8, మార్చి 2011, మంగళవారం

తింగర మంగళ!

మొన్న సాయంత్రం 'మంగళ' సినిమా చూసాం! అసలే దయ్యాలంటే.....వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాను.... నాకు అవసరమా ఇప్పుడు 'మంగళ' చూడటం? అప్పటికే...'నాగవల్లి' సినిమా చూసి..... 'నాగవల్లా....గోడమీద బల్లా?' అనే టైటిల్ తో ఒక పోస్ట్  వేద్దామనుకుంటే....'నాగవల్లి' గారు ఇచ్చిన సీరియస్ వార్నింగ్ దెబ్బకి దడిచి ఆ పోస్ట్ పబ్లిష్ కూడా చేయకుండానే డెలీట్ చేసేసా! అయినా కూడా భయంభక్తి లేకుండా....'మంగళ' చూడ్డానికి రెడి అయిపోయా!

ఇక విషయానికొస్తే....ఒక ఆదివారం సాయంత్రం...తెల్లటి ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్మిన వేళ.....పొద్దున మిగిలిపోయిన మాడిపోయిన ఉప్మా ని మళ్లీ వేడి చేసుకుని తింటూ.....ఇదిగో....ఈ 'మంగళ' సినిమా చూడటం మొదలుపెట్టాం!

కథ పెద్దగా ఏమిలేదు....మూడు ముక్కల్లో చెప్పాలంటే.....ఆ...మూడు ముక్కలు కూడా వేస్ట్.....రెండు ముక్కల్లో..... ఛార్మి,సకూచి అంతే!

ఇందులో ఛార్మి గారు ఒక ప్రముఖ సినినటి :))

ఇక ఈ 'సకూచి ' ఎవరబ్బా అనుకుంటున్నారా? 'సకూచి'....అనగానే మీరు పసిగట్టేయాలి.....మన కాశిమజిలి కథల్లో.....'పిడతకూచి' అంటే ఎవరు? 'పిశాచి' అంటే ఎవరు? అలాగే 'సకూచి' కూడా....ఇది ఎవరినైనా ఆవహిస్తే.....వాళ్ళు చచ్చేదాకా వదిలిపెట్టదు.... :D

ఈ 'సకూచి' గారు....చార్మి గారిని పట్టుకుని పీడిస్తే...ఏం జరుగుతుందో.....అదే కథ :D

సరే...కథనం విషయానికి వస్తే....ఒక పనిపాట లేని మంత్ర గాడు(ప్రదీప్ రావత్)....పిచ్చి పిచ్చి ప్రయోగాలు, చేతబడులు చేస్తూ ఉంటాడు. వాడికి దయ్యాలు,పిశాచాలు మంచి ఫ్రెండ్స్.అలాగే మన 'సకూచి' వారు కూడా! వీడి కొడుకు చచ్చిపోవడానికి 'ఛార్మి' కారణం అని నమ్మి ఈ 'సకూచి' ని నిద్రలేపి మరీ ఛార్మి మీదికి పంపుతాడు. కాని ఇక్కడే ఉంది ఒక ట్విస్ట్! 'సకూచి'......అన్ని దయ్యాల్లాగా.....అల్లరిచిల్లరి దయ్యం కాదు! ఇది ఒక్కసారి ప్రయోగించబడితే..... సీతయ్యలాగా... ఎవరి మాటా వినదు.....ఆ ప్రయోగించిన మాంత్రికుడి మాట తప్ప! మరి మన మెంటల్ మాంత్రికుడేమో  ఇంచక్కా దాన్ని ఛార్మి మీద ప్రయోగించేసి.... బాల్చి తన్నేస్తాడు. ఇక ఎలా? 'సకూచి' నించి ఛార్మి ని రక్షించే శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడుంది?

ఇంతలోనే....సినిమాలో మసాలా ఎలిమెంట్స్ మిక్స్ చేయడానికి రెండు సాంగ్లు....మూడు ఫైట్లు ఉంటాయన్నమాట! ఇందులో 'సకూచి' చేసిన ఫైట్ కూడా ఉంటుందన్దోయ్! 'సకూచి' పూనినప్పుడు.....ఛార్మి చేస్తుంది ఫైటు....హ్హహ్హహ్హా ... ఇరగదీసేస్తుందిలే! ఒంటి చేత్తో....రౌడీల దుమ్ము దులిపేస్తుంది తెల్సా! అలా  'సకూచి' వారి విశ్వరూపం ప్రదర్సించాక.....ఛార్మి బ్రతికి బైటపడే మార్గం తెలుస్తుంది....అదెక్కడో తెల్సా! ....'శివకోన' అనే జంగిల్ సెట్టింగ్ లో ;)


ఇక ఎలాగోలా రొప్పుతూ,రోస్తూ ఈ శివకోన చేరిన ఛార్మిని  ఈసారి కొంచెం గట్టిగా పూనుతుంది మన 'సకూచి'. ఇక చూడండి.....ఆ శివకోనలో 'సకూచి'గారి  విలయతాండవం అబ్బో కేకోకేక!ఈలోగా ఈమెని రక్షించడానికి ఒక 'అఘోర'ల గుంపు జింగుజింగుమని ఎగురుకుంటూ వస్తుంది.ఇది క్లైమాక్స్......ఇక్కడ మనం మాములుగా .....పూజలు...గట్రా ఊహించుకుంటాం. కానీ డైరెక్టర్ గారి స్కిల్ మరి! ఇక్కడ ఆ అఘోరాల చేత మాంఛి గ్రూప్ డాన్స్ పెట్టించాడు. వాళ్ళు అలా కాలికొచ్చిన డాన్స్ వేస్తూ ఉంటె....ఇక ఛార్మి గారి వెకిలి చేష్టలు మొదలౌతాయ్! నాలుక బైట పెట్టడం..... భయపెట్టాలని ముఖంలో పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ పెట్టడం....నేల మీద పాకడం...గాల్లో ఎగరడం అబ్బో! ఛార్మి నట విశ్వరూపం(!?) చూడవచ్చు! నాకైతే భయం సంగతి పక్కనబెడితే.....'ఎహే! ఏంటి ఈ సుత్తి గోల....తొందరగా తేల్చండి' అని అనిపించింది.

అలా అఘోరాలు డాన్సు....చేసి...చేసి.... ఛార్మి వికృత చేష్టలు... చేసి...చేసి...... అలసిపోతున్నప్పుడు ......నాకు విసుగొచ్చి ఆవలిస్తున్నప్పుడు..... ఇక శివుడికి చిరాకేసి .....'ఆపండ్రా బాబోయ్! మీగోల భరించలేకపోతున్నా!' అని జలశివలింగ రూపంలో దర్సనమిస్తాడు. ఆ శివజలం ఛార్మి మొహం మీద కొట్టగానే.....మనం బ్రతికిపోతాం.....అంటే....'సకూచి' గారు చార్మిని వదిలేసి వెకేషన్ కి వెల్లిపోతారన్నమాట.

అద్గదీ సంగతి! అలా ఛార్మి 'సకూచి' కి టాటా చెప్పేసి....మనకి బై చెప్పేస్తుంది.నేను బ్రతుకుజీవుడా....అని టీవీ కట్టేసా! 

ఆనక ఒక స్ట్రాంగ్ టీ తాగితే కాని తలనెప్పి వదల్లేదు!

కాని నాకు ఈ సినిమాలో ఒక తీరని వెలితి కనిపించింది. అదేంటంటే.....ఎంతసేపటికి సకూచి  చార్మిని ఆవహించడమే చూపించారుగాని......అసలు సకూచి  'రూపలావణ్యాలు'....'అందచందాలు' ఎక్కడా చూపించలేదు! నేనెంత ఫీల్ అయ్యానో తెల్సా! మరి రాత్రి నిద్రపోయేటప్పుడు.....నా కలలోకి సకూచి  రావాలంటే....దానికి ఏదో ఒక రూపం ఉండాలి కదా! హ్మ్! ఏం చేస్తాం! నా 'సకూచి' ని చూపించకుండానే సినిమా మొత్తం లాగించేసారు! :((

నాకు బాగా చిరాకేసినవి మాత్రం కితకితలు పెట్టుకున్నా నవ్వురాని కామెడి సీన్లు.....ఎంత భయపడాలనుకున్నా వీలు  కానీ హర్రర్ సీన్లు!!  కానీ లాస్ట్ క్లైమాక్స్ లో ఒక 'ఫార్మేషన్' నాకు  నచ్చింది. ఇక్కడ ఫోటోలో చూపించినట్టు ఆ అఘోరాలందరూ.....ఇలా 'శివలింగం' ఆకారంలో ఫార్మ్ అవుతారు! మధ్యలో ఛార్మి ఉంటుంది ;) అప్పుడు ఒక్కసారిగా మధ్యలోనించి  స్ప్రింగ్ లాగా ఛార్మి పైకి లేస్తుంది...అది వేరే విషయం :))))

ఇక ఈ సినిమాలో...నాకు ఛార్మి అస్సలు....అసలులో కొసరు కూడా నచ్చలేదు.ఛార్మిలో మునుపటి చార్మ్ పోయింది  ;) డాన్స్ లో కూడా గ్రేస్ లేదు. మ్యూసిక్ ఓకే ఓకే.... డైరెక్షన్ పూర్! ఏదో సరదాగా ఏమి తోచకపోతే ఒకసారి చూడొచ్చు!

ఈ సినిమాలో....ఒక సస్పెన్స్ కాని....థ్రిల్ కాని....హర్రర్ కానీ ఏమి లేదు.....నేనిప్పటికే దీనిని తలదన్నేలాంటి  దయ్యం సినిమాలు చూడటం వలన.....ఇది నాకు కామెడి సినిమాగా గుర్తుండిపోతుంది తప్ప.....నో సీరియస్ ఎలిమెంట్స్! సో! మీకెవరికైనా దయ్యాలంటే భయముంటే....దయ్యాల సినిమాలు చూసే ధైర్యం లేకపోతె.....మంచి కామెడి ఎంటర్టైనర్ కావాలంటే ఈ సినిమా చూడండి :)) ఇందులో ఎటు దయ్యంకి ఒక రూపం ఉండదు కనుక.... ఛార్మినే దయ్యం పాత్ర కూడా పోషించింది కనుక.....మనం ఛార్మికి భయపడే సీన్ లేదు కనుక...ధైర్యంగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూసేయోచ్చు!

ఇది 'మంగళ' సినిమా మీద ఇందు రివ్యు ;)

19 కామెంట్‌లు:

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. అయితే నువ్వు కూడా బలయ్యావన్నమాట మంగళకి;)
నాకింకా ఆ అదృష్టం దక్కలేదులే ఇందు..

kiran చెప్పారు...

అమ్మా ఇందు..నేనేదో కాస్త ఇలాంటి చెత్త సినిమాలకు దూరంగా ఉండమని తెగ ప్రయత్నిస్తుంటే నువ్వు,ఈ సినిమాల గురించి భలే భలే రాసేసి...
మా మీద revenge తీర్చుకుంటున్నావు ...:P ...
పోనిలే మీకు కితకితలు పెట్టుకున్న నవ్వు రాలేదు...కానీ మేము మీ రివ్యూ లు చూసి నవ్వేసుకుంటున్నాం

ఇందు చెప్పారు...

@మనసు పలికే ::అవును.నేను మంగళ సినిమా చూశాను..దానికి బలయ్యాను! ఏంపర్లేదు...తొందర్లోనే నీకు 'మంగళ ' చూసే అదృష్టం కలగాలని సకూచి ని ప్రార్ధించు ;)

@ kiran :హ్హెహ్హెహ్హే!! నువ్వు చూడు కిరణ్! అస్సలు భయపడక్కర్లేదు :) పిచ్చ కామెడీలే!!

రాధిక(నాని ) చెప్పారు...

హహ్హహ్హ హర్రర్ కాని త్రిల్లర్ కాని సినిమా పై మీ కామిడీ రివ్యూ

Ram Krish Reddy Kotla చెప్పారు...

ఇందూ నేను ఇందాకే ఈ సినిమా డౌన్ లోడ్ చేశాను చూద్దాం అని... ఎదో హారం చూద్దాం అని కాదు, ఆ హారర్ ని మన డైరెక్టర్ ఎంత వరకు కామెడీ చేశాడు అనేది చూద్దాం అని ... హారర్ జీనర్ సినిమాలు చూడాలంటే నేను చేస్తే ఇండియన్ మూవీస్ చూడను ... :))

శరత్ కాలమ్ చెప్పారు...

అమంగళం సంగతేమో కానీ మీరు ఈ సినిమా చూసే ముందు ఓ పని చేసారు చూడండి - అది నచ్చింది. మాడిపోయిన ఉప్మాని మళ్ళీ వేడి చేసుకొని తినడం. నేను కూడా మాడిపోయిన ఉప్మా అభిమానిని. అందులో వచ్చే టేస్టు మంచి ఉప్మాలో ఎన్నడు రావాలి చెప్పండి. మొత్తమ్మీద మాడిపోయిన ఉప్మా తింటూ మాడిపోయిన సిన్మా చూసేరన్నమాట. సినిమా గురించి వ్రాసి మమ్మల్ని రక్షించారు. సంతోషం.

ramki చెప్పారు...

హా హా హా.....టైటిల్ సూపర్ "తింగర మంగళ"
నేనే ఏదో పప్పులో కలేసాను అనుకుంటే.....మీరు కూడా వేసారా....
ఐన నాకు తెలియక అడుగుతున్నా ఇందు గారు....ఆ సకుచి గారి మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి మీకు....
సకుచి రూపలావణ్యాలు గురించి బాధపడిపోతున్నారు...సకుచి ఎలా వుంటుందో చూపించకుండానే ముగించేసాడు అని చాల దిగులుతో వున్నారు...
మీరు ఇలా సినిమా లో ట్విస్ట్ లు , థ్రిల్లింగ్ సీన్స్ , కామెడీ అన్ని ఇలా చెప్పేస్తే జనాలు ఇంకా ఎందుకు చూస్తారు అండి......పాపం వాళ్ళకి కూడా మాడిపోయిన ఉప్మా తినే ఛాన్స్ ఇవ్వండి.....:P
కాని హోర్రోర్ సినిమా చూసేటప్పుడు మనం బాగా భయపడే వాళ్ళతో చూడాలి...అప్పుడు చూడాలి వాళ్ళ ఎక్ష్ప్రెశన్లు ....ఒకటే నవ్వు.....నవ్వలేక చావాలి....
నాకు మట్టుకు సినిమాలో దయ్యం కనిపిస్తే....మేకప్ బాగా కొట్టారు అని అనిపిస్తుంది.....లేకపోతే మొహం నిండా జాం భలే పుసరే అని అనిపిస్తుంది.....
త్వరలో మీరు "నాగవల్లి గోడ మీద బల్లి" శీర్షిక కూడా రాయాలి అని ఇక్కడ వున్నా ఫ్యాన్లు తరపు నుంచి గట్టిగ కోరుతున్నాం..... :)

Kathi Mahesh Kumar చెప్పారు...

:) :) :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సినిమా సరే. ముందు కధ తెలియాలి. ఉప్మా మాడ్చినది ఎవరు? సకూచి అప్పుడే అక్కడికి వచ్చేసిందా? ఇప్పుడెలా?

ఆ.సౌమ్య చెప్పారు...

హహహ ఇందు..నీకెంత ఓపిక తల్లీ ఈ సినిమా చూడడానికి :)
నేను ఆ దిక్కుమాలిన పోస్టర్లు, చార్మి పోజులు చూసి ఓ నమస్కారం పెట్టేసాను. నీ రివ్యూ చదివాక నేను మంచి పని చేసాననిపించింది...బలే రాసావులే :P

సుమలత చెప్పారు...

ఇందు నేను లండన్ లో డౌన్లోడ్ చేసుకుని మరి బలిఅయ్యా టైటిల్ సూపర్బ్ ....
అయిన భలే రాసావు ఇందు,నీకు బోలెడు చాకిలుపంపించాను రాలేదా ని పోస్ట్ కి ....

శివరంజని చెప్పారు...

అబ్బా ఇందు గారు సూపర్ రాసారు .... టైటిల్ కెవ్వ్ కేక

మిరియప్పొడి చెప్పారు...

బలే ఫన్నీగా రాశారండీ

ఇందు చెప్పారు...

@రాధిక(నాని ): హ్హహ్హ! అవునండీ :))

@Kishen Reddy:నువ్వు చెప్పింది నిజమే! అదే బెస్ట్! వీళ్ళనించి ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్! కాని 13బి సినిమా సూపర్ ఉంటుంది! నాకు నిజంగా చాలా భయమేసింది! అలా ఉండాలి కొంచెం హర్రర్ సినిమాలంటే!

@ శరత్ 'కాలమ్' :మా మాడిపోయిన ఉప్మా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు :)

ఇందు చెప్పారు...

@ RAMAKRISHNA VENTRAPRAGADA:ఇప్పుడు మేటర్ ఏంటీ అంటే...దయ్యం సినిమా చూసి నేను దడుచుకోవాలి అన్నమాట ;) మరి దయ్యం సినిమాలో దయ్యం కనిపిస్తేనే కదా దడుచుకునేది...లేకపోతే వేస్ట్ కదా! అందుకన్నమాట! మీరు చెప్పింది నిజమే! అందుకే చందు నాతో సినిమా చూస్తడు...మస్త్ ఎంజాయ్ నా ఫేస్ చూస్తు! :(( నేను భయపడతాను కదా! అమ్మో! 'నాగవల్లీ గురించా? వద్దులేండి..ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చింది నాకు :(


@Kathi Mahesh Kumar : :) :) :)


@బులుసు సుబ్రహ్మణ్యం :గురుగారు..ఉప్మా మాడటమంటే..మరీ నల్లగా కాదులేండీ...కొంచెం అడుగంటింది.అంతే! నేనే ఆ ఉప్మా మాడ్చిన ఘనురాలిని :)) సకూచినా? ఇక్కడికా? కెవ్వ్వ్వ్! ఇంకా రాలేదులేండీ! మీదగ్గరకే పంపా ;) మీ గ్రంధరచనలో కొంచెం హెల్ప్ చేసిపెడుతుందని :))

ఇందు చెప్పారు...

@ఆ.సౌమ్య :హ్హహ్హా! ఒకసారి చూడొచ్చు సౌమ్యాగారు....కాని ఏదొ టైంపాస్ కోసం ఐతే పర్లేదు.ఏదో ఎక్పెక్ట్ చేస్తే...ఏమీ ఉండదు :)) థాంక్స్...థాంక్స్!

@సుమలత:హ్హహ్హ! నువ్వు మాలాగేనా!! కెవ్వ్వ్! థాంక్యూ సుమా! ఇంకా రాలేదు...ఆన్ ది వే అనుకుంటా ;)

@ శివరంజని :హహ! థాంక్యూ శివ! అందరికీ టైటిల్ తెగ నచ్చేసింది ఏంటో! :)

@ మిరియప్పొడి :అవునండీ....సినిమా అలాగే ఉందికదా అని అలాగే రాసేసా! :))

Unknown చెప్పారు...

అమ్మాయి ఇందు .. నిన్నటి నించి కొంచెం కొంచెం చదివి ఇప్పటికి అవగొట్ట .. :)
సకుచి పేరు మాత్రం బలే వెరైటి గా ఉంది ..అయిన నీకు ఇంత వింత టేస్ట్ లు ఎలా అబ్బాయి .. దొంగల మంగళ పింగల ఇలాంటి సినిమాలు చూడడానికి ..
తూర్పు తిరిగి ఒక దణ్ణం పెట్టు .. :) నేను చచ్చిన చూడను బాబోయ్ .. నువ్వు ఇంత కళ్ళకి కట్టినట్టు చూపించక కూడా చుస్తే నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి :)
థాంక్ యు ఇందు

పరిమళం చెప్పారు...

"తింగర మంగళ" :) :)

Ennela చెప్పారు...

topic...super..
ikkada kooda betty avasaram kanabadutondi..pampeynaa?