మల్లాది గారు వ్రాసిన 'ట్రావెలాగ్'...
మొన్ననే చదవడం పూర్తయింది....ఈ పుస్తకం కొని సంవత్సరం అయింది....ఈ ఏడాది లో 4-5 పుస్తకాలు పూర్తి చేసి ఉంటా చదవడం...కాని ఎందుకో మరి ఇది ఇన్ని రోజులు పట్టింది...(పుస్తకం పెద్దదేమీ కాదు...అనాసక్తంగా కూడా ఏమి లేదు).... బహుశా అమెరికా వచ్చేవరకు చదువుతూనే ఉండాలని రాసిపెట్టుందేమో...
ఇక మల్లాది గారి రచనల గురించి తెలిసిందే...
సున్నితంగా...సునిశిత హాస్యం తో...ఎంతో విశ్లేషించి వ్రాస్తారు....
ఆ కోవ లోకే వస్తుంది ఈ పుస్తకం కూడా..
వారి అమ్మాయి చదివే విశ్వవిద్యాలయం లో జరిగే స్నాతకోత్సవానికి వెళ్ళిన మల్లాది గారు అక్కడ గడిపిన ౩ నెలల ౩ రోజుల అనుభవాలని పొందికగా ఈ పుస్తకం లో ఆవిష్కరించారు....
అమెరికా విశేషాలు....అక్కడ జీవన విధానాలు....అక్కడ నివశిస్తున్న తెలుగు వారి సంగతులు ....అమెరికన్ల తీరు... తను ఇదివరకు చూసిన అమెరికా కి ఇప్పటి అమెరికా కి సారూప్యత...ఇలా ప్రతి అంశాన్ని స్పృశిస్తూ....విశేదీకరిస్తూ....వ్రాసిన చక్కని పుస్తకం ఈ 'అమెరికాలొ మరోసారి'...
ఈ పుస్తకం చదవడం వల్లేమో నాకు అమెరికా కి కొత్తగా వచ్చిన భావనే లేదు....అంతా ఇంతకుముందు చూసినట్టు గానే ఉంది....అంతేకాక అమెరికా లో ఉండి తెలుగు సంస్కృతీ ని కాపాడటం కోసం కృషి చేస్తోన్న 'కిరణ్ ప్రభ ','వంగూరి చిట్టెన్ రాజు' గార్ల వంటి ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది...
ఈ పుస్తకం చివరలో మల్లాది గారు ఒక మాట వ్రాసారు....'భౌతిక సుఖాలకి అమెరికా...ఆధ్యాత్మిక ప్రగతికి ఇండియా ని మించినవి లేవు' అని..... నిజమే అనిపిస్తోంది....
చాల ఆహ్లాదంగా సాగిన మంచి 'ట్రావెలాగ్' ఈ 'అమెరికాలొ మరోసారి'.........
మంచు పూల వాన
-
"ఈ మంచుల్లో.... ప్రేమంచుల్లో.... ఎన్నెన్నో సంగతులు...."
అని పాడుకోవాలనిపిస్తుంది ఈ మంచు చూస్తుంటే! ఈసారి డిసెంబరులో అప్పుడప్పుడు
స్నో పడుతుంటే.... క్రిస్...
12 సంవత్సరాల క్రితం
9 కామెంట్‌లు:
*భౌతిక సుఖాలకి అమెరికా...ఆధ్యాత్మిక ప్రగతికి ఇండియా ని మించినవి లేవు' అని..... నిజమే అనిపిస్తోంది.*
ఆయన సరిగ్గా చెప్పారు . మొన్న గొల్లపూడి గారు కోమాలోఉన్న దేసం అని ఒకటపా రాశారు. ఇండియా లో జరిగే స్కాంలు, నేరాలు, ఘోరాలు,మావోలు, కంపెనిల/వ్యాపర సంస్థల అత్యయాశ చూసిన తరువాత సగటు మనిషికి ఈ వ్యవస్థను ఎవిధంగా బాగు పరచలేమని, బాగు చేయలేనంతగ కుళ్ళి పోయినదని అర్థ మౌతుంది. సామాన్య మానవుడు ఈ అవినితీ, అక్రమాలు శరణాగతి మంత్రం పటించటం తప్ప మరో మార్గమేలేదు. కనుక మనకు ఆధ్యాత్మికత తప్ప మరో మార్గం లేదు.
where can i buy this book, please reply
@cool dude: I got this book in India at book exhibition. Should be available in any book stores (Telugu books stores)
@సాంబశివుడు: నిజమేనండి....దేశన్ని ఎవరో కాదు మనమే బాగుపరచుకోవాలని అంటారు కానీ...అది ఇప్పట్లో సాధ్యం కాదేమో..!!
madam lo chala creativity n poetry unnayi....
the way u presented is really awesome
మీ బ్లాగు పేరు చాలా బాగుంది ఇందు గారు. మల్లాదిగారి ఈ ట్రావెలాగ్ నేనూ చదివాను. మంచి పుస్తకం.
@amruthapooja : thanx my dear pooja madam
@శిశిర :చాలా థ్యాంక్స్ అండీ శిశిర గారు....అవునండీ చాలా మంచి పుస్తకం
yeah! indu thats a nice book ,
nenu chadivina ippatidaka US vellaledu
ha ha ha !
@సావిరహే: :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి