1, నవంబర్ 2010, సోమవారం

నూడిల్స్ కథ...

ఇవాళ పోద్దున 'Maggi' తింటూ దాని మీద 'Ketchup' పోసుకుంటూ ఉంటే  ఒక్కసారి పాత జ్ఞాపకాలన్నీ రెక్కలు కట్టుకుని వచ్చి వాలాయి.....

మంచి పాత రోజుల్లో(Good Olden Days కి  true translation అమ్మా!!) నూడిల్స్ నాకంటికి  వానపాముల్లా...మంచూరియా మటన్ బాల్స్  లా కనిపించేవి..అవి చూస్తే ఆమడ దూరం పారిపోయేదాన్ని....అలాంటి అమాయకమైన నన్ను పనిగట్టుకుని నా ఫ్రెండ్స్ నూడిల్స్,మంచురియా అంటగట్టి చెడగొట్టారుsad...ఒక రోజున నా మానాన నేను బస్సులో కునికి పాట్లు పడుతుంటే కాంటీన్ లో పార్సెల్ చేయించి తీసుకొచ్చిన నూడిల్స్ పొట్లం విప్పారు...మసాల వాసన గుప్పున  కొట్టింది...మన తిండి కాదులే అని మొహం అటుపక్కకి తిప్పి మళ్లీ డ్రీమ్స్ లోకి వెల్లిపోతుండగా టపా టపా మని కొట్టి లేపారు...'ఏంటే! పడుకోనివ్వరా!' అన్నాను చిరాగ్గా ...'నీకోసం నూడిల్స్ తెస్తే తినకుండా పడుకుంటా అంటావేంటి??' అన్నారు ముగ్గురు దయ్యాలు(శిల్ప,ఆది,కవి) ముక్త కంఠం తో.  'ఛి!ఛి! వానపాములు..యాక్!! ఒద్దే!! ప్లీజ్ వదిలేయండి!!' అని బ్రతిమిలాడుతుంటే ఆది,కవి చెరో రెక్క పట్టుకున్నారు...శిల్ప ఫోర్క్ తో నూడిల్స్ తీసి నా నోట్లో పెట్టేసిందిcrying...నా కళ్ళ వెంబడి నీళ్ళు...కోపం కూడా వచ్చింది....కానీ నోట్లో ఏదో రుచికర పదార్ధం...మెల్లగా దాని రుచిని ఆస్వాదిస్తూ వాళ్ళని తిట్టాలి అన్న విషయం మరిచిపోయా!! 'ఇంకా తింటావా??' అన్నారు...'ఊ' అన్నా....అదిగో అదే నా నూడిల్స్ ప్రాసన  దినం....అలాగే ఇంకో దుర్దినాన మంచురియా కూడా నా నోట్లో కుక్కి దానికి అలవాటు చేసారు...

ఆ తరువాత ఇక ఏ హోటల్ కి వెళ్ళినా..రెస్టారెంట్ కి వెళ్ళినా...ఆఖరికి ఈవెనింగ్ కాంటీన్ లో స్నాక్స్ కూడా నూడిల్స్ యే ఆక్రమించేశాయి....ఇంజనీరింగ్ రెండో సంవత్సరం మనం హాస్టల్ గిరి వెలగబెట్టాం లెండి.....అక్కడ కూడా నాకు తగ్గట్టే వెనక రోడ్లోనే నూడిల్స్ బండి...రోడ్ మీద తిండి తినకూడదు అనే ధ్యాసే లేకుండా  ఇంచుమించి వారం లో మూడు సార్లు ఇదే తిండి....ఆ బండివాడికి రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయాంbig grin....రోజు అలా బైట తిండి ఎందుకు హాస్టల్ లోనే  నూడిల్స్ చేసుకుంటే బాగుంటుందేమో అనే రాజి గారి సలహా తో హాస్టల్ కిచన్ లో  'Maggi ' చేయడం మొదలుపెట్టాం...అబ్బో...అదో పెద్ద ప్రహసనం...మనకా వంట సరిగా వచ్చి చావదు...అందుట్లో ఈ వంటలు అసలు రావు...ముందు తిరగమాత వేసి అందులో నీళ్ళు  పోసి 'Maggi ' వేసాము(ఉప్మా సౌజన్యంతో)....పేస్టు అయింది....ఇలా కాదని  'Maggi ' ని ఉడకబెట్టి దాన్ని చల్లనీళ్ళ కింద పెట్టి భాండి లో నూనె వేసి వేయించాము(నూడిల్స్ బండి వాడి సౌజన్యం తో)...అదీ గుండుసూదిల నిక్కబొడుచుకుంది....ఇక నాకు  'Maggi ' రాదు అని డిసైడ్ అయిపోయి ఆ ప్రయోగాలు ఆపేసాI don't know...

అలా రెండు,మూడు సంవత్సరాలు ఆ నూడిల్స్ బండిని పోషించాం....ఇక నాల్గవ సంవత్సరం.....అదృష్టమో దురదృష్టమో జే.కే.సి లో విప్రో కి సెలెక్ట్ అవడంfeeling beat up...మా జే.కే.సి బాచ్ కి వేరే ప్రాజెక్ట్లు,వేరే ల్యాబ్...వేరే టైమింగ్స్....ఫోర్త్ ఇయర్ అందరూ రెండు క్లాసులు వినేసి చక్కా ఇంటికేల్తే...మేము ఆ దిక్కుమాలిన జే.కే.సి ల్యాబ్ లో రోజంతా పడి ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చేదిangry...ఆ ప్రాజెక్ట్ పని దయవల్ల మధ్యాహ్నం బాక్సులు తెచ్చుకున్నా తినబుద్ధి అయ్యేది కాదు...మెల్లగా ఇక బాక్స్ తేవడం ఆపేసి కాంటీన్ మీద పడ్డాం....నేను,ఝాన్సీ,దీప్తి అక్కా,పద్మజ,నర్మదా.....మొత్తం హోల్ సేల్ గా నూడిల్స్ ఫాన్స్ అసోసియేషన్.....ఇక కాంటీన్ లో రామకృష్ణ ని హింస పెట్టె వాళ్ళంdancing....మసాల కొంచెం ఎక్కువుండాలి...ఘాటుగా ఉండాలి...పేస్టు లా అవ్వకూడదు...ఉడికి ఉడకనట్టు ఉండకూడదు....ఉప్పు ఎక్కువా కాకూడదు...తక్కువా కాకూడదు...సరిగ్గా సమానంగా ఉండాలి...అని ఒక పెద్ద లిస్టు చెప్పే వాళ్ళం...చూస్తూ చూస్తూ రోజు వచ్చే ఐదుగురు కష్టమర్స్ ని ఒదులుకోలేడు.....ఏంచేస్తాడు!! రోజు ఒక చిన్న కప్ లో తయారయిన నూడిల్స్ తీసుకొచ్చి 'అమ్మా బంగారాలు !! టేస్ట్ చూసి చెప్పండమ్మా!! ఏమన్నా ఎక్కువ తక్కువలుంటే సరిచేస్తాను!!' అని దీనంగా అడిగేవాడు.....మేము జూనియర్స ముందు గర్వంగా ఒక ఫొస్ పెట్టి  మార్పులు,చేర్పులు చెప్పేవాళ్ళంsmug....ఆ తరువాత మాకు ప్రత్యేకంగా ఒక సాస్ బాటిల్ తెచ్చేవాడు...'చూడండమ్మ!! ఇక కాంటీన్ లో ఇదే లాస్ట్ బాటిల్...సాస్ అయిపోవచ్చింది...కొంచెం చూసి వేస్కోండి అమ్మా!!' అనేవాడు...రోజు ఇదే డవిలాగులే....మరి మేము సాస్ వేసుకోకుండా పోసుకునేవాళ్ళం అన్నమాట...ఒకసారి రామకృష్ణ భార్య వచ్చి అది చూసి....మీరు నూడిల్స్ లోకి సాస్ వేసుకుంటున్నార ?? సాస్ లో నూడిల్స్ నంజుకుని తింటున్నారా? అని అడిగింది.ఒక పిచ్చి నవ్వు నవ్వి ఊరుకున్నాం...మేము దానికీ వంకలు పెట్టేవాళ్ళం...సాస్ మరీ పల్చగా ఉందని...నిన్న వేరే రంగు ,ఇవాళ వేరే రంగు ఉందని,...అలా పాపం వాళ్ళని  ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాంoh go on....

కాలేజి అయిపోయాక అమీర్పేట్ ని ఏలేస్తున్న రోజుల్లో మా  హాస్టల్ కి దగ్గరలో ఒక నూడిల్స్ బండి ఉండేది...అక్కడ నేను,రాజి,ఝాన్సీ,ఆది మా నూడిల్స్ ప్రహసనాన్ని నిరాటంకంగా కొనసాగించాం....నూడిల్స్ తినాలనిపించిన రోజు హాస్టల్ లో ఫుడ్ చెక్ చేసి బాగున్నా  బాగోలేదని తేల్చేసి నూడిల్స్ తెచ్చుకునే వాళ్ళంtongue... రాజి ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆ నూడిల్స్ బండి పక్కనే ఉన్న హాస్టల్స్ లో రూమ్స్ ఉన్నాయేమో కూడా వెతికింది.కానీ ఆరునెలల్లోనే  మా బంగారపు రోజులు అయిపోయాయి...అందరం తలోదిక్కు అయిపోయాం...ఆ రోజుల తోనే మా రుచికరమైన నూడిల్స్ టాటా-గుడ్ బై చెప్పెసాయేమో!!worriedఇక నేను జాబ్ లో జాయిన్ అయ్యాక విప్రో లో తిన్న నూడిల్స్ నాకు నచ్చలేదు....చాలా చండాలంగా ఉండేవి..కానీ చందు దయ వల్ల 'Maggi 'చేయడం మాత్రం బాగా వచ్చింది...నా విప్రో అసెస్మెంట్స్ అపుడు పొద్దున రోజు బ్రేక్ ఫాస్ట్ అదే!! అలా  'Maggi  లో బాగా ప్రావీణ్యం సంపాదించాను...అప్పుడప్పుడు బైటికెల్లినపుడు నూడిల్స్ ఆర్డర్ చేసినా నేను కోరుకున్న టేస్ట్ లేక  తినడం ఆపేసా!!sad

ప్రస్తుతానికి 'Maggi తో అడ్జస్ట్ అవుతున్నా!!sigh

P .S :ఒక సంవత్సరం క్రితం మా గాంగ్ అందరం మళ్లీ  ఏదో పనిమీద కాలేజికి  వెళ్ళాం...రామకృష్ణ కి నూడిల్స్ ఆర్డర్ చెప్పాం...మేము బానే గుర్తున్నాం కానీ మా రూల్స్ మాత్రం గుర్తులేవనుకుంటా.....అందుకే చాలా చెత్తగా ఉన్నాయి నూడిల్స్....మళ్లీ  తినాలనిపించలేదుbroken heart....మా పాత రోజులు నెమరేసుకుంటూ వచ్చేసాం!!

10 వ్యాఖ్యలు:

రాధిక(నాని ) చెప్పారు...

:)))బాగుంది మీ మాగీ ఫ్లాష్బాక్

Niru చెప్పారు...

nice...very nice..

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ బాగుందండీ మీ ఫ్లాష్బాక్ :)

నాకు మ్యాగీ తినీ తినీ బోర్ కొట్టేసింది, ఐనా అలాగే తిట్టుకుంటూ ఇంత సులువుగా వేరే ఇంకేమీ చేసుకోలేక ఏదో తప్పని సరిగా తింటుంటాను.

మనసు పలికే చెప్పారు...

ఇందు గారు, చాలా బాగుందండీ మీ నూడుల్స్ కథ..:)) నిజానికి నాక్కూడా మ్యాగి అంటే ఇష్టమే, అది కూడా మా ఆఫీసు క్యాంటీన్లో..:)

ఇందు చెప్పారు...

@రాధిక(నాని ):Thankyou andi.
@ Niru :Thankyou.
@ వేణూ శ్రీకాంత్ :ThankU.అవును.ఏం చేస్తాం!తప్పదు కదా!
@మనసు పలికే :హ్మ్! రోజు తిని తిని చిరాకేస్తోంది...మీరు ఆఫీస్ లో కూడా 'మాగీ' ని భరిస్తున్నారు అంటే గ్రేట్. :)

కొత్త పాళీ చెప్పారు...

బాగు బాగు.
నేను బి.టెక్ చదూతున్న రోజుల్లోనే మేగీ నూడుల్స్ మార్కెట్లోకి వచ్చింది. హాస్టలు రూములో 1000W కరంటు పొయ్యి, ఒక రెండు కాడ గిన్నెలూ మేంటేన్ చేసే వాళ్ళం. ఆరోజుల్లోనూ, ఆ తరవాత కాన్పూర్ ఐఐటీలోనూ నా మేగీ నలభీమపాకం బాగా ప్రసిద్ధికెక్కింది. ఉడకబెట్టి, వార్చి, ఇవన్నీ చేసే వెసులుబాటు లేదు, డైరెక్టుగా ఒకేసారి ఒకేగిన్నెలో వంటకం పూర్తిగా తయారైపోవలసిందే. మేగీ పేకెట్టుతో వచ్చే స్పైస్ పౌచ్ కాక ఇంటినించి తెచ్చుకున్న ఏదో ఒక పొడి లేదంటె ఏదో ఒక ఊరగాయ కలిపేసే వాళ్ళం.
అమెరికా వచ్చాక కొన్నేళ్ళు ఆ ప్రావీణ్యం అంతా పాస్తా వండడంలో చూపించేవాణ్ణి .. హుఁ .. గత వైభవ స్మృతులు!

ఇందు చెప్పారు...

@ కొత్త పాళీ:వావ్..నూడిల్స్ లో పొడి,ఊరగాయా? కొత్త కాంబినెషన్ చెప్పరుగా ఈసారి ట్రై చేస్తా! బాగున్నాయ్ మీ కాలెజీ రోజు ముచ్చట్లు :)

చందు చెప్పారు...

బాగుందండీ మీ మ్యాగీ కథ. మేము కూడా నూడల్స్ ప్రియులం. విశాఖ లో నూడల్స్ చాలా బావుంటాయి. మేము బాగా నేర్చేస్కుని ఇంటికి ఎవరు ఒచ్చిన నూడల్స్ తో విసిగిస్తాము.

జ్యోతి చెప్పారు...

అసలు మ్యాగీ నూడుల్స్ పాకెట్ మీద ఉన్నట్టే చేయాలని ఏ దేవుడు చెప్పాడు? ఏ పురాణంలో ఉంది? ఇంచక్కా మనకిష్టమైనట్టు చేసుకుంటే సరి.. కట్లెట్,ఉప్మా, పకోడి వగైరా... ఇవాళే షడ్రుచులులో నూడుల్స్ కొత్త రకంగా, రుచికరంగా ఎలా తినొచ్చో చెప్పాను చూడండి..

ఇందు చెప్పారు...

@ చందు :Thankyou chandu.wow....ఐతే మేము మాగీని అలవోకగా చేసినట్టు మీరు నూడిల్స్ చేసేస్తారన్నమాట :))

@ జ్యోతి :అలా ఆలోచించే హాస్టల్ లో మాగీ పాకెట్ మీద ఉన్నది తప్ప అన్ని చేసాం! కాని వంట మాకు అంతగా తెలియదు కదా! అందుకే కుదరలేదు...మీ బ్లాగ్ చూస్తు ఉంటాను జ్యొతిగారు.మీ సమోసాలు ట్రై చెసాం..సూపర్ వచ్చాయ్...ఆ మాగీ వంటకాలు కూడా చూస్తాను :) కామెంటినందుకు ధన్యవాదాలు :)