22, సెప్టెంబర్ 2010, బుధవారం

నిను చూడక...

'నిను చూడక...నేనుండలేను...'


ఈ ముక్క ఎవరితో అంటున్నాను అనుకుంటున్నారా??? ఇంకెవరితో...నా చిరకాల నేస్తం 'న్యూస్ పేపర్' తో....చూసి ఎన్ని రోజులైపోయిందో....అదేమిటి అంతగా కావాలంటే 'ఈ-పేపర్' చూసుకోవచ్చు కదా అని అనొచ్చు....కానీ పొద్దున్నే లేచి చక్కగా వేడి వేడి టీ తాగుతూ... అలా అలా పేజీలు తిప్పుతూ... పేపర్  చదివితే వొచ్చే ఆనందం ఈ 'ఈ-పేపర్' లో ఏం వస్తుంది???ఇప్పుడంటే...ఈ-పేపర్,ఆ-పేపర్ అని వచ్చాయి కానీ ఇదివరకు అందరిళ్ళలోను(పండగలకి పబ్బాలకి తప్ప) క్రమం తప్పకుండా పొద్దున్నే పాలవాడితోపాటు మేలుకోలిపేది పేపర్ యే కదా ...


నాకున్న అతి తక్కువ మంచి అలవాట్లలో ఈ పేపర్ చదవడం ఒకటి అని నా ఫీలింగ్...చిన్నప్పుడు అనగా నా నాల్గవ తరగతి లో ఈనాడు ఆదివారం లో వేసే 'బాలవినోదిని' తో మొదలైన  నా పత్రికాపఠనం....మెల్లగా  'మొగ్గ' తొడిగి....అంచెలంచెలుగా ఎదిగి...ఆఖరికి 'పేపర్' రాని రోజున దిగులు పడే దాక వచ్చింది.....పేపర్ మొదటి పేజి దగ్గర  నించి చివరి దాక నమిలి మింగేసాక పక్క వాళ్ళకి ఇచ్చేదాన్ని..అప్పటిదాకా నన్ను ఎవరన్నా కదిలిస్తే  'కాళికా' అవతారమే......


నాకు సాధారణంగా పొద్దున్నే లేచే చెడ్డ అలవాటు లేకపోయినా..ఈ పేపర్ దయ వల్ల అది కూడా అబ్బింది. ఠంచనుగా పేపర్ బాయ్ పేపర్ మా ఇంటి గుమ్మం లో విసిరేలోగా తలుపు తీసేదాన్ని....ఒకవేళ ఆ రోజు పేపర్ ఇంకా రాకపోతే కనీసం మొహం కూడా కడుక్కోకుండా అలాగే మెట్ల మీద ఎదురు చూస్తూ ఉండేదాన్ని....ఒక్కోసారి 'దీపావళి','సంక్రాతి' పండగలు వెళ్ళిన మరుసటి రోజున పేపర్ రాదు అని తెలిసినా పోరాపాటులో అలవాటు లాగ పొద్దున్నే లేచి..కాసేపు పేపర్ కోసం చూసి ..'ఐతే నిజంగానే ఇవాళ పేపర్ రాదు అన్నమాట' అని నిర్ధారించుకుని మళ్లీ నిద్ర కు ఉపక్రమించేదాన్ని...కాలేజి కి వెళ్ళే రోజుల్లో...ఇంట్లో చదవడానికి వీలు చిక్కకపోతే బాగ్ లో పెట్టేసుకుని బస్ ఎక్కిన తరువాత హాయిగా చదివేసేదాన్ని....చివరికి అమీర్పేట్ లో హాస్టల్ లో ఉన్నపుడు  కూడా అందరికంటే ముందు లేచి పేపర్ మొత్తం నమిలేసి అప్పుడు వెళ్లి మళ్లీ పడుకునేదాన్ని....నా పేపర్ వీక్నెస్ కనిపెట్టిన మా అమ్మ,తమ్ముడు ఒక్కోసారి నాకంటే ముందే నిద్ర లేచి పేపర్ దాచిపెట్టేసి నన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు  తాగించేవారు....ఆ టైం లో చచ్చినట్టు వాళ్ళు చెప్పిన పనల్లా చేసేదాన్ని.....అందరూ కలిసి నాకు 'పేపర్ పురుగు' అని నామకరణం కూడా చేసారు....


ఎన్ని కష్టాలు ఎదురైనా పేపర్ చదవడం మాత్రం మానుకోలేకపోయా...ఆఖరికి బెంగళూరు మహిమ వల్ల అప్రతిహతంగా సాగుతున్న నా పేపర్ పఠనానికి బ్రేక్ పడింది.ముందు కొద్దిరోజులు అక్కడా పేపర్ తెప్పించా!! కానీ రాను రాను పని వత్తిడి ఎక్కువవడం తో...పేపర్ వాడు వేసే పేపర్ కట్టలు కట్టలు బాల్కనిలో చెత్తలా పేరుకుపోవడం చూడలేక వేయించడం ఆపేసా!! నా బాధ చూసి ప్రతి శని,ఆదివారాలు చందు పేపర్ తీసుకురావడం తో కొంత ఉపశమనం ఉండేది....


కానీ...నా జీవితం లో ఇలా నెలలకి నెలలు...అస్సలు పేపర్ తాకకుండా ఉండే సందర్భం ఒకటి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు......ఆదివారాలు తీరిగ్గా కూర్చుని....వేడి వేడి ఉప్మా లో పంచదార జల్లుకుని తింటూ ...మధ్యలో టీ తాగుతూ....'సండే స్పెషల్' లో వచ్చే కథ  చదువుతూ ఉంటే....ఆహ!! ఆ ఊహే ఎంత బాగుంది!!


ఇంకా ఎన్నాళ్ళో ...ఎన్నేళ్లో......ఈ ఎదురుచూపులు...



'నిను చూడక...నేనుండలేను...'

9 కామెంట్‌లు:

శ్రీనివాస్ చెప్పారు...

:)

త్వరలో ప్రతిదినం పేపరు పఠనం దొరుకుగాక

జయ చెప్పారు...

అక్కడకూడా న్యూస్ పేపర్ దొరుకుతుందని విన్నాను. మరి దిగులెందుకు. తెప్పించేసుకోండి. కాకపోతె, ఇవాల్టిది రేపో లేకపోతే ఇంకొన్ని రోజుల తర్వాతో వస్తుందనుకుంటా:) Something is better than nothing.

కొత్త పాళీ చెప్పారు...

నా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పేపరు చదవడం మానేశాను :)
గోంగూర - ఇంకా కొంచెం మిగిలున్నదనుకుంటా.

Overwhelmed చెప్పారు...

Paapam.. English paper chadiveyyandi prastutaniki..

రాధిక(నాని ) చెప్పారు...

మీరూ నాలాగా పేపర్ నమిలి మింగేవారేనన్నమాట. పొద్దున్నే లేచి చక్కగా వేడి వేడి కాఫీ తాగుతూ... అలా అలా పేజీలు తిప్పుతూ... పేపర్ చదివితే వొచ్చే ఆనందం:):)..........పేపర్ చదివే విషయం లో సేం మీ ఫీలింగ్స్ నావీను.కాకపోతే నేను ఇంచక్కా రోజూ చదువుతున్నానుకదా......హై హై ..అచ్చికచ్చిక.....:(

ఇందు చెప్పారు...

@శ్రీనివాస్ :మీ దీవెనలు ఫలించుగాక!! :)
@జయ:నేను చేప్పెది 'తెలుగు దిన పత్రిక ' గురించి అండీ....అది దొరకదు కదా!!
@కొత్త పాళీ:మీతో నేను ఏకీభవిస్తాను...కాని అలవాటైపొయిన ప్రాణం కదా! గొంగూర ఉంటే..ఇంకెందుకు ఆలస్యం...పంపించేయండి..మీ పేరు చెప్పుకుని మేము గొంగూర పచ్చడి తినేస్తాం...
@Jaabili:అది ఇష్టం లేకే కదా ఈ బాధంతా!! :(
@రాధిక(నాని ):మీరు నాలాగే అన్నమాట...ఎంచక్కా ఎంజాయ్ చేసేస్తున్నారుగా!!నేను ఇండియా వస్తాలేమ్మా!! అప్పుడు నేను చదువుతా :D అచ్చికచ్చిక!!

ఆ.సౌమ్య చెప్పారు...

శీఘ్రమేవ పేపరుపఠనాప్రాప్తిరస్తు

ఉప్మాలో పందార వేసుకు తినడం మీకూ ఇష్టమేనా, నాకు కూడా :)

sunita చెప్పారు...

hahaha! ippuDu inkaa nayam e-paper dorukutundi. mooDunellakoesaari naalugu Daalarlu peTTi eenaaDu koni oe nela roejulu chadivae himsa roejulanoesaari oohinchanDi. maemu alaa kooDaa bratikaamu:-)

sai krishna alapati చెప్పారు...

hi indu ....nadi kuda guntureeee...
ne blog e roje chusanu bavundhi ....edo posts chadvuthunna gani comment petta ledhu kani e post ki vachina taruvatha inka tappatam ledhu ...
enduku ante nenu kuda ippudu a stage lo ne unna kabattti nidra levagane kallu kuda tervakunda velli paper tesukoni EENADU anna aksharalathone na day start ayedhi ...ippudu desam kani desam lo e paper ke banisalu ayyamu ....edi emi aina chetilo paper tesukoni chadive anadam e paper chadvuthunte kalagatam ledhu ....ippudu kuda na laptop on chesi unna antha sepu eenadu.net ane site open chesi undalisindhe ...mana lanti vallu entha mandi unnaro a site ki roju ki enni clicks vasthunnayoooooooo.......