8, సెప్టెంబర్ 2010, బుధవారం

'అప్పర్ పెనిన్సులా' అందాలు-1

3 రోజుల సెలవులు....
అందరూ న్యూయార్క్,వాషింగ్టన్,నయగారా ట్రిప్స్ వేసుకుంటున్నారు.......
అవన్నీ ఎప్పుడైనా చూసేవే...ఇది 'ఫాల్' సీజన్ కాబట్టి మనం 'అప్పర్ పెనిన్సులా' కి వెళ్దాం అని చందూ ప్లాన్....
ఒక్కళ్ళమే వెళ్తే ఎం బాగుంటుందని చందూ ఫ్రెండ్స్ అయిన కృష్ణ-ప్రసన్న వాళ్ళని మాతో పాటు  వస్తారేమో అడిగాము..'సరే' అన్నారు....
ఇక 'హోటల్స్' బుకింగ్  అప్పుడు బాగా అలోచించి 'క్యాబిన్' బుక్ చేసాం...అడవిలో అన్నీ వసతులతో ఉండే 'క్యాబిన్' ఐతే  బాగుంటుందని...మాములు 'హోటల్స్' లో ఉండటం ఎప్పుడూ ఉండేదేగా ఇదైతే 'వెరైటీ' అని 'క్యాబిన్' బుక్ చేసాం....


ఇక 'అప్పర్ పెనిన్సులా' విషయానికి వస్తే ....మిషిగన్ రాష్ట్ర పై భాగం లో ఉండే అందమైన ద్వీపకల్పం.....5 మహా సరస్సులతో అలరారే మిషిగన్ రాష్ట్రం లో పెద్ద సరస్సు అయిన 'లేక్ సుపీరియర్' ఒడ్డున ఉన్న 'మినిసింగ్' అనే ద్వీపకల్పానికే 'అప్పెర్ పెనిన్సులా' అని పేరు...ఇక్కడ నవంబరు-ఏప్రిల్ వరకు విపరీతమైన మంచు కురుస్తుంది....అప్పుడు ఇక్కడికి వెళ్ళడం కష్టం...కానీ ఈ 'ఫాల్' లో వెళ్ళడం మంచి సమయం....రంగులు మారిపోయి వసంతం ఆడుకునే చెట్లు....తుళ్ళుతూ ప్రవహించే జలపాతాలు.....చల్లని గాలులు...లేలేత సూర్యకిరణాలు.....దట్టమైన 'హైవత' అడవులు.....కనువిందు చేసే 'పిక్చర్డ్ రాక్స్' అందాలు...ఇంకా కనుచూపు మేర విస్తరించి ఉండే మహా సరస్సు 'సుపీరియర్'......వెరసి అందమైన భూతల స్వర్గం ఈ 'అప్పర్ పెనిన్సులా'...


శనివారం ప్రొద్దున బయల్దేరి కృష్ణ వాళ్ళని కలిసి అక్కడ నించి 'అప్పర్ పెనిన్సులా' కి మా ప్రయాణం మొదలు పెట్టాం......కేవలం రెండే రెండు 'నేషనల్ హైవేస్' మీద సాగే ఈ ప్రయాణం వర్షం వల్ల కొంచెం చిరాగ్గా అనిపించినా బానే సరదాగా సాగిపోయింది....మధ్యాహ్నం 2 గంటలకి 'మెకినా' ద్వీపం చేరుకున్నాం....అప్పటిదాకా చందూ తప్ప అందరం నిద్రపోయాం.....అప్పటికే 'మెకినా' దాటేసాం...ఇక చిన్న చిన్న ఊర్లు తప్ప పెద్దవి ఏమి తగలట్లేదు....ఆకలి దంచేస్తోంది...ఒక పక్క వాన....కార్ లో 'గ్యాస్' అయిపోవచ్చింది... ఇక 'గ్యాస్ స్టేషన్' కోసం వెదుకులాట మొదలు పెట్టాం...ఒక చిన్న ఊరిలో దొరికింది ఒక బుజ్జి 'గ్యాస్ స్టేషన్'.అక్కడే బండికి, మాకు కూడా 'ఫ్యూయల్' దొరికింది....ఒక లోకల్ రెస్టారెంట్ కనిపించింది....మేము తినగలిగేవి 'ఆనియన్ రింగ్స్,ఫ్రెంచ్ ఫ్రయ్స్' మాత్రమె...సరే అని అవే తీసుకుని చిన్న చిన్న తుంపర్లు పడుతుండగా అలాగే నిల్చొని చక చకా తినేశాం...ఆకలి ఐతే తీరలేదు కానీ కొంచెం ఫరవాలేదనిపించింది.'మెకినా' బ్రిడ్జి వరకు 70-80MPH మీద ఝాం..అంటూ దూసుకుపోయిన మేము అక్కడినించి 50MPH మీద మెల్లగా వెళ్ళాల్సివచ్చింది....మధ్యలో 'పిజ్జాహట్' కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చింది...'హమ్మయ్య' అనుకుని అక్కడికి వెళ్ళిపోయి  పిజ్జా,బ్రెడ్ స్టిక్స్ లాగించేసి ఇక మెల్లగా మా క్యాబిన్ కి  బయలుదేరాం ....సరిగ్గా 'మెకినా' బ్రిడ్జి నించి 2 గంటల్లో మా 'క్యాబిన్' ఉండే ప్రాంతానికి చేరుకున్నాం...మేము అక్కడికి చేరేటప్పటికి సాయంత్రం 5:30 అయింది....కానీ వర్షం వల్ల తొందరగా చీకటి పడిపోయింది......'హైవత' ఫారెస్ట్ లో మేము ఉండే 'క్యాబిన్' కోసం కొంచెం గట్టిగానే వెతకాల్సి వచ్చింది...ఎక్కడో లోపల.. రోడ్ కి దూరంగా అడవిలో ఉంది అది...ఆ వాన లో చాలా కష్టం మీద దాన్ని  కనిపెట్టి అక్కడికి వెళ్ళాం....


చుట్టూ దట్టమైన అడవి మధ్య ఉన్న చిన్న 'క్యాబిన్ల' సమూహం అది...లక్కపిడతల్లా ఉన్న అందమైన చెక్క ఇళ్లు భలే ఉన్నాయ్ ...మా క్యాబిన్ నంబర్ ముందే తెలుసు కాబట్టి నేరుగా దానిదగ్గరకి వెళ్ళిపోయాం(అక్కడ ఆఫీస్ లో ఎవరూ లేరు మరి!)......చిత్రంగా క్యాబిన్ డోర్ తీసే ఉంది...సర్లే అనుకుని లోపలికి  వెళ్ళాం....అందమైన బుజ్జి ఇల్లు అది.....హాల్,వంటగది,డైనింగ్ ఉన్న 2-బెడ్రూం ఇల్లు...స్టవ్,వంట కి కావాల్సిన డిషెస్,ప్లేట్స్,మగ్స్.టవల్స్,కట్లరి,ఫ్రిజ్జ్,ఓవెన్, ఇంకా చాలా రకాల స్పైసేస్ ఉన్నాయి...టి.వి,డి.వి.డి ప్లేయర్,సోఫా సెట్స్,హీటర్స్ ఉన్నాయి...చిన్న చిన్న బొమ్మలతో,దుప్పుల కొమ్ములతో,ఫ్రేమ్స్ తో  చాలా అందంగా అలంకరించారు ఆ క్యాబిన్ ని.... ఇంకా బ్యాక్ యార్డ్....అక్కడ కుర్చీలు,బార్బెక్యు,ఫైర్ ప్లేస్ కూడా ఉన్నాయి.....మేము కాస్త ఫ్రెష్ అయ్యి ఇక వంట కి కావాల్సిన సామాన్లు గురించి ఆలోచించడం మొదలుపెట్టాం....వచ్చేటపుడు మాతో పాటు ఫ్రూట్స్,కార్న్,బ్రెడ్,కార్న్ ఫ్లేక్స్ తీసుకెళ్ళాం...కానీ కూరగాయలు,నూనె,బియ్యం,పాలు ఇలాంటివన్నీ ఇక్కడే కొనుక్కుందాం అనుకున్నాం....ఇక వాటిని తేవడానికి బయలుదేరాం....సుమారు ఒక 20 మైళ్ళ దూరం లో చిన్న ఊర్లో ఒక మాల్ ఉంది...అక్కడ రెండు రోజులకి సరిపడా సరుకులు తీసుకున్నాం....పైన చెప్పినవే కాకుండా టమాటాలు,బంగాలదుంపలు,అలోప్పినోస్,ఉల్లిపాయలు,మిక్స్డ్ వెజిటబుల్స్(రెండు రకాలు),ఐస్ క్రీం,టీ-బ్యాగ్స్,పంచదార,పెరుగు,టొర్టిల్లొస్(చపాతీలు లాంటివి) తీసుకుని ఇక ఇంటికి వచ్చాం....


ముందు అందరం వేడి వేడి టీ తాగి ఇక వంట ప్రయత్నాలు మొదలు పెట్టాం......నేను కూరగాయలు తరగడం....ప్రసన్న వంట చేయడం....చందూ-కృష్ణ ఏమో  రైస్ సంగతి చూడటం, పైపైన ఉప్పులు-కారాలు సరిచేయడం......టమాటా-బంగాళదుంప కూర,మిక్స్డ్ వేజ్జి కూర,బంగాళదుంప వేపుడు చేశాం...వాటిల్లో రకరకాల స్పైసేస్ కలిపి వింత రుచి తెచ్చాం...మిరపకాయలు బదులు అలోప్పినోస్ వాడాం....రొట్టెలు కాల్చి,అన్నం వండేసి, ఇక తిండి కి ఉపక్రమించాం....అలా అడవిలో అందమైన చెక్క ఇంట్లో సొంతంగా వంట చేసుకుని తింటుంటే ఆ రుచే వేరు........ఆ అడవిలో ఉండే జంతువులూ,అవి వస్తే మనం ఏమి చేద్దాం అనుకుంటూ...సరదాగా అందరం కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించాం....ఇక తరువాత అప్పటికే వందసార్లు చూసిన 'గాడ్జిల్లా' సినిమా పెట్టుకుని చూస్తూ మెల్లగా అందరం నిద్ర లోకి జారుకున్నాం .......


అలా అడవిలో మా మొదటి రోజు సరదాగా,ఆహ్లాదంగా గడిచిపోయింది.......
మా  క్యాబిన్ లో తీసిన కొన్ని చిత్రాలు ఇక్కడ:


7 కామెంట్‌లు:

వేణూశ్రీకాంత్ చెప్పారు...

బాగున్నాయండీ మీ ప్రయాణం విశేషాలు. నాకు ఈ క్యాబిన్స్ చాలా ఇష్టం ప్రకృతిలో మమేకమైనట్లు చాలా బాగుంటాయి.

అన్ని జంతువులు కాదు కానీ ఎలుగుబంట్లు వచ్చే అవకాశం ఎక్కువ అంటుంటారు. ఇంకా లేడీబగ్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ ఎంతబాగుంటాయో..

చందు చెప్పారు...

woooowwww ! baga ne enjoy chesaru
kartheeka masa vana bhonalannamaata !!

:))))

snellens చెప్పారు...

where are these cabins? i mean place?

ఇందు చెప్పారు...

@వేణూ శ్రీకాంత్ :అవునండీ...క్యాబిన్లు చాలా బాగున్నాయ్...మీరు చెప్పినట్లు ఎలుగుబంట్లు బాగా ఉన్నయట..ఇంకా దుప్పులు,నక్కలు,తోదేళ్ళు కూడా ఉన్నయట..
@సావిరహే ::) అవును బాగా ఎంజాయ్ చేసాం...కాని ఇవి శ్రావణమాసపు వనభొజనాలు :)
@snellens: These are near Munising at Wetmore(Michigan). checkout here http://www.kemosabecabins.com/index.html

ఉమాశంకర్ చెప్పారు...

చాలా బాగుంది చదువుతుంటే..ఆహ్లాదంగా..

ఆ చెక్క కేబిన్లను చూస్తే మాత్రం స్టీఫెన్ కింగ్ తరహ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు గుర్తొచ్చాయి :)

కళాపిపాసి చెప్పారు...

naku bhale nachhutayandi ivi...kakapote aa vatavaranam lo kattelapoyyi unte correctga suite ayyedi....

ఇందు చెప్పారు...

@ఉమాశంకర్ :హహహ!! నిజమే అలాగే ఉన్నాయ్ కూడా!! పెద్దగా వెలుతురు లేకపొవడం,ఇంకా ఆ చెక్కల వల్ల ఆ ముద్ర ఉంటుందిలెండి..

@కళాపిపాసి :హ్మ్!! ఈ దేశం లో కట్టెపొయ్యిలు కూడానా!! ఏదో వాళ్ళ త్రుప్తి కోసం 'బార్బెక్యూ 'అని ఒకటి కనిపెట్టారు కానీ వీళ్ళకెం తెలుసు కట్టెపొయ్యిల రుచి :)