13, జులై 2011, బుధవారం

జావావ్రతం-ఫలం

జావా వ్రతం!

ఈ వ్రతం చేస్తే...పుణ్యం మాట దేవుడెరుగు....బుర్ర వేడెక్కిన వైనానికి నాకు అత్యంత ప్రీతిపాత్రమైన నీలికురులు....ఎక్కడ వసివాడిపోతాయో అని బెంగపడిపోయాను!

సరి...సరి...వట్టిమాటలు కట్టిపెట్టి ఇక విషయానికి వస్తే...
ఈ వ్రతవిధానంబెట్టిదనిన...

"ఐ హేట్ జావా.....ఐ హేట్ ఇట్ ఎవర్ అండ్ ఎవర్.... 

చెత్త జావా...
డొక్కు జావా....

దీన్ని తీసుకెళ్ళి మూసినదిలో నిమజ్జనం చెయ్య!
దీన్ని ఈఫిల్ టవర్ మీదనించి తోసెయ్య!

అసలు దీన్ని ఏ పదార్ధంతో తయారుచేసారో!! ఒక్క ముక్క అర్ధమయ్యి చావదు!

ఆదివాసిల భాషలాగా.....తాడు,తీగ....గిన్నె....గరిటె....ఛి ఒక పద్ధతి లేదు....పాడు లేదు.."

ఇవి మొన్నటిదాకా నేను జావాని తిట్టుకున్న తిట్లు!

అప్పుడెప్పుడో మొదలు పెట్టా జావా నేర్చుకుందామని! కానీ మధ్యలో ఏవేవో అడ్డొచ్చి..... అలా సాగుతూ ....ఆగుతూ....అలా జరిగింది.

అసలే రాకరాక మొన్ననే వచ్చింది నాకు వర్క్ పర్మిట్! ఇక టైం వృధా చేసుకోవడం ఇష్టంలేక.... కష్టమైనా ఈ జావాని అయిష్టంగానే దిగమింగి..... ఆ జావా కనిపెట్టినవాడ్ని గూగుల్ మేప్లో సర్చ్ చేస్తూ...... ఏదో ఒకరోజు స్కేచ్చేసి చితక్కోట్టేయాలని డిసైడ్ అయ్యా!

చచ్చిపోతున్నా గత పదిహేను రోజులనించి.....ప్రపంచకంలో ఎవడైనా పదిహేనురోజుల్లో జావా,సర్వ్లేట్స్,జే.ఎస్.పీ, స్త్రట్స్,జేడిబిసి,హెచ్.టీ.ఎం.ఎల్,సి.ఎస్స్.ఎస్స్ ఏకకాలంలో నేర్చేసుకున్టారా?
నేను....నేను ఉన్నాను కదా....నేను నేర్చుకున్నాను!

నాకు దండేసి దండం పెట్టేయాలని రోజు అనిపిస్తోంది! 

 పోనీ నా టెక్నాలజిలో జాబ్స్ ట్రై చేద్దామంటే.....అబ్బే....దానికి మిషిగన్లో పెద్దగా మార్కెట్ లేదు...కాలిఫోర్నియాలో బాగుందట! ఇప్పుడు అంత దూరం వెళ్ళలేం కనుక.....బుద్దిగా 'చందూ క్రాష్ కోర్స్' లో జాయిన్ అయ్యి....ఇదిగో పైన చెప్పిన అండపిండ బ్రహ్మండాలన్ని నేర్చేసుకున్నా! 

సరే...తాటిపండు మీద పడ్డ నక్కలాగా ముక్కుతూ...మూలుగుతూ....మా చందూ చేత తిట్లు,చీవాట్లు తింటూ....ఏడుస్తూ....ఏడిపిస్తూ.....రోజు గంటలు గంటలు ఆ జావాలో మునిగి తేలుతూ......ఎలాగో అలా పక్షంరోజుల 'జావా వ్రతం' పూర్తి చేసా!

అంతటితో అయిపోతే....ఆనందమేగా! కానీ ఇక్కడే మొదలయింది టార్చర్!

నా అందమైన 'రెజుమే' ని వజ్రవైఢూర్యములు పొదగబడిన కంఠాభరణములు...రత్నమాణిక్యములు కూర్చబడిన కంకణములు లాగా.....వివిధరకాల టేక్నాలజిలతో నింపి....రకరకాల స్కిల్స్ రంగరించి....ఎన్నో ప్రాజెక్టులు దండగా గుదిగుచ్చి అంగరంగ వైభవంగా తీర్చిదిద్దింది మా ఎంప్లాయరు నారీమణి!!

ఒకానొక సుముహూర్తాన మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది! ఇక రోజూ వెండార్లు కాల్ చేయడం.... సతాయించడం.... కాలిఫొర్నియా.... మేరిలాండ్.... ఫ్లోరిడా.... విస్కాన్సిన్... ఇలా మిషిగన్ తప్ప అన్ని రాష్ట్రాలనించి కాల్స్ వచ్చాయ్!అందరికి ఒకే ముక్క చెప్పేదాన్ని! 'మిషిగన్ సరిహద్దు దాటి...పొరుగు రాష్ట్రంలొ కాలుమోపే ఉద్దేస్యం కూడా లేదు ' అని.  ఇలా కొన్నిరొజులు సాగగా..సాగగా....

నామీద దయతలచి లోకల్ పొజిషన్ ఒకటి చూపించింది మా దేవత!!! చిన్న జాబ్.....ఎక్కవ కష్టం ఉండదు....స్టేట్ గవర్మెంట్ ప్రాజెక్ట్ అంటే....సరే అని గెంతులేసా!

ఇంటర్వ్యు రోజు రానే వచ్చింది! వాడు నన్ను జావాలో ముచ్చటగా మూడే మూడు క్వషేన్లు అడిగాడు....ఓ!  ఎగురుకుంటూ చెప్పేసా! ఇక మొదలెట్టాడు సోది.....అది ఇది అంటూ...డేటాబేస్ ,ఓరెకిల్,డీబీ2 అడగడం మొదలుపెట్టాడు!

"అన్నాయ్! నేను 'జావా' జావా' "అన్నా ఎబ్బే...వినిపించుకోడే!
ఇక సర్లే అని లైట్ తీసుకున్నా! వాడు నన్ను లైట్ తీసుకున్నాడు ;)

నెక్స్ట్

ఇక రెండో ఇంటర్వ్యు!....ఇది చాలా మంచి జాబ్! లాంగ్టర్మ్ ప్రాజెక్ట్! పెద్ద కంపెనీ! ఇక ఇది రాకపోతే వేస్ట్ అని నేను ఫిక్స్ అయిపోయా! 

కానీ మా చందూ.....'ఇక్కడ చాలామందికి ఏడాది దాటినా కానీ రాదు జాబ్! ఒక ఇంటర్వ్యు కే అలా అయిపోతే ఎలా?' అని చాలా సముదాయించి.....బుజ్జగించి...బ్రతిమాలి....బామాలి.....ఎలాగోలా నన్ను ఇంటర్వ్యూ కి  రెడీ చేసాడు!

ఈసారి అన్నీ ప్రిపేర్ అయ్యా! ఎక్కడా చాన్స్ మిస్ అవకూడదు అని ఘాట్టిగా నిర్ణయించుకున్నా!

ఇంటర్వ్యు....సాయంత్రం ఆరింటికి.....నేనే కాల్ చేసా! చేతులు వణుకుతున్నాయి.. 
మెల్లగా ఇంటర్వ్యూ మొదలయింది...

మాట్లాడా....మాట్లాడా.....
కాసేపటికి పూర్తయింది!

రిజల్ట్ నాకు స్పష్టంగా తెలిసిపోతోంది! మాటలు రాట్లేదు....పరిగెత్తుకుంటూ చందూ దగ్గరకెళ్ళి చెప్పేసా! 

'చందూ.........వాడు నన్ను మెచ్చుకున్నాడు చందూ......చాలా మంచి ఫీడ్ బాక్ ఇచ్చాడు....నేను సెలెక్ట్ అయ్యాననే అనుకుంటున్న!' అని చెప్పా!

మరుసటి రోజు సాయంత్రానికి నా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది :) 

సంవత్సరకాలపు నా గృహవాసానికి తెరపడింది! సంవత్సరం క్రితం 'విప్రో' లో వదిలేసిన జాబ్.....తిరిగి వేరే రూపంలో నా దగ్గరకొచ్చింది :) 

ఓపిగ్గా నాకు దగ్గరుండి......ప్రతిదీ విసుక్కోకుండా చెప్పి....నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన చందూ కి............... బోలెడు థాంకులు :)

అలాగే...నామీద నమ్మకం ఉంచి....ఎప్పుడు ప్రోత్సహించే అమ్మకి,నాన్నకి.....నమస్సులు :)

'ఐ హేట్ యు' అని ఎన్నిసార్లు చెప్పినా నామీద ప్రేమ ఏమాత్రం తగ్గక చివరకి నాదగ్గరకే వచ్చి సెటిల్ అయిపోయిన 'జావా' కి ధన్యవాదాలు :)

అన్నిటిని మించి....కొండంత అండగా నిలబడి నన్ను కంటికిరెప్పలా చూసుకునే మా కిట్టుగాడికి బోలెడు ముద్దులు :) 
అదండీ....అష్టకష్టాలు పడి నిష్ఠగా చేసిన జావావ్రతానికి తగిన ఫలం లభించింది :) 

40 కామెంట్‌లు:

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హార్దిక శుభాభినందనలు. మొత్తమ్మీద జావా ని ఔపాశన పట్టి సాధించినందుకు కాంగ్రాట్స్. ఆ బాసు గారిని మూడు చెరువుల ఆరు సముద్రాల నీరు తాగిస్తూ, వాడి నెత్తి మీద ఒక సహారా ఎడారి సృష్టించి, ఆనందంగా ఉత్సాహంగా మీ ఉద్యోగ పర్వం సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహా

ఆ.సౌమ్య చెప్పారు...

very good, very good...congratulations!

రవికిరణ్ పంచాగ్నుల చెప్పారు...

Congratulations ఇందుగారు. మొత్తానికి సాధించారు. అలా అని చెప్పి మా మీద (అంటే మీ బ్లాగ్ మీద) శీతకన్నేయకండే!!! :-)

వాత్సల్య చెప్పారు...

Congratulations!!!!

తృష్ణ చెప్పారు...

శుభమస్తు..:)

లత చెప్పారు...

అభినందనలు ఇందూ,అయితే ఇక జాబ్ తో బిజీ అన్నమాట

శశి కళ చెప్పారు...

జావా జుట్టు పట్టి వంచి జాబ్ సాదించినందుకు congrats.మా ఇందు ని మిస్స్ అవుతామా?
REMEMBER ME INDU.NA mail id
sasithanneeru2010@gmail.com

కృష్ణప్రియ చెప్పారు...

Congrats Indu! హ్మ్.. సంవత్సరం ఉన్నారా ఇంట్లో? మంచి బ్రేక్ తర్వాత back to work అన్నమాట

స్నిగ్ధ చెప్పారు...

Hearty Congratulations ఇందూ,keep rocking!!!
:)

Vineela చెప్పారు...

కంగ్రాట్స్ ఇందు గారు...ఇంక జాబు లో కుమ్మేయ్యండి..అబ్బ నేను కూడా ఈ వ్రతం ౩ నెలలు క్రితం మొదలెట్టి మధ్యలో వర్క్ లో బిజీ అయ్యి ఆపేసాను..నా సొంతం గా చదువుకోవడం అవడం లేదు అని నిన్నే ట్రైనింగ్ జాయిన్ అయ్యాను. మీరు నాకు కాస్త టిప్స్ చెప్పాలి మరి.

చందు చెప్పారు...

జావా లో జాబ్ కొట్టిన ఇందూ కి
జావా నేర్పించిన బావ చందూ కి
కంగ్రాట్స్...

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హార్దిక శుభాభినందనలు ఇందూ.. గుడ్ జాబ్.. అలాగే మీ కొత్త ఉద్యోగంలో మంచి పురోగతిని సాధించాలనీ.. ఆస్వాదించగలిగిన ఎన్విరాన్మెంట్ అంటే సహోద్యోగులు, బాస్, టైమింగ్స్, వర్క్ ప్రెజర్ ఇత్యాదులు మీకు అనుకూలంగా నచ్చినట్లు ఉండాలని కోరుకుంటున్నాను..

SHANKAR.S చెప్పారు...

జావాను నమ్ముకున్న వారెప్పుడూ అన్యాయమైపోలేదని మరోసారి నిరూపించారు ఇందూ గారూ..మరోసారి నిరూపించారు :) . (ఇదిగో ఆ కొత్త ఉద్యోగం లో పడి బజ్జులని, బ్లాగులని మర్చిపోతారేమో..గొడవలైపోతాయంతే.)

విరిబోణి చెప్పారు...

Congrats Indu, mee java kastaalu anni naa java kastaalaku chala daggara gaa vunnai. Any way All the best , eppudu join avuthunnaru mari?

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

అభినందనలు ఇందూ!

రాజ్ కుమార్ చెప్పారు...

ఇందు గారూ.. అభినందనలు అందుకోండీ..
మీకు శుభం కలుగుగాక!

..nagarjuna.. చెప్పారు...

Congrats Indu gaaru :)))))

ఈ కొత్త జాబ్‌లో మీరు జావాలో జాతీయ గీతం రాసేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా... ;)

ramki చెప్పారు...

U Can Do it......
I Know u can do it....
because
Basically you are Indu.... :)
Congrats

శిశిర చెప్పారు...

అభినందనలు ఇందూగారు.

Ram Krish Reddy Kotla చెప్పారు...

Java lo job kottinanduku naku chala happy ga undi... ventane ee vishyam velli maa java kittigaadiki cheptaanu.. :)

హరే కృష్ణ చెప్పారు...

:-)
Hearty congratulations Indu:)

Sravya V చెప్పారు...

Hearty congratulations ! Where is the treat :))))

అజ్ఞాత చెప్పారు...

you got a job! gr8. Congrats. I wish you all the best.

స్నిగ్ధ చెప్పారు...

నేను చెప్పాలనుకున్నది మన వేణు గారు చెప్పేసారు...సొ మీకు అలా అమరాలని కోరుకుంటున్నాను..
:)

మురళి చెప్పారు...

ముందుగా కంగ్రాట్స్!
'జావా' నేర్చుకుని తీరాలి అనిపించేలా రాశారు టపా..

ఇందు చెప్పారు...

@ బులుసు సుబ్రహ్మణ్యం:గురువుగారూ...మీరు ఇలా ఆసీర్వదిస్తే చాలు! ఇక దూసుకెల్లిపోనూ :)

@ ఆ.సౌమ్య :థాంక్యూ సౌమ్యా :)

@రవికిరణ్ :లేదండి..ఆ గోలలో పడే అసలు బ్లాగ్స్ వైపు తొంగి కూడా చూడట్లేదు....ఇక జాయిన్ అయ్యాక కొంచెం వెసులుబాటు ఉంటుందిగా...తప్పకుండా రాస్తానండీ

ఇందు చెప్పారు...

@ రిషి : Thankyou Rishi :)
@తృష్ణ : Thankyou Trishna :)
@ లత:ఇప్పటిదాకా జాబ్ కోసం బిజి...ఇకనించి జాబ్లో బిజి :)) థాంక్యూ లతగారూ :)

ఇందు చెప్పారు...

@ it is sasi world let us share said..:శశిగారూ..థాంక్యు సోమచ్! లేదండీ నేను రాస్తూనే ఉంటా :) ఎక్కడికీ పోను!

@కృష్ణప్రియ:అవునండీ...నాకు వర్క్ పర్మిట్ రావడానికి చాల టైం పట్టిందీ...ఒక నెల క్రితం వచ్చింది :) అందుకే ఇక అర్జెంటుగా జాబ్ సర్చింగ్ మొదలుపెట్టా! ఏంచేస్తాం! థాంక్స్ అండీ

@snigdha: Thankyou Snigdha :)

ఇందు చెప్పారు...

@Vineela: హ్హహ్హహా! నేను మీకు చెప్పడమా? :)))) మీరు మరీను! థాంక్స్ వినీలా!

@చందు:బావ చందూ? హ్హహ్హహ్హ!! ప్రాస బాగుంది :) థాంక్స్ అండీ :))

@వేణూ శ్రీకాంత్ :అబ్బబ్బ వేణూ కడుపు నిండిపోయింది ఈ కామెంట్ చూసి! మీరన్నవన్నీ జరిగిపోవాలని కోరుకొనింగ్స్! :) థాంక్యూ సోమచ్!

ఇందు చెప్పారు...

@ SHANKAR.S:గత నెలనించీ ఇదే తంతు జరుగుతోందీ...ఇక జాబ్లొ జాయిన్ అయితే....వారాంతాలైనా రాయడనికి తప్పక ప్రయత్నిస్తా :)

@విరిబోణి::) విరిబోణిగారూ....మీకు,నాకు బోలెడు పోలికలుటాయ్ కష్టాల్లో కూడా! :)) త్వరలోనే అండీ...మెడికల్ టెస్ట్..అవీ..ఇవీ కొన్ని మొన్ననే పూర్తయ్యయి :)

@మందాకిని: Thankyou Mandakini garu :)

ఇందు చెప్పారు...

@ వేణూరాం:థాంక్యూ సోమచ్ రాజ్!

@..nagarjuna..:థాంక్యూ నాగర్జునగారూ...హ్హహ్హ! అప్పటికే కిషన్ గారు రాసేసారు అనుకుంటా! పేటెంట్ తీసుకున్నారో ఏమో...లేకపోతే...నేనే రాసేస్తా :))

@ RAMAKRISHNA VENTRAPRAGADA said...:హ్హహ్హహ్హా! థాంక్స్ అండీ :)

ఇందు చెప్పారు...

@ శిశిర : Thankyou Sisira garu :)

@Kishen Reddy:అదేంటి కిషన్...జవాని చూస్తే...ఆమడ దూరం పరిగెట్తే నువ్వ్వా ఇలా అంటున్నది ;) చెప్పు చెప్పూ......మీ జావకిట్టిగాడూ...కీవు మని అరిచి పరిపోతాడు :))

@Sravya Vattikuti:శ్రావ్యా ఇస్తా..ఇస్తా...ఇవ్వకుండానా? మీ అందరికి బ్లాగులో విందుభోజనాలు పెడతా ఆగండీ :))

ఇందు చెప్పారు...

@Suhana: Hi my dear cuty Suhana...Thankyou somuch for ur sweet wishes :)

@snigdha :హ్హహ్హహ! చాలా థాంక్స్ స్నిగ్ధ :)

@ మురళి :అలా అనకండీ బాబోయ్...అక్కడ జావా హేటర్స్...ఇంకా డాట్నెట్ ప్రోగ్రామర్స్ ఉన్నారు...వాళ్ళు కాని ఇది విన్నరంటే....జావాని జావలో కలిపేసుకుని మింగేస్తారు!! Thankyou somuch! :)

మధురవాణి చెప్పారు...

అమ్మో... అంత కష్టపడి జావా వ్రతం చేసావా ఇందూ.. హమ్మయ్యా.. మొత్తానికి నీ కష్టానికి మంచి ఫలితం దక్కిందిగా.. CONGRATULATIONS!!!
ఆలస్యంగా చూసి ఆలస్యంగా కంగ్రాట్స్ చెప్తున్నందుకు క్షమించేయ్ ఈ సారికి.. మీ ఊరొచ్చినప్పుడు మాత్రం పెద్ద పార్టీ ఇవ్వాలమ్మా మరి.. :))

మనసు పలికే చెప్పారు...

వావ్.. ఇందూ నువ్వు సూపరు:) నాకు అసలు టైం దొరక్క ఈ మధ్య బ్లాగుల వైపు రావడం లేదు ఎన్ని పోస్టులు ఉన్నాయో నేను చదవకుండా..:(

కానీ నీ జావా వ్రతం మాత్రం నిజంగా సూపరు:) సంవత్సరం గ్యాప్ తర్వాత కూడా మంచి జాబ్ కొట్టేసినందుకు అభినందనలు. జావా నీకు ఇంకా దగ్గరగా, ఎప్పుడూ నిన్ను కాపాడుతూ రక్షిస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మనం పాపికొండలు వెళ్లినప్పుడు పార్టీ చేసేసుకుందాం సరేనా???

పద్మవల్లి చెప్పారు...

Hi Indu
Congratulations! Wish you all the success in your career. Good Luck.

జయ చెప్పారు...

కంగ్రాట్స్ ఇందూ గారూ. జావా జాబ్ ప్రేమలో మమ్మల్ని మర్చిపోకండి. మీ అనుభవాలన్నీ రాసేయాలి మరి.

ఇందు చెప్పారు...

@మధురవాణి : మధు...అవును అంత కష్టపడ్దాను ;)నువ్వు రావాలేగానీ తప్పకుండా పార్టీ ఇస్తా! :)

@ మనసు పలికే:థాంక్యూ అప్పూ! :) ఏం పాపికొండలో అప్పూ...నువ్వు,చందు చెబుతునే ఉన్నారు కాని తీసుకెళ్లరేం?? :( ఈలొగా డ్యాం కట్తేస్తారు సరిపోతుంది :(

@ Padmavalli: ThnQ Padmavalli garu :)

@జయ: థాంక్య్యు జయగారూ...ఓ! తప్పకుండా...రాస్తునే ఉంటా :)

harish చెప్పారు...

Haai akka Congratulations.. Mottam meeda ala java vratam valla ila udyogam sadincha antav.. baagundamma...

kiran చెప్పారు...

soooparu ...congratulations ..:))..నాకు పార్టీ??
ఇప్పటికి ..i hate java ..
ఎంతైనా కిట్టి గ్రేట్ కదా :)