12, జనవరి 2016, మంగళవారం

మంచు కురిసే వేళలో...

తెల్లవారుఝామున ఎప్పుడో ...

చటక్కున మెలకువ వచ్చేసింది.

ఎదురుగా గాజు కిటికీ.....

అందులోనించి గుడ్డి దీపాల మసక మసక వెలుతురు..

ఆ వెలుతురులో చమక్కు మంటున్న  నల్లటి చెట్ల చేతుల్లో తెల్లటి గులాబి మొగ్గలు.

ఎలా? ఇది ఎలా?

కళ్ళు నులుముకుని చూద్దును కదా!....

మంచు పూల వాన..

ఆగుతూ ... కురుస్తూ...

చూస్తుండగానే...
సన్నని ముత్యాలై..
తళతళ తళుకులీనే తగరపు కాగితాలై..
విరజాజులై..
సన జాజులై..
మల్లెలై ...
బొండు మల్లెలై...
అర్రే .... అదిగో తెలతెల్లటి గులాబీలై...
మోడువారిన చెట్లను చిగురింపచేస్తున్న... వాన....
 ముచ్చటైన మంచు వాన... వెన్నెల సోన... కన్నులలోన .... కలవై ... .. ...

తెల్లగా తెల్లారాక:

గరాజ్ డోర్ తీసి కారు బైటకి తీయగానె...
డ్రైవ్ వే... కుప్పలు కుప్పలు మంచు ...
చిత్తడి చిత్తడి ... చిందరవందర మంచు...
చిరాకు తెప్పించే మంచు...
'అబ్బ! మళ్ళీ  మొదలయిందా? ! I hate Snow! I hate Winters! I hate Michigan Winters... I hate Michigan' (వెయ్యిన్నొక్కటో సారి అనుకుంటూ ఆఫీస్ కి బయలుదేరాను )

-ఇందు 

6 కామెంట్‌లు:

ghousuddin shaik చెప్పారు...

Manasu siratho vennela santhakam

gora చెప్పారు...

Indu garu.. welcome back
Innallu ekkadikellipoyaru... missed you so much.. malli ila cheppa cheyakunda vellakandee.. Please

MANASIJA చెప్పారు...

ఎన్నాళ్ళకి కొత్త టపా రాసారు ఇందు గారు.. :) I too hate snow n winters:)ఎలా ఉన్నారు?సంక్రాంతి శుభాకాంక్షలండి :)

ధాత్రి చెప్పారు...

:) :)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఎన్ని రోజులకు!
మొదటిదే కావాలి. తెల్లారడాలు, నల్లబోవడాలు అందరికీ ఉన్నవేగా!

Unknown చెప్పారు...

mee posts baaguntayi Indu garu.Nenu mee blog chuse sariki meeru posts pettadam manesaru.kotha posts pedithe baguntadanukunna.chala kalam tarvata malli post....continue chestaranukuntunna.