1, సెప్టెంబర్ 2011, గురువారం

మా ఇంటి గణపయ్య :)

ఉండ్రాళ్ళ మీదకి దండు పంపూ....గణపయ్యా....
కమ్మని నెయ్యి కడు ముద్దపప్పు గణపయ్యా....
ఓ బొజ్జ గణపయ్య...నీ బంటు నేనయ్యా...

ఈ పాట చిన్నప్పుడు ప్రతి వినాయకచవితికి పొద్దున్నే మా టేప్రికార్డర్లో మమ్మల్ని మేలుకొలిపేది :) ఇవాళ పొద్దున్నే నాలుగింటికి ఈ పాట నేనే పాడుకుంటు లేచి.... అన్ని నైవేద్యాలు చేసి.... గణపయ్యకి బోలెడు వండిపెట్టి... ఇంకా చక్కగా పూజ చేసుకుని అంతా అయ్యేసరికి పది :) అసలే వీక్ డే కదా... అంతా ఉరుకులు,పరుగులు లాగా అయిపోయింది :) 

ఇక అట్టే మీకు నా సోదంతా చెప్పి మిమ్మల్ని విసిగించనులే... పిక్స్ పెట్టా..చూసి...తరించేయండి మా ఇంటి గణపయ్యని :) 

గణపయ్యకి ఇష్టమని..ఉండ్రాల్లు,మోదకాలు,గారెలు,పులిహోర,పాయసం చేసా :) వాటికి తోడు.... టమటా పప్పు, బెండ, దొండ కూరలు.. పులుసు.. ఇంకా వడపప్పు,పానకం :) ఇక మామిడి, చెరుకు, అరిటి, ఆపిల్, నారింజ, ద్రాక్ష, పీర్స్, మొక్కజొన్న కూడా పెట్టాను. మరి సరిపోయాయో లేదో బుజ్జిగణపయ్య బుల్లి కడుపుకి :)


ఇంకా పూజ మొదలుపెట్టకముందు బియ్యప్పిండితో ముగ్గేసి...బియ్యంపోసి గణపతిని,వాళ్ళ డాడి శివయ్యని,మా ఇలవేల్పు వెంకీని, ఆయన భార్య లక్ష్మిని పెట్టాను :) 


మా గణపయ్య పూజకి ఎంతముచ్చటగా రెడి అయ్యాడో చూడండీ :) 


శ్ర్రీ మహాగణాధిపతయే...పుష్పం పూజయామి :) 


శ్ర్రీ మహాగణాధిపతయే...పత్రం పూజయామి :) 


కదళీఫల-నారికేళా సహిత నానావిధభక్ష్యభోజ్యం మహానైవేద్యం సమర్పయామి :) 


అంతే...పూజయిపోయిందోచ్! కథవిని అక్షతలు వేసుకుని...తోరం కట్టుకుని గణపతి ఆశీర్వాదం పొందండి :)

సరే...మరి...అందరికి ఇంకొక్కసారి 'వినాయకచవితీ శుభాకాంక్షలు :)


31 కామెంట్‌లు:

హరే కృష్ణ చెప్పారు...

ఇందు, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు :))

ఆహా ఆ ఫొటోస్ చూస్తుంటేనే నోరూరింగ్స్
చాలా శ్రద్ధగా ఒక గోడ కడుతున్నట్టు గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్దతిగా పూజ చేసావు :))

గణపతి బప్పా మోరియా,మంగళ మూర్తీ మోరియా!!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వినాయకుడిని చాలా చక్కగా పూజించారు
మీకు వినాయకచవితి శుభాకాంక్షలు

ఆత్రేయ చెప్పారు...

మా ఇలవేల్పు వెంకీని, ఆయన భార్య లక్ష్మిని పెట్టాను :)
మీరు దగ్గుబాటి వెంకటేష్ నీ
మంచు లక్ష్మిని కొలుస్తారా.. మంచిది
దేవుళ్ళని పట్టుకొని అలా నిక్స్ తో పిలవటం మళ్ళీ కొలవటం కూడానా హన్నా..
పెద్దాడిని చెప్తున్న చెంపలేస్కోని దండం పెట్టుకోండి.

సిద్ధిగణపతి మీకు సిరులనొసగి సదా శ్రేయస్సుకలిగించాలని ప్రార్ధిస్తున్నాను.

వినాయకచవితి శుభాకాంక్షలు

పద్మవల్లి చెప్పారు...

చాలా బాగున్నాడు గణపతి ఇందూ. పిండి వంటలు కూడా బాగున్నాయి. మీకు, మీ చందు గారికి వినాయక చవితి శుభాకాంక్షలు.

SHANKAR.S చెప్పారు...

మొదటి ఫోటో కేక. అబ్బో చందు గారికి ఇన్ని చేయడం వచ్చా?

Sravya V చెప్పారు...

బావున్నాయండి మీ పూజ విశేషాలు !
శంకర్ గారు :)))

కొత్తావకాయ చెప్పారు...

భలే ఉన్నాడు మీ గణపతి, మీరు చేసిన వంటలూ కూడా! వినాయక చవితి శుభాకాంక్షలు.

బంతి చెప్పారు...

మీ బుజ్జి వినాయకుడు , బోల్డు వంటలు, కూసిన్ని కుటోలు ... సూపరండి

స్నిగ్ధ చెప్పారు...

కెవ్వ్...ఇందూ ఇంత ఓపికగా అన్ని వంటలు చేసినందుకు మీరూ గ్రేటో గ్రేట్...మీ బుజ్జి గణపయ్య పిక్స్ బహు ముచ్చటగా ఉంది...మా గురువు గారి డైలాగే నాదినూ..గణపతి బప్పా మోరియా,మంగళ మూర్తీ మోరియా!!

చాతకం చెప్పారు...

వినాయకచవితి శుభాకాంక్షలు

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అదేమిటో ఆశ్చర్యం. శంకర్ గారి డౌట్ నాకూ వచ్చిందండోయ్. ..... దహా

శశి కళ చెప్పారు...

మా వంటలు అయినాక చూద్దామని ఇప్పుదు చూసా..
కన్నయ్యా నీ కంటె గణెశ్ యెక్కువ అయిపొయాడు
ఇందూకి చూద్దువు రా....ఒమ్ గణెషాయనమః

అజ్ఞాత చెప్పారు...

akka,nee vinayakudu chala muddu muddu ga unnadu. nenu kuda eco-friendly ganesha ni thayyaru chesanu. chala manchiga decorate chesave. happy ganesh chaturthi!:)!:)!:)!:)

ఛాయ చెప్పారు...

హన్నన్నా... పూజ మధ్యలో ఫోటోలు తీశారా? అంత బ్లాగ్ మహిమ.... ఐతే ప్లాన్ చేసిన విధానం ఒకే.

kiran చెప్పారు...

బుజ్జి బుజ్జి గణపయ్య ...sooper cute :)
ఎంత ఓపిక ఇందు....పొద్దున్నే లేచావా ..ఏంటో ఈ మధ్య నువ్వు కూడా పనులు చేసేస్తున్నావ్...:P
i m proud of u..indu..proud of u (కళ్ళు తుడుచుకుంటూ...)

కొత్త పాళీ చెప్పారు...

పనికి వెళ్ళాల్సిన రోజున కూడా చక్కగా పద్ధతిగా జరుపుకున్నారు. సంతోషం. ఈ సారి నా చేత్తో వినాయకుణ్ణి చెయ్యలేకపోయాను ఇతర పనుల వత్తిళ్ళతో. అందుకని మేంకూడా టెరకోటా వినాయకునికే పూజచేసుకున్నాము.

నందు చెప్పారు...

meeku vinayaka chavithi shubakankshalu....

Ennela చెప్పారు...

అబ్బో అబ్బో..ప్రసాదంస్ చాలా బాగున్నాయి...కొన్ని ప్యాక్ చెయ్యచ్చుగా...

ramki చెప్పారు...

mee vinayakudu mee poojalo munigipoyi kanipinchatam ledu indu garu........
belated vinayakachavithi shubhakankshalu..... :)

chkc చెప్పారు...

enti vennelasantakam garu eemadya empostlu rayadam manesaru...malanti fans emaipotaru cheppandi.....

ఇందు చెప్పారు...

@Hare: హ్హ్హహ్హ :)) థాంక్స్ హరే! మహేష్ డైలాగ్ రిపీట్ చేసినందుకు :)))

@ రాజి: థాంక్యూ రాజి :)

@ఆత్రేయ:మాష్టారు...మీ ఇలవేల్పు ఎవరన్నా సినిమా స్టారా???? అహ....మీరు నన్ను అడుగుతుంటేనూ వింతాగా అనిపించి అడిగాలెండి :))
నాకు ఉహ తెలిసినప్పటినించి దేవుడిని నా ఫ్రెండ్ గానే భావిస్తున్నా! ఫ్రెండుని ఎలా అయినా పిలవొచ్చు కదా! భక్తిభావనలో...'మైత్రీభక్తీ' కూడా ఒకటి..మీకు తెలుసనే అనుకుంటున్నా! కాబట్టీ...నేను ఏ చెంపలూ వేసుకోనంక్కర్లేదు :))))))))))) మీ ప్రార్ధనకు నా ధన్యవాదాలు :)

ఇందు చెప్పారు...

@ Padmavalli: ధన్యవదాలు పద్మగారు :)

@ SHANKAR.S: ఎందుకండీ మీకు నా వంట మీద అంత అనుమానం....మా చందు వంట మీద అంత అభిమానం? మేల్ డామినేషన్ ;)

@ Sravya Vattikut:థాంక్యూ శ్రావ్యా!

ఇందు చెప్పారు...

@ కొత్తావకాయ: కోవా గారూ...మీకు మా గణపతి నచ్చాడా! చాలా థాంక్స్ అండీ :)

@ బంతి :హ్హహ్హహ! ఆఫీస్ కి వెళ్లే హడావిడిలో కాసినే పెట్టా కుఠోలు ;) థాంక్స్ థాంక్స్

@snigdha: థాంక్యూ స్నిగ్ధ! మీరు నా ప్రతి టపాకి ఓపిగ్గా కామెంటుతున్నారు. నేనే....మీ బ్లాగులోకి వచ్చి చూదట్లేదసలు. అయాం సారి :( టైం ఉండట్లేదు :((

ఇందు చెప్పారు...

@ చాతకం: Thankyou Chatakam garu :)

@ బులుసు సుబ్రహ్మణ్యం: వస్తుంది..వస్తుంది...శంకర్గారికి ఇచ్చిన సమాధానమే మీకునూ.... దు.హా ;)

@ శశి కళ :అమ్మో...తల్లీ శశీ....నువ్వు నాకు కిట్టుకి మధ్య అగ్గిపుల్ల గీసేట్టున్నావ్! ;) కిట్టు శశ్ ఏం చెప్పినా నమ్మకు ;) హ్హహ్హహహ!

ఇందు చెప్పారు...

@Suhana : Wow! Cuty thanks for the comment :) Nuvvu super asalu :) anduke eppudu bujjibujji panulu chestu untav! Thankyou once again sweety!

@ ఛాయ :కాదులేందీ...కొబ్బరికాయ కొట్టాల్సొచ్చినప్పుడూ....ఏదన్నా తేవడానికి లేచినప్పుడూ అలా తీసాను :) ఇవే కదండీ మరి తీపిగుర్తులు! :)

@ kiran: హ్హహ్హహ్హ! కిరణ్....నువ్వు మరీను ;) అంతలా పొగిడితే ఎలా? ఇప్పుడు దగ్గర్లో మునగచెట్టు కూడా లేదాయే ఎక్కుదామంటే ;) కర్చీఫ్ ఇవ్వనా తుడుచుకోడానికి ;)

ఇందు చెప్పారు...

@ కొత్త పాళీ :అందుకనే మాష్టారు అంతపొద్దున లేచింది. అయినా టైం సరిపోలేదు :) మేమూ అంతే...ఏం చేస్తాం ఇక!

@ నందు:థాంక్యూ నందు!

@ Ennela:మీకు ఏవేవి కావాలో చెప్పండీ మీదగ్గరకి వచ్చేటప్పుడు చేసుకుని తీసుకొస్తా! :)

ఇందు చెప్పారు...

@ RAMAKRISHNA VENTRAPRAGADA said...: హ్హహ్హ! రామకృష్ణగారూఉ....మరి గణపతి అంటే అంతే కదా! ఆకులన్ని వేస్తే ముణిగిపోతాడు. లేదంటే ఇక ఖైరతాబాద్ గణేష్ లాంటి విగ్రహాలు తేవాలి :))))

@ krishna chand: కృష్ణచంద్ గారూ మీ అభిమానానికి నా కళ్ళు చెమర్చాయి. మీరు నా బ్లాగుని దర్శించారు.... నా బ్లాగు జన్మ ధన్యం అయింది. మీలాంటి ఫ్యాన్స్ కోసమయినా....తప్పకుండా బ్లాగ్స్ రాస్తా...కృష్ణచంద్ గారూ...రాస్తా! :P

ramesh krishna చెప్పారు...

indu garu,mee puja bagundi...intaki.... vinayakudni e cheruvu lo nimajjanam chesru...

ఇందు చెప్పారు...

@Ramesh Krishna : Maa intivenuka bucket lo :D

Rams చెప్పారు...

Superb Pictures...మీరు చేసిన వంటలూ..super indu garu...sorry for late comment ,i am missing your blogs regularly...
....Rams

ఛాయ చెప్పారు...

@ఇందు-- అయ్యో, ఎంత బాగా చేసుకున్నారో అనే నాభావం. సరిగా చెప్పలేక పోయా.................