ప్రియాతిప్రియమైన శ్రీమతికి,
నా చేత ప్రేమలేఖ వ్రాయించుకునే అదృష్టం నీదే మరి :) ఎందుకంటే..... ఇదే నా మొట్టమొదటి ప్రేమలేఖ ;)
అలాగని నేను శ్రీ రామచంద్రుణ్ణి అని చెప్పలేను.... నా రేంజికి తగ్గట్టు ఏదో ఒకరో,ఇద్దరో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా... ఇదిగో ఇలా అర్ధరాత్రి మూడింటికి నిద్రపట్టక ప్రేమలేఖ రాయాలనిపించే సీన్ ఐతే లేదు అమ్మడు ఎవ్వరికీ :)))
ప్రేమలేఖ... అంటే ఏం రాయాలి??? మనం ప్రేమికులం కాదు కదా!! పోనీ పెళ్ళికి ముందు తెగ ఫోన్లు చేసుకుని మాట్లాడుకున్న వాళ్ళమూ కాదాయె! కానీ ఏదో రాయాలని ఆరాటం. నా రాతల్లో నిన్ను చూసుకోవాలని ఉబలాటం. పోనీ కవితలు రాద్దామంటే.... మనకి కపిత్వం తెల్సుగాని... కవిత్వం తెలీదే! పాటలు రాద్దామంటే.... ఆ పాండిత్యమూ లేదు! అందుకే.... నా మనసులో ఇప్పటికిపుడు నీగురించి వచ్చిన ఆలోచనలన్నీ అక్షరాల్లో పెట్టేస్తున్నా! సరేనా?!
అదిసరేగాని, అసలు ఏం మాయచేసావ్ నన్నూ?? పోనీ నిన్ను చూసిన మొదటిసారే డుబుక్కున ప్రేమలో పడిపోయాను అంటే అదీ కాదు... [నిజం చెప్పేసా ఏమి అనుకోకు ;) ]
కానీ, మన నిశ్చితార్ధం రోజున నీ చేతి వేళ్ళు చూడగానే మాత్రం ముద్దొచేసాయంటే నమ్ము! మరీ ఎక్కువసార్లు చూశానేమో రెండుమూడు రోజులు కల్లో కూడా అవే వచ్చాయ్ ;) ఆ చేతివేలికి ఉంగరం తొడిగే అదృష్టం నాదే అంటేనే అదొక గొప్ప ఫీలింగ్.... ఎవరెస్టు అధిరోహించేసినట్టు!!
అలాగే మన పెళ్లి ఇంకో రెండురోజుల్లో ఉందనగా.... ఆరోజు మీఇంట్లో చెప్పకుండా నాతో పాని-పూరి తినడానికి వచ్చావు చూడు.... ఆ రోజైతే... ఎవరన్నా చూస్తారేమో అని భయపడుతూ బెరుకుగా చూస్తున్న నీ కళ్ళు, ఆవురావురుమంటూ ఒక్కొక్క పూరిని అమాంతం మింగేస్తున్న నీ బుజ్జి నోరు, ఆ పాని ఘాటుకి ఎరుపెక్కిన నీ కోటేరేసిన ముక్కు.... చూస్తుంటే.... ఎంత అబ్బురమనిపించిందో! హ్మ్! ఎంతైనా నువ్వు అందగత్తెవే!! ఒప్పుకోక తప్పట్లేదు మరి ;)
ఇక పెళ్లిరోజున చూడాలి.... ఆ మెరూన్ కలర్ కంచిపట్టులో.... ఆ బుట్టలో కూర్చుని నువ్వొస్తుంటే.... నాకైతే ఎర్రటి గులాబి బంతిని తెస్తున్నారేమో అనిపించింది. అంతలోకే నీకు-నాకు మధ్య తెర కట్టేసి.... జీలకర్ర బెల్లం పెట్టే వరకు అసలు నిన్ను చూడనివ్వలేదు. ఎంత కోపమొచ్చిందో ఆ పురోహితుడి మీదైతే! జీలకర్ర బెల్లం పెట్టేశాక.... హమ్మయా అనుకున్నానా.... అంతలోకే మధుపర్కాలన్నారు నిన్ను పట్టుకోపోయారు అమ్మలక్కలంతా కలిసి! :( మళ్లీ మొహం మాడ్చేసుకుని కూర్చున్నా!
కానీ ఆ తర్వాత తెల్లని మధుపర్కాలలో అచ్చం రాజహంసలా నువ్వొస్తుంటే.... నాకు రెండు రెక్కలు కట్టుకుని నీతోపాటు ఆకాశవీధిలో విహరించాలనిపించిది!! నీకు తాళి కట్టే వేళ... నువ్వెంత టెన్షన్ పడ్డావోగాని, నేనైతే అరవీరభయంకరంగా పడ్డా! ఎందుకు అని అడగవేం?? ఏంలేదు... ఎక్కడ సినిమాల్లో చూపించినట్టు,.... 'నో... ఆపండి.. నహీ' లాంటి డైలాగ్ కోడతావేమో అని ;) [హ్హహహ్హ! ఉడుక్కుంటున్నావా?? ఊర్కే అన్నాలెద్దూ!! :)) ] ఇక పోతే.... తలంబ్రాలప్పుడు తెలిసింది నీ గడుసుదనం!! అమ్మో.... ' "అమాయకురాలు" అనుకున్నా.... ఆ పదంలో 'అ' తీసేయాలి ' అని అనిపించింది తెల్సా? ;) కానీ, అప్పగింతలప్పుడు నువ్వేడిస్తే నాకేం బాలేదు అమ్మాయ్! నీ కళ్ళలో అలా నీళ్ళు చూడలేను నేను :(
అయినా, మనిద్దరి పరిచయం ఎంతా?? ఒక్క వారం కదా! ఒక ఆదివారం నిశ్చితార్ధం ఐతే.... నెక్స్ట్ ఆదివారం పెళ్లి. అస్సలు అనుకోలేదు నా జీవితంలో ఇంత ఫాస్ట్ గా పెళ్లి చేసుకుంటా అని ;) ఫాస్ట్ గా కాదు... సూపర్ ఫాస్ట్‌గా అని చెప్పాలేమో!! హ్మ్! ఏంచేస్తాం! మా డామేజరు సరిగ్గా 15 రోజులు ఇచ్చాడు సెలవులు!! హ్మ్! ఏ బంధమైనా కాలంతో పాటు పెరుగుతుంది. కానీ... మన మధ్య అదేంటో చిత్రంగా ఇంత తక్కువ టైమ్‌లో అల్లేసుకుంది.
పెళ్ళైన మూడోరోజే నేను అమెరికాకి బయలుదేరితే.... నీ కళ్ళలో దిగులు చూస్తే.... ఎంత ఆనందమేసిందో తెల్సా? అవును మరి!! నాకోసం ఆలోచించే మనిషి ఒకరున్నారనే భరోసా ఆ దిగులే! నన్ను కావాలనుకునే వాళ్ళు ఉన్నారనడానికి సాక్ష్యం ఆ దిగులే! అందుకే నాకు అది నచ్చింది. కానీ ఆ దిగులు నాకూ అంటుకుని ఇదిగో ఇలా వేధిస్తోంది!! మన పెళ్లి, నీతో గడిపిన ఆ రెండురోజులు ఇవే నాకు ఇప్పుడు తిండి-నీళ్ళు-నిద్ర.... తెల్సా?? ఎన్నిసార్లు నీ ఫోటో చూసినా... ఎంతసేపు నీతో ఫోన్లో మాట్లాడినా....ఆదివారాలు స్కయిప్ చాట్ చేసినా... ఏదో వెలితి గుండెని మెలిపెట్టేస్తోంది.
నీకో సీక్రెట్ చెప్పనా? అసలు పెళ్ళంటేనే నాకు చిరాకు. హాయిగా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నన్ను... మా అమ్మ 'అమ్మాయి బంగారంలా ఉంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఫోటో చూసి చెప్పరా!' అంటే.... ఇల్లదిరిపోయేలా అరిచా... 'అప్పుడే నాకు పెళ్ళేంటి?' అని. నీ ఫోటో చూపిస్తే చిరాగ్గా చూసి... 'మ్..సరే' అని ముక్తసరిగా సమాధానం చెప్పా! ఏదో ఒకటి పెళ్లి చేసుకుంటే ఈ టార్చర్ తప్పుతుందని. కానీ.... నిజ్జంగా నిజం.... మొదటిసారి నిన్ను చూసినప్పుడు మాత్రం.... మా అమ్మ టేస్ట్ మెచ్చుకోకుండా ఉండలేకపోయా! కానీ మీ అమ్మ, మా అమ్మ ఫ్రెండ్స్ అని.... నీకు నేను ఆరు నెలల ముందే తెల్సు అని తెలిసేసరికి.... అస్సలు నమ్మలేకపోయా! ఆరునెలల నించి నామీద పధకం రచించారన్నమాట మీరంతా కలిసి ;)
నీకేమి గిఫ్ట్ ఇవ్వలేదు నేను... ఇంతవరకు. కానీ నువ్విచ్చిన నీ డైరి.... అందులో నువ్వు దాచుకున్న నెమలీక.... గులాబి రేకులు... వాటిమీద మనిద్దరి పేర్లు..... డైరీలో నాగురించి నువ్వు రాసుకున్న ఊహలు, ఊసులు , కవితలు,........... హ్మ్! రోజుకి కనీసం ఒక పదిసార్లైనా నీ డైరి తెరుస్తా! రోజుకొక పేజి చొప్పున చదువుకుంటూ వస్తున్నా! నువ్వోచ్చేవరకు ఈ డైరి నే నా ఆలనాపాలనా చూసేది మరి :( కానీ.... నీకు అంత నమ్మకమేంటి నామీద? నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని?? ఆ? ఎంత గడుగ్గాయివో!! ఎలాగైతేనేం.... బుట్టలో వేసేసుకున్నావ్ నన్ను!! హాన్నా!
అందుకే నీకోసం ఈ ప్రేమలేఖ వ్రాస్తున్నా! ఇదే నేను నీకివ్వబోయే మొదటి గిఫ్ట్ :) నాగురించి అన్ని రాసుకున్నావ్ కదా నువ్వు.... కానీ నీగురించి రాద్దామంటే..... నీ ఊహల్లో మునిగిపోవడమే తప్ప.... కాగితం మీద కలం కదిలితేనే కదా! ఇదిగో... ఇన్నాళ్టికి అర్ధరాత్రి కుదిరింది ముహూర్తం :)) ఎప్పుడో మర్చిపోయిన అక్షరాలన్నీ కూడబలుక్కుని రాస్తున్నా! నీ అంత అందంగా,కుదురుగా రాయడం కుదరట్లేదు... తిట్టుకోవు కదా! ;)
నేను పెళ్ళికి ముందు.. ఇలాగే ఒంటరిగా ఉండేవాడిని. ఇప్పుడూ నా పరిస్థితిలో మార్పు లేదు. కానీ నా మనసులో మాత్రం బోలెడు మార్పు. చెప్పలేనంత మార్పు. ఆఫీసు-తిండి-నిద్ర తప్ప పట్టని నాకు.. ఊహలు నేర్పావు. కవితలు నేర్పావు. ప్రేమించడం నేర్పావు. విరహం అంటే ఏమిటో చూపిస్తున్నావు. ఇదిగో.... ఇలా ప్రేమలేఖ కూడా రాయించేస్తున్నావు!!
ఇన్ని ఇచ్చిన నా నెచ్చెలీ... నా దగ్గరికి తొందరగా వచ్చెయవూ??
వచ్చేస్తావు కదూ.... బంగారం!
నీకోసం ఎదురు చూస్తూ....
నీ శ్రీవారు!
31 కామెంట్లు:
మీ భావక్షరాలు వలపు పూదోటలో విరిసిన మల్లెల్లా ఉన్నాయి. చదువుతుంటే 'ఎదలో తొలివలపే విరహం జత కలిసే'...పాట గుర్తిచ్చింది.
wow awesome bro
ఎంత బాగా వ్రాసావు ఇందు..మీ వారి మదిలోకి దూరిపోయ్యి భావాలు కాగితం పైకి ఒలికిన్చావు.
కాని పాపం బ్రహ్మీ లు ఏ మదన పడతారు..పాపం దిగులేసి...))
very nice :)
వావ్...
చాల చాల బాగుంది....
పాపం చక్కగా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళని... అమ్మయిలు ఇలా మార్చేస్తారు అనమాట...
హమ్మా....
ప్రేమలేఖలు...కపిత్వాలు...పాటలు...ఎంత మార్పు....ఎంత మార్పు... :)
ఇంకా...రాత్రి పూట నిద్ర పట్టకపోవటం...కాళ్ళు...వేళ్ళు గుర్తు రావటం...:)
కాని అబ్బాయి లు ...అబ్బాయి లే....
లేట్ గ ఇన...చాల లేటెస్ట్ గ రాస్తారు ప్రేమ లేఖని...
All this credit goes to husbands :)
వావ్...
చాల చాల బాగుంది....
పాపం చక్కగా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళని... అమ్మయిలు ఇలా మార్చేస్తారు అనమాట...
హమ్మా....
ప్రేమలేఖలు...కపిత్వాలు...పాటలు...ఎంత మార్పు....ఎంత మార్పు... :)
ఇంకా...రాత్రి పూట నిద్ర పట్టకపోవటం...కాళ్ళు...వేళ్ళు గుర్తు రావటం...:)
కాని అబ్బాయి లు ...అబ్బాయి లే....
లేట్ గ ఇన...చాల లేటెస్ట్ గ రాస్తారు ప్రేమ లేఖని...
All this credit goes to husbands :)
Sweet! :))
బాగుంది!
I am still enjoying the feeling of this post, so could not write more :-)
వావ్! చాలా బాగుందండీ! నిజంగానే మీ శ్రీవారు వ్రాసిన దానిని ఇలా లీక్ చేయలేదు కదా ;)
Wow......చాల బాగుంది.
నైస్ ఫీలింగ్ :))
ఈ పోస్ట్ ని బాగా గుర్తుపెట్టుకుంటానండీ.
ఫ్యూచర్ లో పనికొచ్చే ఫ్రేం వర్క్ లా ఉందీ.
పర్మిషన్ ఇప్పించండీ. ;) ఇప్పించాకా, కాపీ రైట్స్ తీసుకొండీ. ;)
ఇది ఇప్పుడు చందు గారు attest చేస్తే కానీ నమ్మం.......దహా.
Lovely and poetic.
ఇది ఇప్పుడు చందు గారు attest చేస్తే కానీ నమ్మం.......దహా.
Lovely and poetic.
super cute :))
do you really think hubbies write love letters to wives? that too in this manner? :)any way, nice.
ఏమిటో మేము రాయల్సినవన్నీ ఇలా మీరు రాసేస్తే...
మాకు ఇంకా ఏమి మిగులుతాయి చెప్పండి ఇందు గారూ!
:)...@శ్రీ
నేను ఒప్పుకోను....ఇది నా ఐడియా... ...కొంచెం కూడా జాలి లేకుండా కొట్టేసావ్.. :(
అబ్బా...నిజం చెప్పు...నువ్వే రాసుకున్నావ్ కదా ఇదంతా :P
బాగుంది పిల్లా :)
చందూగారి పేరు చెప్పి ఎంత పెద్ద కథ అల్లేసారు ! కిరణ్ చెప్పకపోతే నేను కూడా రాజ్ లాగా పర్మిషన్ అడిగేద్దును :)
indu garu idi meeru rasinda...mee husband meku rasinda...:)...chala bagundandi....
బాగు౦ది
http://bhamidipatibalatripurasundari.blogspot.in/
Enjoyed reading it. Good one.
Ps: maroon <> red. ;).
Good post. Enjoyed reading it. Is this real? ;)
BTW, maroon < > red. Ofcourse, love sick people might not know ;)
చాలా బాగుంది ఇందు.. ఇది నిజంగా మీ ఆయాన మీ పెళ్ళయ్యాక నీకు వ్రాసారా? :)
so sweet.., almost touched my heart,
even im sharpening my views in
"www.naahrudhayam.blogspot.com"
వావ్ చాల బాగుంది అండి ... నేను కూడా మావిడికి ఇలానే లెటర్ రాయలాని అనిపిస్తుంది .. ఇప్పుడు కాదులెండి పెళ్ళి అయ్యాకా . చాల బాగా రాసారండి
superb narration...ఎంత అందంగా వ్రాసారండి ఇందు గారు...అభినందనలు!
nice one....
గూగుల్ ప్లస్ లో నేను షేర్ చేసిన ఈ లింక్ కోసం వెతికి మరీ ఈ లెటర్ ఒకసారి చదవాలని ఇలా వచ్చాను వావ్ సూపర్ అండి .
చాలా చాలా బాగుంది..:)
చాల చాల బాగుంది ఇందు గారు మీ ప్రేమలేఖ.
Very nice :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి