ఇదివరకు చక్కగా పాటలు,పుస్తకాలు,కథలు,కవితలు అంటూ సాగిపోయిన నా జీవితం ఈ చక్రబంధం లో ఎరక్క వచ్చి ఇరుక్కుపోయి అటు లోపలా ఉండలేక..ఇటు బైటికి రాలేక....చచ్చే చావు వచ్చి పడింది...
పూర్వాశ్రమం లో అనగా కాలేజి రోజుల్లో ఆర్కుట్ అనబడే ఒక సైటు మహత్యం వలన ఈ అవలక్షణం నాకు అలవడింది....అందులో 'Mind jolt Games' అని ఒక దిక్కుమాలిన అప్లికషను ని ఏడ్ చేసుకుని....అందులో 'Bouncing Balls','Gold Fishing','Staries','Crazy cabbie','tic-tac-too'...గాడిద గుడ్డు..హల్వా లడ్డు అని ఏవేవో పిచ్చి ఆటలు తెగ ఆడేదాన్ని.....నేను పెట్టె అప్ డేట్స్ చూసి మా ఫ్రెండ్స్ కూడా ఆడేవారు...నువ్వా-నేనా అన్నట్లు పోటీలు పెట్టుకుని ఒకళ్ళ స్కోర్ ఒకళ్ళు బీట్ చేసుకునేవాళ్ళం...కొద్దిరోజులకి ఆ ముచ్చట కూడా తీరిపోయి ఇక ఏదో మొక్కుబడి గా ఆర్కుట్ ఓపెన్ చేసేదాన్ని....ఇక ఆ తరువాత ఉద్యోగం,భాద్యతలు...అవి ఇవి వచ్చి మొత్తం మీద నా ఆటలు అటకెక్కాయి ....
సర్లే అసలు మనకి ఏ వ్యసనము లేదు...దేనికి బానిసలం కాదు...మనం 'క్వీన్ విక్టోరియా' అని చెప్పి తెగ ఫీల్ అయిపోయి...పోయి...బ్లాగ్ ముందు బొక్కబోర్లా పడ్డాను...ఇదేదో భలే ఉందే...ఏం కావాలంటే అది రాసుకోవచ్చు అని చెప్పి దాన్ని మొదలుపెట్టా...(ఈ బ్లాగ్ కాదులెండి....నాకు ఒక ఇంగ్లీష్ బ్లాగ్ ఉంది)....అలా కంటిన్యు అవుతూ వచ్చింది...అరె! మన తెలుగులో నేనెందుకు బ్లాగట్లేదని ఫీల్ అయిపోతు అదీ మొదలుపెట్టా(ఈ బ్లాగే లెండి) ......అలా మూడు టపాలు...ఆరు కామెంట్లు తో సాగిపోతున్నంతలో...ఫేస్ బుక్ అమెరికా లో ఫేమస్ అట కదా మనం అప్పుడెప్పుడో రెండు సంవత్సరాల క్రితం మొదలెట్టిన దాన్ని కొంచెం బూజు దులుపుదాం అని చెప్పి మరిచిపోయిన అకౌంట్ తాళంచెవిని మెయిల్ కి రప్పించుకుని మరీ ఫేస్ బుక్ తలుపులు తెరిచా!!
అప్పుడెప్పుడో కాలేజిలో పురుడు పోసుకున్న ఫేస్ బుక్ అకౌంట్ ఇంకా బ్రతికే ఉంది :) అందులో నా ఫ్రెండ్స్ ఆక్టివ్ గా కూడా ఉన్నారు!! ఇంకేం...మాటలు...ఛాటులు..వాల్ మీద పోస్టులు.....కొద్దిరోజులకి ఆటలు మొదలయ్యాయి...ఆటలంటే ఆర్కుట్ లో లాగ అప్పటికప్పుడు స్కోర్ ఇచ్చేసేవి కాదు...ఇవి రోజులు...నెలలు...సంవత్సరాలు... తరబడి ఆడాలట(అదీ ముందు తెలిసి ఉంటే అసలు మొదలు పెట్టె దాన్నే కాదు )... ముందుగా 'ట్రెజర్ ఐల్' అని ఒక చెత్త ఆట మొదలుపెట్టా...నా దీవి నేనే కట్టుకోవచ్చు..నాకు కావాల్సిన చెట్లు చేమలు నేనే పెట్టుకోవచ్చు...నాకు కావాల్సిన పొలాలు నేనే వేసుకోవచ్చు (కానీ స్ట్ర్రాబెర్రీ,పైన్ ఆపిల్,రాస్పబెర్రి,వాటర్ మిలన్ మాత్రమెనండోయ్....).రోజు నా పడవలో ఒక్కొక్క దీవికి వెళ్లి ఒక పార తో త్రవ్వి..త్రవ్వి..బంగారం,మణులు,బోషాణాలు..ఇలా ఎన్నో వెలికి తీయొచ్చు.....అప్పుడప్పుడు తప్పిపోయిన జంతువులకి ఆశ్రేయం ఇవ్వొచ్చు....ఇళ్ళు కట్టుకోవచ్చు.....రకరకాల వస్తువులు నాణేలు పెట్టి కొని అలంకరించుకోవచ్చు.ఇలా మన దీవిని మనకు కావలసినట్టు గా కస్టమైజ్ చేసుకోవచ్చు.కానీ వేరే దీవికి వెళ్లి నాణేలు,డబ్బులు,వజ్రాలు సంపాదించాలి...అందుకు శక్తి కావాలి... పైన చెప్పిన పోలాల్లోవి తింటేనే నాకు శక్తి వస్తుంది (ఇదో పెద్ద గోల!! ఎనర్జీ అయిపోతే రోబో లాగ ఆగిపోతుంది మన బొమ్మ)......ఈ పొలాలు కూడా టైం కి కోత కోయకపోతే ఎండిపోతాయ్ ......ఇలా ఈ ఐలాండ్ లో అదేపనిగా త్రవ్విపోసి....కొద్దిరోజులకి నా దీవి విస్తరించాను కూడా!!
ఇక ఈ పిచ్చి ఆట నేను ఆడిందే కాకుండా పాపం ఇక్కడ M.S కోసం వచ్చిన నా ఫ్రెండ్ హిమజా కి అంటగట్టా...ఇద్దరం పోటి పడి లెవెల్స్ మీద లెవెల్స్ పూర్తి చేసేసి...ఓ రేయింబవళ్ళు ఆడేసేవాళ్ళం...పంట కోత టైం కి సరిగ్గా కోసేయాలి అనే హడావిడి,ఆదుర్దా....అదీ అర్ధరాత్రైనా..అపరాత్రైనా పంట కోతల టైం కి నెట్ ముందు ప్రత్యక్షం.....కొన్నిసార్లు వంట మధ్యలో వదిలేసి పొలం లో పళ్ళు కోసుకోడానికి వచ్చేసేదాన్ని...ఒక్కోసారి పొయ్యి మీద పెట్టిన పోపు మాడిపోయేది కూడా!! పోపు మాడినా పర్వాలేదు కానీ నా పొలం లో వేసిన పంట మాడితే ఎలా?? ఒకవేళ నాకు ఖాళి లేకపోతె ...'కొంచెం ట్రెజర్ ఐల్ ఆడిపెట్టవచ్చు కదా అలా టి.వి చూడకపోతే' అని చందు కి ఆర్డర్స్ కూడా వేసేదాన్ని.....నా పిచ్చి ముదిరి పాకన పడిందని గ్రహించిన చందు 'ఇందు నువ్వు దీనికి అడిక్ట్ అయిపోయావ్..తొందరగా దీని నుంచి బైటపడితే మంచిది' అని ఉచిత సలహాలు పడేస్తే....'ఆ!! నేను బాగా ఆడేస్తున్న అని కుళ్ళు!!'అనుకునేదాన్ని...
ఈ దరిద్రమే కాకుండా....కొత్త గా 'ఫారం విల్లె'...'ఫ్రాంటియర్ విల్లె'...'కేఫ్ వరల్డ్' లాంటి పిచ్చి ఆటలు మొదలుపెట్టా....(అవి ఇదే తరహా....ఈటీవి సీరియల్స్ లాగా అంతం ఉండదు.....ఆరంభం మాత్రమె..)...ఇక రాత్రి,పగలు ఇదే వ్యాపకం అయిపొయింది....సరదా అనుకున్నది వ్యసనం అయిపొయింది...".పొలాలు ఏమైపోతున్నాయో!!","కేఫ్ వరల్డ్ లో వంటలు ఎంతవరకు వచ్చాయో!!", "హిమజని నిన్న రెడ్ జెం పంపమన్న పంపిందో లేదో!!,'నిన్న కోడి పిల్లలకి దాణ వేసా..ఇవాల్టికి అవి పెద్దవయ్యాయో లేదో!!' ఇదే గొడవ...ఆఖరికి కలలో కూడా నేను పలుగు పార పట్టుకుని ట్రెజర్ ఐలాండ్ లో త్రవ్వుతున్నట్టు....నాకు పెద్ద నిధి దొరికినట్టు....హయ్యో!! ఏం చెప్పను!!
ఇక కొద్దిరోజులకి నాకు అర్ధమయిపోయింది....నేను వీటికి మెల్లగా బానిస అయిపోతున్నానని...(అయిపోతున్నా ఏమిటి నామొహం!! అయిపోయా!) అందుకే...ఒక సుభాముహుర్తాన .....డిజాస్టర్ రికవరీ ట్రీట్మెంట్ మొదలుపెట్టా.....గాట్టిగ నిర్ణయం తీసేసుకున్నా...ఇక ఫేస్ బుక్ ఓపెన్ చేయకూడదని...దానికి శాస్వతంగా గుడ్ బై చెప్పేయాలని....దానికి తగ్గట్టే రెండు రోజుల షికాగో ట్రిప్ కలిసి వచ్చింది...వెళ్ళే ముందు నిర్ణయించుకున్నా ....'ఇక మళ్లీ ఇంటికొచ్చినపుడు ఆ పిచ్చి ఆటలు ఆడరాదు' అని....
రెండు రోజులు..హాయిగా ఏ గోల లేకుండా గడిపాను షికాగో లో...ఇంటికొచ్చాక తీసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చింది....రెండు మూడు సార్లు వేళ్ళు గుంజాయి..'ఫేస్ బుక్ పెట్టు పెట్టు అని..' ....'ఊహు!! వీల్లేదు!!' అని మనసుకు గట్టి వార్నింగ్ ఇచ్చా!! అంతే 'టప్' అని నోరుముసుకుంది...ఆ తరువాత కొద్దిరోజులు గోల చేసేది 'ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి పెట్టు!! అప్పుడప్పుడు ఆడదాం..రోజు వొద్దులే' అని బేరసారాలు కూడా మొదలుపెట్టింది....'నోరుమూసుకో!! తెరిచావంటే ఇడ్లీ పెట్టేస్తా!!' అని చెప్పి బెదిరించా...పాపం దానికి ఇడ్లీ అంటే పడదు లెండి...ఇంకేం చేస్తుంది....కుక్కిన పేను లా పడుంది...హమ్మయ్య అనుకున్నా!!!
నేనే గెలిచా!! నేనే గెలిచా!! మనసు మీద నేనే గెలిచా!!
ఇప్పుడు ఇక ట్రెజర్ ఐల్ లో పంటలు లేవు....కేఫ్ వరల్డ్ లో వంటలు లేవు.....ఫుల్ హాప్పీస్...

23 కామెంట్లు:
enni rojulo :))
chaala funnyga chepparu. but it is really tough to win over manasu.
హహ్హహ్హా.. ఇందు గారు, చాలా బాగుంది మీ టపా.. అభినందనలండీ, మొత్తానికి గెలిచేసినందుకు..:)
ఆర్కుట్‌లో ఫేస్‌బుక్‌లో ఇన్ని ఉంటాయా..? నాకు ఇప్పటి వరకూ తెలియనే తెలియదండీ..:( ఇది అదృష్టమే అంటారా దురదృష్టం అంటారా..?;)
>>అవి ఇదే తరహా....ఈటీవి సీరియల్స్ లాగా అంతం ఉండదు.....ఆరంభం మాత్రమె..
కేకో కేక..:)
హ హ్హ హ్హ...మొన్నటిదాకా మేము (నేను +మా బ్యాచ్) ఫామ్‌విల్లేకు ఇలానే అడిక్ట్ అయ్యాం.ఐదు నిముషాలకోసారి ఎదో ఒక అప్డేట్ ఇచ్చేవాళ్లం, దూడ దొరికందనో, బాతు అరిచిందనో, రిబ్బన్ గెలిచామనో...ఏది పడితే అది. ఆ టైములో తిక్కరేగిన ఫ్రెండోకడు ఓ మెసేజ్ పెట్టాడు "నాయనలారా వ్యవసాయం సెయ్యాలనుకుంటే గ్రామాల్లోకి వెళ్ళి పొలాల్లో చెయ్యండి రూముల్లొ కుసోని కంప్యూటర్లో కాదు" అని. హ్మ్....దెబ్బకు అన్నీ క్లోజ్...
అభినందనలు
మళ్ళీ Air Xonix లాంటి ఆటలు మీ కంటికి కనపడకుండా ఉండాలని కోరుకుంటున్నా
నాగార్జున Age of Empires,Need for Speed,FIFA 10 ఆడటం లేదా?
హతవిధీ..!!
రాత్రి,పగలు,తిండి తిప్పలు మర్చిపోయి మరీ లాన్ లో ఆడేవాళ్ళం ఇప్పుడు EA Sports తో ఇపుడు నెట్టుకొస్తున్నా
నిజమే. ఈ జాల వ్యసనాలు ఒక పట్టాన వొదలవ్. గంటల గ్గంటలు మింగేస్తాయి.
అన్నట్టు ఫేస్‌బుక్ గేం ఎప్లికేషన్స్‌తో కొంచెం జాగ్రత్త - మన సమాచారాన్ని కూడదీసి అమ్ముతున్నారుట. నిన్న న్యూసులో పెద్ద దుమారం.
చాలా చక్కగా రాశారు! మీ ఆంగ్ల బ్లాగు లంకె?
>>>>అసలు మనకి ఏ వ్యసనము లేదు...దేనికి బానిసలం కాదు...మనం 'క్వీన్ విక్టోరియా<<< '.
నేను ఇంతే సేం థాట్ .... ఇలాగే అనుకుంటుంటా ... ఒకానొక టైం లో క్రికెట్ కి ఇలాగే అడిక్ట్ అయిపోయి రేయింబవల్లు TV కి అతుక్కుపోయి కాలేజి ఫస్ట్ దాటేసేసను ... ఇలా అడిక్ట్ అయిపోతామనే నేను ఆర్కూట్, ఫేస్ బుక్స్ క్రియేట్ చేసుకోలేదు
అయ్యో!!! ముందు నన్ను అడిగివుంటే ఈ పార పలుగు కష్టాలు లేకుండా మీ బ్రెయిన్ వాష్ చేసేసేదాన్ని కదా ...
హ్మ్మ్... ఇలా అయినా మంచి జరిగింది కదా ... మీరు ఫేస్ బుక్ ఓపెన్ చేసి ఉండక పోతే ఇంత మంచి పోస్ట్ మిస్స్ అయి ఉండే వాల్లం
Very funny.. I used to play FV and CW in facebook a lot and atticted to it like hell once.. but, ippudu ala kadulendi..epudo o sari open chesi friends ki replies, wall lo posts tappinchi emi cheyyatledu.. okappudu FV pagalu rathri theda lekunda aadevadini.. midnight 1 , 2 ,3 4..alaa samayam gadusthune untundi..konni rojullone 40 levels dhatesa... :-)
రెండు మూడు సార్లు వేళ్ళు గుంజాయి..'ఫేస్ బుక్ పెట్టు పెట్టు అని..' ....'ఊహు!! వీల్లేదు!!' అని మనసుకు గట్టి వార్నింగ్ ఇచ్చా!! అంతే 'టప్' అని నోరుముసుకుంది...ఆ తరువాత కొద్దిరోజులు గోల చేసేది 'ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి పెట్టు!! అప్పుడప్పుడు ఆడదాం..రోజు వొద్దులే' అని బేరసారాలు కూడా మొదలుపెట్టింది....'నోరుమూసుకో!! తెరిచావంటే ఇడ్లీ పెట్టేస్తా!!' అని చెప్పి బెదిరించా...పాపం దానికి ఇడ్లీ అంటే పడదు లెండి...ఇంకేం చేస్తుంది....కుక్కిన పేను లా పడుంది...హమ్మయ్య అనుకున్నా!!!
నేనే గెలిచా!! నేనే గెలిచా!! మనసు మీద నేనే గెలిచా!!
:))))) చాలా బాగా రాసారండి .శుభాకాంక్షలు ఇందు గారు .మీ మనసుని మళ్ళి మీ ఆధీనం లోకి తెచ్చుకున్నందుకు.
@భాను :ఇప్పటికి ఒక పదిహేను రోజులనుకుంటా ;)
@ravi:థాంక్యూ!! అవును.చాలా కష్టం :(
@మనసు పలికే:చాలా థాంక్స్ అండీ మనసు పలికె గారు!! అవునండీ ఇంకా చాలా ఉంటాయ్!!మీ అదృష్టం,ఆర్కుట్ వాడి దురదృష్టం... :D
@..nagarjuna.. :నాకు ఇలాంటి పంచ్ లు పడ్డాయి....అయినా కూడా అకౌంట్ సెట్టింగ్స్ మార్చి మరీ ఆడిన ఘనురాల్ని
@హరే కృష్ణ :థాంక్స్ అండీ హరిక్రిష్ణ గారు.వద్దండీ బాబూ!! వాటికి ఒక దణ్ణం!!
@కొత్త పాళీ :హ్మ్!! అందుకే ఇక ఫేస్ బుక్ ముట్టుకోను గా!! So no probs!!
@కృష్ణప్రియ:థాంక్స్ క్రిష్ణప్రియ గారు...నా ఆంగ్ల బ్లాగు కొంచెం ప్రైవేట్ అండీ.ఇంచుమించు అది నా డైరీ లాంటిది...అందుకే అందరికి ఇవ్వలేను ఆ లింక్. దయచేసి మన్నించండీ!! :(
@శివరంజని:నేను క్రికెట్ కి కాదు గానీ గంగులీ కి వీరాభిమానిని... అందుకోసమే క్రికెట్ చూసేదాన్ని...గంగులీ లేడు....క్రికెట్ లేదు :) మంచిదైంది మీరు ఆ అకౌంట్స్ తెరవకపోవడం....అదొక వ్యసనం..అంటుకుంటే వదలని bubblegum :D.నా పోస్ట్ నచ్చినందుకు Thankyouuuu :)
@Ramakrishna Reddy Kotla:నేను మూడునెలల్లో 68 లెవెల్ కి వచ్చా!! దీన్ని బట్టి అర్ధం చేసుకోండి నేను యే రేంజ్ లో ఆడానో!!
@రాధిక(నాని ):థాంక్యూ థాంక్యూ రాధిక గారు :)
ఇందూ నేనూ ఈ గెంస్ కి విపరీతం గా అడిక్ట్ అయ్యాను ఓసారి..ఫిష్ టైకూన్ లో ఫిష్ లని పెంచడం అమ్మడం కొత్త ట్యాంకులను కొనడం..వాటికి మందులు మాకులు... అయ్యబాబోయ్ ...నాకు తోడు నా పిల్లలు..వాళ్ళను కూడా చెడగొడుతున్నావ్ అని శ్రీవారి కేకలు ,చిన్నా పెద్దా ఆటలు అని తేడాలు అస్సలు లేవు నాకు... పోకర్,కేక్ మేనియా, డ్రెస్స్లు వేయడం .మేకప్పులు పూయడం ..వంటలు ...అబ్బో మళ్ళీ గుర్తు చేసారుగా ..
@నేస్తం:హ్మ్!! నాలాంటివాళ్ళు ఉన్నారన్నమాట :)నాకు అంతే చిన్నా,పెద్దా గేంస్ అని లేదు...ఏది బాగుంటే అది ఆడేయడమే!! అందుకే ఇలా తయారయ్యా:D
చాలా బాగా వ్రాసారండీ మీఋ ఈ టపా.. చాలా సరళముగా, మంచి హాస్యముతో - మీ బాధలు చెబుతూ దానితో పాటూ మమ్మల్ని అలా అడిక్ట్ కావద్దని సున్నితముగా హెచ్చరించినందులకు కృతజ్ఞతలు..
చాలా బాగుంది మీ టపా. నాకు కూడా ఇలా ఫేస్ బుక్ లో ఇలాంటి గేంస్ ఉంటాయని తెలీదు. నేను మా అబ్బాయితో Miniclip ఆడుతాను అంతే!!! అందులో ఉన్న గేంస్ కూడా ఒక రకంగా అడిక్టే...
@ Raj :Thankyou Raj.
@ snellens :ఇవేమిటీ చాలా గేంస్ ఉంటాయ్.కాని అటుపక్కకి వెళ్లకపోవడమే మంచిది :)
chala bagundhandi
@naren:Thankyou naren.
durmaargurala....
naku aa treasure isle antagattesi.....nuvvu odilincheskuntava.....
nenu inka odala kunda aadesthunna...
chaduv maanesi marii aadesthunna... ma prents tho matladatam masei marii aadesthunna
na bf tho chat cheyyatam aapesi mari aadesthunna.....
emaipothanoo ento ila aadesthu aadesthu...
vati sangathi sare kani naku urgent ga oka green gem, oka monkey wrench pampinchu
@ HiMa : hahahahahhahahhahahahahahahhhahahahahahah(villan laugh) :P ;) :D
నాకు ఇలా బ్లొగ్ కి బాక్ గ్రౌండ్ ఎలా చెయ్యలో నెర్పించరూ ప్లీస్
ennela
కామెంట్‌ను పోస్ట్ చేయండి