ఏమిటి ఇదేమన్న సర్ఫ్ ఎక్సెల్ ప్రకటన అనుకుంటున్నారా? హ్హేహ్హే...కాదుగాని... మా పాత ఇంటి ఇక్కట్లు...మీతో కాసిని పంచుకుందామని ఇటు వచ్చానన్నమాట!
మా ఇల్లు ఒక వెయ్యిచదరపుటడుగుల 'శ్వేతసౌధం' [అంటే అమెరిక ప్రెసిడెంటు ఇల్లుకి ట్రు కాపి అని కాదు నా అర్ధం..మరిన్ని వివరములకొరకు పూర్తీ టపా చదువుడి]
క్రితం సంవత్సరం ఆదరాబాదరా అమ్రికా వచ్చేసామా!? వచ్చిరాగానే మా చందు స్నేహితుల ఇంట్లో దిగాం! :) పాపం పదిరోజులు అక్కడే మకాం! ఈలోగా.... ఇల్లు కోసం కిందా మీదా పడి వెదికాం! ఒక్క అపార్టుమెంటు ఖాళీ లేదాయే! అన్నీ కొన్ని నెలలముందే అడ్వాన్స్ బుకింగ్ చేయించుకోవాల్ట! మరి మా గతి ఏమి??
ఈలోగా....మా కొండల ఊరంతా తవ్వి.....ఎలుకని కాకుండా ఏకంగా ఎలుగుబంటిని పట్టారు మా చందుగారు!! ఈ ఇల్లు చెప్పుకోడానికి సింగిల్ బెడ్రూం అయినా.....లంకంత వంటగది....సముద్రమంత బాత్రూముతో అలరారుతూ....నా ప్రాణానికి గుదిబండ అయ్యింది! ఉంటె ఉంది విశాలంగా......దీనికి తోడు....అంతా ధవళమయమే !!
తెల్లటి ఫ్రిజ్జు,తెల్లటి పొయ్యితో సరిపెట్టకుండా......వంటగదంతా తెల్లటి తలుపులు...తెల్లటి అరలు...తెల్లటి గట్టు.... ఆఖరికి ఫ్లోరింగ్ కూడా తెలుపే! పోనీ గది కొంచెం చిన్నదైతే తెల్లగా ఉన్నా ఏదో రోజు తుడుచుకుంటూ మేనేజ్ చేయోచ్చు! అబ్బే...ఎంచక్కా ఒక బ్రేక్ఫాస్ట్ టేబిల్ కూడా వేసుకునేంత 'పెద్ద' కిచెన్ నాకవసరమా అధ్యక్షా?
అప్పటికే రెండు ఫ్లోర్ మేట్స్ తెచ్చి వేసా! అబ్బే! లాభం లేదు. రోజు వంట అయ్యాక ఆ జిడ్డుమరకలు తుడుచుకుని, కిందపడ్డ ఆవగింజలు మినప్పప్పుని వేటాడి, చెత్తాచెదారం శుబ్రం చేసేసరికి అందరు దేవుళ్ళు దిగోచ్చేవారు!
అప్పటికే రెండు ఫ్లోర్ మేట్స్ తెచ్చి వేసా! అబ్బే! లాభం లేదు. రోజు వంట అయ్యాక ఆ జిడ్డుమరకలు తుడుచుకుని, కిందపడ్డ ఆవగింజలు మినప్పప్పుని వేటాడి, చెత్తాచెదారం శుబ్రం చేసేసరికి అందరు దేవుళ్ళు దిగోచ్చేవారు!
దీనికి తోడు....మంచం వేసుకుని పడుకునేంత విశాలంగా ఇచ్చాడు ఆ బాత్రూం! ఇక్కడ బాత్రుం తలుపుంటే...ఆ మూలేక్కడో కనిపించి...కనిపించకుండా ఉంటుంది బాత్ టబ్! ఇక్కడా నేలంతా పాలసముద్రాన్ని తలపిస్తుంది! ఈ విపరీతాలకి తోడు మనకసలే జుట్టు రోజుకి కిలోల్లెక్కన ఊడిపోతుండడం వలన పొరబాటున బాత్రుమ్లో అద్దంలో చూసుకుని తల దువ్వుకుంటే.....తెల్లటి ఆ గచ్చుమీద నల్లటి నా వెంట్రుకలు చూస్తె తిరుమలలో 'కళ్యాణ కట్ట' కళ్ళముందు కనపడుతుంది! :((
ఇక విషయానికి వస్తే..... మొన్న ఇండియా నించి వచ్చాక ఒక వారంరోజులు జెట్లాగ్ పేరుచెప్పుకుని....... ఇంకో రెండురోజులు 'టులిప్ షో' కి వెళ్లి రోజంతా వర్షంలో తడిసి తెచ్చుకున్న జలుబు పేరు చెప్పుకుని మూసిన కన్ను తెరవకుండా పడుకున్నానా.......ఇక ఇల్లు చూస్తె....నాకే చీదర వేస్తుంటే..... పాపం మా చందు వంట తప్ప ఇలాంటి క్లీనింగ్ సెక్షన్లో కాలు కూడా మోపని కారణమున చచ్చినట్టు నేనే లేచి ఘట్టిగా ఊపిరి పీల్చి.....రంగంలోకి దిగాను!
తీరాచూస్తే..........క్లీనింగ్ కోసం నేనెప్పుడు వాడే క్లీనింగ్ సొల్యుషన్ కాకుండా వేరేది ఏదో ఉంది! ఏంటి బాబు ఇది అని అడిగితె.... ఆ నువ్వు లేనప్పుడు ఇది తీసుకొచ్చా.....కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేస్తోంది అని చెబితే సంబరపడి.... ఆవేశంతో ఆరోజే ఆ మురికిపట్టిన మల్లెపూవులా ఉన్న మా వంటగదిని శుభ్రం చేసే కార్యక్రమానికి నాంది పలికా!!
తుడిచా...తుడిచా....ఆ సొల్యుషన్ పిచికారి చేయడం....టిష్యు తో తుడవడం....మళ్లీ తడి బట్ట పెట్టి...దాని పొడి గుడ్డతో తుడిచి....వార్నాయనో చిరాకోచ్చేసింది!! సాయంత్రానికి మా 'మిల్క్ సీ' అదే బాత్రూం కూడా అతి కష్టం మీద శుభ్రం చేసేసరికి నా తల ప్రాణం తోకలోకి వచ్చింది! ఆనక ఇల్లంతా వాక్యుం పెట్టి సోఫాలో కూలబడ్డా! సరే పనైతే అయ్యింది కాని చేతులు కొంచెం మంట పుట్టాయి!ఆ ఘాటు మహిమలే అనుకుని ఊరుకున్నా!
కాసేపయ్యేసరికి చేతుల మీద చిన్నచిన్న గాట్లు! వామ్మో అని చూసుకునేసరికి అన్ని చేతివేళ్ళు ఎర్రెర్రగా బొక్కలు పడిపోయాయి! :( సొల్యుషన్ కొంచెం ఎఫ్ఫెక్టివ్ అనుకున్నా కాని ఇంతనుకోలేదు! నేను కేవ్వవ్వ్వ్వ్! వాటికి ముందు మాయిశ్రైసర్ రాసా....కాసేపాగి మళ్లీ ఏదేదో రాసి ఎం చేసినా మంట మాత్రం పోదే! అలాగే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ ఎలాగో ఉండిపోయా! :((( అసలే రోజుకోసారి వంట చేసేటప్పుడు విధిగా వేళ్ళు కోసుకోవడం నా రివాజు! దానికితోడు ఇవి కొత్తగా! హతవిధీ!
అలా ఆరు గాట్లు....మూడు చందుచీవాట్లతో రోజులు దొర్లిపోయాయి!
క్రమంగా గాట్లు తగ్గుముఖం పట్టాయ్! ఈలోగా అపార్ట్మెంట్ల వేట మొదలుపెట్టాం. ఈసారి ఒక అపార్ట్మెంట్ ఎంచుకుని అన్నీ మాట్లాడుకుని 'ఒకే. డీల్...డీల్' అనుకుని ఆ అపార్ట్మెంట్ ఫైనలైజ్ చేసాం. తీరా ఒకసారి చూస్తాం మా అపార్ట్మెంట్ చూపించమంటే రిసెప్షన్ దేవత.....'సారి రిపెయిర్లో ఉంది కుదరదు' అంది :( నాకేదో తేడా కొడుతోంది. అయినా సర్లే అనుకుని లైట్ తీసుకున్నాం.
ఇల్లు మారే సమయం ఆసన్నమైంది! ఇండియాలోలాగా పెట్టె,బేడ సర్దుకుని ఎగురుకుంటూ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోవడానికి ఇక్కడ కుదరదుగా......వీళ్ళకి ఇల్లు తీసుకునేటప్పుడు ఎలా ఉందో....ఇచ్చేటప్పుడు అలాగే ఉండాలి! గోడల మీద, పొయ్యి గట్టు మీద,బాత్రూమ్లో చిన్న చిన్న మరకలు పడ్డా ఫైన్ వేస్తాడు! పసుపు మరక పడిందో....ఇక అయిపోయినట్టే!అలాగే మనకి ఇల్లు ఇచ్చేటప్పుడు కూడా....చక్కగా కొత్త పైంటు వేసి,కార్పెట్ మార్చి,రిపైర్లు చేసి ఇస్తారు.....కాబట్టి మనం ఇల్లు ఖాళి చేస్తున్నప్పుడు అంతే నీట్టుగా ఇవ్వాలనడం తప్పు కాదేమో!
రుద్ది....రుద్ది...కడిగి...కడిగి....కడిగిందే కడిగి....కార్పెట్ మీద వాక్యుం చేసిందే....చేసి....ఎలాగైతేనేం ఇంటిని కొత్త ఇల్లు లాగా తళతళ మిలమిల లాడే ట్రిపుల్ ఎక్స్ లాగా తీర్చిదిద్దేసాం!
హమ్మయ్య! ఒక గోల వదిలింది! ఈసారి వెళ్ళే ఇల్లన్నా కొంచెం ఈ ధవళమయం కాకుండా చూడు స్వామీ!! అని కోరుకుని.....కొత్తింటిని ఒకసారి చూద్దామని వెళ్ళాం!
తలుపు తీయగానే పక్కనే వంటగది......హమ్మయ్య కొంచెం చిన్నదే.....బ్రతికాను దేవుడా అని అనుకుంటూ అలా లోపలికి అడుగుపెట్టి లైటు వేసా.....అంతే.....
కేవ్వ్వ్వవ్వ్వ్వ్!
అవ్వాక్కయ్యా!!
ఎందుకంటే.....ఇక్కడ కూడా.....అవాక్కయేలా 'టైడ్' తెల్లదనమే! నాలుగు దేదీప్యమానమైన లైట్ల వెలుగులో ధగధగా మెరిసిపోతున్న ఆ తెల్లతెల్లటి వంటగది నాకు ముద్దుముద్దుగా స్వగతం పలుకుతుంటే..... ఏడుపొక్కటే తక్కువ!
మళ్లీ తెలుపుతో నా యుద్ధం మొదలు!
హ్మ్! ఇంటిని మార్చగలిగాం కాని తలరాతని మార్చగలమా?
