ఎవరో తనని పిలుస్తున్నట్టు అనిపించి తల పైకెత్తాడు అర్జున్.
"హలో..ఎక్స్క్యుజ్ మీ..నేను ఇక్కడ కూర్చోవచ్చా?" అదే గ్రీన్ కలర్ చుడిదార్ అమ్మాయి తనని అడుగుతోంది.
'కలా? నిజమా?' అనుకుని...వెంటనే తేరుకుని...
"యా ష్యూర్" అని కొంచెం పక్కకి జరిగాడు.
ఆ అమ్మాయి కొంచెం మొహమాటం పడుతూ వచ్చి పక్కన కూర్చుంది. ఒక గమ్మత్తైన పరిమళం అర్జున్ చుట్టు ఆవరించింది.ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ఒక ఐదునిముషాలు.తను ఇబ్బంది పడుతోంది అని గ్రహించి తన చూపు మరల్చాడు.మళ్లీ తన నేస్తంతో కబుర్లలో పడిపోయాడు.కాని పక్కన కూర్చున్న అమ్మాయి వంక చూడకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది అర్జున్ కి.ఏదైనా మాట్లాడితే బాగుండు అనుకున్నాడు.కాని ముందు తను మాట కలిపే ధైర్యం చేయలేకపోయాడు.ఇంతలో ఆశించిన తరుణం వచ్చేసింది.
"ఏం బుక్ మీరు చదువుతున్నది....ఓహ్! 'ఆల్ కెమిస్ట్' ఆ? నైస్ బుక్" అని తన పుస్తకం వంక చూసి పలకరింపుగా నవ్వింది తను.
"మీరు ఆల్రెడీ చదివేసార?" అన్నాడు అర్జున్.
"యా..నేను పుస్తకాల పురుగుని.మంచి బుక్స్ సేకరించి చదవడం నా హాబి"
"వావ్.నాక్కూడా...మా ఇంట్లో నాకు ఒక చిన్న లైబ్రరి కూడా ఉంది.కాని ఇప్పుడు హాస్టల్ కదా..అందుకే ఎక్కువ బుక్స్ చదివే వీలు ఉండట్లేదు"
"ఓహో! మీరు వైజాగ్ లో ఉంటారా? ఏంటి ఒక్కరే అరకు చూడడానికి వస్తున్నార?"
"అహ! కాదండి.మా ఊరు అరకు.నేను వైజాగ్‌లో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా"
"అవునా! మీది అరకా? గ్రేట్.నేను కూడా ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్. విజయవాడలో"
"కూల్.ఏంటి అరకు టూర్ మీద వచ్చారా మీ కాలేజి వాళ్ళతో?"
"యా టూర్ మీదే.కాని కాలేజి ఫ్రెండ్స్ కాదు.మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉండే ఫ్రెండ్స్ అందరం ఈ ట్రిప్ వేసుకున్నాం.మేమందరం చిన్నప్పటినించి కలిసి పెరిగాం.ఇంకోద్దిరోజుల్లో ఎవరి దారి వారిది.అందుకే మెమొరబుల్ ట్రిప్ గా ఉండిపోవాలని ఈ ప్లాన్ వేశాం.ఆల్రేడి వైజాగ్ లో ఒక రోజు ఉన్నాం.ఇప్పుడు అరకు చూసుకుని..ఇక బాక్ టు విజయవాడ"
"మరి మీ ఫ్రెండ్స్ ఏరి? మీరు ఒక్కరే ఇటు వచ్చేసారెంటి?"
"అదా! ట్రైన్ ఎక్కేటప్పుడు నేను ఈ బోగిలో ఎక్కా...వాళ్ళందరూ పక్కదాంట్లో ఎక్కేసారు.నెక్స్ట్ స్టేషన్ లో మారదాం అనుకున్నాం.నాకు ఎక్కడా సీట్ దొరకలేదు.అందుకే ఇక్కడ ఖాళీ ఉందని మిమ్మల్ని అడిగాను"
"ఓహ్! ఓకే.ఓకే.కాని మీరు వ్రాంగ్ సైడ్ కూర్చున్నారు.ఇటు వైపు అరకు అంత ఏమి కనపడదు.అటువైపు కూర్చుంటే దారిలో వచ్చే జలపాతాలు,లోయలు...కింద ప్రవహించే వాగులు చూడొచ్చు"
"అవునా?ఇన్ని వివరాలు చెబుతున్నారు? మరి మీరెందుకు ఇటు పక్క కూర్చున్నారు?"
"నేను ఈ ట్రైన్ లో చాలా సార్లు అరకు వెళ్ళా..వచ్చా...కాని మీలాంటివారు జీవితంలో ఒకసారో,రెండు సార్లో వస్తారు.అప్పుడు కూడా నేనెందుకు మీకు కాంపిటీషన్ అని..ఇటు పక్కకి కూర్చున్న! సందేహం తీరిందా మేడం? ఇంతకీ మీ పేరు?"
"నా పేరు అనన్య.మరి మీ పేరు?"
"అర్జున్"
"అర్జున్ !మరి ఇప్పుడు అటు వైపు వచ్చే జలపాతాలు అవి నేను మిస్ అవుతాన?నాకు ఫోటోగ్రఫి చాలా ఇష్టం.నేను ట్రైన్లో వెళుతున్నప్పుడు మంచి మంచి పిక్స్ తీద్దామనుకున్నా! ఇప్పుడు కుదరదేమోగా!" అమాయకంగా అడిగిన ఆమె మొహం చూస్తే నవ్వొచ్చింది అర్జున్ కి.
"హ్హహ్హహ్హ! మరి అంతే కదా! సరే నా దగ్గర ఒక ఉపాయం ఉంది.మనం ట్రైన్ డోర్ దగ్గర నిల్చుందామా? అప్పుడు అన్నీ కనిపిస్తాయి.మనం ఎంచక్కా ఫోటోలు తీయొచ్చు.సరేనా?"
"హా! ఇదేదో బాగుంది.పదండి వెళదాం" అని హుషారుగా లేచింది అనన్య.ఆమె వెంటే నడిచాడు అర్జున్.
ఇద్దరు ట్రైన్ డోర్ దగ్గర నిల్చున్నారు.ట్రైన్ మెలికలు తిరుగుతూ ఆ కొండల్లో,కోనల్లో దారులు వెతుకుతూ వెళుతోంది.ట్రైన్ వేగానికి కొండగాలి రివ్వున వచ్చి ముఖాన్ని తాకుతోంది.చుట్టు ఎత్తైన కొండలు...అంతకు మించి లోతైన లోయలు...అక్కడక్కడ బ్రిడ్జిలు వస్తున్నాయ్.వాటికింద పెద్ద పెద్ద వాగులు పరుగులు తీస్తున్నాయ్.దూరంగా కొన్ని కొండలమీద జాలువారుతున్న తెల్లటి జలపాతాలు కనిపిస్తున్నాయ్.ఇంకొన్ని కొండలు మబ్బుల్ని దాటి ఆకాశాన్ని అంటుతున్నాయ్...అన్నిటిని చారెడేసి కళ్ళతో అబ్బురంగా చూస్తోంది అనన్య.ఆ అందాలన్నిటిని తన కెమెరాలో బంధిస్తున్నది.ఆ అందాన్ని మించిన అందమైన అనన్యని అంతకంటే అబ్బురంగా చూస్తున్నాడు అర్జున్.కాటుక దిద్దిన కళ్ళు,నుదిటి మీద దోస గింజంత బొట్టు,చెవులకి చిన్న ముత్యపు హంగింగ్స్,మెడలో కనీకనిపించని సన్నటి గొలుసు..ముత్యపు పెండెంట్,చేతికి సన్నటి బీడేడ్ బ్రేస్లేట్...అన్నిటిని మించి పొడవైన ఆ జెడ..ఎంత సింపుల్ గా ఉందో అంత ఎలిగేంట్ గా....'అచ్చం వనదేవతలా ఉంది' అనుకున్నాడు అర్జున్.అర్జున్ తననే చూస్తుండడం గమనించింది అనన్య.ఎందుకో కోపం రాలేదు మరి అర్జున్ మీద.చిన్న చిరునవ్వు మాత్రం వచ్చింది.
"హలో సర్! ఎక్కడ ఉన్నారు?" అని నవ్వుతూ అడిగింది అనన్య.
"అదేంలేదు.ఊరికే అలా చూస్తున్నా.మీకు ఈ డ్రస్ చాలా బాగుంది.నైస్ కలర్.."
"ఓహ్! థాంక్స్. ఇందాక జలపాతాలోస్తాయి అన్నారు? ఏవి మరి? ఇంతవరకు రాలేదు"
"వస్తాయండి.ఇంకో ఐదు నిమిషాల్లో వస్తాయి చూడండీ"
"సరే! రాకపోతే మీ సొంతూరు అరకు కాదు అని ఒప్పుకోవాలి"
"అయ్యబాబోయ్! మాది నిజంగా అరకేనండీ. మా నాన్న రైల్వేస్ లో చేస్తారు.మేము చిన్నపుడు చాలా ఊళ్లు తిరిగాం.కాని అరకు వచ్చాక నాన్నకి ఇది బాగా నచ్చింది.ఇక మళ్లీ ఎక్కడికీ వెళ్ళలేదు.ఇక్కడే సొంతిల్లు కట్టుకున్నాం.మా ఇల్లు చాలా బాగుంటుంది.కొండ అంచున ఉంటుంది తెల్సా? మీరు ఒకసారి రండి మా ఇంటికి.అస్సలు వదిలి వెళ్ళలేరు"
"అవునా? అంత బాగుంటుందా? మీరు అదృష్టవంతులు.ఇక్కడే ఉంటారు.మాలాంటివాళ్ళు ఇదిగో ఇలా చుట్టపు చూపుగా రావాల్సిందే!"
ఇంతలో పెద్ద శబ్దం చేస్తూ వచ్చింది ఒక జలపాతం.ట్రైన్ ట్రాక్ పక్కనే అంతెత్తు నించి పడుతున్న ఆ జలపాతం చూసి అనన్య అచ్చెరువొందింది.ఏదో కొంచెం దగ్గరలో జలపాతం చూడొచ్చు అనుకుంది కానీ ఇంత దగ్గరలో ఇలా ట్రైన్‌లోకి తుంపర్లు పడే దూరంలో అనుకోలేదు.చాలా సంతోషించింది అనన్య.ఆ జలపాతపు జల్లులో తడిసిన అనన్య ని చూస్తే..మంచులో తడిసిన లేత తమలపాకులా ఉంది అర్జున్ కి.
"అబ్బ!అర్జున్ గారు..సూపర్బ్ అండీ.నేను జలపాతం ఎక్కడో ఉంటుంది....ట్రైన్ లోనించి జస్ట్ కనపడుతుంది అనుకున్నా..ఇంత దగ్గరలో అని అస్సలు ఊహించలేదు.వావ్.ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్.థాంక్యు సోమచ్!"అంది ఆనందంలో తేలియాడుతున్న అనన్య
"ఓకే.దీనికి థాంక్స్ ఎందుకండీ...మా అరకులో ఇలాంటి అందాలు బోలెడు.సరే మరి మీకు ఇంకో సర్ప్రైజ్...ఇంకొద్దిసేపట్లో....అప్పటివరకు చూస్తేనే ఉండండి...అరకు అందాలు...." అని నవ్వుతూ అన్నాడు అర్జున్.
"అవునా! ఇంటరెస్టింగ్.ఐ విల్ వెయిట్" అని తలుపుకి ఆనుకుని మళ్లీ అడవి అందాలు ఆస్వాదించడంలో మునిగిపోయింది.ఆమెని ప్రేమించే పనిలో అర్జున్ కూడా మునిగిపోయాడు.ఇంతలో ట్రైన్ టన్నెల్ లోకి వెళ్ళడానికి టర్న్ తీసుకుంటోంది.అర్జున్ కి ఆ దారి బాగా తెలుసు కాబట్టి ఎక్కడ ఏది వస్తుందో ముందే చెప్పేస్తున్నాడు.
"అనన్య గారు.ఇంకాసేపట్లో...మనం చీకటి గుహలోకి వెళుతున్నాం"
"అమ్మో! నాకు చీకటంటే భయమండి" అని అనన్య అనే లోపు టన్నెల్ వచ్చేసింది...అనన్య కెవ్వుమని అరిచి అర్జున్ చేయి పట్టేసుకుని కళ్ళు మూసుకుంది భయంతో.ఒక పూలచెండు తనని సుతారంగా తాకినట్టు అనిపించింది అర్జున్ కి.ఆమె మృదువైన చేతివేళ్లు అతని చేతిలో లతల్లా అల్లుకుపోయాయి.ఆమె స్పర్శ కి అతను స్థాణువైపోయాడు.అ క్షణం అలా ఆగిపోతే బాగుండు అనుకున్నాడు.భయంతో చిగురుటాకులా వణుకుతున్న ఆమెని చూస్తూ....ముందుకి వంగి నుదిటిమీద ముద్దాడబోయి....వెంటనే తేరుకున్నాడు.'చ! ఏంటి నేను చేస్తున్నది? ఏమైంది ఇవాళ నాకు? నేనేనా ఇలా ప్రవర్తిస్తుంది?' అనుకుని వెంటనే ఆమెకి దూరంగా జరిగాడు.
"అనన్య గారు!టన్నెల్ అయిపొయింది.కళ్ళు తెరవండి"
"అవునా! అమ్మో! నాకు చీకటంటే చాలా భయమండి.ఇంట్లో కూడా కరెంట్ పొతే పెద్దగా అరిచేస్తా" అని చెబుతూ కళ్ళు తెరిచింది.తన చేయి అర్జున్ చేతిలో ఉండడం గమనించి వెంటనే వెనక్కి తీసేసుకుంది.
"ఐయాం సారి! భయంలో..."
"ఫర్వాలేదండి.అయినా..టన్నెల్స్ లో ట్రైన్ వెళ్ళేటప్పుడు లోపల చీకటిగా ఉండదండి.లైట్లు వేసే ఉంచుతారు.కావాలంటే చూడండీ ఈసారి..ఇలా బోలెడు టన్నెల్స్ వస్తాయి.మీరు అన్నిటికీ కెవ్వు కెవ్వు కేకలు వేస్తె నేనేదో మిమ్మల్ని ఏమన్నా చేస్తున్నా అనుకుంటారు.కాబట్టి భయపడకండి.ఓకేనా?"
"ఓహ్! అవునా...నేను అసలు టన్నెల్ అనంగానే..భయపడిపోయి...కళ్ళుమూసుకుని అలా అరిచేసా!"
"పర్లేదండి.అదుగోండీ టన్నెల్ వస్తోంది...ఈసారి భయంతో అరవడం కాదు...ఆనందంతో కేరింతలు కొట్టాలి మీరు.ఓకేనా?"
"హ్హహ్హా! అలాగే.అలాగే."
అలా ఎన్నో టన్నెల్స్ దాటి..ట్రైన్ అరకు వైపు పరుగులు తీస్తోంది.వారిద్దరి మధ్య స్నేహం కూడా బిడియం దాటి అభిమానం వైపు పరుగులు తీస్తోంది.అనన్య చాలా ఫోటోలు తీసింది.కొన్ని అర్జున్ కి కూడా తీసింది.అర్జున్ కొన్ని అనన్య కి తీసాడు..తరువాత సరదాగా కబుర్లు చెప్పుకున్నారు.ఇంటి విషయాలు..కాలేజి విషయాలు.....ఇలా ఎన్నో...చాలా వరకు ఇద్దరి అభిరుచులు కలిసాయి.ఒకరిమీద ఒకరికి అభిమానం పెరిగింది.ఆ విషయం ఇద్దరికి తెలిసినా ఎవ్వరు బైట పడలేదు.అనన్య అలా గలగలా మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపించింది అర్జున్ కి.అర్జున్ సెన్స్ఆఫ్ హ్యుమర్...అతని పొందికైన మాటతీరు...ఆలోచనా విధానం బాగా నచ్చింది అనన్యకి.తమ ఫ్యూచర్ గురించి...ఎయిమ్స్ గురించి....తమ సిద్ధాంతాల గురించి ఇలా ఎన్నో విషయాలు ఒకరికి ఒకరు కలబోసుకున్నారు....వారిద్దరి మధ్య అనుబంధం చిక్కనైంది..
కానీ కాలం పరుగు ఆగదు కదా!కొండలు గుట్టలు దాటి...వాగులు వంకలు దాటి ట్రైన్ బొర్రాగుహలు చేరుకుంది.అప్పటిదాకా ఆ ప్రయాణాన్ని తనివితీరా ఆస్వాదించిన అనన్యని ఒక్కసారి దిగులు ఆవరించేసింది.తను దిగాల్సిన స్టేషన్ అదే! ఈ విషయం తెలీని అర్జున్ ఆనందంలో ఏదో చెబుతున్నాడు.అంతలోనే అనన్య ఫ్రెండ్స్ ట్రైన్ దిగి అనన్య ఉన్న కంపార్ట్మెంట్ లోకి వచ్చారు.
"హేయ్ అనూ! నువ్వొక్కదానివే ఎలా ఉన్నవో ఎని ఎంత టెన్షన్ పడ్డామో! ఒక్కచోట కూడా ట్రైన్ దిగటానికి వీలుపడలేదు.ఇంతకీ అంతా బానే ఉంది కదా! ఏమి ఇబ్బంది పడలేదు కదా!"
"అహ.తను ఉన్నారుకదా...అసలు టైమే తెలీలేదు.ఎన్ని కబుర్లు చెప్పారో! వెరీ నైస్ కంపానియన్.చెప్పడం మర్చిపోయా...తను అర్జున్.నాకు ట్రైన్ లో పరిచయం అయ్యారు.వైజాగ్ లో బీటెక్ చేస్తున్నారు.ఇక అర్జున్....వీళ్ళు నా ఫ్రెండ్స్" అంటూ పేరు పేరునా అందరినీ పరిచయం చేసింది.
"ఓకే అనూ.ఇక్కడే మన దిగాల్సింది.ఇవాళ బొర్రా కేవ్స్ చూసేసి నైట్ కి అరకు వెళ్ళాలి.త్వరగా రా.నైస్ టు మీటు యు అర్జున్.సి యు.టేక్ కేర్" అని వాళ్ళు అంటుండగానే ట్రైన్ మెల్లగా స్టార్ట్ అయింది.
అర్జున్ కి ఏమి అర్ధం కాలేదు.అనన్య అరకు వరకు వస్తుంది అనుకున్నాడు.ఇలా మధ్యలో దిగేస్తుందని అస్సలు అనుకోలేదు.అనన్య మొహం చూస్తే తనకీ వదిలి వెళ్ళడం ఇష్టం లేనట్టుగా ఉంది.'ఇప్పుడు ఎలా? అనన్యని వదిలి ఎలా వెళ్ళడం?నేను తనతో ఎలా వెళ్ళేది? వాళ్ళేమనుకుంటారు?' ఇలా అర్జున్ మనసులో ఎన్నో ఆలోచనలు...
అనన్య ట్రైన్ దిగింది.మెల్లగా అర్జున్ కి 'బై' అని చెప్పింది.వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా 'బై' అని చేతులు ఊపారు..అర్జున్ కి గుండె ఆగినట్టయింది.తన ప్రాణాన్ని ఎవరో లాక్కెళ్ళిపోతున్నట్టు....గుండెలో ఏదో తెలియని బాధ...
'నా బంగారం వెళ్ళిపోతోంది...తను లేకుండా...నేను...నావల్లకాదు...అయ్యో! కనీసం సెల్ నంబర్ కూడా తీసుకోలేదే!! ఛా! నా చేతులారా అనన్య ని దూరం చేసుకున్నా...'
అనుకుంటూ అనన్య పట్టుకున్న తన చేతి వైపు చూసాడు......అంతే......
-కొరవ తదుపరి టపాలో....
19 కామెంట్లు:
బాగుంది .బాగా రాస్తున్నారు.మీరు అరకు ఎన్నిసార్లు వెళ్ళారండి?అరకు అందాలు కళ్ళకుకట్టినట్టురాసేరు..
అరకును కళ్ళ ముందు అందంగా ఓ దృశ్య కావ్యంలా చూపించారు. సింప్లీ సుపర్బ్, చివరికి ఆ " అంతే" ఈ సస్పెన్స్ ఏంటండీ. ?
ammo, ila saSesham kuda pettachchannamaata...nenu oka tapa complete cheyya leka cheyya leka krungi krushistunnanu... ippudu audia ichcharuga... inka oka tapa 10 instalments lo ayinaa sareh pettestaananthe.
chala baagundandee...araku description and love story...chivarna arjun cheiyyi choosukunnadani aapEstE crime katha yemo ani bhayyamgaa undi... kaallu gaatttigaa moosukunnaa... migilina katha cheppedaakaa kallu teravalenu... thondara cheppeyyandi please....
ennela
త్వరగా మిగతా భాగం కూడా పెట్టేస్తే రెండూ కలిపి చదివి కామెంటుతా ఇందు గారు :-)
ఇందు,
సస్పెన్స్ బావుంది. మీరు చాలా బాగా రాస్తారు. అర్జున్ చేతి మీద అనన్య ఫోన్ నంబర్ ఉందా కొంపదీసి?
బాగా రాస్తున్నారు ఇందు గారు తొందరగా తరువాత భాగం కుడా రాసేయండి.....
ఎంత మంచి పోస్ట్ చేశారు చాల బాగుందండి.
ఎన్నాళ్లు..ఎన్నేళ్లు గడిచినా చెరగని ముద్రలా నిలువెత్తు సాక్ష్యంలా నిలుస్తాయి ఈ ప్రయాణ ప్రేమలు. నచ్చిన చిన్నది దూరం అవుతుంటే మనసు పడే భాద అంతే ఇంక... తొలిరోజు తొలి చూపు కలిగిన ఆకర్షణ అలాంటివారిలో ప్రేమభావం ప్రవేశించిందన్నమాటే ఈ అర్జున్ విషయం కూడ అలాగే అనిపిస్తూంది.రెండు మనసులకు సంబంధించిన ప్రేమ ఏనాటికైనా ఆ రెండు మనుసుల మధ్య బంధాన్ని ముడివేయగల్గితే ఆ ప్రేమకథ సుఖాంతం. కానీ అదే ప్రేమ ఓ మనసులో ఆకాశమంత ఎత్తుకు ఎదిగి మరో మనసులో అసలు తన ఉనికినే చాటకపోతే ఇక ఆ ప్రేమకథ ఎలాంటి ముగింపుకు చేరుతుందో ఊహించడం కష్టమే.. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ ఎక్కడా ఆగిపోదు.. అర్జున్ ప్రేమ కథకు మంచి ముగింపు ఇవ్వాలని అర్జున్ తదుపరి భాగం కొరకు ఎదురుచూస్తూ
చాలా బావుందండీ,
కాలేజ్ రోజుల్లొ ఒకసారి అరకు వెళ్ళాను నేను,
ఆ రోజులు గుర్తొచ్చాయి
ఇందు గారు, రెండో భాగం కోసం వెయిటింగ్...
ఇందు గారు.. చాలా చాలా బాగుంది. ఇది మీ రెండో కథ అనుకుంటున్నాను..:) చదువుతున్నంత సేపూ చాలా ఆహ్లాదంగా అందంగా ఉంది. తరువాత భాగం త్వరగా రాస్తారని ఆశిస్తున్నాను..
ఇందు గారు!
సూపర్... ప్రయాణాల్లో ప్రేమ కథలంటే చాలా ఇష్టం. చాలా బాగుంది. త్వరగా ముగింపు రాసేయండి...
అమ్మో ..ఇందు ..ఒక రెండు రోజులు బ్లాగ్స్ పట్టించుకోక పోతే..మీ టాలెంట్ ని మొత్తం బయట పెట్టేస్తార?..
కథ బాగుంది...నేను అరకు ఎప్పుడు చూడలేదండి...:)..మీ పోస్ట్ వల్ల సగం చూశానని..అనిపిస్తోంది...
తొందరలో చుసేస్త...:)
2nd పార్ట్ చదివేయాలి..ఉంటా...!!
అయ్య బాబోయ్ ఇందు గారు ఏమి టాలెంట్ అండి బాబూ మీది ..ఆహా కధ సూపర్ గా మారి .... రెండవ పార్ట్ కోసం వెయిటింగ్ ...ఇకపొతే ఇది కధ?? నిజమా ??? అని డౌట్
@ రాధిక(నాని ):థాంక్యూ రాధిక గారు.ఒక్కసారి వెళ్ళానండీ.... :)
@ భాను:థాంక్యూ భానుగారు..! ఈపాటికే తెలిసిపోయిందనుకుంటా మీకు సస్పెన్స్
@ Ennela:హ్మ్! పెట్టొచ్చండీ...మీరు ఎలా కావాలంటే అలా వ్రాసుకోవచ్చు!
@ వేణూ శ్రీకాంత్ :ఇంకో భాగం కూడా ఉందండీ...వెయిట్...వెయిట్...
@ చందు:థాంక్యూ చందుగారు :) లేదండీ..ఇంకొ భాగం కూడా వేసా! చూడండీ..
@చెప్పాలంటే.....:థాంక్యూ అండీ...అలాగేనండీ...పెట్టేసా చూడండీ!
@ అశోక్ పాపాయి:ఎంత బాగా చెప్పారండీ ప్రేమ గురించీ...అందుకే మీరు అంత మంచిమంచి కవితలు వ్రాయగలుగుతున్నారు....నా కథ నచ్చినందుకు ధన్యవాదాలు అషోక్ గారు...
@ లత:థాంక్యు అండీ...లత గారూ...
@snigdha:వేసేసాను చూసారా మరి రెండవ భాగం??
@ మనసు పలికే:థాంక్యూ అపర్ణ గారూ! నా కథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు :)
@ సవ్వడి :అలాగేనండీ..త్వరగానే ముగిస్తా!
@ kiran:హ్హహ్హహ్హ! ఐతే నా కథలోనే అరకు చూసేస్తున్నారు అన్నమాట...వారానికి ఒక్కసారైనా నా బ్లాగ్ చూడకపోతే మరి క్షమించను కదా! :P
@ శివరంజని:మీకంటేనా చెప్పండీ...రెండు నెలలకి ఒక్కసారి వ్రాసినా అదరగొట్టేస్తారు కదా! మీ ముందు మేమెంతండీ..! ఇది కథే! నిజం కాదు! 100% గ్యారెంటీ :) మీ డౌట్ తీరిందా!
ఇందు గారు సూపరు .. ప్రేమ కదా ట్రైన్ లో .. నేను నెక్స్ట్ ఇంచుమించు ఇలాంటిదే రాయబోతున్నగా ;)
మీకు కాంపిటిషన్ కాదు కాలేదు లెండి .. కానీ మీ బ్లెస్సింగ్స్ ఇస్తార కొంచెం ప్లీస్
@ kavya: మీకేంటండీ..సూపర్ వ్రాస్తారు చూడండీ..నాకంటే 100 రెట్లు బాగుంటుంది మీ కథ :) వైటింగ్ ఫర్ దట్ :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి