నేను కోరుకున్న ఉదయం........
నాకెప్పటినించో మంచుపొరలు ఇంకా వీడకముందే బాల్కని/పాటియొలోకి వచ్చి కూర్చుని వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగుతూ సూర్యోదయాన్ని చూడాలని :) మనకున్న నిద్రాదేవి అపారకరుణాకటాక్షాలవలన అది ఈ జన్మకి నెరవేరని కోరిక అని సరిపెట్టుకుంటువస్తున్నా! :)) కాని నాకు అంతకంటే ఎక్కువ నా కిట్టు కరుణ ఉందని(అప్పుడప్పుడూ ఏడిపించినా) మొన్నే అర్ధమయింది ;)
అసలు సంగతేంటంటే........
మొన్న లాంగ్ వీకెండ్ ఎక్కడికెళదామా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే వాషింగ్టన్ వెళ్దాం.... అసలే మొన్న భూకంపం వచ్చింది కదా.... కాస్త పరామర్శిద్దాం ఒబామని అని బయలుదేరాం ;)
మాతోపాటు వచ్చారు మాకు తెలిసినవాళ్ళయిన శర్మ,జ్యోతి :) వాళ్ళకి ఇద్దరు కవలపిల్లలు.... సన్ని,బన్ని :) వయసు మూడేళ్ళే అయినా..... అల్లరి మాత్రం ఆకాశమంత :))
హ్మ్! ఇక మా యాత్ర విషయానికి వస్తే...
సరాసరి వాషింగ్టన్ వెళ్తె ఎలా? మధ్యలో ఏమన్నా కవర్ చేద్దామని.... ఇస్కాన్ గుడికి అంటూ వెస్ట్ వర్జీనియాలో ఉన్న 'గోల్డెన్ టెంపుల్ ' కి వెళ్ళాం. ఆ రోజు రాత్రి అక్కడ ఉండి మర్నాడు పొద్దున్నె దర్శనం చేసుకుని పిట్స్బర్గ్ వెళ్ళాలని ప్లాన్. శుక్రవారం మధ్యాహ్నం ఆఫీసులకి డుమ్మా కొట్టి బయలుదేరినవాళ్ళం ఆ రోజు అర్ధరాత్రికి ఇస్కాన్ చేరాం. కొండల్లో,అడవుల్లో జీపీయస్ ఇచ్చిన తప్పు రూట్లో వెళ్ళిపోయి మళ్ళి ఎలాగొలా తిరిగి తిరిగి కెరెక్ట్ రూట్ కనుగొని ఎలాగైతేనేం అర్ధరాత్రికి వెళ్ళాం :)
ఇక పొద్దున్నే అందరూ నిద్రపోతుంటే ఎప్పటినించో ఉన్న నా కోరిక తీర్చుకునేందుకు ఆరింటికే నిద్ర లేచా :) [అంతా కృష్ణమాయ :)) ]
కిటికి బ్లెండ్స్ పక్కకి జరిపి చూస్తే.....మన గీతాంజలి సినిమాలో చూప్పించినట్టు అంతా పొగమంచు :) కనుచూపుమేరా మబ్బు నేలవాలిందా అన్నట్టు. బైటికి వెళ్ళాలంటే భయమేసింది. అసలే అడవి..... పైగా మంచు..... ఇంకా జనసంచారం లేదు.సరేలెమ్మని వేడివేడి టీ,కాఫీ లేకపొయినా అలా కిటికి పక్కన కూర్చుని ఆల్చిప్పలాగా కళ్ళు తెరిచి చూస్తు ఉన్నా.
కాసేపటికి మంచు తెరలు ఒక్కొక్కటి విచ్చుకోవడం మొదలుపెట్టాయి.సూర్యుడు ఆ మంచు దుప్పట్లని తొలగించి చెట్లని,పూవులని సుతారంగా ముద్దాడి లేలెమ్మని మేల్కొలుపుతున్నాడు.
అప్పుడే ఒక విదేశిజంట చేతిలో జపమాల తిప్పుతు వెళుతున్నారు.చక్కగా చీరకట్టుకున్న ఆమెని,లాల్చి వేసుకున్న అతన్ని చూస్తే ముచ్చటేసింది :)
ఇక ఆగలేకపోయా.చందూ చూస్తే బాగా నిదరొయింగ్స్! పాపం రాత్రి డ్రైవింగ్కి అలసిపోయినట్టు ఉన్నాడు. ఎందుకులే లేపడం...పాపం పడుకోని అని ఇక నేనే ధైర్యం చేసి ముందడుగేసా! వెంటనే ఎస్సెల్లార్ మెడలో వేసుకుని అభినవ ఫోటోగ్రాఫర్లాగా బయలుదేరా. నేను ఇలా రూంలొనించి బైటికొచ్చా జ్యోతి కూడా నాతో పాటు వచ్చారు....'పద ఒకసారి అలా తిరిగొద్దాం' అన్నారు :) ఇక ఇద్దరం చెట్టాపట్టాలేసుకుని బయలుదేరాం :)
మేము వెళ్ళేసరికే దొంగమంచుపొరలు.......సుర్యుడికే మస్కా కొట్టేసి మళ్ళి చెట్ల మీద పరుచుకున్నాయి :)) మళ్ళీ గీతాంజలి సీన్ రిపీట్.
ఇక మెల్లగా ఆ మంచులో అలాగే సన్నగా వణుకుతూ...... తడిసిన ఆ గడ్డిమీద నడుస్తూ.... దారి పక్కనే పెరిగిన బంతి,చేమంతి,గులాబి పూలు మంచుముత్యాలతో అలరారుతుంటే అవి చూస్తు... చేతిలో కెమెరాతో కనపడిన దృశ్యమల్లా బంధిస్తూ....అలా వనవిహారం చేస్తున్నాం. ఒక రెండు అడుగులు వేయగానే నెమళ్ళ క్రేంకారం వినిపించింది :) అది ఏదో పక్షి అని జ్యోతి కాదు నెమలి అని నేను గొడవ :))
కొద్ది దూరం వెళ్ళగానే ఒక అందమైన చిన్ని కొలను అందులో తెల్లని హంసలు[హంస ఇప్పుడు లేదు కదా....అవి తెల్లని పెద్ద బాతులయుంటాయ్] ఆ దృశ్యం చాలబాగుంది :) ఇక ఆ కొలను ఎదురుగా చుడగానే కృష్ణచైతన్య ప్రభువు అలౌకికానందంలో తేలిపోతూ నాట్యం చేస్తున్నారు. ఆ ప్రతిబింబం ఈ నీటిలో పడి ప్రతిఫలిస్తూ ముచ్చటగొలుపుతుంటే నేను,జ్యోతి కాసేపు అక్కడే ఉండిపోయాం :)
మళ్ళి మా నడక కొనసాగించి ఆ చైతన్యప్రభువుల విగ్రహాల దగ్గరకి బయలుదేరాం. ఆ దారంతా గడ్డిపూలు విరగబూసాయి. వాటిమీద మంచుబిందువులు పడి పూల అందం అమాంతం పెంచేసాయి. ఆ పూలని ఫొటో తీద్దామంటే కుదరలేదు :((
మళ్ళి మా నడక కొనసాగించి ఆ చైతన్యప్రభువుల విగ్రహాల దగ్గరకి బయలుదేరాం. ఆ దారంతా గడ్డిపూలు విరగబూసాయి. వాటిమీద మంచుబిందువులు పడి పూల అందం అమాంతం పెంచేసాయి. ఆ పూలని ఫొటో తీద్దామంటే కుదరలేదు :((
అక్కడ ఇంకో చిన్న కొలను దానికి ఆనకట్టా ఉన్నాయి :) దానిపక్కనే నెమళ్ళ కేంద్రం ఉంది. అక్కడ తెల్ల నెమళ్ళు, మామూలు నెమళ్ళు కలిసి వనవిహారం చేస్తున్నాయి. ఇందాక అరిచినవి అవే :))
నాకు ఆ మంచు చూస్తుంటే...'మంచు కురిసే వేళలో' పాట గుర్తుకొచ్చింది. పైకి పాడదాం అంటే మళ్ళీ జ్యోతి పారిపోతారని పాడలేదనుకోండీ ;)
కానీ అబ్బా.... ఎంత బాగుందో! చుట్టూ కొండలు.... దట్టమైన అడవులు... కొద్దిదూరంలో కృష్ణమందిరం.... మంద్రంగా వినిపిస్తున్న కృష్ణమహామంత్రభజన...... ఎదురుగా కొలను అందులో బాతులు... దాని ఒడ్డున చైతన్యప్రభువులు.... ఆ వనమంతా తిరుగుతూ అల్లరిచేస్తున్న నెమళ్ళు... పధ్ధతిగా పెంచిన రకరకాల పూలమొక్కలు.... అందాలు ఒలకబోస్తున్న గడ్డిపూలు.... రెండు కొలనులమధ్య చిన్ని వంతెన.... అక్కడే కూర్చోడానికి చిన్న రాతిబల్ల.... చెట్లమధ్యగుండా తొంగిచూస్తున్న చల్లని సూర్యుడు...... హ్మ్! ప్రపంచంలో ఇంతకంటే అందమైన ప్రదేశం ఉంటుందా? నాకు తెలిసి ఉండదేమో!
ఆ నెమళ్ళని చూస్తు, ఆ వంతెన దాటి ఆ మంచుపొరల్లో మేము మమేకమయిపోయి, అప్పుడే ఆకులు రాల్చడం మొదలుపెట్టిన వనాల్లోగుండా నడక సాగించి, మెల్లగా చెట్లపైకి వచ్చి ఆశగా తొంగిచూస్తున్న సూరీడ్ని నా కెమెరాలో బంధించి, చిరుచలి గిలిగింతలు పెడుతుండగా ఇక మా రూంకి బయల్దేరాము :)
అలా ఆ చెట్లమధ్యగుండా,మా మధ్య దూరిపోతున్న మంచుమేఘాల్ని తడుముతూ మా రూం కి చేరుకుంటున్నప్పుడు ముక్కుపుటాల్ని తాకింది కట్టెపొంగలి వాసన.....ఇంకా చిక్కటి బ్రూ కాఫీ పరిమళం :)
'మంచి రుచికల ఉదయం కొత్త సన్రైజ్' ....ఎందుకో ఈ ఏడ్ ఠక్కున గుర్తొచ్చింది :)
ఇక ఆగలేక వెళ్ళి,ముఖం కడుక్కుని చందు ని లేపి చిక్కటి కాఫీ తెచ్చుకుని ఎంచక్కా ఆ మంచులో ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ కాఫీ తగుతుంటే.....ఆహ!! స్వర్గం కాళ్ళ కింద ఉందేమో అనిపించింది ఒక్క క్షణం.
నేను కోరుకున్న ఉదయం ఇన్నాళ్ళకి నాకు దొరికింది :)
ఎన్నాళ్ళయినా ఈ చల్లటి మంచు, కొలను, నెమళ్ళు, బాతులు, విగ్రహాలు, వంతెన, చెట్లు, సూర్యుడు నా మనసుని దాటిపోవేమో!! :)
ఏదేమయినా కృష్ణమాయ కృష్ణమాయే! :)
నాకెందుకో ప్రకృతినిమించిన అందం దేనిలోను కనిపించదు. ప్రకృతి భగవంతుడి సృష్టి కాబట్టి ఆయన అందం కాస్త అడిగి అరువు తెచ్చుకుందేమో! అరువు తెచ్చుకున్న అందమే ఇంత అందంగా ఉంటే...అసలైన అందం....అదే మా కిట్టూ ఇంకెంత అందంగా ఉంటాడో కదా!
హ్మ్మ్!! :))
23 కామెంట్‌లు:
టపా టైటిలు చూసి కొంచెం కంఫూజనైంది - పడుతున్నది వానే గదా, మంచు అంటారేవిటా అని. అదన్నమాట సంగతి. మరి కిట్టుతో సావాసమంటే మాటలా, ఇలాంటి పనులే చేస్తూంటాడు!
>>చిక్కటి కాఫీ తెచ్చుకుని ఎంచక్కా ఆ మంచులో ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ కాఫీ తగుతుంటే.....ఆహ!! స్వర్గం కాళ్ళ కింద ఉందేమో
అక్కడో జలపాతం కూడా ఉంటేనా... నిజంగానే స్వర్గమే, అఫ్‌కోర్స్ జలపాతం లేకపోయినా ఆ సిట్యువేషన్‌లో ఉన్నది స్వర్గమే
చదివినంతసేపూ అక్కడ వున్నా అనుభూతి !చాల ఆహ్లాదంగా వుంది .
ఆ విధంగా మంచు కురిసే వేళలో కృష్ణమాయలో మైమరచిపోయావన్నమాట! :))
నీ అక్షరాలూ, ఫోటోలు చూస్తే తెలుస్తోంది అందమైన నీ అనుభూతి! :)
చాలా బాగున్నాయండి, మీ ఎస్సెల్లార్ ఫొటోస్..గ్రీటింగ్ కార్డ్స్ లాగ ఉన్నాయి..ఆహా కృష్ణ తత్త్వం..ఎక్కడివరకు వెళ్ళింది, అని హస్చర్య పోతూ, మీ బ్రూ కోఫ్ఫీ ని నేనూ బాగా ఆఘ్రానించాను..చక్కటి పూల తోట, మరింత చక్కటి వ్యాఖ్య్యనం..వెరసి..ఆహా ప్రకృతి ని నా లాగే ప్రేమించే వారెందరో..అని మురిసి పోతూ ..
వసంతం.
మిగిలన బ్లాగ్స్ కూడా ,వెంటనే చదివేస్తాను.. ఇదే ప్రధమం గా మీ బ్లాగ్ వీక్షణం.
అద్భుతంగా ఉంది ఇందు.
మీరు చెప్పేవరకు ఈ టెంపుల్ గురించి తెలియదు.
వెళ్ళాలి ఎప్పుడో.
ఫొటోస్ కూడా చాలా బావున్నాయి.
చాలా బావున్నాయి ఇందూ,
మీరు కోరుకున్న ఉదయం కోరుకున్నట్టు గడిపారు కద అభినందనలు
అంతా కృష్ణమాయ :)
బావుందండీ మీ మంచి రుచిగల ఉదయం :)
ఫోటోలు చాల బావున్నాయి
బావుందండీ.. ఫోటోస్ కూడా బలే ఉన్నాయ్. నాకూ చాలా ఇష్టం అలా మంచులో తిరగటం.
ఒక సూపరు ఒక కెవ్వు ఒక కేక
నేనే అక్కడ వున్నంత అనుభూతి చెందాను . ఫొటోస్ బాగున్నాయి .
మాకూ అనుభవమైంది. జిపిస్ అక్కడ పనిచెయ్యదు. ఒకసారి డెడ్ ఎండ్ కి తీసుకు వెళ్ళింది. వాళ్లకి తోట ఉంది. అక్కడ పండించిన కూరలనే వాళ్ళు వాడతారు. మనం కూడా వెళ్లి కోసు కోవచ్చు. మీ వర్ణన బాగుంది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.
మంచు కురిసె వెళలొ ...అబ్బ యెంత బాగా రాసావు
ఇందు...కాని తెల్ల నెమలి యెది?నాకు అర్దం కాలెదు.
నాకు కూడ నువ్వు రాసిన వన్ని ఇష్టం ఇందూ...
ఇంత బాగా వ్రాస్తావు కాబట్టె కన్నయ్య పై అన్ని పాటలు
వ్రాసుంటావు.
enthaki pittsburgh vachaara ledhaa ? vachhi vunte nenu aligaanu maa intiki raananduku :( raakapoinaa nee varnana,photos bavunnai :)
బాగుంది మీ అనుభూతి అండ్ ఫుటోలు...నాక్కూడా మీరు చెప్పినట్లు మంచు కురిసే వేళలో ఓ కాఫి కప్పు పట్టుకుని ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ అని ఊదుకుంటూ తాగడమంటే బోలేడంత ఇష్టం..:)
వావ్.. ఇందు నన్ను కూడా తీసుకెళ్లవా ప్లీజ్...:((( నేనూ వస్తా.. వా వా...
నిజంగా ఎంత బాగున్నాయో పిక్స్. ఫోటోలే ఇంత అందంగా ఉంటే ఇంక అసలు దృశ్యాలు ఇంకెంత అందంగా ఉండి ఉంటాయో తలుచుకుంటూ ఉంటే అక్కడికి వెళ్లిపోవాలనిపిస్తుంది ఇందూ..
ఇందూ, ఫోటోలు బాగున్నాయి. నేనెప్పుడో 15 ఏళ్ళ క్రితం చూసాను. అయినా ఇంకా కళ్ళకి కట్టినట్టు గుర్తుంది. మాకు మూడు గంటలు మాత్రమె ప్రయాణం. మొన్న జూలై లాంగ్ వీకెండ్ అప్పుడు వెళ్ళాలి అనుకుని కూడా ఆగిపోయము. అప్పటికి ఇప్పటికి గార్డెన్లో కొన్నిమార్పులు కనిపిస్తున్నాయి. పిల్లల్ని తీసుకువెళ్ళాలి తొందరలో.
మొన లాంగ్ వీకెండ్కి వాషింగ్టన్ వచ్చారా? మేము కూడా అక్కడే ఉన్నాం అప్పుడు. మిమ్మల్ని చూసా, ఇందూ అని పిలిచే లోగ వెళ్లిపోయారు. :-)
ఇందు గారు చాలా బాగున్నాయి ఫొటొస్
"మంచు, పొగమంచు,చల్లటి సూర్యుడు ,మంచులో తడిసిన గడ్డి, ప్రకృతి...,"
ఎంచుకున్న పదాలతో అల్లిన అక్షరాలమాల ...
ప్రకృతి సౌందర్యాన్ని కట్టి పడేసిన చిత్రాలు ....
మీ భావ సౌదర్యం ..... అన్నీ కలిసి కృష్ణ చైతన్య ప్రభు మెడలో మాల అంత సుందరం గా ఉంది పోస్ట్.
టపా సూపర్ ఇందూ..అందుకేగా నిన్ను కెనడా రమ్మన్నది...ఇక్కడైతే అంత తొందరగా లేవక్కరలేకుండానే ఎప్పుడు కావాలాంటే అప్పుడు చూడొచ్చు మంచు..పొగ మంచు కాదులే...పొడి మంచు...
పద్మవల్లి గారూ, మీరు కూడా మా పక్కనేనా..మీరు వచ్చెయ్యండి మరి!కానీ పిలవాలంటే కొంచెం భయంగా ఉంది లెండి.. ఎవ్వరి మాట వినని సీతయ్యకి, వారి సోదరి ఎవ్వరి మాటా వినని సీతమ్మ తోడయితే, యీ ప్రపంచం ఎలా తట్టుకుంటుందా అని!!!
ఇందు గారు ఎంత పని జరిగిందో చూసారా?
మీరు కొంచం బ్రేక్ ఇచేసరికి అసలు మీ బ్లాగ్ గురించే మరిచి పోయా...సడన్ గ ఈ రోజు ఏవో చక్కటి ఆహ్లాద కరమైన పాటలు వింటుంటే...థకి మని గుర్తుకోచారు...చుస్తే ఏముంది...అప్పుడే రెండు పోస్టింగ్స్ వేసేసారు...ఇన పర్లేదు అని ఇప్పుడు కామెంట్ తున్నాను.
డిటో సేం experience అండి నాకు కూడా....ఆ రోజు మాకు కాని gps లేకుండా వుండి వుంటే ఇప్పటికి ఏ చెట్టు కిందో పుట్ట కిందో...కంద మూల ఫలాలు తింటూ కనిపించేవల్లము మీకు... :)
gps కి ఒక పెద్ద దండం.....అసలు వేరే రూటే ఉంది అంట అండి ఆ టెంపుల్ కి....
ఏది ఐతే ఎం...చక్కగా చేరి పోయారు కదా....అసలు నా బ్లాగ్ కూడా ఈ పిక్స్ తోనే స్టార్ట్ చేశాను....చివరకు....ఏమి అప్లోడ్ చెయ్యక....బూజు పట్టిపోయింది....
చక్కగా narrate చేసారు.....
మీలో కూడా నాకు ఒక ఫోతోగ్రఫేర్ కనిపిస్తున్నారు....నైస్ పిక్స్...
ఇంతకి మన ఒబామా గారు ఎలా వున్నారో చెప్పకుండానే...ముగించేసారు.... :)
>>నాకెందుకో ప్రకృతినిమించిన అందం దేనిలోను కనిపించదు. - same pinch :))
ఏమిటో కిట్టి పోస్ట్లు మొట్టమ..భక్తి తో స్వచ్చమైన తెలుగుతో ముంచేస్తావ్...:))
చాల బాగుంది...చదువుతూ..ఉహించేసుకుని....నేను కూడా తిరిగేసా...:))
Hmmm...oka manchi coffee tagina feeling vachindi, mee post chadivi..
nene akkada vunna annattu anipistundi mee post chadivinantha sepu..
కామెంట్‌ను పోస్ట్ చేయండి