పాత సంవత్సరానికి....బై..బై..
కొత్త సంవత్సరానికి...హాయ్..హాయ్...
కొత్త సంవత్సరపు వేడుకలంటే భలే భలే సరదా కదా....గ్రీటింగ్ కార్డ్స్...కేక్స్...కొత్త డైరి...ఇంటిముందు 'వెల్కం న్యు ఇయర్' అని ముగ్గులు....అబ్బో సందడే సందడి.మొత్తం 365 రోజులు...ఇట్టే గడిచిపోయాయంటే నమ్మబుద్ది అవదు. కానీ ఈ365 రోజుల్లో ఎన్ని రోజులు గుర్తుంచుకోతగ్గవి? ఎన్ని జ్ఞాపకాలు దాచుకోతగ్గవి? అవన్నీ మనం ఎంతకాలం గుర్తుపెట్టుకోగలం? అందుకే నేను ఒక ఇయర్ స్క్రాప్ బుక్ పెట్టుకున్నా పింక్ కవర్ పేజి తో ఉండే తెల్లని కాగితాల అందమైన ఈ పుస్తకం లో ప్రతి సంవత్సరం డిసెంబరు31 న....ఆ సంవత్సరం లో జరిగిన ముఖ్యఘట్టాలు...కొన్ని మధుర స్మృతులు...చేదువైనా మరిచిపోలేని జ్ఞాపకాలు....అలా అన్నిటిని అక్షరబద్ధం చేస్తా.క్రితం సంవత్సరం ఆ బుక్ లో వ్రాసిన సంగతులు చదివి వాటిని గుర్తు చేసుకుంటా.అలా చేయడం వల్ల మన జ్ఞాపకాలు పదిలంగా దాచుకున్న ఫీలింగ్ తో పాటు....మనం చేసిన తప్పొప్పులు....ఆలోచనావిధానంలో మార్పులు తెలుస్తాయి అని నా నమ్మకం.
న్యు ఇయర్ అంటే గుర్తొచ్చేది గ్రీటింగ్ కార్డ్స్ కూడా.ఇప్పుడు ఈ-కార్డ్స్ వస్తున్నాయి కాని ఇదివరకు గిఫ్ట్ షాపుల్లో...మామూలు పచారి కొట్లలో కూడా ఎన్నెన్ని గ్రీటింగ్ కార్డ్‌లు అమ్మేవారో! నాకు గ్రీటింగ్ కార్డ్స్ అంటే చాలా ఇష్టం అందుకే మంచి మంచి గ్రీటింగ్ కార్డ్స్ ఖరీదు ఎక్కువైనా కొని...చక్కగా దాచిపెట్టేసుకుంటా.అదేంటో మరి! ఎవ్వరికి ఇవ్వబుద్ది కాదు కాని...నా ఫ్రెండ్స్ కి,టీచర్లకి నేనే గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి ఇచ్చేదాన్ని.గడ్డిపూలు,గులాబి,తామర పూరేకులు,ముక్కుపుడక చెట్టు కొమ్మలు,...ఇలాంటివి ముందుగానే పుస్తకాల్లో దాచి....ప్రెస్ చేసి...వాటిని తెల్లని కాగితం మీద అందంగా అతికించి...రంగు రంగుల జెల్ పెన్స్ తో స్టెన్సిల్ ఉపయోగించి న్యు ఇయర్ కొటేషన్స్ వ్రాసి అందరికీ ఇచ్చేదాన్ని.అలాగే...పేపర్లు...వీక్లీలు...నోట్ బుక్స్ అట్టల మీద ఉండే సీనరిలు,పూలు,చెట్లు....అన్నీ కట్ చేసి చక్కని గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసేదాన్ని.కొద్దిరోజులయ్యాక ఆయిల్ పెయింట్స్ తో గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం మొదలుపెట్టా. ఒక రెండు మూడు కలర్స్ విడివిడిగా బ్రష్ తో తీసుకుని ఒక టబ్ నీటిలో వాటిని చిలకరించి....ఆ రంగులు టబ్ అంతా పరుచుకోగానే....బ్రష్ వెనకవైపుతో ఆ రంగునీటిని ఒకసారి తిప్పి... ఒక దళసరి కాగితాన్ని అలా నీటిమీద ఆ రంగులు అంటేలాగా ముంచి తీసేదాన్ని.ఎంతో అందంగా ఉండే పెయింట్ పాటర్న్స్ దానిమీద పడేవి.దాన్నికాసేపు ఎండలో ఆరబెట్టి....అందమైన మెసేజ్ ఒకటి రాస్తే గ్రీటింగ్ కార్డ్ తయార్.ఇలా చేసిన గ్రీటింగ్ కార్డ్ ఒకసారి మా స్కూల్లో మేడం కి ఇస్తే...ఆమె చాలా మెచ్చుకుంది అలాగే..గవ్వలతో,పూసలతో కూడా గ్రీటింగ్ కార్డ్స్ చేసేదాన్ని. అలా నా సొంతంగా తయారు చేసిన కార్డ్ వాళ్ళకి ఇస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో!
ఇక 31 రాత్రి చేసే హడావిడి అంతా ఇంతా కాదు.ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేయాలి కదా.మనమా ముగ్గులో వీక్.కాని అందరూ వేస్తున్నారు నేను వెయ్యాలి అని ఆత్రుత.మా అమ్మేమో 'నీకెందుకే అసలే ముగ్గులు రావు...పైగా ఈ రంగులు కూడా! అవసరమా? నేను వేస్తా కదా!' అనేది.అయినా వినకుండా ఎదురింటి ఆంటి వాళ్ళ హెల్ప్ తీసుకుని.....పెద్ద పెద్ద ముగ్గులు వేసి మా అమ్మకి గర్వంగా చూపించేదాన్ని.ఆ రోజున ఎవరు వీధిలో అందమైన ముగ్గులు వేసారో అని అన్నీ ఒక రౌండ్ తిరిగి చూసొచ్చి...'మన ముగ్గే బాగుంది' అనుకుని దాన్ని చూసి మురిసిపోయేదాన్ని. నాన్నగారు ఆఫీస్ నించి వస్తూ వస్తూ స్వీట్లు పట్టుకొచ్చేవారు.ఇక అర్ధరాత్రి కోసం ఎదురు చూపులు.అందుకోసం టీ.విలో ఏదో ఒక ప్రోగ్రాం చూడటం...సరిగ్గా పన్నెండు గంటలకి నేను,తమ్ముడు కలిసి పెద్దగా 'హ్యాపీ న్యు ఇయర్' అని వీధి అంతా వినబడేలా అరవడం....స్వీట్లు తినడం....ఇక బంధువులు,ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు...మెస్సేజీలు...అలా గోల గోల చేసి ఎప్పుడో తెల్లవారుజామున పడుకునేదాన్ని.మళ్లీ పొద్దున్నే లేచి కొత్త డ్రస్ వేసుకుని అందరికీ చూపించాలి కదా
ఇక డైరి విషయానికి వస్తే...అదేంటోనండీ ఈ డైరి విషయంలో నాకెప్పుడు చుక్కెదురే.నాకు కావాల్సిన డైరి ఇంతవరకు దొరకలేదు.ప్రతి సంవత్సరం డిసెంబరులో నా కొత్త డైరి వేట మొదలవుతుంది.ఎంత వెదికినా నేను కావాలనుకున్నది దొరకదు.పోనీ మనమే తయారుచేసుకుందాం అంటే..అయ్యే పని కాదు.నాకు మాములు డైరీలు నచ్చవు.చక్కని బాతిక్ ప్రింట్ మీద అందమైన పూసలతో ఎంబ్రాయిడరి చేసిన క్లాత్ ని కవర్ పేజికి అతికించి తయారుచేసిన డిజైనర్ డైరి కావాలి.అది ఎక్కడా దొరకదే? ఒకసారి బెంగళూరు ఫోరంలో చూసా! ధర అక్షరాలా ఐదు వందలు. బాబోయ్ అని వాడికి దణ్ణం పెట్టి వచ్చేసా! ఎప్పటికీ దొరికేనో నా కలల డైరి!! అప్పటిదాకా ఎలాగో అలా సరిపెట్టుకోవడమే...
ఇంకా..కొత్తసంవత్సరం సంగతులంటే...నాకు ఈ రోజున అందరిలాగా....కొత్త నిర్ణయాలు తీసుకోవడం....ఆచరణలోకి పెట్టడం లాంటివి నచ్చవు.మనం ఏదైనా చేయాలనుకుంటే....అ క్షణమే చేయాలి.దానికి వారాలు..వర్జాలు చూడక్కర్లేదు కదా! అని నా పాలసీ.అందరూ సంతోషంగా ఉండాలి...అని మాత్రం కోరుకుంటాను.ఎప్పటిలాగే జీవితంలో ఒక సంవత్సరం అయిపొయింది. మన ఆయువులో సంవత్సరం తరిగిపోయింది.జీవితం చాలా చిన్నది.ఇప్పటిదాకా జరిగిందేదో జరిగింది.ఇక మిగిలిన జీవితాన్ని ఆస్వాదించాలి...అందులో ఆనందాన్ని అనుభవించాలి......ఇదే ప్రతి సంవత్సరం నేను కోరుకునే కొత్త సంవత్సరపు కోరిక
ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయా...అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండీ
మంచు పూల వాన
-
"ఈ మంచుల్లో.... ప్రేమంచుల్లో.... ఎన్నెన్నో సంగతులు...."
అని పాడుకోవాలనిపిస్తుంది ఈ మంచు చూస్తుంటే! ఈసారి డిసెంబరులో అప్పుడప్పుడు
స్నో పడుతుంటే.... క్రిస్మ...
11 సంవత్సరాల క్రితం
17 కామెంట్లు:
గత స్మృతులు మర్చిపోలేమండి.మీకు వెన్నెల సంతకం బ్లాగ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు
చాలా చక్కని తియ్యటి అలవాట్లు మీవి. బ్రెడ్ అయిటెంస్ మాత్రం మానేయకండేం. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నూతన సంవత్సరం లో మీరు ,మీ కుటుంబం ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ....మల్లిశ్రీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు :) :)
నూతన సంవత్సర శుభాకాంక్షలు...
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
బాగా రాశారు ఇందు గారు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2011 నూతన సంవత్సర శుభాకాంక్షలు
Happy New Year...మీ బ్లాగ్ గురించి ఈ టపాలో రాసానండి. వీలున్నప్పుడు చూడండి. http://trishnaventa.blogspot.com/2010/12/2-discovered-blogs.html
గ్రీటింగ్స్ గురించి నేను రాసిన టపా లింక్ ఇది.http://trishnaventa.blogspot.com/2009/10/blog-post_26.html వీలున్నప్పుడు చదవండి.
నూతన సంవత్సర శుభాకాంక్షలు
happy new year indu.. :)
ఇందు బాగున్నాయి మీ నూతన సంవత్సర ముచ్చట్లు.మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఇందు,
నేను కూడా అందరికీ గ్రీటింగ్స్ కష్టపడి కొని ఇచ్చేవాడిని. డైయరీ కోసం చాలా ఆశగా వెదికే వాడిని.. ఎవరన్నా ఉచితంగా ఇస్తారేమో అని.
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు
happy new year
శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదలు :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి