17, డిసెంబర్ 2010, శుక్రవారం

తొలిసారి నిన్ను చూసింది మొదలు...-2

అతనికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది....పెదవులపై చిరునవ్వు మెరిసింది.వెంటనే డోర్ దగ్గర నిల్చొని బైటికి చూసాడు.అనన్యా వాళ్ళు వెళ్ళిపోతున్నారు మెట్లు దిగి.ట్రైన్ ఇంకా మెల్లగానే కదులుతోంది...ప్లాట్ ఫారం చివరలో ఉంది.వెంటనే ట్రైన్ దిగేసాడు అర్జున్.
"అనన్య గారు!!" అని గట్టిగా పిలిచాడు.వెంటనే అనన్య వెనక్కి తిరిగింది.ఎదురుగా అర్జున్.వెంటనే ఆమె కళ్ళలో మెరుపు.అది అర్జున్ దృష్టి దాటి పోలేదు.వడివడిగా ఆమె దగ్గరకి నడిచాడు అర్జున్.
"ఓహ్! ఏంటండి!! మీరు వెళ్ళాల్సింది అరకు కదా! ఏమన్నా మర్చిపోయార?"
"అవునండి...మర్చిపోయారు.నేను కాదు...మీరు.మీ ముద్దుల కెమెరా నా దగ్గరే ఉండిపోయింది.ఇది మీకు ప్రాణం కదా! అందుకే తిరిగిద్దామని చూస్తే మీరు వెళ్లిపోతున్నారు.సరే..అని నేనే ట్రైన్ దిగేసా!"
"అయ్యో! ఐం రియల్లీ సారి అండీ..మీకు చాలా ట్రబుల్ ఇచ్చా! అసలు అలా ఎలా మర్చిపోయాను? థాంక్యు వెరీ మచ్" అంది అనన్య మనస్పూర్తి గా..ఇంకా అర్జున్ ని మళ్లీ చూసిన ఆనందం కూడా ఆమె మోహంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది.
"ఇట్స్ ఒకే! నెక్స్ట్ ట్రైన్ మళ్లీ సాయంత్రానికి కాని రాదు..అప్పటిదాకా ఎలాగో అలా గడిపేస్తాలెండి.మీకు లేట్ అవుతోంది.వెళ్ళండి మరి ఇక గుహలకి"
"అయ్యో! సాయంత్రం వరకా? పోనీ మాతో రండి.మేము ఎటూ సాయంత్రం అరకు వెళతాం.అప్పుడు అందరం కలిసి వెళ్ళొచ్చు.మీకు ఏమి అభ్యంతరం లేకపోతేనే"
"అయ్యో...నాకేం అభ్యంతరం అండీ...ఇక్కడ ఈ స్టేషన్లో కూర్చునే కంటే మీ అందరితో సరదాగా గుహలకి వెళ్ళడమే బెస్ట్.సరే పదండి ఐతే!" అన్నాడు హుషారుగా అర్జున్.తన ప్లాన్ పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది అర్జున్ కి.బొర్రాగుహలనించి బస్ లోనో,జీప్లోనో అరకు వెళ్లిపోవచ్చు.కాని వారితో పాటు గడపాలనే అలా చెప్పాడు.అలా అన్నా కొద్దిసేపు అనన్యతో గడపొచ్చు అని అతని ఆలోచన.
అందరూ కలిసి మెల్లగా నడుచుకుంటూ గుహలవైపు దారి తీసారు.మొత్తం ఆ బృందంలో పదిమంది అనన్యతో కలిపి.ఆరుగు అమ్మాయిలు...నాలుగు అబ్బాయిలు.అర్జున్ వాళ్ళతో తొందరగానే కలిసిపోయాడు.అందరూ గుహల వద్దకు చేరి...టికెట్లు తీసుకున్నారు.అర్జున్ చాలా సార్లు అక్కడికి ఫ్రెండ్స్ తో వచ్చాడు.ఆ ప్రాంతం గురించి బాగా తెలుసు.అక్కడ కొంచెం జాగ్రత్తగా,మెలకువ గా ఉండాలని వారిని హెచ్చరించాడు.ఒకసారి గుహల లోపలి వెళ్ళాక అక్కడ దారి చాలా గజిబిజిగా ఉంటుంది.
అందరూ ఒకేదారిలో వెళ్ళాలి.కొని చోట్ల వొంగొని,కొన్ని చోట్ల రెండు రాళ్ళ మధ్య దూరి...ఇలా సాగుతుంది.అందుకని ముందు ఇద్దరు అబ్బాయిలు...మధ్యలో ముగ్గురు అమ్మాయిలు...తరువాత ఒక అబ్బాయి...మళ్లీ ముగ్గురు అమ్మాయిలు...చివరలో ఇద్దరు అబ్బాయిలు ఉండేట్లు చూసుకున్నారు.మధ్యలో అర్జున్,అతని వెనుక వరుసలో అనన్య ఉన్నారు.ఇక మెల్లగా గుహల్లోకి అడుగు పెట్టారు.అర్జున్ చెప్పినట్లే ఉంది అ దారి.చాలా జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ...అక్కడ విచిత్రమైన ఆకారాల్లో ఉన్న శిలాజాలాలను చూస్తూ....వెళ్లారు.అక్కడక్కడ నేల జారుతోంది.కొన్ని చోట్ల లైటు లేదు.కొంతమంది స్టూడెంట్స్ మధ్య మధ్యలో పెద్దగా అరుస్తున్నారు.దారి పొడుగునా అర్జున్ చేయి వదలలేదు అనన్య.తను అలా పట్టుకుంటే..ఈ గుహ ఏంటి..ఎవరెస్ట్ అయినా అవలీలగా ఎక్కేయోచ్చు అనుకున్నాడు అర్జున్.

సుమారు కిలోమీటరు లోపలికి  నడిచి గుహల చివరి భాగానికి చేరుకున్నారు.అక్కడనించి మెట్లు ఎక్కితే చిన్న గుడి వస్తుంది.అక్కడ శివలింగం చాలా శక్తివంతమని..కోరుకున్నవన్నీ జరుగుతాయని ప్రతీతి.అర్జున్ వాళ్ళు ఆ మెట్లదగ్గరకి చేరుకున్నారు.ఒకసారి పైకి చూసిన అనన్యకి కళ్ళు తిరిగాయి.
"ఏంటి అర్జున్! అంత ఎత్తులో ఉంది..ఈ మెట్లు ఎంత స్టీప్ గా ఉన్నాయో! ఒకవేళ ఎక్కేటప్పుడు కాలు జారి పడితే?"
"ఏముంది! మీతో పాటు...మీ వెనుక ఉన్న అందరినీ కింద పడేస్తారన్నమాట...." అన్నాడు అర్జున్.
"వామ్మో!నేను రాను బాబోయ్! చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయ్! ఇక పైనించి చూస్తే అంతే సంగతులు! మీరు వెళ్ళండి....నేను ఇక్కడే ఉంటా"
"హేయ్..ఇది మరీ బాగుంది...ఏం వీళ్ళందరూ మనుషులు కాదా? మెట్లు ఎక్కి గుడికి వెళ్ళట్లేద? మరీ అంత భయమైతే ఎలా అండీ? సరే నా చేయి గట్టిగా పట్టుకోండి...ఒకవేళ మీరు స్లిప్ అయినా నేను...మీరు కింద పడకుండా పట్టుకుంటా..ఒకే నా?"
"హ్మ్!తప్పదంటారా? సరే...కానీ కొంచెం గట్టిగా పట్టుకోండి"
"సరేనండి!మీరు భయంతో...చుట్టు ఉన్న రాళ్ళ అందాలు చూడట్లేదు.ఇవన్నీ ఒక రకమైన ఖనిజాల వల్ల ఏర్పడతాయ్! అదిగో అక్కడ గుహకి ఒక చిన్న కంత ఉంది చూసారా? ఆకాశం కనపడుతోంది!! అక్కడనించే ఒక ఆవు ఈ గుహలో పడిపోయిందట.ఆ ఆవును వెతుకుతూ వచ్చిన కాపరి ఈ గుహలని కనిపెట్టాడు.కానీ ఇంత ఎత్తులోనించి పడినా..ఆవు క్షేమంగా బయటకి వచ్చిందట.అదంతా ఆ పైన ఉన్న శివుని మహిమ అని ఆయన్ని కనుగొని...పూజించడం మొదలుపెట్టారు.ఈ గుహల కింద నించి అంతర్వాహినిగా....'గోస్తనీ నది' ప్రవహిస్తోంది.మీరు దాని పరవళ్ళ గలగలలు వినొచ్చు....కానీ అది కనపడదు.గుహల బైట లోయలోకి చూస్తే..తెల్లని నురగలో ప్రవహించే గోస్తనీ నది ప్రత్యక్షమౌతుంది.ఆ నది జన్మస్థానం ఈ గుహలే"
ఇలా అనన్య భయం పోగొట్టడానికి ఆ గుహల వైశిష్ట్యం గురించి....అక్కడి శిలాజలాల గురించి...ఇలా ఎన్నో చెబుతూనే ఉన్నాడు అర్జున్.మెల్లగా తనకీ తెలియకుండానే అన్నీ మెట్లు ఎక్కేసి గుడి దగ్గరకి చేరుకుంది అనన్య.అక్కడనించి యధాలాపంగా కిందకి చూసింది.ఆమెకి ఒక్కనిమిషం గుండె ఆగింది.కాళ్ళు వణికాయి.ఆమె ఇంచుమించు గుహల పైకప్పు దగ్గర ఉంది.
"వామ్మో! ఇంత ఎత్తులో ఉన్నానా?"
"అనన్యగారు! తరువాత తీరిగ్గా ఆశ్చర్యపోదురుగాని....రండి...దర్శనం చేసుకుందాం" అని అక్కడ ఉన్న చిన్న,ఇరుకైన గుహలాంటి గుడిలోకి తీసుకెళ్ళాడు అర్జున్.అక్కడ విచిత్ర ఆకారంలో ఉన్న శివలింగాన్ని దర్శించి....తీర్ధం స్వీకరించి...తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు...అర్జున్ ఆ స్వామిని...ఒక్కటే కోరుకున్నాడు.....'అనన్య నా చేయి ఎప్పటికీ విడిచిపెట్టకుండా చూడు స్వామీ' అని.అనన్య ఏం కోరుకుందో అని అడగాలనుకున్నాడు.కానీ అంతలోనే ఆ ఆలోచన విరమించుకున్నాడు.అనన్య కి ఆ శివుని గుహ,శివలింగం అంతా విచిత్రంగా భలే ఉంది.ఆమె మెట్లు దిగేటప్పుడు ఏమి భయపడలేదు.అర్జున్ కి ఏవేవో కబుర్లు చెబుతూ అలవోకగా దిగేసింది.'హమ్మయ్య!అనన్య భయపడలేదు' అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు అర్జున్.కాసేపయ్యాక అందరూ లోపలికి  వెళ్లినప్పటిలాగే  జాగ్రత్తగా గుహల బైటికి వచ్చారు.

ఇక అక్కడినించి వారిని అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరకి తీసుకెళ్ళాడు అర్జున్.అడవిలో ట్రెక్కింగ్ చేస్తూ...కొండలు గుట్టలు ఎక్కుతూ....ఎలాగో అలా ఆ జలపాతాల దగ్గరకి వెళ్ళారు.అనన్య ఆ జలపాతాల దగ్గర చాలా ఎంజాయ్ చేసింది.ఆమె ఆనందాన్ని చూస్తూ....కళ్ళతోనే తన ప్రేమని వ్యక్తపరుస్తూ...అర్జున్ ఆమె వెంటే తిరిగాడు.ఇవన్నీ తను అంతకుముందు చాలా సార్లు వచ్చిన ప్రదేశాలే! కానీ అనన్యతో కలిసి రావడం....తన ప్రియసఖి చెంత ఆ ప్రకృతి సౌందర్యాని ఆస్వాదించడం...ఒక కొత్త అనుభూతికి లోనయ్యాడు అర్జున్.విచ్చుకుంటున్న పూవుని చూసినా....పరుగులు తీసే సెలయేరుని చూసినా....వాటితో సమానంగా...అందంగా కనిపించే అనన్య ప్రకృతికి నిర్వచనంలా ఉంది.'ఏమిటో ఈ అమ్మాయి...ఇలా దగ్గరైపోయింది....అసలు ఒక్కరోజులో ఇదంతా సాధ్యమా? ఇంత ప్రేమ....ఇంత ఆనందం....ఇదంతా నేనేనా?' అంటూ ఎన్నో సార్లు ఆశ్చర్యపోయాడు అర్జున్. తేనెలూరించే అనన్య మాటలు....ముత్యాలు రాలే అనన్య దరహాసం....జలపాతం లా త్రుళ్ళిపడే  ఆమె హుషారు...అర్జున్ మనసుని కట్టిపడేశాయి.ఆమె చుట్టు అల్లుకున్న ఆహ్లాదపు మాయలో అతను కొట్టుకుపోయాడు....అనన్యని చూడకుండా ఒక్క క్షణమైనా నిలువలేని స్థితికి వచ్చాడు.ఇదంతా గమనిస్తూనే ఉన్నా...ఎక్కడా బైట పడకుండా..జాగ్రత్త పడుతోంది అనన్య.ఆమెకి అర్జున్ అంటే ఇష్టం ఏర్పడింది.కానీ తొలిచూపులో ప్రేమ మీద నమ్మకం లేదు.అర్జున్ గురించి పూర్తిగా తెలియందే....అడుగు ముందుకు వేయకూడదు అని నిర్ణయించుకుంది.కానీ అతను చెంత నిలిస్తే...పరిసరాలన్నీ మరచిపోతోంది....'ఏంటో ఈ మాయ!' అనుకుంది అనన్య.ఇక వీరిద్దరి సంగతి అప్పటికే కనిపెట్టేశారు అనన్య మిత్రబృందం.అర్జున్ ప్రవర్తన,నడవడిక వారికి నచ్చింది.అందుకే వారేమి అనన్య ని వారించలేదు.జరుగుతున్న ప్రేమ తంతుని నెమ్మదిగా గమనిస్తున్నారు.

అక్కడినించి బయలుదేరి స్టేషన్ కి వచ్చారు.అప్పటికే లాస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది.చేసేది లేక ఇక జీప్ మాట్లాడుకుని అరకు దారిపట్టారు.....మధ్యలో ఒకచోట ఆగి వేడి వేడి టీ తాగి,ఎర్రగా కాల్చి ఉప్పు,కారం,నిమ్మకాయ పట్టించిన మొక్కజొన్న పొత్తులు తిని ఆత్మారాముడ్ని శాంతింపజేసుకున్నారు.క్రమక్రమంగా అడవిలో చీకట్లు ప్రవేశిస్తున్నాయి.సూర్యుడు కొండల వెనుక దాక్కుంటున్నాడు.ఇక మెలికలు తిరిగే ఘాట్ రోడ్లో ప్రయాణం సాగించారు.అందరూ అలసిపోయి ఎక్కడికక్కడ పడుకుండిపోయారు.అనన్య కూడా వెనక్కి వాలి నిద్రపోతోంది.అర్జున్ మాత్రం రెప్పవేయకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు....'నిద్రపోతున్నప్పుడు కూడా ఎంత అందంగా ఉన్నావు బంగారం? ఇంత బుజ్జిగా ఎలా పుట్టావు రా? నాకోసమే పుట్టావు కదా! నాదగ్గరే ఉండిపోతావా? ఇలా ఎప్పటికీ నా దగ్గరే...' అని అప్రయత్నంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.'ఈ చేతి స్పర్శే కదా...నాలో ప్రేమని మేల్కొలిపింది!! ఈ చేయే కదా మన చెలిమికి వంతెన్ వేసింది' అని ఆమె చేతిని ముద్దడబోతు ఆగిపోయాడు.'ఉహు!లేదు...నా బంగారం అనుమతి లేకుండా...నేనీపని చేయలేను' అనుకుని ఆ చేతిని అలాగే పట్టుకున్నాడు.పొద్దున్నించి అలవాటైపోయిందో...లేక నచ్చేసిందో...అనన్య అర్జున్ని గట్టిగా పట్టుకుని పడుకుంది.అర్జున్ కి అనన్య ఇంకా నచ్చింది.అలాగే ఆమెని ప్రేమిస్తూ ఉండిపోయాడు అరకు వచ్చే వరకు.

రాత్రి ఏడుగంటలకి అరకు చేరారు.అనన్య వాళ్ళు 'పున్నమి' రిసార్ట్ లో రూమ్స్ బుక్ చేసుకున్నారు.కాబట్టి ముందు వారిని అక్కడ దింపి తరువాత ఇంటికి చేరుదాం అనుకున్నాడు అర్జున్.అనన్య వాళ్ళు అక్కడ దిగేసాక మళ్లీ పొద్దుటి పరిస్థితే.అనన్యకి  అర్జున్ తనని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు.అర్జున్కి అంతే.అనన్యని వదిలి వెళ్ళలేని పరిస్థితి.అప్పుడే అర్జున్ కి ఇంకో ఆలోచన వచ్చింది.కానీ అది ఎంతవరకు ఫలిస్తుందో తెలీదు.
"సరే మరి.రూమ్స్ అన్నీ ఓకే కదా!" అని వారిని అడిగాడు.
"యా!ఎవ్రిథింగ్ ఈజ్ ఫైన్.మీరు చాలా దూరం వెళ్ళాలా?"
"అబ్బే లేదండి! ఒక టెన్ మినిట్స్.మీరు డిన్నర్ ఎక్కడా చేస్తారు మరి?"
"ఇక్కడే ఏదో కానిచ్చేస్తాం లెండి."
"మీరేమి అనుకోనంటే...మా ఇంటికి రావొచ్చు కదా!అదే డిన్నర్ కి.మా అమ్మా చాలా బాగా వంట చేస్తారు.ఇక్కడ ఏదో ఫుడ్ ఉంటుంది కానీ మీకు అంతగా నచ్చదు.మీకు సూపర్ ఆంధ్రా భోజనం కావాలంటే మా ఇంటికి వచ్చేయండి చక్కగా...మీకేమి అసౌకర్యం ఉండదు.అదీ మీకు ఇష్టం అయితేనే...ఏమంటారు?"
"అంటే..ఇప్పటికిప్పుడు మీ అమ్మగారు...మా అందరికీ చేయడం అంటే...."
"అవన్నీ నాకోదిలేయండి...మా ఇంట్లో నేను మా అమ్మా తరువాత చీఫ్ చెఫ్ అన్నమాట.అదంతా నేను చూసుకుంట.మీరు నైన్ కి రెడీ అయి ఉండండి.నేను తీసుకెళ్త.ఒకే నా?"
అర్జున్...అనన్య అంగీకారం కోసం వేచి చూస్తున్నాడు.ఆమెకి అర్జున్ పాట్లు అర్ధమౌతున్నాయ్! కానీ అతనికి ఏమి చెప్పకుండా నవ్వుతూ నిల్చుంది.ఎవరు ఏమి మాట్లాడలేదు.మెల్లగా అనన్యే ఇక తలూపింది.అర్జున్ మనసులో...'హుర్రే!' అనుకున్నాడు.
"సరే మరి.మీరు షార్ప్ నైన్ కి రెడీ గా ఉండాలి.సియు..బై" అనేసి హుషారుగా ఈల వేసుకుంటూ బయలుదేరాడు అర్జున్.

అర్జున్ వెళ్ళాక అందరూ అనన్య ని ఆటపట్టించడం మొదలుపెట్టారు.
"హేయ్ అనూ!ఏంటి సంగతి? హా? అరకు లవ్ స్టోరి ఆ? కనీసం మాకు చెప్పను కూడా చెప్పలేదు"
"అబ్బా! అదేం లేదే..పదండి....అసలే టైం లేదు.ఇంకో రెండు గంటల్లో రెడీ అవ్వాలి"
"నువ్వివాళ ఏ విషయం తేల్చే వరకు మేము రెడీ అయ్యేది లేదు....చెప్పాల్సిందే..నీ లవ్ గురించి" అని పట్టుబట్టారు.
"హబ్బ! వదిలి పెట్టరు కదా!అతనంటే ప్రేమ అని చెప్పలేను కానీ కొంచెం ఇష్టం.పూర్తిగా తెలియకుండా నేను ప్రొసీడ్ అవ్వదలుచుకోలేదు.సో! ఇప్పటికీ లవ్వు లేదు...గివ్వు లేదు...చెప్పేసా కదా ఇక త్వరగా తెమలండి" అని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది అనన్య.
ఇక అర్జున్ ఇంటికి వెళ్లి హడావిడి పెట్టేసాడు.పది మంది గెస్ట్స్ అంటే వాళ్ళ అమ్మకి కాళ్ళు,చేతులు ఆడలేదు.'కొంచెం ముందు చెప్పొచ్చు కదా' అన్నారు...'నేను ఉన్నా కదమ్మా!!' అని అర్జున్ చక చకా వాళ్ళమ్మకి పనులన్నీ చేసిపెట్టడం ప్రారంభించాడు. అనన్య ఇంతవరకు టేస్ట్ చేయని ఫుడ్ తినిపించాలని అతని తాపత్రయం.మరీ ఎక్కువ కాకుండా.సింపుల్ గా ఉండేట్లు చూసుకున్నాడు.సరిగ్గా తొమ్మిదింటికి వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి బయలుదేరాడు.పక్కింటి అంకుల్ దగ్గర కార్ తీసుకుని ఝాం అంటూ పున్నమి రిసార్ట్స్ వైపు వెళ్ళాడు.అనన్య ని వదిలి రెండు గంటలు కూడా ఉండలేకపోయాడు..ఎప్పుడెప్పుడు తన దేవతని చూస్తాన అని ఆత్రుతతో రిసార్ట్స్ కి వచ్చాడు.కానీ అతనికి నిరాశే ఎదురయింది.అప్పటికి ఇంకా అనన్య రెడీ అవలేదుట.కనీసం కనపడలేదు కూడా.సరేలే అనుకుని ముందు రెడీ అయిన ఒక ఐదుగురిని తీసుకొచ్చాడు ఇంటికి.వారిని ఇంట్లో అందరికీ పరిచయం చేసి...వారికి కూల్ డ్రింక్స్ ఆఫర్ చేసి...మిగితా వారిని తీసుకురావడానికి మళ్లీ వెళ్ళాడు.లాంజ్ లో తన కోసం వెయిట్ చేస్తూ కనిపించారు మిగితావారు.అప్పుడు చూసాడు అనన్యని.అర్జున్ తన కళ్ళను తానె నమ్మలేకపోయాడు.ఒక్క క్షణం అతనికి కాలం ఆగిపోయినట్టు అనిపించింది.....

- కొరవ...తదుపరి టపా లో...

19 కామెంట్‌లు:

రాధిక(నాని ) చెప్పారు...

చాలా బాగుంది . సీనియర్ రచయిత్రి లా రాసేస్తున్నారు.మీరింక విక్లికి రాసేయోచ్చేమో .ఈ కథని స్వాతికి పంపేయండి అర్జెంటుగా :)) ...

తృష్ణ చెప్పారు...

నరేషన్ చాలా బాగుందండి...nice.

Ennela చెప్పారు...

yee suspence yentandee baboo....professional ga...sarigga inka yemavuthundo aney timeki...sasesham boards... naaku rights ichcheyya koodadu.... kathala poteeki pampukuntanu.. please...
raadhika garu heppinattu....senior rachayitrila....ammo nenu commentanu...yendukante meeru nijjam ga senior rachayitrenemo..alagey undi sarali.....poortiga telusukuni...commentutey better..
neneppudu araku vellaledu kaani yee saari velitey maatram anni place lu gurtu pattestaanu easiga....ikkada ananya ninchudi... ikkada arjun metlekkaadu ani...yento maa seetayya tho velitey.. idigo sivudu choosaavuga pada..antaru... ponee mee ananya yemaina company istundemo adagakoodada....heroine peru superb..
migilina katha yeppudandee...abhimaanulu waiting..

అజ్ఞాత చెప్పారు...

మళ్ళీ ఒక యద్దనపూడి నవల చదివినట్టనిపించింది. ఇదంతా నిజమా! మీ బ్లాగుని చాలా నెలలక్రితం చదివిన గుర్తు. మళ్లీ కనపడలేదనుకుంటాను.
నిజంగా వెన్నెల సంతకం అనే అద్భుతమైన మాటలా అనుభూతితో రాస్తున్నారు. క్యారీ ఆన్.

అశోక్ పాపాయి చెప్పారు...

it's really beautiful story..nice writing , nice collection of pics. please end this story as soon as possible:)

Ennela చెప్పారు...

మల్లొక్క పారి తెలుగులో

యీ సస్పెన్స్ యేంటండీ బాబూ....ప్రొఫెషనల్ గా...సరిగ్గా ఇంక యేమవుతుందొ అనే టైముకి...సశెషం బోర్డులు... నాకు రయిట్స్ ఇచ్చెయ్య కూడదు.... కథల పోటీకి పంపుకుంటాను.. ప్లీస్...
రాధిక గారు చెప్పినట్టు....సీనియర్ రచయిత్రిలా....అమ్మో నేను కామెంటను...యెందుకంటె మీరు నిజ్జం గా సీనియర్ రచయిత్రేనేమొ..అలాగే ఉంది సరళి.....పూర్తిగా తెలుసుకుని...కామెంటుతే బెటర్. నెనెప్పుడూ అరకు వెళ్ళలేదు కానీ యీ సారి వెళితే మాత్రం అన్ని ప్లేస్ లు గుర్తు పట్టేస్తాను ఈసీగా....ఇక్కడ అనన్య నించుంది... ఇక్కడ అర్జున్ మెట్లెక్కాడు అని...యేంటొ మా సీతయ్య తొ వెలితే.. ఇదిగొ శివుడు చూసావుగ పద..అంటారు... పొనీ మీ అనన్య యేమయినా కంపెనీ ఇస్తుందేమో అడగకూడదా....హీరొఇన్ పేరు సుపర్బ్..
మిగిలిన కథ యెప్పుడండీ...అభిమానులు వెయిటింగ్..

సవ్వడి చెప్పారు...

inkenni bhagaalandi babu!

mottam okesaari petteyandi...

3g చెప్పారు...

సూపర్ గా ఉంది. రాధికగారు చెప్పినట్టు మీ నేరేషన్ అదుర్స్. నేను అరకులో గడిపిన ఒక్కోనిమిషం రీళ్ళు రీళ్ళుగా గుర్తొచ్చేస్తున్నాయ్ చదువుతుంటే.

శివరంజని చెప్పారు...

ఇందు గారు నాకు కూడా నేర్పండి బాబూ ఇలా మంచి కధ లు రాయడం....నేర్పుతానంటే రేపే జాయిన్ అయిపోతా మీ శిష్యురాలిగా

Rams చెప్పారు...

Indu Garu Superb andii

Manchi Exciting Present chestunnaru

I am Waiting for continuation..
Meelo Manchi writer unnaru( Mee gurichi naku purthi ga Teliyadu, tappulu rasthe Kshaminchandi)

Mee Kadanu idela Oka cinema thesthe...Manchi Clean Entertainer avutundai...

Rams>>>

భాను చెప్పారు...

ఒక్క క్షణం కాలం ఆగిపోయినట్టేంటి...మీ సస్పెన్స్ కి మా గుండెలు ఆగిపోఎట్టుంటేను:))...బాగుంది ఇందు గారూ...వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పోస్ట్

ఇందు చెప్పారు...

@ రాధిక(నాని ):థాంక్యూ..థంక్యూ..రాధికగారు! స్వాతికి వద్దులేండీ...అసలే ఆ పత్రిక కష్టాల్లో ఉంది ఇప్పుడూ....నా కథ కూడా పంపి భయపెట్టడమెందుకు??

@తృష్ణ :థాంక్యూ తృష్ణగారు!

@Ennela:ముందు ఓపిగ్గా ఇంత కామెంటు వ్రాసినందుకు ధన్యవాదాలు ఎన్నెల గారు! నామొహం నేను సీనియర్ రచయిత్రినేంటండీ! మా ఇంట్లో ఎవరికన్న చెబితే నవ్వుతారు.....కొంచెం పెద్దదైందండీ కథ...అందుకే ఇన్ని ముక్కలు చేయాల్సి వచ్చిందీ...హ్మ్ మీకు అరకు చూడాలంటే నాతో వచ్చేయండీ...నేను తీసుకెళతా కదా! మీకు నా కథ నచ్చినందుకు ధన్యవాదాలు ఎన్నెలగారూ!

ఇందు చెప్పారు...

@ tolakari.29:అబ్బా..!! అబ్బా! కడుపు నిండిపోయిందండీ బాబూ! ఏకంగా యద్దనపూడితో పోల్చారు! హ్మ్! నాకంత లేదండీ! ఏదో ఇలా బ్లాగుల్లో వ్రాసుకోవడమే! థాంక్యు నా బ్లాగు మీకు నచ్చిందుకు!

@ అశోక్ పాపాయి :హ్హహ్హహ్హా! నేను సింపుల్గానే వ్రాదామనుకున్నానండీ..అదేంటో మరి..బాగా పెద్దగా వచ్చేసింది..కుదిదామంటే మనసు రాలేదు.అందుకే మూడు భాగాలు చేసా!

@సవ్వడి:తిట్టుకోకండీ...ఇంకొక్క భాగమె ఉంది...ఈసారికి ఏదొ అలా సర్దుకుపోండీ.....ఇంకోసారి...ఇలా భాగాలుగా చేసి విసిగించనులే!

ఇందు చెప్పారు...

@ 3g:థాంక్యూ 3జి గారు! థాంక్యూ సోమచ్! :)

@శివరంజని :మీదగ్గర నేనే నేర్చుకోవాలండీ...కామెడీగా ఎలా వ్రాయాలి అనేదీ..మీకు నేనే చెబుతాను చెప్పండీ?

@ Rams:రాంస్ గారు...థంక్యు అండీ..ఇందులో అనుకోవడానికి ఏముందీ! నాకు కథలు వ్రాయడం ఇష్టం...బాగా వ్రాస్తున్నా అని మీరందరూ అంటుంటే..చాల ఆనందంగా ఉంది :) థాంక్యూ...సినిమా స్టోరీయా? అంత సీన్ ఉందంటారా?:))

@భాను :హ్హహ్హహ్హ! తొందరగా పెట్తేస్తాలేండీ...బాధపడకండీ...

Ennela చెప్పారు...

Indu gaaru, coment choosi moodava bhaagam kosam parigettukuntoo vachchesaa...oooh.. great disappointment...
kaanee mee suspense bharinchaleka, ...abbo sagam wraasi vadileste waiting inta kastama? ani pinchinaa katha maatram poorti chesesaanu. mari meeku thanksulu.
mari meeru naaku boldanni prmiselu chesestunnaaru...mee intiki vachcheyyamanee, araku teesukelataanani...neneppudo pette beda sardukuni vachchesina vachestaanu....paapam maa seetayya....

kiran చెప్పారు...

ఇందు - సూపర్ స్టొరీ...
ఇంకోదానికోసం వెయిటింగ్...
మనం ఇద్దరం ఒక understanding కి వద్దామా...?
నా mail id ఇస్తా...కథ మొత్తం అక్కడికి పంపించండి....:D ,,ప్లీజ్..
చాలా బాగా చెప్తున్నారు....ఆ స్టైల్ బాగుంది..

Unknown చెప్పారు...

ఫీల్ చాల బాగా మైంటైన్ చేసారు హ్మ్ ఎం చెప్పను

ఇందు చెప్పారు...

@ Ennela: అవునండీ అదే సస్పెన్స్లో ఉండే మజా! ఒట్టేసి ఒకమాట..ఒట్టేయకుండా ఒకమాటా చెప్పను ఎన్నెలగారూ!:P

@ kiran: Thankyou So much Kiran. :)

@ kavya:Thankyou Kavya :)

మంచు చెప్పారు...

హమ్మయ్య ఇందూగారు....చదివేసా.... మొదటి రెండు బాగాలు అప్పుడే చదివేసా కానీ...... ఫీల్ పొతుందేమో అని మొదటి పార్ట్ నుండి మళ్ళీ చదువుకొచ్చా.... సొ ఫ్రెష్ ...
" నిద్రపోతున్నప్పుడు కూడా ఎంత అందంగా ఉన్నావు బంగారం? ఇంత బుజ్జిగా ఎలా పుట్టావు రా? " :-)))
అసలే మీ కథల్లొ ముగింపు నాకు భయం....కొంచెం గుచ్చుకుంటుంది అని .... ఈ ముగింపు మాత్రం బాగుంది