25, అక్టోబర్ 2010, సోమవారం

కళ్యాణ వేళ...

అక్టోబర్ 24 రాత్రి.....ఇంకొద్ది సేపట్లో  25 వచ్చేస్తుంది...ఇది నా జీవితం లో పెద్ద మలుపును తెస్తుంది...ఎవరికైనా జీవితం లో మార్పులు,అధ్బుతాలు సంభవించాకే తెలుస్తాయి...కానీ ఇది అలా కాదు.....అంతా తెలిసినట్టే ఉంటుంది...ఒక పక్క మనసంతా ఆనందం...లోలోపల గుండె  పొరల్లో  ఎక్కడో గూడు కట్టుకున్న దుఖం.....సరిగ్గా సంవత్సరం క్రితం ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాను...ఇంట్లో ఎవరు లేరు...నేను,బామ్మ తప్ప......అమ్మ దగ్గర  ఉంటే బాగుండు అని ఎన్ని సార్లు అనిపించిందో ...కానీ పనుల హడావిడి కదా..ఇంతలో నా బెస్ట్ ఫ్రెండ్ రోహిణి వచ్చింది...గోరింటాకు పెట్టటానికి...చందు కి ఆకుగోరింటాకు ఇష్టం....అచ్చం నాలాగే..కానీ ఫోటోలలో సరిగ్గా పడదని మా ఆస్థాన కెమెరామెన్ గారు ఇచ్చిన ఆదేశాలతో తప్పక కోన్ పెట్టించుకుంటున్నా ......రోహిణి తన సంగతులేవో చెప్తోంది.........కానీ నా మనసు ఆలోచనా తరంగాలలో కొట్టుకుపోతోంది.....ఇక రేపటినించి ఈ ఇల్లు నా ఇల్లు కాదు కదా!! నేను ఇక్కడ ఎప్పటిలా మహారాణి లా ఉండలేను కదా!! అమ్మ ని,నాన్న ని వదిలి ఒక్క రోజు ఉండలేనే!! ఇక జీవితమంతా ఎలా??కంటి నించి ఉబికి వస్తున్న ఒక్కొక్క చుక్క పాదాలకు పెట్టిన గోరింటాకు మీద పడుతోంది.... మళ్లీ రోహిణి గమనిస్తుందేమో అని  ముంగురులు సరి చేసుకుంటున్నట్టు కళ్ళు తుడుచుకోవడం....అలా ఆ రోజు రాత్రి పది గంటలకు గోరింటాకు పూర్తయి రోహిణి వెళ్ళిపోయింది...

మళ్లీ మనసును ఆవరించేసింది దిగులు....ఇంతలో బామ్మ అన్నం కలిపి తీసుకొచ్చింది....'ఒద్దు బామ్మ తినాలని లేదు' అన్నాను... 'మళ్లీ నా చేతులతో ఎప్పుడు పెడతానో...నువ్వెప్పుడు తింటావో....తినవే!!' అని ముద్దలు కలిపి పెడుతుంటే...మళ్లీ కళ్ళు చెమర్చాయి...అమ్మ కావాలి!! నా మనసు ఒకటే గోల పెడుతోంది... నాకు బాధ అయినా సంతోషం అయినా అమ్మే!! అందుకే అమ్మ ఒడిలో పడుకుని అలాగే ఉండిపోవలనిపిస్తోంది.... అది చూసి బామ్మ 'ఎందుకె పిచ్చి తల్లి ఏడుస్తావ్?? మళ్లీ రేపు కళ్ళు ఎర్రగా అవుతాయి... అన్నం తినేసి హాయిగా పడుకో....' అని అంది.....సరే అని అలాగే అన్నం ముగించేసి మంచం మీద పడుకున్నా నిద్ర రాదే?? ఎన్నో ఆలోచనలు...రేపు నేను ఏంటి?? నా పరిస్తితి ఏంటి?? అక్కడ అంతా ఎలా ఉంటుందో?? వాళ్ళందరూ  ఎలా ఉంటారో??? అసలు అమ్మాయిలకే ఎందుకు ఇంత బాధ??? నేనెందుకు అమ్మ-నాన్న ని వదిలి వెళ్ళాలి??? ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను....రాత్రి రెండింటికి అమ్మ-నాన్న పిన్ని,బాబాయ్ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చారు....అప్పటిదాకా నిద్ర పోకుండా అలాగే కూర్చున్నా. నన్ను అమ్మ దగ్గరకి తీసుకుంది.... నా సంగతి అమ్మ కి బాగా తెలుసు....అందుకే ఒళ్లో బజ్జో పెట్టుకుని  మెల్లగా జోకొట్టింది....ఎప్పుడు నిద్రపోయానో.....అమ్మ చేతి స్పర్స మహత్యం కాబోలు...

అక్టోబర్ 25 ....
పొద్దున్నే లేచేసరికి....అమ్మ-నాన్న అప్పటికే రెడి అయి మండపానికి వెళ్ళిపోయారు......'ఇందు...టు-డే ఇజ్ ఏ బిగ్ డే..' అనుకుంటూ నిద్ర లేచా!!సెల్ చూస్తే రోజు పొద్దున్నే ఠంచను గా వచ్చే చందు  మెసేజ్ లేదు.....కోపమొచ్చి 'హ్యాపీ వెడ్డింగ్ డే' అని మెసేజ్ కొట్టి సెల్ పక్కన పడేసా!!తరువాత  అత్త,పిన్ని,ఆమ్మ వాళ్ళు నాకు మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతుర్ని చేయడం మొదలు పెట్టారు ....ఇంతలో అమ్మ వాళ్ళు వచ్చారు....ఆ కార్యక్రమం అయ్యాక....నన్ను మండపానికి తీసుకెళ్ళి ఏదో పూజ చేయించారు.....మండపం లోకి అడుగు పెడుతుండగా స్టేజ్ మీదకి చూసా...పాపం చందు....తెల్లవారు ఝామున మూడు నించి ఆ అగ్నిహోత్రం ముందే అట...కళ్ళు ఎర్ర మిరపకాయల్లా  ఉన్నాయ్....ప్రళయ కాల రుద్రుడు లా చూస్తున్నాడు....ఇంకాసేపు అలాగే ఆ పొగ లో కూర్చోబెడితే 'నాకు ఈ పెళ్లి వొద్దు బాబోయ్!!' అని పారిపోతాడేమో అనిపించింది .నాకు నవ్వు,భయం  ఒకేసారి వచ్చాయి ఆ ముఖం చూస్తే.....నేను వస్తుండడం చూసి ఇక వాళ్ళ  బంధువులు చందు ని ఆటపట్టించడం మొదలుపెట్టారు.....అయినా కూడా పోద్దున మెసేజ్ చేయలేదు అన్న కోపం తో కనీసం చూడను కూడా చూడలేదు నేను ....కానీ తరువాత కాశీ యాత్రకి బయలుదేరినపుడు దొంగ చాటుగా చూసాలెండి...

ఆ కార్యక్రమం అయ్యాక ఇంటికి వచ్చి కాసేపు నిద్రపోదామనుకున్నా....కానీ మళ్లీ ఆలోచనలు చుట్టు ముట్ట్టేసాయి....ఇంటినిండా  సామాను..చుట్టాలు....పక్కాలు.....ఎవరి గోల వారిది లాగ ఉంది...నాకు మాత్రం మనసు మనసులో లేదు....రాత్రి నిద్ర లేదేమో అలాగే ఆలోచిస్తుంటే ఎప్పుడో  కునుకు పట్టేసింది...

ఈలోగా సాయంత్రమైపోయింది....అసలు తతంగానికి తెర లేచింది....7 :51 కి ముహూర్తం...అమ్మ వచ్చి నన్ను లేపింది...టైం చూస్తే ఐదు...ఇక నాకు మంగళ స్నానం చేయించి ఎర్రని కంచిపట్టు  చీర కట్టి,ప్రత్యేకంగా చేయించిన పూల జడ దగ్గరుండి కుట్టించి,కళ్యాణ తిలకం దిద్ది,చేతి నిండా గాజులు వేసి,రకరకాల నగలు పెట్టి,ఒక్కసారి నన్ను కళ్ళ నిండా చూసుకుని...'నేను నా కూతురు 'పెళ్లికూతురు' గా ఎలా ఉండాలి అనుకున్నానో అలాగే  ఉన్నావే...' అని దిష్టి తీసింది...... ఆ అలంకరణ అవన్నీ భలే గా అనిపించాయి.....ఎప్పుడూ సింపుల్ గా ఉండే నేను అన్ని నగలు అవి  వేసుకోవడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది....సరిగ్గా ఆరున్నర కి నేను కళ్యాణ మండపానికి బయలుదేరాను ....ఒక్కసారి మళ్లీ నిస్సత్తువ ఆవరించింది....అదే నాకు ఆ ఇంటి మహారాణి గా ఆఖరి క్షణం...ఇక నేను వేరే ఇంటి అమ్మాయిని అయిపోతాను కదా!!.....వెళ్లబోయే ముందు అమ్మ-నాన్న కాళ్ళకి నమస్కరించాను.....నాన్న దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టారు.....అప్పుడు చూసాను నాన్న కళ్ళలో చిన్న నీటి తెర...నా జీవితం లో నాన్న ఏడవడం అదే మొదటిసారి నేను చూడటం ....ఇక అమ్మ అప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంది కాబోలు  నన్ను దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టుకుంది....ఇద్దరు నన్ను పొదివి పట్టుకుని బయటకు తీసుకెళ్ళారు...ఇంతలో తమ్ముడు వచ్చాడు..వాడు కార్ లో ముందు కూర్చోగా వెనుక అమ్మ-నాన్న మధ్యలో నేను కూర్చున్నా....కార్ బయలుదేరేముందు ఒక్కసారి ఇంటి వైపు చూసి ఇక చూడలేక తల తిప్పేసుకున్నా....

పెళ్లి మండపం....నేను,అమ్మ కలిసి ఆ అలంకరణ అన్నీ సెలెక్ట్ చేశాం...నాన్న గారికి ఆక్సిడెంట్ అవడం వల్ల అన్నీ మేమే చూసుకోవాల్సివచ్చింది....ఆ మండపం లోకి అమ్మ-నాన్న-తమ్ముడు తో పాటు అడుగు పెడుతూ...అందరూ అంతే చూస్తుంటే సిగ్గు తో తల దించుకుని వడి వడి గా పెళ్ళికూతురి గది వైపు వెళ్ళిపోయా...గౌరీ పూజ చేయడం పూర్తయ్యాక నన్ను బుట్టలో తీసుకెళ్ళారు పెళ్లి పీటల దగ్గరకి...ఇక అక్కడినించి పెళ్లి హడావిడి మొదలు....జీలకర్ర-బెల్లం,తాళి,తలంబ్రాలు,మెట్టెలు,నల్లపూసలు,ఏడు అడుగులు,హోమం,అరుంధతి నక్షత్రం ....అన్నీ పద్ధతి గా జరిగాయి... నేను చూసిన పెళ్ళిళ్ళలో నాకు బాగా నచ్చిన పెళ్లి మాదే......జీలకర్ర-బెల్లం పెట్టేటపుడు చందు చేయి మీద చేయి ఉంచి క్షణం నాకు ఇప్పటికీ మెదులుతూనే ఉంది....ఆ క్షణానే మనసులో అనుకున్నా...ఎప్పటికీ ఈ అబ్బాయి చేయి వదిలి పెట్టకూడదు అని......అలాగే తాళిబొట్టు కట్టేటపుడు....ఆ తాళి ఎప్పటికీ అలాగే పచ్చగా కళకళ లాడుతూ ఉండాలి అని కోరుకున్నా...ఇక తలంబ్రాలు అపుడు ప్రత్యేకంగా తెలుపు-ఎరుపు  ముత్యాలు తెప్పించాం.....(రాముల వారి కల్యాణం చూసినపుడల్లా నాకు ముత్యాల తలంబ్రాలు కావాలనిపించేది..అందుకే వెతికి వెతికి మరీ అవి తెప్పించా)...అవి పోసుకుంటూ చేసిన గోల అంతా ఇంతా కాదు...సప్తపది అపుడు చందు అడుగులో అడుగు వేస్తుంటే ఎంత అబ్బురంగా అనిపించిందో !!..అలాగే మిగితా అన్ని కార్యక్రమాలు ఆహ్లాదంగా జరిగిపోయాయి.....బంధువులు,స్నేహితులు,చుట్టుపక్కలవాళ్ళు,నా చిన్ననాటి స్కూల్ టీచర్లు,...ఇలా చాలామంది దీవెనల మధ్య మా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది....

ఇక అప్పగింతలు  దగ్గరికి వచేసరికి మళ్లీ పరిస్తితి మొదటికి వచ్చింది......అందరి దగ్గరకి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని ప్రతి ఒక్కరికి వీడ్కోలు చెప్పా!! అత్తయ్యలు,పిన్ని వాళ్ళు,ఆమ్మ వాళ్ళు,బాబాయ్,వరలక్ష్మి ఆంటీ వాళ్ళు,బామ్మ,కిరణ్ అన్నయ....అందరికీ....ఇక చివరికి చందు తో కలిసి మా అత్తగారింటికి వెళ్ళేటపుడు..... అమ్మ ని వదిలి మొదటిసారి అస్సలు పరిచయం లేని వారింటికి వెళుతున్నా అన్న భయం....దుఖం...సంతోషం....ఏమని చెప్పను....నా చందు దగ్గరకి వెళుతున్నా అని ఆనందమా!! అమ్మ ని,నాన్న ని వదిలేసి వెళ్ళిపోతున్నా అని బాధా!! అమ్మని దగ్గరికి  తీసుకుని ముద్దులు పెట్టా...అలాగే నాన్నకి కూడా...కూతురు అత్తవారింటికి వెళుతోంది అన్న ఆనందం....తమని వదిలి వెళ్ళిపోతోంది అన్న బాధ...పాపం వారి పరిస్తితి ఇంతే!!

ఇక అమ్మ-నాన్నకి,తమ్ముడికి   'బై' చెప్పేసి  వెనుదిరిగి చూడకుండా కారేక్కేసా....తరువాత దారిపొడవునా ఏడుస్తూనే వున్నా!! చందు చాలా ఓదార్చాడు.... ఇక మర్నాడు తెలతెల వారుతుండగా అత్తవారింట్లో అడుగుపెట్టా....అలా అడుగు పెడుతునపుడు మనసులో ఒకటే అనుకున్నా....'ఇక ఇదే నా ఇల్లు....కష్టమైనా,సుఖమైన....ఇక ఇక్కడే నా జీవితం..' అని చందు తో కలిసి చిరునవ్వుతో....అడుగు పెట్టా!!

అలా జరిగిన సంవత్సరం తరువాత ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకోవాలనిపించింది....ఈ సంవత్సర కాలం అసలు ఎలా గడిచిందో కూడా తెలీదు... పెళ్ళికి ముందు అంత భయపడ్డ అమ్మయినేనా ఇన్ని వేలమైళ్ళు అమ్మావాళ్ళకి దూరంగా ఉన్నది??

కాలం అన్నిటికి మందు....కాలం గడిచే కొద్ది కొన్ని మార్పులు జరిగిపోతూ ఉంటాయ్...ఈ సంవత్సర కాలం...ఎన్నెన్నో ఊసులు....ఎన్నెన్నో జ్ఞాపకాలు...చిలిపి తగాదాలు....ఆనందాలు.....ఓదార్పులు....అలకలు...హ్మ్...అలా హాయిగా సాగిపోయాయి రోజులు..

ఎవరో బ్లాగ్ లో చెప్పినట్లు.... 'పెళ్లి అనేది జీవితం లో మనం జరుపుకునే పెద్ద పండుగ'... ఆ పండుగ విశేషాలని  మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.... :)

 మా పెళ్లిలో ని కొన్ని ముఖ్య ఘట్టాలు...ఫోటోల రూపంలో...

జీలకర్ర-బెల్లం:.

కన్యాదానం:

తలంబ్రాలు:

సప్తపది:46 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు మీకు, ఇందు గారు.

మీ పెళ్ళిని చాలా అందంగా వర్ణించారు, అత్తవారింటికి వెళ్ళే, పుట్టింటికి దూరమయ్యే ఒక ఆడపిల్ల మనసుని చక్కగా పొందు పరిచారు మీ భావాలతో.

పెట్టినవి నాలుగు ఫొటోలే అయినా, ప్రతి ఒక్కటీ చాలా చాలా బాగున్నాయి. చివరిదైతే మరీనూ.

Congratulations !

:)

Alapati Ramesh Babu చెప్పారు...

Best wishes to you both on ur anniversary, May the love that you share Last your lifetime through, As you make a wonderful pair. Happy Wedding day.

snellens చెప్పారు...

Happy Anniversary... Nice photos

Overwhelmed చెప్పారు...

Wish you both have the best first anniversary Indu!!

Chala baaga chepparu pelli kaburlu.. mi pelli ki mammalni kuda tisukellipoyyaru.

..nagarjuna.. చెప్పారు...

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇందుగారు....
చివరి ఫొటో అద్భుతంగా వచ్చింది...

హరే కృష్ణ చెప్పారు...

Happy Anniversary to both of you!
ఫొటోస్ Superb!

జ్యోతి చెప్పారు...

హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు ఇందు గారు. చాలా బాగా రాశారు. మీ మనోభావాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. మీ వివాహ వార్షికోత్సవం సంధర్బంగా ఇలా ఆనాటి ఆలోచనలు తలుచుకుని మాతో పంచుకోవాలన్న ఆలోచన బాగుంది.

కొత్త పాళీ చెప్పారు...

ఈ కాలపు "విడియోకోసం పెళ్ళిళ్ళు"లాగా కాకుండా చక్కగా శాస్త్రోక్తంగా జరుపుకున్నట్టు ఉన్నారు. చాలా సంతోషం.
Wishing both of you a lifetime of happy togetherness.

ఇందు చెప్పారు...

@Venu:చాలా థాంక్స్ అండీ వేణు గారు :)
@rameshsssbd:Thankyou somuch Ramesh
@snellens:Thankyou Snellens
@Jaabili :Thankyou Jabilli garu :)

Sravya V చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఇందు చెప్పారు...

@..nagarjuna.. :Thankyou Nagarjuna garu :)
@హరే కృష్ణ :Thankyou harekrishna garu :)
@జ్యోతి :Thankyou Jyotigaru
@వేణూ శ్రీకాంత్ :థాంక్స్ వేణుగారు....సంతోషం అందరితో పంచుకుంటే పెరుగుతుంది కదా అందుకే ఇలా మీ అందరితో పంచుకున్నా :)
@కొత్త పాళీ :అవునండీ చాలా పధ్ధతిగా జరిగింది :) అభినందనలకు ధన్యవాదాలు

కృష్ణప్రియ చెప్పారు...

అభినందనలు.. అంత అందంగా వివరించినందుకు! అందరూ చెప్పినట్టు ఫొటోలు అద్భుతం గా ఉన్నాయి.

చెప్పాలంటే...... చెప్పారు...

హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు మీకు, ఇందు గారు.ninna chuda ledu late gaa cheptunna eami anukokandi

శివరంజని చెప్పారు...

మా ఇందు గారి కి హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు ఇందు గారు.....................ఫొటోస్ సూపర్బ్ ......... మరి స్వీట్స్ ఏమి లేవా ?????? కొంచెం లేట్ గా విషెస్ చెబుతున్నందుకు ఏమి అనుకోకండేం ...నిన్న మీ పోస్ట్ చూడనేలేదు...

3g చెప్పారు...

Happy Anniversary to both of you! పోస్ట్ చాలా బాగుంది. ఫొటోస్ కూడా.

చెప్పారు...

god bless you InChandu :-) Our marriage day is 23rd Oct Last year :-)

శిశిర చెప్పారు...

మీ వివాహ వేడుకనీ, అప్పటి మీ మనఃస్థితినీ చాలా బాగా ఆవిష్కరించారు. ఫోటోలు చాలా బాగున్నాయి. పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

Ram Krish Reddy Kotla చెప్పారు...

Wish you and chandu a very very very happy first marriage anniversary...chala chala happy ga anipinchindi post chaduvuthunte.. Well written :-). If you dont mind, can i ask your marriage pics send to my mail id (picasa link) rkreddy.kotla@gmail.com..wanna see both of you.. Thank you.

Raj చెప్పారు...

Belated wedding anniversary wishes to you and Chandu...

సి.ఉమాదేవి చెప్పారు...

పెళ్లంటే మనసుల సాహచర్యం.మీ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి.మీ ఇరువురి జీవనం అంతే అద్భుతంగా ఉండాలని,మీ సాహచర్యం నిత్యనూతనమై నిలవాలని శుభాశీస్సులు అందచేస్తూ ఇందు,చందుల జంట ఇంట పెద్దలందరికి కనువిందుగ కనులపండగ కావాలని ఆశిస్తున్నాను.Many Happy returns of the day.

మనసు పలికే చెప్పారు...

ఇందు గారూ.. ఆలస్యంగా చూశాను.. క్షమించెయ్యండి.:)Happy Wedding Anniversary..:)
చాలా చాలా నచ్చింది మీ టపా నాకు..:) మీ వర్ణన అద్భుతం. ఫోటోస్ చాలా బాగున్నాయి..
చిన్న రిక్వెస్ట్ అండీ.. మీ కామెంట్ బాక్స్ స్టైల్ కొంచెం మారుస్తారా..? పోస్ట్‌లో ఎంబెడ్ చేసిన కామెంట్ బాక్స్‌లో వ్యాఖ్య పెట్టలేకపోతున్నాను..:(
(ఈ దెబ్బతో నాకు మార్పు శిఖామణి అన్న పేరు ఖచ్చితంగా ఖాయం అయిపోతుంది.. )

ఆత్రేయ చెప్పారు...

చదువు తుంటే నా కళ్ళలో కూడ సన్నటి నీటి తెర.... రెండు గుటకలూ..... ఎందుకంటే ఇంకో నాలుగైదు ఏళ్ళలో మా అమ్మాయికీ పెళ్లి చేయాలి ఫ్లాష్ బ్యాక్ లాగా ఫాస్ట్ ఫార్వార్డ్ అయ్యాను అందుకే కొంచం సెంటి ..
GOD BLESS YOU !
HAVE A WONDERFULLL LIFE !!

ఇందు చెప్పారు...

@కృష్ణప్రియ :Thankyou Krishnapriya gaaru :)
@శివరంజని :థాంక్యూ శివరంజని.స్వీట్సా ఎందుకు లేవూ? నిన్న గులాబ్ జాం చేసా! మా ఇంటికి వస్తే పెడతా :)
@3g:Thankyou 3G
@Sheshu Kumar Inguva:Oh! ఐతే మీకు Belated wedding anniversary wishes :)
@శిశిర :Thankyou sisira

ఇందు చెప్పారు...

@Ramakrishna Reddy Kotla:Chaala thanks Kishan. I will try my best :)
@raj:Thankyou Raj.
@C.ఉమాదేవి :ఉమాదేవి గారు మీ దీవెనలకు ధన్యవాదాలు :)
@మనసు పలికే:Chaala thanks andi. Maarustaa.... hahaha mee kotha peru baagundi :D
@ఆత్రేయ :Thankyou sir. ఈ బాధలు ఆడపిల్లలకి,వారిని కన్నవారికి తప్పవేమో!!

రాధిక(నాని ) చెప్పారు...

ఇందు గారుహృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలండి.ఆలస్యంగా చెప్పినందుకు ఏమీ అనుకోకండి .చాలా చక్కగా రాసారండి.ఫోటోలు చాలా చాలా బాగున్నాయండి.నిన్న మా మావయ్య గారి అబ్బాయిది కుడా మొదటి పెళ్లిరోజే .

Cute Indian చెప్పారు...

Hi Indu,

Happy Wedding Day.

Indu Post aripinchav......
kekaaaa.Photos kuda adbuthamga vunnai.... :)

Cute Indian చెప్పారు...

Asalu neee post chaduvutunte kallu chemartchutunnai....antha adbuthamga raastunnav...

sivaprasad చెప్పారు...

Happy Wedding Anniversary..:)

ఇందు చెప్పారు...

@ రాధిక(నాని ): Thanks andi.Vaariki naa wihes cheppanani cheppandi :)
@ Cute Indian:Thanks annaya.
@ sivaprasad:Thankyou.

చందు చెప్పారు...

బావుంది. ఇందు - చందు ల పెళ్లి. విశేషాలు మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకుని మీరు మరిన్ని టపాలు వెయ్యాలి.

siri చెప్పారు...

Indu-Chandu mee perla lage mee janta kuda chuda muchataga untaranipistondi. ammai tana vivaha ghadialaku inta chakkani akshara rupam ivvatam, new attempt. dairy lu bloglayyayi, manasu yathatathamga bayatikostondi.nice writing and nice photos

sree raaga

మాలా కుమార్ చెప్పారు...

ఇందు గారు ,
పెళ్ళి రోజు శుభాకాంక్షలండి .
ఆలశ్యం గా చెప్పాను ఏమీ అనుకోకండి .
మీ ఫొటో లు , మీరు చెప్పిన విధానము చాలా బాగుందండి .

మధురవాణి చెప్పారు...

ఇందు,
కాస్త ఆలస్యంగా మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. ఫోటోలు చాలా బాగున్నాయి. :)
ఏంటోనండీ.. మీర్రాసే పోస్టులకీ నాకూ చాలా పోలికలు కనిపించేస్తున్నాయి. :)

ఇందు చెప్పారు...

@చందు :అలాగే చందుగారు తప్పకుండా :)
@siri:థాంక్యూ సిరి :)నాకెందుకో ఇలా వ్రాసుకుంటే ముందు ముందు అవి చూసుకుని ఆనందపడొచ్చు కదా అని ఒక చిన్న ఫీలింగ్.అందుకె వ్రాసా :)
@మాలా కుమార్:ఏం ఫర్వాలేదండీ....థాంక్యూ మాలాకుమర్ గారు :)
@ మధురవాణి :థాంక్యూ మధురగారు.మీతో నాకు పొలికనా? నేనేదో ఈమధ్యే బ్లాగటం మొదలుపెట్టా...మీరు ఈపాటికే బ్లాగుల్లో సిధ్ధహస్తులు.హ్మ్! మీరు వ్రాసేవి భలె కామెడీగా ఉంటాయ్..మీకు ఒక సరళి ఉంది.నేను ఇక వ్రాసేటపుడు ఎలా అనిపించేస్తే అలా వ్రాసేస్తా...దానికి ఒక పధ్ధతి అని ఏమిఉండదు :)

మధురవాణి చెప్పారు...

@ ఇందు,
నిజానికి నాకంటే మీరే చాలా అందంగా రాస్తారు. అచ్చం ఇలాంటి భావాలే నేనూ రాద్దామనుకుని ఎందుకో రాయలేదు. ;)
నాకో సరళి ఉందని మీకనిపించిందేమో గానీ, నేను మాత్రం మీరన్నట్టు అప్పుడేదనిపిస్తే అదే రాసేస్తానండీ! నేనూ అచ్చం మీలాగే సరదాగా బ్లాగు మొదలెట్టి అలా తోచింది రాసుకుంటూ పోతున్నానండీ! బ్లాగు మొదలెట్టకముందు అసలు నేను రాయగలనని కూడా నాకు తెలీదు. :)
పైన సిరి గారికి చెప్పారే..
"ఇలా వ్రాసుకుంటే ముందు ముందు అవి చూసుకుని ఆనందపడొచ్చు కదా అని ఒక చిన్న ఫీలింగ్." అని..అది మాత్రం చాలా నిజం. నా అనుభవం కూడా అదే! Keep writing! :)

ఇందు చెప్పారు...

@ మధురవాణి:ఇప్పుడే మునగచెట్టు ఎక్కి దిగాను :) మీకు నా వ్రాసే విధానం నచ్చినందుకు థాంక్యూ :) మీ స్ఫూర్తితో నేను కూడా ఈ బ్లాగ్లోకం లో మీ అంత పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తా

మనసు పలికే చెప్పారు...

ఇందు గారు, ధన్యవాదాలండీ.. కామెంట్ బాక్స్ స్టైల్ మార్చేశారా నాకోసం..:))
Thank you...

అశోక్ పాపాయి చెప్పారు...

నేను మరి కాస్త ఆలస్యంగా మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలండి.

kiran చెప్పారు...

ayyoo..kastha late ga chusanandi ii post..bahle undi..last year 29th na friend pelli...entha edchano nenu adi naku duuram aipotondani..andulo dani venakale undi unnanemo..dani badha + na badha rendu kalisipoyayi..
mee post super...mee pics kuda super..

any ways happy wedding anniversary.. :)

ఇందు చెప్పారు...

@ మనసు పలికే :ఫర్వాలేదులేండీ అందరికీ సౌకర్యంగా ఉండాలి కదా మరి బ్లాగ్ అంటే!అందుకే మార్చేసా!
@ అశోక్ పాపాయి:నేను ఇంకొంచెం ఆలస్యంగా 'ధన్యవాదాలు ' :)
@ kiran:Thankyou kiran :)

HiMa చెప్పారు...

hmmm... aa time lo ila untunda?
[:(] [:)]
nuvvu cheppina vidhanam chala bavundi indu

నీహారిక చెప్పారు...

ఎంత బాగా రాసారు, ఇన్ని రోజులూ నేను ఎందుకు చూడలేదు ఈ బ్లాగు?

Pranam చెప్పారు...

Indu garu,
Me love story kuda ade chetto raseyochu kada..me posts chadvutunte me story telsukovalani undi..plss post :)

Unknown చెప్పారు...

mi varnana adbutamugvunadi e june lo na peli ani anukuntuvunanu, maremile
inka date petaledu andukani but okati suma na peli lokuda naku kaboe barya mani ilage badpdut vuntadani naku ipude talisindi,ivala ma baryamani to matlade tapudu ame paristiti emito adigi telusukovali.
mi kapuramu ;)/ sametalu ravu kanuka "english lo happy married life"

Sirisha చెప్పారు...

chala heart touching ga undi....mee blog ki nenu pedda fan ni indu garu...

mee chetule anta andam ga untey inka meeru enta andam ga undi untaro kada... dishti tiyinchukondi meeku and mee blog ki...