కాకరకాయ....ఎంత చేదుగా ఉంటుందో అంత బాగుంటుంది తినడానికి.సాధారణంగా నాకు చేదుగా ఉండేవి ఏవి నచ్చవు.అందుకే టాబ్లెట్లు వేసుకోగానే కక్కేస్తా
...అలాంటిది చిరు చేదుగా ఉండే కాకరకాయకూర మాత్రం లొట్టలేసుకుంటూ తింటా
.కాకరకాయతో ఏం చేసినా బాగుంటాయ్ కదా! కాకరకాయ కూర, పులుసు, పచ్చడి,చిప్స్....అబ్బో! ఎన్నెన్నో చేసుకు తినొచ్చు ఈ చేదు కాయతో.
రుచి సంగతి పక్కనబెడితే ఆ రూపం చూస్తే నాకు చిన్నపుడు తొండలు,కప్పలు లాంటి సరీసృపాలు గుర్తొచ్చేవి
.కానీ మెల్లగా అలవాటుపడిపోయా.మా ఇంటి ముందు చిన్న పెరడు ఉండేది.అక్కడ ఫెన్సింగ్ మీద కాకర తీగ పాకించేది అమ్మ.దానికి కాసే బుజ్జి బుజ్జి కాకరకాయల వేపుడు కూర ఎంత బాగుంటుందో!
నాకులాగే మా తమ్ముడికి కాకరకాయ కూరంటే ఇష్టం.ఐతే వాడికి బంగాళదుంప వేపుడంటే కొంచెం ఎక్కువ ఇష్టమనుకోండి.....కానీ మా అమ్మ చేసే కాకరకాయ పిట్ట కూర మాత్రం అమోఘం.ఆ రుచి మళ్లీ నేను ఎక్కడా చూడలేదు.ఎంతమంది చేసిన కాకరకాయ కూర తిన్నా...అమ్మ చేసే పిట్టకూర ముందు బలాదూర్.పిట్టకూర అంటే...ఏ పావురాన్నో,పిచుకనో పీక పిసికి చంపేసి కాకరకాయ వేసి కూర చేసారనుకునేరు
.నేను పక్కా సాత్వికాహారిని....ఏదో సాధుజీవిని.
'పిట్ట' అంటే మనం వాడుకలో అనుకుంటాం కదా....'పిట్టంత ఉన్నాడు'...అది ఇది అని.అలా చిన్నది అనే అర్ధం అన్నమాట.చాలా సన్నగా ముక్కలు తరిగి నూనెలో వేయించి....అలాగే సన్నగా ఉలిపాయాలు తరిగి అవి విడిగా వేయించి....ఆఖరికి రెండు కలిపి ఉప్పు-కారం....కాసింత పంచదార జల్లి దించేసే ఈ పిట్టకూర తింటే నిజ్జంగా జన్మ ధన్యం 
ఇక నా ఫ్రెండ్ ఝాన్సీ వాళ్ళ అమ్మగారు నిలవుండే పొడి-కాకరకాయ కూర చేస్తారు.శనగపప్పుల పొడిలో...బాగా వేయించిన కాకరకాయ ముక్కలు వేసి చేసే ఈ కూర కనీసం పది-పదిహేను రోజులు ఉంటుంది.అమీర్పేట్ హాస్టల్ లో ఉన్నపుడు నెలకి ఒకసారి ఒక డబ్బాడు కూర చేయించుకుని పట్టుకోచ్చేది ఝాన్సి.అది మూడే మూడు రోజుల్లో ఊదిపారేసేవాళ్ళం మేము
. ఇక కాకరకాయ-బెల్లం కూర కూడా కేక.అదీ నేను చేసినది ఐతే బాగా ఇష్టం
కారంగా-తియ్యగా జ్యుసీ గా ఉండే ఈ బెల్లం కూరని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే స్వర్గం అలా వచ్చి కళ్ళముందు వాలినట్టు ఉంటుంది.
కాకరకాయ కారం కూడా భలే ఉంటుందన్డోయ్.ఉల్లిపాయలు నూరి...కాకరకాయ బాగా వేయించి రెండు కలిపి చేసే ఈ కూర కూడా ఒక నాలుగైదు రోజులు నిలవుంటుంది.భలే భలే టేస్టీ గా ఉంటుంది.ఈ కూర చేసినప్పుడు.....నేను ఒక మూడురోజులు ఇంకే కూర చేసినా తినేదాన్ని కాదు.పొద్దున,సాయంత్రం ఇదే వేసుకుని కమ్మగా,హాయిగా తినేసేదాన్ని
ఇక చివరాఖరికి నేను పచ్చి కాకరకాయ కూడా తినడం నేర్చుకున్నా!
నేను ఎనిమిదో క్లాస్లో ఉన్నపుడు ఎస్.ఎస్.వై లో (యోగ,మెడిటేషన్ నేర్పిస్తారు)చేరాను.అక్కడ పచ్చి కూరగాయ ముక్కలు తినడం నేర్చుకున్నా.పచ్చి కాకరకాయ ముక్కలు చక్రాలు గా కోసిపెట్టేవారు.దానిమీద కాస్త ఉప్పు...ఇంకొంచెం నిమ్మరసం పిండుకుని కళ్ళు మూసుకుని నోట్లో పెట్టేసుకోవడమే.మొదట్లో....ఏడుపోచ్చేది.ఆ తరువాత తినే ఫ్రూట్ సలాడ్ రుచే తెలిసేది కాదు.కానీ రాను రాను అలవాటైపోయింది(తినగ తినగ కాకరకాయ తియ్యన కదా!).ఫ్రూట్ సలాడ్ మీద కాన్సంట్రేషన్ తో ఈ కాకరకాయముక్కలు పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు 
ఏంటో కాకరకాయ తలుచుకోగానే నోరూరేస్తోంది.సరే కానీ కాకరకాయ మీద ఒక చిన్న పద్యం ట్రై చేద్దామా!(ఏమన్నా తప్పులున్నా...పద్యం బాగోకపోయినా తిట్టుకోకండి....నేనసలే పద్యాల్లో చాలా వీక్
)
కర కర కాకర కిర కిర కీకర
కీకర బాకర కాకర కర కర
కర కాకర..కూర కర కరా...
కరకర కాకర కీకర కిరకిరా...
హ్హహ్హహ్హ....
ఇంకా నా బ్లాగ్ చదువుతున్నార? పారిపోకుండా? మీరు చాలా సహనవంతులు సుమండీ.....