ఆ... టైటిల్ చూసి నోరూరిన జనతాలో మీరు ఉన్నట్టైతే.... డౌట్ లేదు... మీరు నా క్యాటగిరి నే :)
మరేమో.... అసలు సంగతేంటంటే......
మొన్నామధ్య నేను, చందూ ఆఫీసునించి సరాసరి రెస్టారెంట్ కి వెళ్లాం :)) బాగా ఆకలిమీదున్నామేమో.... ఒక నాలుగు రకాలు ఆర్డర్ చేసాం ;)
మా ఖర్మకాలి..... మంగళవారం అన్నీ రెస్టారెంట్లకి సెలవు మేము వెళ్ళింది తప్ప :( ఇక జనాలు పొలోమంటూ ఈ రెస్టారెంటుకి క్యు కట్టారు :(((
ఒక పక్కన కడుపులో కుందేళ్ళు పరిగెడుతుంటే.... ఏం చేయాలో తోచక.... అప్పటికే కొరికేసిన గోళ్ళని గిల్లుకుంటూ కాసేపు కాలక్షేపం చేశాం. ఇక లాభం లేదని.... ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటేగాని ప్రశాంతత చేకూరదని.... ఇక తిండి టాపిక్ మొదలెట్టాం!
"అసలు ఇందు.... రాజమండ్రిలో టమాటా బజ్జి ఉంటుంది....."
"చందూ..ప్లీజ్.... ఇది వందో సారి. గుంటూరు మూడొంతెనల దగ్గర మిరపకాయ బజ్జి ఎంత బాగుంటుందో... మీ రాజమండ్రిలో టమాటా బజ్జి అంత బాగుంటుంది. సరేనా? ప్లీజ్.... టాపిక్ చేంజ్"
"హుహ్!....."
"సరే.... నేను చెప్తాలే.... మా ఆఫేసులో నా కొలీగ్ ఒకాయన ఉన్నారు. ఆయనకి ఫుడ్ ఇంటరెస్టింగ్ టాపిక్ ;) ఏది ఎలా చేయాలి.... ఎలా తినాలి.... అనేవాటి మీద మంచి డిస్కషన్స్ పెడతారు. ఆయనకి అన్నిటికంటే నచ్చేది ఏదో తెల్సా??.. గుళ్ళో పులిహోర అట "
"హ్హహ్హహ్హా! మరే.... గుళ్ళో పులిహోర అల్టిమేట్ ఇందు....ప్రసాదాల్లో పులిహోర, చక్రపొంగలి నంబర్ వన్ అసలు. ఒక్క చిన్న స్పూన్ తిన్నా కూడా అమృతంలా ఉంటుంది."
"అవును మరి. దేవుడు ఎంగిలి చేస్తాడేమో.... మంచి రుచిగా ఉంటుంది :). నాకు ఆ చక్రపొంగలి వాసనకే నోరూరిపోతుంది. "
"ఏమోగాని..... ద్రాక్షారామంలో ప్రసాదం మాత్రం సూపర్! దానికి తిరుగులేదు. అసలు దానిని మించి టేస్టీ ప్రసాదం ఇంకోటి తినలేదనుకో"
"నాకు అది భలే ఇష్టం. ఎంత బాగుంటుందో! అన్నవరం ప్రసాదం తిన్నావా ఎప్పుడైనా?"
"ఆ... అది కూడా కేక! కానీ ద్రాక్షారామం అంత కాదనుకో ;) "
"నిజమే! ఆ ద్రాక్షారామం ప్రసాదం కోసం నేను మూడు సార్లు వెళ్ళా అక్కడికి ;) అసలు నెయ్యి కారుతూ ఉంటుంది. ఆహా!"
"హ్మ్! నాకైతే.... గుడి అంటే ముందు ప్రసాదమే గుర్తొస్తుంది ఇందు. నువ్వు తిట్టుకున్టావ్లె .... కానీ.... నేను మాత్రం ప్రసాదం బాచ్!" :))
"హ్హహ్హ!! అంతలేదులే.... నిజం చెప్పనా?? మళ్లీ ఎవరికీ చెప్పొద్దూ.... నేనూ సేం పించ్ ;) నాకు గుళ్ళో ప్రసాదం అంటే భలే ఇష్టం!... అసలు గుళ్ళో దేవుడి దర్సనం అయిపోయాక... కళ్ళన్నీ ప్రసాదం మీదే! "
"హ్హేహ్హే! నాకు తెల్సులే! నువ్వెప్పుడు గుడికి వెళ్ళినా ..... దేవుడికి దణ్ణం పెట్టుకున్తున్నట్టే ఉంటావ్ కానీ .... ఆ దేవుడి ముందు పెట్టిన ప్రసాదాల వైపే నీ చూపులన్నీ"
"ఏదో నీ అభిమానం ;) ఇది కాదుగాని..... నేను ఇంజినీరింగ్ చదివేటప్పుడు.... మా హాస్టల్ ఫ్రెండ్స్ అందరం.. ప్రతి మంగళవారం, శుక్రవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళేవాళ్ళం. మా హాస్టల్‌కి రెండు వీధుల అవతల ఒక గుడి ఉండేది. అది నా ఫేవరేట్. అక్కడ ఈ మంగళవారం/శుక్రవారం రోజుల్లో.... చక్కగా చింతపండు పులిహోర, ఆరెంజ్ కలర్ రవ్వకేసరి విత్ జీడిపప్పు+కిస్మిస్+నెయ్యి.... వహ్!! అసలు సూపరనుకో ;) నేనైతే.... మా ఫ్రెండ్స్ వేరే గుడికి వెళ్దామన్నా.... పట్టుపట్టిమరీ ఈ గుడికే తీసుకెళ్ళేదాన్ని.... దేవుడి మీద భక్తీ అనుకునేది మా హాస్టల్ వార్డెన్... ప్రసాదం మీద అనురక్తి అని వాళ్ళకి తెలీదుగా ;) "
"ఆ..... ఆంజనేయస్వామికి మెడలో వేస్తారు చూడు అప్పాలు.... అబ్బ.... ఆ టేస్ట్ అసలు అన్‌బీటబుల్!"
"అప్పాలా..... అవి బాగుంటాయని నువ్వంత మొహమాటంగా చెప్పాలా? ;) "
"హహ!! 'అతడు' డైలాగ్ కదా...సూపర్ సినిమాలే. ఏదీ ఏమైనా కానీ అన్నిటికంటే తిరుపతి లడ్డు ప్రసాదం హైలైట్ "
"హా! నిజమే! తిరుపతి అంటే గుర్తొచింది.... శ్రీశైలంలో అమ్మవారిగుడి దగ్గర రాత్రిపూట పూజ అయ్యాక ప్రసాదం పెడతాడు.... ఆహా.... అల్టిమేట్ అసలు. జస్ట్ ఉప్పు+పోపు వేసిన దద్దోజనం ఉంటుంది... వేడివేడిగా.... అబ్బబ్బా!! నోరూరుతుంది చెబుతుంటేనే! అలాగే... ఆ చింతపండు పులిహోర.... దేవుడా! అందులో ఊరిన ఆ ఎండు మిరపకయలైతే ..... సూపరేహే!"
"నాకు శివాలయాల్లో శివుడికి అభిషేకం చేస్తారు.... 'పంచామృతం' .... అది భలే ఉంటుంది ఇందు :) ఆ టేస్ట్ అసలు ఎలా వస్తుందో.... ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా!"
"అవును చందూ.... ప్రసాదాల రుచే వేరు. మొన్నామధ్య మనం పిట్స్ బర్గ్ వెళ్ళినప్పుడు కూడా... ఫుల్లు కుమ్మేసాంగా అసలు. ప్రసాదం కోసమే గుడికి వెళ్ళినట్టుగా ఉంది." ;)
"సంపత్ ఐతే... ఎప్పుడు హారతి ఇస్తారా.... ఎప్పుడు ప్రసాదం కౌంటర్ వైపు వెళ్దామా అనే!"
"హ్హహ్హ!! నాకు అరోరా టెంపుల్ లో కూడా ప్రసాదం బాగా నచ్చింది. నాచేత డేడ్లి ఇడ్లీ తినిపించాడు వాడి పల్లి చట్నీ తో! వాడి తరువాతే ఎవరైనా"
"కదా!ఆరోజు సాంబార్ కూడా కత్తిలా ఉంది. ఇంకోసారి వెళ్ళాలి ఇందు షికాగోకి. కనీసం ప్రసాదం తినడానికైనా!! "
" :))) నాకు ఇస్కాన్ ప్రసాదం కూడా నచ్చుతుంది చందూ. ఆరోజు గోల్డెన్ టెంపుల్ లో భలే ఉంది కదా! బెంగుళూర్ ఇస్కాన్‌లో స్వీట్స్ ఉంటాయి.... వావ్... అసలు పండగే అనుకో"
"అక్కడ ఫుడ్ చాలా బాగుంటుందిరా! 'సండే ఫీస్ట్' ఐతే.... కేక! బ్యాచలర్స్ కి ఒక పూటకి కడుపునిండా భోజనం అన్నమాట ;) "
"హ్మ్! ఎన్నిసార్లు వెళ్ళావ్ బాబు..."
"అబ్బో... లెక్కలేనన్ని....."
"దేవుడి మీద భక్తా? ప్రసాదం మీద ప్రీతా??"
"అది ఇంకా చెప్పాలా? "
"హయ్యో రామా.."
"ఇస్కాన్‌లో ఉండేది కృష్ణుడు తల్లి... రాముడు కాదు.... అంటే నీ దృష్టి దేవుడి మీదా.... చిత్తం ప్రసాదం మీద అన్నమాట"
"హతవిధీ!"
"సర్ యుర్ ఆర్డర్" అనుకుంటూ............. తీసుకొచ్చాడు.... ఎపటైజేర్.
'అహనా పెళ్ళంట' సినిమాలో కోటా లాగా........ అప్పటిదాకా మేము డిస్కస్ చేసుకున్న ప్రసాదాల రుచులన్నీ ఊహించుకుంటూ..... ఇద్దరం ఏదో తినేసి బైట పడ్డాం!
అవండి.... మా గుళ్ళో ప్రసాదం గోల.... మరి మీ సంగతేంటి???? ;)
Photos Courtesy: Google

27 కామెంట్లు:
నిజమే ఇందూ.. గుళ్ళో ప్రసాదాలకి తిరుగేలేదు.. మనలోమనమాట అరోరా టెంపుల్ లో సాంబారు ఎప్పుడూ అంతే బాగుంటుంది :) నాకైతే ఆ గుళ్ళో ప్రసాదాలకోసమైనా సరే మరోసారి అమెరికా (చికాగో) వెళ్ళి రావాలని అనుకుంటూ ఉంటాను గుర్తొచ్చినపుడల్లా.
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్
అన్ని గుళ్లల్లో ప్రసాదాలు చూపించేసి, నోరూరించేసి, ఇప్పుడూ నాకు ఆకలి పెంచేశావ్ ఇందు. నాకు తెలీదు, నాకు ఆ పులిహోర, దద్దోజనం, లడ్లు అన్నీ కావాలి :( నాకు తెలీదు కొరియర్ చేసెయ్...
ఒకసారి మా రూమ్మేట్స్ అరోరా నుండి ఇడ్లీ టుగో తెచ్చారు. ఎందుకో మరి నాకయితే నచ్చలేదు. ఎప్పటి నుండో షికాగోలో ఉన్నవాళ్ళు బాగుంది బాగుంది అనుకుని తిన్నారు. నాకు మరొక ఫ్రెండ్‌కి నచ్చలేదు మరి. మా అమ్మమ్మ చేసిన ఇడ్లీలే ఇడ్లీలు. ఉల్లి చట్నీ వేసుకుని తింటుంటే అప్పదాసుకి కనిపించిన శంఖుచక్రాలు, తిరునామం మనకి కూడా కనిపించి తీరాలి అంతే.
ఈ అమెరికా ప్రసాదాలని వదిలేసి తిరుపతి లడ్డు, అన్నవరం ప్రసాదం, అయ్యప్ప ప్రసాదం, పంచామృతం ఇలాంటివి చెప్పండి నోరెత్తకుండా నోట్లో వేసుకుని తినేస్తా.
ఆహా పులిహోర ...
మీరు కూడా మా బ్యాచే..
మేము సాయి బాబా గుడికి రెగ్యులర్ కస్టమర్స్.. :)))
కెవ్వ్ ఇందూ :)))
ఇస్కాన్ అయితే అడిగిమరీ వేయించుకుంటాను నేనైతే ప్రశాంతంగా భలే ఉంటుంది
ప్రసాదం బాచ్ టీమ్ లీడర్ గారికి నమసుమాంజలి
ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ కాబట్టి మన బాచ్ తరుపున ఈ పాట అంకితం చేస్తున్నాం
ప్రసాద రౌండు నందు కమ్మనైన వంటకంబు
గుడిలోకి వెళ్ళు చందు ఓహొహ్హో ఆ వెనుకనే మా ఇందు
అహహ్హహహ్హ అహహ్హహహ్హ అహహ్హహహ్హా ఆహాహా
గుళ్ళోన లైను నందు నిల్చున్న ముందు ఇందు
ప్రసాదం బాచ్ నందు టీమ్ లీడ్ ఏ ఈ ఇందు
అహహ్హహహ్హ అహహ్హహహ్హ అహహ్హహహ్హా ఆహాహా
ఔరౌర పులిహోర కెల్లా అయ్యారె పొంగలిల్ల
ఔరౌర దద్దోజనం లల్ల అయ్యారె సాంబార్ లిల్ల
ఓ హో రే పంచామృతంలుల్ల అహాహ్హ అహాహా
ఇయెల్ల నాకే చెల్ల
గుడి లో ప్రసాదాలు నిషేదిస్తే చాల మంది పూజారులకు cholestrol problems తగ్గుతాయి. గుడిని దర్శించే భక్తులు తగ్గిపోతారు. ప్రసాదాల మహిమ చాలా గొప్పది.Nice post!
ఆహా!! ఈ పోస్ట్ చదివిన తరువాత నా నోట్లో వూరిన
లాలాజలం తో ఇక్కడ బెంగళూరు లో వరదలు వచ్చేలా ఉన్నాయి :D
మొత్తానికి సూపర్ ....
హహా... ప్రసాదమంటే పెసాదమే కదండీ... ;)
తిరపతి లడ్డూ నే నంబర్ వన్.. నా వరకూ
ఆ తర్వాత... మా అన్నారం సత్తిబాబు పెసాదం.
మొన్ననే... వేడి వేడి అన్నారం పొట్లం నెయ్యి కారిపోతూ, కాలిపోతూ ఉంటుంటే.. దాన్నీ తింటుంటే... నా సామి సత్తిబాబూ.... అద్భుతం ;)
అయ్యప్పస్వామి పెసాదం మీద మీ అభిప్రాయం ఏమిటండీ? ;)
తిరుమలలో లడ్డు, తిరుచానూరులో (అలిమేలుమంగాపురం) వడ (గాఠిగా, కారంగా.. ఆహా.. మహాప్రభో), గోవిందరాజ స్వామి సన్నిధిలో దధ్ధోజనం, దోసెలు.
ఇక అన్నవరం ప్రసాదం.. ఇలాంటిది వేరొకటి లేదు, రాదు.
సిమ్మాచలం అప్పన్న సన్నిధిలో పొంగలి, చిట్టిగారెలు, అప్పాలు. "గుండు" అని ఓ ప్రసాదం ఉంటుందండీ.. కదంబం అన్నమాట. (ఇది చాలా తక్కువ మందికి తెలుస్తుంది.) ఆ గుండు తినని వాడి జన్మ వృధా వృధా వృధా..
ఇక మా ఊళ్ళో తూర్పుగట్టు ఆంజనేయస్వామికి మంగళవారం వడల దండ మొక్కుకుని, కిటకిటలాడే రద్దీలో మునివేళ్ళమీద నిలబడి మొక్కు తీర్చుకుని.. బయటికి వచ్చి చప్టా మీద కూర్చుని తింటే ఆ గారెల రుచి ఆ గారెల రుచే..
ఎవరక్కడ.. నాకో రెండు ఇండియా టికెట్లు బుక్ చేసి బిల్లు ఇందు గారికి పంపించండి.
మా తాడిపత్రి కోదండ రంగనాథ స్వామివార్ల ఉప్పొంగలి వైకుంఠానికి వాకిలి తెరచినట్లే!
జలతారు వెన్నెలగారూ!స్వామివారికి నివేదించిన ప్రసాదంతో cholestrol సమస్యలు రావండి.దానికి వేరే కారణాలుంటాయి,
Saradaaki annanu lendi mohangaaru. Neyyi dandigaa vesi chakrapongali avi chestaaru kadaa, avi roju tintaaru kadaa poojaarulu ani alaa annaanu. Ante.
మా అమ్మమ్మ వాళ్ళ ఊరి ఆంజనేయ స్వామి అప్పాలు అంటే నాకు ఇష్టం.మా ఆహాయ్(చిన్నప్పుడు ఆచార్యులు అని అనటం నోరు తిరగక అలా పిలిచే వాడిని ,ఇప్పటికి కూడా ) వాళ్ళు బాగా చేస్తారు.
పోస్ట్ బాగుంది :))
గుళ్ళో ప్రసాదాల రుచి వర్ణించడం బహుశా ఏ కవి కి సాధ్యం కాదు. అమోఘం అద్భుతం.
నేను ఆంధ్రా యూనివర్సిటి లో చదివిన ఐదు ఏళ్లలోనూ నెలకి రెండు మాట్లు సింహాచలం నరసింహ స్వామి దర్శనానికి వెళ్ళేవాడిని. ఆ కాలం లో ప్రసాదాలు ఫ్రీ. కొనుక్కోనఖ్ఖర లేదు. పులిహోర రుచి అద్భుతం అన్నమాట. అటువంటి పులిహోర భూ ప్రపంచం లో ఎక్కడా దొరకదని నొక్కి వక్కాణిస్తున్నాను. కానీ ఒక ౫-౬ ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు కొనుక్కోవలసి వచ్చింది. అప్పటి రుచి లేదు కానీ బాగానే ఉంది.
మీతో పాటు నేను కూడా జై గుళ్ళో ప్రసాదాలు అంటాను. జై జై.
అమ్మా ఇందూ.. నిన్నటి నుండి నన్ను ఈ ప్రసాదాల రుచి వెంటాడుతూనే ఉంది. నాకు తెలీదు, నాకు ఈ ప్రసాదాలన్నీ చేర్చే పూచీ నీదే. నాకు ప్రసాదాలు కావాలీ...:'(
రాజ్, నిజమే అయ్యప్పస్వామి ప్రసాదం ఇందు మర్చిపోయినట్లు ఉంది. భలే ఉంటుంది ఆ ప్రసాదం కూడా..
>>మా తాడిపత్రి కోదండ రంగనాథ స్వామివార్ల ఉప్పొంగలి వైకుంఠానికి వాకిలి తెరచినట్లే!
నాకు తాడిపత్రి కూడా వెళ్లాలని ఉంది:(
"అవును మరి. దేవుడు ఎంగిలి చేస్తాడేమో.... మంచి రుచిగా ఉంటుంది"
ప్రసాదం కంటే తియ్యగా ఉందండీ, ఈ మాట.
మా చిన్నపుడు నరసాపురంలో వేసవి కాలంలో నెలరోజులపైనే, ఎంబర్ మన్నార్ కోవెల్లో ఉత్సవాలు జరిగేవి.
పిల్లలంతా రోజంతా అక్కడే ఉండి గుడి బయట ఆడుకొనేవాళ్ళం. ప్రసాదం టైముకి మాత్రం గుళ్ళో హాజరయ్యేవాళ్ళం.
బెంగళూరు ఇస్కాన్ లో ప్రసాదాలు నాకు అంతకంటే గొప్పగా అనిపించలేదు.
అబ్బ...ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు....
ఒక వేడి వేడి , తియ్య తియ్యని , కమ్మ కమ్మని ప్రసాదం ఆర్టికల్ తగిలింది...
దీనికి మీకు ఎన్ని బూరెలు,గారెలు ఇచ్హిన సరిపోదు...
వర్క్ లో పడి...ఏదో కమ్మటి వాసనా తిగిలితే.....మీ బ్లాగ్ ని ఒకసారి తట్టి చూసా ...
ఇంకేముంది....వివాహ భోజనం రేంజ్ లో అన్ని పిండి వంటకాలు లిస్టు ఇక్కడ ప్రత్యక్షం అయ్యింది...
నోట్లో..లాలాజలం వూరింది అంటే నమ్మండి...
ఇన్ని చూసాక...ఇంటికి వెళ్ళిన తరువాత కనీసం కేసరి ఇన చేసుకొని...దేవుడికి పెట్టి (అంటే కాస్త taste పెరుగుతుంది అని చిన్ని ఆశ ) తినాలి...లేకపోతే ఆత్మ రాముడు నొచ్చుకుంటాడు :)
ఏది ఐతే ఎం ....చక్కటి నోరు ఊరే రుచులన్నీ కళ్ళ ముందు ప్రత్యక్షం చేసారు...
అన్నట్టు మనం కూడా మీ బ్యాట్చ్ ఏ ...అదేనండి ....ప్రసాదం బ్యాట్చ్ :)
రాజమండ్రిలో టమాటా బజ్జి ఉంటుంది నిజమండీ కేవ్వ్వ్వ్ కేక ఉంటుంది. ప్రసాదాలన్నీ అంతే అండీ దేవుడు ఎంగిలి చేస్తాడేమో.... మంచి రుచిగా ఉంటాయి :) ఇస్కాన్ వాళ్ళ ప్రసాదాలన్నీ బాగుంటాయి. రాజమండ్రిలో మా ఇంటి దగ్గర వరాహ నరసింహస్వామి గుడిలో పొద్దు పొద్దున్నే బలిహారం సమయానికి ప్రసాదాలు భలే ఉంటాయి. ఈ గుడి అచ్చు గుద్దినట్టు సింహాచలం గుడిలా ఉంటుంది చందనం తొడుగుతో.... నేను అక్కడికి రోజూ వెళ్ళే దానిని. పుణ్యం మాట దేవుడెరుగు కాని మంచి ప్రసాదం వస్తుందిగా!!!
Ante Indu..pittsburgh vachhi maa intiki raakundaa vellipoyaara...:(((
idemi baaledu :(
Post maatram nooru voorinchindi :)
హాయ్ ఇందు! మీ ప్రసాదాల పోస్ట్ నోరూరిస్తూ చాలా బాగుంది
బాగుందండి మీ ప్రసాదాల ప్రసారము ...మా అక్క వాళ్ళ పాప చినప్పుడు అంటే ఒక అయిదు సవత్సరాలు ఉంటాయేమో, అప్పుడు అమ్మ తో కలిసి రోజు పొద్దున్నే ఆంజనేయస్వామి గుడి కి వెళ్ళేది, ఒక వారము తర్వాత, అమ్మమ్మా... రోజు పొద్దున్నే లేవాలి నడుచుకుంటూ గుడి కి రావాలి అంటే కష్టంగా ఉంది, రోజు నాకు ప్రసాదము తెచ్చి పెట్టావా???? అని అదిగాక కానీ తెలియలేదు దీనికి భక్తి ఎక్కడ ఉందొ...
@వేణు: అవును వేణు.... నేను రెండుసార్లు వెళ్ళాను :) సూపర్ ఉంటుంది సాంబార్ ఐతే!!
@అప్పు: అలాగే అప్పూతల్లీ! అన్నీ పార్సెల్ చేయించి పంపిస్తా ;)
@ మురళి: నువ్వు యు.ఎస్ రా చెప్తా!!! అడుగు కూడ పెట్టనివ్వను మా గుళ్ళల్లో...హా!! [అచికచికా అయ్యింది బాగా]
@ హర్షా: అవును హర్షా!! గుడికి వెల్లేదే.. ప్రసాదం మీద భక్తితో ;)
@ ఏండీ: కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్!!! సూపర్ సాంగ్!!! అదిరే...అదిరే... పాటే..అదిరే! :))
@ జలతారు గారు: :) కొలెస్ట్రాల్ ఉన్న్న...బీపీ సుగర్ ఉన్నా.. ప్రసాదం ముందు అవన్నీ దిగదుడుపే!
@ ప్రదీప్: హహ్హా!! బెంగుళూరులో వేసవిలో వరదలు ;)
@ రాజ్: అస్సలు భలే గుర్తుచేసారు రాజ్..... ఈ ప్రసాదం ఎలా మర్చిపోయాను చెప్మా? నా ఫ్రెండు వాణిది కేరళ. ఆ అమ్మాయి చేత డబ్బలు డబ్బలు తెప్పించుకుని స్పూన్ పట్టుకుంచి నాక్కుంటు కూర్హ్చునేదాన్ని ;)
@ కోవా: ఆ గుండు సంగతి నాకు తెలీదండి. ఐతే నా జన్మ..వృధా వృధా ఏనా? :((((
@ మోహన్: వావ్... అంతబాగుంటుందా???
@ జలతారు: అర్ధమయిందండీ :)) నిజమే పాపం!!
@ శేఖర్: అప్పాలా... భలే ఉంటాయ్ బుజ్జిబుజ్జిగా :)
@ బులుసు: అబ్బా! అసలు ప్రాసాదాల్లోకి పులిహోర మహాప్రసాదం అండీ బాబూ... అబ్బబ! నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయ్ ;)
@ అప్పు: దా మా ఇంటికి దా.... మొన్నే సత్యనారాయణస్వామి వ్రతం చేసుకున్నాం! ప్రసాదం మా ఆఫీసులో పంచా! అబ్బోఎ.... అసలు తినిందె తినబుద్ధెస్తుందని అందరూఉ లాగించేసారు డబ్బా ఖాళీ :)))
@ బొనగిరి: థాంక్స్ అండీ. ఇస్కాన్ ప్రసాదాలు అందరికీ నచ్చవులెండీ... మేమంటే.. కనపడింది అల్లా తినే బ్యాచ్ కదా! మాకు చల్తా! :)))
@రాంకి: హ్హెహ్హెహ్హె!!! మీరు పరిచయం చేసిందే సాయిబాబా గుడి :) థాంక్స్ ఫర్ వండర్ఫుల్ ప్రసాదం ;)
@ రసగ్న: >> . పుణ్యం మాట దేవుడెరుగు కాని మంచి ప్రసాదం వస్తుందిగా!!! ఈ లైన్ సూపర్ అండీ బాబూ!
@విరిబొణి: నేను వస్తూనే ఉంటా విరిబోణిగారు. ఈఎసారి కలుద్దాం....మీరేమీ దిగులు పడకండీ....
@ రాధిక (నాని): మీరెప్పుడు ఫాం లోకి వస్తారండీ :(((( ఎప్పుడు మళ్లీ బ్లాగ్ మొదలుపెడతారూఊఊ :(((((((
@ కవిత: థాంక్స్ కవిత గారూ... హ్హహ్హ!! మాకే ప్రసాదాల పిచ్చి తగ్గాలెదు...చిన్నపిల్లా..... మరి టేస్ట్ అలవాటైతే అంతే కదా!! ;)
కామెంట్‌ను పోస్ట్ చేయండి