నేను చిన్నపుడు ఒక సినిమా చూసా! నాకు అది బాగా నచ్చింది

'ఒక చిన్న పిల్లాడు....ఇద్దరు మనుషులు మాత్రమె పట్టే విమానం లో వాళ్ళ నాన్న దగ్గరకి బయలుదేరతాడు....కానీ మధ్యలో పైలెట్ హార్ట్అటాక్ తో చనిపోతాడు...ప్లేన్ దట్టమైన అడవిలో ఉన్న ఒక చెరువులో క్రాష్ లాండింగ్ అవుతుంది...ఆ అడవిలో ఒంటరిగా ఆ అబ్బాయి ఎలా బ్రతికాడు?ఆ అబ్బాయి అక్కడనించి ఎలా బైటపడతాడు? అనేది స్టోరి' అని చెప్పా! వాడు ఒక చిత్రమైన ఫేస్ పెట్టాడు

చందు కి సినిమాలంటే ప్రాణం.అది తెలిసి 'హమ్మయ్య! కచ్చితంగా చందు కి తెలిసే ఉంటుంది' అనుకుని ఒక రోజు ఆ కథ కొంచెం చెప్పా...అది యే తెలుగు సినిమానో అయితే చందు ఠక్కున చెప్పెసేవాడే...కానీ అది ఒక ఇంగ్లిష్ సినిమా....అందులో కూడా చందుగారు దిట్ట కాబట్టి ఎలాగోలా కనుక్కుంటారేమో అనుకున్నా....కొంచెం 'బేబీస్ డే అవుట్ ' లాగా ఉంది కానీ అది కాదు అని తేల్చేసాడు. హ్మ్! నా ఆశ తీరలేదు.ఇక ఆ విషయం వదిలేసా!
ఈమధ్య కొంచెం తీరికగా ఉన్నా కదా ఆ సినిమా గుర్తొచ్చింది.మొత్తానికి నిన్న ఎలాగైనా అది కనిపెట్టాలి అని భీష్మించుకుని మళ్లీ ట్రై చేశా! నాకు గుర్తున్నంత వరకు కథ అంతా గూగుల్ సర్చ్ బార్ లో కొట్టేసా! ఏవేవో పిచ్చి రిసల్ట్స్ ఇచ్చింది..మరి పిచ్చి గా కొడితే అంతేగా! కానీ ఒక రిసల్ట్ మాత్రం నన్ను,నా బాధ ని అర్ధం చేసుకుంది."అలా డ్రిస్క్రిప్షన్ తో ఊరు,పేరు లేని మూవీ వెదకాలంటే 'IMDB' అని ఒక దేవతా సైటు ఉంది...అందులోకి వెళ్లి వెతుకు బిడ్డా" అని సెలవిచ్చింది


'చందు..దొరికిందీ..నాకు ఇష్టమైన సినిమా దొరికిందీ...'అని ఎంతో సంతోషంగా చెప్పా..'ఎలా ఎలా?' అంటే ఇలా ఆ 'IMDB' సైటు లో చూసాను అందులో దొరికింది అని చెప్పా...'ఓహ్!అదా!అది నాకు తెలుసు.దాని డేటాబేస్ చాలా బాగుంటుంది' అని చెప్పాడు....మరి ఈ ముక్క ముందు చెప్పొచ్చుగా! అని నేనంటే 'హిహిహి' అని పిచ్చి నవ్వొకటి విసిరి..'అసలే దొరక్క దొరక్క దొరికింది ముందు సినిమా చూడు' అని చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేసాడు....
కానీ అప్పటికే రాత్రయింది....రేపు తీరిగ్గా పని అంతా అయ్యాక చూద్దామని అనుకున్నా...ఇవాళ పొద్దున్నే చక చకా పనులన్నీ చేసేసి....మధ్యాహ్నం భోజనం అయ్యాక....ఎంచక్కా ఆ మూవీని డౌన్లోడ్ చేసుకుని టి.వి లో ప్లే చేశా! ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది అనుకున్నా....అలా చూస్తూనే ఉన్నా.....నేను ఊహించుకున్న దృస్యాలేవి రావట్లేదు

ఏతావాతా తేలింది ఏమిటయ్యా అంటే....ఇష్టాలు మారిపోతూ ఉంటాయ్....చిన్నపుడు కొన్ని అద్భుతాలుగా అనిపిస్తాయ్....కానీ పెరిగే కొద్దీ...జ్ఞానం వికసించే కొద్దీ అవి చిన్న చిన్న విషయాలుగా అయిపోతాయ్....చిన్నపుడు టీ.వి లో నిజంగా మనుషులు ఉండేవాళ్ళు అనుకునే దాన్ని...నాకు అది ఒక వింత లాగా అనిపించేది...చాలా సార్లు టీ.వి లో దూరిపోదామని ట్రై చేశా కూడా!!

17 కామెంట్లు:
paapam pasivaadu = ani oka telugu cinema ide story line to undi mari. meeru cheppina time framelone vaccindi. may be u dont remember the language well but the story line is exactly the same.
ఒకో సారి అంతే ఇందక్కా!! నాక్కూడా ఇలాగే జరిగింది: నా చిన్నప్పటి నుంచి జయప్రద అంటే చచ్చే ఇష్టం ...ఒక్కసారన్న బయట చూడాలి అని ఆరో క్లాసు నుంచి పదో క్లాసు వరకూ కలలు కనేవాడిని.
నాలుగేళ్ళ క్రితం బయట నిజం గా చూసా నిజ్జం గా జడుసుకున్నా .. ఏంటి ఇలా అయింది అని మానసిక వైద్యుడిని అడిగా. అయన అన్నారు (హార్లిక్స్ డాక్టర్ లా.. యా అదంతా ఇంఫక్చువేషణ్ అని దీనికి మందులక్కర్లేదని).
బాగుంది మీ పోస్ట్. దార్లోనే ( బై ద వే ) ఆ సినిమా తెలుగు లో ' పాపం పసివాడు' ( పాపం ఇందక్కా..??)
హ్మ్...
ముందుగా మీ టపా టైటిల్ నన్నాకర్షించింది..:) చాలా బాగుంది..
ఇక ఇష్టాల సంగతి అంటారా..? మనసు కోతిలాంటిదని ఎప్పుడో చెప్పారుగా మన పెద్దలు.. టపా మాత్రం చాలా బాగుంది ఇందు గారు..:)
అవునండి వయసు తో పాటు మన ఇష్టాలు ,రుచులు (taste ) మారుతుంటాయి. ఎందు కంటే జ్ఞానము (అజ్ఞానము కూడా )తుంది కదా!
@ budugu :Thankyou budugu.కాని నేను చూసింది ఇంగ్లిష్ సినిమానే.ఎందుకంటే..అందులో ఆ అబ్బయి వేసుకునే రెడ్ షర్ట్ నాకు బాగ గుర్తు :)మరి పాపంపసివాడు సంగతి తెలియదు :(
@ మనసు పలికే :Thankyou andi.
@ అరుణాంక్:అవును మీరు అన్నట్టే జ్ఞానము(అజ్ఞానము కూడా)వస్తుంది కాబట్టీ
@ ఆత్రేయ:అయ్యొ!! అవునా ఆత్రేయ బాబాయ్ గారు!! అంత పని జరిగిందా!!ఒక్కొసారి అంతే బాబాయ్ గారు...అలా జరిగిపోతూ ఉంటాయ్...అల కంగారు పడి డాక్టర్ దగ్గరకు వెళితే ఎలా బాబాయ్ గారు!! పాపం ఆత్రెయబాబాయ్!!?? ఆ సినిమా తెలియకేగా ఇంతా కష్టపడి వెదికింది......:P
అది కాదు ఇందక్కా నేను రెండు సార్లంటే నువ్వు అన్ని సార్లనాలా ? మరీ టీవీ రిపోర్టర్, న్యూస్ రీడర్ తో అన్నట్లు... ఏమైనా నోరేట్టుకు అరిచే వాళ్ళతో నాలాటి పాపం పసివాడు గెలవ లేడు.
ఇష్టాలు తప్పకుండ మారుతాయి. మారకపోతే మనం జడంగా ఉండిపోయినట్టు. ఇలాంటి మార్పుకూడా పరిణతికి గుర్తు.
అంతర్జాలం ఇచ్చిన గొప్ప బహుమానాలు ఐదింటిని పేర్కొనమంటే అందులో IMDB కచ్చితంగా ఉంటుంది.
@ ఆత్రేయ :అయ్యొరామా! నేనేమన్నాను బాబాయ్ గారూ!! మీరు మరీ సున్నితం సుమండీ :P
@ కొత్త పాళీ :అవును....మార్పు మనిషికి సహజమే...కాని నాకు ఆ సినిమా ఒక ఫాంటసీ మొన్నటిదాకా...నిన్న దానికి బ్రేక్ పడింది అంతే..
హ్మ్ ఇష్టాలు ఒకోసారి చాలా ఆశ్చర్యకరంగా మారిపోతుంటయండీ అందులో ఏమాత్రం సందేహం లేదు.
ఒకప్పుడు అంటే మైనే ప్యార్ కియా రిలీజ్ ఐనకొత్తలో అందులో హీరోయిన్ ’భాగ్యశ్రీ’ ఆహా ఓహో అని గంగ వెర్రులెత్తిపోయేవాడ్ని. అదే ఊపుతో ఒక రెండేళ్ళ క్రితం ఆ సినిమా పాట వీడియో మళ్ళీ చూసి. హ్మ్ ఈ అమ్మాయినా నే అంత ఇష్టపడింది అనిపించింది :-)
నిజమే కొన్ని కొన్ని ఒకప్పుడు అద్భుతంగా అనిపించినవే కొన్నాళ్ళకు మామూలుగా అనిపిస్తాయి ..ఇంతకూ మీ ప్రయత్నం మెచ్చుకోతగ్గది :) :)
nenu ii post monna ofice lo chadavandi....intikochaka commentudamante link marchipoya..:P..
anthe andi anthe....chinnapudu anni istangane untayi....ippude ani kastanga untayi...mari pedda vallam aipoyam kada... :P
so nene mee blog 1st chusesa..:)
@ kiran :సో,మీరే గెలిచారన్నమాట :)
Anywayz thanks for visiting my blog :)
@ వేణూ శ్రీకాంత్:హ్హహ్హహ్హ :))
@ పరిమళం:thank you andi :)
Telugu kuda indu eh movie...adhi papam pasivaadu ne..kudirinapudu okasari chudadaniki try chey ra...
కామెంట్‌ను పోస్ట్ చేయండి