27, జులై 2011, బుధవారం

'For Women' లో నా ఆర్టికల్!

కేవ్వవ్వ్వ్వ్!!

ఏంటి...భయపడ్డారా? ఏదైనా అరిచి చెప్పడం నాకు అలవాటు కదా మరీ!!

నా ఆర్టికల్ 'For Women' వెబ్సైట్ లో వేశారు :)

ఇందుకు ముందుగా ఈ సైట్ ఎడిటర్ గారికి ధన్యవాదాలు.

మొదట ఈ వెబ్సైట్ చూసినప్పుడు.....నాకు చాలా ఆశ్చర్యమేసింది! ఎన్నో ఆర్టికల్స్....ఆడవారికోసం!
అంతే కాకుండా...ప్రముఖుల చేత ఇవ్వబడుతున్న  సలహాలు,సూచనలు కూడా. ఆరోగ్యం,విద్య,కెరీర్,వంటలు,ఫ్యాషన్,ఆధ్యాత్మికం,.....ఇలా ఎన్నెన్నో అంశాలమీద చినచిన్న ఆర్టికల్స్ రూపంలో ఎంతో ముచ్చటగా చెబుతున్నారు!

ఇలా మహిళలు,పిల్లలు,జీవన విధానం....వీటి గురించి చక్కగా చెబుతున్న ఈ వెబ్సైట్....చాల బాగుంది!
నాకు ఈ సైట్ చాలా నచ్చింది :) ఒకసారి కావాలంటే మీరు వెళ్లి చూడండి! ఇదిగో లింక్

ఇక నా ఆర్టికల్ గురించి చెప్పాలంటే....
నా బ్లాగ్ చూసి...కామెంటులో మెయిల్  అడ్రస్ ఇచ్చి....తనకి మెయిల్ చేయమని చెప్పారు ఎడిటర్గారు.
తరువాత,
ఒకరోజు....ఇలా మా వెబ్సైట్లో 'ప్రవాసి' కాలం ఉంది ఒక ఆర్టికల్ రాయగలవా? అని అడిగినప్పుడు.....నాకు ముందు భయమేసింది! వామ్మో! నేను ఆర్టికల్ రాయడమా అని. అయినా తను..నువ్వు రాయగలవ్ అని ప్రోత్సహించి.... ముందు ఒక ఆర్టికల్ రాసి పంపమన్నారు.

నేను వ్రాసి భయపడుతూ పంపించా! అది చూసి....చాలాబాగుంది....ఇలా సిరీస్ కంటిన్యు చేయగలవా? అని అడిగినప్పుడు ఎంత హాపిగా అనిపించిందో!

అలా....ఒక పక్క నా జాబ్ ప్రిపరేషన్స్లో పడి.....సమయానికి వాళ్లకి అందించలేకపోయినా ఏమి అనుకోకుండా 'మీకు సమయం ఉన్నప్పుడే రాయండి' అని వెన్నుతట్టి ప్రోత్సహించిన ఎడిటర్ గారికి ఇంకోసారి ధన్యవాదాలు.

ఇదిగో నా ఆర్టికల్  మొదటి భాగం :)

బాగుందా?

21 కామెంట్‌లు:

SHANKAR.S చెప్పారు...

బాగా రాశారు ఇందు. నెక్స్ట్ పోస్ట్ కోసం వెయిటింగ్.

కృష్ణప్రియ చెప్పారు...

చాలా సంతోషం! ఇప్పుడే చూసి వస్తున్నా..
అభినందనలు!

తృష్ణ చెప్పారు...

congrats..good write up!

cbrao చెప్పారు...

సంతోషం ఎక్కువై లింక్ ఇవ్వటం మరిచారు. మీ సంతోషంలో మేము పాలు పంచుకుందుకు For women లింక్ ఇవ్వండి.

మనసు పలికే చెప్పారు...

మా ఇందు రాయడం, బాగోకపోవడమా.?? భలే అడిగావులే, చాలా బాగా రాసావు ఇందు ఆర్టికల్:) ఫర్ వుమెన్ లో కాస్త చోటుని సంపాదించినందుకు అభినందనలు:)) వచ్చే వారం కోసం వెయిటింగ్..

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మీ వ్యాసం చూశాను. ఆ వెబ్ సైట్ లో. ప్రవాసాంధ్రుల భావాలు చాలా బాగా వ్రాసారు.

అభినందనలు & శుభాకాంక్షలు

శశి కళ చెప్పారు...

బంగారు ఇందు యెక్కడకు పొయినా తెలుగమ్మాయి
శబాష్ అనిపించు కుంది.

ఇందు చెప్పారు...

@ SHANKAR.S: ThnQ Shankar garu :)

@కృష్ణప్రియ: :) ThnQ Krishna garu

@ తృష్ణ: ThnQ Trishna garu :)

ఇందు చెప్పారు...

@ cbrao: అయ్యో రావుగారూ...లింక్ ఇచ్చానండీ...అక్కడ 'ఆర్టికల్ ' అని ఉన్నచోట లింక్ ఇచ్చాను :) మీరు సరిగా గమనించలేదనుకుంటా...పర్లేదు...ఇదిగోండీ మీకోసం మళ్ళీ ఇస్తున్నా లింక్

http://www.forwomen.in/article.php?id=357

@ మనసు పలికే: కెవ్వ్వ్! అప్పూ నేను మునగచెట్టు ఎక్కేసా :)) థాంక్స్ థాంక్స్ :))


@బులుసు సుబ్రహ్మణ్యం :బులుసుగారూ...చాలచాల థాంక్స్ అండీ :)

@ it is sasi world let us share : ThnQ Sasi :) చాలా సంతోషమేసింది నీ వ్యాఖ్య చూసి :)

లత చెప్పారు...

ఇప్పుడే చదివాను ఇందూ బాగా రాశారు.
congrats

cbrao చెప్పారు...

షికాగొ, న్యూయార్క్ చిత్రాలు ఉంచారు వ్యాసంలో. మీరు ఆ నగరాలు సందర్శించినప్పుడు తీసినవా? మరో విషయం అమెరికాలో. మన కవితలలో గోడ మీద బల్లి, మంచంలో నల్లి అంటూ అక్కడ వ్రాయలేము. గోడలపై విద్యుత్ దీపాలకు ఆకర్షితులయే పురుగులు కూడా అమెరికా, కెనడాలలో నా దృష్టికి రాలేదు.

విరిబోణి చెప్పారు...

Baavundi Indu :) All the best for your next post :))

వేణూశ్రీకాంత్ చెప్పారు...

బాగా రాశారు ఇందు.. అభినందనలు..

రవికిరణ్ పంచాగ్నుల చెప్పారు...

బాగా రాసారు ఇందూ.. తరువాయి భాగం ఎప్పుడు?

కొత్తావకాయ చెప్పారు...

బాగా రాసారు. ప్రవాస జీవిత గమనంలో కొత్త కోణాలను ఆవిష్కరించాలని ఆశిస్తూ, అభినందనలు.

ramki చెప్పారు...

ఇందు గారు,
మీ ఆర్టికల్స్ ఎప్పుడు చదివినా ఏవో పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ వుంటాయి....
మీరు ఇలాగె దిన దిన అభివ్రుది చెందాలి అని కోరుకుంటూ.........

సెలవు...

రాధిక(నాని ) చెప్పారు...

కంగ్రాట్స్ ఇందు .బాగుంది మీ ఆర్టికల్

స్నిగ్ధ చెప్పారు...

ఇందూ,మీరు ఈ టపా రాయక ముందేఅ మీ బ్లాగులో ఈ వెబ్ సైట్ చూసి ,ఆ సైట్ ని దర్సించి వచ్చా...నిజంగానే మంచి సైట్...మీ వ్యాసమూ చదివాను...ఇంతలో మీరే టపా రాసారు ఇక్కడ...బాగా రాసారు...
:)

ఇందు చెప్పారు...

@ లత , విరిబోణి, రాధిక(నాని ): Chala thanks andi :)

@cbrao : అవునండీ....అవి నేను తీసినవే.నేను షికాగో,న్యుయార్క్ వెల్లినప్పుడు తీసినవి. నా వ్యాసంలో నేను తీసిన ఫొటోలు వేయాలని అవి పంపాను. మీరు చెప్పినది నిజమే..... బల్లులు,నల్లులు నా దృష్టికీ రాలేదులేండీ... చూడనివాటిగురించి ఎలా రాస్తాము చెప్పండీ? :)

@RAMAKRISHNA VENTRAPRAGADA said...: థాంక్యూ సోమచ్ అండీ! ఎందుకో మీ వ్యాఖ్య చూసినప్పుడల్లా కడుపు నిండిపోతుంది :)

ఇందు చెప్పారు...

@Ravikiran: Thankyou andi :)

@కొత్తావకాయ : కొత్తవకాయగారూ...చాల థాంక్స్ అండీ :)

@snigdha: Wow Snigdha munde choosesara site..:) thankyou somuch!!!!

@Venusrikant: Thankyou Venu :)

kiran చెప్పారు...

కంగ్రాట్స్ మై డియర్ :)
ఇక నీ ఆర్టికల్ గురించి సేపరాటే గ పొగడాల..?? :)