"హలో అర్జున్ గారు! ఇక బయల్దేరదామా?" అని అడిగింది.
అప్పుడు ఇహలోకి వచ్చిన అర్జున్....
"ఓహ్!సారీ...యా....పదండి వెళదాం" అని వాళ్ళని కార్ దగ్గరకి తీసుకెళ్ళాడు.అనన్య ముందు సీట్లో కూర్చుంటే బాగుండనుకున్నాడు.కానీ ఆమె వెనుక సీట్లో తన స్నేహితురాళ్ళతో కూర్చుంది.కొంచెం నిరుత్సాహపడినా..పోన్లే అని త్వరగా ఇంటికి పోనిచ్చాడు.అక్కడికి చేరాక...అర్జున్ అందరికీ ఇంట్లో వాళ్ళని పరిచయం చేసి...ఇల్లంతా చూపించాడు.అర్జున్ వాళ్ళ ఇల్లు కొండ అంచున ఉంటుంది.ఆ ఇల్లే ఆ వీధిలో చివరి ఇల్లు.అక్కడితో డెడ్ ఎండ్.ఇల్లు చిన్నదైనా ముచ్చటగా ఉంది.ఇంటిముందు రకరకాల పూల చెట్లు.ఇంటివెనుక పళ్ళచెట్లు....ఇంకా చిన్న పెరుడు కూడా ఉంది.వారి ఇంటి వెనుక గోడ దాటితే కిందంతా పెద్ద లోయ.ఆ ఇల్లు చాలా నచ్చింది అనన్యకి.
"మీరు లైబ్రరి ఉంది అన్నారు..మీ ఇంట్లో ఎక్కడా?" అని అడిగింది అనన్య..సహజంగా తనకి పుస్తకాల మీద ఉన్న ఆసక్తితో..
"నా రూం పైన ఉంటుందండి.అక్కడుంది నా చిన్ని పుస్తక ప్రపంచం.రండి చూపిస్తా!..మీరూ వస్తార?" అని మిగితావారిని కూడా అడిగాడు.బాబోయ్...ఆ పుస్తకాల గోల మావల్ల కాదు..మీరు కానివ్వండి అని వాళ్ళు కిందే ఉండిపోయారు...
అర్జున్ అనన్యని పైకి తీసుకెళ్ళాడు.అక్కడ కూడా చాలా మొక్కలు కుండీలలో ఉన్నాయి.ఒక చిన్న ఉయ్యాల అర్జున్ రూం పక్కనే ఉంది.అర్జున్ రూం తలుపు తీసి....లైట్ వేసి అనన్యని లోపలి ఆహ్వానించాడు.రూం లోకి అడుగుపెట్టగానే మంచి గంధపు వాసన...'వావ్' అనుకుంది అనన్య.రూం అంతా ఒకసారి పరిశీలనగా చూసింది.కొంచెం పెద్ద రూం.కానీ చాలా పద్దతిగా...నీట్ గా ఉంది.గదికి నలువైపులా కిటికీలు...వాటికి అందమైన కర్టేన్స్......గోడలకి వెదురుతో చేసిన వాల్ హాన్గింగ్స్.....ఒక మూలకి చిన్ని మంచం....దాని పక్కనే కేన్ టేబుల్-చైర్...దానిమీద చిన్న లైటు....ఒక బుల్లి కొండపల్లి బొమ్మా...సర్దిపెట్టి ఉంచిన పుస్తకాలు....పక్కనే పెద్ద షెల్ఫ్...దాని నిండా ఎన్ని పుస్తకాలో!నెమ్మదిగా అనన్య కాళ్ళు అటు వైపు లాగాయి.ఒక్కో పుస్తకం తీసి ....ఎంతో ఆసక్తితో చూస్తున్న ఆమె వంకే చూస్తున్నాడు అర్జున్.'ఇదంతా నిజమేగా? తన అందాల రాశి...తన రూం లో....ఇదంతా కలై కరిగిపోదు కదా!' అని ఆలోచిస్తున్నాడు.'ఎంతందంగా ఉంది ఈ చీరలో! పొద్దున రైల్వే స్టేషన్లో అల్లరి చేసిన అమ్మాయేనా? తెలుగుదనానికి నిలువెత్తు రూపంలా...బాపు బొమ్మలా....పూల కొమ్మలా....నా చెలి సౌందర్యం ఏమని చెప్పను? అప్సరసలు...దేవతలు...అంటే ఇలానే ఉంటారు కాబోలు....' అనుకుంటూ ఆమె సౌందర్యారాధనలో మునిగితేలుతున్నాడు. ఇంతలో అనన్య అర్జున్ వంక చూసింది.చేతిలో ఉన్న పుస్తకం రాక్‌లో పెట్టి అతని వంక చూసి చిరునవ్వు నవ్వింది.
"ఏంటి అలా చూస్తున్నారు? "
"మీరూ ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు అనన్య గారు....నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు శారీ కట్టుకుంటారని...రియల్లీ యు లుక్ ఏమేజింగ్..."
"హ్మ్! మీ ఇంటికి భోజనాలకి వస్తున్నాం కదా...కొంచెం సాంప్రదాయబద్ధం గా ఉంటుందని కట్టుకున్నా..అంతే!"
"ఓకే.ఎలా ఉందండి నా లైబ్రరి?!"
"గ్రేట్.చాలా కలెక్షన్ ఉంది.నేను చదవని ఎన్నో పుస్తకాలు ఉన్నాయి.మీ అభిరుచి కూడా బాగుంది.మీ రూం కూడా...చాలా పద్దతిగా ఉందే! మేము వస్తున్నామని...ఇలా సర్దారా? లేక ఎప్పుడు ఇలాగే ఉంటుందా?" అని చిలిపిగా అడిగింది అనన్య.
"హ్హహ్హ!లేదండి.నా రూం నేనే సర్దుకుంటా.నాకు నీట్ గా లేకపోతె చిరాకు.సో! నా రూం ఎప్పుడు ఇలాగే ఉంటుంది"
"గుడ్! బైట కూడా ఒకసారి చూద్దామా?" అని రూం బయటకి నడిచింది అనన్య.ఆమె వెంటే వెళ్ళాడు అర్జున్.
అక్కడ నించి లోయ అంతా కనపడుతోంది.చల్లటి కొండగాలి ముఖానికి తాకుతోంది.పుచ్చ పువ్వులా విచ్చుకున్న వెన్నెల..... నల్లటి అగాధంలా ఉన్న ఆ లోయలో కాంతిని నింపడానికి ప్రయత్నిస్తోంది.అక్కడక్కడ మిణుకు మిణుకు అని ఏవో గాల్లో ఎగురుతూ ..మెరుస్తున్నాయి...
"అవేంటి? అలా దూరంగా ఎగురుతూ....మెరుస్తున్నాయి....?" అని అడిగింది అర్జున్ ని.
"అవి మిణుగురు పురుగులండి.అడవి కదా..ఇవన్నీ ఉంటాయి.రాత్రిపూట....ఇలా చల్లగా గాలి వీస్తుంటే...ఈ ఉయ్యాలబల్ల మీద కూర్చొని....అలా లోయలోకి చూస్తూ ఉంటే....ఎంత బాగుంటుందో!"
"చాలా బాగుందండి...ఐతే మనం ఇప్పుడు కూడా ఉయ్యాల బల్ల మీద కూర్చుందాం రండి" అని అర్జున్ తోపాటు వెళ్లి ఉయ్యాలబల్ల మీద కూర్చుంది.కొబ్బరి చెట్ల సందుల్లోనించి చంద్రుడు తొంగి చూస్తున్నాడు.అనన్య దగ్గరనించి ఒక గమ్మత్తైన పరిమళం ఆ పిల్లగాలితో కలిసి అర్జున్ చుట్టు తిరుగుతోంది.చిగురాకుల రెపరెపలు....కీచు రాళ్ళ శబ్దం మినహా.....వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది.అర్జున్ కి ఆ క్షణం ఎంత అపురూపంగా అనిపించిందో....తనకి ఇష్టమైన చోట....తనకి చాలా ఇష్టమైన అమ్మాయితో గడుపుతున్న ఆ కాలం ముదుకు వెళ్ళకూడదు అని ఎన్ని సార్లు అనుకున్నాడో!ఆ పున్నమి రాత్రి తన చెంత వెన్నెల శిల్పం లా ఉన్న వున్న అనన్యని చూస్తూ ఉండిపోయాడు....
"ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు కదా!ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండు!" అనన్య నోటివెంట తన మనసులో మాటలు విని...అర్జున్ ఆశ్చర్యపోయాడు....
"మరి ఎప్పటికీ నాతోనే ఉండిపోతావా అనూ?" ఇక ఆగలేక అడిగేసాడు అర్జున్.
"ఏంటి?ఏమన్నారు?"
"అదే! ఇక్కడే కాసేపు కూర్చుందామా అన్నాను.అంతే" అని తడబడ్డాడు.అనన్య కి అర్ధమయింది.ఆమెకి అర్ధమయింది అని అర్జున్ కి అర్ధమయింది.వారి మధ్య కాసేపు మౌనం రాజ్యమేలింది.ఇద్దరి మనస్సుల్లో పుట్టి ఇంకా 24 గంటలు కూడా కానీ ప్రేమ...ఎన్ని మాయలు చేస్తోంది? ఒక క్షణం మౌనం..ఒక క్షణం గానం...ఒక క్షణం విరహం..ఒక క్షణం మోహం....మనసు ఎంత చిత్రమైనది? ఎందుకు..ఎప్పుడు..ఎవర్ని కోరుకుంటుందో...దానికే తెలీదు...కానీ ప్రేమ అనే నిప్పుని రగిల్చి....అంతకంతకీ ఆజ్యం పోస్తూనే ఉంటుంది...
అంతలోకే పైకి అనూ ఫ్రెండ్స్ వచ్చారు.
"హేయ్! పైన చాలా బాగుంది కదా! ఇక్కడే భోజనాలు చేద్దామా?" అన్నారు అర్జున్ తో.అతను సరే అనడంతో...అందరూ కిందకి వచ్చి ఆ భోజన సామగ్రి అంతా పైకి తీసుకెళ్ళారు....పైన వెన్నెల్లో...అందరూ కూర్చుని భోజనాలు చేసారు.....మూడురోజులనించి బైట భోజనం తిని తిని వెగటు పుట్టి...ఇపుడు ఇంటి భోజనం దొరికేసరికి....ఒక్కొక్కళ్ళు....ఆకలిగొన్నపులుల్లా...అన్నం మీద దాడి చేసారు.భోజనాల సమయంలో అర్జున్,అనన్య ఒకరితో ఒకరు డైరెక్ట్ గా మాట్లాడుకోలేదు.భోజనాలు అయ్యాక...అంతా అంత్యాక్షరి ఆడుకున్నారు.అప్పుడు కూడా వారిద్దరి మధ్యా మౌనమే! అందరితో బానే ఉన్నా..ఇద్దరూ ఎదురుపడితే మౌనమే సమాధానం అయింది.అర్జున్ చెల్లి అనన్యతో బాగా కలిసిపోయింది.ఆమె,అనన్యా ఇద్దరు తెగ ముచ్చట్లాడుకున్నారు.కాసేపయ్యాక అందరూ కిందకి వెళ్ళారు.అనన్య....అర్జున్ ఇంట్లో ఉన్న సిస్టంలో తాము దిగిన ఫొటోలన్ని కాపీ చేసింది...అది చూసి...'పోనిలే..తన జ్ఞాపకాలైనా ఉన్నాయి' అనుకున్నాడు.ఇక కాసేపటికి అందరూ రిసార్ట్ కి బయలుదేరారు.అందరినీ అక్కడ దింపాడు అర్జున్.వాళ్ళు రేపు అరకు అంతా చూపించే భాద్యత అర్జున్ కి అప్పగించారు.ఆనందంగా స్వీకరించాడు అతను.అందరికీ గుడ్‌నైట్ చెప్పి ఇంటికి వచ్చాడు.అప్పుడు కూడ అనన్య ముభావంగానే ఉంది.అర్జున్ తన రూం లోకి రాగానే అక్కడ బుక్ షెల్ఫ్ దగ్గర అనన్య పుస్తకాలు తిరగేస్తున్నట్టే అనిపించింది...ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు.అనన్య ఆలోచనలే.'తనకి నేనంటే ఇష్టమా లేదా? ఒక వేళ ఇష్టంలేకపోతె...నేను నా ప్రేమ విషయం డైరెక్ట్ గా చెప్పేస్తే,...తను కాదంటే? నేను అసలు అది తట్టుకోగలనా?? అనన్య ఉద్దేశమేంటి??' ఇలా ఎన్నో ఆలోచనలు ముప్పిరిగొన్నాయి.అలా అనన్య గురించి...తన ప్రేమ గురించి...ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారు ఝామున కొద్దిగా నిద్రపోయాడు.
పొద్దున్నే లేచి తయారయి రిసార్ట్‌కి వెళ్లి అక్కడ నించి అందరినీ తీసుకుని అరకు చూపించడం మొదలుపెట్టాడు అర్జున్.అనన్య కొంచెం డల్ గా ఉంది.అతనికి విషయం తెలుసు కాబట్టి...ఆమెని ఎక్కువ కదిలించలేదు.అనన్య ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఆమెకి దూరంగా ఉంటున్నాడు.ఇదంతా చూస్తున్న అనన్య మిత్రబృందానికి ఏమి అర్ధం కాలేదు.'ఏమోలే!ఇద్దరిమధ్యా గోడవైందేమో...మనం కలిపించుకోకుండా ఉండడం బెస్ట్' అనుకున్నారు.చాపరాయి ఫాల్స్,ట్రైబల్ మ్యుసియం,పద్మాపురం గార్డెన్స్...అన్నీ చూపించాడు.సాయంత్రానికి ఇక వారు వైజాగ్ కి పయనమయ్యారు.వెళ్లేముందు ఒకసారి అందరూ అర్జున్ ఇంటికి వచ్చారు.అర్జున్ కుటుంబానికి కృతఙ్ఞతలు తెలియజేసి....ఇక బయలుదేరారు.అర్జున్ కూడా వారితో పాటు బయలుదేరాడు.అతనికి మరుసటిరోజున పరిక్ష ఉంది.అందరూ కలిసి బస్సులో వైజాగ్ పయనమయ్యారు.బస్ లో కూడా....అనన్య అర్జున్ తో ఏదో నామమాత్రంగా మాట్లాడింది.అర్జున్‌కి మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టైందీ...'తనకి నేను నచ్చలేదేమోలె అనుకున్నాడు!'.ఇక అనన్యని ఇబ్బంది పెట్టకూడదనుకున్నాడు.
మర్నాడు సాయంత్రం అనన్య వాళ్ళు వెళ్ళేది..విజయవాడకి.తాము ఇంకా చూడని సింహాచలం,భీమ్లి బీచ్,రిషికొండ బీచ్ చూసుకుని సాయంత్రం బయలుదేరదామని వాళ్ళ ప్లాన్.అందరూ వైజాగ్ చేరారు.అర్జున్ బస్ స్టాండ్‌లో వాళ్లకి వీడ్కోలు పలికి..సాయంత్రం కుదిరితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తానని చెప్పి...అనన్య వంక ఒకసారి చూసి....చిన్నగా నవ్వి....హాస్టల్ కి బయలుదేరాడు....ఆ రోజు అర్జున్ చాలా బాధపడ్డాడు.'అనవసరంగా ఒక మంచి అమ్మాయిని బాధ పెట్టాను.పాపం తను ట్రిప్ సరిగా ఎంజాయ్ చేయలేకపోయిందేమో నావల్ల!....కానీ అనన్య లేని నా లైఫ్...ఊహించుకోలేకపోతున్నా! ఒక్కరోజులో కట్టుకున్న ఆశల మేడలన్ని కూలిపోతున్నాయ్ !' అనుకున్నాడు.మధ్యాహ్నం పరీక్ష.ఏదో చదివి...ఏదో రాసి సాయంత్రం బైట పడ్డాడు.వెళ్లేముందు అనన్యకి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలనిపించింది.కనీసం ఒక స్నేహితుడిగా గుర్తుంచుకున్నా చాలు అనుకున్నాడు.వెంటనే తన ఫ్రెండ్ షాప్ కి వెళ్ళాడు.
రాత్రి....తొమ్మిది గంటలు....అనన్య వాళ్ళ బస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది.అనన్య ఫ్రెండ్స్ అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నారు.ఇంతలో పరుగులాంటి నడకతో అర్జున్ వచ్చాడు.అందరూ అతనికి థాంక్స్ చెప్పి వీడ్కోలు పలికారు.వాళ్ళందరికీ పేరు పేరునా వీడ్కోలు చెప్పాడు అర్జున్.ఇక అనన్య వంతు వచ్చేసరికి అతనికి మాటలు రాలేదు.చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ ఆమెకి అందించాడు.ఎన్నో మాటలు గొంతు దాక వచ్చి ఆగిపోతున్నాయ్.ఆమె కళ్ళల్లో తన ప్రేమని వెదికే ప్రయత్నం చేస్తున్నాడు అర్జున్.అతనికి తన భావాలు కనపడకుండా దాచుకుంటోంది అనన్య.తను కోరుకున్న ప్రేమ ఆమెలో కనిపించక...తన తొలివలపు చిరునామా తెలియక...అలసిన అర్జున్ మనసు ఆమెకి వీడ్కోలు పలికింది.ఆమె అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ తీసుకుని అతనికి బై చెప్పి బస్ ఎక్కింది.లోపలి వెళ్లేముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి నవ్వింది.అర్జున్ కళ్ళలో నీళ్ళు....'నువ్వు లేకుండా ఉండలేను అనన్యా!' అని చెప్పాలనిపించింది.కానీ నోరు పెగల్లేదు.అక్కడ అనన్య కళ్ళలో కూడా నీళ్ళు...అర్జున్ ని వదిలి వెళ్ళలేకపోతోంది...కానీ బయటపడడానికి మొహమాటం అడ్డొస్తోంది.'చెప్పాలా..వద్దా? ఇది సమయమా...? కాదా? ఇది ప్రేమేనా? మోహమా?' ఎన్నో ప్రశ్నలు ఆమె మనసులో!!ఇక అక్కడ అర్జున్ ని చూస్తూ ఉండలేక లోపలికెళ్ళిపోయింది అనన్య.అర్జున్ కూడా అనన్య వెళ్ళిపోవడం చూడలేక వెనుదిరిగి వచ్చేసాడు.బస్ బయలుదేరింది....
అర్జున్ అనన్య బాధ తట్టుకోలేక హాస్టల్ రూంకి వెళ్లి పడుకున్నాడు.అతనికి అనన్య రూపమే కళ్ళముందు కదలాడుతోంది.'తనని ఇబ్బంది పెట్టకూడదని కనీసం సెల్ నంబర్ కూడ అడగలేదు....ఇక నా అనన్యని జీవితంలో కలవలేను...ఎలా ఇంత బాధ తట్టుకోవడం?? అసలు తనకి కనీసం నామీద ఇష్టం అయినా ఉందా?ఇక అనన్య నాకు శాశ్వతంగా దూరం అయిపోయినట్టేనా?' అని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు.అక్కడ బస్‌లో అనన్య అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసింది.ఒక సిరామిక్ మగ్...దానిమీద తామందరం బొర్రాగుహల దగ్గర దిగిన ఫోటో ప్రింట్ చేసి ఉంది.కింద 'విత్ లవ్...అర్జున్' అని వ్రాసి ఉంది.ఆ మగ్‌లో చాక్లెట్లు...ఒక చిన్న టెడ్డిబేర్ బొమ్మా...దాని మీద..'ఐ మిస్ యు' అని వ్రాసి ఉన్న అక్షరాలూ...అనన్యకి కన్నీళ్ళు ఆగలేదు.ఆ 'మిస్ యు' అనే పదాలు ఆమెలో జరిగే సంఘర్షణకి అర్ధం ఇచ్చాయి.'నేను ఇప్పుడు అర్జున్ ని మిస్ ఐతే...ఇక ఎప్పటికీ తన ప్రేమని మిస్ అయినట్టే.ఇప్పటిదాకా ప్రేమని ఆకర్షణేమో అనుకున్నా! కానీ...ఈ కన్నీళ్ళు...ఈ బాధా..ఇదంతా ప్రేమే కదా! తనని వదలలేని స్థితి...ఇదంతా ప్రేమే కదా! తన కళ్ళలో కనిపించే నా రూపం నిజమని నా మనసు నమ్ముతోంది.ఇది ప్రేమ అని చెబుతోంది.ఇంతకంటే ఇంకేం కావాలి?' అనుకుంది అనన్య.
అనన్య ఊహల్లో కొట్టుకుపోయిన అర్జున్...ఎప్పటికో బయటపడ్డాడు.ఎప్పటికీ మరిచిపోలేని అనన్య తన జీవితంలో వచ్చిన వాసంత సమీరం అనుకున్నాడు.కాసేపయ్యాక తన ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు.ఒక పది మిస్డ్ కాల్స్.ఏదో కొత్త నంబర్...'ఎవరబ్బా ఇన్ని సార్లు కాల్ చేసారు?' అని ఆ నంబర్ కి కాల్ బాక్ చేసాడు.
"హలో! ఎవరు?"
"హలో!"
"హలో!...ఎవరు...అనూ!"
"యస్ అర్జున్! నేనే!...."
"అనన్య! ఐ కాంట్ బిలీవ్ దిస్.మీకు నా నంబర్!!??"
"నిన్న మీ చెల్లిని అడిగి తీసుకున్నా!నీకు కనీసం నా సెల్ నంబర్ అడగాలని కూడా అనిపించలేదు కదా!ఏం చేయాలి నిన్ను?"
"అది కాదు అనన్య!నువ్వు నావల్ల ఇబ్బంది పడుతున్నావేమో అని...నీకు నేనంటే ఇష్టం లేదేమోనని..."
"హ్మ్! ఇప్పుడు చెప్పు....నాకు నువ్వంటే ఇష్టంలేదా!?"
"అదంతా నాకు తెలీదు అనూ!కానీ ఒక్కటి మాత్రం నీకు చెప్పాలనుకుంటున్నా!........'ఐ లవ్ యు అనన్యా!"
" "
"హమ్మయ్య! జీవితంలో ఈ మాట నీతో చెప్పలేనేమో అనుకున్నా! ఇప్పుడు చెప్పేసా! ఎంత హ్యాపీ గా ఉందో!నువ్వు లేకుండా...నేను అస్సలు ఉండలేకపోతున్నా అనూ!...ఐ లవ్ యు...ట్రూలీ...మ్యాడ్లీ..డీప్లీ..మరి నీక్కూడా నేనంటే ఇష్టమేగా?" ఏం సమాధానం వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు అర్జున్.
"యస్!"
"చాలు అనన్యా!...ఇది చాలు....ఇంతకీ నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందా?"
"చాలా.....నువ్వెంత నచ్చావో...అంత!"
సమాప్తం
P.S: ముందుగా...ఇన్ని భాగాలు చేసి ఈ కథను వ్రాసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ...అసలు మొదట...రెండు భాగాలుగా మాత్రమె వ్రాదామనుకున్నా! కానీ అర్జున్-అనన్య మధ్య ప్రేమ..కేవలం ఆకర్షణ కాకూడదు అనే..వారిమధ్య ప్రేమని చిగురించే అంశాలు జోడించా.అందువల్ల కథ నిడివి ఎక్కువైంది.,ఈ మూడు భాగాలు మీ చేత చదివించినందుకు...నన్ను తిట్టుకోకండే మరి! కథ అంతా నచ్చితే...కామెంటేయండి....లేకున్నా...అక్షింతలు వేస్తూ కామెంటేయండి......
46 కామెంట్లు:
బావుందండీ, చాలా బాగా రాశారు.
చాల బాగా రాసారు
cute love story
చాలా.. చాలా.. చాలా.... చాలాబాగుందండి. అద్భుతంగా స్టోరీ నేరేట్ చేశారు. సూపర్బ్
మీరు రాసింది చదువుతూవుంటే హాయిగా సాయంత్రం వేళ కొబ్బరి చెట్టు కింద మంచం మీద పడుకొని
ఇంకే విషయాలూ పట్టించుకునే అవసరం లేని వయసులో రోజుకో నవల చదివేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి.
ఇప్పుడు కంటికెదురుగా ఎన్ని పుస్తకాలున్నా చదివే సమయం లేదు. మీ వల్ల ఇవాళ్ ఇలా తీరుబడి 'నాకొసం' చేసుకున్నాను.
థాంక్ యూ వెరీ మచ్.(continue to make it a novel.)థాంక్ యూ వెరీ మచ్.ఇంతకీ ఇదంతా కధేనా, నిజం కాదా?
chala chala chala chala chala... nachindandi naku mi story. chaduvuthu unte antha kalla mundu kanpinchindndi.. nijanga.. superb andi.. thanks for this and expecting more from u..
బాగుంది.ఏమి ట్విస్ట్‌లు లేకుండా తొందరగా కథని సుకాంతం చేసేసారు.
ammo ammo, naaku teliyakundaa yeppudu printesaaruu deenni... yedo ala choosaanu kaabatti saripoyindi....koththa template vachchaka 'view profile kelli, bogger click chesi , dash board nokkite kaani , nenu follow avuthunna blog vivaraalu teleetledu...samudram..madhyana deevi..oka bhavanam..andulo chilaka praanam laaga anna maata..
story baavudi chala chala... ending kooda...yenta opiko meeku chakkaga varninchaaru places...naaku inta opika iste bagunnu devudu...naaku tuition cheptara madam? roju up and down chesukunta mee ooriki!inka objections lekunda mimmalni guruvarya ani piluchukovachchu kuda!
హాయ్ ఇందు గారు....
మీరు రాసిన ఈ స్టొరీ చదువుతూ వుంటే ఎంతో అందంగం కట్టిన పొదరిల్లు లా వుంది......
చదువుతున్నంతసేపు ఎక్కడో ఊహల్లో తెలిపోయాను....
ముఖ్యంగా మీరు అరకు అందాలూ వర్ణించిన తీరు, నా మనస్సుని కట్టిపడేసింది....
మాలో అరకు వెళ్లి వచ్చిన భావన తెప్పించారు.....
కథ చివరిలో వాళ్ళు ఇద్దరు కలవరు ఏమో అని కాస్త ఖంగారు పడ్డాను...కాని శుభం కార్డు కూడా అద్భుతంగా వేసారు....
మొత్తం కథని మీరు ౩ భాగాలుగా విభజించి... తరువాత ఏమి జరుగుతుందా ఏమి జరుగుతుందా అన్న ఆసక్తి ని మాలో కలిగించారు.....
ఎక్కువ చెప్పాను అని అనుకోకపోతే ....." మీ ఈ కథని చదివిన వాళ్ళు ఎవరైనా ...ప్రేమించని వాళ్ళు వుంటే చటుక్కు మని ప్రేమలో పడిపోతారు అనన్య తో..... " :)
ఇందు గారు బాబోయ్ ఎంత బాగుందో తెల్సా .. నా లాంటి జిడ్డు రైటర్స్ కి మీరే ఆదర్శం ..
షార్ట్ అండ్ స్వీట్ గా ఎక్సలెంట్ గా రాసారు
ఇన్ని రోజులు ఎందుకు చదవలేదా అని ఫీల్ అవుతున్న ..
ఈ రోజు ఆఫీసు లో గొడవ జరిగింది అని నేను పని చెయ్యను అని ధర్నా చేస్తున్న సో మీ పోస్ట్‌లు మొత్తం .. పిడి వేసేస్తున్న .. :)
అప్పుడే అయిపోయిందా అనిపించిందండి..ఇంకా పొడిగించి ఒక పూర్తి నిడివి నవల రాసేయచ్చు..ఓసరి ఆలోచించి చూడండి. నిజంగానే..!
చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగాయి కొన్ని కాలగర్బంలో కలసిపోతే మరి కొన్ని శాశ్వతంగా నిలిచిపోయాయి. కాని అర్జున్ నిరీక్షణ అనే సాగరాన్ని దాటి ప్రేమ అనే దీవిని చేరుకున్నాడు. 3వ ఎపిసోడ్ తో కథ కంచికి మేము ఇంటికి అన్న మాట చాల బాగుంది మీరు రాసింది. thanks to vennela santhakam..:)
ఇందు..సూపర్ కదా..స్టొరీ..!!
తిట్టుకోవడమా...ఎందుకు అల చేస్తాం....
చాలా బాగుంది....మీ తెలుగు...మీ స్టైల్ అఫ్ రైటింగ్..!!
అమ్మాయి ఆలోచించే పద్ధతి...అబ్బాయి రెస్పాన్స్..!! :)
నాకు చాలా నచ్చింది..!!
చాలా బాగా రాసారు ఇందు గారు ... క్లైమాక్స్ బాగా నచ్చింది .... ఎంత బాగుందో క్యూట్ లవ్ స్టొరీ
ఇందు చాలా చక్కగా రాశావు.. ఏవో ఆఫీస్ పనులవల్ల కుదరక నీ బ్లాగు చూడలేదు.. ఈ రోజే చూసాను.. మొత్తం మూడు భాగాలు చదివాను... మనసుని హాయిగా తాకి వెళ్ళే చక్కని ప్రేమ కథ రాశావు.. ఆ కథలో అర్జున్ పాత్రలో నన్ను ఊహించుకుంటూ లీనమయ్యి చదివేశా.. :)... ఈ కథ ఇంకో నాలుగు అయిదు భాగాలున్నా కూడా చాలా బాగుంటుంది.. ఇంకా ఎక్కువ డీటైల్డ్ గా ఉంటె బాగుంటుంది... ఇంకో చక్కని ప్రేమ కథను నీ దెగ్గర నుంచి ఆశిస్తున్నా :)
superb
superb ga undi
so so cute...
ఎంత హాయిగా ఉందో... సూపర్!
<< "ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు కదా!ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండు!" >> అనన్య చేత అనిపించడం బాగుంది. ఇంకా మంచి సీన్ దగ్గర మంచి ఫొటో పెట్టారు. " Will you be mine forever "... కొన్ని ఇంగ్లీష్ లో కూడా బాగుంటాయి...:):)
కథలో ఫీల్ కావాలాంటే పెంచాల్సిందే... తప్పదు.
అనన్య బాధ గాని, అర్జున్ బాధ కాని పూర్తిగా ఎలివేట్ కాలేదు. వాళ్ల బాధని చదివేవాళ్లు కూడా పడాలంటే కథని ఇంకా పెంచాలి. కథను మరి కొంచెం పెంచుంటే ఆ బాధని కూడా ఫీల్ ఐయ్యుండేవాళ్లం.... ఇది గుర్తుంచుకోండి అంతే!
bhale nacchindi Indu.. a cute story.
ఇందు గారూ
భలే నచ్చేసింది నాకు ..ఐ లవ్ థిస్ ..ట్రూలీ..మ్యాడ్లీ..డీప్లీ..:) అందరూ అంటున్నట్టు నవలగా పొడిగించండి. మీ రైటింగ్ స్టైల్ బాగుంది. ఇట్ కాన్ బి అ బ్యుటీఫుల్ లవ్ స్టోరీ.
@కిషన్ గారూ
మీరు అర్జున్ పాత్రలో. ఊహించేసుకున్నారా....అనన్యా ఏమంటుంది మరి:)
@ లత:ధన్యవాదాలు లత గారు!
@ keerthu: Thankyou Keerthu :)
@ satish: మీ అభిమానానికి ధన్యవాదాలు సతీష్ గారు!
@ tolakari.29: మీకు ఇంతగా నా కథ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.మూడు భాగాలు చేస్తేనే చదవలేకపోయారు జనాలు...నవలగా వ్రాస్తే చదువుతారంటారా? ఇది కథేనండీ...నిజం కాదు :)
@ Ushassu: చాలా చాలా థాక్న్స్ మీక్కూడా...నా కథ ఇంతగా నచ్చినందుకు :)
@ రాధిక(నాని ):ఇంకా ట్విస్ట్‌లు పెట్టి హింస పెట్టడం భావ్యం కాదనీ...ముగించేసా రాధికగారూ!
@ Ennela :హ్హహ్హహ్హా! ట్యుషన్ ఫీస్? రోజు నాకు నయగారా జలపాతం చూపించాలి మరి..డీల్ ఓకే నా?
@ RAMAKRISHNA VENTRAPRAGADA: రామకృష్ణ గారు! మీ అభిమానానికి ధన్యవాదాలు.మీరు చెప్పినట్టే ఇక్కడ..రామకృష్ణా అనే ఒక అబ్బాయి..అర్జున్ పాత్రలో తనని తాను ఊహించేసుకున్నాడట...హ్మ్! థాంక్యూ రామక్రిష్ణ గారు..
@ kavya :హ్హహ్హహ్హా! జిడ్డు రైటర్ ఆ? ఏంకాదు! మీరు అందంగా వ్రాస్తారు. అన్నీ చదివేయండీ...నా పోస్టులు..అప్పుడు తెలుస్తుంది...ఎవరు జిడ్డు రైటరో! థాంక్యూ కావ్యగారు! నా కథ నచ్చినందుకు.
@ తృష్ణ :నామీద ఉన్న నమ్మకానికి థాంక్స్ తృష్ణ గారు! కానీ కథ ముగించేసా కదా! ఇప్పుడు ఎలా పొడిగించనూ?? :((
@అశోక్ పాపాయి :మరోసారి మీరు అందమైన కవితలు వ్రాస్తారని నిరూపించుకున్నరు అశోక్ గారూ! థాంక్యూ సోమచ్!
@ kavya :హ్హహ్హహ్హా! జిడ్డు రైటర్ ఆ? ఏంకాదు! మీరు అందంగా వ్రాస్తారు. అన్నీ చదివేయండీ...నా పోస్టులు..అప్పుడు తెలుస్తుంది...ఎవరు జిడ్డు రైటరో! థాంక్యూ కావ్యగారు! నా కథ నచ్చినందుకు.
@ తృష్ణ :నామీద ఉన్న నమ్మకానికి థాంక్స్ తృష్ణ గారు! కానీ కథ ముగించేసా కదా! ఇప్పుడు ఎలా పొడిగించనూ?? :((
@అశోక్ పాపాయి :మరోసారి మీరు అందమైన కవితలు వ్రాస్తారని నిరూపించుకున్నరు అశోక్ గారూ! థాంక్యూ సోమచ్!
@ kiran:థాంక్యు సోమచ్ కిరణ్ :)
@ శివరంజని:థాంక్యూ రంజనిగారు!
@ Kishen Reddy:నేను అలానే వ్రాద్దామనుకునా కిషన్.కానీ అందరు..ముగించేయండీ అంటుంటే..న కథ నచ్చలేదేమోలే అనుకున్నా! కానీ ఇప్పుడే అర్ధమయ్యిందీ...అందరికీ నా కథ నచ్చిందీ..ఇంకా ఎక్కువ భాగాలుంటే బాగుండేదనీ...ట్రై చేస్తా కిషన్.థాంక్యూ సోమచ్!
@ srinivas rao: thankyou Srinivas garu :)
@ సవ్వడి :అలాగేనండీ...కానీ చెప్పా కదా! మరీ ఎక్కువైపోతోందేమో అని ఇక ఆపేసా! ఇంకోసారి ఇలా వ్రాసేటప్పుడు మీరు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తా! ధన్యవాదాలు :)
@ Sree : Thankyou Srii :)
@ భాను: థాంక్యూ భానుగారు! మీ అందరూ అలా నవలగా వ్రాయమంటే ఎంత హాపీ గా ఉందో! థాంక్యూ సోమచ్!
అందరూ చదివేసారు, కామెంట్లు పెట్తేసారు, నేనూ సమాధానాలు ఇచ్చేసాను అని గేట్లు మూసెయ్యకండీ... ఇంకా నేను మూడొబాగం చదవలేదు. :(
Chala bagundi... meeku Joharulu..
తృష్ణ గారి కోరిక మీద దీని ఎక్స్టెన్షన్ నేను రాయన :p లవ్ ఎట్ సెకండ్ సైట్ ..
అర్జున్ రెండో గాల్ ఫ్రెండ్ కదా హహహ్హహ్హ .. ఇందు గారి ఇమేజ్ మొత్తం డామేజ్ చేసేస్తా .. నేనసలే విలన్ టైపు .. అబ్బా :)
ఎం ఇందు గారు ..
కావ్య గారు..అమ్మో! మీరు కొంచెం డేంజరస్! చేసినా చేసేయగలరు.కానీ మీ కథలు ఆల్రెడీ చదివాను కాబట్టీ మీరు బానే రాస్తారనుకుంటున్నా! ఏమంటారు?
@ మంచు:ఫర్వాలేదు మంచుగారు...నా బ్లాగ్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి :) మీరు నింపాదిగా చదివి నచ్చితే కామెంటేయండీ..సరేనా!
@ snellens: Thankyou Snellens :)
కథకు ముగింపేమిటండి? అంతా మనం రాసే రాతలో ఉంటుందిగానీ. అయినా ప్రేమ సక్సెస్ అవ్వటం ముగింపు కాదు. మొదలు. అసలు అక్కడ నుంచే అసలు కథ మొదలౌతుంది. కాదంటారా?
ఇందు గారు, చాలా బాగా రాసారండీ.. ఎండింగ్ ఎక్కడ విషాదాంతం చేస్తారేమో అని భయపడ్డాను...చాలా చక్కగా ముగింపు ఇచ్చారు...అమ్మాయి ఫీలింగ్స్, అబ్బాయి ఫీలింగ్స్ చాలా చక్కగా ఆవిష్కరించారు....మూడ్‌ని ఎలివేట్ చేసేలా అంతే చక్కగా ఫోటోలు పెట్టారు...
మరిన్ని మంచి కథలు రాస్తారని ఆశిస్తున్నాను...
Indu Garu Meeru chala simple ga rasarandi enta simple ante , Konchem
atruta, Konifeelings, konchem entetainment..ila chala list vastudandi...Mee story to Real love ki Life Nichcharu..,mee kada chadutuunte nenukuda evari no okarini eelane love cheyyalanu undi
nice story
help!!!!halp!!!!!help!!!!!help!!!!help!!!!!!
help!!!!!!heelp!!!!!!
Thanks indu gaaru,
last night I read some help topics on how to increase the page width and followed some of the steps in help topic and my blog was completely off.I was so panic and shouted for help....jyoti garu responded and fixed it this morning...thanks to her....
thanks again....
nice story.. .. happy ending chesaru .. :)
@ తృష్ణ :మీరు చెప్పింది నిజమే! ప్రయత్నించి చూస్తాను :)
@snigdha:చాలా థాంక్స్ అండీ...తప్పక మంచి కథలు వ్రాయడానికి ట్రై చేస్తాను :)
@ Rams:హ్హహ్హహ్హా! మీకు ఇలాగే ఎవరినో ఒకరిని లవ్ చేయాలని ఉందా! వావ్! నా కథ మిమ్మల్ని అంత ప్రభావితం చేసింది అంటే నమ్మలేకుండా ఉంది.కానీ నాకు చాలా హాపీ గా ఉంది.ఒక మంచి ప్రేమ కథని వ్రాసి మీ అందరికీ అందించినందుకు....ఆ ప్రేమని మీరందరూ ఫీల్ అయ్యి చదివి స్పందించినందుకు :)
@ sivaprasad: Thanq :)
@ Prasanna: Thanku Prasnnagaaru :)
@ Manchu: ఫర్వాలేదండీ...ఎక్కడైతే ఏంటీ? మీకు కథ నచ్చింది కదా! అది చాలు :)
ఏమిటో ఇందు ఇప్పటికి నాలుగు సార్లు మీ కథ 3 పేజీలు 3టాబ్స్ లో ఓపెన్ చేసి పెట్టుకుని చదవకుండా మూసేసాను. ఇవ్వాళ కూడా కుదరలేదు. రేపు చదివి ఖచ్చితంగా కామెంటుతానేం..
Induuuuuuu Aripinchav gaaaaa narration...
Kekaaaaaaa.
Kavitwatm tho paaatu kadhalu kuda aripistunnav gaaa.
స్మూత్ రీడ్ ఇందుగారు. బాగుంది. అర్జున్ అనన్యలతో పాటు నన్ను కూడా బొర్రాగుహలూ అరకు అంతా తిప్పేశారు.
హమ్మయ్య.. మొత్తానికి మూడు పార్ట్లు చదివేసా ఈరోజు.. బాగా రాసారు ఇందు గారు. నాకు చాలా నచ్చిందండి .. నెక్స్ట్ కధ ఎప్పుడండీ మరి?
Hey indu..chala chala chala chalaaaaaaaaaaaaaaaaaaaaaaaa bagundhi story..ne creativity thelisindheleh naku..really superb ra...
chala baga rasaru..
nenu 3rd part mathrame chadivanu..really nice..
varnana super..
Adbutham!!! Kalla mundu jaruguthunnattu ga undi chadivinantha sepu!!!! EE rachana cinimaallo undali!!!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి