20, నవంబర్ 2010, శనివారం

కార్తీక వనభోజనాలు -కొబ్బరన్నం

జ్యోతిగారి ఆలోచన మేరకు ఈ టపా పెడుతున్నా! అసలు కార్తీకమాసపు వనభోజనాల గురించి టపా వ్రాద్దామనుకున్న! అలా రోజులు గడిచిపోయి పౌర్ణమి కూడా వచ్చేసింది.ఇకనైనా ఆలస్యం చేయకూడదని ఈ 'కొబ్బరన్నం' చేశా! కాస్త రుచి చూసి ఎలా ఉందో చెప్పండే!!

ఎప్పుడు కార్తీకమాసం వచ్చినా....నేను ఎదురు చూసేది....ఒక తీరికైన ఆదివారంకోసం(వన భోజనాలకి)....ఇంకా పున్నమి వెన్నెలలు చిలికించే కార్తీకపౌర్ణమి కోసం(వెన్నెల భోజనాలకి).

నాకు తెలిసి,ఒక్క సంవత్సరం తప్ప....క్రిందటి ఏడాది వరకు మా ఇంట్లో కార్తీకమాసమంటే హడావిడే.పొద్దునే లేచి....తలారా చన్నీళ్ళ  స్నానం చేసి తులసి మొక్కకి పూజ చేసే అమ్మ....పొద్దున్నే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుని ఆ ప్రసాదం తీసుకువచ్చే  నాన్న....ఎనిమిది గంటలయినా ఇంకా నిద్రలేవకుండా పడుకునే నేనుtongue....అలా భలే సందడిసందడిగా ఉండేది. కార్తీక వనభోజనాల్లో మేము ఎక్కువగా ఎంచుకు
నేది చీరాల వెళ్ళేదారిలో ఉండే ఒక పెద్ద పళ్లతోట.అక్కడ ఎక్కువగా జనాల హడావిడి ఉండదు. పొద్దున్నే లేచి భోజనాలకి అన్నీ సిద్ధం చేసుకుని త్వరగా ఇంటినించి బైటపడిపోయే వాళ్ళం.తరువాత ఆ తోటలోకి వెళ్లి...కాసేపు అంతా కలియతిరిగి...ఇక మధ్యాహ్నవేళ  హాయిగా చెట్లకింద చాప,దుప్పటి పరుచుకుని.... తెచ్చుకున్న పదార్ధాలను పేపర్ ప్లేట్లలో సర్ది.....అందరం చేరి ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ చల్లని గాలి పీలుస్తూ హాయిగా వనభోజనాలు చేసేవారం.తరువాత ఆ పైరగాలికి కాసేపు అలా కునుకు పట్టేసేది. అందరం ఒక మాంచి నిద్ర లాగించేసి సాయంత్రం నాలుగు ఆ వేళలో సముద్రపోడ్డుకి బయలుదేరేవాళ్ళం.కాసేపు అక్కడ అలలతో ఆటలాడుకుని ఆరు-ఆరున్నరకు ఇక తిరుగు ప్రయానమయ్యేవాళ్ళం.దారి మధ్యలో చిక్కటి చాయ్..ఇంకా వేడి వేడి మిరపకాయ బజ్జి మా మెనూ. అలా ప్రతి ఆదివారం ఇంచ్చుమించు ఏదో ఒక చోటికి వెళ్ళేవారం. అమరావతి,కోటప్పకొండ,హంసలదీవి,సూర్యలంక,అంతర్వేది,ద్వారకతిరుమల,వైకుంటపురం,బాపట్ల,వేదాద్రి,
కొండపల్లి ....ఇలా....ఎన్నో...ఎన్నెన్నో ఊళ్లు...ఎంతో సరదాగా గడిచిపోయాయి ఆ కార్తీకమాసపు ఆదివారాలు.


ఇక వనభోజనాల్లో స్పెషల్స్ గురించి చెప్పాలంటే....మా అమ్మ చేసే కొబ్బరన్నం నాకైతే అమృత సమానం.అది నేను కనీ వినీ ఎరుగని రుచి.ఇంతవరకు మా అమ్మలాగ కొబ్బరన్నం చేయగలవారిని నేనైతే చూడలేదు.కాని ఇది కొంచెం శ్రమ తో కూడుకున్న పని.పచ్చి కొబ్బరి ని మిక్సీలో వేసి,చిక్కటి ద్రవంలా చేసి,దాన్ని వడకట్టి కొబ్బరిపాలు తీసి ఆ పాలతో తయారుచేస్తారు ఈ కొబ్బరన్నాన్ని.తరువాత మసాలలాలు(దాల్చిన చెక్క,జాజికాయ,జాపత్రి,లవంగాలు,ఏలకులు,మిర్యాలు) మెత్తని పోడిలా చేసి పెట్టుకోవాలి.ఇందులో గసగసాలు,ధనియాలు,అల్లం వేయకూడదు. తరువాత భాండి లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి పక్కకు తీసి....ఆ మిగిలిన నెయ్యి లో ఈ మసాలా,బిర్యాని ఆకు వేసి కొంచెం వేయించాలి.తరువాత అందులో కొబ్బరిపాలు పోయాలి.ఆ పాలు బాగా మరిగాక అందులో నానబెట్టిన బియ్యం వేయాలి.చిటికెడు ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి.తరువాత జీడిపప్పులు వేయాలి.ఫైనల్ గా కొత్తిమీర,పుదీనా జల్లి దించేయాలి. అంతే...వేడి వేడి కమ్మని కొబ్బరన్నం రెడీ...ఇందులో అలూకూర,రైతా కాంబినేషన్ అదుర్స్ .

చూసేసార!కొబ్బరన్నం ఎలా  చకచకా చేసేసానో! మీకు కావాలంటే....మా ఇంటికి భోజనాలకి వచ్చేయాలి మరి.

19, నవంబర్ 2010, శుక్రవారం

చిట్టిచీమ కథ!

అనగనగనగా....ఒక దట్టమైన అటవీ ప్రాంతం.అక్కడ ఏనుగులు,దుప్పులు,ఎలుగులు,చిరుతలు....ఇలా ఎన్నో జంతువులు ఉండేవి.ఆ అడవికి రాజు 'గజేంద్రుడు' అనే ఏనుగు. ఆ అడవి మధ్యలో ఒక పెద్ద వాగు ఉంటుంది.ఎండాకాలం లో సన్నగా పిల్లకాలువలా అగుపించినా....వర్షాకాలంలో....చెట్టుని పుట్టని ఏకం చేసేస్తుంది.అందుకే దానిపేరు 'రాకాసి వాగు'.అటువంటి అడవిలో సుమారు ఒక అరకిలోమీటరు భూమిలోపలికి వెళితే...ఒక మహాసామ్రాజ్యం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.అదే 'చీమల రాజ్యం'.ఆ రాజ్యానికి అధినేత 'చక్కెరపతి'.తన రాజ్యంలో చీమలన్నీ సుభిక్షంగా ఉండాలని నిరంతరం తపించే మనసున్న మారాజు. తన సామ్రాజ్యాన్ని చాలా పద్దతిగా,ముందు చూపుతో నిర్మించాడు.చీమ కార్మికులు ఆహరం వేటకు వెళ్ళడం దగ్గరనించి....ఆ ఆహారపు నిల్వలను జాగ్రత్త పరిచేవరకు అన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. ఆ రాజు నీడలో చీమలు....చీకు-చింతా లేకుండా హాయిగా జీవిస్తుంటాయి.
'పండిత పుత్రా పరమ సుంఠ' అన్నట్లుగా ఆ చక్కెరపతి మహారాజుకి ఒక కొడుకు ఉన్నాడు.వాడిపేరు 'రుచి'. చక్కెరపతికి కొడుకంటే ప్రాణం. కొడుకు పుట్టినప్పుడు తన రాజ్యానికి వారసుడు కలిగాడని మహాదానందపడిపోయి అందరికీ తన భాండాగారంలో భద్రంగా దాచిపెట్టిన కమ్మటి పుట్టతెనేతో విందు కూడా ఇచ్చాడు.చిన్నప్పటినించి రుచి కి చీమ విద్యలు నేర్పడం మొదలు పెట్టాడు. ఆహారాన్ని ఎలా సేకరించాలి? యేయే పదార్ధాలను ఎంచుకోవాలి? వాటిని ఎలా భద్రపరచాలి? ఇలా.... చాలా ఓర్పుగా కొడుకుకి విద్యలు బోధించాడు.కాని రుచికి ఇవేమీ పట్టేవి కావు. అల్లాటప్పా గా తిరుగుతూ..స్నేహితులతో జల్సా చేస్తూ గడిపేసేవాడు.ఇలా బిక్కుబిక్కుమంటూ నేలలో ఉండడం...ఆహరం కోసం రోజులకి రోజులు పాకడం నచ్చని పనులు.చెప్పాలంటే మూర్ఖుడైన సోమరిపోతు.పొగరు,గర్వం,అహంకారం అనే అవలక్షణాలు బాగా ఔపోసన పట్టాడు.అలాగే పెరిగిపెద్దయ్యాడు.

అవి వర్షాకాలపు ప్రారంభ రోజులు.రాకాసివాగు మెల్లగా విస్తరిస్తోంది.చీమలు అన్నీసెలవులు తీసుకుని ఇళ్ళల్లో ఉండిపోయాయి. ఒకరోజు రుచి అడవిలో సరదాగా విహార యాత్రకి బయలుదేరాడు.అప్పటికే చక్కెరపతి వాతావరణం బాలేదని వద్దని వారించాడు.మూర్ఖుడైన రుచి పట్టువదల్లేదు.కొడుకు సంగతి తెలిసిన చక్కెరపతి సరే అని అన్నీ జాగ్రత్తలు చెప్పి పంపాడు.అవన్నీ ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసాడు రుచి. మెల్లగా అడవిలో అందాలన్నీ ఆస్వాదిస్తూ..ఎండుటాకుల మీద పాకుతూ...వాటిమీద ఉన్న వానచినుకుల్లో మునిగి తేలుతూ ముందుకు సాగుతున్నాడు రుచి.ఇంతలో ఏదో అలజడి.దూరంగా ఆకులు నలిగిపోతున్న శబ్దం.చూస్తే ఒక గజరాజుల మంద అటుగా వస్తోంది. రుచికి వాటిని చూస్తే నవ్వొచ్చింది.అంతంత పెద్ద ఆకారాలతో ఎలా బ్రతుకుతాయో అని అనిపించింది. ఇంత చిన్న పొట్టలకే ఆహారం వెతుక్కోలేక చస్తుంటే...ఈ ఏనుగులు అడవిని మొత్తం ఒక్క గుటకలో మింగేసేలా ఉన్నాయ్ అని అనిపించింది.ఇంతలో రుచిలో సహజంగా ఉండే పొగరు బైటికొచ్చింది.'ఏమిటి ఈ ఏనుగుల గొప్పతనం ?' అని వెళ్లి వాటికి ఎదురు నిల్చున్నాడు రుచి.

ఏనుగులు రుచిని చూడలేదు.రుచికి గర్వభంగమైంది.'హన్నా! చీమల సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తిని....మహారాజు చక్కెరపతి కుమారుడని....నన్ను గుర్తించవా ఈ మదాంధ గజాలు?' అని పక్కనే ఉన్న ఒక పదునైన పుల్ల తీసుకుని ఎదురు వస్తున్న ఆ అడవికి మహారాజైన గజేంద్రుని పాదంలో గుచ్చాడు రుచి. ఏదో చక్కిలిగింతయనిపించి గజేంద్రుడు కిందకి చూడగా....ఒక ఎండుటాకుపై నిలబడి....రెండు చేతులు నడుము పై నిలిపి....ఒక చేతితో పుల్ల పట్టుకుని....కిరీటధారియై ఉన్న రుచిని చూసి ఫక్కున నవ్వాడు.
"ఎందుకు ఆ నవ్వు గజరాజ?"
"నవ్వక ఇంకేమి చేయను అర్భకరాజ?"
"హన్నా!అటకటా!! నన్ను అర్భకరాజ అనెదవ?"
"మరి నీలాంటి పిపీలికానికి అంతకన్నా విలువయా?"
"హొరీ! దుష్టగజమా! దమ్మున్నచో నాతో తలపడి నెగ్గుము" అని తన ఒరలోని పదునైన కత్తిని పోలిన పుల్లని తీసి ఆ గజేంద్రుడు పాదములపై కలబడ్డాడు.
అది చూసి తనలో తను నవ్వుకున్న గజేంద్రుడు ఒక్క ఘీంకారం చేసి తొండంలో గాలిని పూరించి రుచి పై గురిపెట్టి అధిక పీడనము జోడించి గాలిని వదిలిపెట్టగానే....ఆ దెబ్బకి రుచి వెళ్లి రాకాసి వాగులో పడ్డాడు.

రుచికి దిమ్మతిరిగింది.ఒక్క నిమిషం ఏమీ అర్ధం కాలేదు.అర్ధమయ్యేసరికి పీకల్లోతు నీటిలో పడి కొట్టుకుపోతున్నాడు.'అరె! ఇప్పుడెలా? తండ్రిగారు నేర్పించిన ఈత అయినా సరిగ్గా నేర్చుకొనకపోతిని' అని తనలో తను బాధపడ్డాడు.గజరాజు తో అనవసరంగా తగువు పెట్టుకున్నందుకు తనని తనే నిందించుకున్నాడు.కాని ప్రస్తుతం తన కర్తవ్యమ్ పశ్చాత్తాపం కాదని...ఇక్కడ్నించి బైటపడాలని అనుకున్నాడు.అప్పటికే వర్షం మొదలయింది.ఇక రాకాసి వాగు ఉగ్రరూపం దాలుస్తోంది. అడవిలో పురుగు పుట్రా అన్నీ ఎవరి గూటికి అవి చేరుకున్నాయి.క్రమంగా చీకటి పడుతోంది.ఆ నీటిలో మునుగుతూ...తేలుతూ... రుచి నానాతిప్పలు పడుతున్నాడు.క్రమక్రమంగా ఒడ్డు దూరమైపోతోంది.అంటే...వాగు విస్తరిస్తోంది.

రుచికి వాళ్ళ ఇల్లు గుర్తుకొచ్చింది.అమ్మ చేసిపెట్టే కమ్మని చెరుకు పాయసం గుర్తొచ్చింది.నాన్న చెప్పే జాగ్రత్తలు గుర్తొచ్చాయి. 'నాన్న చెప్పినట్టు నడుచుకుని ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు. మూర్ఖత్వంతో ఏనుగుని ఎదిరించకపోతే తాను ఈ వాగులోకి పడి ఉండేవాడే కాదు.అసలు చీమల రాజ్యం వదిలి బైటికి వచ్చి ఉండేవాడే కాదు.కమ్మగా....పంచదార పలుకులు  తింటూ...తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండేవాడు.ఇంకెప్పుడు నాన్న మాట జవదాటకూడదు అనుకున్నాడు.కాని ముందు నేను బ్రతకాలి...ఎలా? ' అని ఆలోచిస్తున్నాడు రుచి.

ఇంతలోకి 'రుచి' అన్న పిలుపు వినిపించింది.'నాన్న! అది నాన్న గొంతు' అని తల పక్కకి తిప్పి చూసాడు.రొప్పుతూ  రోస్తూ  ఒక కర్రపుల్ల పట్టుకుని వాగు గట్టు వెంబడి పరిగెడుతున్నాడు చక్కెరపతి.
"ఇదిగో! ఈ పుల్లని పట్టుకుని మెల్లగా పాకుతూ రా!" అన్నాడు చక్కెరపతి.
"అలాగే నాన్న!" అని ఆత్రంగా ఆ పుల్ల వైపు కదలసాగాడు రుచి.అతి కష్టం మీద దాన్ని అందుకున్నాడు.
"వేగంగా రా! ఎక్కువసేపు నేను ఈ పుల్లని మోయలేను.వాగు త్వరత్వరగా విస్తరిస్తోంది" అని అరిచాడు చక్కెరపతి.
"సరే! సరే!" అని సాధ్యమైనంత త్వరగా పాకసాగాడు రుచి.
ఆ పుల్లని మోయలేక మోయలేక మోస్తూ....చాలా కష్టం మీద పరిగెడుతున్నాడు చక్కెరపతి.
ఎలాగో అలా పుల్ల చివరకి చేరుకున్న రుచి గట్టుమీదకి ఒక్క ఉదుటన దూకాడు.ఆ దూకుడులో...పట్టుజారి నీటిలోకి పడబోతు గట్టు అంచు పట్టుకున్నాడు.కాని పైకి రాలేకపోతున్నాడు.బురద జారిపోతోంది.మెల్లగా వాగులోకి జారిపోతున్నాడు.అది గమనించిన చక్కెరపతి ఆ పుల్లని వదిలేసి రుచి ఆరుకాళ్ళలో ఒక కాలు దొరకబుచ్చుకుని పైకి బలవంతంగా లాగాడు.ఆ విసురుడుకి రుచి ఒడ్డుకి వచ్చి పడ్డాడు.కాని చక్కెరపతి బురదలోకి జారిపడి...వాగులో పడిపోయాడు.వేగం పెరిగిన వాగులో...రుచి కనులకు అందనంత దూరంలో కొట్టుకుపోయాడు చక్కెరపతి.

స్థాణువై అలాగే చూస్తుండిపోయాడు రుచి.తన తండ్రి  ప్రాణాలను సైతం లెక్కచేయక తనని కాపాడాడు.'ఇన్నాళ్ళు....ఇలాంటి త్యాగామూర్తినా నేను ధిక్కరించింది? ఇటువంటి తండ్రి మాటలనా నేను పెడచెవిన పెట్టింది? నాన్న నాకోసం ఎంత కష్టపడ్డాడు? కాని దానికి ప్రతిఫలంగా...కనీసం నాన్నని కాపాడుకోలేకపోయాను' అని ఆ వాగు ఒడ్డున కుమిలి కుమిలి ఏడ్చాడు రుచి.అతని మనసు ఆ దుఖ్ఖ జలాలతో ప్రక్షాళన అయ్యింది.అతనిలో ఉన్న అహంకారపు జ్వాలలు చల్లారాయి.మూర్ఖపు కొమ్ములు విరిగిపోయాయి. రుచి తన తప్పు తాను తెలుసుకున్నాడు. తన తండ్రి కాపాడిన ఈ ప్రాణాలను అతని పేరు నిలబెట్టడానికి అంకితం  చేస్తాను అని ఆ రాకాసి వాగు సాక్షిగా ప్రమాణం చేసి చీమల రాజ్యానికి పయనమయ్యాడు.

అటు తరువాత ఆ చీమల రాజ్యానికి చక్రవర్తి అయి తన తండ్రి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసేలా సుపరిపాలన చేస్తూ సుఖంగా జీవించసాగాడు 'చక్రవర్తి రుచి'.

                                                    



P.S:కథలు వ్రాయడంలో ఇది నా మొదటి అడుగు.చందమామ కథలు స్పూర్తి గా తీసుకుని ఈ కథ వ్రాశా! తప్పులేమన్నా దొర్లితే తప్పక తెలియజేయండి.

15, నవంబర్ 2010, సోమవారం

అపురూపమైన కల....


నడిరాతిరి నిదురలో ఎన్నెన్నో కలలు....
కలలు అలలై చెలియలిగట్టు దాటుతుంటే...
ఉలిక్కిపడిన రెప్పలమాటున ...
నిద్రాదేవి వీడ్కోలు తీసుకుంటే....
అరమోడ్పున విచ్చుకున్న ఆ నేత్రద్వయం,
స్వప్నలోకం విడిచి రాలేమంటే....
వాస్తవంలో కాలం  కలై కరిగిపోతుంటే...
అసంపూర్తి స్వప్నం వెలవెలబోతుంటే....
అది చూసి చలించిన మనసు,
అపురూపమైన ఆ కలను తనలో నిక్షిప్తంచేసి..
చీకటి అంచులకి మెరుపుల జిలుగులు అద్ది...
రంగుల కుంచెతో దాన్ని పరిపూర్ణం చేస్తుంటే...
తన స్థానంలో కలకి ప్రాణం పోస్తున్న మనసుని చూసి
మురిసిపోయిన నిద్రాదేవి......
ఆప్యాయంగా కళ్ళను ముద్దిడుతున్నవేళ...
తొలి తూరుపు కిరణం నేల తాకిన వేళ....
మాగన్నుగా నిద్ర పట్టింది.

11, నవంబర్ 2010, గురువారం

స్పిరిట్ గేం...ఆడారా ఎప్పుడైనా??

స్పిరిట్ గేం...
ఈ ఆట గురించి వినే ఉంటారు చాలా మంది....కానీ నాకు తెలిసింది మాత్రం 'అన్వేషిత' అనే ఒక 'గొప్ప' సీరియల్ వల్ల :)
'విధి వంచితా...విష వలయితా....ఓ!! అన్వేషితా!!అన్వేషితా!' అంటూ సాగే ఈ ఈటీవి సీరియల్ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది.కొంత వరకు బానే ఉత్కంఠభరితంగా సాగింది కానీ కొద్దిరోజుల తరువాత మరీ విసిగించేసాడు..నాకైతే దయ్యాలంటే భయమైనా...చూడాలని చాలా ఆత్రంగా ఉండేది.రాత్రిళ్ళు నిద్రలో ఉలిక్కిపడుతున్నా అని మా నాన్న ఆ సీరియల్ ని ఇంట్లో బాన్ చేసారు.కానీ నాకేమో ఆ సీరియల్ లో బీరువా మీద కూర్చుండే 'కబీస్' అన్నా.....అందులో చూపించే స్పిరిట్ గేమ్ అన్నా భలే ఇష్టంday dreaming.అందుకే పక్కింటికి వెళ్లి చూసేదాన్ని.అప్పుడు క్లాస్ లోను...సాయంత్రాలు ఆటలప్పుడు ఇదే టాపిక్ మా ఫ్రెండ్స్ మధ్య.కొన్నాళ్ళకి ఆ సీరియల్ అయిపొయింది.కానీ స్పిరిట్ గేం ఆడాలనే కోరిక మిగిలిపోయింది.దయ్యాలంటే భయమైనా వాటితో ఫ్రెండ్షిప్ చేయాలనీ నాకు  ఒక చిన్న కోరికbig grin.కానీ ఆ గేం ఆడడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు.అందరికీ దయ్యాలంటే భయమే...ఏంచేస్తాం! ఇంట్లో తెలిస్తే మా నాన్న తోలు ఒలిచేస్తారు...అందుకే ఇక ఆ విషయం వదిలేసా!!

చాలా రోజులకి మన ఇంజినీరింగ్ రెండో సంవత్సరం హాస్టల్ అప్పుడు మళ్లీ ఈ గేం మీద ఆసక్తి బైటికొచ్చింది.ఐదు కొప్పులు ఒక చోట చేరితే ఊరుకోవుగా! అలాగే మేము అందరం రాత్రిళ్ళు పడుకునేటప్పుడు ఏదో ఒక కథ చెప్పుకునే వాళ్ళం.అలా ఒక రోజు దయ్యాల కధా...అక్కడనించి 'అన్వేషిత' సీరియల్ కథా...మెల్లగా స్పిరిట్ గేం దగ్గరకి వచ్చి ఆగాం.మా ఐదుగురికి విడి విడి గా మనస్సులో ఆడాలనే ఉంది...కానీ బైటపడాలంటే భయం.మెల్లగా...ఒక్కొక్కరం వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెబుతున్నాం దయ్యాల గురించి.ఇంతలో నేనే ఈ టాపిక్ కావాలని తెచ్చా! 'మనమూ స్పిరిట్ గేం ఆడదామా?' అసలు దయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకుందాం...జస్ట్ ట్రై అంతే!' అని అగ్ని కి ఆజ్యం పోసానుbig grin.ఒక్కొక్కరు బాగా అలోచించి సరే సరే అన్నారు. ఇంతలోకి శ్రావ్య,అమృత,రాజి వాళ్ళ ఫ్రెండ్స్ కి జరిగిన కొన్ని అనుభవాలు చెప్పారు.మాకు అప్పటిదాకా స్పిరిట్ గేమ్ గురించి తెలిసినది అంతా చెప్పుకుని....తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకున్నాం.


  • ముందుగా స్పిరిట్ గేం ఆడే రూం లో దేవుడి బొమ్మలు ఉండకూడదు....అలా ఉంటే ఆత్మలు  రావుటI don't know
  • చేతికి ఏమన్నా దేవుడి తాళ్ళు,తాయోత్తులు ఉండకూడదుట.
  • ఒక దేవుడి పటం కొంచెం అందుబాటు లో పెట్టుకోవాలి...ఎందుకంటే ఒకవేళ ఆత్మ  వచ్చి మనల్ని పట్టేసుకుని వెళ్ళకపోతే దాన్ని బలవంతంగా పంపించేయడానికట.hypnotized
  • ఈ ఆట ఆడడానికి ఒక చార్ట్ ప్రిపేర్ చేయాలి.ఒక నాణెం కూడా కావాలి.
  • గదిలో లైట్లు ఉండకూడదు.ఒక కొవ్వొత్తి మధ్యలో పెట్టుకోవాలిట.
  • అందరూ ఒక వలయం లాగా ఏర్పడి కూర్చొని ఆ ఆత్మ ని  ఆహ్వానించాలట.
  • అందరూ శ్రేద్దగా ఆత్మని  ఆహ్వానించాలి....ఎవరైనా డౌట్ పడితే...ఆత్మకి  కోపం వస్తుందిట.hee hee
  • ఇక లాస్ట్ గా కళ్ళుమూసుకుని...ఒకరి చేతులో ఒకరు చేయి వేసి....అస్సలు కళ్ళు తెరవకుండా ఆ ఆత్మకి  వెల్కం చెప్పాలి....కళ్ళు తెరిస్తే అది వేల్లిపోతుందిట.shame on you
  • ఆత్మ వచ్చాక నాణెం పట్టుకుని మెల్లగా ఆత్మ తో సంభాషణ మొదలుపెట్టాల్ట.

ఇలా కొన్ని రూల్స్ తెలుసుకుని.....ఒకటికి పది సార్లు మననం చేసుకుని స్పిరిట్ గేం కి సిద్ధం అయ్యాం.ఆడతాం సరే...మరి ఆత్మ వస్తే ఎం అడగాలి?మాకు ఎక్జాంస్ ఇంకో రెండు వారాల్లో ఉన్నాయ్.కాబట్టి మా కాలేజి కి వెళ్లి ఎక్జాం పేపర్ చూసి మాకు క్వశ్శన్స్ చెప్పాలి అని అడుగుదాం అనుకున్నాంidea.సరే...అంతా రెడి చేసుకున్నాం.అందరం వలయంలా కూర్చున్నాం.స్పిరిట్ గేం కి కావాల్సిన చార్ట్ మధ్యలో పెట్టుకున్నాం.ఒక నాణెం ని దానిమీద పెట్టాం.కళ్ళు మూసుకోబోయే ముందు వచ్చింది అసలు డౌట్...ఇంతకీ యే ఆత్మ ని పిలవాలి స్పిరిట్ గేం కి???thinking...బాగా ఆలోచించాం.మంచి ఆత్మ ని పిలుద్దాం...అప్పుడు మన పని అవ్వగానే వేల్లిపోమ్మంటే పోతుంది....లేదంటే వదలదు అనుకున్నాం.మంచి వాళ్ళంటే?? గాంధి గారు??...ఎబ్బే ఆయన క్వషన్ పేపర్ చెప్పడు....సుభాష్ చంద్రబోస్(నా ఫేవరేట్ happy)....ఆయన బ్రతికి ఉన్నాడో...చనిపోయాడో తెలియదు....ఇక స్వామీ వివేకానంద?(ఈయన నా సూపర్ ఫేవరేట్big hug)...ఆ! ఈయనైతే మన కష్టాల్ని అర్ధం చేసుకొంటాడు.అదీ మనలాంటి స్టూడెంట్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం...ఇంకా మంచి ఆత్మ కూడా! మనల్ని ఏమి చేయదు.సో ఇక స్వామి వివేకానందా ని దివి నించి భువికి దించేద్దాం అని డిసైడ్ అయిపోయి గేం స్టార్ట్ చేశాం.అదే! కళ్ళు మూసుకుని అందరం మనసులో స్వామీ వివేకానంద కి ఆహ్వానం పలకడం మొదలు పెట్టాం....

అలా చాలా సేపు కళ్ళు మూసుకున్నాం....మధ్యలో నేను అప్పుడప్పుడు కళ్ళు తెరిచి అందరూ సవ్యంగా చేస్తున్నారా లేదా అని టెస్టింగ్ కూడా చేశా!tongue....ఎంత సేపు చూసిన వివేకానందా రాడే!waiting చూసా!చూసా! ఆవలింతలు వస్తున్నాయ్ కానీ వివేకానందా వచ్చే జాడలు ఎక్కడా కనబడట్లేదు.ఇక విసిగిపోయి కళ్ళు తెరిచేస! అప్పుడే అమృత కూడా కళ్ళు తెరిచి చూస్తోంది....'నువ్వెందుకు తెరిచావ్! అంటే నువ్వెందుకు తెరిచావ్' అని కాసేపు పోట్లాడుకున్నాం.'నీవల్లే ఆత్మ రాలేదు అంటే నీవల్లే రాలేదు' అని తిట్టుకున్నాం.మళ్లీ ట్రై చేద్దాం అనుకున్నాం.కానీ అప్పటికే అందరికీ అర్ధం అయింది....స్పిరిట్  గేం లేదు...ఏమి లేదు...దయ్యాలు...ఆత్మలు అంతా బూటకం అని ఆ టీ.వి.లలో చూపించేవి అంతా ట్రాష్ అని.ఎందుకు ఈటివి వాడు ఇంత మోసం చేసాడా అని బాధపడ్డాం!వాడు సరే! మరి స్పిరిట్ గేం ఆడామని....ఆత్మలు వచ్చాయని చెప్పిన ఫ్రెండ్స్? అబ్బో! అందరూ అందరే అనుకున్నాం. ఆ చార్ట్లు,కొవ్వొత్తులు తీసి పక్కన పడేసాం.కాసేపు...మధ్యలో ఒక్కొకళ్ళు ఎన్నిసార్లు కళ్ళు తెరిచారో అప్పుడు అందరం ఎంత సిన్సియర్ గా ప్రే చేస్తున్నామో చెప్పుకుని....చెప్పుకుని... హాయిగా నవ్వుకుని పడుకున్నాం.పైకి అనలేదు కానీ నాకు మాత్రం కొంచెం బాధేసిందిsadచక్కగా ఆత్మలు,దయ్యాలు ఉంటే ఎంత బాగుండేది! వాటితో ఫ్రెండ్షిప్ చేసుకుని ఉంటే అల్లావుద్దీన్ లో జీనిలాగా నాకు ఒక జీనీనో గజినీ నో ఉండేది day dreaming హాయిగా ఎక్జాంస్ కి చదివే గోల తప్పేది...మంచానికి ఎదురుగా ఉన్న రాక్ లో బండ బండ పుస్తకాలు కనిపించాయి...హ్మ్! ఏం చేస్తాం! చదవక తప్పుతుందా!

చక్కగా చదువుకోక ఈ దయ్యాలు,ఆత్మలు మీకేందుకమ్మా అని అనొచ్చు....దానికి సమాధానం ఏ.వి.ఎస్ ఇస్టైల్లో చెప్పాలంటే...'ప్చ్! అదో తుత్తి!'tongue

5, నవంబర్ 2010, శుక్రవారం

దివ్వెల పండుగ


కోటి కాంతుల వెలుగులు విరజిమ్మే "తారాజువ్వలు" .......

నవ్వుల పువ్వులు పూయించే "కాకర పువ్వోత్తులు ".........

ఆనందాల వెల్లువ పొంగించే  "మతాబులు ".....

తారా తోరణాలను ఇంటిముందు వాల్చే "దీపాల కాంతులు"...

వెరసి...
చెడు పై మంచి సాధించిన విజయానికి నిదర్శనం...ఈ దివ్వెల పండుగ....

సంతోషాల దీపావళి...అందరి జీవితాల్లో వెలుగులని పంచాలని ఆశిస్తూ...


అందరికీ 'దీపావళి' శుభాకాంక్షలు....

3, నవంబర్ 2010, బుధవారం

ఇష్టాలు మారిపోతాయా??!!

ఏమో మరి! నాకు ఇవాళే తెలిసింది...

నేను చిన్నపుడు ఒక సినిమా చూసా! నాకు అది బాగా నచ్చిందిbig hug...కానీ ఆ సినిమా పేరు తెలీదు....సినిమా కూడా పూర్తిగా చూడలేదు ...క్లైమాక్స్ ఏంటో తెలీదు..ఆ సినిమా పూర్తిగా చూడాలని నా కోరిక.కానీ అది ఒక్కసారే చూసాను....పేరు గుర్తు లేదు...మా తమ్ముడ్నిఅడిగా ఒకసారి!కథ ఏంటో చెప్పు ట్రై చేస్తా అన్నాడు.ఏదో గుర్తున్నంత వరకు చెప్పా!

'ఒక చిన్న పిల్లాడు....ఇద్దరు మనుషులు మాత్రమె పట్టే విమానం లో వాళ్ళ నాన్న దగ్గరకి బయలుదేరతాడు....కానీ మధ్యలో పైలెట్ హార్ట్అటాక్ తో చనిపోతాడు...ప్లేన్ దట్టమైన అడవిలో ఉన్న ఒక చెరువులో క్రాష్ లాండింగ్ అవుతుంది...ఆ అడవిలో ఒంటరిగా ఆ అబ్బాయి ఎలా బ్రతికాడు?ఆ అబ్బాయి అక్కడనించి ఎలా బైటపడతాడు? అనేది స్టోరి' అని చెప్పా! వాడు ఒక చిత్రమైన ఫేస్ పెట్టాడుI don't know...'ఓహో! వీడికి నేను చెప్పింది అసలు అర్ధం కాలేదన్నమాట....ఎవరిని అడిగినా ఇలానే మొహం పెడతారేమో...ఆ మళ్లీ అది టీ.వీ  లో వేయకపోడు..నేను చూడకపోను...' అనుకుని ఊరుకున్నా.అప్పటినించి నా ఫేవరేట్ సినిమా ఏది అని అడిగితే అదే గుర్తుకొచ్చేది..కానీ పేరు కూడా తెలీకుండా ఏమని చెప్పను అని వేరే ఏదో చెప్పెసేదాన్ని....గూగుల్ పరిచయం అయ్యాక దాంట్లో కూడా వెతికా ఏవేవో పేర్లు కొట్టి....ఉహు!! లాభం లేదు..సరేలే ఎప్పటికైనా దొరక్కపోదు అనుకున్నా....

చందు కి సినిమాలంటే ప్రాణం.అది తెలిసి 'హమ్మయ్య! కచ్చితంగా చందు కి తెలిసే ఉంటుంది' అనుకుని ఒక రోజు ఆ కథ కొంచెం చెప్పా...అది యే తెలుగు సినిమానో అయితే చందు ఠక్కున చెప్పెసేవాడే...కానీ అది ఒక ఇంగ్లిష్ సినిమా....అందులో కూడా చందుగారు దిట్ట కాబట్టి ఎలాగోలా కనుక్కుంటారేమో అనుకున్నా....కొంచెం 'బేబీస్ డే అవుట్ ' లాగా ఉంది కానీ అది కాదు అని తేల్చేసాడు. హ్మ్! నా ఆశ తీరలేదు.ఇక ఆ విషయం వదిలేసా!

ఈమధ్య కొంచెం తీరికగా ఉన్నా కదా ఆ సినిమా గుర్తొచ్చింది.మొత్తానికి నిన్న ఎలాగైనా అది కనిపెట్టాలి అని భీష్మించుకుని మళ్లీ ట్రై చేశా! నాకు గుర్తున్నంత వరకు కథ అంతా గూగుల్ సర్చ్ బార్ లో కొట్టేసా! ఏవేవో పిచ్చి రిసల్ట్స్ ఇచ్చింది..మరి పిచ్చి గా కొడితే అంతేగా! కానీ ఒక రిసల్ట్ మాత్రం నన్ను,నా బాధ ని అర్ధం చేసుకుంది."అలా డ్రిస్క్రిప్షన్  తో ఊరు,పేరు లేని మూవీ వెదకాలంటే 'IMDB' అని ఒక దేవతా సైటు ఉంది...అందులోకి వెళ్లి వెతుకు బిడ్డా" అని సెలవిచ్చిందిtalk to the hand."ధన్యవాదములు.మహోపకారం చేసావు తల్లీ" అని ఒక దణ్ణం పెట్టి ఆ సైటు లోకి చొరబడ్డా.....అక్కడ ఉన్న ఏవేవో ఆప్షన్స్ లో నాకు తెలిసినవి....రెండే రెండు...ఆ మూవీ చాలా పాతది....1980-2000 మధ్యలో అని,అందులో 'ప్లేన్ క్రాష్' అవుతుందని మాత్రం కొట్టా...8 రిజల్ట్స్  ఇచ్చింది....ఆ సినిమాల  స్టొరీ తో సహా! వాటిల్లో రెండవదే నా సినిమా...నేను కోరుకున్న సినిమా...'A Cry in the Wild'happy

'చందు..దొరికిందీ..నాకు ఇష్టమైన సినిమా దొరికిందీ...'అని ఎంతో సంతోషంగా చెప్పా..'ఎలా ఎలా?' అంటే ఇలా ఆ 'IMDB' సైటు లో చూసాను  అందులో దొరికింది అని చెప్పా...'ఓహ్!అదా!అది నాకు తెలుసు.దాని డేటాబేస్ చాలా బాగుంటుంది' అని చెప్పాడు....మరి ఈ ముక్క ముందు చెప్పొచ్చుగా! అని నేనంటే 'హిహిహి' అని పిచ్చి నవ్వొకటి విసిరి..'అసలే దొరక్క దొరక్క దొరికింది ముందు సినిమా చూడు' అని చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేసాడు....

కానీ అప్పటికే రాత్రయింది....రేపు తీరిగ్గా పని అంతా అయ్యాక చూద్దామని అనుకున్నా...ఇవాళ పొద్దున్నే చక చకా పనులన్నీ చేసేసి....మధ్యాహ్నం భోజనం అయ్యాక....ఎంచక్కా ఆ మూవీని డౌన్లోడ్ చేసుకుని టి.వి లో ప్లే చేశా! ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది అనుకున్నా....అలా చూస్తూనే ఉన్నా.....నేను ఊహించుకున్న దృస్యాలేవి రావట్లేదుwaiting....'ఆ చిన్నపిల్లాడిని ఎలుగు వెంటాడుతుంది...వారి ఇద్దరిమధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది....వాడు అడవిలో దారితప్పిపోతాడు....ఎలాగో అలా  తనంతట తానె ఆ అడవినించి బైట పడతాడు...'ఇలా ఏవేవో ఊహించా ఇప్పటిదాకా!! కానీ ఆ సినిమాలో అంత దృశ్యం లేదు..ఆ అబ్బాయి చేసే పనులన్నీ 'Cast Away' లో ఆల్రెడీ నేను చూసేసా! పెద్ద విషయం ఏమి లేదు..ఎలుగుతో ఫైటు కూడా చాలా సిల్లీ గా అనిపించింది....దీనికోసమా ఇంత తాపత్రయపడింది...ఇన్ని రోజులు ఎదురుచూసింది...అనిపించి ప్రాణం ఉసూరుమంది....

ఏతావాతా తేలింది ఏమిటయ్యా అంటే....ఇష్టాలు మారిపోతూ ఉంటాయ్....చిన్నపుడు కొన్ని అద్భుతాలుగా అనిపిస్తాయ్....కానీ పెరిగే కొద్దీ...జ్ఞానం వికసించే కొద్దీ అవి చిన్న చిన్న విషయాలుగా అయిపోతాయ్....చిన్నపుడు టీ.వి లో నిజంగా మనుషులు ఉండేవాళ్ళు  అనుకునే దాన్ని...నాకు అది ఒక వింత లాగా అనిపించేది...చాలా సార్లు టీ.వి లో దూరిపోదామని ట్రై చేశా కూడా!!tongueకానీ ఇప్పుడు టీ.వి టెక్నాలజీ తెలిసాక నాకు అది చాలా సిల్లి గా అనిపించింది....అలానే ఈ సినిమా కూడా...భలే ఉంటుంది...అదీ ఇది...అని చందు కి తెగ చెప్పేదాని ఇదివరకు....ఇందాక చందు ఆఫీస్ నించి వచ్చి...'సినిమా చూసావా ఎలా ఉంది?' అని అడిగితే...'ఏదో పర్లేదు' అని ముక్తసరిగా జవాబిచ్చా....తనకీ విషయం అర్ధమయింది అనుకుంటా...పెద్దగా ఏమి అడగలేదు...కానీ నాకే బాధేసింది....సర్లే ఏంచేస్తాం....లైట్ :)

1, నవంబర్ 2010, సోమవారం

నూడిల్స్ కథ...

ఇవాళ పోద్దున 'Maggi' తింటూ దాని మీద 'Ketchup' పోసుకుంటూ ఉంటే  ఒక్కసారి పాత జ్ఞాపకాలన్నీ రెక్కలు కట్టుకుని వచ్చి వాలాయి.....

మంచి పాత రోజుల్లో(Good Olden Days కి  true translation అమ్మా!!) నూడిల్స్ నాకంటికి  వానపాముల్లా...మంచూరియా మటన్ బాల్స్  లా కనిపించేవి..అవి చూస్తే ఆమడ దూరం పారిపోయేదాన్ని....అలాంటి అమాయకమైన నన్ను పనిగట్టుకుని నా ఫ్రెండ్స్ నూడిల్స్,మంచురియా అంటగట్టి చెడగొట్టారుsad...ఒక రోజున నా మానాన నేను బస్సులో కునికి పాట్లు పడుతుంటే కాంటీన్ లో పార్సెల్ చేయించి తీసుకొచ్చిన నూడిల్స్ పొట్లం విప్పారు...మసాల వాసన గుప్పున  కొట్టింది...మన తిండి కాదులే అని మొహం అటుపక్కకి తిప్పి మళ్లీ డ్రీమ్స్ లోకి వెల్లిపోతుండగా టపా టపా మని కొట్టి లేపారు...'ఏంటే! పడుకోనివ్వరా!' అన్నాను చిరాగ్గా ...'నీకోసం నూడిల్స్ తెస్తే తినకుండా పడుకుంటా అంటావేంటి??' అన్నారు ముగ్గురు దయ్యాలు(శిల్ప,ఆది,కవి) ముక్త కంఠం తో.  'ఛి!ఛి! వానపాములు..యాక్!! ఒద్దే!! ప్లీజ్ వదిలేయండి!!' అని బ్రతిమిలాడుతుంటే ఆది,కవి చెరో రెక్క పట్టుకున్నారు...శిల్ప ఫోర్క్ తో నూడిల్స్ తీసి నా నోట్లో పెట్టేసిందిcrying...నా కళ్ళ వెంబడి నీళ్ళు...కోపం కూడా వచ్చింది....కానీ నోట్లో ఏదో రుచికర పదార్ధం...మెల్లగా దాని రుచిని ఆస్వాదిస్తూ వాళ్ళని తిట్టాలి అన్న విషయం మరిచిపోయా!! 'ఇంకా తింటావా??' అన్నారు...'ఊ' అన్నా....అదిగో అదే నా నూడిల్స్ ప్రాసన  దినం....అలాగే ఇంకో దుర్దినాన మంచురియా కూడా నా నోట్లో కుక్కి దానికి అలవాటు చేసారు...

ఆ తరువాత ఇక ఏ హోటల్ కి వెళ్ళినా..రెస్టారెంట్ కి వెళ్ళినా...ఆఖరికి ఈవెనింగ్ కాంటీన్ లో స్నాక్స్ కూడా నూడిల్స్ యే ఆక్రమించేశాయి....ఇంజనీరింగ్ రెండో సంవత్సరం మనం హాస్టల్ గిరి వెలగబెట్టాం లెండి.....అక్కడ కూడా నాకు తగ్గట్టే వెనక రోడ్లోనే నూడిల్స్ బండి...రోడ్ మీద తిండి తినకూడదు అనే ధ్యాసే లేకుండా  ఇంచుమించి వారం లో మూడు సార్లు ఇదే తిండి....ఆ బండివాడికి రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయాంbig grin....రోజు అలా బైట తిండి ఎందుకు హాస్టల్ లోనే  నూడిల్స్ చేసుకుంటే బాగుంటుందేమో అనే రాజి గారి సలహా తో హాస్టల్ కిచన్ లో  'Maggi ' చేయడం మొదలుపెట్టాం...అబ్బో...అదో పెద్ద ప్రహసనం...మనకా వంట సరిగా వచ్చి చావదు...అందుట్లో ఈ వంటలు అసలు రావు...ముందు తిరగమాత వేసి అందులో నీళ్ళు  పోసి 'Maggi ' వేసాము(ఉప్మా సౌజన్యంతో)....పేస్టు అయింది....ఇలా కాదని  'Maggi ' ని ఉడకబెట్టి దాన్ని చల్లనీళ్ళ కింద పెట్టి భాండి లో నూనె వేసి వేయించాము(నూడిల్స్ బండి వాడి సౌజన్యం తో)...అదీ గుండుసూదిల నిక్కబొడుచుకుంది....ఇక నాకు  'Maggi ' రాదు అని డిసైడ్ అయిపోయి ఆ ప్రయోగాలు ఆపేసాI don't know...

అలా రెండు,మూడు సంవత్సరాలు ఆ నూడిల్స్ బండిని పోషించాం....ఇక నాల్గవ సంవత్సరం.....అదృష్టమో దురదృష్టమో జే.కే.సి లో విప్రో కి సెలెక్ట్ అవడంfeeling beat up...మా జే.కే.సి బాచ్ కి వేరే ప్రాజెక్ట్లు,వేరే ల్యాబ్...వేరే టైమింగ్స్....ఫోర్త్ ఇయర్ అందరూ రెండు క్లాసులు వినేసి చక్కా ఇంటికేల్తే...మేము ఆ దిక్కుమాలిన జే.కే.సి ల్యాబ్ లో రోజంతా పడి ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చేదిangry...ఆ ప్రాజెక్ట్ పని దయవల్ల మధ్యాహ్నం బాక్సులు తెచ్చుకున్నా తినబుద్ధి అయ్యేది కాదు...మెల్లగా ఇక బాక్స్ తేవడం ఆపేసి కాంటీన్ మీద పడ్డాం....నేను,ఝాన్సీ,దీప్తి అక్కా,పద్మజ,నర్మదా.....మొత్తం హోల్ సేల్ గా నూడిల్స్ ఫాన్స్ అసోసియేషన్.....ఇక కాంటీన్ లో రామకృష్ణ ని హింస పెట్టె వాళ్ళంdancing....మసాల కొంచెం ఎక్కువుండాలి...ఘాటుగా ఉండాలి...పేస్టు లా అవ్వకూడదు...ఉడికి ఉడకనట్టు ఉండకూడదు....ఉప్పు ఎక్కువా కాకూడదు...తక్కువా కాకూడదు...సరిగ్గా సమానంగా ఉండాలి...అని ఒక పెద్ద లిస్టు చెప్పే వాళ్ళం...చూస్తూ చూస్తూ రోజు వచ్చే ఐదుగురు కష్టమర్స్ ని ఒదులుకోలేడు.....ఏంచేస్తాడు!! రోజు ఒక చిన్న కప్ లో తయారయిన నూడిల్స్ తీసుకొచ్చి 'అమ్మా బంగారాలు !! టేస్ట్ చూసి చెప్పండమ్మా!! ఏమన్నా ఎక్కువ తక్కువలుంటే సరిచేస్తాను!!' అని దీనంగా అడిగేవాడు.....మేము జూనియర్స ముందు గర్వంగా ఒక ఫొస్ పెట్టి  మార్పులు,చేర్పులు చెప్పేవాళ్ళంsmug....ఆ తరువాత మాకు ప్రత్యేకంగా ఒక సాస్ బాటిల్ తెచ్చేవాడు...'చూడండమ్మ!! ఇక కాంటీన్ లో ఇదే లాస్ట్ బాటిల్...సాస్ అయిపోవచ్చింది...కొంచెం చూసి వేస్కోండి అమ్మా!!' అనేవాడు...రోజు ఇదే డవిలాగులే....మరి మేము సాస్ వేసుకోకుండా పోసుకునేవాళ్ళం అన్నమాట...ఒకసారి రామకృష్ణ భార్య వచ్చి అది చూసి....మీరు నూడిల్స్ లోకి సాస్ వేసుకుంటున్నార ?? సాస్ లో నూడిల్స్ నంజుకుని తింటున్నారా? అని అడిగింది.ఒక పిచ్చి నవ్వు నవ్వి ఊరుకున్నాం...మేము దానికీ వంకలు పెట్టేవాళ్ళం...సాస్ మరీ పల్చగా ఉందని...నిన్న వేరే రంగు ,ఇవాళ వేరే రంగు ఉందని,...అలా పాపం వాళ్ళని  ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాంoh go on....

కాలేజి అయిపోయాక అమీర్పేట్ ని ఏలేస్తున్న రోజుల్లో మా  హాస్టల్ కి దగ్గరలో ఒక నూడిల్స్ బండి ఉండేది...అక్కడ నేను,రాజి,ఝాన్సీ,ఆది మా నూడిల్స్ ప్రహసనాన్ని నిరాటంకంగా కొనసాగించాం....నూడిల్స్ తినాలనిపించిన రోజు హాస్టల్ లో ఫుడ్ చెక్ చేసి బాగున్నా  బాగోలేదని తేల్చేసి నూడిల్స్ తెచ్చుకునే వాళ్ళంtongue... రాజి ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆ నూడిల్స్ బండి పక్కనే ఉన్న హాస్టల్స్ లో రూమ్స్ ఉన్నాయేమో కూడా వెతికింది.కానీ ఆరునెలల్లోనే  మా బంగారపు రోజులు అయిపోయాయి...అందరం తలోదిక్కు అయిపోయాం...ఆ రోజుల తోనే మా రుచికరమైన నూడిల్స్ టాటా-గుడ్ బై చెప్పెసాయేమో!!worriedఇక నేను జాబ్ లో జాయిన్ అయ్యాక విప్రో లో తిన్న నూడిల్స్ నాకు నచ్చలేదు....చాలా చండాలంగా ఉండేవి..కానీ చందు దయ వల్ల 'Maggi 'చేయడం మాత్రం బాగా వచ్చింది...నా విప్రో అసెస్మెంట్స్ అపుడు పొద్దున రోజు బ్రేక్ ఫాస్ట్ అదే!! అలా  'Maggi  లో బాగా ప్రావీణ్యం సంపాదించాను...అప్పుడప్పుడు బైటికెల్లినపుడు నూడిల్స్ ఆర్డర్ చేసినా నేను కోరుకున్న టేస్ట్ లేక  తినడం ఆపేసా!!sad

ప్రస్తుతానికి 'Maggi తో అడ్జస్ట్ అవుతున్నా!!sigh

P .S :ఒక సంవత్సరం క్రితం మా గాంగ్ అందరం మళ్లీ  ఏదో పనిమీద కాలేజికి  వెళ్ళాం...రామకృష్ణ కి నూడిల్స్ ఆర్డర్ చెప్పాం...మేము బానే గుర్తున్నాం కానీ మా రూల్స్ మాత్రం గుర్తులేవనుకుంటా.....అందుకే చాలా చెత్తగా ఉన్నాయి నూడిల్స్....మళ్లీ  తినాలనిపించలేదుbroken heart....మా పాత రోజులు నెమరేసుకుంటూ వచ్చేసాం!!