18, అక్టోబర్ 2010, సోమవారం

కన్నుల పండువ గా...

గత మూడు రోజులు....దసరా ఉత్సవాల్లో ముఖ్యమైనవి.....అష్టమి మొదలుకుని దశమి వరకు...సందడే సందడి....


మేము...మాకు దగ్గరలో ఉన్న గుళ్ళు అన్నీ చుట్టేసాం ఈ మూడు రోజుల్లో......కాంటన్,పశ్చిమ కాశీ,భారతీయ టెంపుల్,పరాశక్తి టెంపుల్....కానీ అన్నిటికంటే అంగరంగ వైభవంగా నవరాత్రి మహోత్సవాలు చేసినది మాత్రం 'పరాశక్తి టెంపుల్' లోనే.... నవరత్రుల్లు మొదటి రోజున వెళ్ళాము ఈ గుడికి ....ఆ రోజు వైభవం చూసే..దశమి రోజు ఇంకెంత బాగుంటుందో అనుకున్నా.... అనుకున్నదానికంటే ఘనంగా నిర్వహించారు......


ముఖ్యంగా అమ్మవారి విగ్రహం...అలంకరణ,....పూజ విధానం....ఆలయ కమిటి డిసిప్లిన్ వెరసి....పరాశక్తి గుడి ఈ నవరాత్రి మహోత్సవాలలో అన్నిటికంటే మిన్నగా ఉంది అని చెప్పొచ్చు....అదేమిటో మరి! మిగితా అన్నీ  గుళ్ళు వెలవెల బోయినట్లు ఉన్నాయి....ఒక్క ఈ గుడి తప్ప....


ఇక నిన్న...అనగా దశమి రోజున...అసలే అందంగా అలరారే అమ్మవారిని ఇంకా అందంగా అలంకరించారు.... గులబిమాలలతో...రక రకాల పూల తో చేసిన ఆ అలంకరణ వర్ణనాతీతం ...అమ్మవారిని చూస్తే నాకు అన్నమయ కీర్తన గుర్తొచింది....'ఏమని పొగడుదుమే ఇక నిను!! ఆమని సొబగుల అలమేల్మంగా!! ఏమని పొగడుదుమే!!' అని.... అలంకరణ తరువాత దర్శనం అయ్యాక పూజారులు చదివిన వేదాలు ఆ హాల్ లో ప్రతిధ్వనిస్తుండగా అందరూ అలౌకికమైన భక్తీ పారవశ్యం లో మునిగిపోయారు...సుమారు  మూడు గంటలు....ఎటువంటి విసుగు,చికాకు లేకుండా దైవధ్యానం లో యిట్టె గడిచిపోయాయి....


ప్రతి సంవత్సరం నాకు దసరాలు అపుడు శ్రీశైలం వెళ్ళడం అలవాటు....క్రిందటి ఏడాది నాన్నగారికి బాగోక వెళ్ళలేదు..అలా తప్పిన ఆనవాయితీ ఈ సారి అలవాటయింది....అయినా కూడా ఆ లోటు తీర్చేసినట్టు దర్సనమిచ్చిన పరాశక్తి మాతకు నమస్సుమాంజలి.....


దసరా చివరి మూడురోజులు...చాలా ఆహ్లాదంగా,ఆనందంగా  గడిచాయి...ఆ తల్లి అందరికీ సకల శుభాలని అనుగ్రహించాలని ఆకాంక్షిస్తున్నాను....

8 కామెంట్‌లు:

తృష్ణ చెప్పారు...

ఈ మధ్యనే మీ బ్లాగ్ చూసానండీ. బాగుంది.బాగా రాస్తున్నారు. దసరా విశేషాలు కూడా బాగున్నాయి.మీక్కూడా అమ్మవారి ఆశిస్సులు లభించాలని కోరుతున్నాను.

తృష్ణ చెప్పారు...

అన్నట్లు మీ butterflies చాలా చాలా బాగున్నాయి. నా తోటలోక్కూడా పంపిస్తారా..:)

ఇందు చెప్పారు...

@తృష్ణ :థాంక్యూ తృష్ణ గారు..butterflies కావాలా!! పంపిస్తా పంపిస్తా!! :)

శివరంజని చెప్పారు...

దశరా శుభాకాంక్షలు ఇందు గారు

ఇందు చెప్పారు...

@శివరంజని : meeku kooda dasaraa subhaakankshalandii :)

సి.ఉమాదేవి చెప్పారు...

మీ పండుగ సరదాతోపాటు,పరాశక్తి గురించి చదివా.అమ్మవారి సన్నిధిలో భక్తి పారవశ్యంతో కాసేపు మనల్ని మనమే మరచి ధ్యానం చేసుకోవడాన్ని మించిన మెడిటేషన్ ఏముంటుంది?

రాధిక(నాని ) చెప్పారు...

బాగున్నాయి మీ దసరా సంబరాలు

ఇందు చెప్పారు...

@ C.ఉమాదేవి:avunu nijame.
@ రాధిక(నాని ):thankyou