ముందుగా తన కీర్తిని ఇనుమడింప చేసిన 'వందే మాతరం' గీతం తో షో కి స్వాగతం పలికిన రెహ్మాన్ మెల్లగా తన మాయ మొదలు పెట్టాడు.ఇంతలో కృష్ణ-ప్రసన్న వాళ్ళు కూర్చున్న దగ్గరకి మమ్మల్ని రమ్మన్నారు....సరే అని అక్కడికి వెళ్లి...ముందు ఇంకా చాలా సీట్లు ఖాళి ఉన్నాయని అక్కడికి కుర్చిల మీద నించి దూకుతూ వెళ్లి (ఎక్కడికెళ్ళినా మన బుద్ది పోతుందా??!!)కూర్చున్నాం ...ఇంతలో ఎప్పుడొచ్చాడో 'రోజా' సినిమా లో 'వినరా..వినరా'(తెలుగు లో కాదులెండి....తమిళం లో) పాడుతూ 'హరిహరన్' వచ్చాడు'.హరిహరన్ గాత్రం గురించి చెప్పేదేముంది?? అది నాకు ఇష్టమైన పాట....ఒక్కసారి తెలుగు లో 'వినరా....వినరా' అంటే బాగుండు అనుకున్నా...ఊహు!! నిరాశే మిగిలింది...ఆ తరువాత లతామంగేష్కర్ తో కలిసి రెహ్మాన్ పాడిన గీతం ఈ షో కే హైలైట్.ఇంతకీ లతామంగేష్కర్ అక్కడ ఉంటే వింతేముంది?? లతామంగేష్కర్ పాడిన రికార్డెడ్ వాయిస్ తో...స్టేజి మీద ఆమె 3D -లేసర్ ప్రొజెక్షన్ తో రెహ్మాన్ పాడిన గీతం అద్భుతం.ఆ తరువాత 'మైకేల్ జాక్సన్' పాటల్లో ప్రముఖమైన 'బ్లాక్ ఆర్ వైట్' పాడాడు....దానికి ఒక చిన్న పిల్లాడు...జాక్సన్ స్టయిల్ లో 'మూన్ వాక్' చేస్తూ చేసిన డాన్స్ సూపర్...ఆ తరువాత ఎన్నో అద్భుతమైన పాటలు పాడాడు...మధ్య మధ్యలో వర్ధమాన గాయని గాయకులతో కొన్ని పాడించాడు....
తరువాత హరిహరన్ పాడుతూ ఉంటే దానికి రెహ్మాన్ 'హర్మనీ' వాయిస్తూ...కొంచెం సేపు గాన కచేరి చేసారు.... అప్పటికి ఒక్క తెలుగు ముక్క చెవికి సోకక...తమిళ,హిందీ హోరు తో తుప్పు పట్టిన మా చెవులలో 'ఓ చెలియా! నా ప్రియ సఖియా!! చేజారెను నా మనసే!!' అని పాడి అమృతం పోసాడు ఒక వర్ధమాన గాయకుడు...అంతే!! చందు-కృష్ణ-ప్రసన్న తో సహా అక్కడ ఉన్న చాలామంది తెలుగువారు అందరూ ఈలలు...చప్పట్లు....బాబోయ్ అదిరిపోయింది....(తెలుగోడి సత్తా అపుడు తెలిసి ఉంటుంది రెహ్మాన్ కి).....కానీ మా ఆనందం ఎంతో సేపు నిలవలేదు....ఎందుకంటే పాడింది ఆ ఒక్క ముక్కే కాబట్టి!!
ఆ తరువాత మత సామరస్యానికి చిహ్నంగా అన్నిమతాలకు సంబంధించిన రెహ్మాన్ స్వరపరిచిన గీతాలు పాడారు....అప్పుడు వచ్చిన 'జోధ-అక్బర్' లో 'ఖ్వాజా మేరె ఖ్వాజా' పాట కి మేము కూడా సినిమా లో లాగే చప్పట్లు కొట్టాం.
తరువాత వచ్చిన 'రోబో' లో ఒక పాట మాత్రం అన్నిటికంటే నాకు బాగా నచ్చింది...చెప్పాలంటే ఆడిటోరియం దద్దరిల్లింది...రెహ్మాన్ మాజిక్ ఏంటో తెలిసేలా చేసింది...తరువాత ఆల్ టైం హిట్స్ అయిన 'చయ్య!!చయ్య!!'...'దిల్సే రే!!'...'రింగా రింగా' లాంటి పాటలతో హోరెత్తించిన రెహ్మాన్ 'పప్పు కాంట్ డాన్స్!!'(జానే తు..హిందీ సినిమా లో ది) పాట తో అందరి చేత డాన్స్ కూడా చేయించాడు....అందరూ లేచి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు డాన్స్ చేయడమే!! ఈలలు..చప్పట్లు...గోల..గోల...ఆ తరువాత కాసేపు చట్నీ సాంగ్స్ (తెలుగు,హిందీ,తమిళం అన్నీ కలిపేసి పాడారు).....కానీ ఇందులో కూడా ఒక్క తెలుగు ముక్కే ఉంది...'ఈ హృదయం...' అంటూ పాడాడు...పోన్లే ఏం చేస్తాం!! నేనైతే...దీనికే మురిసిపోయి ఓ తెగ చప్పట్లు కొట్టేసా!!...తరువాత మళ్లీ తన 'వందేమాతరం' గీతం పాడి...'జయహో' పాట తో షో ని ముగించాడు రెహ్మాన్...
షో లో స్టేజి డెకొరేషన్,లైటింగ్,ఆర్కెస్ట్రా అద్భుతం....ప్రతి పాటకి అనుగుణంగా స్టేజి మీద వచ్చే బాగ్రౌండ్స్ చాలా బాగున్నాయ్!!....రెహ్మాన్ కూడా సాధ్యమైనన్ని పాటలు తానె పాడాడు.కానీ,నిరాశపరిచింది మాత్రం 'హరిహరన్ ఎక్కువ పాడకపోవడం '.......'తెలుగు పాట లేకపోవడం'.మన తెలుగు వాళ్ళు....'తెలుగు తెలుగు' అని అరిచిన అరుపుల తో 'తెలుగు సినిమా పరిశ్రమ' కూడా ఒకటుందని....అందులో తాను కూడా పని చేసానని... తెలుగు వాళ్ళు విదేశాల్లో కూడా చాలామంది ఉంటారు అని రెహ్మాన్ గారు కొంచెం గుర్తుకు తెచ్చుకుంటే చాలు!!
రెహ్మాన్ జయహో షో పిక్స్ ఇక్కడ:
5 కామెంట్లు:
అచ్చం ఇలాగే అట్లాంటిక్ సిటి లో కూడా ...
I envy you :).షో కళ్ళ ముందు అలా చూపించారు మాకు. థ్యాంక్స్ అండీ. ఒక డవుటు,రింగ రింగ పాట రెహ్మాన్ స్వరపరచినది కాదు కదా.ఎందుకు అది కూడా పాడారంటారు?
మీరన్నది నిజమే,ఎప్పుడూ ఏవో నాలుగు ముక్కలు తప్ప రెహ్మాన్ షో లో పెద్దగా తెలుగు పాటలు వినిపించవు. షో లో స్వయంగా రెహ్మాన్ ఒక తెలుగు పాట పాడితే మన లాంటి వీరాభిమానుల ఆనందానికి హద్దేముంటుంది చెప్పండి?
హా.ఎంత చక్కని ఛాన్సు కొట్టేసారండీ.రెహ్మన్ స్తేజీ షో లలో తెలుగు పాటలు చాలా తక్కువుంటాయి.అతనే స్వయంగా పాడేవి అయితే అసలుండవు. ఎందుకో అలాగ. మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నా,అంత మంచి షో కి వెళ్ళగలిగినందుకు.పైగా అంత ఖాళీ గా ఉన్న షో..Hmm...(ఒక నిట్టూర్పు ఇక్కడ నాకా అవకాశం లేకపోయిందే అని)
@dnc : :)
@Rishi:థాంక్స్ అండీ...'రింగ రింగా' సాంగ్ 'స్లండాగ్ మిలినియర్ ' లోది...మన తెలుగు 'రింగ రింగా' కాదు... దేవిశ్రీ మిమ్మల్ని రెహ్మాన్ ని సైతం మరపించేట్టు చెసాడనుకుంటా!! :)
@ఆవకాయ :మీకు తప్పక ఆ అవకాసం వస్తుందిలేండీ....:)తెలుగు పాట లేనందుకు కొంచెం ఫీల్ అయ్యా!! కాని ఏంచేస్తాం!! ఇంతే ప్రాప్తం అనుకోవడమే!!
రెహ్మాన్ షో బాగా ఎంజాయ్ చేసినట్లున్నారు.....ఫొటోస్ బాగున్నయికానీ ,ఒక వీడియొ పెడతే మేమూ చుద్దుముకదా?:( :(....
కామెంట్‌ను పోస్ట్ చేయండి