సుమారు నెల రోజుల క్రితం.....
ఇంకో మూడు గంటల్లో ఫ్లైట్......వెళుతోంది ఇండియాకి! ఎంత హడావిడో! ఇంకెంత సంతోషమో! ఒక్కదాన్నే వెళుతున్నందుకు కాస్త భయం కూడా! అన్నీ సర్దేసుకుని ఇక బయలుదేరే వేళ............తెలిసింది విషయం అమ్మమ్మ పోయారని! ఒక్క నిమిషం కాలం ఆగిపోయినట్టయింది. ముందు ఏడుపు కూడా రాలేదు ఆ షాక్‌లో!
కాసేపటికి ఇక నావల్ల కాలేదు! చందు ఎంత ఓదార్చినా కంట్రోల్ చేసుకోలేకపోయా. ఇక ఫ్లైట్‌లో మరీ ఒక్కదాన్నే అయిపోయేసరికి ఇంకా ఏడుపొచ్చేసింది. ఎక్కడినించి వస్తోందో అంత దుఖం!! అమ్మమ్మ జ్ఞాపకాలు ఒక్కొక్కటి వచ్చి సూదుల్లా గుచ్చుతున్నాయ్! కనీసం చివరిసారైనా చూడటానికి లేదు కదా అని ఎంత బాధేసిందో!! అలా నా బాధంతా కన్నీటి రూపంలో కరిగిపోయి.....ఎప్పటికో సర్దుకున్నా! కాని 'ఇక అమ్మమ్మ లేదు' అనే మాట తలుచుకోగానే తన్నుకొస్తోంది దుఖం! ఇండియాలో ఫ్లైట్ లాండ్ అయ్యాక ఇక నన్ను నేనే తమాయించుకున్నా అదీ అమ్మని చూసేవరకే!
కాసేపటికి ఇక నావల్ల కాలేదు! చందు ఎంత ఓదార్చినా కంట్రోల్ చేసుకోలేకపోయా. ఇక ఫ్లైట్‌లో మరీ ఒక్కదాన్నే అయిపోయేసరికి ఇంకా ఏడుపొచ్చేసింది. ఎక్కడినించి వస్తోందో అంత దుఖం!! అమ్మమ్మ జ్ఞాపకాలు ఒక్కొక్కటి వచ్చి సూదుల్లా గుచ్చుతున్నాయ్! కనీసం చివరిసారైనా చూడటానికి లేదు కదా అని ఎంత బాధేసిందో!! అలా నా బాధంతా కన్నీటి రూపంలో కరిగిపోయి.....ఎప్పటికో సర్దుకున్నా! కాని 'ఇక అమ్మమ్మ లేదు' అనే మాట తలుచుకోగానే తన్నుకొస్తోంది దుఖం! ఇండియాలో ఫ్లైట్ లాండ్ అయ్యాక ఇక నన్ను నేనే తమాయించుకున్నా అదీ అమ్మని చూసేవరకే!
ఇక నా జీవితంలో 'అమ్మమ్మ' అని ఎవ్వరినీ పిలవలేను అనుకుంటేనే ఏదో తెలియని బాధ గుండెల్లో మెలిపెడుతోంది! నన్ను చిన్నప్పుడు ముద్దు చేసిన అమ్మమ్మ, నాకు తాయిలాలు చేసి పెట్టె అమ్మమ్మ....నా బాల్యపు తీపిగుర్తుల్లో అత్యంత తియ్యనైన అమ్మమ్మ.....నాకు వీడ్కోలు చెప్పకుండానే......నేను వచ్చేలోగానే హడావిడిగా సుదూర తీరాలకు వెళ్ళిపోయింది! నా పరిస్థితే ఇలా ఉంటే ఇక అమ్మ సంగతి ఏమని చెప్పనూ? అమ్మతో ఫోన్లో మాట్లాడటానికి కూడా నాకు ధైర్యం చాలలేదు! ఎంత ఏడ్చిందో! కన్నతల్లి కదా మరి!
ఎన్నెన్నో జ్ఞాపకాలు! ఒకటా? రెండా? నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో నన్ను మొట్టమొదటిసారిగా తాకింది మా అమ్మమ్మే! అలాగే నన్ను మా ఊరు తీసుకెళ్ళి......తన అరచేతుల్లో పెట్టుకుని చూసుకుంది! చిన్నప్పుడు నా ప్రతి వేసవి సెలవుల విడిది అమ్మమ్మ ఊరే!! పొద్దున్నే లేచి అమ్మమ్మ కుంపటి మీద చేసే ఉప్మా...... కట్టెల పొయ్యి మీద వండే చక్రాలు,తనకి ఇష్టమయిన వంకాయ కూర,ఇంటి వెనుక పెంచిన మొక్కలు, రోట్లో రుబ్బే గారెల పిండి, దేవుడి గదిలో ఉండే తనకిష్టమయిన రాములోరి పటం, పొద్దున్నే నీళ్ళు పట్టే పెద్ద గాబు,రోజు వెళ్లి దణ్ణం పెట్టుకునే రామాలయం, తను కొండ ఎక్కలేకపోయినా ఇక్కడినించే మొక్కుకునే శివాలయం......ఎన్నెన్ని గుర్తులు తనతో పాటే గాల్లో కలిసిపోయాయి!
నాకోసం ఏరికోరి గుడ్డ తీసుకుని అందమైన పరికిణీలు కుట్టించేది. ముచ్చటపడి వెండి జడ గంటలు చేయించింది. నేనెప్పుడు ఊరికేల్లినా నాకిష్టమైన తాటిముంజెలు,జున్నుపాలు,చెరుకు గడలు సిద్ధం! పిడుగులు పడుతుంటే.....నేను భయంతో తన ఒళ్ళో ముడుక్కుంటే .... 'అర్జునా.... ఫాల్గుణ.... కిరీటి.... శాతవాహనా....' అని పెద్దగా అంటూ ఉండేది.అలా చేస్తే పిడుగు భయపడి మనదగ్గరకు రాదు అన్ని చెప్పేది! నేనెప్పుడైనా ధైర్యం కోల్పోయి బేలగా మాట్లాడితే అస్సలు ఊరుకునేది కాదు! ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి....ఇలా ఎప్పుడు ఏడవకూడదు అని కన్నీళ్లు తుడిచేది! ఇప్పుడు ఇక నాకు అలా చెప్పేదెవరు?
నాకు ఉహ తెలిసి అమ్మ తరువాత అంత ఆప్యాయంగా చూసుకుంది అమ్మమ్మే! బామ్మ కంటే నాకు అమ్మమ్మ దగ్గరే ఎక్కువ చనువు! నేనంటే ఎంత ప్రేమంటే....ఊరు వదిలి వచ్చే ప్రతిసారి తన కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి! మేము ఏ ఊరు వెళ్ళినా తనని వెంటబెట్టుకుని వెళ్ళేవారం! నా పెళ్లి చూడాలనేది అమ్మమ్మ అతి పెద్ద కోరిక! కాని తను రాలేకపోయింది. అది నా పెళ్ళిలో తీరని లోటు! ఇప్పుడు అసలుకే లేకుండా నన్ను ఒదిలి వెళ్ళిపోయింది. 'అమ్మలూ' అని ప్రేమగా పిలిచే ఆ పిలుపు ఇక నాకు ఎప్పటికి వినపడదు కదా!
కొంతమంది అమ్మమ్మ పోయిన విషయం తెలిసి అన్నారు....' ఆ పెద్దావిడ కదా! పోవడమే మంచిది. ఇంకా ఎంతకాలం ఉంటుందిలే' అని. నా మనసు చివుక్కుమంది. పెద్దావిడైనా తను మా అమ్మకి కన్న తల్లి! నన్ను అల్లారుముద్దుగా చూసుకున్న అమ్మమ్మ! మన ఆత్మీయులు ముసలివాల్లైతే ప్రేమలు పోతాయా?? అలా అయిపోయాయి మానవ సంబంధాలు!!
ఎవరేమనుకుంటే ఏం....అమ్మమ్మా.....నాకు నువ్వంటే బోలెడు ఇష్టం....నీకు నేనంటే అంతే ఇష్టం. కాని నాకు చెప్పకుండా.....నేను వచ్చే వరకు ఆగకుండా వేల్లిపోయావ్! నాకు నీమీద చాలా కోపంగా ఉంది! అయినా నీమీద అలగడానికి ఇప్పుడు నువ్వు లేవుగా! పోనిలే! నీకు రాముడంటే ఇష్టంగా అక్కడే ఉండు. హాయిగా అక్కడే నీ బుజ్జి మూతి హనుమంతులవారితో ఆడుకో! ఎప్పుడైనా నాకు కష్టం వచ్చి నిన్ను తలుచుకుంటే....నీ రాములవారితో చెప్పి నా కంట నీరు తుడుస్తావు కదూ!
అమ్మమ్మా.....ఐ మిస్ యు! నాకు కాలం గిర్రున వెనక్కి తిరిగి మళ్లీ నీ చేతుల్లో ఆడుకోవాలని ఉంది! మన ఊళ్ళో...ఆరుబయట వెన్నెల్లో....నువ్వు చెప్పే కథలు వింటూ....గోరుముద్దలు తింటూ......అక్కడే ఉండిపోవాలని ఉంది! మళ్లీ ఆ రోజులు వెనక్కి వస్తే బాగుండు! నువ్వు 'అమ్మలు' అని పిలుస్తూ నన్ను ముద్దాడితే బాగుండు!
నీకోసం నేనేమి చేయలేకపోయా అమ్మమ్మా! కనీసం ఆఖరి చూపు కూడా చూడలేకపోయా! ఇలా నీ జ్ఞాపకాలు అక్షర రూపంలో భద్రపరుచుకుందామని రాస్తున్నా! ఇదే నేను నీకు ఇస్తోన్న 'అక్షర నివాళి'.........
21 కామెంట్లు:
http://muralidharnamala.wordpress.com/2011/03/08/ammamma/
అమ్మమ్మే లేకుంటే మనకి బాల్యమే లేదండి. చల్లని చూపులతో అమ్మమ్మ ఎక్కడున్నా అమ్ములూ అని మిమ్మల్నే చూస్తుంటారు. భౌతికంగా దూరమయినా 20 ఏళ్ళకు పైగా మీ జీవితంలో పెనవేసుకుపోయిన అనుభందం, ఙ్ఞాపకాలుగా మీతోనే చివరి వరకూ ఉంటుంది. దిగులుపడకండి.
ఇందు .. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .. నీ బాధని అక్షరాలుగా మార్చి రాసినట్టు ఉంది ఈ పోస్టు ..
బాధ పడకు ఇందు .. మేమంతా ఉన్నాం కదా .. ఎప్పుడు కావాలన్నా నీకు ఒక కాల్ దూరం లో ఉన్నాను నేను సరేనా ..
నువ్వు అలా అంటే మా అమ్మమ్మ ఎప్పుడో పోయింది . నాకు ఎలాంటి జ్ఞాపకాలు లేవు వాళ్ళకి సంబంధించి .. ఇంకేమి అనాలి ?? మా అమ్మమ్మ చెల్లి ఉంది ఇంకా తననే అలా పిలుచుకుంటాము ..
may her soul rest in peace ..
అవును, అమ్మమ్మ లేని బాల్యం బాల్యమే కాదేమో! నాకూ బామ్మ తెలీదు. అమ్మమ్మే తెలుసు! చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర పడుకుని మీద కాలు వేసుకుని అమ్మమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోవడం ఒక బంగారు అనుభవం!
ఇందూ, I share your greif! ఎందుకంటే అమ్మమ్మ అంటే ఏంటో నాకూ తెలుసు! సో సారీ!
ఇందు.. టపా అంతా అయిపోయే సరికి అప్రయత్నంగా కళ్లలో నీళ్లు.. 4 సంవత్సరాల క్రితం నా పరిస్థితి గుర్తొచ్చింది. ఏంటో మాటలు రావట్లేదు ఇందు..
I know the pain indu... Be strong... pain comes in waves and touches us hard at times, only time will heal it...
అమ్మమ్మతో మీ అనుబంధం గురించి తెలుసుకోవడమ్ బాగుంది ఇందుగారు.. తనని మీరెంతగా మిస్ అవుతున్నారో మీరు రాసిన ప్రతి అక్షరం చెప్తుంది. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
ఇందు గారు,
అందుకేనా మీరు ఈమధ్య కనిపించనిది..మీ నివాళి కదిలించింది.. మీకు, మీ కుటుంబానికి, నా ప్రగాఢ సానుభూతి..
ఇందు గారూ,
మీకు నా "సహ" అనుభూతి. (సానుభూతి కాదు - మీతోటి అనుభవించిన "సహ" అనుభూతి) సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఉన్నట్టుండి నేనూ ఇలా కుప్పకూలిపోయాను. అమ్మమ్మ నా తొలి గురువు - అందరూ నన్ను చిన్నబుచ్చినా, నా బిడ్డ బాగా గొప్ప చదువులు చదువుతుందని చెప్పేది. ఆమె పుణ్యమే నాకు వచ్చిన కాసిన్ని తెలుగు పద్యాలూ, తెలుగు మీది ఇష్టతానూ ! అమ్మమ్మని గుర్తు చేసి కన్నీటి నివాళిని అర్పింపజేసారు ఒక్కసారి!! కానీ ఇప్పుడు నిజంగా అంత బాధపడట్లేదు నేను - ఎందుకంటే మా అమ్మమ్మే నాకు కూతురుగా పుట్టింది! మా అమ్మమ్మ బాధలో కూడా "అమ్మా" అనక, కృష్ణా, అనేది. మా అమ్మాయి నిద్రపోవాలంటే - కృష్ణ జపం చేయాల్సిందే ... నెలల పిల్లగానే అది "కిత్త" "కిత్త" అని నామ జపం చేస్తూ ఉండేది. :-) మొన్ననే మా అమ్మమ్మకి .. అదే అమ్మాయికి సంవత్సరం నిండింది.
అలా అమ్మమ్మ మళ్ళీ మరో రూపంలో మీ దగ్గరకి వస్తుందని అనుకుంకోండి మరి! మీరు త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తూ -
చాలాసార్లు లాగానే మొన్నొకరోజు పొద్దున్నే మిమ్మల్ని బాగా తలుచుకున్నాను..ఆ రోజే మీరు నాకు రెండు వ్యాఖ్యలు పెట్టారు...when you think of someone and the feeling is strong..your thoughts reach them..wherever they are..
మీ అమ్మమ్మగారు ఎక్కడ ఉన్నా తనకు ప్రియమైనవాళ్ల క్షేమాన్ని కోరుతూనే ఉంటారు. మీ జ్ఞాపకాలు నాకు మా 'నాన్నమ్మ'ను గుర్తుచేసాయి. వేరే దేశంలో ఉండి కూడా సమయానికి కాకపొయినా వీలైనంత వెంఠనే వెళ్లగలిగారు..మీ అమ్మగారి బాధ పంచుకోగలిగారు. ఓదార్చగలిగారు.అలా కూడా వెళ్లలేనివారు ఎంతమంది ఉంటారో అని ఆలోచించండి..అప్పుడు మీ దు:ఖం కాస్తైనా ఉపశమనాన్ని పొందచ్చు.
:((((..matallev..kani ii badha ela untundo naku baga telsu..
ammammalu ,tatayyalu ..entha sweeto...cheppalem...!!
Roju lechinappati nunchi Etu parigeduthunnamo theleyani ee payanam lo okka kshanam aaginatlanipinchindi.
May God keep her soul in his lap..
ఇందు గారు ,
మీ అమ్మమ్మ గారు మళ్ళీ మీ ఇంటికి వస్తారండి .ఇష్టమైన వారిని వదిలి ఎక్కడికీ వెళ్ళరు .
Meru ammamma gari gurinchi rasindi chaduvutunte nenu na novel vennello godavarilo rasina ammamma gurtuku vachharu...tana manavaralini ammulu ane pilustundi a paatra...and ma grany ni kuda gurtuchesaru...thanks alot meku kudirinappudu okasari na blog visit cheyandi
http:/kallurisailabala.blogspot.com
@ MURALI :అవును మురళిగారూ....మీరన్నది నిజమే! అమ్మమ్మ ఎక్కడున్నా నామంచే కోరుకుంటుంది
@ కావ్య :థాంక్స్ ఫర్ ద సపోర్ట్ కావ్యా!! నీకు మీ అమ్మమ్మతో అంత అనుబంధం లేకపోయినా మనకి బాగా దగ్గరవారు దూరమయ్యే బాధ తెలుసుగా...హ్మ్! ఇదీ అంతే!
@ సుజాత: అవును సుజాతగారూ! అమ్మమ్మలేనిదే నా బాల్యమైతే లేదు.అంతే! అమ్మమ్మ,తాతయ్య,బామ్మల ప్రేమకి ఆల్టర్నేటివ్ లేదేమో!
@మనసు పలికే: హ్మ్! అవును అపర్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇంతే! ఎంత అనుబంధం ఎక్కువుంటే అంత బాధ ఎక్కువౌతుంది.
@Sree: Thnx for the concern Sree. Yeah sure. I will try
@ వేణూ శ్రీకాంత్:థాంక్యూ వేణూగారూ!
@కృష్ణప్రియ: కృష్ణగారూ....అవునండీ!! అసలు ఏమీ ఇంటరెస్ట్ లేదు కొద్దిరోజులు.అన్నిటికీ దూరంగా ఉన్నా!! ఈమధ్యే కొంచెం పర్లేదు.
@విరజాజి: విరజాజిగారూ...మీది నా పరిస్థితేనా?? హయ్యో అంత బాధ అనుభవించారా?? మీరు చెప్పినట్టే మా అమ్మమ్మ ఇంకో రూపంలో వస్తే అంతకంటే ఏంకావాలి??
@తృష్ణ : మీ వ్యాఖ్య ఎన్నిసార్లు చదివానో!! నాకు బాగా నచ్చింది మీరు చెప్పిన పధ్ధతి! అందుకే మీరంటే నాకు బోలెడు ఇష్టం!! థాంక్యూ తృష్ణ గారూ!! :)
@ kiran:అవును కిరణ్! నాకు తెలుసు నీ విషయం.నీ బ్లాగ్‌లో చూసా ఒకసారి! :(
@Giri Kumar (Seshu) : :((
@ karthik: Thnq Karthik garu!
@ మాలా కుమార్ :Thnq Mala garu!
@ kallurisailabala: అవునా! తప్పక చూస్తా అండీ! నాకు రెండు ఇష్టమైనవే! గోదారి........వెన్నెలా!! :)
అదే అనుకుంటున్నాను అండీ..ఈ మధ్య కొత్త టపాల్లేవేంటా అని..మీకు,మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి..అమ్మమ్మ ఙ్ఞాపకాలు బాగా చెప్పారు...మళ్ళీ అమ్మమ్మ తప్పకుండా మీ ఇంటికి వస్తారు...
@snigdha: avunu snigdha garu.....Thnq
హలో ఇందు గారు.....
మీరు ఈ మధ్య ఏ పోస్టింగ్ రాయకపోఎసరికి బిజీ గ వున్నారు ఏమో అనుకున్న.......కాని "ఐ మిస్ యు " అనే పోస్టింగ్ తో వస్తారు అని అనుకోలేదు....సారీ ఫర్ యువర్ లాస్.... :(
పెద్ద వాళ్ళ ప్రేమని చాల చక్కగా వర్ణించారు.....అది అనుభవిస్తేనే తెలుస్తుంది.....కాని నాకు మీరు రాసింది చదివితే తెలిసింది....
త్వరలో..మీరు ...మీ కుటుంబ సభ్యులు ఈ విషాదం నుంచి కోలుకోవాలి అని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను...
కామెంట్‌ను పోస్ట్ చేయండి