ఇందు: చందు తొందరగా స్నానం చేసి రా..బ్రెడ్ టోస్ట్ చేసి పెడతా...చందు: ఇవాళ టిఫిన్ బ్రేడ్డా?
ఇందు: అవును.ఏం ఒద్దా?
చందు: అంటే...అది..మరి..ఇందు ఇవాళ నాకు ఆకలిగా లేదు...జస్ట్ కాఫీ చాలు...అంతే...
ఇందు: ఏంటి? మళ్లీ మొదలెట్టావా? మేపిల్ సిరప్ ఉంది....చక్కగా వేస్కొని తినొచ్చు...ఏం ఫర్వాలేదు...వెళ్ళు
చందు: ప్లీజ్ ఇందు...బ్రెడ్ మాత్రం నావల్ల కాదు
ఇందు: అసలేంటి నీ ప్రాబ్లం? పోనీ మేపిల్ సిరప్ వద్దు...పీనట్ బటర్...జామ్ ఉంది...తింటావా?
చందు: ఒద్దు ఇందు....నువ్వు తిను అవన్నీ వేసుకుని....నన్ను మాత్రం ఒదిలేయ్!
ఇందు: లేదు చందు.....నువ్వు ఏమి తినకుండా ఆఫీస్ కి వెళ్ళడానికి వీల్లేదు.
చందు: :((((( [మళ్లీ జాలి చూపులు....'నన్నొదిలి పెట్టు' అని]....ఆ! నేను ఇవాల్టికి కార్న్ ఫ్లేక్స్ తింటా
ఇందు: కార్న్ ఫ్లేక్స్ లేదు....గాడిద గుడ్డు ఫ్లేక్స్ లేదు.అయినా ఏంటి బ్రెడ్ తో నీ ప్రాబ్లం? ఎంత బాగుంటుంది అసలు బ్రెడ్? ఇటాలియన్ బ్రెడ్ తెల్సా? అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది.
చందు: నావల్ల కాదు ఇందు.ఐ హేట్ బ్రెడ్....
ఇందు: నాకోసం కూడ తినవా చందు?? [సెంటిమెంటు పిండేసానా? ;) ]
చందు: అలా అంటే ఎలా? నాకు అస్సలు ఇష్టంలేదు ఇందు.యుఎస్ వచ్చిన కొత్తల్లో ఇక్కడ వెజిటేరియన్ ఏమి దొరక్క...కేవలం ఆ డొక్కు శాండ్విచ్...సలాడ్ తిని..తిని ఆ రెండూ అంటే విరక్తి పుట్టింది.అందుకే ఐ హేట్ బ్రెడ్.నువ్వు ఏం తినమన్నా తింటా..బ్రెడ్ దక్క!
ఇందు: నామొహం లే! అన్నిటికీ ఇవే స్టోరీస్...అటు..ఇటు మార్చి చెప్తావ్! అంతేగా!.....క్యాబేజీ పప్పు తింటావా? కాలిఫ్లవర్ కూర?....తీపి గుమ్మడి కూర? సొరకాయ పప్పు? బీట్రూట్ కూర? ఏం తింటావు చెప్పు? ఇన్ని కండీషన్స్....మళ్లీ చేసినవాటికి వంకలు??? ఆ? అదంతా సరే బ్రెడ్డు తింటావా లేదా?
చందు: అసలు ఎలా తింటారు ఇందు బ్రెడ్ ని? అది జ్వరం వస్తే తినే తిండి.ఇక ఈ అమెరికా వాళ్లకి తెలిసిన ఒకే ఒక ఐటం.అయినా నీకీ బ్రెడ్డు పిచ్చేంటి ఇందు??
ఇందు: నాకు బ్రెడ్డు పిచ్చెం లేదు.బ్రెడ్డు అంటే ఇష్టం అంతే! నీకే బ్రెడ్డంటే చేదు.నన్నంటావేంటి? అయినా నీకోసం ఆ డొక్కు..చెత్త...ఇడ్లీలు ఎన్నిసార్లు తినలేదు? నాకోసం ఒక్క బ్రెడ్ స్లైస్ తినడానికి ఎంత ఆలోచిస్తున్నావ్ చందు?
చందు: ఎందుకు ఇందు అంత మాటలంటావ్??? సర్లే నీకిప్పుడు నేను బ్రెడ్ తినాలి అంతేగా? ఇవ్వు ఇటు...తినేస్తా... :((((
ఇందు : [ఇందు మనసు కరిగిపోయింది....పాపం అనిపించింది ] ఒద్దులే...పాపం నీకు ఇష్టం లేదుగా! ఎందుకులే అంత బలవంతంగా తినడం?? నేను మరీ అంత రాక్షసినేం కాదు! డోంట్ వర్రీ...సర్లే నీకిష్టమైన ఉప్మా చేసిపెడతా...ముందు స్నానం చేసి రా!
చందు:
ఇక జింగ్..జింగ్ అని ఈల వేసుకుంటూ...ఎగురుకుంటూ స్నానానికి వెళ్లారు మా చందుగారు...!
ఇదండీ...మా ఇంట్లో బ్రెడ్డు తంతు.ఇది ఒక్కసారి కాదు...మాటీవిలో 'అతడు' మూవీ లాగా...వారానికి ఒకసారి జరుగుతూనే ఉంటుంది....సేం డైలాగ్స్...ఒకటి ముందు...ఇంకోటి వెనుక.అంతే!నాకు బ్రెడ్ అంటే చాలా ఇష్టం.అలాగని నేనేదో అమెరికన్లా ఫోస్ కొడుతున్నా అనుకోకండి...నాకు చిన్నప్పటినించి...టూటీ ఫ్రూటీలు వేసిన మిల్క్ బ్రెడ్ అంటే చాలా ఇష్టం.'లైట్ల బ్రెడ్..లైట్ల బ్రెడ్' అంటూ తినేదాన్ని అట...మా అమ్మా ఎప్పుడు చెబుతూనే ఉంటుంది.మర్చిపోయా చెప్పడం...మా అమ్మకి కూడ బ్రెడ్ అంటే అసహ్యమే...చందు కి,మా అమ్మకి..బ్రెడ్ అంటే ఏదో రోగిష్టిమొహాల తిండిలాగా కనపడుతుంది.జ్వరం వస్తేనే బ్రెడ్ తినాలట.నాకు వీళ్ళకి బ్రెడ్ యుద్ధాలు చాలా జరిగాయి...ఎప్పుడు ఓడిపోయేది మాత్రం నేనే! :((((((((((
ఏం చేస్తాం లెండి..ఏవో బ్రెడ్డు కష్టాలు....ఈమధ్య చందుగారికి బ్రెడ్ సాండ్విచ్ కొంచెం నచ్చుతోంది....బాగా కారంగా...స్పైసీ గా కూర చేసి ఆ సాండ్విచ్లో పెడుతున్నా...పర్లేదు....తినగలుగుతున్నారు అబ్బాయిగారు.... :)
మార్పు అనేది సహజం కదా!
