27, డిసెంబర్ 2010, సోమవారం

ఏల బ్రెడ్డు యన్న యింత హేటు??

ఇందు: చందు తొందరగా స్నానం చేసి రా..బ్రెడ్ టోస్ట్ చేసి పెడతా...
చందు: ఇవాళ టిఫిన్ బ్రేడ్డా?sad
ఇందు: అవును.ఏం ఒద్దా?
చందు: అంటే...అది..మరి..ఇందు ఇవాళ నాకు ఆకలిగా లేదు...జస్ట్ కాఫీ చాలు...అంతే...
ఇందు: ఏంటి? మళ్లీ మొదలెట్టావా? మేపిల్ సిరప్ ఉంది....చక్కగా వేస్కొని తినొచ్చు...ఏం ఫర్వాలేదు...వెళ్ళు
చందు: ప్లీజ్ ఇందు...బ్రెడ్ మాత్రం నావల్ల కాదు puppy dog eyes [ఇక్కడ జాలి చూపులు ఉంటాయి...చలిలో వణుకుతున్న కుక్కపిల్లలా అన్నమాట ]
ఇందు: అసలేంటి నీ ప్రాబ్లం? పోనీ మేపిల్ సిరప్ వద్దు...పీనట్ బటర్...జామ్ ఉంది...తింటావా?
చందు: ఒద్దు ఇందు....నువ్వు తిను అవన్నీ వేసుకుని....నన్ను మాత్రం ఒదిలేయ్!
ఇందు: లేదు చందు.....నువ్వు ఏమి తినకుండా ఆఫీస్ కి వెళ్ళడానికి వీల్లేదు.
చందు: :((((( [మళ్లీ జాలి చూపులు....'నన్నొదిలి పెట్టు' అని]....ఆ! నేను ఇవాల్టికి కార్న్ ఫ్లేక్స్ తింటా big grin [అబ్బ ఆ మొహం 1000 క్యాండిల్ బల్బే]
ఇందు: కార్న్ ఫ్లేక్స్ లేదు....గాడిద గుడ్డు ఫ్లేక్స్ లేదు.అయినా ఏంటి బ్రెడ్ తో నీ ప్రాబ్లం? ఎంత బాగుంటుంది అసలు బ్రెడ్? ఇటాలియన్ బ్రెడ్ తెల్సా? అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది.
చందు: నావల్ల కాదు ఇందు.ఐ హేట్ బ్రెడ్....angry[ఐ హేట్ యు అన్న రేంజ్ లో చెప్పాడు పిల్లాడు]
ఇందు: నాకోసం కూడ తినవా చందు?? [సెంటిమెంటు పిండేసానా? ;) ]
చందు: అలా అంటే ఎలా? నాకు అస్సలు ఇష్టంలేదు ఇందు.యుఎస్ వచ్చిన కొత్తల్లో ఇక్కడ వెజిటేరియన్ ఏమి దొరక్క...కేవలం ఆ డొక్కు శాండ్విచ్...సలాడ్ తిని..తిని ఆ రెండూ అంటే విరక్తి పుట్టింది.అందుకే ఐ హేట్ బ్రెడ్.నువ్వు ఏం తినమన్నా తింటా..బ్రెడ్ దక్క!crying
ఇందు: నామొహం లే! అన్నిటికీ ఇవే స్టోరీస్...అటు..ఇటు మార్చి చెప్తావ్! అంతేగా!.....క్యాబేజీ పప్పు తింటావా? కాలిఫ్లవర్ కూర?....తీపి గుమ్మడి కూర? సొరకాయ పప్పు? బీట్రూట్ కూర? ఏం తింటావు చెప్పు? ఇన్ని కండీషన్స్....మళ్లీ చేసినవాటికి వంకలు??? ఆ? అదంతా సరే బ్రెడ్డు తింటావా లేదా?angry
చందు: అసలు ఎలా తింటారు ఇందు బ్రెడ్ ని? అది జ్వరం వస్తే తినే తిండి.ఇక ఈ అమెరికా వాళ్లకి తెలిసిన ఒకే ఒక ఐటం.అయినా నీకీ బ్రెడ్డు పిచ్చేంటి ఇందు??
ఇందు: నాకు బ్రెడ్డు పిచ్చెం లేదు.బ్రెడ్డు అంటే ఇష్టం అంతే! నీకే బ్రెడ్డంటే చేదు.నన్నంటావేంటి? అయినా నీకోసం ఆ డొక్కు..చెత్త...ఇడ్లీలు ఎన్నిసార్లు తినలేదు? నాకోసం ఒక్క బ్రెడ్ స్లైస్ తినడానికి ఎంత ఆలోచిస్తున్నావ్ చందు?
చందు: ఎందుకు ఇందు అంత మాటలంటావ్??? సర్లే నీకిప్పుడు నేను బ్రెడ్ తినాలి అంతేగా? ఇవ్వు ఇటు...తినేస్తా...  :((((
ఇందు : [ఇందు మనసు కరిగిపోయింది....పాపం అనిపించింది ] ఒద్దులే...పాపం నీకు ఇష్టం లేదుగా! ఎందుకులే అంత బలవంతంగా తినడం?? నేను మరీ అంత రాక్షసినేం కాదు! డోంట్ వర్రీ...సర్లే నీకిష్టమైన ఉప్మా చేసిపెడతా...ముందు స్నానం చేసి రా!
చందు: happyమా మంచి ఇందు...ఎంత బుద్ధిగా మాట వింటుందో!! [అసలు మీనింగ్....'నీమొహం లే...చూసావా...నేనే గెలిచాను' అని]
ఇక జింగ్..జింగ్ అని ఈల వేసుకుంటూ...ఎగురుకుంటూ స్నానానికి వెళ్లారు మా చందుగారు...!

ఇదండీ...మా ఇంట్లో బ్రెడ్డు తంతు.ఇది ఒక్కసారి కాదు...మాటీవిలో 'అతడు' మూవీ లాగా...వారానికి ఒకసారి జరుగుతూనే ఉంటుంది....సేం డైలాగ్స్...ఒకటి ముందు...ఇంకోటి వెనుక.అంతే!నాకు బ్రెడ్ అంటే చాలా ఇష్టం.అలాగని నేనేదో అమెరికన్లా ఫోస్ కొడుతున్నా అనుకోకండి...నాకు చిన్నప్పటినించి...టూటీ ఫ్రూటీలు వేసిన మిల్క్ బ్రెడ్ అంటే చాలా ఇష్టం.'లైట్ల బ్రెడ్..లైట్ల బ్రెడ్' అంటూ తినేదాన్ని అట...మా అమ్మా ఎప్పుడు చెబుతూనే ఉంటుంది.మర్చిపోయా చెప్పడం...మా అమ్మకి కూడ బ్రెడ్ అంటే అసహ్యమే...చందు కి,మా అమ్మకి..బ్రెడ్ అంటే ఏదో రోగిష్టిమొహాల తిండిలాగా కనపడుతుంది.జ్వరం వస్తేనే బ్రెడ్ తినాలట.నాకు వీళ్ళకి బ్రెడ్ యుద్ధాలు చాలా జరిగాయి...ఎప్పుడు ఓడిపోయేది మాత్రం నేనే! :((((((((((

ఏం చేస్తాం లెండి..ఏవో బ్రెడ్డు కష్టాలు....ఈమధ్య చందుగారికి బ్రెడ్ సాండ్విచ్ కొంచెం నచ్చుతోంది....బాగా కారంగా...స్పైసీ గా కూర చేసి ఆ సాండ్విచ్లో పెడుతున్నా...పర్లేదు....తినగలుగుతున్నారు అబ్బాయిగారు.... :)
మార్పు అనేది సహజం కదా! winking అలాగని మనం మారకూడదు...ఎదుటివారిని మార్చాలి tongue

125 కామెంట్‌లు:

మధురవాణి చెప్పారు...

అహహా.. బాగున్నాయ్ మీ బ్రెడ్డు కష్టాలు! కొసమెరుపు మరీ బాగుంది.. ;) కానీ, నాక్కూడా బ్రెడ్ తినమంటే కష్టమే! :(

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మరే బ్రెడ్ ఎలా తింటారండీ అసలు.. అది కేవలం పేషంట్స్ తిండి... నేనుకూడా తప్పనిసరి పరిస్థితుల్లో విషం మింగినట్లు మింగేస్తా కానీ బ్రెడ్ అస్సలు నచ్చదు. నా ఓటు కూడా ఉప్మాకే...
హల్లో హల్లో ఇక్కడెవరు ఇడ్లీని ఏదో అంటున్నారు.. అసలు మల్లెపువ్వుల్లా తెల్లగా మెత్తగా ముట్టుకుంటే మాసిపోయేట్లండే ఇడ్లీ నచ్చదా.. అసలు అంత ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఇంకేదైనా ఉందా అని ప్రశ్నిస్తున్నా అధ్యక్షా...

అశోక్ పాపాయి చెప్పారు...

బాగున్నాయండి మీ కబుర్లు మీ బ్రెడ్డు కష్టాలు..:))

రాజ్ కుమార్ చెప్పారు...

అసలు ఎలా తింటారు ఇందు బ్రెడ్ ని? అది జ్వరం వస్తే తినే తిండి.రైటో రైటు..:) :)

nice post ఇందుగారు.

శిశిర చెప్పారు...

:) బ్రెడ్‌ని ఇష్టంగా తింటారా? బాబోయ్.. నా వల్ల కాదు. నేనూ చందు గారి పార్టీనే. అది జ్వరమొచ్చినపుడు తినే తిండి. No doubt. :)

ఇందు చెప్పారు...

వా...వా....అందరూ చందు పార్టీనే!నా పార్టీ అదే...బ్రెడ్డు పార్టీ ఎవరూ లేరా? మమ్మీ!! వా..వా...

కొత్త పాళీ చెప్పారు...

టపా యింకా చదవలేదు, కానీ శీర్షికలో జరిగిన ఛందోభంగానికి నా హృదయం క్షోభించి ఈ వ్యాఖ్య రాస్తున్నా - ఏల బ్రెడ్డు యన్న యింత హేటు - అని చిన్న మార్పుచేస్తే చక్కటి ఆటవెలది పాదం అవుతుంది.

మంచు చెప్పారు...

ఒక బ్రెడ్ ఫ్యాన్ గా మీకు , బ్రెడ్ కి సపొర్ట్ చెయ్యాలని ఉన్నా ఆ పక్క గొదావరి కదా... తప్పదు నేను ఈ సారికి అటువైపే వెళ్ళాలి ... తప్పదు :D

బ్రెడ్ ని ఇస్టంగా తినే వంటకం గా మార్చే పేటెంటెడ్ రెసిపీ ఒకటి ఉంది....ఉండండీ ఈ వీకెండ్ కి నా బ్లాగ్ లొ కొడతా :-))

ఇందు చెప్పారు...

@కొత్తపాళీ:శీర్షిక సరిచేసానండీ...నాకు మరీ అంత డీటయిల్స్ తెలియవు.మీరు హర్ట్ అయితే క్షమించండీ..ఈసారి కొంచెం జాగ్రత్తగా పడతానులేండి.తప్పుని తెలియచేసినందుకు ధన్యవాదాలు :)

భాను చెప్పారు...

నీనూ మీకు అగైనేస్తే ఈ బ్రెడ్ విషయంలో...మరీ ఎలా తిన్టారండీ. ఏదో జ్వరం వచ్చినప్పుదంటే వేరు కానీ. అంతా బానే ఉంది కాని " . ఇక్కడ జాలి చూపులు ఉంటాయి...చలిలో వణుకుతున్న కుక్కపిల్లలా అన్నమాట" మరీ పోలిక ఇలాన ఎంత బ్రెడ్ తినక పొతే మాత్రం...:)) పాపం మీ చందు గారు. :)) మరీ అంట కోపమయితే ఎలాగండీ..
వేణు గారూ ఇడ్లీ సాహిత్యం అని మొన్నే రేడియో లో విన్న అది వింటే మీ ఇడ్లీ సంగతి కూడా ఇందు గారి బ్రెడ్డు లానే అయిపోతుంది. .:))

ఇందు చెప్పారు...

@ మంచు: ఇది మరీనండీ..అబ్బా!అబ్బా! ఏం ప్రాంతీయ అభిమానం....హ్హహ్హ! పేటెంటెడ్ రెసెపీఆ! ఇంకో చుంబరస్కా టైపా? ఇంతకీ అది స్వీటా? హాటా? మా చందుగారికి తీపి పదార్ధాలు చేదుగా ఉంటాయిలేండీ...వారిదంతా కారం బాచ్!అదేంటో గుంటూరు వారి శాఖ తగిలినట్టుంది ;)

ఇందు చెప్పారు...

@ భాను:ఎటూ నన్ను సపోర్ట్ చేయకపోగా..కనీసం చందుగారి మీద ఈగ కూడా వాలనివ్వట్లేదుగా! వా..వా! ఏం ఫర్వాలేదు.మీ అందరి సపోర్ట్ తనకేగా! నేనే పాపం :( నాకు కోపం ఏమీ లేదండీ...ఊర్కే అలా ఏడిపిస్తూ ఉంటా...ఆ టైంలో మా చందు గారి ఫేస్ చూస్తే నాకు నవ్వాగదు.అయినా సీరియస్నెస్ నటిస్తూ కొంచెం కొంచెం ఏడిపిస్తూ ఉంటా...అంతే :))

ఇందు చెప్పారు...

@ మధురవాణి: థాంక్యు..థాంక్యూ..ఐతే మీరు చందు పార్టీయే! :(

@వేణూ శ్రీకాంత్ :ఐతే మీరు కూడా మా చందుగారిలాగా బాడ్ బోయ్ అన్నమట.ఉడతలంటే ఇష్టం...డొక్కు ఇడ్లీలంటే ఇష్టం :P....బ్రెడ్దంటే కష్టం...హ్మ్! ఎన్ని చెడ్డ లక్షణాలు!! :))ఇడ్ల్లీలు మల్లె పువ్వుల్లా ఉంటాయా? నాకంటికి అవి ఇడ్లీలు కాదు...డెడ్లీలు :X నేను మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అధ్యక్షా :))

@అశోక్ పాపాయి:థాంక్యూ అశోక్ గారు..చందు ని సపోర్ట్ చేయలేదుగా! మీరు చాల మంచివారు :)

Unknown చెప్పారు...

మాటీవిలో 'అతడు' మూవీ లాగా...సూపర్ పోలికండి..కానీ నేనూ బ్రెడ్డు పార్టీ కాదండి..

ఇందు చెప్పారు...

@ వేణూరాం :మీరు బ్రెడ్ హేట్ పార్టీయే! :((

@ శిశిర: మీరుకూడా నా శిశిరగారు? హయ్యో! నాకెవరూ అండాదండా లేరా?

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చూశారా మీకు తెలీకుండానే ఇడ్లీలు డెడ్లీలు అంటూ పొగిడేశారు :-) (Deadly In a super positive sense హ హ :) అదేకదా నేకూడా చెప్తుంటా... సరిగా చేయడం వస్తే ఇడ్లీలు మల్లెలంత తెల్లగానూ మెత్తగానూ వస్తాయ్ ఇక నెయ్యీ+కారప్పొడి, సాంబార్, పల్లీ చట్నీ, శనపప్పు చట్నీ ఇలా ఏ కాంబినేషన్ తోనైనా నోరూరించేస్తాయ్...

ఇందు చెప్పారు...

@వేణూ శ్రీకాంత్ :మీకు నా తిట్టు కూడా పొగడ్తలా అనిపించిందన్నమాట.నేను ఇడ్లీలు బానే చేస్తాలేండీ...చందు కి ఇష్టం కదా! మల్లెపువ్వులాగే వస్తాయి.కొబ్బరి+పల్లీ చట్నీ చేస్తా! ఇడ్లీ చేసినరోజు మా ఇంట్లో పండగ అన్నమాట.హ్మ్! ఏవిటో మీ ఇడ్లీ ప్రియత్వం!!

కొత్త పాళీ చెప్పారు...

శీర్షిక విషయం అర్ధం చేసుకున్నందుకు నెనర్లు. హృదయం సంక్షోభం అని నేనుకూడా కొంచెం సెంటీ ఓవరుడోసు వేశాలేండి :)
మీరు ఒక పని చెయ్యక తప్పదు. చందుగార్ని బెదిరించో బెల్లించో ఏనార్బరు తీసుకుపోయి, అక్కడ జింగర్‌మెన్ వాడి షాపు దర్శనం చేయించండి. అక్కడ రకరకాల బ్రెడ్డురాజాల్ని రుచిచూపించండి. ఇహ బ్రెడ్డో న్నమహ అనకపోతే - జింగర్మెన్ వాడు చేసేది బ్రెడ్డే కాదు!

జింగర్మెన్ బ్రెడ్డు మరికొన్ని చోట్ల కూడా దొరుకుతుంది కానీ ఎంతైనా వాడి ముఖ్య స్థావరంలో, ఒక బ్రెడ్డూ పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుంటే వచ్చే ఎఫెక్టు వేరు కదా!
Zingerman's
422 Detroit Street
Ann Arbor, MI 48104

మధురవాణి చెప్పారు...

ఇక్కడెవరో ఇడ్లీ గురించి చెప్తున్నారు.. నన్ను కూడా ఇడ్లీ అభిమాన సంఘంలో చేర్చుకోవాలని మనవి. :) వేడి వేడి ఇడ్లీ, కారప్పొడి, నెయ్యి ఉంటే చాలు.. అలా స్వర్గం దాకా వెళ్లి రావచ్చు. ;)

Ennela చెప్పారు...

అర్రెర్రెరే ఆగండక్కడ..నేనున్నానిక్కడ... ఎందుకు చెపుతున్నానొ అర్థం చేసుకోండి..
కుంచెం సపోర్ట్ అండీ...మరంటా చాలా చిన్నప్పుడంటా జొరం వొస్తేనే బ్రెడ్డంట...అందుకని అప్పట్లో మాట్లాడితే జొరం వచ్చేదంట...కానీ ఇపూడంటా పిల్లలు బ్రెడ్ తింటే..."అయ్యయ్యో వీళ్ళసలు ఏమీ తినలేదే ఇవ్వాళ" అని ఫీలింగ్ అంట..సివరాకరికి చెప్పొచ్చేదేంటంటే....అల్లక్కడ చిన్నప్పుడు ఇందూ గారికి పుల్ల్ సప్పొర్టిచ్చీసినా..ఇల్లిక్కడ...బ్రెడ్ తింటె పాపం చందూ గారికి కడుపెట్టా నిండుతుందీ అని ప్రశ్న....పాపం వదిలేద్దురూ...అంత కష్ట పడి బ్రెడ్ ఏం వండుతారు గానీ, ఏదో సింబళ్గా ఇడ్లీయో...ఇడియప్పమో...ఇంకా సింబళ్గా కావాలంటే యే అరిసలో వండీయొచ్చుగా రోజూ బ్రేక్ఫాస్ట్కీ.....

Ennela చెప్పారు...

అయ్యో మా ఇందు గారు అండ దండా అడిగారని చూడలేదే...సారీ అండీ...ఇదిగో నండీ...ఇచ్చేస్తున్నా....

http://music.bec0de.com/video/THRWCwE7hY4/Bhadrachalam_Konda_(gang_Leader)_-_Bappilahiri_Sangeetam

Sree చెప్పారు...

hehehe.. nenu unnaale indu bread okay okaygaa tintaa.. cheselaaga cheste bread kooda yama yama yummygaa untundi.. even simple toastgaa neyyesi cheste naaku bhale ishtam.. grilled sandwich, toast meeda lettuce mayonnaise, ketchup, ceaser salad jalepenos laantivi ennenno esukuni beebatsamaina combinationslo tintaanu nenu

మంచు చెప్పారు...

అబ్బే... మన చేతుల్లొ ఉంటుంది కదా... పేటెంటెడ్ రెసిపీస్ ఎలా పడితే అలానే చేసుకొవచ్చు...... ఇప్పుడు హాట్ కావాలి అంతే కదా... అదే చేసేద్దాం మరి :-)

ఇక్కడ కామెంట్ పెట్టిన వాళ్ళందరిని కూడా బ్రేడ్ ఫావరెట్స్ గా మార్చేద్దాం :-))

లత చెప్పారు...

ఇందు గారూ,
డోంట్ వర్రీ,మీకు తోడు మేమున్నాము,
ప్లెయిన్ బ్రెడ్ తినమంటే బాధపడాలి కానీ సింపుల్ గా ఎన్ని రకాలు ఐనా చేసుకుని తినొచ్చు
ఆ విషయం లో మా వారితో కూడా ప్రాబ్లెం లేదు
సో నేను మీ పార్టీ నే.

ఇందు చెప్పారు...

@ కొత్త పాళీ:కొత్తపాళీగారు! మీకు బోలెడు థాంకూలండీ...చందు సంగతేమో...నేను మాత్రం పండగ చేసుకుంటా...అడ్రస్ కూడా ఇచ్చారు! ఎంత మంచివారండీ!

@ మధురవాణి:మధురగారు! మీరు బ్రెడ్డు హేటరు సరే! ఇడ్లీ ఫాన్ కూడానా? ఏవిటో...ఒక్కళ్ళకీ మంచి టేస్ట్ లేదు ;)


@ఎన్నెల:హ్హహ్హహ్హా...సూపరు! ఐతే ఏకంగా మెగాస్టారే నాకు అండా-దండా అన్నమాట :)) హ్మ్! బ్రెడ్ ఒక్కటి పెట్టి ఎలా పంపిస్తానండీ? ఒక లోటాడు కాఫీ కూడా ఉంటుంది కదా! ;) మీరేం బెంగ పడకండీ...మా చందుగారు ఆకలి దగ్గర నో మొహమాటంస్..ఎప్పుడు దోసెలు..ఇడ్లీలు...ఉప్మా..పెసరట్టు...తపాల చెక్కా...నూడిల్స్...పులిహోర...ఇలా చేస్తునే ఉంటానండీ..అప్పుడప్పుడు బ్రెడ్.అది కూడా తినకుండా మారం చేస్తాడు ఈ పిల్లాడు! ఏం చెప్పనూ?

ఇందు చెప్పారు...

@ Sree: Sree Thankyou for supporting me. Yeah! mee combinations konchem variety gane unnay! avanni veste tinabul gane untunda?


@ మంచు:సరే! అలాక్కానిచ్చేయండీ.....మాంఛి స్పైసీగా చేసేయండీ. దెబ్బకి బ్రెడ్డ్ హేటర్స్ అందరూ...ఫాన్స్ ఐపోవాలంతే! :))


@ satish:హ్మ్! థాంక్సండీ...హ్మ్! అనుకున్నాలేండీ..ఎవరో దయామయులు ఒకరూ..ఇద్దరూ తప్ప అందరూ బ్రెడ్డు హటర్సే !! :((

ఇందు చెప్పారు...

@ లత :లతగారు! ప్లైన్ బ్రెడ్డు..అదీ మా చందు గారికి పెట్టే సాహసం కూడానా? ఎప్పుడూ రకరకాలుగా చేస్తానండీ! అయినా తినరే! బ్రెడ్ మసాలా..టోస్టెడ్ బ్రెడ్ సాండ్విచ్...బ్రెడ్ హల్వా...ఎన్నో! ఏదీ నచ్చదు! :( మీరు నాకోసం ఎమైనా కారం-కారం బ్రెడ్డు వంటలు కనిపెట్టండీ! :( నన్ను సపోర్ట్ చేసినందుకు థాంకూలు :)

మనసు పలికే చెప్పారు...

నేనున్నాను ఇందు గారు. నేనున్నాను మీ పార్టీ:) నాక్కూడా ఇష్టమే బ్రెడ్ అంటే:))
Post Super..

రాధిక(నాని ) చెప్పారు...

బాగుంది ఇందు మీ బ్రెడ్ పాట్లు:)).నాకూ మా అమ్మాయి తో ఇవే పాట్లు. తనూ మీ పార్టీయే ఇడ్లీ అంటే మొహం మాడ్చుకుంటాది.తనుండగా వారానికి ఒకరోజు ఇడ్లీ చేసినా గొడవే..హాస్టల్ నుండి ఇంటికొస్తూనే బ్రెడ్ తెచ్చుకుంటుంది ( మా ఊరి లో దొరకవని).

ఆ.సౌమ్య చెప్పారు...

నాకూ ఒకప్పుడు బ్రెడ్ అంటే రోగిష్టి తిండీ అనే అభిప్రాయం. చాలా సహ్యించుకునేదాన్ని. కాకపోతే ఈ మధ్యన చాలా ఇష్టపడుతున్నను. ముఖ్యంగా చీజ్ sandwich, బ్రెడ్ ఆంలెట్ అవీ బాగా ఇష్టపడుతున్నా.

మీ చందు కూడా మారతారులెండి నాలాగే :)

సవ్వడి చెప్పారు...

అసలు ఇడ్లీని కొబ్బరి చెట్నీతో గాని ఉల్లి చెట్నీతో గాని ఉంటుంది మజా............. కనీసం ఓ పది గుటకాయ స్వాహా ఐపోవు...:):)
బ్రెడ్ ని తింటాను కాని పక్కన్ బూస్టో హార్లిక్సో ఉండాలి. వాటిలో ముంచుకొని తినమంటే ఎన్నైనా తింటాను.:) ఈ జాములు గీములు అంటే మనవల్ల కాదు. అందులోనూ వారం వారం:):)??
సో నేను కూడా చందు గారి పార్టీనే:):)

శివరంజని చెప్పారు...

అబ్బా బ్రెడ్ కూడా ఫాన్స్ ఉన్నారా ......బ్రెడ్ అస్సలు నచ్చదు... జ్వరం వచ్చినప్పుడు కూడా తినను... వేణు గారు..... నిజమే ఇడ్లీ ని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోవద్దు వాళ్ళకి ఇడ్లీ తినిపించేద్దాం

Unknown చెప్పారు...

హాయ్ ఇందు గారు... ఎప్పుడు ఇడ్లీ తింటే బోర్, అలాగే బ్రెడ్డు కూడా, నా వోటు పెసరట్టు ఉప్ప్మ విత్ అల్లం పచ్చడి. అలా అని బ్రెడ్డు ఎస్తం లేదు అని కాదు. అప్పుడు అప్పుడు పేరు పెట్టవలిసిన వత్తకలు తాయారు చేస్తాను. మీకు కావాలి అంటే చెపుతాను. మీరు చేసి చుడండి. తిన్న నేను బాగానే వున్నాను.

నోట్: మీ వారు బ్రెడ్డు ఇష్టపడాలి అంటే బ్రెడ్డు తో కొంచం క్రిస్పిగా వుండే స్నాక్స్ ట్రై చెయ్యండి. అది ఆఫీసు నుండి వచ్చిన ప్పుడు పెట్టండి ఒక మంచి కాఫీ తో
-- మోహన్

లత చెప్పారు...

అయ్యో ,మీరు చందు గారికి పెడ్తున్నారని కాదండీ
రోగం వస్తే తినే తిండి అంటున్నారు కద బ్రెడ్ ని, అందుకని అలా అన్నాను.అలాగే నాకు తెలిసిన బ్రెడ్ ఐటంస్ మీ కోసం రాస్తాను

kiran చెప్పారు...

ఇందు - నేను మీ వైపే.. :)

బ్రెడ్ ఇది వరకు ఇష్టం ఉండేది కాదు..
ఒక ఆరు నెలల కిందట రోజు...ఒక సాండ్విచ్ ఒక జుఇస్ తాగే దాన్ని...
కాస్త లావు అయ్యావ్ అన్నారు అందరు..:)..

ఇందు చెప్పారు...

@ మనసు పలికే :నిన్న అనుకున్నా అండీ...ఎవరున్నా లేకపోయినా..నాకు ఎన్నెలగారు..అపర్ణగారు...కిరణ్ గారు తోడుంటారని...థాంక్యూ అపర్ణా :)

@ రాధిక(నాని ):హయ్య్! ప్రియా కూడా నాలాగే! మీ అమ్మాయి కూడా భవిష్యత్తులో నా అంత గ్రేట్ అయిపోతుందన్నమాట.ఎందుకంటే ఇడ్లీ వద్దని బ్రెడ్ తినేవాళ్ళందరూ గ్రేట్ కదా :)

@ ఆ.సౌమ్య :హ్మ్! ఏదొ ఇక మంచుగారు...లత గారు..నాకోసం కొత్త కొత్త రెసెపీస్ కనిపెట్టి..అవి నేను వారంత కాకపోయినా ఏదొ నా మిడిమిడి ఙ్గ్నానంతో చేసిపెట్టి...అది చందుకి నచ్చీ...తను మారీ..హ్మ్! అంతా మాయ!(అదేదొ సినిమాలో...ఎల్బీ శ్రీరాం అన్నట్లు)

ఇందు చెప్పారు...

@సవ్వడి:హా! తను ఇదే అంటారు.బ్రెడ్ని కాఫీలొ ముంచుకు తింటా అని. 'తంతా ' అని చెప్పా! నాకు కొంచెం చిరాకు అలా చేస్తే! కాఫెలో బ్రెడ్ ముంచుకు తినేదేంటండీ? ఇక ఇడ్లీలు...హ్మ్! అవి నా పాలిట...పిల్లతెల్ల దయ్యాలు.అవి చేసి...పల్లీ చట్నీ చేసి...చందుకి పెడితే..మీలాగే..పది పైనే స్వాహా! :))


@ శివరంజని:శివరంజని గారు! మధురగారు...శిశిర గారు..భాను గారు...వేణు గారు...అందరూ బ్రెడ్ హేట్ పార్టీ....మీరన్నా...నా పక్కన ఉంటారనుకున్నా! మీరు బ్రెడ్ హేట్ మాత్రమే కాక...వేణు+మధుర+సవ్వడి గారిలాగా...ఇడ్లీ పార్టీఆ? నో!నో! నేనొప్పుకోను!!


@ అమ్మాయి కళలు:ఏటూ..మంచుగారు..లత గారు...నాకోసం కొత్త బ్రెడ్ వంటలు కనిపెట్టే పనిలో ఉన్నారు! పనిలో పని మీరు పెట్టేయండీ మీ బ్లాగ్లో ఆ వంటలు :) వాటికి పేర్లు ఏవొ ఒకటి పెట్టెద్దాం! పేటెంట్ సగం-సగం :) మీ సలహా తప్ప పాటిస్తానండీ. కామెంటినందుకు ధన్యవాదాలు :)

ఇందు చెప్పారు...

@లత: నాకు అర్ధమయిందండీ...మీరెంత మంచివారు...మంచుగారి లాగే! నాకోసం వంటలు వ్రాస్తానంటున్నారు...మీరు నాకు భలే నచ్చేసారు :)


@ kiran :థాంక్యూ కిరణ్.ఏ కారణం ఐతే ఏంటీ..మీరు నా పార్టీ..అది చాలు. :)

Ram Krish Reddy Kotla చెప్పారు...

ఇందు నేను నీ పార్టీనే .. నాకు కూడా బ్రెడ్ సాండ్విచ్ అంటే ఇష్టం ... దాదాపుగా నా బ్రేక్ ఫాస్ట్ రోజూ అదే .. రకరకాల సాండ్విచ్ లు నేనే చేసుకొని తింటా ... :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

>>అబ్బా బ్రెడ్ కూడా ఫాన్స్ ఉన్నారా<< అద్దీ భలే అడిగారు శివరంజని గారు.. ఇడ్లీ జిందాబాద్.. మధుర గారు అదినేనే వచ్చేయండి మనం బ్రెడ్ హేటర్స్ సంఘం ఇడ్లీ అభిమాన సంఘం రెండూ పెట్టేద్దాం చందుగారిని అధ్యక్షులుగా ఎన్నుకుని, సవ్వడి గారు మీకుకూడా వెల్కం :)

ఇందు చెప్పారు...

@ వేణూ శ్రీకాంత్: హన్నా! ఎంత ఇడ్లీ ఫాన్స్-బ్రెడ్ ఏంటీస్ ఐతే మాత్రం ఇలా సంఘాలు పెట్టేస్తారా? మళ్ళి దానికి చందు అధ్యక్షులా? ఇంకా నయం! అయినా నేను+అపర్ణ+మంచు+కిరణ్+కిషన్ గారు..అందర్మ్ కలిసి బ్రెడ్ పార్టీ పెట్తేస్తాం.దానికి అధ్యక్షులు 'బ్రెడ్ పిజ్జ ' కనిపెట్టి పేటెంట్ పొందిన మన మంచు గారు :) అప్పుడు చెప్తాం....మీ ఇడ్లీ పార్టీ సంగతి :P

ramki చెప్పారు...

ఎంటండి ఇందు గారు.........
అందరు కలిసి మీ ఈ పోస్ట్ ని ఘుమ ఘుమ లాడించేస్తున్నారు.......?
ఇడ్లీలు అంటున్నారు, దోశలు అంటున్నారు, అల్లం పచ్చడి అంటున్నారు......అబ్బో..చివరాఖరికి అరిసెలు కూడా.... :)
నోరు వురిపోతోంది....

చివరాఖరుకు నేను చెప్పోచేది ఏంటి అంటే......
అధ్యక్షా.....(ఇది బ్రెడ్ పార్టీ కాని వాళ్ళకి)
ఒక్కసారి... ఒక్కటంటే ఒక్కసారి....పనీర బ్రెడ్ కి వెళ్లి వెజ్ సంద్విచ్ తినండి .....నా సామీ రంగా... నా భూతో నా భవిష్యత్...అని అంటారు....వద్దు అని అన్నా కాని వెళ్లి మరీ తింటారు...అంత అద్భుతం గా వుంటుంది....
చివరాఖరిగా....."ఇందు కలదు అందు లేదు అని సందేహము వలదు...ఎందెందు వెదకిన అందందు కలదు మన ఈ బ్రెడ్.... :) "

ఇందు చెప్పారు...

@Kishen Reddy :చాలా థాంక్స్ కిషన్ :) బ్రెడ్ పార్టీలోకి సాదర స్వాగతం నీకు :)

ఇందు చెప్పారు...

ఏవిటోనండీ రామకృష్ణగారు! మనోళ్ళు...బ్రెడ్ పార్టీ(ఇది నేనే పెట్టా అనుకోండీ)...ఏంటీ బ్రెడ్ పార్టీ కూడా పేట్టేసారు! మిమ్మల్ని ఇప్పుడే నేను బ్రెడ్ సంఘంలో చేర్చేసా! బ్రెడ్ పార్టీలోకి సాదర స్వాగతం.నేను అది తిన్నానండీ.సూపర్బ్ ఉంటుంది కదా! ఈ ఇడ్లీ బాచ్ కి ఆ రుచులు తెలియవులేండీ...ఆ తెల్లపిల్లదయ్యాల్లాంటి ఇడ్లీలు తినీ తినీ బ్రెడ్ గొప్పదనం తెలియట్లేదు :))

మంచు చెప్పారు...

లాభం లేదు వీళ్ళ కొసం నేను బ్రెడ్ తొ ఇడ్లీ ఎలా చెయ్యాలొ కనిపెట్టాల్సిందే ...:-)

కంగారు పడకండీ..కెవ్ మనకండీ.... అది కేవలం ఇడ్లీ ఫాన్స్ కొసం...:D

ఇందు చెప్పారు...

@ మంచు : హ్హహ్హహ్హా! ఐతే బ్రెడ్ పిజ్జా అయిపోయిందీ....ఇక బ్రెడ్ ఇడ్లీ అన్నమాట :)) బాబోయ్! ఏంటీ ఇడ్లీ బాచ్ అంతా ఒక పక్కకొచ్చేయండమ్మా! అప్పుడు మంచుగారి బ్రెడ్ ఇడ్లీతో ఇడ్లీ బాచ్ పని పట్టొచ్చు :))

ramki చెప్పారు...

ఆఆఆ .... ఇదంతా పప్పు బాచ్ అండి......లైట్ తీస్కోండి...
"ఇప్పుడు కాని మన బ్రెడ్ బాచ్ కి ఆ ఇడ్లీ బాచ్ కి కాని ఎన్నికలు పెడితే మనమే గెలుస్తాం అని నొక్కి వాక్కాడిస్తున్న అధ్యక్షా...." :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

అబ్బే లాభంలేదు ఇందుగారు.. మీ అధ్యక్షులవారు ఏదో బ్రెడ్ తినలేనివారికోసం అని బ్రెడ్ పిజా కనిపెట్టారు కానీ తను మా పార్టీనే మా వైపు శివరంజని గారున్నారు.. ఇంకా గోదావరి ఉంది కనుక మాపార్టీనే అని మంచు గారు మొదటి కామెంట్ లోనే చెప్పారు.. తను మాటమీద స్టూలేసుకుని మరీ నిలబడతారు నాకు తెలుసు.. ఇంక అధ్యక్షుడే లేకపోతే పార్టీ ఎక్కడిది :-) హుష్..గప్ చుప్.. అంతా మాయం :-D

అన్నట్లు నిన్న చెప్పడం మర్చిపోయాను చందుగారికి తీపి చేదుగా అనిపిస్తుందా.. ఐతే ఈ విషయంలో మారుచులు వేరనమాట నేను గుంటూరోడ్నైనా కారం ఎంత ఇష్టంగా తింటానో తీపి కూడా అంతే ఇష్టంగా తింటాను :)

Ennela చెప్పారు...

ఇందు గారు, చెప్పడం మరచిపొయాను.బ్రెడ్ ని రెండు రోజులు నీళ్ళల్లో నానెట్టి..రుబ్బి .అల్లం పచ్చిరగాయలు కొట్టేసి...అట్టేసెయ్యొచొహోఓ....అబ్బే..నేనిప్పుడే భోంచేసాను...నాకు పెట్టకండే .

ఇందు చెప్పారు...

మంచుగారు! ఎక్కడున్నా ఇక్కడికి రావలసిందిగా కోరుచున్నాము అధ్యక్షా! మనపార్టీ కి అన్యయం జరుగుతోందండీ! అప్పుడే చీలికలు మొదలయ్యాయి! ఇక గప్పగెంతులే ఆలస్యం :( మంచుగారు! మీరు బ్రెడ్ పార్టీ అధ్యక్షులని ఇక్కడా బ్లాగ్ముఖంగా ఈ ఇడ్లీ పార్టీవారికి తెలియజేయవలసిందిగా ప్రార్ధన

వేణుగారు! మీకు గోదావరుంటే మాకు కృష్ణానది ఉందండీ....ఇంకా అమెరికా దేశస్థులైన కొత్తపాళీగారు..రామకృష్ణగారు కూడా మా వైపే! అంటే మాకు విదేశీ అండబలం కూడ ఉంది :) మీ ఇడ్లీ బాచ్ మమ్మల్ని ఏమీ చేయలేదు :P

ఇందు చెప్పారు...

@ RAMAKRISHNA VENTRAPRAGADA said...
:ఏమోనండీ..మన అధ్యక్షులవారు ఉలకట్లేదు...పలకట్లేదూ....ఈ ఇడ్లీ పార్టీ వారు ఏదొ వ్యుజం రచిస్తున్నారు!

ఎన్నెలగారు! మీకు నేనంటే కోపమా? :( ఏవిటండీ అది? బ్రెడ్ చట్నీఆ? అదిగాని చందుకి పెడితే.....ఇక అంతే...మంచుగారి బ్రెడ్ పిజ్జా పెట్టినా నో యూజ్!మీరు చక్కగా తప్పించుకుంటారా? ఆగండి ముందు మీకే పెడతా!

ramki చెప్పారు...

ఉహూ...ఇంకా లాభం లేదండి....
మన తడ్హాక ఎంటో చూపించాల్సిన టైం దగ్గర పడింది....
ఈ రోజు నుంచి 21 రోజుల (అంటే ఏదో నెంబర్ బావుంది కదా అని వాడేసనులెండి.. :) ) పాటు ఎడతెరపి లేకుండా...పొద్దున్న , మధ్యానం, రాత్రి బ్రెడ్ తో చేసిన రక రకాల వంటలు వండి పెట్టండి.... మీ చందు గారికి....అప్పుడు ఆ అధ్యక్షుల వారే ఒప్పోకుంటారు....బ్రెడ్ గొప్పదో...ఇడ్లీ గొప్పదో.... ఇంక వీళ్ళు ఎన్ని వ్యూహాలు వేసిన ఫలించవు.....
నా మాట విని మంచు గారు వచేలోపు ఇప్పటికి ఇది ఫాలో ఇపొండి.... :)

మంచు చెప్పారు...

శివరంజని అల్రేడీ బ్రేడ్ ఫ్యాన్ గా మారడమైనది. చందూగారు, నేస్తం గారు తదితర ప్రముఖులు కూడా బ్రెడ్ పార్టీలొ చేర్చుకొవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గొదావరి జిల్లాల్లొ కొత్తగా పది బ్రెడ్ ఫ్యాక్టరీలకి నిన్నే శంకుస్థాపన చేసారు... ఇంకేం కావాలి చెప్పండి.

ఇడ్లీలతొ ఎం చెయ్యగలరు చెప్పండీ... మహా అయితే సూర్యవంశం లొ మీనా లా ఇడ్లీలతొ ఉప్మా చేస్తారు అంతే కదా... పూర్తిగా కార్బొ హైడ్రేట్స్.... రవ్వ ఇడ్లీ తప్ప వేరే వేరియేషన్ లేదు. అదే బ్రెడ్ చూడండీ... హాట్ సాండ్విచ్, కొల్డ్ సాండ్విచ్, పుడ్డింగ్, కట్లెట్, బజ్జీ, ఇలా అసలు అంతే లేదు... అదే వేరియేషన్స్ కావాలంటే వైటు, బ్రవున్, హొల్ గ్రైన్, ఇటాలియన్, సాన్ ఫ్రాన్సిస్కొ సౌర్ బ్రెడ్, ఫ్రెంచ్ బాగట్, పిటా బ్రెడ్, అసలు ఎన్నని చెప్పాలంటారు. నా వల్ల కాదు.

Ennela చెప్పారు...

ఏంటొ మీరు సంఘాలు అవీ పెట్టి నన్ను అపార్థం చేసేసుకుంటున్నారు...సప్పోర్టండీ... అర్థం చేసుకోరు..అయినా,
ఎవరయినా వండి పెట్టాలే కానీ...యీ ఎన్నెల బ్రేడ్ అట్టాయినా తింటుంది....మా సికందరాబాదు వాళ్ళ త్యాగానికి హద్దుండదు తెలుసా...

మంచు చెప్పారు...

ఇడ్లి బ్రేక్ ఫాస్ట్ జీవితం లొ ఒక చిన్న భాగమే .. టీనేజ్ లవ్ స్టోరీ లాంటిది జస్ట్ షార్ట్ టైం....

కానీ బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ నుండి లంచ్ డిన్నర్ వరకూ .... మొత్తం జీవితం అంతా అదే అనిపించేంత స్కొప్ కలది.... అంటే జీవిత భాగస్వామిలా అన్నమాట :-)

"ఢా....ం".... నేను ఈ కామెంట్ రాస్తుండగా వెనకనుండి చదివి ఎవరొ ఇప్పుడే ఢాం.... వాళ్ళకి మొహం మీద సొడా కొట్టి వస్తా..... ఇది చదివి మీరు తేరుకున్నకా మళ్ళీ మాట్లాడుకుందాం.

ఇందు చెప్పారు...

రామకృష్ణగారు! మనకోసం...మన అందరి బ్రెడ్డు భవిష్యత్తుకోసం మన అధ్యక్షులవారు బ్రెడ్డు వివరాలతో పాటు ఇద్దరు,ముగ్గురు ఇడ్లీ పార్టీ వారిని బ్రెడ్ పార్టీలో చేర్చడమైనది.పనిలోపని మీరు చెప్పినట్టు....ఇడ్లీ పార్టీ అధ్యక్షుడైన గౌరవనీయులు చందుగారిని మెల్లగా బ్రెడ్లు పెట్టి ఇడ్లీ పార్టీ కి పొగబెట్టే పని కార్యరూపం దాల్చబోతోందీ..మంచి అవిడియా ఇచ్చినదుకు ధన్యవాదాలు :)


గౌరవనీయులైన అధ్యక్ష మహాశయులు మా మంచుగారు సెలవిచ్చినట్టు...ఇలా మా బ్రెడ్డు పార్టీ కొత్త సభ్యులతో..కొత్త వంటకాలతో...కళకళలాడిపోవుచున్నది కావున..ఇడ్లీ పార్టీ డౌన్..డౌన్...బ్రెడ్ పార్టీ జిందాబాద్!

ఎన్నెల గారు! హ్మ్! ఏ చెప్పమంటారు? సరే ఈసారికి అర్ధం చేసుకుంటాలేండీ :P

ramki చెప్పారు...

శుభం...ఇప్పుడు వెన్నెల గారు కూడా మన పార్టీ తీర్థం పుచుకున్నారు....... :)
ఆఆఆ
ఇంక ఎవరైన ఇడ్లీ లు , దోసలు గట్రా అనే వాళ్ళు ఎవరైన వుంటే చేతులు ఎత్తొచు......
వాళ్ళని ఆ పార్టీ అధ్యక్షుల్ని చేసి 21 రోజులు ట్రీట్మెంట్ ఇచేస్తం..... :)

ఇందు చెప్పారు...

ఆహా! మంచుగారు! ఏం చెప్పారండీ! నేను వ్రాసిన లవ్ స్టోరీస్ చదివీ చదివీ మీకు ఇలాంటి కవితలు వెల్లువలా వస్తున్నాయా ఏమిటీ! బాబోయ్!

ఇందు చెప్పారు...

అవునడీ..కథ సుఖాంతమయింది. :)

అజ్ఞాత చెప్పారు...

రెండు బ్రెడ్ ముక్కల మీద ఇంత రభస జరుగుతోందా ఇక్కడ. ప్చ్.. సరే! మీకు రాజీ కుదురుస్తున్నా... వేణూశ్రీకాంత్ లాంటి ఇడ్లోపాసకులు, బ్రెడ్ ని సాంబార్లో ముంచుకునిన్నూ, అలాగే ఎండిపోయిన బ్రెడ్ ముక్కల ప్రియులు చీజ్/టమేటా సాస్ స్నాండ్విచ్ లా చేసుకుని ఇడ్లీలు లాగించమనిన్నూ తీర్పు ఇవ్వడమైనది. ఇక ఈ బ్లాగుల్లో ఆకలి కేకలు వినపడకూడదు, సరేనా? :)

శివరంజని చెప్పారు...

>>>>శివరంజని అల్రేడీ బ్రేడ్ ఫ్యాన్ గా మారడమైనది.>>>>>>>

నన్ను బలవంతం గా బ్రెడ్ ఫాన్ గా మర్చేయాలని కుట్రలు జరుగుతున్నాయి ఇక్కడ రక్షించండి వేణు & మధుర గారు

Nagamani చెప్పారు...

Indu, nenu mee pakka..I like bread..luke warm milk lo veskoni tinadam chaala istam...
delivery ayyaka baby ni chuddaniki prathi okkaru bread testaaru kada..naa delivery appudu naaku inka pandage anukondi..midnight kuda lechi tinesedanni

~Nagamani (Fellow TIAn)

ఆ.సౌమ్య చెప్పారు...

ఏంటి మంచు గరూ ఇడ్లీలలో ఏముంటుందా? ఇడ్లీలలోను రుచులు వేరయా అని....ఎప్పుడైనా పలకూర ఇడ్లీ తిన్నరా? అద్భుతంగా ఉంటుంది. నేను చేస్తే అమృతమే ఇంక. అలాగే మసాల ఐడ్లీ తిన్నారా? పొనీ పేరైనా విన్నారా? తమిళనాడు ఇడ్లీ తిన్నారా, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి.

అందులోనూ మాంచు కొబ్బరి పచ్చడి, కారప్పొడి ఇంత నెయ్యి ఉంటే చాలదూ!

ఒకప్పుడు నేను ఇడ్లీ తినేదాన్నే కాదు, కానీ ఈ మధ్య అస్సలు వదలట్లేదు....నాకు ఆంధ్ర ఇడ్లీ నచ్చదు, తమిళనాడు ఇడ్లీ చాలా నచ్చుతుంది.

ఆంధ్ర ఇడ్లీ అనగా...మినప్పప్పు, రవ్వ తో చేసినది.
తమిళ ఇడ్లీ అనగా మినపప్పు, బియ్యం తో చేసినవి.

Ennela చెప్పారు...

SNKR gaaru, mee teerpu excelllent...ippude idleelni bread toastar lo nunnu, bred ni saambaar lo nunnu padesi vachchaa....hahahaha..intlo vaallaki yee roju vindu bhojaname paapam....hahah

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఇందుగారు మాకు కూడా జర్మనీ నుండి తగినంత విదేశీమద్దతుందండీ.. ఇంకా కూడగట్టడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయ్... హన్నా మీరు మంచుగారు ఇలా శివగారిని, నేస్తం గారిని అందరినీ బలవంతంగా మీ పార్టీలొకి లాగేసుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా :-)

మంచుగారు ఏం చెప్పారుసారు మీటీనేజ్ లవ్ జీవితభాగస్వామి ఫిలాసఫీ చదివి నేకూడా ఢాఆఆ..మ్ :-D ఇప్పుడే మావాళ్ళు ఓ 20 లీటర్ల వాటర్ క్యాన్ నా మొహం మీద ఖాళీ చేసి మళ్ళీ లేపారు :-)

రామకృష్ణ గారు పనీరా గుర్తుచేసి దెబ్బకొట్టేశారండి. ఇపుడు బ్రెడ్ ని తిట్టాలంటే మనసు రావడంలేదు :-) ఐనా సరే ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఇంట్లో తినిపించే బ్రెడ్ కనుక అలుపెరగక నా వాదాన్ని కొనసాగిస్తా...

శంకర్ గారు మీ జడ్జిమెంట్ వల్ల లాభంలేదండీ :-) అయినా మా పోరాటాల పెడబొబ్బలు మీకు ఆకలికేకల్లా వినిపిస్తున్నాయా హతవిధీ !! ఏదేమైనా ఎండిపోయిన బ్రెడ్ ముక్కలు అంటూ చెప్పకనే మీరు మా పార్టీకి ఫుల్ సపోర్ట్ అని చెప్పేశారు కనుక బలవంతంగా ఐనా సరే మీకు మా ఇడ్లీ పార్టీ సభ్యత్వాన్నిస్తున్నాము :-)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

అయినా మా ఇడ్లి ఇడ్లీ గానే అమృతంలా ఉంటుందండీ ఇంక దాన్ని కష్టపడి వేరే వేరే రూపాలకు మార్చు కొని తినాల్సిన అవసరమేమిటి? పాపం బ్రెడ్ ని బ్రెడ్ లాగ తినలేక దాన్ని ఫది ముఫై రకాలుగా షేపులు మార్చి ఆ శాండ్విచ్ ఈ శాండ్విచ్ అని తయారు చేసుకుని తినాల్సివస్తుంది.

అయినా ఇడ్లీ గురించి పూర్తిగా తెలియదని చెప్పండి అంతేకాని వేరియంట్స్ లేవని చెప్తే కుదరదు... అసలు ఇడ్లీ పిండితో నెయ్యేసి పెనంమీద బంగారురంగులో మెరిసిపోయేలా దోరగా కాల్చిన రొట్టె ఎప్పుడన్నా తిన్నారా... అహ తిన్నారా అంటా ? తింటే ఆ రుచికి దాసోహమనకుండా ఉండగలరా... ఇక ఇడ్లీలతో ఉప్మా చేసుకోవచ్చు.. ఇడ్లీ ముక్కలతో ఫ్రై చేసుకోవచ్చు... ఇక ఇడ్లీలో రకాలు అంటారా... ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, వెజిటబుల్ ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, బటన్ ఇడ్లీ, సన్నై ఇడ్లీ, తట్టై ఇడ్లీ, మంగుళూరు ఇడ్లీ, మల్లిగె ఇడ్లీ అబ్బో చేసుకునే ఓపిక ఉండాలేకానీ ఎన్నో...

ఇందు చెప్పారు...

@వేణూ శ్రీకాంత్ :హబ్బ! హబ్బా! వేణుగారు! ఇడ్లీలని ఇన్ని రకాలు చేసుకుని తింటేగానీ తిన్నట్టు ఉండదన్నమాట.అదే మా బ్రెడ్ ఐతే...ఎలా చేసినా బాగుంటుంది ;) జర్మనీ సపోర్ట్ ఉందికానీ...అమెరికా సూపర్ పవర్ కదా! సో! మేమే గ్రేట్! మా పార్టీ బలగమే ఎక్కువ :))


@snkr:మీ తీర్పు ని నేను ఖండిస్తున్నానండీ! మావి ఎండిపోయిన బ్రెడ్డు ముక్కలా? నో! నేనొప్పుకోను! మా బ్రెడ్డు ముక్కల మధ్య ఇడ్లీ పెట్టి తినడానికి మా బ్రెడ్ సంఘం ఒప్పుకోదని సవినయంగా తెలియజేసుకుంటున్నానండీ!

ఇందు చెప్పారు...

@Soumya:అదేంటీ సౌమ్యగారు! నిన్ననెకదా మీరు బ్రెడ్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారూ? అప్పుడే ఇడ్లీ పార్టీ కి మారిపోయారా? హన్నా! హన్న! ఎంత ఘోరం! అధ్యక్షా మన పార్టీని రక్షించండీ!!


@Nagamani:నాగమణిగారు! ధన్యవదాలు.బ్రెడ్ పార్టీకి స్వాగతం :) మీలాగ బ్రెడ్ ప్రియులని చూస్తే నాకెంత ఆనందమో! మీరు అలాగే బ్రెడ్ ని తింటూ ఎంజాయ్ చేసేయండీ!

@Sivaranjai:ఇది తూచ్ తూచ్ అండీ...మీరు మా బ్రెడ్ పార్టీ అంతే! మీ గోదావరి అబ్బాయి మంచుగారు యే కదా మన బ్రెడ్ పర్టీ ప్రెసిడెంట్.కావున్,గోదారి కోసం అయినా మీరిటొచ్చేయాలి మరి!! తప్పదు :))

@Ennela:ఎన్నెలగారు! మీరు snkrగారి సలహా పాటించేసారా? పాపం మీ సీతయ్య! :((

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఇందుగారు ఆఆఅ ఇది తొండి... నా ఫార్ములా నాపైనే ప్రయోగిస్తారా హన్నా...

శివా మీరు స్ట్రాంగ్ గా అలానే నిలబడండి మనస్లోగన్ “బ్రెడ్ వద్దు.. ఇడ్లీనే ముద్దు..” వాళ్ళలాగే అంటారు మీరు మనసుమార్చుకోవద్దు :-)

ఇందుగారు మీ అధ్యక్షులవారిది గోదావరి అని శివరంజని గారిని పార్టీమార్పించేయడానికి ట్రైచేస్తారా.. అందుకే నేను వ్యూహాత్మకంగా గోదావరి అబ్బాయి చందుగారికి మా ఇడ్లీపార్టీ అధ్యక్షపదవి కట్టబెట్టాను కనుక అధ్యక్షుల ప్రాంతీయ తత్వం నిలబడదు :-D

ఇందు చెప్పారు...

@ వేణూ శ్రీకాంత్ :ఆ నామొహం! శివగారు మా వైపే! రాకపోయినా మంచుగారు..నేను కలిసి లాక్కొచేస్తాం!ఇక మీ చందుగారా! ఇంట్లో ఇడ్లీ బ్యాన్ చేస్తే ఏంచేస్తారు? సర్లే ఏదో ఒకతి పెట్టు అని బ్రెడ్డునే తింటారు హ్హహ్హహ్హా! సో! మీరెన్ని అస్త్రాలు ప్రయోగించినా...మా బ్రెడ్ పార్టీదే పైచేయి :))

మంచు చెప్పారు...

వేణు గారు, సౌమ్య గారు: ఇంకా కొన్ని రకాలు మర్చిపొయారు. జర్మన్ ఇడ్లీ (మధుర గారి ఇంట్లొ చేసుకునేది), సింగపూర్ ఇడ్లి (నేస్తం గారి ఇంట్లొ చేసుకునేది, శంకర్ గారి ఇంట్లొ చేసుకునేది ) చేసుకునేది ఇలా చెప్పుకుంటూ పొతే బొల్డు రకాలు వస్తాయ్... హేవిటండీ ఇది.

>>> ఇడ్లీలు ... నా పాలిట పిల్లతెల్ల దయ్యాలు .... >>> దీనికి సమాధానం చెప్పండి చాలు :-)

శివా : గొదావరి సెంటిమెంట్ కి ఆయింట్మెంట్ లేదు అని నువ్వే చెప్పావ్. ఇక తప్పదు. వచ్చేయ్.

ఇందు చెప్పారు...

రండి...రండి..ఎవరక్కడా! మా అధ్యక్షులవారు సవాల్ విసిరారు! రండీ...కాచుకోండీ మా బ్రెడ్ దెబ్బా :))

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ పిటా బ్రెడ్ ని కూడా బ్రెడ్ వేరియంట్స్ లో కలిపేశారు కదా అని అందరూ అలాగే ఉంటారనుకుంటే ఎలాగండీ.. రోటీ, పరోఠా, చపాతీలను కూడా బ్రెడ్ అనే అంటారు కదా అక్కడ హోటళ్ళలో అవికూడా కలిపేయండి మరి :-P

ఇటాలియన్ బ్రెడ్ కీ సాన్ ఫ్రాన్సిస్కొ సౌర్ బ్రెడ్ కీ ఎంత తేడా ఉందో ఆంధ్రా ఇడ్లికీ, తమిళనాడు ఇడ్లీకీ అంతే తేడా ఉందండీ.. మీరిలా అపోహపడతారనే సౌమ్య ఇంగ్రేడియంట్స్ కూడా ఇచ్చారు.. మేం చెప్పిన మిగిలిన వేరియంట్స్ కికూడా అంతే తేడా ఉంది... దేవుడా ఈ ఇడ్లీ అఙ్ఞానులకు కాస్త ఙ్ఞానం ప్రసాదించవా :-)

ఇందు చెప్పారు...

@ వేణూ శ్రీకాంత్ : అదేనండీ నేనూ చెప్పేదీ...ఇడ్లాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఈ జీవుల్ని రక్షించు తండ్రీ! :p

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ :-) ఏదైతేనేం ఇందుగారు విజయవంతంగా 75 కామెంట్స్ చేశాం మీ బ్లాగ్ లో.. ఇంక నాకు కూడా బోరు కొట్టేసింది ఇప్పటికే బోల్డు వాగేశాను :P సో పోరాటానిక విరామం ఇస్తున్నాను :-) ప్రస్తుతానికి శలవు. ఓపిక ఉన్నవాళ్ళెవరైనా 100 కి లాగ్గలరేమో చూద్దాం :-)

ఇందు చెప్పారు...

అవునా! హ్మ్! నిజమేనండీ...75 చేసేసారు!! గ్రేట్.నాకూ బోర్ కొట్టేసింది,...ఇక ఆపేద్దాం :) ఈ టపా కి కామెంట్లు బంద్ హో!

అజ్ఞాత చెప్పారు...

ఎండిపోయిన బ్రెడ్ అని రాశానా! అంటే.. సన్-డ్రైడ్ అని కాదు నా వుద్దేశ్యం. పచ్చిబ్రెడ్ సాంబార్లో మెత్తనైపోతుంది, బాగుండదు. చక్కగా టొస్ట్ చేసిన అనుకోండి.
వేణు గారు, నా సభ్యత్వం ఇందు గారికిచ్చేయండి. నేను మసాల/రవ దోశ(పెసరట్ తప్ప), జీడిపప్పు పులిహోర/కట్టె పొంగలి, వుగ్గాని(కర్నాటకలో బొరుగులు(మరమరాలు) తో చేసిన పోహా లాంటిది), వాడప్పం(బియ్యపురొట్టె), బిస్మిల్లాబాత్(?), వాంగిబాత్ ల అభిమానిని. చెబుతూంటేనే ఆకలి వేసినట్టుగా అనిపిస్తోంది. :)

కొసమెరుపు: బ్రెడ్ టోస్ట్ మధ్య ఆవకాయ/నిమ్మకాయ పచ్చడి పెట్టుకుని తింటే ... అదో రుచి. ట్రై చేయండి - " ట్రై చేస్తే పోయేదేమీ లేదు, ఆకలి తప్ప" :)... అదో రుచి. ట్రై చేయండి. :))

3g చెప్పారు...

ఇలా మధ్యలో కౌంటర్ మూసేస్తే ఎలాగండీ..... నేనేదో బ్రెడ్ పార్టీకి ఓటేద్దామని వస్తే....

అజ్ఞాత చెప్పారు...

ఫోటో కాస్త వెరైటీగా ఉంది...బ్రెడ్ ముక్కే ’I hate bread' అంటుందేమిటమ్మాయ్ విడ్డూరం !!

బ్రెడ్‌లో బటర్+ జామ్ కలుపుకొని తింటే సూపర్..ఓసారి అలా కానివ్వమనండి.

ఒక్క ఇడ్లీతో మూడు సార్లు సాంబారు వేయించుకొని తినే మాలాంటి ఆరాధకుల దేవత ఇడ్లీని అన్నందుకు ఐ హర్ట్

ఆ.సౌమ్య చెప్పారు...

నాకు ఇడ్లీ, బ్రెడ్దు రెండూ ఇష్టమే...నేనేం చేసేది :))))

కానీ ఇడ్లీ, బ్రెడ్డు రెండూ పెట్టి ఏదో ఒకటే ఎంచుకోమంటే మాత్రం....హ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ నేను ఇడ్లీ పార్టీలోకే జంప్ అయిపోతా :D

ఊకదంపుడు చెప్పారు...

రాజీనా .. హాహహా .. ఓటమి ఒప్పుకొని మా పక్షం వచ్చేసామని ఒప్పుకోండి..
మాయావతి ములాయం సింగు ఐనా రాజీ కుదుర్చుకోవచ్చేమో గానీ బెడ్డుప్రియులతో మేము రాజీ కుదుర్చుకోమంతే...

ఇదిగోండి ఇందు గారు, మీ ప్రశ్నకుసమాధానం, మరియు కొత్తపాళీ గారడిగిన ఆటవెలది.

మేకప్పేస్తే మొహం రంగుగా కనిపించవచ్చు కానీ కళగా కాదు కదా, మీ బ్రెడ్డుకి ఎన్ని అలంకారాలుచేసినా కూడా అంతే!!!

కూరలెన్నిదెచ్చి కుక్కినా బ్రెడ్డులో
రుచియు పచియు రాదు; రూపు దప్ప
నాకు లేని కళను మేకప్పు దెచ్చునా
విశ్వదాభి రామ వినుర వేమ

Ennela చెప్పారు...

ookadampudu gaaru..
ikkada idleenaa breddaa anna point vadileste...
mee kavita superb...andulonu..'
నాకు లేని కళను మేకప్పు దెచ్చునా
abbaa..yem cheppaarandee baboo...'ayite..yee kavitanu naaku appu ichcheste...
blaagudabhiraama ennelamma ani maarchesukunta....thanks...

ఇందు చెప్పారు...

@Snkr :ఆహా! మా బ్రెడ్డుని తిట్టేసి...మళ్ళి 'సన్-డ్రైడ్' అంటారా? హన్నా! సర్లేండీ...మీ మెన్యు లిస్ట్ బహు పసందుగా ఉంది.బ్రెడ్డు మధ్య ఆవకాయ ఇప్పుడేంటండీ..నా చిన్నప్పూడే కనిపెట్తేసా! హ్హహ్హహ్హ! సరే ఐతే..మీరు బ్రెడ్డు పార్టీ అని నేను కంఫర్మ్ చేసేస్తున్నా మరి ;)

@3g:కౌంటర్ మూసివేయలేదండీ....ఇడ్లీXబ్రెడ్ వార్ కి తెరపడింది అంతే! మీకు బ్రెడ్ పార్టీ సాదర స్వాగతం పలుకుతోందీ :) రండీ..మా పార్టీలో చేరి ఆ ఇడ్లీ పార్టీ కొమ్ములు విరిచేయండీ :))

@ అనామకుడు :ఫొటో అంటే..అదీ మరి..దాన్ని ఎడిటింగ్ చేసిన ఘనురాల్ని నేనే :( ఏదొ..అలా పెట్టేసా! బ్రెడ్డ్+జాము+బటరు కామన్ అండీ....అది ఎటు తినరు..మిగితావి చేసిపెట్టినా వంకలే :((

ఇందు చెప్పారు...

@ ఆ.సౌమ్య :సౌమ్యగారు! ఇలా మమ్మల్ని నడి బ్రెడ్డులొ ముంచేయడం దారుణం అండీ...హ్మ్! ఏచేస్తాం ఇడ్లీ పార్టీ వారి పనే ఇదంతా...సర్లే మీ ఇష్టం ఇక :(

@ vookadampudu:హన్నా! ఏమంటిరి?ఏమంటిరి? మా బ్రెడ్డుని మేకప్పుచేసినా కళలేదనియా!ఏంత మాట! ఏంత మాట!ఇది గడ్డు పరీక్షయే కానీ...బ్రెడ్డు పరీక్ష కాదే కాజాలదే!.................

నాకింతవరకే వచ్చు మరి :p

హ్మ్! మీ పద్యం బగుంది కాని...మీరు ఇడ్లీ పార్టీ కదా! మా బ్రెడ్డు పార్టీ కూడా మీమీద ఒక పద్యం వదులుతుంది లేండీ...మేము మీతో ఏమీ రాజీ కుదుర్చుకోము! ఇప్పటికీ మేము బ్రెడ్డు మీదే నిలబడతాం!

@ Ennela:ఎన్నెలగారు! మీరు నా ఫ్రెండు...మీరు నా పార్టీ.మనం ఇడ్లీ పార్టీ వరిని మెచ్చుకోకూడదండీ బాబూ! మీరు అంతగా కావాలంటే ఇడ్లీ మీద ఒక కవిత వదలండీ...

భాను చెప్పారు...

ఇడ్లీ-బ్రెడ్ వార్ ఇంకా నడుస్తుందా:)

ఇందు చెప్పారు...

అవును భానుగారు! అయినా మీరు ఇడ్లీకి,బ్రెడ్డు కి అగైనెస్ట్ గా! హ్మ్! మా పార్టీలోకి వచ్చేయొచ్చు కదా! ఒక బ్రెడ్ స్లైస్ ఫ్రీగా ఇస్తాము ఓటేస్తే :))

Ennela చెప్పారు...

sorry indu gaaru...kalaaposanandee ..tattukoleka poyaa.....
sare mari idi ela undi?

ఇడ్డెన్న్లు బ్రెడ్డును ఒక్క రంగుననుండు
చూడ చూడ బ్రెడ్డు అంచు వేరు
ఆ అంచు అందమ్ము ఇంతింత గాదయ
బ్లాగుదభిరామ ఎన్నెలమ్మ....

ఇందు చెప్పారు...

ఎన్నెలగారు...మీరు అసలు సూపరో సూపరు! ఆహా! ఏమి పద్యరాజము!! వావ్! చప్పట్లూ...ఈలలూ...ఎన్నెలమ్మకి :)

Ennela చెప్పారు...

subhanalla...subhanalla...


janulaaraa idlee priyulaara,
iddenlu yeppudu tinevegaa..okka saari..oke okka saari maa breddu ruchi choodandee..sorga vaadulavvandee..sorry sorgam kanipistundani cheptunna....oka breddu slice ki rendu frozen idlee uchitam...(indu gaaru..idi only marketing technikku...appartham chesukokandi mallee)

ఇందు చెప్పారు...

హ్మ్! అలాక్కనిచ్చేద్దాం! బ్రెడ్పార్టీలో జాయిన్ అవ్వాలనుకునే ఇడ్లీ ప్రియులకి ఇదే మంచి ఆఫర్! ఒక బ్రెడ్ ముక్కకి రెందు ఫ్రొజెన్ ఇడ్లీలు ఫ్రీ హ్హిహ్హిహ్హీ!!!

Ennela చెప్పారు...

idi ID-BeDDu sangraamamu....
Id anaga idlee...bed anga breddu...yevarevari kenta balamundo..telchukovaalsina tarunamide...alasinchina aasha bhangamu...tvarapadandee...breeduki oteyyandee...sukha santoshaalato undandee....breddu paalanalo rubbadaalundavu...kadagadaalundavu....udikinchadaalundavu..tomadaalundavu....only ...konu.teruvu...tinu..akkalaara chellelaara...meeku suvarnaavakaasamu...konu..teruvu..tinu....ting ting...

భాను చెప్పారు...

బ్రెడ్ విత్ ఆమ్లెట్ అయితే కొంత అద్జుస్త్ ఆయిత మరి . ఇడ్లీ అంటే అమ్మో కష్టమే.

శరత్ కాలమ్ చెప్పారు...

నేను ఈ టపాగానీ, కామెంట్లు గానీ ఎక్కువ చదవలేదు కానీ ఏదో ఇక్కడ ఇడ్లీ పార్టీ వారూ, బ్రెడు పార్టీ వారు కొట్టుకు ఛస్తున్నారు అనిపించి ఇడ్లీ పార్టీ వారికి నా వంతు నైతిక మద్దతు ఇద్దామని వచ్చా. ఇడ్లీ సాంబారులో వేరుశనక్కాయల చట్నీ గానీ మరేదయినా చట్నీ గానీ వేసుకొని కలిపి తింటుంటే వుంటుందీ మజా. ఎందుకులెండి - ఇంతకంటే ఎక్కువ చెప్పడం - ఆల్రెడీ నాకు నోరూరిపోతోంది.

ఇంతకూ ఏ పార్టీ ఆధిక్యతలో వుందేం?

Ennela చెప్పారు...

otEsta annanka aamlet oka lakkana tammee,..indu gaari taraf kenchi nenu vaagdaanam jestunna..okka bredduku 2 gudlu preeee..mana galleela.... andarni tolkara...annattu 'mana pori yedki vaaye' tolkochchey malla..biraanra.

Ennela చెప్పారు...

taajaa vaartalu...
india lo unnavaallandaru bredduki...north amerikaa vaalu iddennukee ekkuva votlu vesaarani telisindi.....india lo mana populationa adhikam kaabattee, breedduke yekkuva aadhikyata undani visvasaneeya vargaalu telipaayi...vaartalu intatito samaaptam...tirigi vando tapalo kalusukundaam...selavu...

భాను చెప్పారు...

ఇందు ఇడ్లీ ప్రియులకు చెడు వార్త సారీ పులుపు వార్త...ఇడ్లీ తింటే అసిడిటీ అట, ఇకపోతే ఇడ్లీ పార్టీ వాళ్ళు చీప్పే అయితేమ్స్ ఉన్నాయి చూడండి , వాటిమీద వేసే నెయ్యి, అందులోకి కారం. అల్లం చెట్నీ, పల్లీ చట్నీలు వగైరా వగిర అన్నీ కడుపులో ఓ పులుపు/అసిడిటీ సముద్రం ఏర్పడుతుందట:) సో మనం ఇడ్లీ కే పూర్తిగా అగైన్స్త్ అంట. కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ తో నా వోటు మీకేనంట. అబ్బ ఎంత మల్లెపూల లాగున్న ఎలా తిన్తారండీ ఇడ్లీలు. మొన్నెక్కడో రామ లక్ష్మి గారు రాశారు. మద్రాస్ లో ఇడ్లీ కానీ ఓ మంచి హోటల్ ఉందట. ఆ హోటల్ ఓనర్ ఫ్యాన్ వెయ్యదాట్ . ఆరుద్ర గారు జోకేస్తాడట. ఫ్యాన్ వేస్తె ఇడ్లీలు కొట్టుక పోతాయని ఆ ఓనర్ ఫ్యాన్ వెయ్యదట. :) సో నేను మీ జట్టే. వ్హెరె ఇస్ మై బ్రెడ్ అమ్లేత్ట్:)

ఇందు చెప్పారు...

@శరత్ 'కాలమ్' :శరత్ గారు! బ్రెడ్డు పార్టీయే గ్నహవిజమ సాధించిందని విస్వసనీయవర్గల ద్వారా మా ఎన్నెలగారు తెలియజేసారు! కావున మ పార్టీదే విజయం! మీరు కూడా ఆ ఇడ్లీ పార్టీ వదిలేసి మా బ్రెడ్ పార్తీలోకి రావల్సిందిగా మనవి.మీకు అలా బ్రెడ్ పార్టీలోకి వస్తే..రెండు ఇడ్లీలు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. :))


@భాను:ధన్య్వాదాలు భానుగారు! ఇడ్లీ పార్టీకి మంచి ఝలక్ ఇచ్చారు! బ్రెడ్ పార్టీకి మంచి మద్దతునిచ్చారు! మీరు మా పార్టీ అరోగ్యశాఖా మంత్రిగా డిక్లేర్ చేస్తున్నమహో!

Ennela చెప్పారు...

indu gaaru, bhaanu gaaru janaalni tolkochchaaru...oka veyyi breddu 2 velu guddu...order cheseyyandi mari toraga...credit card number ichcheste..nenu US2Guntur lo order padestaanu....bhanu gaaru panilo pani penkalu mamalni pampamantaaraa...intikaada aamlet vesesukuntaara? chepte...2 velu penaalu kudaa orderlo add chesestaaa....

ఇందు చెప్పారు...

ఎన్నెలగారు! మీకు బోలెడు ధన్యవదాలు! మన పార్టీకి మంచి మంచి అవిడియాలు ఇస్తున్నారు! మీరు మా పార్టీ చీఫ్ విప్! :))

వేణూశ్రీకాంత్ చెప్పారు...

విజయవంతమైన ఈ వందో కామెంట్ ద్వారా అంతిమ విజయం మా ఇడ్లీ పార్టీదే అని డిక్లేర్ చేయడమైనది :)

Ennela చెప్పారు...

indu (indu gaari)moolamgaa teliyajeyunademanagaa....yee sangraamamlo breddu raaju gelupu saadhinchadamayinadi....
indu garu 100 tapa kottesaaru...congrats andee....baar baar sata tapa praapti rastu....ilanti yudhdhaalenno srustinchi...blaagarula jeevitaallo velugulu nimpaalani..korukuntunnanu...
naaku vando tapa wraayadaaniki chance vachchindahoooooo.....vanda varaku techchina sodara sodaree manulaku...dhanyavaad....jai hind...

ఇందు చెప్పారు...

వంద కామెంట్లు పూర్తయినాయి.ఇది నేను,మా బ్రెడ్ పార్టీ కలలో కూడా ఊహించని ఘనవిజయం.ఇందుమూలంగ బ్రెడ్ పార్టీ అధ్యక్షులైన మంచుగరు...చీఫ్ విప్ ఎన్నెలగారు...ఆరోగ్యశాఖా మంత్రి భానుగారు...సమాచారా శాఖామంత్రి రామకృష్ణ వెంట్రప్రగడగారు.....హో మంత్రి శంకర్ గారు....అన్నిటినీ మించి మాకు ఘనమైన పోటీఇచ్చిన ఇడ్లీ పార్టే ఉపాధ్యక్షులైన వేణుశ్రీకాంత్ గారికి,సౌమ్యగారికి,శివరంజనిగారికి,సవ్వడి గారికి ధన్యవాదాలు :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

వందో కామెంట్ పెట్టాలనే తొందరలో చెప్పడం మరిచిపోయాను. అభినందనలు ఇందుగారు వందకామెంట్ల పండగ చేసుకున్నందుకు :-)

ఇందు చెప్పారు...

ఫర్వాలేదు వేణుగారు..మనం నిన్న మధ్యలో వదిలేసిన యుధ్ధాని కొనసాగించి నాకు ఈ విజయాన్ని అందించిన ఎన్నెల గారికి,భానుగారికి,సంకర్,3జి గారికి అభినందనలు తెలియజేయాలి :)

Ennela చెప్పారు...

arere arere..gelupe jaare...idi varakepudu lede...etc ect....inka paataa raadu

oke okka oTuto adhikyata lo unna breddu...venu gaari tapa to idlee to samanamayyindani indu moolamgaa teliya chesukuntooo...idlee bredd redunu tinable ani...okati tinu inkokati tinipinchu ani savinayamgaa manavi chesukuntu...once again...bolo bharat maataaki....jay...

ఊకదంపుడు చెప్పారు...

అయ్యాలూ అమ్మలూ,
చీజుంటే బ్రెడ్డ్ తింటా అనటం, ఆవకాయ పచ్చడి ఉంటే తింటా అంటం, పల్లీలకోసమ్ బీరుదాగుతున్నా అని చెప్పినట్టు ఉంటుంది.
కత్రీనా కైఫ్ ఫాన్ ఉందని తీస్ మార్ ఖాన్ కి వెళ్లినంత మాత్రాన ఆ సినిమాకి ఫన్ ఐపోడుకదా ఆనిముత్యం అనలెరు కదా... అర్ధం చేసుకోరు.....,,

ఇందు గారూ,
ఎవరన్నా బ్రెడ్ ని కాఫీ లో ముంచుకు తింటా అంటే - నేను కూడా "తంతా" అనే అంటా. ఏంచేయమంటారు మరి, కాఫీ అంటె అంత ఆభిమానమూ బ్రెడ్ అంటె అంత హేటూ

ఊకదంపుడు చెప్పారు...

భ్రెడ్ పార్టీ గెలిచిందా - మీరు కూడా మొన్న పెద్ద ఎలచ్చన్లలో వాడిన EVM లనే వాడారా??

ఇందు చెప్పారు...

హమ్మ ఎన్నెలగారు! బ్రెడ్డు-ఇడ్లీ ఏకం చేసేస్తారా? దీన్ని నేను ఖండిస్తున్నా అధ్యక్షా!

ఊకదంపుడుగారూ....లేదండీ ఎన్నెలమ్మ అనే ఈవీయం తో ఓటింగ్ చేయించాం! అదేమో! అంతా బానే ఉన్నా చివర్లో మొరాయించిందీ :))

ఏది ఏమయినా బ్రెడ్డ్ పార్టీదే విజయం.హంతే! ఇక నో ఆర్గ్యుమెంట్స్ :P

ramki చెప్పారు...

చూస్తున్న చూస్తున్న....
ఈ యుధాన్ని ఆపుతారు ఏమో అని..........
ఆపరే......
దీనికి ఒకటే మందు ఇందు గారు..........
మీరు ఇంకో పోస్టింగ్ సృష్టించడమే........లేకపోతే ఎన్నెలమ్మ గారు, ఊకదంపుడుగారూ, మన పార్టీ సభ్యులు కూడా అగేటట్లు లేరు....
మీరు రాస్తారా? లేకపోతే వచ్చి రాని తెగులు లో సారీ తెలుగు లో ఏదో ఒక కవిత్వం రాసేయమంటార?...... :)
ఆ తరువాత ఏమైనా జరిగితే నాకు సంబంధం లేదు అధ్యక్షా... :P

మంచు చెప్పారు...

బ్రెడ్ పార్టీ విజయం గురించి రిజల్ట్ ప్రకింటించేసాకా ఇంకా అర్గ్యుమెంట్స్ ఎమిటి... ఎమన్నా డవుట్లు ఉంటే కొర్టులొ తేల్చుకొండి (జడ్జీలు కొత్తపాళీ గారు , SNKR గారు ) :D

ఇందు చెప్పారు...

హ్మ్! మరే మంచుగారు...జడ్జీలయినా తీర్పు వెంటనే ఇస్తారా? లేక తీర్పు పత్రాలని హోం మినిష్టరుగారికి ఇచ్చేసి చేతులు దులుపుకుంటారా ;)

రామకృష్ణగారు...అదేనండీ నేను థింకుతున్నా! రేపే ఏదొ ఒక పోస్ట్ వేసి ఇడ్లీ పార్టీవారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిందే!! :)))

భాను చెప్పారు...

ఇందు మూలంగా సమస్త బ్లాగ్మిత్రులకి తెలియ జేయునది ఏమనగా బ్రెడ్ పార్టీ విజయం సందర్భంగా మరియ మా బ్రెడ్ పార్టీ పితామహులు.. క్షమించాలి మాతా మహులు ఇందు గారు వంద కామెంట్స్ దాటినా సందర్భంగా విజయోత్శవ సభ ను ఏర్పాటు చేయడమయినది. అందరికి ఇదే మా ఆహ్వాన పత్రిక.

బ్రెడ్ పార్టీ విజయోత్చావ సభ

ముఖ్య అతిధులు
ఇ.బ్లా.సం. (ఇడ్లీ బ్లాగర్ల సంగం ప్రతినిథులు )

వేదిక: వెన్నెల సంతకం సమయం: మీరోచ్చినప్పుడు
గమనిక: ఇ.బ్లా.సం సబ్యులకు వేయుటకు బ్రెడ్ పార్టీ సబ్యులందరూ రకరకాల ఇడ్లీ దండలతో రాగలరు. మరియ అతిదులందరికి గుమ ఘుమలాడే రకరకాల బ్రెడ్ వంటకాలు సెలెబ్రిటీ చెఫ్ లచే తయారు చేయించినవి. అందరూ ahwaanitule
ఇట్లు
బ్రెడ్ బ్లాగర్ల సంఘం అధ్యక్షులు

భాను చెప్పారు...

ఇప్పుడే అందిన వార్త
బ్రెడ్ పార్టీ విజయం తో ఎక్కడ బ్రెడ్లు దొరుకుతలేవని ప్రజలంతా బ్రెడ్ లు అందజేయాలని నిరాహార దీక్షలు మొదలుపెట్టారని మ జెడ్ టివి ప్రతినిది ఇప్పుడే తెలియ జేస్తున్నారు. అదే విదంగా హోటల్స్ లో చేసిన ఇడ్లీ లు చెట్నీ లు మిగిలి పోయి , నగరాలు గ్రమల్లు అన్నే ఎక్కడ జూసినా ఇడ్లీ చెత్త తో కాలుష్యం ఏర్పడి కలరా వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంబడే ఇడ్లీ పార్టీ ని నిషేదిన్చాలనై కోరుతున్నారు.

బ్రేకింగ్ న్యూస్.......బ్రేకింగ్ న్యూస్

"ఇడ్లీ పార్టీ నిషేధం.. వివరాలు కొద్ది సేపట్లో మా ప్రతినిథి లైవ్ లో అండ జేస్తారు వివరాలకి చూడండి మా జెడ్ టి,వి,

భాను చెప్పారు...

ఇడ్లీ అంటే విసుగు చెందినా రాజు కారి కథ ఇక్కడ చదవండి
http://kottapalli.in/2009/10/%E0%B0%87%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80-%E0%B0%A6%E0%B1%8B%E0%B0%B6

Ennela చెప్పారు...

Fantastic bhanu garu

చందు చెప్పారు...

సభకి నమస్కారం! మన అచ్చ తెలుగు వారు కొందరు అచ్చమైన ఇంగ్లిష్ వాడి బ్రెడ్ కోసం, స్వచ్చమైన ఇడ్లిని నానా ధుర్బాషలాడుతుంటె సగటు ఇడ్లి ప్రేమికుడిగా సహించలేక ఈ కామెంటు పెడుతున్నాను. ఇంతకి నేను ఎవరో కాదు .... ఇందు బ్రెడ్ ప్రేమకి బలి అయ్యే ఇడ్లి ప్రేమికుడిని... బ్రెడ్ ద్వేషిని....చందు ని :(...

అయినా బ్రెడ్ కి ఇడ్లి కి పోలిక ఏంటండి?? పత్యానికి జబ్బు చేసినప్పుడు కళ్ళు మూసుకోని తినే బ్రెడ్ ఎక్కడా?? వరల్డ్స్ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇడ్లి ఎక్కడా?? దీనికి ఒకే పరిష్కారం... పోలింగ్ ....ఇందు ని ఒక పోల్ పెట్టమంటాను ...అప్పుడు చూసుకుందాము ...మీ పతాపము మా పతాపము... get ready for idliistic (idealistic ;) ) poll...

ఊకదంపుడు చెప్పారు...

వేణూరామ్ గారూ శిశిర గారూ మీరెక్కడ ...??

రక్తం లో ఉత్సాహాం ఎక్కువ పాళ్లు ఉన్న ఓ మిత్రుడు ఒక సారి వాడి పుట్టినరోజుకి ఆసుపత్రికి బ్రెడ్డు పాలు పంచటానికి వెళ్తూ నన్నూ తీసుకెళ్ళాడు.. వీడు ఇవ్వంగానే మొదటి రోగి - బ్రెడ్డు పాకెట్ వీడి చేతిలో పెట్టేసి అన్నాడు
: "ఆ బ్రెడ్డు కంటే ఈ రోగమే నయం బాబు నువ్వే ఉంచుకో"

సుజాత వేల్పూరి చెప్పారు...

ఈ పోస్టుకి వెయ్యి కామెంట్స్ రావాలి! బ్రెడ్డు ని హేట్ చేసేవాళ్లందరికీ ఐ లవ్యూ చెప్తున్నా!

దాని మొహం తగలెయ్య, బ్రెడ్ ని చూస్తేనే జ్వరం ముంచుకొస్తుంది నాకు. అలాగే మిరియాల చారుని చూసినా సరే! అప్పుడే జ్వరం తగ్గినంత నీరసం వస్తుంది. పథ్యం కూడు గుర్తొచ్చి!

మా వారు బ్రౌన్ బ్రెడ్ బ్రేక్ ఫాస్ట్ మీద పీనట్ బటర్ వేసుకుని తింటుంటే ఆ పరిసరాల్లో ఉండను నేను. పారిపోయి కించెన్లో బియ్యం డబ్బా వెనక దాక్కుంటా!

బ్రెడ్ లో నేను ఇష్టపడేదేదైనా ఉంటే అది సబ్ వే లో వెజ్జీ డిలైట్ సబ్ మాత్రమే

అసలు తిఫినంటే మల్లె రేకుల్లాంటి ఇడ్లీలూ, వెల్లుల్లి కారప్పొడీ, నెయ్యి, లేదా కొబ్బరి చట్నీ!

లేదా పూరీలూ బగాళా దుంప ఉల్లి కూరా,
లేదా పల్చని రేకుల్లాంటి దోసెలూ,
లేదా పెసర మొలకలు రుబ్బి వేసిన వేడి వేడి పెరట్లూ, విత్ అల్లప్పచ్చడీ,

ఇవీ టిఫిన్లంటే!

ఆ.సౌమ్య చెప్పారు...

ఏమిటి మేమిక్కడ బతికుండగా బ్రెడ్దు పార్టీ విజయం సాధించడమే....సహించం, క్షమించం...ఎప్పటికైనా ఇడ్లీదే విజయం.

మంచు చెప్పారు...

చందూ గారు... బ్లాగ్లొ పొల్స్ కస్టం అండీ.... రిగ్గింగ్ చాల ఈజీ ఇక్కడ ...అలొచించుకొండి.
అయినా మీకు గొదావరి సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ రాయాలి... ఉండండీ శివరంజని ని, నేస్తం గారిని తీసుకువస్తా

శివరంజని చెప్పారు...

INDHU గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

సవ్వడి చెప్పారు...

ఇడ్లీ పార్టీ గెలిచేవరకూ ఊరుకునేది లేదు.
ఏమన్నారు! ఇడ్లీలు తెల్ల పిల్ల దెయ్యాలా.... ఎంత మాట ఎంత మాట " ఆ ఇడ్లీలే లేకపోతే మీ స్టౌకి అందం ఏది? మీ డైనింగ్ టెబుల్ కి అందం ఏది ? " చెప్పండి సమధానం.
మీ రొట్టి ముక్కలే తెల్ల పిల్ల పిశాచాలు...

Congrats for 120 comments

వేణూశ్రీకాంత్ చెప్పారు...

Welcome చందుగారు, ఒక బ్రెడ్ ద్వేషిగా మీ బాధ నేను పూర్తిగా అర్దం చేసుకోగలనండీ అర్దం చేసుకోగలను. చందుగారు, సుజాత, ఊకదంపుడు గారు, సౌమ్య, సవ్వడి గారు, శివరంజని గారు, శిశిర గారు, వేణూరాం ఆహా మా ఇడ్లీ పార్టీ బలా బలాలు చూస్తుంటే హృదయం ఉప్పొంగిపోతుంది. ఎన్నెల గారు మీరుకూడా మా పార్టీలో చేరిపోండి ఇంకెన్నాళ్ళు తటస్తంగా ఉంటారు.

"ఆ బ్రెడ్డుకన్నా రోగమేనయం.." హ హ ఊ.దం. గారు అదరగొట్టేశారు :)
సుజాత గారు వెయ్యికామెంట్లు అక్కరలేదండీ అల్రేడీ విజయం మనదే :)
భానుగారు మీరు న్యూస్ సృష్టించి ప్రసారం చేయడాన్ని మేం ఖండిస్తున్నాం.

భాను చెప్పారు...

వేణు గారూ
ప్రసార మాద్యమాలపై మీ వ్యాఖ్యలు మీరు వెంబడే ఉపసంహరించుకోకపోతే మేం మీ బ్లాగ్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. హన్నా మా ప్రసారాలు మా వార్తలు మేం సృస్తిన్చామ? పొద్దున్నే ఇడ్లీ తిన్న మత్తు లో మీకేమి తలియట్లే అదే బ్రెడ్ తిని ఉంటె మీరిలా ఉండేవార. అధ్యక్షా మేం దీన్ని పెద్ద కత్తి తో ఖండిస్తున్నాం:)వేణు గారు వ్యాక్యాలు ఉపసంహరించు కొనే వరకూ మా ఉద్యమం నడుస్తుంది..దీన్ని ఎవరూ ఆపలేరు. సభ్యులార జై బ్రెడ్ పార్టీ..:)

చందు చెప్పారు...

ఇందు,
నా ఓటు చందు గారి ఇడ్లీలకే. అసలు తెల్ల గువ్వల లాంటి ఇడ్లీ లని పొద్దున్నే ఆవిరి మీద తీసి.... సుతారంగా మల్లె పువ్వుల్లాంటి మెత్తని వెన్న రాసి, మూడు గుంటల ప్లేట్ లో ఒక దాంట్లో ఫ్రెష్ కొబ్బరి పచ్చడి, ఒక దాంట్లో పల్లీ పచ్చడి, ఇంకో దాంట్లో కారప్పొడి వేసి పెడితే ఉంటుంది...మీరా మెనూ డిసైడ్ అవ్వండి వారానికి కనీసం ఏడు రోజులు. ఏదో ఒక రోజు పిలవకపోయినా మీ ఇంటికి వాసన పట్టి వాలిపోతాము.