1, ఫిబ్రవరి 2012, బుధవారం

నాకొక అందమైన డైరి కావలెను!!!

ఆ టైటిల్ ఏవిటి తల్లీ.... 'అందమైన వధువు/వరుడు కావలెను' అని ప్రకటన ఇచ్చినట్టు అంటారా.... అనేసుకోండి :) నా డైరీ వేట ఆ రేంజ్లో సాగింది మరి :)) 
అసలు సంగతేంటి అంటే.....,
నాకు చిన్నప్పటినించి ఏదో ఒకటి రాయడం అలవాటు :) మాటలకంటే రాతలనే ఇష్టపడతాను!! మాటలంటే  గాల్లోకలిసిపోతాయ్!! కానీ రాతలు అలాగే ఉండిపోతాయ్ అని నా ఫీలింగ్! ;) అందుకే చిన్నప్పుడు కనిపించిన కాగితాన్నల్లా నా రాతలతో నింపేసేదాన్ని :))) అలాగే యే ఊరికేళ్ళినా రాసే ట్రావెలాగ్...... కవితలు, కథలు, బుల్లిబుల్లి కొటేషన్లు.... ఇవన్నీ ఎక్కడపడితే అక్కడ రాసేసేదాన్ని :)))) అలా కాకుండా వాటిని అనాధల్లా వదిలేయలేక ఒక గూడు కల్పించి వాటికి ఆవాసం ఏర్పరచదలిచాను.....అదే.... 'డైరి'

ఇక అప్పటినించి మొదలయింది నా డైరి సెర్చ్! 

మొదట్లో మా డ్యాడి ఆఫీసువాళ్ళు ఇచ్చిన డైరీలో రాసుకునేదాన్ని. అవి చూడటానికి ప్లెయిన్ గా ఉన్నా.... ఒక్కోరోజుకి ఒక్కో ఫుల్ పేజి తో.....చాలా స్పేషియాస్గా ఉండేవి. కాని, రానురానూ....అవి బోర్ కొట్టేసి.... మంచి అందమైన డైరి కోసం వెతకడం మొదలుపెట్టా!! ఈ సందట్లో సడేమియాలాగా ఇంజినీరింగ్ చదివేప్పుడు ఆ 'గోదావరి' సినిమా..... అందులో కమలిని డైరి చూసి.... బాగా కుళ్ళేసుకుని అలాంటి డైరియే కావాలని పట్టుపట్టి  తిరిగిన షాపు తిరక్కుండా తిరిగా!! ఎక్కడా లేదు :(

అలా హైదరాబాదు,గుంటూరు,విజయవాడ,విశాఖపట్నం కూడా వెతికేసాక..... ఇక బెంగుళూరులో అడుగుపెట్టినప్పుడు దొరికింది 'ఫోరం మాల్' లో అచ్చు అలాంటిదే! గవ్వలతో,పూసలతో, అందమైన వర్క్ చేసిన ఫ్యాబ్రిక్ కవర్ ఉన్న బుజ్జి డిజైనర్ డైరి! ఎంతముద్దుగా ఉందో! చటక్కున చేతిలోకి తీసేసుకుని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నపుడు చూసా!! ఖరీదు అక్షరాలా ఐదొందలు అట! కేవ్వ్వ్వవ్వ్వ్వవ్!! అక్కడే మూర్చపోయా! ఎవరో నీళ్ళు చల్లి లేపి, కుర్చీలో కూర్చోపెట్టి కూల్ డ్రింక్ ఇప్పిస్తే అప్పుడు  కళ్ళు తెరిచా....

డైరికి ఐదొందలా? వీడు వీడి డొక్కు షాపు! అనుకుని....నోరు,బుగ్గలు నొక్కుకుని బైటపడ్డా!

ఐదొందలు అని వదిలేసానేగాని, ఎన్నిసార్లు అది కల్లోకొచ్చింది అనుకున్నారూఉ??  ఒక్కోసారి వెళ్లి తీసేసుకోవలనిపించేది! సర్లే లైట్ అనుకుని.... కొద్దిరోజులకి కాం అయిపోయా! కానీ ఎప్పుడు యే షాపుకి వెళ్ళినా డైరీలు కనపడతాయేమో అని తెగ వెతికేదాన్ని.

ఆ తరువాతా గుంటూరు నీలగిరిస్ షాపులో కొన్ని అందమైన పుస్తకాలు పెట్టాడు. అవి డైరీలు కాదు....జస్ట్ నోట్ బుక్స్! కానీ అందంగా ఉన్నాయ్ :) సరేలెమ్మని ఒకటి కొనేసుకుని అందులోనే నాకు తోచిన చెత్తాచెదారం అంతా రాసేదాన్ని. కానీ ఎక్కడో వెలితి ఉండేది...... రోజు రాసుకునే డైరి..... కొన్ని సంవత్సరాలయ్యాక చదువుకుంటే ఎంత బాగుంటుందో అని :) ఒకపక్క నిరాశ! ఇంకో పక్క నచ్చిన డైరి కోసం వేట!! 

అప్పటికే నాకు నేనే డిజైనర్ డైరి తయారుచేసేసుకుందాం అని కూడా డిసైడ్ అయ్యా! కానీ నా డైరికి ఉండే కనీస లక్షణాలు కూడా యే పుస్తకానికి లేకపోవడం వల్ల ఆ ప్లాన్ పక్కన పెట్టేసా!!

 అసలు ఐడియల్  డైరి అంటే ఎలా ఉండాలంటే........ అందమైన డిజైనర్ కవర్ ఉండాలి. దానికి బుల్లిబుజ్జి పూసలు,రంగురాళ్ళూ,రిబ్బన్లు లాంటి రకరకాలతో అలకరించి ఉండాలి. అలాగని గంగిరెద్దులా ఉండకూడదు...... అందమైన రంగవల్లిలా ఉండాలి. లోపల పేజీలు బుల్లి బుల్లి డిజైన్లతో..... చూడగానే పెన్నుపట్టుకుని రాసేసేలా ఉండాలి. 'ఎందుకురా బాబూ ఈ డైరి రాయడం' అని ఫీల్ అయ్యేలా ఉండకూడదు. అలాగే.... ప్రతిరోజూ బోలెడు సంగతులు రాసుకోవడానికి ఒక ఫుల్ పేజి ఉండాలి! అప్పుడైతే బోలెడు బోలెడు రాసేసుకోవచ్చు :)) ఇక ఆ పేజీల్లో ఏమన్నా స్లోగన్లు,కొటేషన్లు ఉంటే మహాచెడ్డ చిరాకు నాకు! రాస్తే గీస్తే నేను రాయాలిగాని ఎవరూ అందులో రాసి ఉండకూడదు ;) అదన్నమాట నా సింపుల్ డైరి రిక్వైర్మెంట్!! 

ఇలాంటి డైరి కోసం.....వెతగ్గా వెతగ్గా..... ఎక్కడా దొరక్క, ఇక ఇన్నిరోజులూ చేసిన వృధా చాలు..... ఇప్పటికైనా ఏదో ఒకదాంతో ఎడ్జస్ట్ అయిపోదాం.... ఎన్నిటికి ఎడ్జస్ట్ అవ్వట్లేదు..... డైరి ఒక లెఖ్ఖా? అనుకున్నా!! పోన్లే కనీసం కొంచెం బాగున్నా చాలు అనుకున్నా! ఇక గూగుల్ సర్చ్ మీద పడ్డా!

వార్నీ, అమెరికాలో జనాలు డైరిలే రాయరా? ఎంతవెతికినా అవేంటో చిన్నపిల్లల కథలపుస్తకాలు, ఆ డైరి ఈ డైరి అంటూ వస్తున్నాయిగాని, నేను రాసుకోవడానికి వీలుగా ఖాళీ డైరి ఒక్కటుంటే ఒట్టు!! అసలు వీళ్ళు డైరీని డైరి అనే అంటారా? ఇంకేదన్నా పదం ఉందా?? అసలే అమెరికాది ఉలిపికట్టె చందం కదా.... అనుకుని..... వెతగ్గా దొరికింది.... 'డే ప్లానర్' అట! నా మొహం!! సరేలే యే రాయి ఐతే ఏంటి అని.... ఆ డే ప్లానర్లు అమ్మే షాపులు చూస్తే... ఎమేజాన్ దొరికింది :)) అందులో, రకరకాల డే ప్లానర్లు ఉన్నాయ్ :) కానీ అందులో ఒకేపేజీలో నాలుగైదు రోజులకి రాసుకునేలాగా బుల్లిబుల్లి గడులు ఉన్నాయ్! :(( పోనీ 'ఒక్కోరోజుకి ఒక్కోపేజి' స్కీములో ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం అంటే...... అబ్బే..... అవి 40 -50డాలర్లు ఉన్నాయ్ ;) దీనికంటే..... బెంగుళూరులో  500 బెటర్ అనిపిస్తుంది ;) [టిపికల్ ఇండియన్ మెంటాలిటీ కదా ;) ]

సరేలెమ్మని,ఏదో గుడ్డిలో మెల్లాలా నచ్చిన ఒక డే ప్లానర్ కి ఫిక్స్ అయ్యి, ఆర్డర్ ఇవ్వబోతే.... షిప్పింగ్ డైరి అంత ఖరీదు అయ్యేట్టుంది.... హయ్యో! రామా!! నేనేమన్నా మణులు అడిగానా? మాన్యాలు అడిగానా? ఒక బుల్లిబుజ్జిచిట్టిచిన్ని అందమైన డైరి కావాలన్నాను... అదీ కష్టమేనా???? హుహ్!! 

ఏంచేస్తాం!!! అంతా షిప్పింగ్ కట్టి అదే తీసుకుందాం అనుకున్నా! తీరా చూస్తే.... షిప్పింగ్ న్యు ఇయర్ తర్వాత మాత్రమె చేస్తామన్నాడు :(( హతవిధీ!! జనవరి ఫష్టు కల్లా డైరి లేకపోతె....ఇంకెక్కడ రాసుకొను??? నాకు మధ్యలో మొదలుపెట్టడం నచ్చదు :(( ఏం చేస్తాం? ఇక ఈ సంవత్సరం కూడా డైరి లేకుండానే గడిచిపోతుందేమో!! ఈ ముక్కే మా చందుతో అంటే.... 'ఆ డైరి ఆర్డర్ ఇవ్వు..... అది వచ్చేదాకా ఎక్కడో అక్కడ రఫ్ఫు రాసుకో.... డైరి వచ్చాక అందులో ఫెయిర్ చేయోచ్చు' అట!! :))))))) మహాగొప్ప సలహా కదా! ;) 'డైరిలకి కూడా రఫ్ఫు,ఫైరు రాస్తున్న ఇందు' :))) [ప్రస్తుతం ఈ పనిలోనే ఉన్నా.... ]

అంటే, మేటర్ అర్ధమయ్యిందిగా! ఈసారికి కూడా డైరికి పంగనామమే!!

హ్మ్! అదండీ సంగతి :) సో, మీకుగాని మంచి అందమైన డైరి( పైన చెప్పిన వర్ణన చూడవలెను) కానీ మీకంటికి కనపడితే...... ఇటు పంపించండి :) పండగ చేసుకుంటా :)))) 

18 కామెంట్‌లు:

శశి కళ చెప్పారు...

chakkati potolu...chakkani post...

మనసు పలికే చెప్పారు...

ఇందూ...
డైరీ రిక్వైర్‌మెంట్ పిచ్చెక్కించావ్‌గా:) కానీ దొరికేదెలా? నీకు దొరికితే, నాక్కూడా ఒకటి పార్సిల్ చెయ్యి;). హైదరాబాద్ సంగతి నే చూసుకుంటాలే, దొరగ్గానే కొరియర్ చేస్తాను:):)

రసజ్ఞ చెప్పారు...

బాగుందండీ! నేను డైరీలో ఏది పడితే అదే వ్రాసేసుకుంటాను. ఏదీ లేకపోతే pathways వేసుకుంటాను;) నాకు మాత్రం ఇస్కాన్ వాళ్ళు, తితిదే వాళ్ళ డైరీలు చాలా ఇష్టం చక్కని బొమ్మలు విగ్రహ అలంకరణతో ఉంటాయి.

అజ్ఞాత చెప్పారు...

GOOD

Advaitha Aanandam చెప్పారు...

:-)

Apparao చెప్పారు...

నేను అయితే మాత్రం గగూగుల్ డాకుమెంట్స్ లో డైరీ రాసుకుంటున్నా
ప్రైవసీ ఉంటుంది
ఖర్చు లేదు
ఇంటర్ నెట్ కనెక్షన్ ఉంటె చాలు
ఏ ఊరులో అయినా రాసుకోవచ్చు
ఎక్కడికీ మోసుకు పోనక్ఖర్లేదు

ఇవి కాక ....
పేపర్ సేవ్ చైనా వాళ్ళం అవుతాం

Sravya V చెప్పారు...

ఇందు ముందు ఒక ఒక విషయం తేల్చండి ,మీకు డైరీ కావాల్సింది రాసుకోవటానికా లేక గవ్వలు అంటించుకోవటానికా :P(j/k)

Wish you will find one soon with all your requirements !

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హహహహ బాగుంది ఇందూ :-) శ్రీఘ్రమేవ గుడ్డు డైరీ ప్రాప్తిరస్తూ :-))

రాజ్ కుమార్ చెప్పారు...

మీ రిక్వయిర్మెంట్ కేక అండీ..
చందుగారు ఇచ్చిన అవిడియ కేకన్నర. ;)

హేమిటో డైరీ రాద్దాం అని చిన్నప్పటి నుంచీ అనుకుంటున్నా.. ఒక్కసారీ నెరవేర లేదు. అదేంటో రాద్దామని కూర్చుంటే సిగ్గుతో కూడిన నవ్వొచ్చేస్తుంది.

లాస్ట్ ఇయర్ ఇంటికెళ్ళినప్పుడు LIC వాళ్ళ్లిచ్చిన డైరీ(చూడ్డానికి చాలా బాగుంది) అమ్మనడిగి పట్టుకొచ్చేశా.
ప్రొఫైల్ నింపేసీ, పక్కనెట్టేస్తే అందులో మా వాళ్ళు పేకాట స్కోర్లు వేసుకుని నింపేశారు ;)

ఎక్కడికో పోయినట్టున్నాను..అంతా మీ పోస్ట్ మహిమ.. ;)

నైస్ పోస్ట్ ఇందుగారూ !

ramesh krishna చెప్పారు...

indu ...mee post chusaka nakkuda dairy rayalane kutuhalam ekkuvaindi....ippude forum, garuda mall, mantri mall ki tour vesesta.....dorikite meku okati parcel chesta lendi....:)

ఛాయ చెప్పారు...

ఇందు గారు..
అందమైన డైరీ కోసం మీ కలలు అద్ద్భుతం...
అందులో రాసే కలం కోసం కోరికలు ఉంటే చెప్పేద్దురు...
ఎంతైనా " బై వన్ గెట్ వన్ " రోజులుకదా!
ఇహ బోతే నే సెప్పేది " మీ రాత బాగుంటుందని .. "

ramki చెప్పారు...

nice narration.

ఇందు చెప్పారు...

@శశి: థాంక్యూ శశి :)

@appu: హహ :) నువ్వు హైదరాబాద్ సంగతి చూస్కో! మిగితా చోట్ల జనాల్ని పెట్టా! ఎలగోలా నీకోటి,నాకోటి సంపాదిద్దాంలే :)

@రసజ్ఞ :అవునండీ... అవి భలే ఉంటాయ్!! కాని నా రిక్వైర్మెంట్ వేరు కదా ;) అదే పెద్ద ప్రాబ్లం :))0

ఇందు చెప్పారు...

@ kastephale: Thankyou!!

@Madhavi : :)

@ Apparao Sastri:ముందుగా మీరు నా బ్లాగులోకి తొంగి చూసి కామెంటినందుకు ధన్యవాదాలండి :) అవునండి మీరాన్నదీ సబబే!! ఆలోచించాల్సిన విషయం :) ధన్యవాదాలు!

ఇందు చెప్పారు...

@ Sravya Vattikuti: హ్హహ్హ!! మీరు భలే షార్ప్ సుమా కనిపెట్తేసారు ;) థాంక్స్ :)

@ వేణూ శ్రీకాంత్ : హ్హహ్హ!! గుడ్డు డైరి అంటే... డైరి విత్ ఎగ్స్ ?? ;) హ్హెహ్హె....

@రాజ్ కుమార్: డైరీ రాయాలంటే సిగ్గేస్తుందా? అయ్యబాబోయ్ మీరు డిఫరెంటున్నర అండీ బాబూ!! హ్హహ్హ :))) నయం పేజీలు చింపి పడవలు చేసుకుని ఆడుకోలేదు మీ ఫ్రెండ్సు :))))

ఇందు చెప్పారు...

@ ramesh krishna: కెవ్వ్వ్!!! థాంక్స్ అండీ బాబూ!! అలాగే ఆ అప్పుకి ఒకటి పార్సెల్ చేసయండి :)

@ ఛాయ :హ్హహ్హ!! థాంక్స్ అండి.. అదీ ఉందండోయ్! జనాలు వెంటపడి మరీ కొడతారని చెప్పలేదుగాని మీరు భలే కనిపెట్తేసారు ;)

@ramki: Thankyou Ramki :)

రవి చెప్పారు...

ఇందు గారు,
మీకు కావలసిన డైరీ దొరికిందో లేదో తెలియదు ..ఒకవేళ దొరక్క పోతే flipkart.com లో డైరీస్ విభాగం లో చూడండి, అక్కడ మీరు చెప్పిన పోలికల తో కొన్ని డైరీలు ఉన్నాయి.

అనంతం కృష్ణ చైతన్య చెప్పారు...

వామ్మో!! వాయ్యో!! నేను ఇంక డైరీ రాయకపోతే నా జీవితమే వేస్ట్ అన్నట్లుగా ఇన్ ఫ్లూయన్స్ చేసెసారు.............
అర్జంట్గా ఒక డైరీ కొనుక్కుని రాసేయాలి.......... :) :)