7, ఫిబ్రవరి 2011, సోమవారం

కర కర కాకర

కాకరకాయ....ఎంత చేదుగా ఉంటుందో అంత బాగుంటుంది తినడానికి.సాధారణంగా నాకు చేదుగా ఉండేవి ఏవి నచ్చవు.అందుకే టాబ్లెట్లు వేసుకోగానే కక్కేస్తాphbbbbt...అలాంటిది చిరు చేదుగా ఉండే కాకరకాయకూర  మాత్రం లొట్టలేసుకుంటూ తింటాbig grin.కాకరకాయతో ఏం చేసినా బాగుంటాయ్ కదా! కాకరకాయ కూర, పులుసు, పచ్చడి,చిప్స్....అబ్బో! ఎన్నెన్నో చేసుకు తినొచ్చు ఈ చేదు కాయతో.

రుచి సంగతి పక్కనబెడితే ఆ రూపం చూస్తే నాకు చిన్నపుడు తొండలు,కప్పలు లాంటి సరీసృపాలు గుర్తొచ్చేవిsad.కానీ మెల్లగా అలవాటుపడిపోయా.మా ఇంటి ముందు చిన్న పెరడు ఉండేది.అక్కడ ఫెన్సింగ్ మీద కాకర తీగ పాకించేది అమ్మ.దానికి కాసే బుజ్జి బుజ్జి కాకరకాయల వేపుడు కూర ఎంత బాగుంటుందో!batting eyelashesనాకులాగే మా తమ్ముడికి కాకరకాయ కూరంటే ఇష్టం.ఐతే వాడికి బంగాళదుంప వేపుడంటే కొంచెం ఎక్కువ ఇష్టమనుకోండి.....కానీ మా అమ్మ చేసే కాకరకాయ పిట్ట కూర మాత్రం అమోఘం.ఆ రుచి మళ్లీ నేను ఎక్కడా చూడలేదు.ఎంతమంది చేసిన కాకరకాయ కూర తిన్నా...అమ్మ చేసే పిట్టకూర ముందు బలాదూర్.పిట్టకూర అంటే...ఏ పావురాన్నో,పిచుకనో పీక పిసికి చంపేసి కాకరకాయ వేసి కూర చేసారనుకునేరుshame on you.నేను పక్కా సాత్వికాహారిని....ఏదో సాధుజీవిని.happy'పిట్ట' అంటే మనం వాడుకలో అనుకుంటాం కదా....'పిట్టంత ఉన్నాడు'...అది ఇది అని.అలా చిన్నది అనే అర్ధం అన్నమాట.చాలా సన్నగా ముక్కలు తరిగి నూనెలో వేయించి....అలాగే సన్నగా ఉలిపాయాలు తరిగి అవి విడిగా వేయించి....ఆఖరికి రెండు కలిపి ఉప్పు-కారం....కాసింత పంచదార జల్లి దించేసే ఈ పిట్టకూర తింటే నిజ్జంగా జన్మ ధన్యం big hug

ఇక నా ఫ్రెండ్ ఝాన్సీ వాళ్ళ అమ్మగారు నిలవుండే పొడి-కాకరకాయ కూర చేస్తారు.శనగపప్పుల  పొడిలో...బాగా వేయించిన కాకరకాయ ముక్కలు వేసి చేసే ఈ కూర కనీసం పది-పదిహేను రోజులు ఉంటుంది.అమీర్పేట్ హాస్టల్ లో ఉన్నపుడు నెలకి ఒకసారి ఒక డబ్బాడు కూర చేయించుకుని పట్టుకోచ్చేది ఝాన్సి.అది మూడే మూడు రోజుల్లో ఊదిపారేసేవాళ్ళం మేము rolling on the floor. ఇక కాకరకాయ-బెల్లం కూర కూడా కేక.అదీ నేను చేసినది ఐతే బాగా ఇష్టం batting eyelashes కారంగా-తియ్యగా జ్యుసీ గా ఉండే ఈ బెల్లం కూరని  వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే స్వర్గం అలా వచ్చి కళ్ళముందు వాలినట్టు ఉంటుంది.

కాకరకాయ కారం కూడా భలే ఉంటుందన్డోయ్.ఉల్లిపాయలు నూరి...కాకరకాయ బాగా వేయించి రెండు కలిపి చేసే ఈ కూర కూడా ఒక నాలుగైదు రోజులు నిలవుంటుంది.భలే భలే టేస్టీ గా ఉంటుంది.ఈ కూర చేసినప్పుడు.....నేను ఒక మూడురోజులు ఇంకే కూర చేసినా తినేదాన్ని కాదు.పొద్దున,సాయంత్రం ఇదే వేసుకుని కమ్మగా,హాయిగా తినేసేదాన్నిhappy

ఇక చివరాఖరికి నేను పచ్చి కాకరకాయ కూడా తినడం నేర్చుకున్నా!worried నేను ఎనిమిదో క్లాస్లో ఉన్నపుడు ఎస్.ఎస్.వై లో (యోగ,మెడిటేషన్ నేర్పిస్తారు)చేరాను.అక్కడ పచ్చి కూరగాయ ముక్కలు తినడం నేర్చుకున్నా.పచ్చి కాకరకాయ ముక్కలు చక్రాలు గా కోసిపెట్టేవారు.దానిమీద కాస్త ఉప్పు...ఇంకొంచెం నిమ్మరసం పిండుకుని కళ్ళు మూసుకుని నోట్లో పెట్టేసుకోవడమే.మొదట్లో....ఏడుపోచ్చేది.ఆ తరువాత తినే ఫ్రూట్ సలాడ్ రుచే తెలిసేది కాదు.కానీ రాను రాను అలవాటైపోయింది(తినగ తినగ కాకరకాయ తియ్యన కదా!).ఫ్రూట్ సలాడ్ మీద కాన్సంట్రేషన్ తో ఈ కాకరకాయముక్కలు పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు tongue

ఏంటో కాకరకాయ తలుచుకోగానే నోరూరేస్తోంది.సరే కానీ కాకరకాయ మీద ఒక చిన్న పద్యం ట్రై చేద్దామా!(ఏమన్నా తప్పులున్నా...పద్యం బాగోకపోయినా తిట్టుకోకండి....నేనసలే పద్యాల్లో చాలా వీక్big grin)

కర కర కాకర కిర కిర కీకర 
కీకర బాకర కాకర కర కర 
కర కాకర..కూర  కర కరా...
కరకర కాకర కీకర కిరకిరా...

హ్హహ్హహ్హ....rolling on the floorఇంకా నా బ్లాగ్ చదువుతున్నార? పారిపోకుండా? మీరు చాలా సహనవంతులు సుమండీ.....day dreaming

34 కామెంట్‌లు:

Ennela చెప్పారు...

అజ్జిబాబో ఇందూగారూ, మీరు కవి అయిపోతున్నరండీ బాబో,...ఆయ్ నిజవేనండీ...మీ కవిత మీదొట్టు.కర కర కాకర కవిత అదుర్స్
తినగ తినగ పచ్చి కాకర తియ్యనుండా.....నేను ట్రై చేస్తానుండండి....బాలేకపోతే బాగుండదు మరి! మీరే బాధ్యులు.
మరి అలా లొట్టలేసుకుంటూ మీరు తినెయ్యడమేనా..మాక్కూడ కొంచెం పెట్టేదుందా..
మరి ఇన్ని రకాలు వ్రాసేసారా...మాకేమో ఈ దిక్కుమాలిన ఊర్లో కాకర కాయలు కాదు గదా..పచ్చి మిరగాయలు కూడా దొరకవు...నిన్ననే పాస్పోర్టు వచ్చింది..కుంచిం మీ అడ్రెస్ చెబుదురూ!
టెంపరొరీ గా ఇంట్లో ఏవో గుజరతీ వాళ్ళ కాకర అనీ అప్పడాల్లాంటివి ఉన్నాయి , వాటితో సరి పెట్టుకుంటా(రాజేంద్ర ప్రసాద్ టైపులో ఇవి తింటూ వాటిని ఊహించుకుంటాగా)

ఇందు చెప్పారు...

ఏవిటో ఎన్నెలగారు...మీరు మరీ మునగ చెట్టు ఎక్కించేస్తున్నారు నన్ను ...దిగబుధ్ధి అవ్వట్లేదు ;) మరే! మీరు మీకు,మాకు అడ్డుగా ఉన్న లేక్ ని ఈదేసుకుంటూ వచ్చేయండీ మీకు బోలెడు కూరలు చేసి పెడతా :) ఓహో..ఆహన పెళ్లంట టైప్లో అన్నమాట ;) ఇక్కడ ఫ్రొజెన్ కాకర దొరుకుతాయి..చక్కగా మన ఇండియాలో లాగా....పచ్చి కాయలు కూడా దొరుకుతాయి. :)

లత చెప్పారు...

కాకరకాయ మీద భలే పొస్ట్ రాశారండీ
మిగతావి తినను కానీ కాకరకయ కారం మాత్రం చాల ఇష్టం నాకు.
మా ఇంట్లో మాత్రం కాకర నిషిద్ధం.ఎప్పుడన్న నా ఒక్క దాని కోసం చేసుకోవాలి అంతే
మీ కవిత సూపర్

ఇందు చెప్పారు...

అవునా? కాకర నిషిధ్ధమా? :( అయ్యో పాపం! మంచి టేస్ట్ ని మిస్ అవుతున్నారుగా! నా పద్యం నచ్చినందుకు థాంక్స్..థాంక్స్..

సుమలత చెప్పారు...

ఆహా ఎమి రుచి అండి కాకరది మా వారికి ప్రాణం మా
అత్త గారు బాగా చేస్తారు కాకర పొడి వూరు వెళ్లి నప్పుడల్లా ముందు కాకర తీసుకొని రావాలి అంత ఇష్టం.
మీరు చెప్తుంటే బుజ్జి కాకరలు కొంచెం మాకు కుడా

SHANKAR.S చెప్పారు...

ఎవరికయినా అమ్మ చేత్తో చేసిన కాకరకాయ కూర ఎప్పటికీ చేదనిపించదేమో. మీ కాకర ప్రియత్వానికి మెచ్చి ఇదిగో నా స్టైల్లో ఒక పేరడీ.

"ఇందు" గలదందు లేదని
సందేహము వలదు కాకర రుచి
విందేకదా ఏ విధంబు చేసిన
అందరికీ పసందుగా నోరూరింపన్

గ్రామర్ దోషాలు వెతక్కండి...పేరడీకి పట్టింపులేంటి :)

హరే కృష్ణ చెప్పారు...

ఎవరిక్కడ పద్యం రాసి మరీ కాకర ని అవమానించింది! i hurted..కరేలా అంటే సూపర్ అంతే సరిగ్గా fry వండటం రావాలి కాని
మా శాఖాహారులకు ఇదే బావర్చి తో సామానం

..nagarjuna.. చెప్పారు...

ఎంతో సహనంతో, కాకర (పచ్చి కాకరను మినహాయించి) మీద మక్కువతో మీ పోస్టును మొత్తం సదివేస్నందుకు, ఏటి ఇందుగారు, మొత్తం సదివేస్నందుకు నాకు యమ అర్జంటుగా కాకరకాయ పులుసు, కాకరకాయ వేపుడు, కాకరకాయ పొడి పార్శిల్ చేయండి చెప్తాను. మీ పేరు చెప్పుకొని కొన్ని రోజులైనా ఆలు బెడద తప్పించుకుంటాము.

Sai Praveen చెప్పారు...

బాగా రాసారు. పద్యం అదుర్స్ :)

Sai Praveen చెప్పారు...

మీ "నా గురించి చెప్పాలంటే" చాలా చాలా బావుంది.

ఇందు చెప్పారు...

@ సుమలత:అవును కదా! కాకర రుచే వేరు! మీకు బుజ్జి కాకరకాయలు కావాలా? ఆ చెట్టు ఇప్పుడు లేదండీ...పీకేసారు :(

@ SHANKAR.S:శంకర్ గారూ..మీరు పేరడీ కింగ్ అండీ...నిన్న రక్షకుడు పాట...ఇవాళ కాకర తోట [ప్రాస కోసం వాడా]....ఏం చెప్పారండీ! ఎవరక్కడ?శంకర గారికి చప్పట్లు...ఈలలు.. :))

@ హరే కృష్ణ:కెవ్వ్వ్! కెవ్వ్వ్! హరే గారూ....నేను శాఖాహారినేనండీ! నాకు కాకర అంటే ఇష్టమే! పద్యం రాసి కాకరని అవమానించాను అన్నారంటే...అ పద్యం మీకు నచ్చలెదు కదా! :(

ఇందు చెప్పారు...

@ ..nagarjuna..:అలగలగే! ఒక కాకరపులుస్+వేపుడు+పొడి కూరా పార్సెల్!!!!!!!! :))


@ Sai Praveen: థాంక్యు...థాంక్యూ...పద్యం నచ్చినందుకు....నా 'నా గురించీ' నచ్చినందుకు :)

Unknown చెప్పారు...

ఇందు ముందుగా నీ పద్యానికి హాట్సాఫ్ .. సూపర్ రాసావ్ పో .. నా దగ్గర శిష్యరికం చేసినందుకు నీకు బాగానే తెలుగు వచ్చేసింది అయితే ..
అయాం ప్రవుడ్ ఆఫ్ యు మై గాళ్ .. :)
ఇంకా కాకరకాయ విషయానిక్ వస్తే .. బాబోయ్ చేదు .. నాకు చిన్నప్పుడు పెద్ద నచ్చేది కాదు ..
కానీ మా అమ్మ అన్నయ్య బాగా తినే వారు .. మా అమ్మ కాకరకాయలు మద్యలోకి చీరి వాటికీ నునిలో వేయించి .. కారం పెట్టి వండేది ... నేను కాకరకాయ తీసేసి కారం తినేదాన్ని ..
కాని వాన్ ఫైన్ మార్నింగ్ వీళ్ళకి అంతలాగా ఎం నచ్చిందో చూడడం అని .. అన్నిన్ట్లోకేల్ల బుజ్జి కాకరకాయ ఏరి మొహం ఒక లాగ పెట్టి .. తిని చుస .. పర్లేదు .. మరీ బాడ్ కాదు అనిపించింది :)
తర్వాత .. ఇంకా అదే అదనుగా చూసుకుని మా అమ్మ కాకరకాయ మీద ఉన్నవి లేనివి అన్ని మంచి మాటలు చెప్పెదప్పటికి .. నమ్మేసి .. ఇష్టం పెచేసుకున్న ..
ఇప్పుడు నేను కూడా వండడం నేర్చేసుకున్న .. :) నా నెక్స్ట్ పోస్టు కాకరకాయ కారం పెట్టి కూర కాస్కో :p

చందు చెప్పారు...

నాకు కాకర అంటే అస్సలు పడదు. అందులోనూ తీపి తగిలితే మరీ కష్టం. ఈ మధ్యనే కాకరకాయ చిప్స్ తిని, పోనీలే కాకరతో చేసే ఒక్క ఐటమ్ మనకు నచ్చింది అనుకున్నాను. కానీ మీ కాకర కబుర్లు బావున్నయ్ కాకర చిప్స్ లా.

సుజాత వేల్పూరి చెప్పారు...

అయితే మీరంతా "గాగళగా గూళ" ఫాన్సే అన్నమాట.( ఈ గాగళగాగూళ అంటే ఏమిటి? ఈ మాట నేనెక్కడినుంచి పట్టుకొచ్చానో చెప్పినవాళ్ళకి కాకరకాయ వేపుడుతో భోజనం)

మా పెరట్లో దడి మీద అల్లుకుని విరగ కాసే కాకర వల్ల మాకు వారంలో మూడు రోజులు కాకర వేపుడు తప్పకుండా ఉండేది భోజనంలో! ఆ తీగ ఎన్నాళ్ళకు చావకపోగా అక్కడినుంచి ఇల్లెక్కి పైనంతా అల్లుకుని కాయడం మొదలుపెట్టింది. మా చిన్నన్నకు మండి పోయి దాన్ని పీకేశాడు.

కాకరకాయ ఫాన్ నే నేను కూడా! ఆగాకర కాయ వేపుడు కూడా చాలా బాగుంటుంది. మీలో ఎవరన్నా తిన్నారా? చాలా ఖరీదెక్కువ అవి.అయినా కొనకుండా ఉండలేనంత రుచి!

స్నిగ్ధ చెప్పారు...

వావ్ ఇందు గారు....మీలో ఇంత గొప్ప కవయిత్రి ఉన్నరాన్నమాట...పద్యం అదుర్స్!!
పొద్దున పొద్దునే నోరూరించే టపా చదివించారు....ఇప్పుడేమో అర్జెంట్గా కాకర కూర తినాలని ఉంది.... కాకరకాయ కూర,కాకరకాయ పులుసు పార్చెల్ చేస్తే బాగుంటుంది....ఏటంటారు??

కృష్ణప్రియ చెప్పారు...

వద్దు వద్దు అనుకుంటూనే లంచ్ టైం ముందు చదువుతాను ఇలాంటి పోస్టులన్నీ.. :-(( ఇప్పుడు నేను తెచ్చుకున్న.. బోరింగ్ డబ్బా విప్పుతాను.. తప్పుతుందా..

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. ఇందు గారూ, మీ టపా అంతా చాలా సీరియస్సుగా చదివానండీ, కాకర అంటే నాకు చాలా ఇష్టమైన కూర కాబట్టి:) అదేంటో మరి, చివరాఖరులో మీరు స్వహస్తాలతో రాసిన పద్యం చదవగానే ఫక్కున నవ్వేసా..;)
టపా బాగుంది:) మీకులాగే మా తమ్ముడు కూడా అంతే, కాకర తీగ చాలా సీరియస్‌గా వెతికేసి కాకరకాయ కోసేసి తినేస్తాడు. నేను పచ్చివి తిననులే కానీ, కూర మాత్రం ఫుల్లుగా లాగించేస్తా:)

kiran చెప్పారు...

నిన్న నేను కవిత ఎలా రాయాలో ట్రైనింగ్ ఇస్తే..ఈరొజె నీ బ్లాగ్ లో ప్రయోగించేసవ..:)
గుడ్..గుడ్..:)..నా పేరు నిలబెడ్తున్నావ్..
కాకర కయ గురించి..ఇంత బాగా రాయచ్చని నాకు ఈ రోజే తెల్సింది..
ఈ సారి నీ పిట్ట కూర..ట్రై చేస్తా..సరే కానీ నువ్వు బెంగుళూరు ఎప్పుడు coming ..?? :P ..నీ చేతి వంట తినాలి అని ఉంది.. హహహ.

ఇందు చెప్పారు...

@ కావ్య:అవును కావ్యా! నువ్విచ్చిన ట్రైనింగ్ కి చూడు కవితలు,పద్యాలు వరదలా వచ్చేస్తున్నాయ్! పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు....ఇందు కవ్యాని మించిన కావయిత్రి అయినప్పుడు...కలిగేదే శిష్యొత్సాహం.నీకు అలాగే పెట్టాలిలే లేకపొతే మా కాకరకాయని అదోలాగా మొహం పెట్టి తింటావా?అమ్మా!?

@ చందు:హ్హహ్హ్హహ్హా! ఐతే ఈసారి ఎవరికైనా మీమీద కోపం వస్తే....కాకరకాయ కూర చేయమని వాళ్ళకి ఉచిత సలహా ఇస్తా నేను :)) [మీకు కోపం వస్తే దుంపల వేపుడు..మీమీద కోపం వస్తే కాకర వేపుడు....వాకేనా?] :))

@సుజాత :'గాగళగా గూళ' అంటే 'కాకర కూరా అని అర్ధమా? అది మీ అమ్మయి/అబ్బయి చిన్నప్పుడు నోరు తిరక్క అన్న పదమా? నేనైతే అదే అనుకుంటున్నా ;)
నాకు తెలుసండీ ఆగాకరకాయ కూర.చలల్ బాగుంటుంది.చేదు ఉండదు.భలే భలె కూర అది.

ఇందు చెప్పారు...

@ snigdha:స్నిగ్ధ గారూ...నా పద్యం నచ్చినందుకు బోలెడు థాంకూలూ :) మీరలా అంటుంటే ఇక నేనేటంటానూ? మీకు నాగర్జునగారికి కకరకాయ వేపుడు+పులుసు పార్సెల్ :))

@ కృష్ణప్రియ:ఒకపని చేయండీ...అహనా పెళ్లంటలో కోటాలాగా...అలా నా బ్లాగ్ వంక చూస్తూ...కాకర కూర ఊహించుకుంటూ మీరు తెచ్చుకున్న బోరింగ్ డబ్బ ఎంచక్క తినేయండీ...పైన ఎన్నెలగారూ కూడా అలాగే చేస్తారట :)

ఇందు చెప్పారు...

@ మనసు పలికే:అంతేనండీ అంతే....మీలాంటి గ్రేట్ గ్రేట్ కవయిత్రులకి మాలాంటి చిన్న చిన్న కవితలు నవ్వొస్తాయ్ :( [జస్ట్ కిడ్డింగ్] ఓహ్! మీ తమ్ముడు కూడా నాలాగే అన్నమాట :) పచ్చి కాకర కూడా ట్రై చేస్తే పోలా>? బానే ఉంటుంది :))

@ kiran:ఆహా! ఏమి నా భాగ్యమూ? ఒకరికిద్దరు గురువర్యులు కలిగిన ఏకైక శిష్యురాలినై :)) ఇటు కావ్య...అటు కిరణ్...కెవ్వ్!! వస్తా వస్తా!ఇండియా వస్తా! బెంగుళురు వస్తా...మీ హస్టల్ కి వస్తా...మీ రూం కి వస్తా! చెమట పట్టకుండా వంట చేసి నీకు నా చేతి రుచి చూపిస్తా ;)

Ennela చెప్పారు...

సుజాత గారి ఇంటి పక్కన తమిళ ,మళయాళ స్నేహితులు ఉండి ఉంటారు చెరో వైపు..అందుకే నాకు మల్లే ళ కారం వచ్చేసింది...కదండీ!
మా ఇంటి పక్క కుట్టి..గళ గళ పాళుతున్న గోదాళిలా ...జళ జళ కాళుతుంటె కన్నీళిలా అని పాడేది మరి..అప్పటి దాకా నోరు తిరగని నాకు ళ కారం పూర్తిగా వచ్చేసింది..ఇప్పుడు నీంగళ్ అని స్పస్టంగా పలుకగలను తెలుసా!

Ennela చెప్పారు...

సుజాత గారు, కాకర కాయ వేపుడుతో భోజనానికి నేను ఎలిజిబుళ్ళా? ఒకవేళ అయితే, ఇండియా రావడానికి ఒక వైపు ఖర్చు మీది అని సవినయంగా మనవి చేస్తున్నాను...

హరే కృష్ణ చెప్పారు...

అవును ఆగాకర కాయ చూడడానికి కూడా చిన్నగా భలే ఉంటాయి
బాబోయ్ ఆగాకర కాయ ఆంటే ముఖ్యం గా ఆ గింజలు సువాసన ఇంకా టేస్ట్ కేకంతే హ్మ్మ్..చిన్నప్పుడు తిన్న రోజులు గుర్తొస్తున్నాయ్

పాట బాలేదా ?
పాట ని పోస్ట్ డామినేట్ చేసేసింది అంతే :)

రాధిక(నాని ) చెప్పారు...

ఇందుగారు సూపరండి! మీ కరకర కాకర.కాకరకాయ తో మేము బెల్లం,చింతపండుతో పులుసు,వేపుడు ఎక్కువగా చేస్తాము.పిట్టకూర బాగుందండి ట్రై చేయాలి.ఇక మీ పద్యం హహ్హహ్హ ఇంకా సూపర్ర్.........

సుజాత వేల్పూరి చెప్పారు...

ఇందు, గాగళగాగూళ విషయంలో కూరలో కాలేశావు. ఎన్నెల, దాదాపుగా దగ్గరికొచ్చారు. యండమూరి నవల భార్యా గుణవతి శత్రు లో హీరో ఇంటిపక్కన ఒక మళయాళీ కుట్టి ఫామిలీ ఉంటుంది. మీ ఇంట్లో ఏం కూర అంటే "గాగళగాగూళ" అని చెప్తుంది. అదేమిటో అర్థం కాక హీరో హీరోయిన్లిద్దరూ బుర్ర బద్దలు గొట్టుకున్నాక తెలుస్తుంది "కాకరకాయ కూర" అని! అదీ సంగతి!

ఎన్నెల గారికి మదర్పిత చందన తాంబూలాలతో సహా భోజనానికి ఆహ్వానం. ఛార్జీలూ అవీనా...మరేం పర్లేదండీ! మీరు ఇక్కడికి వచ్చినపుడే పెట్టుకుందాం భోజనాల ప్రోగ్రామ్!

Ennela చెప్పారు...

సుజాత గారు, తూచ్ చూచ్ ఇది చెల్లదు...భోజనం ఆఫర్ చేసినప్పుడు యీ రూల్స్ పెట్టలేదుగా...నేనొప్పుకోనంతే...ఇప్పుడే వచ్చేస్తా....వా...వ్.ఆ....వా...ఆ..ఆ...

ramki చెప్పారు...

ఇది అన్యాయం....దారుణం......
ఏదో....ఒక 15 రోజులు మీ బ్లాగ్ చూడకపోతే ఇలా రాసేస్తారా.......
అన్నట్లు.......మనం కాకరకై ద్వేషి.....మా అమ్మ అల ప్లతే లో పెడితే చటుక్కు మని కళ్ళు మూసుకొని గుటుక్కున మింగేసి...గ్లస్సుడు మంచినీళ్ళు తాగేస్త..... :(
అదేంటో...చిన్నప్పటినుంచి అంతే......ఇంకా అమెరికా వచాక ఆ బాధలు తప్పాయి.... :)
కాకపోతే ఆగార కాకరకాయి అంటే కాస్త ఓకే.....
అసలు మీ ఈ పోస్ట్ కి రిప్లై చూస్తుంటే అందరూ అభిమానులే కనిపిస్తున్నారు......
ఒక్కొల్లు అల పొగుడుతుంటే అసలు తట్టుకోలేకపోతున్న...
ఈ మధ్య మన ఇండియన్ స్టోరే లో కాకరకాయలు కనిపించటంలేదు ఏంటి చెప్మా అని మొన్నే డిట్రాయిట్ వదిలి వచేటప్పుడు అనుకున్న....ఇదన్నమాట సంగతి...మీ ఈ కర కర కాకర మహత్యం అనమాట.....
కొంపతీసి డిట్రాయిట్ లో కాకరకాయి అభిమాన సంఘం ఎమైన వేలిసిండా ఏంటి ఇందు గారు....
సర్లెండి....
ఇంకో పోస్టింగ్ చదవాలి.....మల్లి కామెంట్స్ చదవాలి........అబ్బ చాల పనులు పెండింగ్ లో వున్నయిండి...
బట్ ఎనీ వే....మీ ఈ కాకరకాయి పోస్టింగ్ నాకు కాస్త చేదుగా వున్నా....బావుంది లెండి.... :)

లత చెప్పారు...

హాయ్ ఇందూ
పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఈ రోజు మీ పుట్టినరోజు అని కావ్య బ్లాగ్ లో చూశాను.
హావ్ ఎ నైస్ డే
హ్యపీ వాలెంటైన్స్ డే అల్సో

స్నిగ్ధ చెప్పారు...

ఇందుగారు, పుట్టిన రోజు శుభాకాంక్షలండీ...
కాకర కాయ స్పెషల్స్ తో పార్టీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారా?
మీ పద్యం చదువుతోంటే అనిపించింది ఎవరి దగ్గర శిష్యకరికం చేసి ఈ టాలెంట్ సంపాదించారా...మన గురువుగారు కావ్య దగ్గరన్నమాట...
కిరణ్ గారు మీ గురువని కామెంట్స్ చూస్తే తెలిసింది...ఇద్దరి గురువుల దగ్గర శిష్యరికం చేసే అదృష్టాన్ని పొందారు....గ్రేట్ అండి...
గురువులని మించిన శిష్యురాలు కావాలని కోరుకుంటున్నాను....
:)

ఇందు చెప్పారు...

@ Ennela:ఎన్నెలగారూ...మీరే విన్నర్...అందుకోండి సుజాతగారి విందు భోజనం.

@సుజాత: సుజాతగారూ...కాకరపులుసులో కాలేసానండీ...హ్మ్! నాకు మళయాళం ఇల్ల.ఇల్ల. ఇక ఎన్నెలగారికి పసందైన కాకర విందు అందించే భాద్యత మీదే! :))

@ హరే: మీరు అలా ఆగాకర పేరు చెప్పి ఊరించకండి :( ఇక్కడ మాకు అది దొరకదుగా :((

@రామక్రిష్ణ: మీరు భలే వారే! ఎంత బాగుంటాయ్ కకర కూరలు,పులుసులు...మీరు మాంఛి టేస్ట్ మిస్స్ అవుతున్నారండి :)) అవును డెట్రయిట్లో కాకర మీద దాడి చేసోంది నేనే! :))

@లతగారు...చాలా థాంక్స్ అండీ :)

@స్నిగ్ధ : అవునండీ...కావ్య,కిరణ్,ఎన్నెల నాకు గురువులు :) వారి అడుగుజాడల్లో నడుస్తు నేను ఉన్నత శిఖరాలు చేరుకుంటా అన్నమాట :)

మురళి చెప్పారు...

కాస్తా కూస్తా కాకుండా ఏళ్ళ తరబడి ఆలస్యంగా చూశానండీ మీ పోస్టు..
ఎప్పుడైతేనేం.. కాకర ఎవర్ గ్రీన్.. ఆ రుచి ఎవర్ ఫ్రెష్.. మీ పోస్టు లాగానే..

Lalitha చెప్పారు...

Your blog is refreshingly good - I will come back & read other posts.

~Lalitha