15, నవంబర్ 2010, సోమవారం

అపురూపమైన కల....


నడిరాతిరి నిదురలో ఎన్నెన్నో కలలు....
కలలు అలలై చెలియలిగట్టు దాటుతుంటే...
ఉలిక్కిపడిన రెప్పలమాటున ...
నిద్రాదేవి వీడ్కోలు తీసుకుంటే....
అరమోడ్పున విచ్చుకున్న ఆ నేత్రద్వయం,
స్వప్నలోకం విడిచి రాలేమంటే....
వాస్తవంలో కాలం  కలై కరిగిపోతుంటే...
అసంపూర్తి స్వప్నం వెలవెలబోతుంటే....
అది చూసి చలించిన మనసు,
అపురూపమైన ఆ కలను తనలో నిక్షిప్తంచేసి..
చీకటి అంచులకి మెరుపుల జిలుగులు అద్ది...
రంగుల కుంచెతో దాన్ని పరిపూర్ణం చేస్తుంటే...
తన స్థానంలో కలకి ప్రాణం పోస్తున్న మనసుని చూసి
మురిసిపోయిన నిద్రాదేవి......
ఆప్యాయంగా కళ్ళను ముద్దిడుతున్నవేళ...
తొలి తూరుపు కిరణం నేల తాకిన వేళ....
మాగన్నుగా నిద్ర పట్టింది.

14 కామెంట్‌లు:

అశోక్ పాపాయి చెప్పారు...

బాగుందడీ మీ కవిత

kiran చెప్పారు...

chaala bagundi.. :)

చందు చెప్పారు...

ఐతే మీరు మా అమ్మాయి అభిమాన యువరాణి స్లీపింగ్ బ్యూటీ టైప్ లో బానే నిద్రపోయి కలలు కంటారు. బావుంది మీ కవిత. ఏవిటో ఆ అందమైన కల, ఒక టపా కొట్టెస్తే పోలా...

మనసు పలికే చెప్పారు...

వావ్.. ఇందు గారు చాలా చాలా నచ్చింది మీ టపా..:) ఎంతగా నచ్చిందో చెప్పలేను..

రాధిక(నాని ) చెప్పారు...

బాగుందండి.

ఇందు చెప్పారు...

@అశోక్ పాపాయి :Thankyou Ashok garu.

@ వేణూ శ్రీకాంత్ :Thanx andi Venugaru.


@ kiran :Thankyou Kiran.

ఇందు చెప్పారు...

@చందు :అవునండీ...నేను కలలు కనడమేకాదు..ఇలా సగంలో ఆగిపొయిన కలలకు కంటిన్యుషన్ కూడ చేస్తూ ఉంటా! ఆ అనుభవం తోనే ఈ కవిత వ్రాసా! కల గురించి చెపాలంటే...అబ్బొ! అదో పెద్ద కథ :)

@ మనసు పలికే :Thankyou andi Aparna garu.Thankyou verymuch :)

@ రాధిక(నాని ) :Thankyou radhikagaru :)

DARPANAM చెప్పారు...

వావ్.... మీ భావుకతతో మాకళ్లముందు
స్వప్న లోకాలను సాక్షాత్కరింపరించారు

అజ్ఞాత చెప్పారు...

వావ్.... మీ భావుకతతో మాకళ్లముందు
స్వప్న లోకాలను సాక్షాత్కరింపరించారు

మాధవి చెప్పారు...

bagundandi mee kavita

చందు చెప్పారు...

చాలా బవుందండి ....మీరు కవిత బాగా రాశారు...మీ పాత కవితలు ఏమన్నా ఉంటే అవి కూడ పంచుకోవచ్చు కదా...

ఇందు చెప్పారు...

@DARPANAM / essemchelluru-darpanam : Thnaks andi.

@ మాధవి :Thankyou madhavigaru :)

@ చందు :alage chandugaaru.tappakundaa. :)

veera murthy (satya) చెప్పారు...

లలితమైన భావుకత!!!

veera murthy (satya) చెప్పారు...

indu garu namaste!

కవితా పోటీకి ఆహ్వానం

http://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html


-satya