'ట్విట్టర్'...ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పదమే కనిపిస్తోంది....వినిపిస్తోంది..
సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఈమధ్య మన దేశం లో వీరవిహారం చేస్తున్నాయ్....'ఆర్కుట్','ఫేస్ బుక్','హై 5','మైస్పేస్', ఆ జాబితాలోకే వస్తాయి...కాని వీటిల్లో 'ఆర్కుట్' దే పైచేయి....విదేశాల్లో 'ఫేస్ బుక్' కి మంచి ప్రాచుర్యమున్నా ఎందుకో మరి ఇండియా లో 'ఆర్కుట్' కే బ్రహ్మరధం పట్టారు మనవాళ్ళు....చాలా మంది వీటికి వ్యసనపరులు కూడా అయిపోయారనుకోండి !!!
తరువాత కొంతకాలానికి 'బ్లాగు' ల పర్వం మొదలయింది....చెప్పాలంటే...'అమితాబ్ బచ్చన్' గారు బ్లాగులకి చాలా ప్రాచుర్యం కల్పించారు....తన సినిమా సంగతులు....కుటుంబ విషయాలు....ఇలా అన్ని బ్లాగు రూపం లో తెలియచేసేవారు...ఇక అప్పటినించి చాలామంది బ్లాగు ని తమ అభిప్రాయాలకు రూపం గా తీర్చిదిద్దడం మొదలుపెట్టారు.కొంతమంది ప్రముఖుల బ్లాగుల వల్ల కొన్ని గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి...కానీ.. భాషని,సంస్కృతీ ని,సాహిత్యాన్ని కాపాడుకోవడానికి....తమకి తెలిసిన విషయాలను అందరికి తెలియచేయడానికి....కళలకు ప్రాచుర్యం కల్పించడానికి...ఇలా బ్లాగు అన్నో విధాలుగా ఉపయోగ పడుతోంది....ఈ 'కంప్యూటర్' యుగంలో కూడా మన సంస్కృతీ -సాంప్రదాయాలకు విలువనిచ్చి సాహిత్య సుమగంధాలను అందరికి అందిస్తోన్న బ్లాగు మరియు బ్లాగర్లకు వందనాలు....
అటు తరువాత బాగా ప్రాచుర్యం పొందినది ఇదిగో ఈ 'ట్విట్టర్' యే.....హాలీవుడ్ నించి టాలివుడ్ దాక విస్తరించిన ఈ కొత్త సంసృతికి తెరలు తీసింది సినిమా జనమే అయినా ఇపుడు ఇంచుమించు దేశం లో ఉన్న ప్రతి ప్రముఖ వ్యక్తికీ ఒక 'ట్విట్టర్' అకౌంట్ ఉండడం పరిపాటి అయిపొయింది...తమ రోజువారి కార్యక్రమాలు... అభిప్రాయాలు... అభిరుచులు.... అన్నీ ఈ 'ట్విట్టర్' లో పోస్ట్ చేయడం.... అవి చూసి అభిమానులు మురిసిపోవడం జరుగుతోంది... కొన్ని సైట్లు అయితే ప్రముఖులు చేస్తోన్న తాజా 'ట్వీట్స్' సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి. మన రాష్ట్రం లో ఈ 'ట్విట్టర్' కి విశేష ఆదరణ కలిగించి 'ట్విట్టర్ బాబు' అనే ముద్దు పేరు కూడా దక్కించుకున్న మహేష్ బాబు.....త్వరలో విడుదల కాబోయే తన కొత్త సినిమా విశేషాలని,'లోగో' ని ,అందులో తన చిత్రాల్ని కూడా 'ట్విట్టర్' ద్వారానే తన అభిమానులకి అందించారు... తమ అభిమాన హీరో/హీరోయిన్ కి స్వయంగా తామే సందేశం పెట్టవచ్చు అనే ఆనందం లో అభిమానులు 'ట్విట్టర్' లో తమ అకౌంట్లు క్రియేట్ చేసుకుని వారిని 'ఫాలో' అయిపోతున్నారు... ఇలా ఇపుడు దేశమంతా 'ట్విట్టర్' మానియా మొదలయింది.....
కాని...'ట్విట్టర్' వల్ల కొంత మేలు కూడా జరుగుతోంది...మొన్న 'పులి' చిత్రం ఆడియో రిలీజ్ అయ్యాక మహేష్ బాబు పవన్ కళ్యాన్ కి శుభాకాంక్షలు తెలిపి 'ఆల్ ద బెస్ట్' చెప్పడం...'మర్యాద రామన్న' లో సునీల్ చాల బాగా చేసాడని కితాబివ్వడం...... 'ఆయేషా' సినిమా రిలీజ్ అపుడు సోనం కపూర్ కి జెనిలియా శుభాకాంక్షలు తెలియచేయడం .....ఇదంతా చూస్తోంటే తారల మధ్య వైషమ్యాలు తొలగుతున్నట్టు ఉంది.ఎటువంటి భేషజాలు లేకుండా ఒకరిని ఒకరు అభినందించుకోవడం .......ప్రోత్సహించుకోవడం అనేది సుభాపరిణామం ......ఇంకా ముందు ముందు 'ట్విట్టర్' ఎన్ని మాయలు చేస్తుందో చూడాలి :)
'ట్విట్టర్' అనేది ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లు లాగ వ్యసనం కాకుండా మనుషుల మధ్య దూరాలు తొలగించి దగ్గరకు చేర్చే వారధి కావాలని ఆశిస్తున్నా......
మంచు పూల వాన
-
"ఈ మంచుల్లో.... ప్రేమంచుల్లో.... ఎన్నెన్నో సంగతులు...."
అని పాడుకోవాలనిపిస్తుంది ఈ మంచు చూస్తుంటే! ఈసారి డిసెంబరులో అప్పుడప్పుడు
స్నో పడుతుంటే.... క్రిస్...
12 సంవత్సరాల క్రితం
4 కామెంట్‌లు:
కొన్ని అలా జరిగిపొతూ ఉ0టాయి... :P
bagundoy nee visleshanaathamaka vivarana.
avunu telugu padalu ardhamouthayi kada meeku !
@సావిరహే: ardham kaakundanee inthaa raasanantaara?? ;)
mari facebook??
కామెంట్‌ను పోస్ట్ చేయండి