11, నవంబర్ 2010, గురువారం

స్పిరిట్ గేం...ఆడారా ఎప్పుడైనా??

స్పిరిట్ గేం...
ఈ ఆట గురించి వినే ఉంటారు చాలా మంది....కానీ నాకు తెలిసింది మాత్రం 'అన్వేషిత' అనే ఒక 'గొప్ప' సీరియల్ వల్ల :)
'విధి వంచితా...విష వలయితా....ఓ!! అన్వేషితా!!అన్వేషితా!' అంటూ సాగే ఈ ఈటీవి సీరియల్ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది.కొంత వరకు బానే ఉత్కంఠభరితంగా సాగింది కానీ కొద్దిరోజుల తరువాత మరీ విసిగించేసాడు..నాకైతే దయ్యాలంటే భయమైనా...చూడాలని చాలా ఆత్రంగా ఉండేది.రాత్రిళ్ళు నిద్రలో ఉలిక్కిపడుతున్నా అని మా నాన్న ఆ సీరియల్ ని ఇంట్లో బాన్ చేసారు.కానీ నాకేమో ఆ సీరియల్ లో బీరువా మీద కూర్చుండే 'కబీస్' అన్నా.....అందులో చూపించే స్పిరిట్ గేమ్ అన్నా భలే ఇష్టంday dreaming.అందుకే పక్కింటికి వెళ్లి చూసేదాన్ని.అప్పుడు క్లాస్ లోను...సాయంత్రాలు ఆటలప్పుడు ఇదే టాపిక్ మా ఫ్రెండ్స్ మధ్య.కొన్నాళ్ళకి ఆ సీరియల్ అయిపొయింది.కానీ స్పిరిట్ గేం ఆడాలనే కోరిక మిగిలిపోయింది.దయ్యాలంటే భయమైనా వాటితో ఫ్రెండ్షిప్ చేయాలనీ నాకు  ఒక చిన్న కోరికbig grin.కానీ ఆ గేం ఆడడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు.అందరికీ దయ్యాలంటే భయమే...ఏంచేస్తాం! ఇంట్లో తెలిస్తే మా నాన్న తోలు ఒలిచేస్తారు...అందుకే ఇక ఆ విషయం వదిలేసా!!

చాలా రోజులకి మన ఇంజినీరింగ్ రెండో సంవత్సరం హాస్టల్ అప్పుడు మళ్లీ ఈ గేం మీద ఆసక్తి బైటికొచ్చింది.ఐదు కొప్పులు ఒక చోట చేరితే ఊరుకోవుగా! అలాగే మేము అందరం రాత్రిళ్ళు పడుకునేటప్పుడు ఏదో ఒక కథ చెప్పుకునే వాళ్ళం.అలా ఒక రోజు దయ్యాల కధా...అక్కడనించి 'అన్వేషిత' సీరియల్ కథా...మెల్లగా స్పిరిట్ గేం దగ్గరకి వచ్చి ఆగాం.మా ఐదుగురికి విడి విడి గా మనస్సులో ఆడాలనే ఉంది...కానీ బైటపడాలంటే భయం.మెల్లగా...ఒక్కొక్కరం వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెబుతున్నాం దయ్యాల గురించి.ఇంతలో నేనే ఈ టాపిక్ కావాలని తెచ్చా! 'మనమూ స్పిరిట్ గేం ఆడదామా?' అసలు దయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకుందాం...జస్ట్ ట్రై అంతే!' అని అగ్ని కి ఆజ్యం పోసానుbig grin.ఒక్కొక్కరు బాగా అలోచించి సరే సరే అన్నారు. ఇంతలోకి శ్రావ్య,అమృత,రాజి వాళ్ళ ఫ్రెండ్స్ కి జరిగిన కొన్ని అనుభవాలు చెప్పారు.మాకు అప్పటిదాకా స్పిరిట్ గేమ్ గురించి తెలిసినది అంతా చెప్పుకుని....తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకున్నాం.


  • ముందుగా స్పిరిట్ గేం ఆడే రూం లో దేవుడి బొమ్మలు ఉండకూడదు....అలా ఉంటే ఆత్మలు  రావుటI don't know
  • చేతికి ఏమన్నా దేవుడి తాళ్ళు,తాయోత్తులు ఉండకూడదుట.
  • ఒక దేవుడి పటం కొంచెం అందుబాటు లో పెట్టుకోవాలి...ఎందుకంటే ఒకవేళ ఆత్మ  వచ్చి మనల్ని పట్టేసుకుని వెళ్ళకపోతే దాన్ని బలవంతంగా పంపించేయడానికట.hypnotized
  • ఈ ఆట ఆడడానికి ఒక చార్ట్ ప్రిపేర్ చేయాలి.ఒక నాణెం కూడా కావాలి.
  • గదిలో లైట్లు ఉండకూడదు.ఒక కొవ్వొత్తి మధ్యలో పెట్టుకోవాలిట.
  • అందరూ ఒక వలయం లాగా ఏర్పడి కూర్చొని ఆ ఆత్మ ని  ఆహ్వానించాలట.
  • అందరూ శ్రేద్దగా ఆత్మని  ఆహ్వానించాలి....ఎవరైనా డౌట్ పడితే...ఆత్మకి  కోపం వస్తుందిట.hee hee
  • ఇక లాస్ట్ గా కళ్ళుమూసుకుని...ఒకరి చేతులో ఒకరు చేయి వేసి....అస్సలు కళ్ళు తెరవకుండా ఆ ఆత్మకి  వెల్కం చెప్పాలి....కళ్ళు తెరిస్తే అది వేల్లిపోతుందిట.shame on you
  • ఆత్మ వచ్చాక నాణెం పట్టుకుని మెల్లగా ఆత్మ తో సంభాషణ మొదలుపెట్టాల్ట.

ఇలా కొన్ని రూల్స్ తెలుసుకుని.....ఒకటికి పది సార్లు మననం చేసుకుని స్పిరిట్ గేం కి సిద్ధం అయ్యాం.ఆడతాం సరే...మరి ఆత్మ వస్తే ఎం అడగాలి?మాకు ఎక్జాంస్ ఇంకో రెండు వారాల్లో ఉన్నాయ్.కాబట్టి మా కాలేజి కి వెళ్లి ఎక్జాం పేపర్ చూసి మాకు క్వశ్శన్స్ చెప్పాలి అని అడుగుదాం అనుకున్నాంidea.సరే...అంతా రెడి చేసుకున్నాం.అందరం వలయంలా కూర్చున్నాం.స్పిరిట్ గేం కి కావాల్సిన చార్ట్ మధ్యలో పెట్టుకున్నాం.ఒక నాణెం ని దానిమీద పెట్టాం.కళ్ళు మూసుకోబోయే ముందు వచ్చింది అసలు డౌట్...ఇంతకీ యే ఆత్మ ని పిలవాలి స్పిరిట్ గేం కి???thinking...బాగా ఆలోచించాం.మంచి ఆత్మ ని పిలుద్దాం...అప్పుడు మన పని అవ్వగానే వేల్లిపోమ్మంటే పోతుంది....లేదంటే వదలదు అనుకున్నాం.మంచి వాళ్ళంటే?? గాంధి గారు??...ఎబ్బే ఆయన క్వషన్ పేపర్ చెప్పడు....సుభాష్ చంద్రబోస్(నా ఫేవరేట్ happy)....ఆయన బ్రతికి ఉన్నాడో...చనిపోయాడో తెలియదు....ఇక స్వామీ వివేకానంద?(ఈయన నా సూపర్ ఫేవరేట్big hug)...ఆ! ఈయనైతే మన కష్టాల్ని అర్ధం చేసుకొంటాడు.అదీ మనలాంటి స్టూడెంట్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం...ఇంకా మంచి ఆత్మ కూడా! మనల్ని ఏమి చేయదు.సో ఇక స్వామి వివేకానందా ని దివి నించి భువికి దించేద్దాం అని డిసైడ్ అయిపోయి గేం స్టార్ట్ చేశాం.అదే! కళ్ళు మూసుకుని అందరం మనసులో స్వామీ వివేకానంద కి ఆహ్వానం పలకడం మొదలు పెట్టాం....

అలా చాలా సేపు కళ్ళు మూసుకున్నాం....మధ్యలో నేను అప్పుడప్పుడు కళ్ళు తెరిచి అందరూ సవ్యంగా చేస్తున్నారా లేదా అని టెస్టింగ్ కూడా చేశా!tongue....ఎంత సేపు చూసిన వివేకానందా రాడే!waiting చూసా!చూసా! ఆవలింతలు వస్తున్నాయ్ కానీ వివేకానందా వచ్చే జాడలు ఎక్కడా కనబడట్లేదు.ఇక విసిగిపోయి కళ్ళు తెరిచేస! అప్పుడే అమృత కూడా కళ్ళు తెరిచి చూస్తోంది....'నువ్వెందుకు తెరిచావ్! అంటే నువ్వెందుకు తెరిచావ్' అని కాసేపు పోట్లాడుకున్నాం.'నీవల్లే ఆత్మ రాలేదు అంటే నీవల్లే రాలేదు' అని తిట్టుకున్నాం.మళ్లీ ట్రై చేద్దాం అనుకున్నాం.కానీ అప్పటికే అందరికీ అర్ధం అయింది....స్పిరిట్  గేం లేదు...ఏమి లేదు...దయ్యాలు...ఆత్మలు అంతా బూటకం అని ఆ టీ.వి.లలో చూపించేవి అంతా ట్రాష్ అని.ఎందుకు ఈటివి వాడు ఇంత మోసం చేసాడా అని బాధపడ్డాం!వాడు సరే! మరి స్పిరిట్ గేం ఆడామని....ఆత్మలు వచ్చాయని చెప్పిన ఫ్రెండ్స్? అబ్బో! అందరూ అందరే అనుకున్నాం. ఆ చార్ట్లు,కొవ్వొత్తులు తీసి పక్కన పడేసాం.కాసేపు...మధ్యలో ఒక్కొకళ్ళు ఎన్నిసార్లు కళ్ళు తెరిచారో అప్పుడు అందరం ఎంత సిన్సియర్ గా ప్రే చేస్తున్నామో చెప్పుకుని....చెప్పుకుని... హాయిగా నవ్వుకుని పడుకున్నాం.పైకి అనలేదు కానీ నాకు మాత్రం కొంచెం బాధేసిందిsadచక్కగా ఆత్మలు,దయ్యాలు ఉంటే ఎంత బాగుండేది! వాటితో ఫ్రెండ్షిప్ చేసుకుని ఉంటే అల్లావుద్దీన్ లో జీనిలాగా నాకు ఒక జీనీనో గజినీ నో ఉండేది day dreaming హాయిగా ఎక్జాంస్ కి చదివే గోల తప్పేది...మంచానికి ఎదురుగా ఉన్న రాక్ లో బండ బండ పుస్తకాలు కనిపించాయి...హ్మ్! ఏం చేస్తాం! చదవక తప్పుతుందా!

చక్కగా చదువుకోక ఈ దయ్యాలు,ఆత్మలు మీకేందుకమ్మా అని అనొచ్చు....దానికి సమాధానం ఏ.వి.ఎస్ ఇస్టైల్లో చెప్పాలంటే...'ప్చ్! అదో తుత్తి!'tongue

24 వ్యాఖ్యలు:

swapna@kalalaprapancham చెప్పారు...

nenu 2 times aadanu. aadaanu ante aaadatam kaadu, aadaledu ante aadaledu ani kaadu :)

chinnapudu ma nayanamma valla intiki vellinapudu memu chinna pillalandaram oka daggara cheri room antha chikatiga undetattu chesi oka pattika gisi dantlo a- z varaku rasi, andaram chuttu kurchunnamu kallu thriche. adi chala concentartion tho cheyali ata. okka ame kallu musukoni oka athma ni thaluchukuntadi. nenu emina adigano ledo gurtu ledu asalu chala chinnapudu kada.

inko sari peddinapudu ma friends tho aadaanu appudu oka friend ki vachhata cheyadam, so memu andaram chuttu kurchunnam late night. aa friend oka athma ni pilichi ame okkathe kallu musukundi, migitha vallam antha kallu theriche ame chetundi chusamu. appudu nenu adigina questions gurthu unnayi. munduga andaram ma perlu cheppu ani adigamu , aa chese ammayi asalu kallu theravakundane ma names anni chethitho taka taka chupindhi memu chala stun ayyamu baboy ani. nenu p.g chesthana ani, job gurinchi, inka appatlo exams unde, sare ani exam lo em questions vastayi ani saradaga vadilanu. nenu cheppanu annattu cheyi chupindi letters mida, nenu oorukuntana malli malli ade questions adiga, oka 2,3 times adi alage chupinchindi nenu cheppanu, adagakudadu ani. ayina malli inko sari adigithe adi nannu thittindi, enni sarlu cheppali, can't u understand ani , chi chi dinitho kuda thittinchukunnana ani anukoni saradaga navvukunna.
inko konte question kuda adiganu. ma hubby peru enti ano, nick name enti ano, mottaniki adi oka answer cheppindi, hehehe thega navvochinsindi adi cheppina answer chipinchagane.

inthaki ma friend evari athma ni pilichindo thelusa divya bharathi athma ni :)

Unknown చెప్పారు...

everybody in this world is a soul, but one cant recognize this fact with spirit game or in few days, it will take years, thats why Munis do meditation for years and years with so much concentration. Swami vivekananda proved it with the technique called Telepathy.
Wish you will realize your 'self(soul)' yourself soon. All the best.

హరే కృష్ణ చెప్పారు...

:))
కానీ స్పిరిట్ గేం ఆడే మజా హాస్టల్ లో ఎన్ని గేం లాడినా రాదు
adventures ని resume లో పెట్టుకోవచ్చు!

సగం రాసి ఆపేసా ఈ స్పిరిట్ గోల మీద
అందరూ మర్చిపోయాక మళ్ళీ పోస్ట్ ని బయటకి తియ్యాలి నెమ్మదిగా..

ఎంత favorite అయితే మాత్రం వివేకానంద నే టార్గెట్ చేసారా..ప్లిచ్!

Manjusha kotamraju చెప్పారు...

memu eng.lo unnappudu aadamandi,,maa frnd pattukundi coin,,andaram kalisi pray chesam..e atmanu pilichamo gurtuledu,,coin matram kadilindi,,mari maa frnd ala kadipindo,,leka mari emo teliyadu,,adi kadiletappatiki maaku bhayam vesindi,,sudden ga light vesesam,,,maa frnd nenu kadapaledu..naku bhayam vestondi ani edchesindi...adoka tension ante,,edo ala cheyi kadili untundi tanaku teliyakundaa,,a night memu nidra pote vottu...bhale funny ippudu taluchukunte,,malli gurtuchesinanduku thanx..

shankar చెప్పారు...

memu kuda aadam...coin ayite kadilindi...adi enduku kadilindo teliyadu...kani maa questions ki konni meaningful answers vachayi...ante perly....

Pranav Ainavolu చెప్పారు...

అప్పుడెప్పుడో ఈటి‌విలో అన్వేషిత అనే సీరియల్ వచ్చినప్పుడు అందులో చూసి క్లాస్ రూమ్ లో experiments చేసేవాళ్లం. అదేంటో ఒక్కసారి కూడా ఏ ప్రేతాత్మా మమ్మల్ని కరుణించలేదు :(

ఇందు చెప్పారు...

@ swapna@kalalaprapancham :హ్మ్! స్వప్నగారు మీరు మాలాగే అడిగారన్నమాట :)
@ Madhu Mohan: Thankyou Madhumohan:) I will try my best.
@ హరే కృష్ణ:మీ పోస్ట్ కోసం ఎదురుచూస్తు ఉంటా :) ఏదొలేండీ మంచి ఆత్మ కదా అని అల పిలిచేసాం :)

ఇందు చెప్పారు...

@ Manju :హ్మ్! కదా! నాకు మొన్న ఏదొ మూవీ చూస్తుంటే గుర్తొచ్చింది. ఈ పోస్ట్ పెట్టేసా!
@ ప్రణవ్ :మాలాగే మీకు కూడా బాడ్లక్ అన్నమాట :(
@ gowrisankar:పొన్లెండీ కనీసం మీకు కయిన్ కదిలింది.ఆన్సర్స్ వచ్చాయి.మాకు ఏదీ లేదు.ఎక్జాంస్ కి చచ్చినట్టు చదవాల్సొచ్చిందీ :(

ఆ.సౌమ్య చెప్పారు...

హ హ హ మేమూ ఆడేవాళ్ళం ఈ ఆటని. అయితే అన్వేషిత రాకముందే మాకు ఈ గేం తెలుసు. స్కూలులో చదువుతున్నప్పుడు తెగ ఆడేవాళ్ళం. మేమైతే ఇంట్లోవాళ్ళకి తెలియకూడదని, పెద్దవాళ్ళు బయటికెళ్ళినప్పుడు ప్లాన్ చేసేవాళ్ళం. నేను మా స్నేహితులు చాలా సీరియస్‌గానే ట్రై చేసాం. ఎవరం కళ్ళు తెరిచేవాళ్ళం కాదు. అదేమి మాయోగానీ ఆ రూపాయి బిళ్ళ తనంతట తానే జరిగేది. అది ఈ రోజుకీ నాకు చిత్రంగానే అనిపిస్తుంది. ఎదుటివాళ్ళు కదిపేస్తున్నారేమో అని ఓ అనుమానం. కానీ ఎవరూ నేను కదపలేదంటే నేను కదపలేదు అనేవారు. ఈ ఆట ఇద్దరిద్దరం ఆడేవాళ్ళం. అన్నిటికన్నా గమ్మత్తైన విషయమేమిటంటే...ఆట అంతా అయిపోయాక, మనం పిలిచే ఆత్మలు వెనక్కి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయేమో అని పిచ్చ భయంగా ఉండేది నాకు. :P మేమేమో మా తాతల్ని, అమ్మమ్మ, బామ్మలని పిలిచేవాళ్ళం. వాళ్ళైతే ఒకవేళ ఉండిపోయినా మనల్ని ఏమీ చెయ్యరని (మనమంటే ప్రేమ కదా వాళ్ళకి). :D తిరిగి వెళ్ళిపోమని వాళ్ళని తెగ ప్రార్థించేదాన్ని. వెళ్ళిపోయినట్టు స్పష్టంగా తెలిసినా (అంటే ఆటలో) రాత్రి పూట భయమేస్తూ ఉండేది...ఏమో ఇక్కడే ఉన్నారేమో అని :) కానీ విపరీతంగా ఆడేవాళ్ళం ఈ ఆటని. సందు దొరికితే చాలు చార్టు, రూపాయిబిళ్ళతో సిద్ధమయిపోయేవాళ్ళం. ఆ ఆట పిచ్చి వదిలాక, అందరం ఆ రోజుల్ని తలుచుకుని తెగ నవ్వుకునేవాళ్ళం. ఈరోజుకీ మా ఫ్రెండ్సంతా కలిస్తే స్పిరిట్ గేం ని గుర్తు తెచ్చుకుని ఎంత నవ్వుకుంటామో :D

ఇప్పుడు నాకు ఆ రోజుల్ని గుర్తు తెచ్చినందుకు మీకు చాలా థాంక్స్. మనస్పూర్తిగా నవ్వుకుంటున్నా ఈ కామెంటు రాస్తూ :)

ఆ.సౌమ్య చెప్పారు...

ఆ ఇంతకీ ఈ గేం లో అడిగే ప్రశ్నల గురించి చెప్పలేదు కదూ....ఎన్ని పిచ్చి ప్రశ్నలడిగేవాళ్ళమో హహహ. :D నేను ఎంతవరకు చదువుకుంటాను, ఏ ఊర్లో చదువుతాను. ఇంజనీరింగ్ చేస్తానా, మెడిసిన్ చదువుతానా. లేక పిజి చేస్తానా పెళ్ళి ఎప్పుడవుతుంది. భర్త పేరేమిటి, ఏం చేస్తూ ఉంటాడు. ఎంతమంది పిల్లలు. నేను ఎంతకాలం బతుకుతాను ఇలా నానారకాల ప్రశ్నలు వేసేవాళ్ళం.
ఒకసారి మా ఫ్రెండు భర్త ఏమి చేస్తాడని ప్రశ్న అడిగాం....సమాధానంగా "FOX" అని వచ్చింది. నీ భర్త గుంటనక్కలాంటివాడని చెబుతోంది అని మా ఫ్రెండుని తెగ ఏడిపించాం. అదేమూ గోల గోల...మీరంతా కావాలనే చేసారు. కావాలనే ఆ లెటర్స్ మీదకి రూపాయిని పోనిచ్చారని మమ్మల్ని తెగ తిట్టింది ఏడుపుమొహమేసుకుని :P

ఇంకోసారి నేను గుజరాత్ లో చదువుతానని వచ్చింది. వెంటనే గుజరాత్‌లో ఉన్న institutions, కాలేజీ లన్నిటినీ లిస్ట్ వేసా నేను. :D

ఇలాంటివి బోలెడు.

శివరంజని చెప్పారు...

ఇందు గారు ఈ స్పిరిట్ గేం నకస్సలు తెలియదు ..నేనాడలేదు ..ఇప్పుడెలా ??????? ..పోనీ ఇప్పుడు మనిద్దరం ఆడుకుందామా ?

ఇందు చెప్పారు...

@ఆ.సౌమ్య :థాంక్స్ అండీ...మీరు చాల ఎంజాయ్ చెసినట్టు ఉన్నరు ఈ గేం ఆడుతూ! మీకు కాయిన్ ఎలా కదిలింది? మాకు ఎంత ట్రై చేసినా కదల్లెదు :( మీరు లక్కీ :(

@ శివరంజని :హ్మ్!మీలాంటి అమాయకులు ఉంటరనే గేం రూల్స్ కూడా ఓపిగ్గా పెట్టా :) ఆడదాం!ఆడదాం నేను రెడీ :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

నాకూ ఆ సీరియల్ కన్నా ముందే తెలుసు కానీ ఒక వేళ నిజంగా ఆత్మలు వచ్చేస్తాయేమో అని భయపడి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు :-P అసలే నాకు బోలెడు చాలా ధైర్యం లెండి.

SNKR చెప్పారు...

http://en.wikipedia.org/wiki/Ouija
మీరు చెబుతోంది ఓజో బోర్డ్ గురించేనా? హైస్కూల్లో వున్నప్పుడు ఒకతను చూపించాడు, అందరివేళ్ళు కాయిన్ మీద పెట్టేవాళ్ళం. ఓ సారి ఓ స్పానిష్ ఆడ దయ్యం వచ్చింది. కాయిన్ కదలబోతుండగా, నా బలపరీక్ష కోసం దయ్యాన్ని ఆపాలని నొక్కిపట్టేవాణ్ణి. అది గమనించి పెద్దవాళ్ళు నన్ను వేలు పెట్టనీకుండా చేసేవారు. ఒక్కటి మాత్రం చెప్పగలను - ఆ దయ్యం నాకన్నా బలమైనదిగా ఎప్పుడూ అనిపించలేదు. :D

మాలా కుమార్ చెప్పారు...

మా చిన్నప్పుడూ ఈ ఆట ఆడేవారు . ఎక్కడ దయ్యం వచ్చి మా ఇంట్లో తిష్ఠ వస్తుందో నని భయం తో దాని జోలికి పోలేదు , కాని మా ఫ్రెండ్స్ వాళ్ళ వీర గాధలు చెపుతుంటే భయం భయం గా వింటూ వుండేదానిని .

Ram Krish Reddy Kotla చెప్పారు...

Spirit game naku kuda "Anveshita" serial dvarane telsindi.. nenu inter lo and engineering lo kuda adanu.. but engg lo adina spirit game chala pedda highlight.. chala pedda story jarigindi apudu.. adi oka post ga rasanu na "akasaveedhilo" blog lo... u can check it here:

http://akasaveedhilo.blogspot.com/2009/07/blog-post.html

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. భలే భలే ఉంది..:)

ఇందు చెప్పారు...

@ వేణూ శ్రీకాంత్:హ్హహ్హహ్హ! భలేవారండీ.నన్ను చూడండీ..దయ్యలంటే భయమైనా ఎంత ఇంటరెస్టో! :P

@ snkr:హహ! స్పానిష్ దయ్యన్ని ఆహ్వానించారా! మీరు చాలా గ్రేట్. హ్మ్!ఐతె దయ్యం కంటే మీరే బలవంతులన్నమాట :)

ఇందు చెప్పారు...

@ మాలా కుమార్:హయ్యొ! భయపడి అస్సలు ఆడలేదా! మంచి ఫన్ మిస్సయ్యారండీ!

@Ramakrishna Reddy Kotla:చదివానండీ బాబూ! చాల భయమేసింది :( కాని లాస్ట్ లో క్లైమాక్స్ కి కొంచెం కుదుట పడ్డాను :)

@మనసు పలికే :Thankyou :)

సవ్వడి చెప్పారు...

hahahahaha..

nenu eppudu adaledandi! ippudu try ceyyalanipistundi....:)

vaddulendi.. mallee e deyyamainaa vacceste.:)

ఇందు చెప్పారు...

@ సవ్వడి: పర్లేదులేండీ ఒకసారి ఆడి చూడండీ...ఏంకాదు :)

స్నిగ్ధ చెప్పారు...

నమస్తే ఇందు గారు,మీ బ్లాగ్ని ఇప్పుడే చూడ్డం..
బాగా రాసారండీ స్పిరిట్ గేం గురించి... అన్వేషిత టైటిల్ సాంగ్ నుంచి మొదలు పెట్టారు చూడు...నాకు నచ్చిందండీ.....ఒక్క సారి ఆ సీరియల్ వచ్చే టైం,తర్వాత మేము ఆడిన స్పిరిట్ గేంస్ అన్నీ గుర్తొచ్చాయి..
మేము కూడా ఇది ఆడామండీ...కానీ సిన్సియర్ శిఖామణి లాగ ఎగ్సాంస్లో ఏమేమి ప్రశ్నలు వస్తాయో అవన్ని అడగలేదు...
ఇంట్లోనే కాకుండా..స్కూల్లో ఏదైనా పీరియడ్ లీషర్ గా ఉంటే అక్కడ కూడా ఆడేవాళ్ళము...
ఆ రోజులన్నీ గుర్తుకు తెచ్చినందుకు మీకు బోలెడన్నీ థాంకులు... ఒక్కసారి ఆడినప్పుడు సౌందర్య ని కూడా పిలిచామంటే చూస్కొండి .....

Unknown చెప్పారు...

అమ్మో నాకు చాల భయం .. ఇప్పడికి దెయ్యాలు సినిమా కళ్ళు మూసుకునే చూస్తా
ఇంజనీరింగ్ లో ఒక సారి మర్రి చెట్టు అనే సినిమాకి వెళ్ళా అంతే దెబ్బకి మూడేళ్ళు మా అమ్మ దగ్గరే పడుకున్న ..

ధాత్రి చెప్పారు...

చిన్నప్పుడు అన్వేషిత serial చూసి మేము కూడ ఈ గేమె school లో ఆడేవాళ్ళం..అయితే ఆడుదామని initiate చెసింది నేనె కబట్టి ...నా friends నమ్మరేమో అని coin నేనే కదిపేసేదాన్ని ..మేము NTR ఆత్మ ని పిలిచాం ..కాని రాలేదు ..:D:D