కేవ్వవ్వ్వ్వ్!!
ఏంటి...భయపడ్డారా? ఏదైనా అరిచి చెప్పడం నాకు అలవాటు కదా మరీ!!
నా ఆర్టికల్ 'For Women' వెబ్సైట్ లో వేశారు :)
ఇందుకు ముందుగా ఈ సైట్ ఎడిటర్ గారికి ధన్యవాదాలు.
మొదట ఈ వెబ్సైట్ చూసినప్పుడు.....నాకు చాలా ఆశ్చర్యమేసింది! ఎన్నో ఆర్టికల్స్....ఆడవారికోసం!
అంతే కాకుండా...ప్రముఖుల చేత ఇవ్వబడుతున్న సలహాలు,సూచనలు కూడా. ఆరోగ్యం,విద్య,కెరీర్,వంటలు,ఫ్యాషన్,ఆధ్యాత్మికం,.....ఇలా ఎన్నెన్నో అంశాలమీద చినచిన్న ఆర్టికల్స్ రూపంలో ఎంతో ముచ్చటగా చెబుతున్నారు!
ఇలా మహిళలు,పిల్లలు,జీవన విధానం....వీటి గురించి చక్కగా చెబుతున్న ఈ వెబ్సైట్....చాల బాగుంది!
నాకు ఈ సైట్ చాలా నచ్చింది :) ఒకసారి కావాలంటే మీరు వెళ్లి చూడండి! ఇదిగో లింక్
ఇక నా ఆర్టికల్ గురించి చెప్పాలంటే....
నా బ్లాగ్ చూసి...కామెంటులో మెయిల్ అడ్రస్ ఇచ్చి....తనకి మెయిల్ చేయమని చెప్పారు ఎడిటర్గారు.తరువాత,
ఒకరోజు....ఇలా మా వెబ్సైట్లో 'ప్రవాసి' కాలం ఉంది ఒక ఆర్టికల్ రాయగలవా? అని అడిగినప్పుడు.....నాకు ముందు భయమేసింది! వామ్మో! నేను ఆర్టికల్ రాయడమా అని. అయినా తను..నువ్వు రాయగలవ్ అని ప్రోత్సహించి.... ముందు ఒక ఆర్టికల్ రాసి పంపమన్నారు.
నేను వ్రాసి భయపడుతూ పంపించా! అది చూసి....చాలాబాగుంది....ఇలా సిరీస్ కంటిన్యు చేయగలవా? అని అడిగినప్పుడు ఎంత హాపిగా అనిపించిందో!
అలా....ఒక పక్క నా జాబ్ ప్రిపరేషన్స్లో పడి.....సమయానికి వాళ్లకి అందించలేకపోయినా ఏమి అనుకోకుండా 'మీకు సమయం ఉన్నప్పుడే రాయండి' అని వెన్నుతట్టి ప్రోత్సహించిన ఎడిటర్ గారికి ఇంకోసారి ధన్యవాదాలు.
ఇదిగో నా ఆర్టికల్ మొదటి భాగం :)
బాగుందా?