skip to main  |
      skip to sidebar
దసరా....చాలా సరదా సరదా గా గడిచిపోయేది చిన్నపుడు.పది రోజుల సెలవులు.....పెద్దపండగ కలిసి ....ఆటలే ఆటలు....గోలే గోల. అమ్మ మాకోసం కష్టపడి కజ్జికాయలు,కొబ్బరి బూరెలు,కారప్పూస, చెక్కలు,రవ్వలడ్లు,బూంది లడ్లు....ఇలా ఎన్నో చేసి పెట్టేది....అవన్నీ తినడం...అవి అరిగేదాక ఆడడం ఈ పది రోజుల దినచర్య.
అమ్మ మాకోసం కష్టపడి కజ్జికాయలు,కొబ్బరి బూరెలు,కారప్పూస, చెక్కలు,రవ్వలడ్లు,బూంది లడ్లు....ఇలా ఎన్నో చేసి పెట్టేది....అవన్నీ తినడం...అవి అరిగేదాక ఆడడం ఈ పది రోజుల దినచర్య. 
 
చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. అది నా ఐదవ తరగతి లో అనుకుంటా జరిగింది.నాన్న మాకు అప్పుడే లలితా సహస్రనామాలు చదవడం నేర్పిస్తున్నారు...వాటి విశిష్టత...గొప్పతనం గురించి రోజు కొంచెం కొంచెం చెప్పేవారు.ఒక సారి ఇలాగె చెబుతూ....ఏమన్నా రోగాలు,జ్వరం వచ్చినా ఆ రోగి తల పై చెయ్యి పెట్టి లలిత చదివితే తగ్గిపోతుంది అని చెప్పారు.అది బాగా మెదడు లో పాతుకుపోయింది నాకు,తమ్ముడికి.
అది నా ఐదవ తరగతి లో అనుకుంటా జరిగింది.నాన్న మాకు అప్పుడే లలితా సహస్రనామాలు చదవడం నేర్పిస్తున్నారు...వాటి విశిష్టత...గొప్పతనం గురించి రోజు కొంచెం కొంచెం చెప్పేవారు.ఒక సారి ఇలాగె చెబుతూ....ఏమన్నా రోగాలు,జ్వరం వచ్చినా ఆ రోగి తల పై చెయ్యి పెట్టి లలిత చదివితే తగ్గిపోతుంది అని చెప్పారు.అది బాగా మెదడు లో పాతుకుపోయింది నాకు,తమ్ముడికి. 
 
ఒక రోజు మధ్యాహ్నం అమ్మ పాపం పిండి వంటలు చేసి అలసిపోయి నిద్రపోతోంది బెడ్రూం లో.నేను మా తమ్ముడు వరండాలో ఏవో ఆడుకుంటున్నాం. నేను భారత నాట్యం నేర్చుకునే రోజులు అవి. నేనేదో మాములుగా డాన్స్ చేస్తుంటే మా తమ్ముడు 'అక్కా! నేను తాళం వేస్తా నువ్వు చెయ్యి' అన్నాడు.గోడకు తగిలించే ఛార్ట్ కి ఉండే చెక్క తీసుకొచ్చి నేల మీద వాడికి ఇష్టం వచ్చినట్టుగా దరువేస్తున్నాడు. నేనేమో పూనకం వచ్చ్సిన దానిలాగా డాన్స్ చేస్తున్నా.ఇంతలో కాలు లో ఏదో గుచ్చుకున్న ఫీలింగ్.,అయినా తగ్గకుండా వీరావేశం తో తెగ చేసేస్తున్నా డాన్స్ తకదిమి...తకదిమి అనుకుంటూ.ఇంతలో మా తమ్ముడు....'అక్కా! రక్తం..రక్తం!!' అని అరిచాడు..అపుడు చూసుకున్నా...కాలులో చిన్న మేకు దిగింది.మనం ఆపకుండా దానిమీదే డాన్స్ చేయడం వల్ల అది లోపలి దిగబడిపోయింది కూడా...రక్తం ధారాపాతంగా కారిపోతోంది....వాడేమో భయంతో బిత్తరపోయి చూస్తున్నాడు....అప్పుడు నొప్పి తెలిసి ఆరున్నొక్క రాగం మొదలుపెట్టా.నన్ను చూసి వాడు ఏడుపు మొదలెట్టాడు. .కాసేపయ్యాక వాడు  ఏడుపు ఆపి ఏదో గుర్తొచ్చిన వాడిలా పూజ మందిరం లోకి వెళ్లి కాటన్ అనుకుని పత్తి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు.నేను మేకు మెల్లగా తీసి అవతల పారేసి ఆ పత్తి తీసుకుని మేకు దిగబడిన చోట పెట్టా.అయినా భయం తగ్గని మా తమ్ముడు మళ్లీ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి 'లలితా సహస్రనామాలు' పుస్తకం తెచ్చి వాడి కుడి చేయి నా తల మీద పెట్టి  వచ్చీ రానీ ఆ నామాలను చాలా కష్టపడి చదివేస్తున్నాడు....ఎలాగైనా అమ్మ లేచే లోగ ఆ గాయం మానిపోవాలని వాడి ఉద్దేశం
.కాసేపయ్యాక వాడు  ఏడుపు ఆపి ఏదో గుర్తొచ్చిన వాడిలా పూజ మందిరం లోకి వెళ్లి కాటన్ అనుకుని పత్తి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు.నేను మేకు మెల్లగా తీసి అవతల పారేసి ఆ పత్తి తీసుకుని మేకు దిగబడిన చోట పెట్టా.అయినా భయం తగ్గని మా తమ్ముడు మళ్లీ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి 'లలితా సహస్రనామాలు' పుస్తకం తెచ్చి వాడి కుడి చేయి నా తల మీద పెట్టి  వచ్చీ రానీ ఆ నామాలను చాలా కష్టపడి చదివేస్తున్నాడు....ఎలాగైనా అమ్మ లేచే లోగ ఆ గాయం మానిపోవాలని వాడి ఉద్దేశం 
 
ఇంతలో అనుకున్నంతా అయ్యింది.మా హడావిడి కి,ఏడుపులకి అమ్మ లేచేసింది. 'ఏం జరుగుతోంది ఇక్కడ?' అని అడిగింది. భయపడుతూ....అసలు విషయం చెప్పాను.అంతే!! ఇద్దరి వీపుల మీద మద్దెల దరువులు.
 'ఏం జరుగుతోంది ఇక్కడ?' అని అడిగింది. భయపడుతూ....అసలు విషయం చెప్పాను.అంతే!! ఇద్దరి వీపుల మీద మద్దెల దరువులు. 'అసలే తుప్పు పట్టిన మేకు.....అదికాకుండా పత్తి తీసుకొచ్చి దానికి పెడతావా? సెప్టిక్ అవుతుందే...ఏం పిల్లలు దొరికారు దేవుడా....పిల్లలు కాదు పిశాచాలు!!' అని తిట్ల తలంటు పోసింది.'ఏం కాదు...నేను లలితా సహస్రనామాలు చదివా....అక్క తల మీద చేయి పెట్టి.అంతా బాగయిపోతుంది. నాన్న చెప్పారు కదా నిన్న' అని మా తమ్ముడు అమాయకపు ఫేస్ పెట్టుకుని చెప్తుంటే వాడికి లాగిపెట్టి  ఒక్కటి ఇచ్చి
 'అసలే తుప్పు పట్టిన మేకు.....అదికాకుండా పత్తి తీసుకొచ్చి దానికి పెడతావా? సెప్టిక్ అవుతుందే...ఏం పిల్లలు దొరికారు దేవుడా....పిల్లలు కాదు పిశాచాలు!!' అని తిట్ల తలంటు పోసింది.'ఏం కాదు...నేను లలితా సహస్రనామాలు చదివా....అక్క తల మీద చేయి పెట్టి.అంతా బాగయిపోతుంది. నాన్న చెప్పారు కదా నిన్న' అని మా తమ్ముడు అమాయకపు ఫేస్ పెట్టుకుని చెప్తుంటే వాడికి లాగిపెట్టి  ఒక్కటి ఇచ్చి 'చేసిందంతా చేసి ఇంకా వెధవ్వేషాలు ఒకటి' అని తిట్టి హడావిడిగా నన్ను హాస్పిటల్ కి లాక్కెళ్ళి చుర్రుమని టెట్వాక్ ఇంజెక్షన్ చేయించింది మా అమ్మ....అంతటితో ఊరుకుందా? లేదు..సాయంత్రం నాన్నారు రాగానే మళ్లీ రెండవ రౌండు తిట్లు కోటింగ్ వేయించింది...
'చేసిందంతా చేసి ఇంకా వెధవ్వేషాలు ఒకటి' అని తిట్టి హడావిడిగా నన్ను హాస్పిటల్ కి లాక్కెళ్ళి చుర్రుమని టెట్వాక్ ఇంజెక్షన్ చేయించింది మా అమ్మ....అంతటితో ఊరుకుందా? లేదు..సాయంత్రం నాన్నారు రాగానే మళ్లీ రెండవ రౌండు తిట్లు కోటింగ్ వేయించింది... 
 
ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నవ్వొస్తోంది నేను,మా తమ్ముడు చేసిన అమాయకపు పనులు,అల్లరి.......ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండు.....ఆ దసరా సరదాలు మళ్లీ వెనక్కి వస్తే బాగుండు...
 నేను,మా తమ్ముడు చేసిన అమాయకపు పనులు,అల్లరి.......ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండు.....ఆ దసరా సరదాలు మళ్లీ వెనక్కి వస్తే బాగుండు...
 
 
 
  
 
 
 
13 కామెంట్‌లు:
కజ్జికాయలు,కొబ్బరి బూరెలు,కారప్పూస, చెక్కలు,రవ్వలడ్లు,బూంది లడ్లు...!! చాలా ? ఇంకేమన్నా ఉన్నాయా ? ఆయినా అవన్నీ తింటూ కూర్చోక మీకు మీ తమ్ముడికి హిందీ సినిమా లో లా ఆ మేకుల మీద డాన్సు ఎందు కమ్మా..?
sweet
హ హ బాగున్నాయండీ అల్లర్లు. లలితాసహస్రనామం మాత్రం సూపరు:)
@ఆత్రేయ :'ఇలా ఎన్నో చేసిపేట్టేది అన్నాను కానీ అన్నీ చేసేది అనలేదు కదా ఆత్రేయ గారు... :) ఎవో మా ఆటలు మావి లేండి... :D
@కొత్త పాళీ:థాంక్యూ
@వేణూ శ్రీకాంత్:థాంక్యూ వేణు గారు... :)
bharatha natyam lo kuda praaaveenyam vundaaa indu neeku..
:)
Ithe baaagane allari chesav gaaa chinnappudu....
illu peeki pandiri vesavannamata.....
:) :)
@Cute Indian : avunu annaya :)
:-)) Very cute..
నేనూ చిన్నప్పుడు ఇలాంటి పిచ్చి పనొకటి చేసాను. మీ పోస్టు చదువుతుంటే, నేనూ, మా తమ్ముడు చేసిన అల్లరంతా గుర్తొచ్చింది. చాలా ముచ్చటగా ఉంది మీ వెన్నెల సంతకం! :)
@కృష్ణప్రియ :thankyou krishna priya :)
@మధురవాణి :నా బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదాలు మధుర గారు...మీ తమ్ముడి గురించి వ్రాసిన 'హప్పి హప్పి బర్త్ డే' పోస్ట్ చదివానండి...అప్పుడు నాకు ఇలానే అనిపించింది :)
దసరా శుభాకాంక్షలు కాస్త ఆలస్యం గా
post & templet బావుంది
Cute ga undi me allari...chaduvuthu chala navvukunna oohinchukuntoo :)
@ హరే కృష్ణ :Thankyou harikrishna :)
@ Ramakrishna Reddy Kotla :Thankyou somuch kishan.
కామెంట్‌ను పోస్ట్ చేయండి