi...

సిరిసిరిమువ్వ చెప్పారు...

కరోనా పుణ్యమా అని అందరూ ఇలా బ్లాగుల దుమ్ము దులపటం బాగుంది.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

లాక్ డౌన్ ఏమో కానీ కొత్తసంవత్సరం ఇలా అందరి బ్లాగ్స్ మళ్ళీ మొదలు పెట్టడం బావుంది ఇందూ.. కంటిన్యూ చేయండి..

Padmarpita చెప్పారు...

మళ్ళీ బ్లాగ్ లో అందరూ రాస్తే ఎంత బాగుంటుందో.

ఇందు చెప్పారు...

@Raj': Poddune nidra tondaragaa lekavakunda help chesaru ;)

@Rahman: Chala thanks :) meeku kooda... konchem aalasynga :P

@Murali: Bommalu geesaa babu.... inkem pani chestaa nenuuu :D

@Lalitha: Thanks andi. ela unnaruu?

@Nihaarika: Avunandi :) 3 years avutondi vachi. ela unnaaru?

@Bulusu: Mashtaaruuu... vandanaalu. ela unnaaru?

@Muvva garu: Avunandi :) Hope those days will be back :)

@Venu: True! Hope so :) chuddam enthavaraku raastano ;)

@Padmarpita: Thanks avunandi :)