Tuesday, July 31, 2012

ఒక వాన చినుకు!!

ఒక చిన్నిచినుకు....

మిలమిలా మెరిసిపోతున్న వాననీటి తళుకు...

నీలిమేఘాల కురులసిగలో విరిబాలగా వెలుగుతుంటే..

చల్లనిగాలి వచ్చి చెక్కిలి నిమిరి చక్కలిగింతలు పెట్టగానే...

జలజలా జారి...మధుమాసపు మంచుపూవై రాలి..

నేలమ్మ నులివెచ్చని కౌగిలిలో చేరే వేళ...

పచ్చని ఆకుల పొదరిల్లోకటి సాదరంగా ఆహ్వానిస్తే..

చిగురుటాకుల ఒడిలో సేదదీరి....

కమ్మని మన్నుపరిమళం అనుభవిస్తుంటే...

రంగురంగులరెక్కల కోక ఒకటి వస్తే...

నీకు రంగుల లోకం చూపిస్తా వస్తావా అంటే...

సర్రున జారి.... సీతాకోకరంగుల్లో కలిసిపోయి...

తోటంతా తిరిగి.... ఆటలెన్నో ఆడుకుని... పాటలెన్నో పాడుకుని...

మలిసందె వెలుగు మసకపడే మునిమాపటివేళ...

కోకమ్మ సెలవు తీసుకుని..... మల్లెపొదలో జారవిడిస్తే...

మల్లెపూల రెక్కలపై చిరురవ్వల ముక్కెరైపోయి...

మల్లెభామ మత్తులో తూగి... సందెగాలి పాటలో ఊగి...

రాతిరమ్మ చుక్కలపందిరి కింద వెన్నెలభోజనాలు పెట్టే వేళ...

జాబిలమ్మ వెండి ఊయలలో ఊరేగుతుంటే......

వెన్నముద్దల్లా విచ్చుకున మల్లెపూలతోటలోకి...

 
వయ్యారంగా నడిచి వచ్చిన ఒక చక్కనిచుక్క...

అరవిచ్చిన మల్లెల్లో అచ్చంగా ఒదిగిపోయిన వానచినుకుని చూసి...

మురిసి.....ఆమె మోమున ముద్దబంతిపువ్వు విరిసి...

మత్తెక్కించే  మల్లెలను అరచేతుల్లో పోదివిపట్టుకుని...

ముచ్చటైన ముత్యపుచినుకును ముద్దాడగానే....

 వెల్లకిల్లా ప్రేమలో పడ్డ వానచినుకు....

'ఈ జన్మకిది చాలు' అనుకుని మెల్లగా నేలతల్లి ఇల్లు చేరుకుంది....


-ఇందు

[Imagesource:Google]

27 comments:

జ్యోతిర్మయి said...

నేలతల్లి ఒడిలో చేరిన చినుకును నేను
వెన్నెల సంతకం అందుకున్న ప్రియభామిని నేను

ఎంత పుణ్యం చేసుకున్నానో
జీవన మాధుర్యం చవిచూశాను

మరుజన్మలో నేను పువ్వునవుతా
ఇందు మోమున మెరిసే చిరునవ్వునవుతా!

స్వామి ( కేశవ ) said...

చాలా బాగుందండి.. :)

స్వామి ( కేశవ ) said...

సర్రున జారి .. ,
సీతాకోకరంగుల్లో కలిసిపోయి...
తోటంతా తిరిగి.... ఆటలెన్నో ఆడుకుని...

చాలా బాగుందీ పసి అల్లరి చినుకు ..

లక్ష్మీదేవి said...

అద్భుతమైన ప్రయాణము.

శేఖర్ (Sekhar) said...

తడి ఆరని ఆ చినుకు లాగే చాల బాగుంది :))

రాజ్ కుమార్ said...

ఒక చినుకు రాలిపడింది..>>
ఈ ముక్కని దీనిని ఇలా కూడా.. ఇంత అద్భుతం గా చెప్పొచ్చా???
సలాములు.. సలాములు...!

the tree said...

చక్కగా రాశారు, అభినందనలు, వీలైతే నా కవిత పెళ్లైన ఆడపిల్లవు కదా,ఎంతైనా,,చూడండి.

రాధిక(నాని ) said...

చాలా....... చాలా ....బాగుందండి.

శశి కళ said...

చక్కనైన చినుకు ఇందు చేతిలోని
కాలానికి జారి ఇలా పై ఇంద్రధనుస్సు లాగా బ్లాగ్ లో వెళ్లి విరిసే )))

..nagarjuna.. said...

ఆ చినుకు నేలమ్మను తాకినపుడు గుబాళించే మట్టివాసనంత మధురంగా ఉంది

kiran said...

నేనొప్పుకోను ...ఒప్పుకోనంతే :(

ఫోటాన్ said...

చాలా బాగుంది ఇందు గారు !

మధురవాణి said...

This is one of the most beautiful poems I have ever read! Absolutely brilliant.. just loved it! ఇందమ్మాయ్ కి బోల్డు అభినందనలు :)

మాలా కుమార్ said...

Happy Birthday to vennela santakam .

the tree said...

happy birthday.

ఇందు said...

@jyotirmayi: భలే రాసారండీ జ్యోతిగారూ! :) థాంక్స్ థాంక్స్

@swamy: Thanq Swamy garu. Chala rojulaki naa blog loki vacharu :)

@Lakdhmidevi: Thanx andi Lakshmigaru :)

ఇందు said...

@sekhar: హహ థాంక్స్ శేఖర్!


@rajkumar: ఏదో...అలా అలవోకగా...అదన్నమాట! :)) థాంక్స్ రాజ్ :)

@the tree: తప్పకుండానండి :)

ఇందు said...

@radhika[nani]: Thanx andi Radhika garu :)

@sasi:శశి కుమ్మేసారుగా కవిత :) వావ్! భలే ఉంది :) థాంక్స్

@nagarjuna:అబ్బ! ఈ డ్రాగన్లో కూడా కవితాత్మకత ఉందన్నమాట ;) బాగు! బాగు!

ఇందు said...

@kiran: ఎందుకమ్మా కిరణూఉ ఏమయిందీఈఈ???? :P

@Photon: Thanx Harsha :)

@Madhu: చాలా థాంక్స్ మధూ డార్లింగ్! :)

ఇందు said...

@Malakumar: Gurtupettukuni maree chepparu. Dhanyavaadaalu :)

@Tree: Chala chala Thanx andi :)

kallurisailabala said...

చాలా బావుంది . చదివిన ప్రతిసారి కొత్త అర్ధాలు స్ఫురిస్తున్నాయి.

Reddy Sekhar said...

Indu gaaru...namaskaramandi..
na peru Sekhar..,4th b.tech chestna..,Madi Kadapa(Na gurinchi inta kanna avasaram ledanukunta)kani...

meeru nannu spcl ga gurtupetkovali....miku ati peeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeedddddddddddddddddddddddddda ac ni nenu.....

nijamga mi blog chusinappati nundi miku pedda fan aipoyanu.....

By the way mi anni posts lage idi kuda chala chala bavundi

Naku chala badha kalginche vishayam entante...miru chala late ga post chestunnaru month ki okati ani.....
baboy....ala vaddandi.....
Kanisam week ki okataina post cheyandi please atleast month ki 2....please andi....Eppudepudu kotta post vastunda chadiveddama ani kallu kayalu cheskuni roju mi blo open chestna....Pls kasta ekkuvaga post chesi mamalnandarni santoshimpachestarani asistu.....

Selavu :)

ఇందు said...

Sekhar reddy garu :) mee comment ki chala pedda thanks andi :) meeru entha pedda fanooo meeru rasina comment andulo badhe cheptondi. Tappakund meelanti protsaham ichevalla kosamainaa rastaanandi :) thanks for the comment. I'm really happyyyy :)

ఇందు said...

Sailu chala thanks comment ki :)

the tree said...

వినాయకచవితి శుభాకాంక్షలండి,

ఎగిసే అలలు.... said...

Indu gaaru.... mee postulanni suppero suppper..:-):-):-)
ee post ayithe vanaa pademundu vacche matti vaasanalaa... adbuthamgaa undi..:-):-):-)

చందు said...

ఏమైపోయావు ఇందూ,
నీ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు చందూ,
నీ బ్లాగులో టపాలు ఎందుకు బందు,
సమాధానం చెప్పు నాకు ముందు.....