20, నవంబర్ 2010, శనివారం

కార్తీక వనభోజనాలు -కొబ్బరన్నం

జ్యోతిగారి ఆలోచన మేరకు ఈ టపా పెడుతున్నా! అసలు కార్తీకమాసపు వనభోజనాల గురించి టపా వ్రాద్దామనుకున్న! అలా రోజులు గడిచిపోయి పౌర్ణమి కూడా వచ్చేసింది.ఇకనైనా ఆలస్యం చేయకూడదని ఈ 'కొబ్బరన్నం' చేశా! కాస్త రుచి చూసి ఎలా ఉందో చెప్పండే!!

ఎప్పుడు కార్తీకమాసం వచ్చినా....నేను ఎదురు చూసేది....ఒక తీరికైన ఆదివారంకోసం(వన భోజనాలకి)....ఇంకా పున్నమి వెన్నెలలు చిలికించే కార్తీకపౌర్ణమి కోసం(వెన్నెల భోజనాలకి).

నాకు తెలిసి,ఒక్క సంవత్సరం తప్ప....క్రిందటి ఏడాది వరకు మా ఇంట్లో కార్తీకమాసమంటే హడావిడే.పొద్దునే లేచి....తలారా చన్నీళ్ళ  స్నానం చేసి తులసి మొక్కకి పూజ చేసే అమ్మ....పొద్దున్నే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుని ఆ ప్రసాదం తీసుకువచ్చే  నాన్న....ఎనిమిది గంటలయినా ఇంకా నిద్రలేవకుండా పడుకునే నేనుtongue....అలా భలే సందడిసందడిగా ఉండేది. కార్తీక వనభోజనాల్లో మేము ఎక్కువగా ఎంచుకు
నేది చీరాల వెళ్ళేదారిలో ఉండే ఒక పెద్ద పళ్లతోట.అక్కడ ఎక్కువగా జనాల హడావిడి ఉండదు. పొద్దున్నే లేచి భోజనాలకి అన్నీ సిద్ధం చేసుకుని త్వరగా ఇంటినించి బైటపడిపోయే వాళ్ళం.తరువాత ఆ తోటలోకి వెళ్లి...కాసేపు అంతా కలియతిరిగి...ఇక మధ్యాహ్నవేళ  హాయిగా చెట్లకింద చాప,దుప్పటి పరుచుకుని.... తెచ్చుకున్న పదార్ధాలను పేపర్ ప్లేట్లలో సర్ది.....అందరం చేరి ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ చల్లని గాలి పీలుస్తూ హాయిగా వనభోజనాలు చేసేవారం.తరువాత ఆ పైరగాలికి కాసేపు అలా కునుకు పట్టేసేది. అందరం ఒక మాంచి నిద్ర లాగించేసి సాయంత్రం నాలుగు ఆ వేళలో సముద్రపోడ్డుకి బయలుదేరేవాళ్ళం.కాసేపు అక్కడ అలలతో ఆటలాడుకుని ఆరు-ఆరున్నరకు ఇక తిరుగు ప్రయానమయ్యేవాళ్ళం.దారి మధ్యలో చిక్కటి చాయ్..ఇంకా వేడి వేడి మిరపకాయ బజ్జి మా మెనూ. అలా ప్రతి ఆదివారం ఇంచ్చుమించు ఏదో ఒక చోటికి వెళ్ళేవారం. అమరావతి,కోటప్పకొండ,హంసలదీవి,సూర్యలంక,అంతర్వేది,ద్వారకతిరుమల,వైకుంటపురం,బాపట్ల,వేదాద్రి,
కొండపల్లి ....ఇలా....ఎన్నో...ఎన్నెన్నో ఊళ్లు...ఎంతో సరదాగా గడిచిపోయాయి ఆ కార్తీకమాసపు ఆదివారాలు.


ఇక వనభోజనాల్లో స్పెషల్స్ గురించి చెప్పాలంటే....మా అమ్మ చేసే కొబ్బరన్నం నాకైతే అమృత సమానం.అది నేను కనీ వినీ ఎరుగని రుచి.ఇంతవరకు మా అమ్మలాగ కొబ్బరన్నం చేయగలవారిని నేనైతే చూడలేదు.కాని ఇది కొంచెం శ్రమ తో కూడుకున్న పని.పచ్చి కొబ్బరి ని మిక్సీలో వేసి,చిక్కటి ద్రవంలా చేసి,దాన్ని వడకట్టి కొబ్బరిపాలు తీసి ఆ పాలతో తయారుచేస్తారు ఈ కొబ్బరన్నాన్ని.తరువాత మసాలలాలు(దాల్చిన చెక్క,జాజికాయ,జాపత్రి,లవంగాలు,ఏలకులు,మిర్యాలు) మెత్తని పోడిలా చేసి పెట్టుకోవాలి.ఇందులో గసగసాలు,ధనియాలు,అల్లం వేయకూడదు. తరువాత భాండి లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి పక్కకు తీసి....ఆ మిగిలిన నెయ్యి లో ఈ మసాలా,బిర్యాని ఆకు వేసి కొంచెం వేయించాలి.తరువాత అందులో కొబ్బరిపాలు పోయాలి.ఆ పాలు బాగా మరిగాక అందులో నానబెట్టిన బియ్యం వేయాలి.చిటికెడు ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి.తరువాత జీడిపప్పులు వేయాలి.ఫైనల్ గా కొత్తిమీర,పుదీనా జల్లి దించేయాలి. అంతే...వేడి వేడి కమ్మని కొబ్బరన్నం రెడీ...ఇందులో అలూకూర,రైతా కాంబినేషన్ అదుర్స్ .

చూసేసార!కొబ్బరన్నం ఎలా  చకచకా చేసేసానో! మీకు కావాలంటే....మా ఇంటికి భోజనాలకి వచ్చేయాలి మరి.

33 కామెంట్‌లు:

జయ చెప్పారు...

చాలా బాగుంది కొబ్బరన్నం నోరూరించేస్తోంది.

కృష్ణప్రియ చెప్పారు...

చాలా బాగుంది... పైగా కొబ్బరి చిప్పలో పెట్టి డిస్ప్లే చేయటం నచ్చింది.

swapna@kalalaprapancham చెప్పారు...

nenu anthaga kobbarannam gurinchi vinaledandi.

Good post.

sunita చెప్పారు...

baagundi. noerooristoo...

లత చెప్పారు...

బాగుందండీ
చాలామంది కొబ్బరన్నం అనగానే కొబ్బరి తురుము వాడుతారు కాని నాకూ ఇలా కొబ్బరి పాలు పొసి చెయ్యడమె ఇష్టం.

jaggampeta చెప్పారు...

kobbari annam bavundi.konaseemalo ilane kobbari palaavu chestaru

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలాబాగుంది ఇందుగారు, డిస్ప్లే ఐడియా కూడా బాగుంది. మా పిన్నిగారొకావిడ అచ్చంగా ఇలానే చేస్తారు కొబ్బరిపాలతో చాలా రుచిగా ఉంటుంది.

మంచు చెప్పారు...

wow !

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

ఇంతమంది ఇన్ని వంటలు రాస్తున్నారు ఎవరన్నా నాకిష్టమయిన ఈ కొబ్బరన్నం గురించి రాయకపోతారా అని ఎదురుచూస్తున్నా,ఆఖరికి మీరు కరుణించారు.
నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా మా స్నేహితుడి అమ్మగారు నాకోసం ఈ కొబ్బరన్నం తయారుచేసి తలుపులు దగ్గరగా వేసి మరీ వడ్డిస్తారు మన తిండికి చూసేవాళ్ళ దిష్టితగులుతుందని,ఎంతయిన తల్లి మనసు కదా మరి.భలే అమృతప్రాయంగా ఉంటుందిలెండి.
ఇలా బ్లాగ్ రూపంగా కొబ్బరన్నం రుచి చూపించి విందుచేసినందుకు అభినందనలు,ఈ పోస్ట్ ద్వారా ఆ అమ్మని మరొక్కసారి తల్చుకునేట్టు చేసినందుకు ధన్యవాదాలు.

మధురవాణి చెప్పారు...

కొబ్బరన్నం ఫోటో అదిరిపోయింది. మీ కొబ్బరన్నం ఘుమఘుమలు మాదాకా వచ్చేసాయి. :)

మాలా కుమార్ చెప్పారు...

కొబ్బరిపాలు తీసే ఓపిక లేక ఈ కొబ్బరన్నం జోలికి పోనండి . చాలా ఓపిక గా చేసరు , అదిరిపోతోంది .

kiran చెప్పారు...

blog lo download kobbarannam ani unte bagundedi kada.. :) :P....bagundi...post eppati lage.. :)

సిరిసిరిమువ్వ చెప్పారు...

మీ కొబ్బరన్నం సూపర్. దానికన్నా సూర్యలంక, బాపట్ల, చీరాల....ఈ పేర్లు చూడగానే కడుపునిండిపోయింది. మేమూ చిన్నప్పుడు ప్రతి కార్తీక పౌర్ణానికి ఎక్కువగా చీరాల బీచ్కి వెళ్లేవాళ్లం..తరువాత తరువాత సూర్యలంక. జీడిమామిడి తోటల్లో భోజనాలు..తిరిగి వచ్చేటప్పుడు బాపట్లలో మిరపకాయ బజ్జీలు..బాదం పాలు.
ఇప్పుడు కార్తీక మాసంలో మాకు వెళ్లటం కుదరటంలేదు కాని ..మా వాళ్లంతా వెళ్తారు.

రాధిక(నాని ) చెప్పారు...

ఫోటో చాలా బాగుందండి నొరూరిస్తూ......

శ్రీలలిత చెప్పారు...

కొబ్బరన్నం చూడ్డానికీ, తినడానికీ కూడా బాగుందండీ...

ఇందు చెప్పారు...

ముందుగా ఫొటో నచ్చిన అందరికీ ధన్యవాదములు.నిజం చెప్పాలంటే ఆ ఐడియా నాకొచ్చినా అది నేను తీసిన ఫొటో కాదు.చందుగారు కొబ్బరికాయ కొట్టిన తీరుకి ఇంకేం పెట్టను కొబ్బరిచిప్పలొ కొబ్బరన్నం :P .అందుకే జ్యొతిగారు చెప్పినట్టు....నేను అనుకున్న ఫొటో కోసం ' జై గూగులమ్మ ' అన్నా సొ! మీ పొగడ్తలన్నీ గూగుల్ గారికే చెందుతాయని సవినయంగా తెలియజేస్తున్నా ! :)

ఇందు చెప్పారు...

@ జయ:ధన్యవాదములు జయగారు.జై గూగులమ్మ!

@ కృష్ణప్రియ :ధన్యవాదములు కృష్ణప్రియగారు.జై గూగులమ్మ!

@swapna@kalalaprapancham:పోన్లేండీ అందరికీ అన్నీ తెలియాలని లేదుగా! థాంక్యూ స్వప్న.

ఇందు చెప్పారు...

@sunita : ధన్యవాదముల సునీతగారు.

@ లత :ధన్యవాదములు.అవునండీ.దీని రుచి వేరు.పూర్తిగా కొబ్బరిపాలలో ఉడికిన అన్నం కమ్మగా ఉంటుంది :)

@ jaggampeta:ధన్యవాదములు.అవునా! మా అత్తయ్యగారిని అడగాలి ఐతె ఈ కొబ్బరిపులావు సంగతి :)

ఇందు చెప్పారు...

@ వేణూ శ్రీకాంత్ :జై గూగులమ్మ!ధన్యవాదములు వేణుగారు.అవును కదా..చాలా బాగుంటుంది కొబ్బరన్నం.


@ మంచు:thankyou.

@ శ్రీనివాస్ పప్పు:నాకు చాలా ఆనందంగా ఉంది మీకు ఆ అమ్మగారిని మళ్ళీ గుర్తుచేసినందుకు. నా పోస్ట్ నచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.

ఇందు చెప్పారు...

@మధురవాణి :ధన్యవాదములు మధురగారు.జై గూగులమ్మ!వచ్చెసాయా ఘుమఘుమలు..! మరి వాటి దారిలోనే మీరు వచ్చెయండీ మా ఇంటికి :)

@ మాలా కుమార్:అవునండీ కొంచెం శ్రమతో కూడుకున్న పని.ఓపికగా చేయాలి.ధన్యవాదాలండీ.

@ kiran:హ్హహ్హహ్హ.అవును కిరణ్ అల ఉంటే బాగుంటుంది.నేను రోజు మా అమ్మ వంటలు తినొచ్చు.కనిపెడదాం మనం ఇద్దరం కలిసి ఆ సాఫ్ట్ వేర్. థాంక్స్ నా పోస్ట్ నచ్చినందుకు.

ఇందు చెప్పారు...

@సిరిసిరిమువ్వ:అవునండీ...గుంటూరు చుట్టుపక్కల చాలా ఊళ్ళు వనభోజనాలకు భలే అనువుగ ఉంటాయి కదా! ఏంటో ఆ రోజులు....ఎంత సరదాగా గడిచిపోయేవో!

@రాధిక(నాని ):జై గూగులమ్మ! ధన్యవాదాలండీ రాధికగారు.

@ శ్రీలలిత :జై గూగులమ్మ! ధన్యవాదాలండీ శ్రీ లలితగారు

HiMa చెప్పారు...

choosthontene nooru ooripotondi...ochesthunna indu...kobbarannam ready na? :P

పానీపూరి123 చెప్పారు...

ఇంద, పాట్‌లక్ లో నా వాట క్రింద పానీపూరీలు తినండి :-)

మనసు పలికే చెప్పారు...

ఇందు గారూ.. నాకు చాలా ఇష్టమైన వంటకం నేర్పించారు మీరు.. ధన్యవాదాలు..:)
>>తలారా చన్నీళ్ళ స్నానం చేసి తులసి మొక్కకి పూజ చేసే అమ్మ....పొద్దున్నే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుని ఆ ప్రసాదం తీసుకువచ్చే నాన్న.
మీరేమో అనేసుకున్నాను..;)

Ram Krish Reddy Kotla చెప్పారు...

Naku kuda kobbarannam chala istam... chala tasty ga untundi jeedi pappu veste :-)

సవ్వడి చెప్పారు...

Indu garu!
naaku kobbari annam calaa ishtam. ee vana bhojanaallo meeru maatrame naaku naccina vanta cesaaru.:):)
noruripotondi:):)

భాను చెప్పారు...

ఇందు
కొబ్బరన్నం అల ఎదురుగా డిస్ప్లే పెట్టేసావ్ అదేమో ఎలా ట్రై చేసిన మా నోట్లోకి డౌన్లోడ్ కావట్లేదు. అదేదో సినిమాలో కోట శ్రీనివాస రావు చికెన్ కొరకు కోడిని ఎదురుగా చూపించినట్లుంది మా పరిస్థితి. ఇలా అయితే మేం ఉర్కొం . మొత్తానికి బాగుంది మీ కొబ్బరన్నం. అర్జెంట్ గా మా ఆవిణ్ణి చేయ్యమనాలి.

నేస్తం చెప్పారు...

nice post చాలా బాగుంది

ఇందు చెప్పారు...

@HiMa: yeah neekosame waiting daa daa :))

@పానీపూరి123 : baagundanDi mee panipuri.

@ మనసు పలికే :మీకు కొబ్బరన్నం ఇష్టమేనా! నాసంగతి తెలిసిందే కదండీ :P

ఇందు చెప్పారు...

@Ramakrishna Reddy Kotla: avunandi..chala baguntundi :)

@ సవ్వడి: chaala thaanks anDii...:)

@భాను:హ్హహ్హహ్హ ఆగండి భానుగారు...నేను కిరణ్ కలిసి ఆ సాఫ్ట్వెర్ కనిపెడుతున్నాం...అప్పుడు మీరుకూడ తినొచ్చు...ప్రస్తుతానికి ఇలా అద్జస్ట్ అయిపోండీ :))

@ నేస్తం:thankyou Nestam garu :)

హరే కృష్ణ చెప్పారు...

ఒక వారం పాటు మీ బ్లాగ్ కి సెలవు..కొబ్బరన్నం వికటించింది ఇక్కడ

ఇందు చెప్పారు...

@ హరే కృష్ణ:అయ్యో!! ఏమైందండీ..?

వాజసనేయ చెప్పారు...

అలా అన్ని మీరే చేసుకుంటే ఎట్లాగు ,రుచి ఎలా ఉందొ చెప్పటానికైన మాకు పంపచ్చుకదా.