1, సెప్టెంబర్ 2010, బుధవారం

జయ జయ దేవ హరే



శ్రిత కమలాకుచ మండలా........ద్రుత కుండలా....ఈ కలిత లలిత వనమాల....
జయ జయ దేవ హరే ...జయ జయ దేవ హరే....                                                ||జయ జయ||    
దినమణి మండల మండనా......భవ ఖండనా......ఈ మునిజన మానస హంసా      ||జయ జయ||
కాళియ విష ధర గంజనా..........జన రంజన........ఈ యదుకుల నళిన దినేశా        ||జయ జయ||
మధు ముర నరక వినాశనా......గరుడాసనా.......ఈ సురకుల కేళి నిదానా            ||జయ జయ||
అమల కమల దళ లోచనా........భవ మోచనా.....ఈ త్రిభువన భవన నిదానా         ||జయ జయ||
జనక సుతా కృత భూషణా........జిత దూషనా......ఈ సమరశమిత దశకంఠా          ||జయ జయ||
అభినవ జలధర సుందరా.........ద్రిత మంధరా......ఈ శ్రీముఖ చంద్ర  చకోరా            ||జయ జయ||
తవ చరణే ప్రణతావయా...........ఇతి  భావయా.....ఈ కురు కుశలం ప్రణతేశూ         ||జయ జయ||
శ్రీ జయదేవ కవేరిదం...............కురుతేముదం.....ఈ మంగళ ఉజ్వల  గీతం           ||జయ జయ||


అర్ధ్ధం :


లక్ష్మీదేవి ని వక్షస్థలమునందు,కర్ణములకు కుండలాలను,మెడలో తులసిమాలను ధరించిన హరీ నీకు జయము జయము....
ప్రచండ సూర్యునివలే ప్రకాశిస్తూ,ఆలోచనలను ఖండిస్తూ,మునుల హృదయాలలో హంసవలె విహరించే  హరీ నీకు  జయము జయము
కాళియుని విషాన్ని హరించి,జనరంజకుడవై,యదుకుల రత్నమై వెలిగే హరీ నీకు జయము జయము....
మధు-ముర రాక్షసులను వధించి,గరుత్మంతుని అధిరోహించి,దేవలోకాన్ని రక్షించిన హరీ నీకు జయము జయము....
కలువరేకుల వంటి కన్నులతో,భవమోచన కలిగించే,త్రిభువన నాధుడవైన హరీ నీకు జయము జయము....
జానకి దేవిని చేపట్టి,అధర్మాన్ని జయించి,రావణుడిని వధించిన హరీ నీకు  జయము జయము...
నీలమేఘ శ్యాముడవై,మంధర పర్వతాన్ని మోసి, చంద్రుని వలె అందమైన ముఖారవిందాన్ని కలిగిన హరీ నీకు జయము జయము...
నీ చరణారవిందాలకి ప్రణమిల్లుతూ,నీ కరుణా కటాక్ష వీక్షణాలు కోరుతూ...జయదేవుడు నీకై వ్రాసిన,మంగళకరమైన గీతం ఈ గీతం....
హరీ నీకు  జయము జయము...శ్రీ హరీ నీకు జయము జయము....


-జయదేవ(గీత గోవిందం)  


అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు...ఈ శుభ దినాన ఆ దేవదేవుని పాదారవిందాలకు నమస్కరిస్తూ చిరు కానుక గా సమర్పించిన జయదేవుని అష్టపది... 

6 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీకు, మీ కుటుంబానికి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

కొత్త పాళీ చెప్పారు...

సంతోషం

కళాపిపాసి చెప్పారు...

Belated Krishnashtami wishes andi...meru rasindi e book lo chusi rasarandi?....

ఇందు చెప్పారు...

@చిలమకూరు విజయమోహన్: థ్యాంక్స్ అండీ...
@కొత్త పాళీ: :)
@కళాపిపాసి:ఈ పాట నేను 'నిత్య సంతోషిణీ గారు పాడిన 'జయదేవుల అష్ట పది ' లొ రొజు వినే పాటే...కాబట్టి యే బుక్ చూడక్కర్లేదు....ఇక అర్ధం మాత్రం ఎలగో అలా కష్టపడి వెతికి,కొంత నేను అర్ధం చేసుకుని వ్రాసినది....

శివరంజని చెప్పారు...

Belated Krishnashtami wishes andi...mee profile chaalaa baagundi

ఇందు చెప్పారు...

@శివరంజని:చాలా థ్యాంక్స్ అండీ..