3, అక్టోబర్ 2011, సోమవారం

నోట్ బుక్ వెనుక పేజీలో!!

కాలేజి రోజులు అంటేనే ఎన్నెనో జ్ఞాపకాలు!
అసలు ఆ రోజులు తలుచుకుంటే మనసు రెక్కలు కట్టుకుని రివ్వున ఎగిరిపోతుంది.....
ఈ జ్ఞాపకాల దొంతరలోనే దొరికింది ఒక రంగుల పేజి.....అదే 'నోట్ బుక్' వెనుక పేజి.

బహుశా....ఇది అందరి కాలేజి చదువులకి వర్తిస్తుందేమో. ఎందుకంటే క్లాసులో పాఠాలు వింటూనే మాట్లాడుకునే కళ [ఈమధ్య సెల్ఫోన్లు వచ్చాయనుకోండి] మనకి నేర్పింది ఈ నోట్ బుక్స్ యే కదా! నావరకు నేనైతే ప్రతి నోట్ బుక్ ముందు,చివర రెండు పేజీలు  ఖాళీ ఉంచేదాన్ని.మరి సంవత్సరం మాట్లాడుకునే కబుర్లకి ఆ మాత్రం వదలొద్దూ! ఇక పెన్ను వాడితే ఆ రెండు పేజీలు  తొందరగా అయిపోతాయని పెన్సిల్ వాడేదాన్ని [తెలివి ;) ]

ఇక ఆ రాతల్లో ఎన్నెన్ని ఇంఫర్మేషన్లో! ఫోన్ నంబర్లు హడావిడిగా రాసుకోవాలన్నా.....మనసులో పాడుకుంటున్న పాటకి చేతిలో పెన్ను అక్షర రూపం ఇవ్వాలన్నా...... తవికలైన, కథలైన...... ముచ్చట్లైనా..... తిట్లైనా అన్నీ ఆ వెనుక పేజీల్లో పొందిగ్గా అమరిపోయేవి. అందుకే సాధ్యమైనంతవరకు మా నోట్ బుక్స్ అబ్బాయిలకి అడిగినా ఇచ్చేవాళ్ళం కాదు :)))) [ఇన్ఫో లీక్ అయిపొదూ ;) ]

అలాగే సినిమాకి వెళ్ళాలంటే 'మూవీ?' అని రాసి అందరికీ పాస్ చేసేవాళ్ళం.రావాలనుకునేవాళ్ళు వాళ్ళ పేర్లు రాసేవాళ్ళు. కానీ పాపం లెసన్ చెప్పే సార్ ఏమో మేమేదో నోట్స్ షేర్ చేసుకుంటున్నాం అనుకునేవాడు పాపం మానవుడు! ఇక ఎన్నింటికి వెళ్ళాలి? ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులున్నాయ్? టికెట్లకి సరిపోతాయా? ఇత్యాది లెక్కలన్నీ ఆ పుస్తకాలూ అటు-ఇటు మోస్తూ తిరిగేవి 


నాకు ఇదివరకు హిందీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. షారుఖ్ పాటలంటే మరీను.' సూరజ్ హువా మధం' పాటైతే పిచ్చి :)) ఆ పాట లిరిక్స్ మొత్తం నా 'సి' లాంగ్వేజ్ నోట్స్ వెనకాల ఉండేది. ఒకసారి మా సార్ క్లాస్లో రౌండ్స్ వేస్తూ....నా నోట్స్ తీసుకుని అటు,ఇటు తిప్పి చూస్తూ చివరి పేజిలో ఆ పాట చూసి.....ఒక్క క్షణం  కోపమొచ్చినా నవ్వేసి వెళ్ళిపోయారు :)) అప్పుడెంత భయమేసిందో! అయినా బుద్దొస్తుందా.....అలా రాస్తూనే ఉన్నాం :)) 

ఇక నేనైతే.... ప్రతి పేజి కార్నర్ లో బుల్లిబుల్లి బొమ్మలు వేసేదాన్ని. ఇక చివరి పేజీల్లో ఏదో చేతికొచ్చిన బొమ్మ వేయడం.....దానికి రెండు కళ్ళు,ఒక ముక్కు,నోరు రెండు పిలకలు పెట్టడం...... పక్కనున్న నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరి పేరు రాయడం....... ఇక ఆ అమ్మాయిని ఏడిపించడం! ఆ పిల్ల లబోదిబోమన్నా నోట్స్ ఇచ్చేదాన్ని కాదు. అందరూ చూసి పడి,పడి నవ్వాక అప్పుడు తీరిగ్గా ఆ అమ్మాయికి ఇస్తే.....తను ఎంచక్కా తన పేరు కొట్టేసి నా పేరు రాసి కచ్చ తీర్చుకునేది. హహహ! అయినా కూడా భలే ఉండేది...ఆ మజాయే వేరు!

ఇక నిక్ నేమ్స్ ఒక లెఖ్ఖా? హబ్బో! క్లాసులో ప్రతివారికి నేను నిక్నేమ్స్ పెట్టేదాన్ని :))) అది ఎలాగో తెల్సా? వాళ్ళ పేరు కలిసోచ్చేలా అన్నమాట. ఉదా: దున్న దివ్య,బుల్లిబల్లి, కోతి కవిత, మోహిని పిశాచి, రాజి = పి.ఐ.జి, ఇలా! అవి ఎంతగా పాపులర్ అయ్యాయి అంటే..... నా సెల్ ఫోన్లో వాళ్ళ పేర్లకి బదులు ఇవే పేర్లు ఉంటాయ్...ఇప్పటికీ :))))))))))) నన్నైతే చితక్కోట్టేసేవాళ్ళు అలా పిలిస్తే! ఎంత ఉడుక్కునే వాళ్ళో! హ్హహ్హహా! కానీ పాపం నాకు పెట్టడానికి వాళ్ళకి ఏమి దొరకలేదు :)  [నా పేరు అంత 'స్వీట్ నేం' కదా]

ఇక ఒకరోజు ఎలెక్ట్రానిక్స్ క్లాస్ జరుగుతుంది. నాకు ఈ సబ్జెక్ట్ అంటే చాలా చిరాకు. 'ఎహే సోది గోల' అని చెప్పి ఆ క్లాస్ నోట్స్ వెనుక పేజిలో ఇక ఒక కథ రాయడం మొదలుపెట్టా. క్లాస్ అయిపోయేసరికి నా కథ అయిపోయింది :)) న్యూస్ పేపర్ మీద కథలెండి ;) ఇంకా మీ మీదకి వదలలేదు నేను :)) మా ఫ్రెండ్స్ ఐతే అది చూసి......అసలు నన్ను ఒక రేంజ్లో పొగిడేసరికి మా క్లాసు అటకెక్కి కూర్చున్నా కాసేపు. అలా క్లాసులో రాసిన ఇంకో కథే.....నా 'చిట్టి చీమ కథ'.

అలాగే..... బెంచిలమీద రాసే అలవాటుకూడా మనకి అలవడింది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం 'సి' లాంగ్వేజ్ నేర్చుకోడానికి మా గుంపుగుంపు అంతా ఒక ఇన్స్టిట్యుట్ మీద పడ్డాం. అక్కడ ఒక్కక్కరికి ఒక్కో చెయిర్. దానికి రాసుకోడానికి ఒక బుల్లి బల్ల. ఇక దానిమీద ఉండేవి....బాబోయ్! 'విజయేంద్ర వర్మ.....చూసినోడి ఖర్మ', ఇలాంటి కేక పెట్టించే డైలాగ్స్ ఉండేవి. రోజు అవి చూసి నవ్వుకోలేక చచ్చేవాళ్ళం :)) 

కానీ ఇంటర్లో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ నాకు నవ్వు తెప్పిస్తుంది. మా కాలేజిలో రేసిదేన్శియాల్ స్టూడెంట్స్,డే-స్కాలర్స్ ఇద్దరికి ఒకేచోట క్లాసులు. మా గర్ల్స్ క్యాంపస్ పక్క రోడ్లోనే  గర్ల్స్ హాస్టల్. ఈ హాస్టల్ వాళ్ళు రోజు మధ్యాహ్నం లంచ్ కి హాస్టల్ కి వెళ్ళేవాళ్ళు. ఇక మిగితావారు ఇళ్ళకి వెళ్ళేవారు. మా ఇల్లు దూరం అవడంతో నేను క్యారేజి తెచ్చుకునేదాన్ని.మా క్లాసులో నేనొక్కదాన్నే ఉండేదాన్ని. ఇక హాస్టల్ వాళ్ళు చదుకోడానికి చేయిర్లు,ప్లాంకులు అక్కడే పెట్టుకునేవారు. వాటిమీద ఏవేవో రాసున్దేవి. ఎక్కువగా పవన్,మహేష్ ఫ్యాన్స్ రాసేవారు. వాళ్ళ సినిమా పాటలు,డైలాగ్స్ అలా. ఇంకా ఫ్రెండ్షిప్ కోట్స్,లవ్ కోట్స్....ఇలా బోలెడు సమాచారం ఆ ప్లాన్క్స్ మీద ఉండేది ;) నేను అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ ప్లాంక్స్ మీద రాస్తుండేదాన్ని. :)

ఒకరోజు మధ్యాహ్నం లంచ్ అయ్యాక నేను మా ఫ్రెండ్ చైర్లో కూర్చున్ని బుద్ధిగా చదువుకుంటున్నా. తీరా దాని ప్లాంక్ చూస్తే.....కొత్తగా తళతళ లాడుతోంది.నీట్ గా ఏమి రాయకుండా ఖాళీగా ఉంది. అది చూసేసరికి మన చేతులు దురద పుట్టాయి.  'అరె! నాకు చెప్పలేదేంటి ఎప్పుడు కొన్నది ఈ కొత్త ప్లాంక్? భలే బావుంది' అనుకుని ఎంచక్కా నా హైలైటర్ తీసుకుని......అప్పుడే విడుదలైన 'ఒక్కడు' ఆడియోలో పాట రాసేసా ;) 

ఒకటికి నాలుగు సార్లు అది చూసుకుని మురిసిపోయి.....కాసేపు ఆ ప్లాంక్ మీదే నిద్రపోయి....లేచి ముఖం కడుక్కుని నా ప్లేస్ కి వచ్చి కూర్చున్నా.ఇక లంచ్ చేసి అందరూ వచ్చేసారు.....గోలగోలగా ఉంది. ఇంతలో నాకు అస్సలు పరిచయం లేని ఒకమ్మాయి మా ఫ్రెండ్ చైర్ దగ్గరకొచ్చి ఆ ప్లాంక్ తీసుకుని చూసింది.ఆ ప్లాంక్ ఆ పిల్లదట. కేవ్వ్వ్వవ్వ్వ్వ్!!నేను రాసింది చూసి పళ్ళు పటపటా కొరికింది. ఆ పిల్ల పవన్ ఫ్యాన్ అట! మహేష్ అంటే పడదట! మనకేం తెల్సు? వాఆఆఅ......వా............

'ఇక్కడెవరు కూర్చున్నారు? ఈ పాట రాసిందెవరు?' అది ఇది అని చీల్చి చెండాదేస్తుంటే......అసలే సత్య హరిశ్చద్రుడి కజిన్ సిస్టర్ అయిన నేను...... 'నేనే!' అని చెప్పబోతుంటే నా ఫ్రెండ్ నోరు నొక్కేసింది. 'ఆ ఏమో మరి. మాకేం తెల్సు? అయినా నీ ప్లాంక్స్ ఇక్కడ పెట్టకు. తీసుకెళ్ళి నీ చెయిర్లో పెట్టుకో.నా చెయిర్లో పెట్టావేంటి?' అని మా ఫ్రెండు గయ్యిన పడేసరికి దెబ్బకి ఆ అమ్మాయి తోకముడిచి నన్ను కొరకొరా చూస్తూ వెళ్ళిపోయింది. మా ఫ్రెండు నన్ను నాలుగు చీవాట్లేసింది లోకజ్ఞానం అలవరచుకో తల్లి అని :)) 

హ్మ్! అప్పటినించి ఏం రాసినా.....ఎక్కడ రాసినా ఆచి,తూచి రాస్తుంటా అన్నమాట ;)

అదండీ...... నా జ్ఞాపకాల తేనెతుట్టె కదిపేసి ఆ తేనెటీగలను మీమీదకి వదిలేసా! కామెంటు పెట్టకపోతే కుట్టేస్తాయ్ మరి ;) జాగ్రత్తా! :))))))) 

18 కామెంట్‌లు:

MURALI చెప్పారు...

నా జీవితంలో ఏ క్లాసు పదినిమిషాలకంటే ఎక్కువ విన్నట్టు గుర్తులేదు. మ్యాథ్స్ విన్నా వినకున్నా నోట్సు వ్రాసుకోవాలి కాబట్టి మ్యాథ్స్ క్లాసులకి మినహాయింపు. మరేం చేసేవాడ్ని. నోట్సు వెనుక, బెంచీ మీద బొమ్మలేసేవాడ్ని, కవితలు వ్రాసేవాడ్ని, న్యూస్‌పేపర్లో వార్తల్లా క్లాసు విషయాల్ని పత్రికా భాషలో వ్రాసి అందరికీ షేర్ చేసేవాడ్ని. అవన్నీ గుర్తొచ్చాయి. ఇప్పటికీ కాన్ఫరెన్సుల్లో, క్లైంట్ కాల్స్‌లో ఇదే చేస్తుంటా.

THOTAKURI SRINIVAS చెప్పారు...

మీ జ్ఞాపకాలతో ఎక్కడికో తీసుకెళ్ళారు. చాలాబాగా వ్రాశారు. ఇవన్ని మీరు కుట్టేస్తారనె భయంతో చెప్పతున్నానుకోకండి. అద్భుతం.....

రాజ్ కుమార్ చెప్పారు...

ప్చ్... నేను చాలా మిస్సయిపోయానన్న మాట. జీవితమంటా మొదటి బెంచ్ లో కూర్చొని ఇలాంటి సరదాలకి దూరమయిపోయానా? ;( ;( వాఆఆఆఅ.... వాఆఆఆఆఆఆ..

..nagarjuna.. చెప్పారు...

>>కానీ పాపం నాకు పెట్టడానికి వాళ్ళకి ఏమి దొరకలేదు :)

ROFL...... నిజంగానే !!
పాపం వాళ్లంత ముచ్చటపడుతుంటే ఓసారి బజ్ వైపు రమ్మనొచ్చుకదా :P

రఘు చెప్పారు...

చాలా బాగుంది

అజ్ఞాత చెప్పారు...

ఒక్కసారిగా కొన్ని ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్ళారు. మేము ఫోన్ నంబర్లే కాకుండా సొంత కవిత్వాలని, కోడు భాషని కూడా ఆఖరు పేజీలో వెలగబెట్టేవాళ్ళం.

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగా రాసారండీ కాలేజీ రోజులన్నీ అలా కళ్ళముందు కదిలాయి.

vasantham చెప్పారు...

అదిరిందండి..నేనూ ఫస్ట్ బెంచ్ టైప్ ..అల్లరి చేసినా క్లాస్ రూం బయటే..క వ న శర్మ గారు అన్నట్టు అవి " బంగారు రోజులు"....ముఫై ఏళ్ళు పై అయినా కాలేజ్ అంటే, కళ్ళ లలో మెరుపులు వస్తాయి..మీకు మాత్రం నిక్ నేం లేక పోవడం అన్యాయం. మీకు తెలియ కుండ ఉందేమో??
వసంతం.

శశి కళ చెప్పారు...

మాట ల విందు..ఇందు..బాగుందా....
ఒక్కసారి కదిపావా మా తల్లె..అలా చూడు
అందరు...రియ్యుం..రియ్యుం...వెనక్కి
పొయారు...very nice

రాజ్..యెమి బాద పదకు అప్పడు రాయాల్సినవి
ఇప్పుడు బుఝ్ లొ రాస్తున్నావుగా....

మనసు పలికే చెప్పారు...

అమ్మా.. ఆశ దోశ.. మమ్మల్ని కుట్టిద్దామనే;)

ఇందు, చిన్నప్పటి రోజుల్ని భలే గుర్తు చేశావ్ లే. నీ ఙ్ఞాపకాల తుట్టె ఏమో కానీ నన్ను మాత్రం నా చిన్ననాటి రోజులకి తీస్కెళ్లిపోయావ్. అక్కడి నుండి రావాలని లేదు, ఏం చెయ్యనూ??? టపాకి సూపర్ లైక్..

ramki చెప్పారు...

ఏంటి ఇందు గారు....
ఐతే మనం క్లాసు topper ఆఆఆ?
చాల బావున్నై మీ జ్ఞాపకాలు....కాని ఇన్నాళ్ళకు ఒక విషయం అర్ధం అయ్యింది...అమ్మాయి లు ని బుక్స్ అడిగితే ఎందుకు ఇవ్వరో.....
కొంచం లేట్ గ తెలుసుకున్న... :P
ఐతే మీ లో కవియిత్రి అప్పుడు పుట్టింది అనమాట...నైస్ నైస్
కాని నేను మాత్రం...లైబ్రరీ లో మన టాలెంట్ అంత చూపించే వాళ్ళం....లైబ్రరీ అంత మనకు కొట్టిన పిండి....ఎవడి మీద ఇన కోపం వస్తే మా డిపార్టుమెంటు బుక్స్ తీసుకెళ్ళి..వేరే డిపార్టుమెంటు లో దాచేవాళ్ళం...వాడికి కాదు కదా...ఒక్కోసారి నాకు కూడా కనిపించకుండా పోయేవి... :P ( కొంచం కచ్చి తీర్చుకునే విధానం)
నిక్ names అంటారా...అబ్బో...చాల చెప్పుకోవాచు వాటి గురించి....శాంపిల్ గా కొన్ని...ఎక్ష్క్లుసివె గ మీకోసం...:)
1 . బిడ్డగాడు..
2 . మెస్సగాడు
౩. శకెఇమమ్
ఎవడి వీక్నేస్స్ తో వాడికి ఒక పేరు పెట్టేవాళ్ళం... :)
ఇప్పటికి కూడా అవన్నీ తలుచుకొని...అల మెమోరీస్ లోకి వెళ్లి పోతం...
నైస్ పోస్టింగ్...
మీ కోసం ఒక మంచి పాట... http://www.youtube.com/watch?v=6RBdF1ZZZ_I&feature=రెలతెద్
enjoy

స్నిగ్ధ చెప్పారు...

నాది కూడా సేం వేణురాం గారి కామెంటే...
అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఉందని నాకు తెలియకుండా పోయిందే...
వాఆఆఆ.....

ఛాయ చెప్పారు...

మీ జ్ఞాపకాల తేనెతుట్టె కుట్టినట్టే ఉంది.. యండమూరి "వెన్నెల్లో ఆడపిల్ల", " ఆనందో బ్రహ్మ "...ఇంకా ఎన్నో పాతరోజులు , నోట్సు రాసుకున్న ఫ్రెండ్స్ ని మళ్ళి అడిగి తెచ్చుకోవటం ........
నిజమే మీరు జ్ఞాపకాల దొంతరలని కదిపారు, అద్భుతంగా.!!!

కొత్తావకాయ చెప్పారు...

హహ్హహా.. ఎన్ని జ్ఞాపకాలు తవ్వి తోడుతున్నారు ఇందు గారూ! హ్మ్.. ఇంక నా సంగతీ చెప్పాలి కదా! చుక్కలాట, "ఊరు, పేరు, తార, సినిమా" (గుర్తుందా ఈ ఆట?), సినిమా పాటలు, దోస్తులతో కీచులాటలు, సారీలు వెనక పేజీలకెక్కి మా స్కూలు, కాలేజీ రోజులని రాగరంజితం చేసేవి.

Wonderful post! :)

Ennela చెప్పారు...

induu,
nee tapaa, sasikala gaari riyyum riyyum comment inkaa kottaavakaayagaari.."ఊరు, పేరు, తార, సినిమా"..annee superb

S చెప్పారు...

:))

చాతకం చెప్పారు...

బాగున్నాయి మీ నోట్ బుక్ ఆఖరి పేజీ విశేషాలు. "ఐ హావ్ ఎ బోయ్ ఫ్రెండ్" అని ఒక లేని మున్నాని ఊహించుకుని పాటలు కూడా పాడి ఉంటారనుకుంటా? నేను మాత్రం రోజూ శ్రథ్థగా మాస్టారి బొమ్మ గీయటం ప్రాక్టీసు చేసేవాడిని. ఒకసారి మా పరీక్ష సెంటరు వుమెన్స్ కాలేజీ లో పడింది, అప్పుడుచూసా, అన్ని బెంచీల మీదా చెత్త రాతలు. ;) అవన్నీ ఇందూ పనా? హన్నన్నా !

kiran చెప్పారు...

హిహిహిహి ఇందు same pinch ..:D
మనం కూడా పేపర్ పెన్ దొరికితే వదలం...ఇప్పటికి ఆఫీసు లో డాకుమెంట్స్ మీద గీసేస్తూ ఉంటా :D
ఇంకా బెంచిల మీద బోలెడు రాసాను....నా juniors ఎన్ని తిట్టుకున్నారో :D