ఒక మనిషి సమాజం లో ఎలా మెలగాలి...తన విధులు,పరిధులు,భాద్యతలు అనునిత్యం గుర్తు చేసేదే హిందుత్వం.ప్రక్రుతి లో మమేకమై మెలగడం కూడా అందులో ఒక భాగమే..
షికాగో లో 'స్వామీ నారాయణన్' గుడికి వెళ్ళాను....అక్కడ లోపలికి వెళ్ళే దారిలో కొన్ని ఫోటో ఫ్రేమ్స్ పెట్టారు....వాటిల్లో మన ఆలయాల గురించి వ్రాసిన కొన్ని వ్యాఖ్యలు నాకు నచ్చాయి...ఆలయాలకి-ప్రకృతికి ముడి పెడుతూ...మనిషి యొక్క ఆలోచనలను ప్రభావితం చేసేవిగా చెప్పబడిన ఆ వ్యాఖ్యలు కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను....
ఆలయ శిఖరం-పర్వత శిఖరం వలె ఎత్తు గా ఉండి,దైవం ఎప్పుడు ఉన్నతంగా ఉంటుందని అది చేరుకోవడం ప్రతి జీవి యొక్క జన్మ కి పరమార్ధం అని సూచిస్తుంది.అందుకే ఆలయాలు...పర్వతాలను పోలి ఉంటాయి.
ఆలయ కలశం-అమృతత్వానికి చిహ్నంగా,స్వచ్చతకు ప్రామాణికంగా నిలుస్తూ మనిషి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని సూచిస్తుంది.
ఆలయ స్థంబాలు-అడవిలో నిటారుగా,ధృడంగా ఉండే చెట్ల వలె ఉండి....ధృడ చిత్తానికి సంకేతంగా ఉంటాయి.
ఆలయ పతాకము-ధ్వజ స్థంబం మీద ఉండే పతాకము...చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక గా రెపరెప లాడుతూ ఉంటుంది.
ఆలయం పై కప్పు- జ్ఞానాన్ని మనిషి మీద కురిపిస్తున్నట్టు గా దైవత్వానికి చిహ్నంగా ఉంటుంది.
ఆలయ కుడ్యాలు-ఆలయం గోడలపై,స్థంబాలపై,పైకప్పు పై చెక్కే పూలు,లతలు....రాయిని కూడా పూవు గా మలచబడే కోమలత్వానికి చిహ్నంగా నిలుస్తుంది.
చిరుగంటలు-చిరుగాలికే కిల కిల మంటూ ఊగే గంటలు....మనసులో ఉండే చెడు ఆలోచనలు దూరం చేసి దైవం మీద ధ్యాస ఉండేలా చేస్తాయి.
గుడిలో వెలిగించే దీపం- అజ్ఞానపు అంధకారాలను పారద్రోలి....ఎల్లప్పుడూ ప్రకాశించే ఆ దేవదేవుని దివ్య ముఖారవిందం లా కోటి సూర్యకాంతి ప్రతిఫలిస్తుంటుంది.
గర్భాలయం లో మూర్తులు- 'మూర్తి పూజ' అనేది దైవానికి పక రూపం ఇచ్చి,ప్రాణ ప్రతిష్ట చేసి...మనసు పరిపరి విధాల పోకుండా ఆ మూర్తి మీదే నిలిపి...ధ్యానించడానికి...ముక్తి ని పొందడానికి.....
ఇవి...మన ఆలయాలలో ఉండే విశిష్టత....గుడి లో చేసే ప్రతి కార్యం,విధానం కి ఏదో ఒక సూక్ష్మార్ధం ఉంటుంది అని పెద్దలు చెప్పే మాటలు నిజమనిపించాయి అవి చూసిన తరువాత.మన వాళ్ళు గుళ్ళు అల్లాటప్పా గా కట్టలేదు...చాలా విశ్లేషించి,లోతు గా అలోచించి నిర్మించిన అద్భుతాలు....మన ఆలయాలు.
10 కామెంట్లు:
సరిచేశాను.చాలా థాంక్స్ అండీ..చెప్పారు కాబట్టి సరిపోయింది.అప్పటికే రెండు,మూడు సార్లు చూసుకున్నా....కానీ గమనించలేదు... థాంక్స్ అండీ వేణు శ్రీకాంత్ గారు.. :)
మా ఊరులోనే ఉన్నారు కదా, మీకు కుదిరితే ఈ ఆదివారం మధ్యాహ్నం డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ ఆధ్వర్యంలో 'బ్రతికిన కాలేజీ' పుస్తక చర్చ ఉంది.
డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ గ్రూపు వివరాలు మీరు ఇక్కడ చూడచ్చు.
http://groups.yahoo.com/group/DTLCgroup/
చర్చ వివరాల కోసం గ్రూప్స్ కాలెండరులో మీరు చూడవచ్చు.
తప్పక ప్రయత్నిస్త అండీ రావడానికి ....ఆ లైబ్రరీ నాకు తెలుసు...చెప్పినందుకు ధ్యానవాదాలు
good one
మంచి విషయాలు చెప్పారు ఇందు
meru chala lothuga alochistarandi
చాలా చక్కని విషయాలు. మనకు స్వీకరించే హృదయం ఉండాలి కానీ ప్రకృతిలోని ప్రతి వస్తువూ మనకు ఒక గురవవుతుంది. ఎంతో కొంత స్ఫూర్తినిస్తుంది.
@sivaprasad:థాంక్యూ..
@శివరంజని :థాంక్యూ శివరంజని
@కళాపిపాసి :గుర్తించినందుకు ధన్యవాదాలు :)
@రాజశేఖరుని విజయ్ శర్మ :అవునండీ...ప్రకృతిని మించిన గురువు ఎవరుంటారు!!
Baaaagaaa post chesav indu......
good..
@ Cute Indian :thankyou annaya :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి