8, డిసెంబర్ 2010, బుధవారం

పర్యావరణం-పరిరక్షణ-సైకిల్

అయ్యో! శీర్షిక చూసి భయపడకండి...నేనేమి 'పర్యావరణం-పరిరక్షణ' మీద క్లాసులు పీకను.కాబట్టి మీరు  సేఫ్ జోన్ లో ఉన్నట్టేhappy...మరెందుకు ఈ టైటిల్ అంటే....మొన్న నెమలీకలగురించి అలా ఆలోచిస్తూ ఉంటే...మా క్లాస్ లో జరిగిన ఒక సంగతి గుర్తొచ్చి భలే నవ్వొచ్చింది...అది  మీకు చెప్పేద్దామని కంకణం కట్టుకున్నా అదన్నమాట సంగతి big grin

నా చిన్నప్పుడు అంటే మరీ చిన్నపుడు కాదులెండి...నా ఏడో క్లాసులో అన్నమాట...ఒకసారి మా సార్ గారు...'ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్' మీద అప్పటికప్పుడు వ్యాసం రాయమన్నారు.నేనసలే వ్యాసరచనల్లో క్వీను tongue ఎప్పుడు మా స్కూల్లో చిల్డ్రన్స్ డే కి పెట్టె టాలెంట్ సర్చ్ లో...వ్యాసరచన పోటిలో నాకు ప్రైజ్ రావాల్సిందేrock on!.అవన్నీ టాపిక్ ముందే తెలుసు కాబట్టి కొంచెం ప్రిపేర్ అయి రాస్తాము..కానీ ఇలా సడన్ గా రాయమంటే? అప్పుడే నా అసలైన టాలెంట్ బైటపడిందిbig grin.సరే ఇక వ్యాసం విషయానికి వస్తే సార్ చెప్పిందే ఆలస్యం పెన్ను-పేపరు తీసుకుని  'జయీభవ!' అనుకుని బరకడం మొదలుపెట్టా..ముందుగా పర్యావరణానికి చెడు చేస్తున్నది వాయు కాలుష్యం అని....దానికి కారణం కర్మాగారాలు...మితిమీరిన వాహనాలు వాటి పొగ అని వ్రాశా.ఆ తరువాత శబ్దకాలుష్యానికి కూడా ఈ వాహనాలు దోహద పడుతున్నాయి అని వ్రాశా.అంతవరకూ బానే ఉంది.ఇక ఇక్కడ నించి మొదలైంది...'అన్నీ వాహనాలు పెట్రోలు లేదా డీజిలు వాడుతున్నాయి.అవి వదిలే హానికారక రసాయనాల వల్లే ఈ కాలుష్యం అంతా.అందుకని అందరూ పెట్రోలు/డీజిలు తో పనిలేని వాహనాలు వాడాలి.కాబట్టి అందరూ సైకిళ్ళు వాడాలిsurprise.సైకిలు వాడితే ఆరోగ్యముతో పాటు...కాలుష్య నివారణ కూడా.ఇంకా అందరూ సైకిళ్ళేవాడడం వల్ల...పెద్ద పెద్ద ఆక్సిడెంట్లు కూడా అవ్వవు...అందువలన మనుషులందరూ హాయిగా ఉంటారు.ట్రాఫిక్ జాములు ఉండవు...పార్కింగ్ ప్రాబ్లం ఉండదు...కాబట్టి ఎటువంటి టెన్షన్లు ఉండవు.లైసెన్సులు...హెల్మెట్లు గోలే ఉండదు.పైగా పెట్రోలు కి,డీజిలు కి అయ్యే ఖర్చు కూడా మిగులుతుంది.అందువల్ల దేశ ఆర్ధిక పరిస్థితి కూడా బాగుపడుతుంది. చిన్నగా మోగే బెల్లు తప్ప భయంకరమైన హారన్లు ఉండవు....ఇంకా వాహనాల రోద కూడా లేదు కాబట్టి శబ్ద కాలుష్యం ఉండదు.దగ్గర ఊళ్ళకి బస్సులు వాడుకోవచ్చు.మరీ దూరప్రయాణాలకు రైళ్ళు ఎటూ ఉన్నాయి.కుటుంబం అంతా వెళ్ళడానికి సైకిల్ కి అప్ గ్రేడ్ వర్షన్ 'రిక్షా' ఉంది. ఇక ఏమర్జెంసిలకి అంతగా కావాలంటే చిన్న చిన్నవ్యాన్లు అడపాదడపా  వాడుకోవచ్చు.కాబట్టి దేశం లో అందరూ హాయిగా స్కూటర్లు,బైక్లు,కార్లు పక్కన పడేసి సైకిళ్ళు వాడడం ఉత్తమం.ఇటు వాయు కాలుష్యం....అటు శబ్ద కాలుష్యం రెండూ తగ్గిపోతాయ్.ఆరోగ్యము..ఆర్ధిక పరిస్తితి మెరుగు పడుతుంది.అందువల్ల సైకిల్ యే పర్యావరణ పరిరక్షణకు...మానవాళి ప్రగతికి నేను సూచించే పరిష్కారం'...అని వ్రాశాapplause.అదేంటో మరి అలా రాసేస! day dreaming

ఇక మా సార్ మా దగ్గర పేపర్లు కలెక్ట్ చేసుకుని అవి చదివి వాటిల్లో బాగున్నవి ఒక పక్క,బాగోలేనివి ఒక పక్క పెట్టారు.నేను నాది యే పక్క ఉందా...అని తెగ టెన్షన్ పడ్డాnail biting.కాని ఒక పేపర్ చదివి అది చేత్తో పట్టుకుని మిగితా పేపర్లు సార్ట్ చేసారు.'ఆ పేపర్ ఎవరిదో! చేత్తో పట్టుకుని ఉన్నారు అంటే..అంత ఘోరంగా వ్రాసారేమో' అని ఒక నవ్వు నవ్వుకున్నాhee hee....చివరికి బాగా వ్రాసిన వాణి,కవిత,మహేశ్వరీ పేపర్లు పైకి చదివి వినిపించారు.నాది చదవనందుకు ఫీల్ అయ్యా broken heart తరువాత....'ఇక్కడ ఒక విచిత్రమైన పరిష్కారం సూచించింది మన ఇందు.చూద్దామా?' అని ఆ చేత్తో పట్టుకున్న పేపర్ చదవడం మొదలుపెట్టారు. అందరికీ ముందు ఏమి అర్ధం కాలేదు..కాసేపు అయ్యాక నవ్వడం మొదలుపెట్టారు....చదవడం పూర్తయ్యాక మా సార్ అన్నారు...'చాలా సింపుల్ గా తేల్చావు ఇందు.idea.ఇంతమంది ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా తెలియని విషయం నువ్వు భలే కనిపెట్టావే..ఆహా! ఒక్క సైకిల్ తో ఇంత మార్పా?' అన్నారు.

ఇప్పటికీ అర్ధం కాదు...ఆయన పొగిడారో...తిట్టారో...కాని నాకు మాత్రం నేను రాసిన ఆ వ్యాసం గుర్తొచ్చినప్పుడల్లా భలే నవ్వొస్తుంది...ఈ సైకిల్ పిచ్చేంటో నాకు blushing

24 కామెంట్‌లు:

మంచు చెప్పారు...

అది కచ్చితం గా పొగడ్తే... మన ఇండియాలొ ఐ ఐ టి లాంటి విద్యాసంస్తలు, ఇంఫొసిస్ లాంటి ఎం ఎన్ సీ లలొ చూసినా...ఇక్కడ సిలికాన్ వ్యాలిలొ చూసినా.... అందరూ సూచించే మార్గం ఇదే...సైకిల్ వాడమని... కాలిఫొర్నియాలొ చలి కాస్త తక్కువ కాబట్టి ఇక్కడ సైకిల్ వాడకం ఎక్కువ.... సైకిల్ పెట్టుకొవడానికి బస్సుల్లొ, రైళ్ళలొ ప్లేస్ కూడా ఉంటుంది ఇంచక్కా....

-------------

అయితే అంత మంచి సైకిల్ కి కూడా ఒక చెడ్డ గుణం ఉంది.... అది తొక్కితే ఆయాసం తెప్పిస్తుంది. :-)))))

కొత్త పాళీ చెప్పారు...

ఇందుగారు మీరు భలే స్పెషల్ మనిషండి. అసలు ఆ రోజుల్లోనె సైకిలు గొప్పతనం గుర్తుపట్టినందుకు మీకు భారత ప్రభుత్వం కనీసం భారత రత్న ఇచ్చెయ్యాలండి.

మరే, మరే, పైన వ్యాఖ్యలో మంచు మిమ్మల్ని అక్కా అన్నాడండి!

భాను చెప్పారు...

కాలుష్యానికి మీరు సూచించిన పరిష్కారం బాగుంది. కాని మీరు ఆయాసపడుతూ తొక్కిన ఆ సైకిల్ వ్యాసానికి బహుమతి వచ్చిందా లేక ఓన్లీ ప్రశంశలేన?

అశోక్ పాపాయి చెప్పారు...

చివరికి మాష్టారు గారు మిమ్మల్ని పోగిడారు లెండి. మేము కూడ మిమ్మల్ని పోగుడుతూ మీకు చప్పట్లు.

మంచు చెప్పారు...

హ హ హ కొత్తపాళీ గారు..LOLLL.. ముందు నాకు అర్ధం కాలేదు....
ఇందూ గారూ...... అది " ఎంచక్కా " అండీ.... " ఇందక్కా " కాదండీ.... promise

రాధిక(నాని ) చెప్పారు...

అబ్బో ఆరోజుల్లోనే మీ టేలంట్అంతా చూపించే వారనమాట.బల్ల గుద్ది మరీ చెపుతున్నా మిమ్మల్ని పోగిడేరని..:)))

kiran చెప్పారు...

aaahaaa..em idea andi indu garu..keka..kevvu..mee sir lage nenu kuda paogada kunda undaleka potunna...meeru rasindi chala ella kindata..kani ippudu meeru rasina prathi aksharam correct.entha dummu..entha...sound lu..baboi...

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మీ సార్ ఏ ఉద్దేశ్యంతో అన్నారో కానీ మీరు రాసినది మాత్రం కొట్టేయలేని విషయాలు ఇందుగారు. పర్యావరణం ప్లస్ ఆరోగ్యరీత్యాకూడా సైకిలే బెస్ట్.

ఇందు చెప్పారు...

@మంచు:హ్మ్! ధన్యావాదాలు మంచు గారు. ఆయాసం వచ్చినా ఆరోగ్యం కదండీ...సైకిల్ నా ఫేవరెట్ అందుకే!! :)


@ కొత్త పాళీ:మీరు మరీ పొగిడేస్తున్నారు కొత్తపాళీ గారు :p ఏదో సైకిల్ మీద నా ప్రేమ అల రాయించింది నా చేత. ఇక మంచుగారు నన్ను 'అక్క' అనలేదండీ..అయినా వారు వివరణ ఇచ్చారనుకోండీ..కానీ మీరు ఈ చురక నాకు ఎందుకు వేసారొ తెలుసు.అప్పుడొకసారి 'ఆత్రేయ' గారు నన్ను 'ఇందక్క' అంటే,..నేను వారిని 'ఆత్రెయ బాబయ్' అన్నా అనే కదా! వారు సరదాగా అన్నారు కదా అని నేను సరదాగా అన్నా! కానీ వారు అది కొంచెం సీరియస్ గా తీసుకున్నట్టు ఉన్నారు..ఇందులో ఉద్దేస పూర్వకంగా ఏమీ చేయలేదని మనవి :) అయినా ఎవరేమంటే నాకెందుకండీ మనం మంచిగా ఉంటే మనజోలికి ఎవరూ రారు అని నమ్ముతాను.అంతే.

ఇందు చెప్పారు...

@ భాను :అవునండీ...ఏదో క్లాస్ రూంలో వ్రాసిన కాలక్షేప వ్యాసానికి అంతేగా మరి ఇచ్చేది!!

@అశోక్ పాపాయి :ధన్యవాదాలు అశోక్ గారు.వారు అప్పుడు పొగిడినా నాకు ఇపుడు నేను వ్రాసినదానికి నవ్వొస్తోంది.ఒకటే విషయం పట్టుకుని మొత్తం వ్యసం రాసేసినందుకు...:))

@ మంచు :అయ్యొ! మంచుగారు...మీరు అంత వివరణ ఇవ్వక్కర్లేదండీ..నేను ఆమాత్రం అర్ధం చేసుకోగలను :)

@ రాధిక(నాని ):నామొహం టాలేంటు లేండీ..అన్ని తెలివితేటలే ఉంటే ఇలా ఎందుకు ఉంటా? మీరు బల్లగుద్ది మరీ నన్ను సపోర్ట్ చేసినందుకు థాంకూలు :)

@ kiran:ఎంటో కిరణ్ అంతా మీ అభిమానం. అందరూ పొగిడేసి..పొగిడేసి..నన్ను మునగచెట్టు ఎక్కించేసారు..నేనేమో దిగలేకపోతున్నా :p మీరు అనంది నిజమే..ఇప్పుడు చాల పొల్యుట్ అయిపోయింది వాతావరణం.

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. ఇందు గారు, భలే ఉంది మీ సైకిల్ వ్యాసం. నాకైతే ఎందుకో అప్రయత్నంగా "అశోకుడు చెట్లు నాటించెను బావులు తవ్వించెను.." గుర్తొచ్చింది. "ఎందుకు..?" లాంటి క్లిష్టమైన ప్రశ్నలు అడగొద్దు ప్లీజ్..;)
కామెడీ పక్కన పెడితే మీకు నా తరపున చప్పట్లు. అంత చిన్నప్పుడే ఇంత మంచి విషయాన్ని చాలా చక్కగా ఆలోచించగలిగి, దాన్ని పేపర్ మీద పెట్టినందుకు..:)

కొత్త పాళీ గారు,
>>మరే, మరే, పైన వ్యాఖ్యలో మంచు మిమ్మల్ని అక్కా అన్నాడండి!
ఇది చూసి భలే నవ్వుకున్నాను..:)))

నీహారిక చెప్పారు...

ఇందు గారు,
సైకిల్ అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా సైకిల్ నేర్చుకుంటాను అని మా నాన్నని అడిగితే మగపిల్లల్లాగా సైకిలేమిటి అని నాకు సైకిల్ కొనివ్వలేదు. ఆ సైకిల్ కోరిక అలాగే ఉండిపోయింది. పెళ్ళైన తరువాత పట్టుబట్టి స్కూటీ కొని నేర్చుకున్నాను. కానీ సైకిల్ తొక్కలేదన్న బాధ అలానే ఉండిపోయింది. బాగా రాసారు.

అజ్ఞాత చెప్పారు...

బావుంది పిన్నీ ( అంటే...అక్కా అంటే మీకు నచ్చదని , కొత్త వరస ట్రై చేసా)

కొత్త పాళీ చెప్పారు...

@ ఇందు, మంచు .. చురక కాదు, సరదాగానే :)

ఇందు చెప్పారు...

@వేణూ శ్రీకాంత్:థాంక్యూ వేణు.. :)

@ మనసు పలికే :నా పోస్ట్ నచ్చినదుకు ధన్యవాదాలు అపర్ణగారు...'అశోకుడు చెట్లు నాటించెనూ గుర్తొచ్చిందా? ఇంకా రాజమౌళి గారి 'మర్యాద రామన్నా సైకిల్ గుర్తొచ్చుంటుందేమో అనుకున్నా

కొత్తపాళి గరి వ్యఖ్య చూసి నాకు భలె నవ్వొచ్చిందండీ..చిన్నపిల్లాడు టీచర్ కి కంప్లైంట్ చెసినట్టు చెప్పారు :))

@ నీహారిక:అయ్యో! మీరు సైకిల్ తొక్కలేదా? భలే ఉంటుందిగా సైకిల్...పోన్లేండీ స్కూటీ అయినా నడిపారు కదా! నా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు :)

ఇందు చెప్పారు...

@ లలిత:లలితగారు...ఈ విషయాన్ని నేను ఎంత లాగకూడదు అనుకుంటే అంతగా వివరణలు ఇవ్వాల్సివస్తోంది...నాకు సాధరణంగా ఎవరినిపడితే వారిని వరసలు పెట్టి పిలవడం ఇష్టం ఉండదు అండీ..అది పిన్ని అయినా,అక్క అయినా....అందరినీ పేరు పెట్టి పిలిస్తే హాయికదా! ఎందుకు ఈ వరసలు..గొలలు...?? అయినా ఇక ఈ ఇషయాన్ని మీ విఙ్గ్నతకే వదిలేస్తున్నా..మీ ఇష్టం

@కొత్త పాళీ:సంతోషం :)

హరే కృష్ణ చెప్పారు...

అసలు ఏమి ప్రిపేర్ అవ్వకుండానే ఇంత రాసేసారంటే ఇంకెవరైనా హింట్ ఇస్తే ప్రైజ్ లన్నీ పట్టుకోచ్చేసేలా ఉన్నారే..

ఎవరిని పొగిడారంటే
ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో వాళ్లనే పొగిడినట్టు..మీది
consolation ప్రైజ్ అని ఏమో అని నా డవుట్..:)

Siri చెప్పారు...

నేను ఇప్పుడు కూడ సైకిలే వాడతాను. నేను వుండేది ఈ అమెరికాలోనో అనుకునేరు చెన్నై లో.

శివరంజని చెప్పారు...

హహహాహ ఇందు గారు సూపర్ రాసారు ... అసలు మీకిచ్చిన కి మీరు రాసిన వ్యాసానికి నవ్వలేక సచ్చాను అనుకోండి ... ఇంత మంచి పొస్ట్ ఇంత లేట్ గా చూసనేంటబ్బా

Nagamani చెప్పారు...

mee post chadivi naaku bhale navvochindi ;)
mari inthaki cycle vadutunnara? leda?

ఇందు చెప్పారు...

@ హరే కృష్ణ:అంతేనంటారా? సరే అలాగే సరిపెట్టుకుంటా :((

@ స్నేహ :వావ్ గుడ్ అండీ.... :)

@ శివరంజని :హ్మ్! కదా..ఆయన ఒకటి రాయమంటే...నేను సైకిల్ గురించి ఓ! తెగ రాసేసా! ఒక్కొసారి అంతేనండీ ఇలా మా టపాలు ఎవరూ చదవకుండా మూలనపడుతుంటాయ్ :(

@ Nagamani:ధన్యవాదాలు నాగమణిగారు.లేదండీ...ఇప్పుడు నేను ఇంటిభార్యని కదా!(అదే హౌజ్ వైఫ్) కాబట్టీ..నాకు సైకిలు,కారు,స్కూటరు ఏమీ అక్కర్లేదు :))

Ennela చెప్పారు...

indu garu,
ammo ammo entha goppa thought...adi kuda 7va taragatilo.....mechchukolenandee..
khachchitam ga....antha clearga telustuntenu..... ponee ooroo peru icheyyandi.... panthulu gaarini kanukkuntaanu.. panilo pani inida velle korika teeripotundi naaku.....yemanukokandey oka ticket meedi..oka tcket naadi..ok?

Cute Indian చెప్పారు...

Hi indu,

Aripinchav gaaaa Cycle vyasaam...

Ika master comments ki vaste adi nirmohamatamgaaaa pogadte indu...

Ram Krish Reddy Kotla చెప్పారు...

Jai cycle :). Adi thokkithe arogyaniki arogyam (manchi fitness).. ullasaniki ullasam (ala thokkuthoo velthunte enta hayiga untundo)plus meeru chepinatlu kalushya nivarana :)