18, సెప్టెంబర్ 2010, శనివారం

భలే భలే డెట్రాయిట్ జూ...

అదేంటో మరి....నాకు జూ అంటే భలే ఇష్టం...నా చిన్నప్పుడు ఎప్పుడు చూసినా ఆ హైదరాబాద్ 'నెహ్రు జూలాజికల్ పార్క్' కి తీసుకెళ్ళేవారు....అక్కడ జంతువులు తక్కువ నడక ఎక్కువ.....అంతకుమించి నేను ఏ 'జూ' కి వెళ్ళలేదు :( కానీ నా జూ చూడాలనే కోరిక అలాగే ఉండిపోయింది.బెంగుళూరు లో ఉండేటపుడు కొన్ని వందల సార్లు అనుకున్నా 'బన్నెర్ఘట్ట' జూ కి వెళ్ళాలని.....కానీ ఏంచేస్తాం!! 8 నెలల్లో  ఒక్కరోజు కూడా 'జూ' కి వెళ్ళడానికి వీలుపడలేదు....కానీ బెంగుళూరు కి 150కి.మీ దూరం లో ఉన్న 'మైసూరు జూ' కి మాత్రం వెళ్ళా :D ....ఈ 'జూ' ఉపోద్ఘాతమంతా ఎందుకంటే 'డెట్రాయిట్' వచ్చాక...ఇంచుమించు ప్రతి వారాంతం ...'జూ'...'జూ' అని నామజపమే...'తీసుకెళ్తే గాని మనశ్శాంతి లేదు' అని డిసైడ్ అయి చందు క్రిందటి  వారమే నాకు 'జూ' సందర్శనం చేయించడం జరిగింది :) మరి నాకు నచ్చిన పని చేసేస్తే వెంటనే అందరికీ చెప్పేయాలి కదా!! అలా ఫోనులో గంట మా అమ్మ-నాన్న కి జూ మొత్తం వర్ణించా!! ఇక ఇప్పుడు మీకు అన్నమాట :)


అన్నీ 'జూ' లలో ఉండే విధంగానే....ఇక్కడ కూడా 'పులులు,సింహాలు,ఎలుగుబంట్లు,ఖడ్గమృగాలు ,జిరాఫీలు,చారాల గుర్రాలు,జింకలు, పాములు,కప్పలు, తొండలు,మొసళ్ళు,రకరకాల పక్షులు' ఉన్నాయి....ఇక వీటి గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు......కానీ టీ.వి.లో తప్ప నిజంగా నా  జీవితంలో చూస్తాను అని అనుకోని కొన్నిటిని మాత్రం చూసేసా!! అవే 'పెంగ్విన్లు,ధృవపు ఎలుగుబంటి,ఆర్క్టిక్ నక్క,సీల్స్,మీర్కాట్స్,ప్రైరీ డాగ్స్,ఏంట్ ఈటర్స్,రెడ్ పాండా,కంగారు,ట్రీ కంగారు,రెండు మూపురాల ఒంటె,మూపురం లేని ఒంటె'......కానీ మనం ఎప్పుడూ చూసే కోతులు,ఏనుగులు,చింపాంజీలు(వీటికోసం పెద్ద జాగా ఏర్పాటు చేసారు కానీ నాకు  ఎక్కడా కనిపించలేదు) ఇక్కడ లేవు :( 


బుడి బుడి అడుగులేస్తూ బుజ్జిగా నడుస్తున్న పెంగ్విన్లని చూస్తే ఎంత ముచ్చటేసిందో.......వాటికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'పెంగ్వినేరియం' అద్భుతం.....ఇక 'ఆర్క్టిక్ సర్కిల్' లో చక్కగా గడ్డి లో బజ్జోని నిద్రపోతున్న 'ధృవపు ఎలుగుబంటి' గారు తెలుపు+పసుపు రంగులో మెరిసిపోతున్నారు....దాని పక్కనే బిత్తరచూపులు చూస్తున్న 'ఆర్క్టిక్ నక్క' ఎంత చిన్నగా ఉందో...అక్కడినించి 'సీల్స్' చూడటానికి లోపలికేల్లాం...పైన అంతా నీరు కింద గాజు సొరంగం....అక్కడ నించి చూడాలి 'సీల్స్' విన్యాసాలు...అటు ఇటు ఈదుతూ...గెంతుతూ...వెల్లికల పడుకొని ఈత కొడుతూ....ఆహా!! ఏమి ఆడుకుంటున్నాయో!! ఇక 'మీర్కాట్స్' విషయానికి వస్తే వాటికి ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేసారు...ఇసుక,రాళ్ళు-రప్పలు,ఎండు కొమ్మలు  పెట్టారు...అవి ఇసుకలో దూరి తలపైకెత్తి చూస్తూ ఉంటాయ్...అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయ్ ...ఇక ప్రైరీ డాగ్స్ ఐతే  బుజ్జిగా చిన్న చిన్న తోకలు వేసుకుని ఇసుకలోకి దూరి,ఎండు గడ్డి తింటూ భలే ఉన్నాయ్...ఏంట్ ఈటర్స్ పెద్ద పెద్దగా ఉండి సూది లాంటి ముక్కు తో కుచ్చు తోకతో అటు ఇటు హడావిడిగా తిరిగెస్తూ వింతగా ఉన్నాయ్.... కంగారులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి....ఇక్కడ ఒక చిన్న ప్రదేశం లో వాటిని స్వేచ్చగా వదిలేసారు...మనం వాటి మధ్యలోగుండా నడుచుకుంటూ వెళ్ళవచ్చు....దగ్గరగా  చూడొచ్చు....ఫోటోలు తీసుకోవచ్చు....కానీ మేము వెళ్లేసరికి అవి అలసిపోయి చెట్టు నీడలో పడుకున్నాయ్!!.....ఇక రెండు మూపురాల ఒంటె-మూపురం లేని ఒంటె నేను చూడటం అదే ప్రధమం....అలాగే పక్షుల దగ్గర,సీతాకోకచిలుకల దగ్గర మనం లోపలికెళ్ళి వాటి మధ్య తిరగొచ్చు....పెద్ద పెద్ద నీలిరంగు సీతాకోకచిలుకలు, ఎర్ర కొంగలు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఇక జూ అంత తమదే అన్నట్టు కలివిడిగా తిరిగేస్తున్నాయ్ అందాల నెమళ్ళు....


ఆ తరువాత 3D -4D 'వైల్డ్ ఆఫ్రికా' షో  కి వెళ్ళాం....10 నిముషాలు సాగే ఈ షో చాలా బాగుంది....అందరికీ 3D  గ్లాసెస్ ఇచ్చారు.ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నాక షో మొదలయింది.ఏనుగు ఘీంకరిస్తే ఆ చప్పుడు కి ధియేటర్ మొత్తం అదిరిపోయింది....అలాగే ఖడ్గమృగం హుంకరిస్తే ఆ గాలి మాకు కొట్టింది...ఏనుగు తొండం తో నీటిని స్క్రీన్ మీదకి చిమ్మితే మా  మీద నీళ్ళు చల్లారు...చారాల గుర్రం కి ఒక వేటగాడు బాణం వేస్తె  సీట్ లో నించి మాకు గుచ్చుకున్నట్టు ఉంది .ఒక సింహం ఇంకో సింహాన్ని కొడితే మనల్ని ఎవరో కొట్టినట్టు ఉంది......ఇలా 4D - ఎఫ్ఫెక్ట్లతో షో భలే ఉంది :) ఇది అందరూ తప్పక చూడాల్సిన షో.


అలా షుమారు 4  గంటలు పట్టింది మాకు జూ మొత్తం చూడటానికి. కానీ నేను ఇప్పటిదాకా చూసినవాటికంటే ఇది బెస్ట్ జూ...జంతువుల్ని ఎంతో శ్రద గా,వాటి సహజ వాతావరణం సృష్టించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా  చూస్తున్నారు.  నాకు ఇది బాగా నచ్చింది. ఇక్కడ సావనీర్ గా నాకు అన్నిటిలోకి బాగా నచ్చిన 'పెంగ్విన్' కి గుర్తు గా 'పింక్ పెంగ్విన్' ని తీసుకున్నా!! బుజ్జిది ఎంత బాగుందో!! దానికి 'ప్రెట్టి' అని నామకరణం కూడా చేసేసా :)


ఇవండీ  నా 'డెట్రాయిట్ జూ' సందర్సన విశేషాలు.....


జూ ఫోటోలు కొన్ని ఇక్కడ :


                                                                  పెంగ్విన్లు:

మీర్కాట్స్:


సీల్స్ :
                                                                              
ప్రైరీ డాగ్స్:
                      
                                                                  ధృవపు ఎలుగుబంటి


ఆర్క్టిక్ నక్క 
                                                                    
ఏంట్ ఈటర్స్:
కంగారు:
రెండు మూపురాల ఒంటె :
మూపురం లేని ఒంటె:
సీతాకోకచిలుక:

                          
నెమలి:
ఇక నా 'ప్రెట్టి' గాడు :

11 కామెంట్‌లు:

భాను చెప్పారు...

good post

Unknown చెప్పారు...

nice post indu. your pretty is sooo pretty

swetha చెప్పారు...

బాగుంది మీ పొస్ట్.ముఖ్యంగా మీ ఫొటోలు.

Unknown చెప్పారు...

నమస్కారం ఇందు గారు, మీరు రాసిన టపాలు చదువుతున్నాను. చాలా బావుంటున్నాయి. చాలా చక్కగా రాస్తున్నారు. ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. మీ అనుభవాలు ఇలాగే మాతో పంచుకోవాలని ఆశిస్తూ మీ అభిమాని :-)

రాధిక(నాని ) చెప్పారు...

బాగున్నాయి మీ జూ విశేషాలుఇందు గారు.చాలా బాగున్నాయి ఫొటోస్.

సి.ఉమాదేవి చెప్పారు...

ప్రకృతికి సొబగులు అద్దే జంతుజాలం.పక్షులు,జలచరాలు మనిషికి ఆనందం పంచుతాయి,ఆహ్లాదం పెంచుతాయి.అమెరికాలో జూ సందర్శన చక్కటి అనుభూతులనందిస్తుంది.ఆ జ్ఞాపకాలను మరోమారు గుర్తుకు తెచ్చారు.ThanQ.

శివరంజని చెప్పారు...

ఇందు మీ ప్రెట్టీ చాలా బాగున్నాడు నాకిస్తావా మరి

ఇందు చెప్పారు...

@భాను :thankyou bhanu.
@sahiti :thanx sahiti...
@swetha:thanyou.
@Ramesh:అభిమాని గారు...మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు..
@రాధిక(నాని ):ధన్యవాదాలు రాధిక గారు...
@C.ఉమాదేవి:అవునండీ...ధన్యవాదాలండీ...
@శివరంజని::) థాంక్యూ...ప్రెట్టి గాడు కూడ థ్యాంక్స్ చెప్పాడు...అమ్మో!!నా ప్రెట్టీ గాడ్ని ఇచ్చేయడమే?? లేదు,,,లేదు..

snellens చెప్పారు...

Good memory. I normally forget some of the animal names after we come out. Your writing is fabulous. keep up the good work. Your Pretty is cute

కొత్త పాళీ చెప్పారు...

చో చ్వీట్

Srujana Ramanujan చెప్పారు...

Thanks. Nice intro