8, ఆగస్టు 2010, ఆదివారం

తిరుమల కాలిబాట ...



పరమ పవిత్రమైన తిరుమల కాలిబాట లో  చిరుత చిన్నారుల పై దాడి చేయడం...అదీ ఒకసారి కాకుండా రెండు సార్లు చేయడం......చాల బాధాకరమైన విషయం...


నాకు తిరుమల కాలిబాట అంటే చాలా ఇష్టం...నేను మొట్ట మొదటి సారి మా వరలక్ష్మి ఆంటీ వాళ్ళతో కలిసి కొండకి నడిచి వెళ్ళాను....నేను,అమ్మ,నాన్న,తమ్ముడు,ఇంకా ఆంటీ వాళ్ళ కుటుంబం,వాళ్ళ బంధువులు మొత్తం 11 మంది....అసలు అంతమంది తో వెళితే ఆ సందడే వేరు....సరదాగా కబుర్లు చెప్పుకుంటూ....మధ్యమధ్యలో ఆగుతూ.......అలుపు తీర్చుకుంటూ.....అడవి అందాలను ఆస్వాదిస్తూ....ఎంతో కులాసాగా సాగింది నా మొదటి తిరుమల కాలిబాట ప్రయాణం...నేను చివరిసారిగా కొండకి నడిచి వెళ్ళింది కూడా ఆంటీ వాళ్ళతో కలిసే...మొదటి సారి తిరుమల కాలిబాట ఇంత బాగుంటుందా!! అని అనిపించింది....రెండవసారి అంతకుమించిన అందాన్ని ఆ వేంకటేశ్వరుడు మాకు ప్రసాదించాడు...అదే సన్నని చిరుజల్లులు...పచ్చని  కొండలని అలా  సుతారంగా తాకి వెళుతున్న తెల్లని  మేఘమాలికలు.....వాటిని చీల్చుకుని నేను ఉన్నాను అంటూ అప్పుడప్పుడు పలకరిస్తున్న సూర్యభగవానుడు.....వర్షపు జల్లులో తడిసి మెరిసిపోతున్న తిరుమల గిరుల సోయగాలు...చూసితీరవాల్సిందే కాని వర్ణనాతీతం...అలా వర్షం లో తడుస్తూ....పవిత్రమైన ఆ కాలిబాట వెంట సాగిన మా ప్రయాణం అనిర్వచనీయం...


ముందుగా అలిపిరి దగ్గర లగేజి చక్ చేసి...కొబ్బరికాయ కొట్టి కాలిబాటన మా నడక మొదలుపెట్టాము...అమ్మ,నాన్న బస్సు లో కొండపైకి చేరుకుంటామని మమ్మల్ని జాగ్రత్తగా రమ్మని చెప్పి వెళ్ళిపోయారు....ఇక మిగిలింది ఆంటీ వాళ్ళు 4 గురు ,నేను,తమ్ముడు.....అంతకుముందు కాలిబాట వెళ్ళినప్పటి సంగతులు నెమరువేసుకుంటూ....మనసులో గోవిందనామాల్ని స్మరించుకుంటూ...ఒక్కోక్కమెట్టు అధిరొహిస్తూ ఆ శ్రీనివాసుడ్ని ఎప్పుడు చూస్తామా అని అనుకుంటుండగా...సన్నని తుంపర్లు మొదలయ్యాయి....ముందు అంకుల్ కంగారు పడ్డారు.....సవ్యంగానే సాగుతుందా ప్రయాణం అని.....'ఎం పర్లేదండి...అంతా ఆ వెంకటేస్వరుడే చూసుకుంటాడు ' అని మా ఆంటీ ధైర్యం చెప్పగా వడివడి గా ముందుకు సాగము....చెప్పాలంటే....వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది....కాలిబాట మీద దేవస్థానం  వారు ఏర్పాటు చేసిన షెల్టర్ ఉన్నందువల్ల ఎటువంటి అసౌకర్యం కలగలేదు...కాని మార్గం మధ్యలో కొన్ని చోట్ల షెల్టర్ ఏర్పాటు  చేయలేదు...అక్కడ కొద్దిగా తడిసాము....


ఒకచోట జింకల పార్కు కనిపించింది....ఇక ఆగుతామా!!....వాటికి మాతో తీసుకువ్చిన మొక్కజొన్నలు..కారెట్లు....అక్కడ ఉన్న గడ్డి....ఎవరికీ ఏది దొరికితే అది పెట్టేసాము....మా ఆంటీ వాళ్ళ పిల్లలు చాలా  ఆనందించారు అవి చూసి....కాలిబాట నడిచే భక్తులకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి ఈ జింకలు(ఇప్పుడు ఆ జింకలను వేరే చోటికి తరలిస్తున్నారంటే బాధేస్తోంది)....తరువాత ఒక చోట చిన్న దుకాణాల సముదాయం కనిపించింది...అక్కడ వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు....గుంటూరువారం మరి  బజ్జీలు తినకుండా ఉంటామా!! అంకుల్ వెళ్లి  బజ్జీలు ఆర్డర్ ఇచ్చారు... అందరం అక్కడ ఉన్న కుర్చిలలో కుర్చుని  అడవి గాలిని అందులో కలిసి వచ్చే మట్టివాసనను  ఆస్వాదిస్తూ ఉండగా మొదలైంది పెద్ద వర్షం...అందరు ఎక్కడికక్కడ సర్దుకుపోయారు....ఈలోగా మాకు బజ్జీలు వచాయి....ఆ వర్షం లో కొంచెం కొంచెం తడుస్తూ..వేడి వేడి బజ్జీలు తింటుంటే...ఆహ!! స్వర్గమే....కాసేపటికి ఆ జడివాన శాంతించింది..ఈ లోగ మేము కాసిని వేడి టీ కూడా త్రాగి తిరిగి మా నడక కొనసాగించాము....


ఇక అటు తరువాత ఘాట్ రోడ్ మీద కాసేపు మా నడక సాగింది.....అక్కడ కొండల పక్కన నడుస్తుంటే మేఘాల్లో ఉన్న భావన కలిగింది....కొండల మీద మొత్తం తెల్లటి మబ్బులు పరచుకున్నాయి....దూరంగా ఉన్న పెద్ద పెద్ద గాలిమరలు....ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న మనుషులు.... ఏమి కనిపించట్లేదు.....సన్నని జల్లు....చుట్టూ పొగలాగా తెల్లటి మేఘాలు అలా మమ్మల్ని తాకుతూ వెళ్ళాయి... మేఘాల్లో తేలిపోవడమంటే  ఇదేనేమో !!!!.భలే ఆనందమనిపించింది.......దేవదేవుడిని చూడటానికి వెళ్తున్న మాకు ప్రక్రుతి ప్రసాదించిన వరం లా అనిపించింది.....అలా మేఘాల్లో నడుస్తూనే మోకాళ్ళ పర్వతం చేరుకున్నాం....అక్కడ కూడా పరిస్థితి ఇంతే ......చాలా ఆహ్లాదంగా ఎటువంటి శ్రమ,చిరాకు,అలసట లేకుండా మా ప్రయాణాన్ని ఇంత నయనానందకరంగా చేసిన ఆ గోవిందునికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంటూ....మా యాత్రను ముగించాము...కేవలం 4 గంటలలో తిరుమల చేరుకున్నాం.......మనసు ఆనందంగా ఉందేమో దేహం కూడా పెద్దగా బాధించలేదు....కాళ్ళు నొప్పి కూడా పెద్దగా లేదు....ఆ మరుసటి రోజు కళ్యాణ సేవకి వెళ్లి కన్నులపండువగా జరిగిన దేవుడి పెళ్లిని చూసి అటు పిమ్మట శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి బయలుదేరాము.....దివ్యవిగ్రహ రూపుడైన ఆ స్వామిని దర్శించి,పులకించి....భక్తిపారవశ్యం తో బయటకు వచ్చాము.....


'ఎంత ఆహ్లాదమైన యాత్ర!' అనిపించింది.....తిరుమలకి ఎన్నిసార్లు వచ్చినా  కాలినడకనే స్వామిదర్సనం చేసుకోవాలనిపించింది....కాని మొన్న తిరుమలలో చిరుత జరిపిన దాడి చూసి చాలా బాధేసింది....ఎంతో నమ్మకంతో కొన్ని వేలమంది భక్తులు నిరంతరం కాలిబాటన తిరుమల చేరుకుంటారు.....రాత్రి పగలు అని తేడా లేకుండా ఎల్లప్పుడూ  భక్తుల గోవింద నామాలతో ప్రతిధ్వనించే తిరుమల కాలిబాట లో ఇలా జరగడం ఏంటో!!......ఇది సరైన భద్రత కల్పించని అధికారుల తప్పా??? లేక జనారణ్యం లోకి వచ్చి అలజడి సృష్టిస్తున్న చిరుత తప్పా???


ఏది ఏమైనా ఇకమీదట ఇలాంటివి జరగకుండా చూడాల్సిన భాద్యత భద్రతా అధికారుల పై ఉంది.....చిరుతని పట్టేసాముగా అని అధికారులు అనొచ్చు....కాని.....అప్రమత్తత అనేది అన్నివేళలా అవసరం....


ఈసారి కూడా నేను కాలిబాటనే తిరుమల కొండకి వెళ్దామనుకుంటున్నా....పులి వచ్చినా...ఏమైనా..... ఆ వేంకటేశ్వరుడు ఉన్నాడుగా...... :)

మేము కాలిబాట న వెళ్ళినపుడు తీసిన కొన్ని చిత్రాలు....
















18 కామెంట్‌లు:

Ravi చెప్పారు...

ఇందు గారూ, మీరు మంచి సమయంలో వెళ్లారండీ! అందుకనే అంత అందమైన ప్రకృతి దృశ్యాలను చూడమని వరం ఇచ్చాడేమో ఆ శ్రీనివాసుడు. నేను కూడా కాలిదారిన వెళ్లడానికే ఇష్టపడతాను. అదీ చెప్పులు లేకుండా.

ఇక కాలిదారి భద్రత విషయానికొస్తే దేవస్థానం వారు చాలా కాలం నుంచే ఏ సమయంలోనైనా గుంపులు గుంపులుగా వెళ్లమని ఆదేశాలిస్తూనే ఉంటారు. కానీ కొంతమంది భక్తులు ఉత్సాహం కొద్దీ అలా ఒంటరిగా వెళ్ళిపోతుంటారు. ఎక్కువ మంది జనాలుంటే క్రూరమృగాలు దగ్గరికి రావడానికి జంకుతాయి.
ఇంకా చీకటి పడితే సెక్యూరిటీ గార్డులు కూడా అక్కడక్కడా కనిపిస్తారు. దేవస్థానం ఎంత భద్రత కల్పించినా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి ప్రమాదాలు నివారించగలుగుతాం.

ఆ.సౌమ్య చెప్పారు...

మా తిరుపతి ప్రయణం గుర్తుకు వచ్చింది...thanks!

ఇందు చెప్పారు...

@Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) : అవునండి,....మీరు చెప్పింది నిజమే....మనం కూడ జగ్రత్తలు తీసుకొవాలి మరి..!!


@ఆ.సౌమ్య : :)

కొత్త పాళీ చెప్పారు...

Pics are beautiful.
కాలినడకన కొండ ఎక్కడం నాక్కూడ ఇష్టం

రాధిక(నాని ) చెప్పారు...

మీ ఫొటోస్ చాలా బాగున్నాయి ఇందు గారు.తిరుమలకు నడచి వెళ్లడం చాలా మంచి అనుబవం.బాగుంటుంది .నాకూ ఇష్టమే .

అజ్ఞాత చెప్పారు...

నేను ఇ0త వరకు ఎప్పుడూ కాలి నడకన వెళ్ళలేదు... ఇది చదివాక వెళ్లాలనిపిస్తొ0ది ఇ0దు.. ఫొటొస్ చాలా బావున్నాయి..

chaitu చెప్పారు...

chala bagunnay andi photos...nenu kaali nadakana vellali

ఇందు చెప్పారు...

@chaitu: meeru vachaaru kadandi maatho ;) aa first pic lo undi meere kadandiiiii!!!!!

@himaja :థ్యాంక్స్ హిమజ...బాగుంటుంది కాలిబాట వెల్లిరా మరి!!

@రాధిక(నాని ): థ్యాంక్స్ అండీ రాధిక(నాని ) గారు....

@కొత్త పాళీ:థ్యాంక్స్ అండీ కొత్త పాళీ గారు....

చందు చెప్పారు...

nijam ga ne blog peru la idi vennela santhakame
chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala bagunayi ne pics !!!

ఇందు చెప్పారు...

@సావిరహే:chaaaaaaaaaaaaaaaaaaaaaaaaaala thnx andi

వెంకట్ చెప్పారు...

I miss those days when we used to climb tirumala twice or thrice in a month :(

ఇందు చెప్పారు...

@వెంకట్ : aithe meeru chaala adrushtavantulandi :) anni sarlu tirumala konda ekke bhaagyam evariki untundi cheppandi??

వెంకట్ చెప్పారు...

అయ్యివుండవచ్చేమో , కాని పి.జి అయ్యాంక ఈ రెండు సంవత్సరాలలో ఒక్కసారి కూడా వెళ్ళడం కుదరలేదు :(
BTW మీ బ్లాగ్ పేరు కొత్తగా చాలా బాగుంది.

ఇందు చెప్పారు...

@వెంకట్ :మళ్ళీ వెళతారులేండి అంతా ఆ వెంకటెశ్వరుడే చూసుకుంటాడు....థ్యాంక్స్ అండీ....

చెప్పారు...

5yrs back when i walked its very much cold and nice. Now its hot like anything. And lot of people making it like "Santa". Simply loosing its charm and purity. yearly once atleast i will take steps in tirumala. for the last 10 yrs lot of things got changed there.

Cute Indian చెప్పారు...

Indu asalu nee varnana adbutham...aripistunnav gagaaa.Naaa autograph sweet memories laaagaa vundi ee blog....
Good..Chala baaga rastunnav tapa lani..
Great..

ramakumari Balantrapu చెప్పారు...

fantastic fotos and description too..
every time we visit tirupati mostly we go by walk only...
we have seen all these scenes which fotos you uploaded in this topic..again we recollected our memories...
thankyou very much...
keep it up.
rama.
09437418299
bvsrk1300@gmail.com
bvsrk1300.blogspot.com

ఇందు చెప్పారు...

@Sheshu Kumar Inguva:అవునండీ....కొన్ని అలా జరిగిపొతుంటాయ్...ఏంచేస్తాం!! ఏది ఏమైనా తిరుమల గిరుల పవిత్రత వాటిదే....ఆ అందం ఎన్నటికీ తరగదు అని ఆశిద్దాం...
@Cute Indian :థ్యాంక్స్ అన్నయ్యా....
@confident girl:చాలా సంతోషం అండీ..నా ఫొటోలు మీ గ్నాపకాలను తిరిగి గుర్తుచేసినందుకు చాలా ఆనందంగా ఉంది :)