Wednesday, October 27, 2010

ఆరెంజ్...ఒక రేంజ్ పాటలు...

నాకు ఈ ఏడాది నచ్చిన వాటిల్లో ఈ 'ఆరెంజ్' సాంగ్స్ టాప్ లో ఉన్నాయి..మొన్నటిదాకా 'తకిట..తకిట' బాగున్నాయి అనుకున్నా...అవే ఎక్కువగా విన్నా కూడా....ఖలేజ,బృందావనం వచ్చినా ఏదో ఉన్నాయ్ కానీ పాటల్లో 'సోల్' లేదు.ఆరెంజ్ లో అన్నీ పాటలు నచ్చేసాయ్...నాకు ఎక్కువ సాఫ్ట్,మెలోడి,క్లాసి టచ్ ఉన్న సాంగ్స్ ఇష్టం...అలా అని మరీ సుత్తిగా,మెల్లగా ఉండే స్లో సాంగ్స్ కూడా ఇష్టం ఉండదు...పాట మనసుకి ఆహ్లాదంగా ఉండాలి....పదే పదే వినాలి అనిపించాలి.అర్ధం కానీ లిరిక్స్ ఉన్నా...ఎక్కువ డ్రం బీట్స్  ఉండి తలనొప్పి తెప్పించినా.... చాలా చిరాగ్గా ఉంటుంది.

హారిస్ ఇంతకుముందు చేసిన తమిళ మూవీస్ అన్నిటికీ మంచి మ్యూసిక్  ఇచ్చాడు కానీ ఎందుకో తెలుగు లో 'వాసు','సైనికుడు','మున్నా' పాటల్లో లోపం ఉంది అనిపిస్తుంది.ఒకటి రెండు పాటలు బాగున్నా...పరిపూర్ణంగా ఆడియో మొత్తం నచ్చేసింది అని చెప్పేలా లేవు...మళ్లీ 'ఘర్షణ' బాగా చేసాడు.ఇప్పుడు 'ఆరెంజ్'....సింప్లీ సూపర్బ్.కారుణ్య పాడిన 'ఊల ఊలాల' పాట ఐతే తెగ నచ్చేసింది...అలాగే 'నేను నువ్వంటూ' కూడా...కారుణ్య తెలుగు వాడె అయినా మన వాళ్ళెందుకు సరిగ్గా ఉపయోగించుకోరో!! 'రూబ రూబ' కూడా కొత్త గా బాగుంది. ఇక కార్తిక్ పాడిన 'చిలిపిగా' సాంగ్ కొంచెం బాధ మిక్స్ అయి ఉంది.'హలో రమ్మంటే' హుషారుగా సాగిపోతుంది.ఇక టైటిల్ సాంగ్ నా చివరి చాయిస్.

వీటిల్లో ఇంకో స్పెషాలిటి...డ్యూయట్స్ లేకపోవడం....ఉన్న ఆరు పాటలు హీరో మీద ఫోకస్ చేసినవే...కానీ అన్నిటిలో హీరోయిన్ గురించి పాడినవే......ప్రేమ,విరహం,బాధ,సంతోషం కలగలిపిన వనమాలి సాహిత్యం బాగుంది....ఇక అసలు సినిమా ఎలా ఉంటుందో ఏమో కానీ....ఈ పాటలు మాత్రం నా పర్సనల్ కలెక్షన్స్ లోకి చేరిపోయాయి happy

నిన్నటినించి...ఇంట్లో,కార్లో....ఎక్కడ చూసినా ఈ పాటలే...పెట్టి పెట్టి చందుగారి చెవుల తుప్పు వదిలించేస్తున్నాtongue

8 comments:

చందు said...

ఐతే, ఆరెంజ్ పాటలు వినబుల్ అన్న మాట. నాకు వాసు పాటలు నచ్చాయి. అందులో "నమ్మవే అమ్మాయి" స్లో సాంగ్ ఐనా బావుంది.

sivaprasad said...

orange songs bagunnavi

మనసు పలికే said...

ఇందు గారు, పాటల సంగతి నాకు తెలియదు కానీ, మీ టపా మాత్రం బాగుంది..:) ఇప్పుడే వింటా.. మళ్లీ కామెంటుతా..:))

రాధిక(నాని ) said...

ఆరెంజ్ పాటలు అంత బాగున్నాయ?ఐతే ఇప్పుడే డౌన్ లోడ్ చేసేయాలి.

ఇందు said...

@ చందు : avunu. Melodious gaa baagunnay. Mass beats maatram undavu.

@ sivaprasad: Yup!! :)

@మనసు పలికే:Thankyou :) vineyandi.vineyandi.Nachchakapote titukokandi. :)

@రాధిక(నాని ) :Melodious gaa unnaayandi. Manasuki hayiga undi vintunte.

మధురవాణి said...

నాక్కూడా నచ్చాయి గానీ, కొంచెం విన్న ట్యూన్స్ లా అనిపించాయి. కానీ, అన్నీ పాటల్లో వినిపించిన గొంతులు మాత్రం సూపర్! :)
మీరు సనికుడు పాటలు విన్నారా? అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా 'మాయేరా.. మాయేరా' పాట చాలా బాగుంటుంది. సెల్యూట్ అని ఇంకో సినిమాలో కూడా ఒక పాట బాగుంటుంది.

ఇందు said...

అవునండి..మహెష్ బాబు వీరాభిమాని అయిన నాకు తెలియదా!! :డ్ 'ఒరుగల్లు ' పాట! అలగె సెల్యూట్ లో 'నిన్నేనా' పాట చాలా రోజులు నా కాలర్ ట్యూన్. సైనికుడు లో ఆ 'ఆడపిల్ల అగ్గిపుల్ల 'సాంగ్ నాకు చాలా చిరాకు.అలగే మున్నాలో కూడా కొన్ని సాంగ్స్ బాలేవు.'మనసా' సాంగ్ బాగుంటుంది. కాని హారిస్ ఆల్బం మొత్తం నాకు నచ్చడం ఇదే మొదటిసారి అంటున్నా :)

vennela kumar said...

HAI I AM VENNELA KUMAR FROM VIJAYAWADA
ORANGE SONGS GOOD