14, ఫిబ్రవరి 2011, సోమవారం

ఎంతో మజాలంటా....చాక్లేట్ లోకమంటా......

డైరీమిల్క్ యాడ్ ఒకటి గుర్తుందా??
'ఎంతో మజాలంటా! డైరీమిల్క్ ప్రపంచమంటా....డైరీ మిల్క్ పక్షులు...డైరీ మిల్క్ చెట్లు....' అనుకుంటూ ఒక యానిమేషన్ యాడ్ వచ్చేది....అలాగే ఉంది ప్రస్తుతం నా పరిస్థితిbig grin....కానీ నా సాంగ్ ఏమో....'ఎంతో మజాలంటా! హర్షీస్ ప్రపంచమంటా....రీసీస్ పక్షులు...గోడైవా చెట్లు....' ఇలా పాడుకుంటున్నా......నిన్నటి నా దినచర్య ఒకసారి పరిశీలిస్తే ఇది అర్ధమయిపోతుంది.....పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్  తోపాటు ఒక చాక్లెట్.....నెక్స్ట్ ఇంటిపని మొదలుపెట్టే ముందు....అది అయిపోయాక ఒకటి.తర్వాత వంట ప్రోగ్రాం మొదలు పెట్టె ముందు ఒకటి.....అది అవ్వగానే అలిసిపోతాం కదా..అప్పుడు ఇంకో చాక్లెట్....సరే ఇంతలో చందు వచ్చేస్తాడు....మరీ ఇన్ని చాక్లెట్లు తిన్నా అని తెలిస్తే ఎలా?? అందుకని అప్పుడు మాత్రం బుద్దిమంతురాలిలాగా ఉండి లంచ్ అవ్వగానే చందు అటు వెళ్ళగానే మళ్లీ ఇంకో చాక్లెట్(మరి లంచ్ తరువాత తీపి తినాలి కదాwinking)...తరువాత కాసేపు బ్లాగులు  చూడటం...అలా ఒక గంట గడిచిపోతుందా కాసిని  చాక్లెట్లు  తినాలనిపిస్తుంది కానీ ఎక్కువ తినకూడదు కదా అందుకని ఒకేఒక్క చాక్లెట్ తినేసి....ఏదో ఒక పుస్తకం పట్టుకుని కూర్చుంటా.....ఇక సాయంత్రం చందు రాగానే...'ఒక చాక్లెట్ తింటా చందు....' అంటే....'తిను ఇందు...నీకోసమేగా తెచ్చింది తిను...' అంటాడు...అప్పుడు అధికారికంగా ఇంకోటి అన్నమాటwinking....మళ్లీ రాత్రి డిన్నర్ అయ్యాక....'ఇంకొక్కటి తింటా  చందు'  అంటాను....'సరే..ఇక ఇదే ఇవాల్టికి లాస్ట్' అంటాడు....big grin అని ఒక నవ్వు  నవ్వి  ఒక చాక్లెట్ తినేస్తా....అదన్నమాట సంగతి.....హ్హహ్హహ్హా!!

అసలు నాకు ఈ చాక్లెట్ల పిచ్చి ఎలా మొదలయిందా అని తీవ్రంగా ఆలోచిస్తే కొన్ని నిజాలు బైటపడ్డాయి.....చిన్నపుడు నాకు చాక్లెట్లంటే చిరాకు...తీపి అస్సలు పడదు....ఎంతసేపటికి లేస్ చిప్స్,కుర్కురే,హల్దిరామ్స్ మూంగ్ దాల్,... ఇలా హాట్ యే గాని చాక్లెట్లు,బిస్కత్తులు,పిప్పరుమెంటు బిళ్ళలు....లాంటివి అంతగా తిన్న దాఖలాలు లేవు.....ఏదో పుట్టినరోజున బిల్డప్ కోసం చాక్లెట్లు ఇవ్వడమే కానీ వాటిమీద నాకు ఎప్పుడూ ఇంటరెస్ట్ లేదు...మరి ఎలా వచ్చింది నాకు ఈ చాక్లెట్ పిచ్చి?? ఎలా! హౌ? అని నాలో నేను తెగ కోస్నేలు వేసుకుంటే....బుర్ర లో ఒక మెరుపు మెరిసిందిidea మా స్కూల్ లో 'కవిత' అనే ఒక అమ్మాయి ఉండేది.ఆ అమ్మాయి వాళ్ళ అమెరికా బంధువులు తెచ్చే చాక్లెట్ల గురించి మా అందరికీ పెద్ద పెద్ద షోలు వేసి మరీ చెప్పేది.'మా అంకుల్ అమెరికానించి డైరీ మిల్క్ తెచ్చాడే.కానీ నేను దాన్ని టేబుల్ మీద పెట్టేసి మర్చిపోయా.ఒక టూ వీక్స్ తరువాత దాన్ని చూసా.అయినా అది అంతే ఉంది చెక్కు చెదరకుండా! చూసారా! అద్దీ అమెరికా చాక్లెట్లు అంటే' అని తెగ సోది చెప్పేది...బొత్తిగా టీవి  జ్ఞానం లేని నేను 'అవునా! నిజామా! అబ్బో!' అనుకునేదాన్ని.అప్పుడు అమెరికా చాక్లెట్లు అంటే క్రేజ్..డైరీ మిల్క్ ఇండియా లో పాన్ షాపు లో కూడా అమ్ముతారని నా చిన్ని బుర్రకి ఆనాడు తట్టలేదుI don't know. అమెరికా చాక్లెట్లు బాగుంటాయని...ఎప్పటికైనా అమెరికా వెళ్లి చాక్లెట్ తినాలని ఇలా చాలా చాలా అనేసుకున్నా... :))


ఆ తరువాత ఒకసారి డైరీ మిల్క్ మా ఇంటిదగ్గర పచారి షాపు లో చూసా.'అరె! ఇదీ డైరీ మిల్క్ యే...కవిత చెప్పింది దీనిగురించే కదా!!భలే భలే..ఈ షాపు వాడు కూడా అమెరికా చాక్లెట్లు అమ్ముతున్నాడు' అని ఒకటి కొనుక్కుని తిన్నా.....నచ్చింది...మరుసటి రోజూ మళ్లీ వెళ్లి కొనుక్కున్నా..ఇంకా నచ్చింది....అలా రోజూ కొనుక్కుని తింటుంటే మా అమ్మకి విషయం అర్ధమయింది.'చాక్లెట్లు అలా రోజూ తింటే పళ్ళు పుచ్సిపోతాయే...అప్పుడు ఏది తినడానికి ఉండదు' అని తిట్టింది worried.'అమ్మో!!! చాక్లేట్లకంటే పళ్ళు ముఖ్యం అనుకున్నా...' కానీ వదలలేకపోయా....అలా మెల్లగా నాకు చాక్లేట్లకి బంధం ఏర్పడింది.మా తమ్ముడి పుట్టినరోజుకి నాన్న పెద్ద కాడ్బరీ చాక్లెట్ బాక్స్ తెచ్చారు.దాంట్లో ఉన్న చాక్లెట్లు అన్నీ తినేసాక అది వాడు జామెట్రీ బాక్స్ గా యూజ్ చేసేవాడు.నాకు అలాంటిది కావాలని ఎంత ఏడ్చానో! మరీ నా పుట్టినరోజు అప్పటికే అయిపోయిన్దాయే!! ఆఖరికి ఒకరోజు దాంట్లో వేపకాయలు అన్నీ పిసికి రసం చేసి అందులో పోశా...వాడు దెబ్బకి దాని జోలికి  పోలేదుbig grin....ఆ బాక్స్ నేను తీసేసుకున్నా.దాన్లో జెమ్స్,చిన్న కాడ్బరీ చాక్లెట్స్ వేసుకునేదాన్ని. అలా చాక్లెట్లు నా జీవితం లో భాగం అయ్యాయి.ఎంతగా అంటే మా నాన్న ఎప్పుడు సరుకులు కొనడానికి వెళ్ళినా రెండు డైరీ మిల్కులు తీసుకురాకుండా ఉండరు.స్వీట్ డాడీbatting eyelashes


ఇక ఇంజినీరింగ్ లో 'తులసి' అని నా బెస్ట్ ఫ్రెండ్....దానికి నాకంటే చాక్లెట్ల పిచ్చి ఎక్కువ. దాని బాగ్ లో ఎప్పుడు రెండు,మూడు చాక్లెట్లు ఉండాల్సిందే.క్లాస్ లో ఎవరన్నా చాక్లెట్ తింటే దానికి పెట్టాల్సిందే...నేను దానికీ పోటిగా తయారవడం తో మా ఇద్దరి మధ్య చాక్లెట్ యుద్ధాలు కూడా సంభవించాయి.ఇక ఇలా కాదని..ఒక ఒప్పందానికి వచ్చాం.ఎక్కడ చాక్లెట్ దొరికినా చెరిసగం పంచుకోవాలి అని...అదేదో దొంగలు దొంగతనం చేసాక వాటాలు పంచుకున్నట్లుhee hee.చీట్ చేయకూడదు అని రూల్ కూడా పెట్టుకున్నాంtongue అయినా ఎవరికి వారం దొంగచాటుగా చాక్లెట్లు మెక్కేస్తూ ఉండేవాళ్ళం.డైరీ మిల్క్,పెర్క్,మంచ్,మిల్కిబార్,కిట్-కాట్,ఫైవ్ స్టార్,బార్ వన్....ఇంకా డైరీ మిల్క్ లో లభ్యమయ్యే అన్నీ ఫ్లేవర్స్,....అన్నీ వెరైటీస్ టేస్ట్ చేసేసాం....సరదాగా మొదలైనది......వదలలేని స్థితి కి వచ్చింది.చివరికి చందు పరిచయం అయ్యాక తనకీ అర్ధమయింది నా చాక్లెట్ల పిచ్చి....కానీ నా ఇష్టమే వీక్నెస్ అయిపొయింది....ఇక విప్రో ఎక్సామ్స్ అపుడు 'ఇందు నువ్వు ఈ చాప్టర్ ఇవాళ ఫినిష్ చేసేస్తే నీకో చాక్లెట్'......'ఇందు నువ్వు అల్లరి చేయకుండా అన్నం మొత్తం తినేస్తే నీకు పెద్ద చాక్లెట్ కొనిపెడతా' ఇలా సుతిమెత్తని బ్లాక్మైల్స్ కూడా మొదలయ్యాయిd'oh....

ఇక అమెరికా వచ్చాక....ఎన్నెన్ని చాక్లెట్లోdancing....ఆహా! వాల్మార్ట్ కి వెళ్ళినా...క్రోగర్ కి వెళ్ళినా....అదేదో సినిమా లో భానుప్రియ 'కొసరు' అని అడిగినట్టు..నేను కూడా...'చాక్లెట్' అని అడగటం...చేసేది లేక...అవి తీసుకోవడం చందు కి అలవాటయిపోయింది..... అయినా నాకోసమే అన్నట్టు బిల్ కౌంటర్ దగ్గరే పెడతారుbig grin ఏంటో వారి అభిమానం.మొన్నటికి మొన్న వేలంటైన్స్ డే సందర్భంగా బోలెడు చాక్లెట్లు మంచి మంచి ప్యాకింగ్ చేసి పెట్టారు.ఇక నేను ఆగుతానా? పట్టుకొచ్చేసా.... హర్షీస్ కిసేస్, ఇంకా మీనియేచార్స్,లింట్ ట్రఫిల్స్.... ఇవి చిన్ని చిన్ని చాక్లెట్స్ కదా....అటు ఇటు వెళుతూ నోట్లో వేసేసుకోవచ్చ్చు అని నా ప్లాన్. నిన్న రాధికా చాట్ లో చెబుతోంది వాళ్ళ  ఫ్రెండ్ కి సాంబార్ లో చాక్లెట్ నంజుకోవడం అలవాటు అటrolling eyes.నాకు మరీ అంత వైలెంట్ కోరికలు లేవు గాని...ఏదో ...పూటకి మూడు చాక్లెట్ బార్లు తింటే చాలుbig grin అంతే.అల్పసంతోషిని కదా!!

సరే మరి.నాకు  చాక్లెట్ తినే వేళయింది.నా  పోస్ట్ చదివి మీకు చాక్లెట్ తినాలనిపించిందా...అసలే ఇవాళ నా బర్త్ డే మరీ!! మీకు బోలెడు చాక్లెట్స్ ఫ్రీ....ఫ్రీ.....ఫ్రీ.... ఇదిగో చాక్లెట్ .ఎలా ఉంది ?? యమ్మీ కదా!day dreaming

32 వ్యాఖ్యలు:

SHANKAR.S చెప్పారు...

మీకు బోల్డు హ్యాపీ బర్త్ డే శుభాకాంక్షలు ....ఇంకా బోల్డన్ని చాక్లెట్లు

విరిబోణి చెప్పారు...

Wish You a very happy birthday to uuuuuuuuu - indu:)

kiran చెప్పారు...

జన్మదిన శుభాకాంక్షలు ఇందు..:):)
ఇద్దో నీ గిఫ్ట్..బోలుడు chocolate లు నీకు...:)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ టపా బాగుంది ఇందూ :-) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు :-) పుట్టినరోజంటే మరి కనీసం పదినిముషాలకో చాక్లెట్ అన్నా తినాలి తింటున్నారా :-) ఈ సంధర్భంగా మీకు మరిన్ని మంచి మంచి రకాల చాక్లెట్స్ ప్రాప్తిరస్తూ అని ఆశీర్వదిస్తున్నా :)

ఇందు చెప్పారు...

@SHANKAR.S: Thankyuuu shankar garu :)

@ విరిబోణి: Thankyouu viriboni [:)]

@ kiran:ఇంద అన్నావు మరి ఏది నా చాక్లెట్ గిఫ్ట్???? కిరణ్ ఎప్పుడు ఇంతే! మోసం చేసేస్తుంది :(

ఇందు చెప్పారు...

వేణుగారు..కెవ్వ్! పదినిమిషాలకి ఒక చాక్లెటా? మా చందుకి తెలిస్తే అసలుకే మోసం వస్తుంది.అసలే ఈ విషయం తెలీకుండా చాలా జాగ్రత్తగా తింటున్నా....:P Thnx for the wishes :)

Hima bindu చెప్పారు...

Happy birthday
ఇలా చాక్లెట్స్ గూర్చి చెప్పి ఊరించడం మీ బర్త్ డే నాడు అస్సలు బాలేదు :-( నా బాగ్ లో కూడా గుప్పెడు చాక్లెట్స్ వుండాల్సిందే .

..nagarjuna.. చెప్పారు...

Happy returns of the day Indu gaaru...

http://www.thecolorsmagazine.com/wp-content/uploads/2009/10/chocolates.jpg

ఏంటీ చందుగారికి తెలీకుండా ఇంకో చాక్లెట‌బార్ లాగిస్తున్నట్టున్నారు చెప్తా చెప్తా... ఎస్కూస్‌మీ చందుగారు ఓసారి ఇటొస్తారా సీక్రెట్ చెప్పాలి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మీకు జన్మదిన శుభాకాంక్షలు. చాక్లెట్స్ మీరు తినడమేనా మాకు ఏమైనా మిగిల్చారా.:)

Ennela చెప్పారు...

//ఆఖరికి ఒకరోజు దాంట్లో వేపకాయలు అన్నీ పిసికి రసం చేసి అందులో పోశా//...పాపం అమాయకం తమ్ముడు...తమ్ముడూ కడిగి వాడచ్చమ్మా..అక్కలిలాగే మోసం చేస్తారు..

//రాధికా చాట్ లో చెబుతోంది వాళ్ళ ఫ్రెండ్ కి సాంబార్ లో చాక్లెట్ నంజుకోవడం అలవాటు అట//..అవున్లెండి..చిన్నప్పుడు అమ్మ పెట్టిన తీపి పులుసు అలవాటు పడి ఉంటారు.ఇలాంటివి విని తట్టుకోవాలి ..తప్పదు...!

//అంతే.అల్పసంతోషిని కదా!!.//.ఏంటో మరీ మొహమాటపెట్టేస్తున్నారు..పోనీలే బర్త్ డే కదా అని ఒప్పేసుకుంటున్నా...

పోస్టు మొత్తం స్వీట్ స్వీట్ గా చాల బాగుంది కానీ , ఒక ఏడాది పోయాక, అయ్యో,సన్నజాజులు బొండు మల్లెలెలా అయ్యాయబ్బా అని ఆశ్చర్య పోకూడదంట ..హ్హాహా
హ్యాప్పీ బర్త్ డే టు యూ...

ఇందు చెప్పారు...

@చిన్ని :Thankyou chinni garu.mee blog lo ippude kaasini chocs petti vacha chudandi :)

@ ..nagarjuna.. :నాగార్జునగారూ చాలా బాగుంది మీ గిఫ్ట్.మీరు నయం ఆ కిరణ్ కంటే ;) కానీ ఇలా చందుకి ఈ విషయం లీక్ చేసేయకూడదు.టాప్ సీక్రెట్ :P

@ బులుసు సుబ్రహ్మణ్యం :థాంకూలూ....థాంకూలూ....అయ్యోరామా! మీకు పెట్టకుండానా? అదిగో అల్ల లింకు పెట్టాగా? అందులో బోలెడు చాక్లెట్లు ఉన్నాయ్! పండగ చెస్కోండీ మీరు :))


@ Ennela:వాడిమొహం వాడికి ఆ గ్నానమే ఉంటే నా పప్పులు ఎలా ఉడికేవీ??

నేను అంతే గుందె దిటవు చేసుకున్నా అది విని :(

నాగురించి మీకు తెలియంది ఏముంది ఎన్నెలగారూ....మీరు మరీనూ!

థాంక్స్...థాంక్స్...ఈదెమిటి ఇలా శాపం పెట్తేసారు? అంతేనంటారా? ఐతే కొంచెం తగ్గిస్తాలేండీ! :((

సుమలత చెప్పారు...

ఎన్నెల గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే బాగుందండీ మీ చాకొలేట్ పలాయనం మరి నాకు ....

ఇందు చెప్పారు...

సుమలత గారూ...కెవ్వ్! నేను ఎన్నెలగారు కాదు :( ఇందు.నా బ్లాగ్ వెన్నెల సంతకం :( అయినా పర్లేదులేండీ.... :) లైట్.

మీకూ కావాలా నా బ్లాగ్లో అక్కడ రెండు డబ్బల్లో పోసాగా చాక్లెట్లు అవన్ని మీకే! తీసేసుకోండీ...తినేయండీ..పండగ చేసుకోండీ :)

Ennela చెప్పారు...

సుమలత గారు, నాకు తెలుసు మీరు నా గురించి కలవరిస్తున్నారని...
ఇలా వచ్చెయ్యాలన్నమాట నా దగ్గరికి
http://ennela-ennela.blogspot.com

ఇందు చెప్పారు...

ఎన్నెలగారూ మీ ఫాన్స్ లిస్ట్ పెరిగిపోతున్నదోచ్!

ramki చెప్పారు...

ముందుగ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇందు గారు......
ఇలాగె కలకాలం 3 హర్షీస్ కిసేస్ తో 6 లింట్ ట్రఫిల్స్ తో (రూజు కి ఇన ఓకే లేకపోతే గంటకి ఇన ఓకే :) ) మీ లైఫ్ సాగిపోవాలి అని మీ అందరి ఫోల్లోవేర్స్ తరపున కోరుకుంటున్నాను అండి.......
ఇంతకి మీరు చెప్పిన మీ ఈ చాక్లెట్లు లెక్క అధికరికంగానా......? లేకపోతే అనధికారికంగాన.........? :)
పాపం....చందు గారిని అమాయకుల్ని చేసి ఇలా తినేస్తార.........?
అన్నట్లు మరిచాను........
ఇంతకి మా చాక్లెట్లు ఏవండి .........
కొంపతీసి మా పేరు చెప్పేసి గుటకయస్వహనా..........? :(
సర్లెండి ఎం చేస్తాం......
మీ పేరు చెప్పి నేను కూడా ఒక చాక్లెట్ తినేస్త........ :)

Sree చెప్పారు...

Happy birthday Indu...

Naa kooturiki kooda undi ee chocolate picchi.. kaani tanaki 22 months :) and tana bhashalo avi "kakideelu" oka rangelo kummestadi annam nellu vadilesi maree :((.

Rajesh చెప్పారు...

Many happy returns of the day Indu...

Unknown చెప్పారు...

అన్నేసి చాకొలెట్లు తింటావా .. నువ్వు .. హ్మ్ సరేలే పుట్టిన రోజు కదా తినీ .. మా ఊరు రా నీకు ఇంకా బొళ్లు కొనిపెడత :)
హాపీ బర్త్ డే వన్స్ అగైన్ .. ఫ్రెండ్ :)

లత చెప్పారు...

మీ చాక్లెట్ పోస్ట్ ఊరిస్తూ బావుంది.మా ఇంట్లో కూడ చాక్లెట్స్ బాగా తింటారు.

Ram Krish Reddy Kotla చెప్పారు...

Indu, wish you a very very happy Birthday.. Hope u had a very pinkiful and chocolatie birthday :)

సాపాటు సమగతులు చెప్పారు...

ఇందు గారు సారీ అండి చూసుకోలేదు ఎన్నెల సంతకం
టపా టైటిల్ చుసుకోలేదండి ........

సాపాటు సమగతులు చెప్పారు...

ఇందు గారు చాక్లెట్స్ ఇచ్చినందుకు థాంక్స్ అండి

సాపాటు సమగతులు చెప్పారు...

ఇందు గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

ఇందు చెప్పారు...

@RAMAKRISHNA VENTRAPRAGADA said...:బోలెడు థాంకూలూ మీకు రామక్రిష్ణ గరు :) అధికారిక లెక్కలె! హ్హిహ్హిహ్హి!! మరి చెప్పి తింటారా ఎంటి? అలా చేస్తె చాక్లెట్ల వైపె చూడనివ్వరు :)) మీకు కూడా ఉన్నాయండీ! నేను మరీ అల ఎవరికి పెట్తకుండా తినను :))

@ Sree:థాంక్యూ శ్రీ గారు :) ఐతే శ్రియా నాలాగే మంచిపిల్లలాగా తయారవుతుంది రేపు పెద్దైతే :)


@Rajesh:Thankyuuu Rajesh :)

ఇందు చెప్పారు...

@కావ్య :Thankyou my dear Cuty,Sweety,Pretty,Naughty Kavya :)


@లత :Thankyou Thankyou :)

@Kishen Reddy :Woww! pinkiful&chocolattie...kevvvv! Thnx thnx Kishen :)

ఇందు చెప్పారు...

@ సాపాటు సమగతులు :మీరు సుమలత గారు ఒకరేనా? ఏమో మరి.ఏది ఏమైనా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు :)

మనసు పలికే చెప్పారు...

హమ్మయ్య.. ధన్యవాదాలు ఇందు.. నాకోసం ఆ గాడ్జెట్‌ని తీసేసినందుకు. ఇప్పుడు వ్యాఖ్య పెట్టొచ్చు:)
ఓ పని చేద్దాం.. మన పాపికొండలు ట్రిప్‌లో బోలెడన్ని చాకొలెట్లు తెచ్చుకుందాం. ఫుల్లుగా తినేద్దాం:)))) ఇంకా అప్పుడే బర్త్‌డే కేక్ కూడా కట్ చేద్దువు కానీ (చాచొలెట్ ఫ్లేవర్).
టపా చాకొలెట్లంత మధురంగా ఉంది..

శివరంజని చెప్పారు...

మరేమో ఇందు గారు మీకు బర్త్ డే విషెస్ ఆ రోజే చెప్పేసాను కదా ... కాని ఇక్కడ చాక్లేట్స్ పంచి పెడుతున్నారని నాకు తెలియదు ... నేను రాలేదని మీరందరూ తినేసారా

భాను చెప్పారు...

హృదయపూర్వక జన్మ దిన శుభాకాంక్షలు

రాధిక(నాని ) చెప్పారు...

మాప్రియ కుడా సేం మికులా చాక్లెట్ పిచ్చిది .రోజు ఎన్నైనా తినేస్తుంది.
జన్మదిన శుభాకాంక్షలు ఇందుగారు :))

చాలా లేటుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నందుకు సారీ..సారీ .
వారం నుండి మీ బ్లాగ్ ఓపెన్ చేసినప్పుడే కరెంట్ పోవడం ,నెట్ ఆగిపోవడం ఇలా జరిగింది .అందుకే లేట్ గా చెబుతున్నా..:౦

అజ్ఞాత చెప్పారు...

I'm learning telugu just now. Still I need help to understand. Me and my mom went through your blog. It is very nice Indu akka.My mother said you write very well. She is a journalist u know?
I too love chocolates:). My mom used to make for me. Next time when you come to Hyderabad we will share a chocolate feast :)