30, సెప్టెంబర్ 2010, గురువారం

ఏంటబ్బా!! ఇంత సహనం??

పొద్దున్నే లేచి కొన్ని తెలుగు వెబ్ సైట్లు చూసాక నాకు వచ్చిన డౌట్ ఇది...
'అయోధ్య' విషయం లో మన వాళ్ళు ఇంత సంయమనం పాటించారా???
ఏ గొడవలు...కొట్లాటలు...అల్లర్లు లేకుండా...60 సంవత్సరాలు కోర్టులో మగ్గిపోయిన తీర్పు బైటికొచ్చిందా?? 
అయినదానికీ కానిదానికీ గొడవలు చేసి...కోడి గుడ్డు కి ఈకలు పీకే రాజకీయ నాయకులు నోళ్ళు మెదపలేదా??? 
చీమ చిట్టుక్కు మన్నా రాద్ధాంతం  చేసే 'మీడియా'...అదీ 'చర్చలు' అనే పేరుతొ 'చిచ్చులు' పెట్టె టీ.వి.9 లాంటి ఛానళ్ళు అసలు ఈ విషయం  గురించి అంతగా పట్టించుకోలేదా?? 
అటు కాకి ఇటు వాలినా...ఇటు కాకి అటు వాలినా.....బందులు...బస్సులు తగలబెట్టడాలు....రాస్తా రోకోలు...వీధుల్లో విధ్వంసాలు సృష్టించే అల్లరి మూకలు తోకలు ముడిచారా?? 
ఆ ఎవరెటు పొతే నాకేంటి అని నిమ్మకు నీరేత్తని పోలీసు వారు...గట్టి గా పహారా కాశారా?? 


అయ్యబాబోయ్!! ఇది ఇండియా నే?? 
ఇది ప్రతి దాన్ని హైలైట్  చేసే మీడియా నే??
వీళ్ళు మన డబ్బులు తిని బొజ్జలు పెంచిన రాజకీయ నాయకులే??
వీధుల్లో గలాటా చేయకుండా ఇంత బుద్ధిగా ఇళ్ళలో కూర్చుని ఉంది మన అల్లరి మూకలే??
తుపాకి ఎక్కుపెట్టి అందరి తలలు వంచగలిగింది మన పోలీసోల్లె??


ఇదంతా నిజామా?? నేను పగటిపూట కూడా కల కంటున్నానా?? 
వామ్మో!!వార్నాయనో!!
అర్జెంటుగా నిన్న తెచ్చుకున్న 'గులాబ్ జామ్' మిక్చరు తో ఇవాళ స్వీట్ చేసేయాల్సిందే...
మన ఇండియా లో ఇంత సహనం,ఓపిక,సామరస్యం....నేను పుట్టాక ఇప్పుడేనేమో బహుశా చూడడం...
ఇప్పుడిప్పుడే  నాకు ఆశ  కలుగుతోంది..మన దేశం కూడా బాగుపడుతుందేమో అని....

జై భారత్ మాత...
జై జై భారత్ మాత...

7 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

మన వాళ్ళకు హిందూ-ముస్లిం భాయి భాయి అన్న పూనకం పుట్టినట్లుంది. మంచిదే. ఇప్పుడెవరయినా ఏదయినా మతానికి అనుకూలంగా విపరీతమయిన వ్యాఖ్యలు కానీ, వార్తలు కానీ, ప్రసారాలు కానీ, చర్చలు కానీ చేసిన వారిని దేశద్రోహి అని మొఖాన ఉమ్మేసేలాంటి ఫీవర్ అందరిమదినిండా అలుముకున్నట్లుంది. మంచిదే. అయితే ఈ సహనం ఎన్నాళ్ళు వుంటుందో చూడాలి.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

యాతావాతా తేలిందేమంటే సమస్యంతా రా.నాయకులతోనూ,మీడియాతోనే అని.వాళ్ళు సమస్యలను కెలక్కుండా శాంతంగా కూర్చుంటే దేశమంతా ప్రశాంతంగా ఉంటుంది.

రాధిక(నాని ) చెప్పారు...

మేమూ అలానే అనుకున్నామండి.ఈ రోజుల్లో ఏమి జరగాలన్నా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంది కదా ..ఏదైతేనే తీర్పు వచ్చాక కుడా ఎటువంటి కకొట్లాటలు లేకుండా , దేశమంతా హాయిగా ప్రశాంతంగా ఉంది..

సవ్వడి చెప్పారు...

జై భారత్ మాత...
జై జై భారత్ మాత...

ఇందు చెప్పారు...

@శరత్ 'కాలమ్': :)
@చిలమకూరు విజయమోహన్:అవునండీ...ఇప్పటికన్నా మీడియా,రాజకీయనాయకులు తమ అతి చేష్టలు తగ్గించుకుంటే చాలు...
@రాధిక(నాని :అవునండీ...నాకు ఆశ్చర్యం వేసే ఈ పొస్ట్ పెట్టా!! :)
@సవ్వడి: :)

మాలా కుమార్ చెప్పారు...

మా అమ్మాయి కి , కోడలు కు , మావారి కి కాల్ చేసి ఇంటికి త్వరగా చేరండి . తీర్పు ఇలా వచ్చింది , ఏమి గోడవలువుతాయో అని హడావిడి పెట్టి అందరినీ ఇళ్ళకు పిలిచాను . తీరా చూస్తే అంతా ప్రశాంతం ! ఎంత హాచర్యమేసిందో ! నాకూ ఓ పెద్ద అనుమానం వచ్చేసింది అసలు ఈ రోజు తీర్పు వచ్చిందా ?అని .
జై భారత్ మాత
జై జై భారత మాత .

ఇందు చెప్పారు...

@మాలా కుమార్ :అందరికి కావల్సింది ఇదే కదా!! ఇప్పటికైనా ఈ కాకి గోల చేసే టి.వి.లు..పత్రికలు, ఇలాంటి సున్నిత విషయల్లో కాస్త సమ్యమనం పాటిస్తే అదే చాలు..