3, జనవరి 2011, సోమవారం

నిద్రమత్తులో ఎన్నో ఉషోదయాలు...

నాకు ఒక తీరని కల ఉంది.దాన్ని నెరవేర్చడం కోసం చాలా ప్రయత్నించా! ప్చ్! లాభం లేదు.అదేమిటంటే....'పొద్దున్నే లేచి...తలస్నానం చేసి....తలకి టవల్ చుట్టుకుని.....పట్టుచీర కట్టుకుని....ఇంత బొట్టు పెట్టుకుని....కాళ్ళకి పసుపు రాసుకుని....తులసి కోట చుట్టు ప్రదక్షిణం చేసి.....ఒక మంచి అన్నమయ్య కీర్తన పాడి[అరె! ఎవరు ఇంత శ్రావ్యంగా పాడుతున్నారు అని చందూ నిద్రలేవాలి అన్నమాట :)) ]....ఇంట్లో దేవుడికి పూజ చేసి ఆ అగరుబత్తి పొగలు ఇల్లంతా వ్యాపించగా....నేను దేవతలగా హారతి పళ్ళెంలో కుంకుమ,ప్రసాదం తీసుకెళ్ళి మా అత్తయ్యకి,మావయ్యకి,చందుకి ఆ ప్రసాదం అందించి......చందూ కాళ్ళకి మొక్కి......ఆశీర్వాదం తీసుకుని ఆ తరువాత అందరికీ కాఫీలు..టిఫినీలు అందించే పనుల హడావిడ్లో పడిపోవాలన్నమాట'......ఇదేంటి? అలా మొహాలు పెట్టారు? ఒక్కసారి మీ సినిమా/సీరియల్ డేటాబేస్ని సరిచేసుకోండి...కొత్తగా పెళ్ళయిన అమ్మాయి.....అత్తగారింటికి రాగానే చేసే పని ఇదే కదా! ఎన్ని సినిమాల్లో చూడలేదు?? కానీ అదేంటో! పెళ్ళయి సంవత్సరమైనా....ఏనాడు నేను అలా చేయలేదు :((  చేయాలనీ మనసులో ఉన్నా....అసలు అలా చేస్తే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలని కుతూహలంగా ఉన్నా...మనం నిద్రలేచే కనిష్ట సమయం ఎనిమిదిన్నర.గరిష్టం....ఇక మనిష్టం :)) హ్మ్!నేను లేచేసరికి......చందూ తను కాఫీ తాగి నాకు పెట్టేస్తాడు.ఇక ఏదో హడావిడిగా టిఫిన్ చేసేసి చందూ మొహాన పడేసి నేను దర్జాగా లాప్టాప్లో మెయిల్స్ చూస్తా అన్నమాట!


ఇవాళ పొద్దున ఏడున్నరకి లేచి....అప్పటికే నిద్రలేచిన చందూని టైం ఎంతా అని అడిగి....అబ్బే ఇది నా టైం కాదు అని ఎనిమిదిన్నర దాకా పడుకున్న ఘనురాల్ని....ఏంచేద్దాం! అసలు నాకు ఈ నిద్ర దేవత ఎలా ఆవహించిందా అని ఆలోచిస్తే...చిన్నప్పటినించి మనకి ఈ జాడ్యం ఉన్నట్టు పరిశీలనలో తేలింది.చిన్నప్పుడు మా ఇంటి గేట్ ఎదురుగానే స్కూల్ గేట్.ఇలా మా ఇంట్లోనించి సరాసరి నాలుగు అడుగుల్లో స్కూల్లో ఉంటా....అయినా కూడా రోజు లేటుగా వెళ్లి మా ఇంటిముందే స్కూల్ గేట్ దగ్గర నిల్చున్డేదాన్ని.మా అమ్మ పొద్దున్నే లేపితే విసుక్కుంటూ లేచి పక్క  మంచం మీదకి వెళ్లి పడుకునేదాన్ని.మా నాన్న 'పూజకి పూలు తీసుకురామ్మా' అంటే....మొహం కూడా కడుక్కోకుండా....ఏదో నిద్రమత్తులో నాలుగు పూలు....కొమ్మలు....మొగ్గలుతో సహా తెంపుకొని తీసుకొచ్చి మా నాన్నకి ఇచ్చి పడుకునేదాన్ని.ఈ షార్ట్ గేప్ లో పేపర్ కూడా చదివేసేదాన్ని.ఇక మా పనమ్మాయి వచ్చి....'పాపాయ్! నిద్రలేమ్మ! నేను ఇల్లు చిమ్మాలి!' అంటే విసుక్కుంటూనే దుప్పటితో సహా లేచి అలాగే హల్లోకోచ్చి దివాన్ కాట్ మీద పడుకునేదాన్ని.అప్పటికే మా అమ్మ శతధా...సహస్రధా ప్రయత్నించింది నా నిద్రదయ్యాన్ని వదలగోట్టడానికి....అబ్బే! మనం మామూలు దయ్యాలం కాదుగా! :)))

ఇక కాలేజికి వెళ్ళేటప్పుడు....ఏడింటికి బస్ స్టాప్లో ఉండాలి.అందుకని నేను చచ్చినట్టు ఆరింటికి లేవాలి.నేను ఆరింటికి లేచి.....రెడీ అయ్యి....బస్సెక్కి....హాయిగా తోమ్మిదిన్నరవరకు బస్సులో నిద్రపోయేదాన్ని :) హాస్టల్లో ఉన్నప్పుడు కూడా....పొద్దున్నే వీచే చల్లగాలికి అలాగే ముడుక్కుని పడుకునేదాన్ని.అప్పుడు ఎంత హాయిగా ఉండేదో!ఎక్జాంస్ అప్పుడు తెల్లవారఝామున లేవాలంటే చాలా బద్ధకం.కానీ మనం ఏదో పరీక్షల ముందు చదివి ముక్కున పెట్టుకుని  రాసి పాసయ్యే టైప్ కదా! చచ్చినట్టు చదవాల్సొచ్చేది.అప్పుడు మాత్రమె నేను సూర్యోదయాలు చూసేదాన్ని.ఆఖరికి రైళ్ళు....బస్సుల్లో కూడా నా నిద్ర టైమింగ్స్ మారేవి కావు :)) నేను ఒకసారి హైదరాబాద్ బస్సులో నిద్రపోతు తప్పిపోయా కూడా! ఏదో మా బాబాయ్ బస్సు వెంట పరిగెత్తి.....బస్సుని కొట్టి కొట్టి ఆపకపోతే మీకు నా వెన్నెలసంతకం చదివే భాగ్యం ఉండేది కాదు :)) ఇలా నా నిద్ర నాతో పాటే పెరిగి పెద్దయింది :) ఆఖరికి విప్రోకి వెళ్ళేటప్పుడు కూడా.....రోజు ఎనిమిదింటికి లేచి అరగంటలో రెడీ అయ్యి.... తొమ్మిదింబావుకి ఠంచనుగా ఆఫీస్ లో ఉండేదాన్ని.ఈ క్రెడిట్ అంతా మా చందుకే :) అలా మూడు పీడకలలు....ఆరు తీపికలలుగా నా నిద్ర సాగుతూ వచ్చింది.

'సరే! పెళ్ళయ్యాక రోజు ఎవడు చేస్తాడు? చచ్చినట్టు ఇదే లేవాలి...పనులన్నీ ఇదే చేసుకోవాలి' అని రోజు నాకు శాపం పెట్టి వదిలేసేది మా అమ్మ.పెళ్లయింది.మా అమ్మ కల అడ్డం తిరిగింది.నా కలలు మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయ్! చందూ ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా నన్ను లేపిన పాపాన పోలేదు.ఎప్పుడు నాకు మెలుకువ వస్తే...అప్పుడు గుడ్మార్నింగ్ చెప్పే టైప్ అన్నమాట! కొంచెం లేటైతే కాఫీ పెట్టేసుకుంటాడు....ఇంకొంచెం లేట్ ఐతే తనే టిఫిన్ చేసేస్తాడు......మరీ లేట్ ఐతే...టిఫిన్ తినేసి నా టిఫిన్ ఒక పక్కన పెట్టేసి ఆఫీస్ కి చెక్కేస్తాడు......ఒకవేళ ఇంట్లోనే ఉంటే ఇంకా పండగ....తనే లంచ్ కూడా చేసేస్తాడు.నేను మధ్యాహ్నం లేచినా నో టెన్షన్.నేను ఒకసారి మధ్యాహ్నం రెండింటికి లేచా! తెల్సా!! మా అమ్మ నన్ను చూసి అంటుంది.....'ఏం అదృష్టమే నీది!' అని.కానీ నాకు ఇది ఇష్టం లేదు కదా! నా కల పైన చెప్పినట్టు జరగాలని.కానీ ఇది రివర్స్ కదా! ఇప్పుడెలా! నా కల నెరవేరేది ఎలా?

నా నిద్రమత్తులో ఎన్నో సూర్యోదయాలు వెళ్ళిపోయాయి.ఒక్కసారన్నా తెలతెలవారుతున్న ఆకాశాన్ని,సూర్యుడిని చూడాలని ఆశ! కానీ అదేదో పుష్కరానికి ఒకసారి జరిగే పండగలాగా అన్నమాట :)) హ్మ్! నా అగరుబత్తిల కల....సూర్యోదయాల కల ఇక కలలోనే చూసుకోవాలి.ఇలలో కుదరదేమో!

దేవుడా! మంచి దేవుడా!
పోవడానికి నిద్ర ఇచ్చావ్!
కనడానికి కల ఇచ్చావ్!
నిద్ర లేపకుండా ఉండటానికి చందుని ఇచ్చావ్!
కానీ ఎందుకు దేవుడా! నాకు ఇష్టమైన కలలు నెరవేరకుండా చేసావ్??
నువ్వు నా కలలు నేరవేరుస్తావ్!
నాకు తెలుసు.....
ఎందుకంటే....బేసికల్లి.....యు ఆర్  గాడ్! వెరీ గుడ్ గాడ్!
అంతే!

56 కామెంట్‌లు:

sivaprasad చెప్పారు...

good one, mi korika twarlo tirali

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ భలే రాశారండీ.. తెలుగు సినిమాలు చూసీ చూసీ నేను కూడా పెళ్ళి అనుకోగానే ఇలాంటి కలలే కనేవాడ్ని కొన్నేళ్ళ క్రితం వరకూ :-) ముఖ్యంగా పండగరోజుల్లో ఇలా మా ఆవిడ తలకి టవల్ చుట్టుకుని హడావిడిగా అటు ఇటు తిరుగుతుంటే నేనేమో పంచెకట్టుతో గుమ్మానికి మావిడి తోరణాలు కడుతూ..ఇలా ఉండేదనమాట హ హ :-)

ఉదయాన్న అంచెలంచెలుగా మీరు నిద్రపోయే ప్లేసులు మార్చటం చూస్తే మా చెల్లాయ్ గుర్తొచ్చింది చిన్నపుడు తనుకూడా అంతే :-) హ్మ్ మొత్తానికి చందుగారు టూగుడ్ అనమాట :-) మీకల త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాను.

కొత్త పాళీ చెప్పారు...

ఏంటి నిన్న జెమినిలో నువ్వునాకు నచ్చావ్ సినిమాచూశారా? :)

voleti చెప్పారు...

Thanks for changing the logo of your profile,

రాజ్ కుమార్ చెప్పారు...

.మనం నిద్రలేచే కనిష్ట సమయం ఎనిమిదిన్నర.గరిష్టం....ఇక మనిష్టం :))
keka...
సూపర్ గా రాసారండి..
ఏది ఏమైనా, పొద్దు పొద్దున్నే బస్సు ప్రయాణాల్లో నిద్ర బాగ పడుతుందండీ.:) :)

ఇందు చెప్పారు...

థాంక్స్ శివగారు :)

@ వేణూ శ్రీకాంత్ :ఆహా! మీరు నాలాగేనా! బాగుంది బాగుంది :)) అవునండీ...ఒక్కరూ ఒక్కచోట నన్ను ప్రసాంతంగా పడుకోనివ్వరే! హ్మ్! ఏచేస్తాం :) అవునూ చందూ టూ గుడ్...కాబట్టే నేనిలా బాడ్ అయిపోతున్నా :P

@ కొత్త పాళీ :అబ్బే కాదండీ....నిన్న టీవిలో ఆ సినిమా వస్తోందని తెలుసు కానీ 'షూటర్' అనే మంచి ఇంగ్లీష్ సినిమా చూసా :) అయినా నాకు ఈ డైలాగులు కంఠతా వచ్చు.అన్నిసార్లు చూసా ఆ సినిమా :))

ఇందు చెప్పారు...

@ voleti : :)

@వేణూరాం:అవును...అదీ కిటికీ పక్కన కూర్చుంటే హాయేహాయి :) Thnaq వేణూరాం.

విరిబోణి చెప్పారు...

హాయ్ ఇందు గారు,
బలే చెప్పారు , నా పెళ్ళికి ముందు నేను అలానే నిద్ర పోయేదాన్ని . కాని నా పెళ్లి తర్వాత మీరు కన్న కలని (అంటే నేను అలానే కల కనేదాన్నిపెళ్లి అయ్యాక నేను బాగా poojalu చేయాలనీ )
నేను సాకారం చేస్తున్నాను , నన్ను చూచి మా వారు, అత్త ,మామలు తెగ మురిసి పోతారు :)
కాని అలా చేయడం లో చాల తృప్తి వుంటుంది అండి..
తప్పకుండా future లో మీ కల నిజం అవ్వాలని కోరుకుంటున్నా :)

Unknown చెప్పారు...

ఇందు గారు .... మీరు మరీనండి ..

మీరు పాత సినిమా హీరోయిన్ లాగ ఆలోచిస్తున్నారు :) .. మాడ్రన్ అమ్మాయిలూ .. అలా ఉండరు ..

మీరు చేసేదే కరెక్ట్ రెచ్చిపోండి అంతే :)

Ennela చెప్పారు...

ఇందు గారు, ..మీకు అంత కోరిగ్గా ఉంటే ఇండియా లో మా ఇంటి అడ్రెస్స్ ఇస్తాను... ఒక వారం ఉండి రండి...

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

నేను ఒక్కోసారి ఇందు గారి లాగా, ఒక్కోసారి విరిబోణి గారి లాగాను అన్నమాట. కాబట్టి నాకు రెండు కోరికలూ తీరాయి. అంటే నాకు అంత నిద్ర రాదు లెండి.
విరిబోణి గారు, మీరు వ్యాఖ్యల్ని ఎనేబుల్ చేయలేదు. ఒక్కసారి మీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి వ్యాఖ్యలు లేదా కామెంట్స్ అన్న చోట కి వెళ్ళి పరిశీలించండి.

శివరంజని చెప్పారు...

ఇందుగారు ఆ మొదటి పేరా రాశారు చూడు సూపర్ ... అస్సలు నిద్రగురించి రాశారు చూసారు ...మీరు తెగ నచ్చేసారు ...మీ బ్రెడ్ కి ఫాన్ కాకపోయినా నిద్రకి మాత్రం నేను మీ పార్టీనే

లత చెప్పారు...

భలే రాశారండీ
నాకూ పొద్దున్నే లేవడం అంటే అసలు పడదు.ఎంత సేపైనా రాత్రే చదివెదాన్ని.
చందూ గారు చాలా గుడ్ అన్నమాట.
కంగారు పడకండి మీ కోరిక తీరుతుంది.ఓ చిన్న పాపాయి వస్తే అప్పుడు ఎటూ పొద్దున్నే లేవక తప్పదు
అప్పటిదాక ఎంజాయ్ యువర్ సెల్ఫ్

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. ఇందు గారు, మీ టపా చదివి నేను ఎంతగా నవ్వుకున్నానో, నాకూ ఆ మంచి భగవంతుడికే తెలుసు మరి..:)))
సు....పర్ టపా.. మీ అదృష్టాన్ని చూసి నాకు కుళ్లుగా ఉందని నేను వేరేగా చెప్పాలా.!! ఏదేమైనా మీ కల త్వరలోనే నెరవేరాలనీ (కనీసం ఈ కొత్త సంవత్సరంలో అయినా) మనస్పూర్తిగా కోరేసుకుంటున్నాను.

నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

హహ్హహ్హ బాగుందండి . హేమి కోరికండి బాబు! మొదటికోరికఅసలు తీరదేమోనండి?రెండో కోరిక తీరేకోరికే! ట్రై చేయండి..చందూ ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా నన్ను లేపిన పాపాన పోలేదు.ఎప్పుడు నాకు మెలుకువ వస్తే...అప్పుడు గుడ్మార్నింగ్ చెప్పే టైప్ అన్నమాట! కొంచెం లేటైతే కాఫీ పెట్టేసుకుంటాడు....ఇంకొంచెం లేట్ ఐతే తనే టిఫిన్ చేసేస్తాడు......మరీ లేట్ ఐతే...టిఫిన్ తినేసి నా టిఫిన్ ఒక పక్కన పెట్టేసి ఆఫీస్ కి చెక్కేస్తాడు......ఒకవేళ ఇంట్లోనే ఉంటే ఇంకా పండగ....తనే లంచ్ కూడా చేసేస్తాడు.నేను మధ్యాహ్నం లేచినా నో టెన్షన్..
మీ చెందు ఎంతమంచి వారండి!:)))

ఆ.సౌమ్య చెప్పారు...

ఇందు ఏమిటో నాకు నాకథ చదువుకున్నట్టు ఉంది...నా జీవితలో ప్రతీ సీనూ అలా కళ్ళముందు కదిలింది...నాకూ నీలాంటి అదృష్టమే...కానీ నీలాంటి కోరిక లేదులే...నేనెప్పుడూ పడుకుంటూనే ఉంటా...అదే నా జీవిత పరమార్థం.

నిద్రో రక్షతి రక్షితః
నిద్రస్య సుఖం ప్రాప్తం. న నిద్రే నాస్తి జీవితం.

మధురవాణి చెప్పారు...

అంతా బానే ఉంది గానీ, నాదో పెద్ద సందేహం.. ఈ పోస్టంతా మీ గురించి రాసుకున్నారా.. నా గురించి రాశారా అని. :p సేమ్.. డిట్టో డిట్టో.. ఒక్క లైను కూడా మార్చక్కర్లేదు.. :D

kiran చెప్పారు...

woww ...!! ఇందు గారు భలే రాసారండి..అసలు.. :)
నేను మొదటి line నుండి చివరి దాక నవ్వుతూనే ఉన్న... :D
ఎంత అదృష్టం అండి...
నా ఫ్రెండ్స్ చాలా మంది పెల్లిల్లయ్యాక..తొందరగా లేచేస్తున్నారు...మీరు ఇలాంటివి చెప్పేయకండి...కుల్లుకుంటారు..!! :P ..
basically గుడ్ గాడ్ మీకు సాయం చేయాలి అని కోరుకుంటున్న.. :)

ఇందు చెప్పారు...

@ విరిబోణి:ఆహా! నాలాంటివారు(అంటే నాలా ఆలోచించి ఆచరణలో పెట్టేవారు) ఇంకా ఉన్నారన్నమాట :)) వెరీ గుడ్ విరిబోణిగారు....మీరు నకు భలే నచ్చేసారు :)

@ kavya:అంతేనంటావా కావ్యా? కానీ ఇప్పుడు సినిమాల్లో కూడా అంతా అంతే కదా! సేం సెట్టింగ్...పాట...ఇల్లంతా పొగ.....హారతి పళ్లెం...ఏం చెద్దాం మరి?!:P

@ Ennela :ఓహ్! అంటే ఇప్పుడు అక్కడ నాకు ఏం ట్రైనింగ్ ఇస్తారు? పొద్దున్నే ఎలా నిద్ర లేవాలి అనా?? :))

ఇందు చెప్పారు...

@ మందాకిని :ఆహా మందాకినిగారు...మీరు ఇంకా సూపరు! రెండు వెర్షన్లు కలిపి కొడుతున్నారుగా! :))


@ శివరంజని :హ్హహ్హహ్హ! నాకు ఇంకా మీ నిద్ర టపా గుర్తుంది :)) థాంక్స్ కనీసం ఇక్కడైనా కనికరించి నా పార్టెలో జాయిన్ అయ్యారు :)

@ లత:కదా! పొద్దున్నే అస్సలు లేవబుధ్ధి కాదు.ఆ! నేను అదే అనుకుంటా! అప్పుడు ఎవరికోసం లేస్తాం? ఏంటో అందరూ మీలాగ ఆలొచించరేం!మీరు నాకు భలే నచ్చేసారు.మా మంచి లతగారు :)

ఇందు చెప్పారు...

@ మనసు పలికే :హ్హహ్హహ్హ! థాంక్స్ థాంక్స్ అపర్ణగారు! ఆ మంచి భగవంతుడు నాకు కొంచెం నిద్రమత్తు వదలగొట్టాలని కూడా కోరేసుకోండే!! :))


@ radhika :తెలుగు సినిమాల ప్రభావం రాధికగారూ..చూసీ చూసీ...పెళ్ళయ్యక ఇలా చేయాలేమో అనుకునేదాన్ని.హిహిహి.మీరు అలా అనకూడదు రాధిక గారు! 'ఆ గుడ్ గాడ్ మీ కోరిక తీర్చాలి ' అని మీరు కోరుకోవాలి :)) అవును మా చందు గుడ్డు :))

@ kiran:హ్హహ్హహ్హ! మా అమ్మగారు అలాగే ఊహించారు....కాని రివర్స్ అయిందిగా! కుళ్ళంటారా? ఏముందండీ పొద్దున లేస్తేనే సుఖం.హాయిగా ఉంటుంది.నాలాగ ఎనిమిదింటికి కూడా లేవకపోతే ఎలా చెప్పండి?

ఇందు చెప్పారు...

@ ఆ.సౌమ్య:హ్హహ్హహ్హ! ఏం కొటేషనండీ బాబూ! నిద్రో రక్షతి రక్షితః నా? ఆహా! గ్రెట్.గ్రెట్.ఇలాంటి ఎంకరెజ్మెంట్ ఉండాలేగానీ...ఎంతసెపైన నిద్రపోనూ!!

@ మధురవాణి :అవునా! వావ్! ఇడ్లీ-బ్రెడ్ దగ్గర మనం ఏంటీ అయినా ఇక్కడ కలిసిపోయామే! హ్మ్! ఐతే నాలాగ అలొచించగలిగే జీవులు ఈ భూమ్మీద రెందు ఉన్నాయి.ఒకటి కావ్య...రెండు మీరు :))

ఇందు చెప్పారు...

@నీహారిక: నీహారికగారు! నేను బ్లాగ్ మొదలుపెట్టాక మొదటిసారి ఒక కామెంట్ చూసి ఇంత బాధపడడం! అసలు మీరు అలా ఎలా అనగలిగారు? మీకు చెప్పదగినదాన్ని కాకపోవచ్చు....కాని నాకు తెలిసినంతలో భార్యాభర్తల బంధం కేవలం అవసరాలమీద ఆధారపడి ఉండదండీ.భార్య అంటే పనులు చేసి పెట్టి తన అవసరాలన్నీ తీర్చే యంత్రం కాదు అని చందు అభిప్రాయం.అలాగే భర్త అంటే లక్షలు సంపాదించి ఎప్పుడంటే అప్పుడు డబ్బులు గుంజుకునే ఏటీయం కాదు అని నా అభిప్రాయం.మేము ఇద్దరం అవసరాల కోసం పెళ్ళి చేసుకోలేదు.దృఢమైన బంధం ఏర్పడాలని చేసుకున్నాం.అది మా మధ్య ఉంది.ఎప్పుడూ ఉంటుంది.దయచేసి ఇలాంటి కామెంట్లు ఇంకెప్పుడు నా బ్లాగ్లో చేయవద్దు.నా బ్లాగ్ నచ్చకపోతే చదవకండి.కామెంట్లు వ్రాయకండి.వదిలేయండి.అంతే! ధన్యవాదాలు.

జ్యోతి చెప్పారు...

ఇందు ,ఒకసారి చందు మెయిల్ ఐడి ఇస్తారా??మీ నిద్రసంగతి తేల్చాలి. హన్నా! పెళ్లయ్యాక కూడా ఇంత నిద్రా?? పైగా కలలు.. ఆసలు నాలాటి అత్త దొరకాల్సింది. నిద్రపోయే ఇందును, భరిస్తున్నందుకు చందును ఇద్దరిని సరిచేసేదాన్ని...:)))

krishna చెప్పారు...

చిరు చీకటిలో మీ కోరిక నెరవేరాలంటే సాయంత్రం పూట ట్రై చేసి చూడరాదా అండీ :)

అశోక్ పాపాయి చెప్పారు...

చదువుతున్నంతసేపు చాల హాయిగా ఆనందంగా ఉంది మీ టపా చాల నవ్వించారు

ఇక్కడ ఇంకో విషయం నీహరిక గారు@@@ మీరు అల మాట్లాడడాం చాల తప్పు అసలు మీరు ఏమి మాట్లాడరో మీకే అర్ధం కావలి..ఇలాంటివి మరల జరగకుండా చూడండి ఎందుకంటే ఇది ఎవరికి నచ్చదు. ఒక బ్లాగర్ గా మనం మనకి ఉన్న కళని అందరరికి పంచుతున్నం ఒకరికిఒకరం అభిమానం పొందుతున్నాం.అందరిని ప్రొత్సహించి ఆనందింప చెయ్యలిగాని భాధపెట్టకూడదు మీరు నాకన్నా పెద్ద కావచ్చు మీరు అన్నది మాత్రం అందరు భాద పడవలసి వచ్చింది.

మంచు చెప్పారు...

మీ పొస్ట్ విపరీతం గా నచ్చింది. ఎందుకంటే
మరేమో...
ఎందుకంటే ....
చెప్పేస్తున్నా...
ఈ పొస్ట్లొ మీ నిద్రమత్తుకన్నా... చందు గారి (గొదావరి అబ్బాయిల) మంచితనన్నే ఎక్కువ ఎలివేట్ చేసారు :-D

మీ కోరిక తీరే మార్గం ఒకటుంది. అగర్బత్తి శివరాత్రి మర్నాడు ట్రై చెయ్యండి. ముందు రోజు అసలు నిద్రపోరు కదా అసలు. సొ ఇక లేవడానికి ప్రాబ్లెం ఉండదు.

Ennela చెప్పారు...

ఊహూ..ట్రయినింగులు గట్రా యేమీ ఉండవు..మీరు లేస్తారంతే...యెందుకు అని అడక్కూడదు..అక్కడ ఉంటే ఒక్క పూటలో తెలిసిపోతుంది మరి...అడ్రెస్ ఇచ్చేనా?

నేస్తం చెప్పారు...

ఇందు నిద్ర విషయంలో బోలెడు కుళ్ళు వచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ...కాళ్ళకు దణ్ణం పెట్టడం సీన్ అయితే సంవత్సరానికి 3 టైంస్ మా ఇంట్లో ఉంటుంది ..ఒకటి వరలక్ష్మి వ్రతం,రెండు నా బర్త్ డే ,మూడు మా పెళ్ళి రోజు ...భలే బాగుంటుందిలే అప్పుడు సీన్..ఒకటే నవ్వు వస్తుంది ఇద్దరికీ..(అంటే కాళ్ళకు దణ్ణం పెట్టడం కూడా ఎంజాయ్ చేస్తారా అని అంటే కాదేది సరదాకు అనర్హం అని అన్నమాట నా సమాధానం )

తృష్ణ చెప్పారు...

:) nice..!
రైళ్ళు బస్సులు స్టేషన్ దాటి వెళ్ళిపోవటాలు...మిస్సయిపోవటాలు మొదలైన వాటిల్లో మాకు బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ..మా అన్నయ్య ద్వారా. వాడు బాస్సో రైలో ఎక్కితే ఇల్లు చేరే దాకా అందరికీ టెంషనే. ఇప్పుడు మాత్రం పక్కన వదిన ఉంటుండి కాబట్టి కాస్త ధైర్యం.

ఇంతకీ మీరు గత టపాకి నేను రాసిన వ్యాఖ్య చదవలేదా? మీ సీతాకోకల సంగతి ఓ టపాలో రాసా చూడలేదా?

తృష్ణ చెప్పారు...

ఇప్పుడే చూసా మీవ్యాఖ్య...సరే కంప్లైంట్ వాపస్....అన్నట్టు మీ చందూగారికి దిష్టి తీసేయండి..నాలాంటి వాళ్ళ దిష్టి తగులుతుంది...:)

ramki చెప్పారు...

అమ్మో అమ్మో ..........
ఇదెప్పుడు రాసేసారు.......నేను చూడలేదు.........ఎంత పని జరిగింది........ :(........
అప్పుడే 28 కామెంట్స్ కూడా.......ప్చ్...
కాని మీ ఈ పోస్ట్ చూస్తే నాకు ఒకటే గుర్తుకోచింది ఇందు గారు..........
"అంబికా దర్బారు బత్తి.....
భగవంతునికి......ఇందు గారికి అనుసందానామినది......... అంబికా దర్బారు బత్తి " :)
మీ ఈ కల తొందరలోనే నెరవేరాలని ఆ అంబికా దర్బారు బత్తి కి దండం పెట్టుకుంటాను లెండి.... :)...

సుజాత వేల్పూరి చెప్పారు...

నీకు బ్లాగ్ పోస్టులకి భలే ఐడియాలొస్తున్నాయి ఇందూ! మా ఇంట్లో మా అమ్మ కలలు కూడా నిలువునా అడ్డం తిరిగిపోయాయి.

నాకు ఏడుపు ఎప్పుడొచ్చేదంటే స్కూలు రోజుల్లో ఏప్రిల్ పరీక్షలప్పుడు అంతా హాయిగా వెన్నెల్లో మంచాలేసుకుని నిద్దర్లు పోతుంటేమనం మాత్రం వరండాలో కూచుని చదవాల్సి రావడం. అప్పుడు మాత్రం తెగ నిద్ర వచ్చేసేది. ఇంకోటి నాక్సలు తెల్లవారుజామున లేచి చదవడం ఇష్టం ఉండదు. ఎంత కమ్మని నిద్రలో ఉంటాం టైములో?

కావాలంటే రాత్రి రెండింటివరకూ చదువుతా కానీ తెల్లవారుజామున ప్రైమ్ మినిస్టరొచ్చి లేపినా లేవను.

చందు చెప్పారు...

ఇందు గారు,
అదరగొట్టారు. ఈ బ్లాగు చందు చదవకుంటే ఇలాగే మీ కలలు సాగు, చదివి మిమ్ములను పొద్దునే లేపి మీ కల నెరవేరిస్తే బహు బాగు.
ఐనా, కల బావుంది కదా.. అలాగే కంటిన్యూ ఐపోతే బెటర్. అవన్నీ కలల లోనే బావుంటాయి. నా మాట నమ్మండి

karthik చెప్పారు...

చాలా బాగా రాశారు..
మీ కోరిక తీరాలని కోరుకుంటున్నా.. :) :)

కార్తీక్

కృష్ణప్రియ చెప్పారు...

ఇందు గారూ, :)) మీ కల నచ్చింది. కృష్ణ గారి ఐడియా బాగుంది. అలా ఎడ్జస్ట్ అయిపోండి ఈసారికి..
లేదా.. మంచు గారు చెప్పినట్టు.. శివరాత్రి నాడు ట్రై చేయవచ్చు..

నేస్తం చెప్పారు...

>>>మనం నిద్రలేచే కనిష్ట సమయం ఎనిమిదిన్నర.గరిష్టం....ఇక మనిష్టం
>>మా అమ్మ కల అడ్డం తిరిగింది.నా కలలు మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయ్
కొన్ని చమక్కులు చాలా బాగా రాసావు ఇందు .. :)
నేరేషన్ అదిరిపోతుంది ఈ మధ్య మీది
సుజాత గారు అందరికీ ఇదే పెద్ద ప్రోబ్లెం తెల్లవారుజామున నిద్ర భలే పడుతుంది ..రాత్రుళ్ళు ఎంత సేపన్నా మెలుకువ ఉండగలను.. తెల్లవారు జామున ఉహు హు ..ప్రైం మినిష్టర్ వచ్చినా నేనూ లేవను..కానీ పిల్లల వల్ల లేవాల్సివస్తుంది.. :)
చందు గారికి నా తరుపున కూడా రెండు ఎండుమిర్చి ఎక్కువ దిష్టి తీయండి :)పనిలో పని మీకు కూడా :)

ఇందు చెప్పారు...

@ జ్యోతి:హ్హహ్హహా! అలాగేనండీ...తప్పకుందా ఇస్తాను.మా ఇంట్లో మా అత్తయ్యగారు కూడా ఏమీ అనరు.'పోన్లే పాపం పిల్లని పడుకోనివ్వూ' అంటారు. :)) నేను ఎటూ మధ్యాహ్నాలు నిద్రపోను.అందుకని పొద్దున ఎంతసేపు పదుకున్నా ఏమీ అనరు :)


@ krishna:అబ్బెబ్బే! నాకు సాయంత్రాలు...మధ్యాహ్నాలు నిద్ర ఇష్టముండదు.అయినా అలా సాయంత్రాలు ఇల్లంతా ధూపం వేస్తరా ఏంటీ? సినిమల్లో పొద్దున్నే అలా చేస్తారు :))) కాబట్టి నేను పొద్దునపూటే లేవడానికి ట్రై చేయాలి.


@ అశోక్ పాపాయి :చాలా థాంక్స్ అశోక్ గారు....Thanks for ur support :)

ఇందు చెప్పారు...

@మంచు :హా! ఇక మీ గోదారబ్బాయిలే చాలా మంచోళ్ళు...ఏమాటకామాట....కొంచెం ఎక్కువ మంచోళ్ళేలేండీ....మీరిచ్చిన అవిడియా ఏదో బానే ఉంది. ఇది ట్రై చేస్తా :)


@ Ennela:హ్హహ్హహ్హా! ఐతే మరి చందుగారిని కూడా తీసుకెళ్ళొచ్చా? మరి చందుగారి మీదే కదా నా పాటలు...కాళ్ళకి దండం పెట్టడాలు ప్రయోగించేదీ!! :P

@ నేస్తం :అవునండీ...నేను సేం టు సేం! పుట్టినరోజుకి....మొన్న జరిగిన మొదటి పెళ్ళిరోజుకి అలాగే పెట్టా! నాకు పెళ్ళిలో ఒక పదిసార్లు పెట్టించారు కాళ్ళకి దణ్ణం.అప్పుడే నవ్వొచ్చిందీ....మీకు కుళ్ళుగా ఉందా? నాక్కూడా....మీరందరు పొద్దున్నే లేస్తున్నారుగా :((

ఇందు చెప్పారు...

@ తృష్ణ:హ్హహ్హహ్హా! అవునా! మీ అన్నయ్య కూడా నాలాగే అన్నమాట! :)) మీరు నా బ్లాగ్లో పెట్టిన వ్యాఖ్యలు చూసాను...మీ బ్లాగ్ టపా చూసాను...దానికి వ్యాఖ్యలు పెట్టాను.నేను మీ బ్లాగ్ మిస్ అవనండీ :) అలాగే మా చందుకి దిష్టి తీసేద్దాం :))


@ RAMAKRISHNA VENTRAPRAGADA:హ్హహ్హహ్హా! నేనెప్పుడూ అంతే! అటుఇటు చూసే లోపల పోస్ట్ పెట్టేస్తూ ఉంటా :)) ఆహ! ఏంచెప్పారండీ...నాకు ఇక ఎక్కడ మబికా దర్బార్ బత్తి చూసినా మీ కామెంట్ గుర్తొస్తుంది.బాగా దణ్ణం పెట్టేసుకోండీ...ఐతే దేవుడికి..అగర్బత్తికి కాదు ;)


@ సుజాత:అబ్బా! సేంటుసేం అండీ...నాక్కూడా అర్ధరాత్రి రెండు,మూడు అయినా పర్లేదు...పొద్దున్నే లేవలంటేనే వామ్మో! అదొక నరకం.కళ్ళు మండుతాయ్! చీ! ఏం చదువులురా బాబు అనిపిస్తుంది.అలా చిన్నప్పుడు కష్టపడ్డందుకేనేమో...ఇప్పుడు కొంచెం సుఖంగా నిద్రపోగలుగుతున్నా! :))

ఇందు చెప్పారు...

@ చందు:హ్హహ్హ!నా టపా అలా పడగానే ఇలా చదివేస్తాడు చందు. ఆల్రెడీ ఇది చదవడం అయింది.నిన్న అదే డిస్కషన్.'ఇందూ నీ కలకి నేను అడ్డమా? పోనీ పొద్దున్నే లేపనా?' అని అడిగాడు.'నా అంతట నేను లేవాలి బాబూ...నువ్వు లేపినా మళ్ళి పడుకుంటా...కాబట్టి నువ్వేమీ అడ్డుకాదూ అని చెప్పా! :))

@ karthik :Thanq Karthik garu :)


@ కృష్ణప్రియ:కృష్ణగారి అయిడియా బానే ఉంది కానీ...నాకు పొద్దునపూటే అవన్ని చేయడం ఇష్టం.సాయంత్రన్ని పొద్దున అని ఎలా అనుకోను :( ఇక మంచుగారి అయిడియా అదిరింది.నేను ఇది ఫాలో అయిపోతా :)) నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు కృష్ణప్రియ గారూ!

ఇందు చెప్పారు...

@ నేస్తం :బోలెడు థాంకూలు మీకు.నన్ను మెచ్చుకున్నారు కదా! చాలా చాలా థాంక్స్ నేస్తం గారూ! :)

సిరిసిరిమువ్వ చెప్పారు...

చాలా అదృష్టవంతులు మీరు. నేను మీకు పూర్తిగా రివర్సు. ఎంత పడుకుందామన్నా ఆరు తరువాత చస్తే నిద్రపట్టదు..మంచం మీద ఉండబుద్ది కాదు. రాత్రి పూట ఎంత లేటుగా పడుకున్నా పొద్దుటే లేచిపోవాలి. ఆరయితే నాకు చాలా ఎండెక్కినట్టు! అప్పుడప్పుడు సెలవు రోజు ముందు రాత్రి పిల్లలకి మా అయనకి చెప్తా..రేపు పొద్దున నేను లేచేదాకా నన్ను లేపొద్దు..టిఫీనీలు గట్రా మీరే చేసుకోండి అని..అబ్బే మనకి రోజుకన్నా ముందే మెలుకువ వచ్చేస్తుంది...

"నేను ఎటూ మధ్యాహ్నాలు నిద్రపోను.అందుకని పొద్దున ఎంతసేపు పడుకున్నా ఏమీ అనరు"...ఎనిమిది తరువాత నిద్ర లేచి మళ్లా మధ్యాహ్నం నిద్ర కూడానా???

భాను చెప్పారు...

పాపం చందూ బ్రెడ్ బాదితుడే అనుకుంటే మళ్ళీ ఇప్పుడు మీ నిద్రా బాదితుడు కూడానా. మీరు లేవకపోతే అంతకన్నా ఎం చేస్తారు లెండి మగవాళ్ళు:)
దేవుడా ఓ మంచి దేవుడా
చదవడానికి ఓ మంచి బ్లాగు నిచ్చావ్ !
కామెంటే అవకాశ మిచ్చావ్ !
........................................................
ఇందు నీ కలలను తీరుస్తాడు ఆ దేవుడు త్వరలో
తీరుస్తాడు నీ కలలను!
నాకు తెలుసు.....
ఎందుకంటే....బేసికల్లి.....యు ఆర్ గాడ్! వెరీ గుడ్ గాడ్!
అంతే! :)

Ennela చెప్పారు...

arere chandu gaaru lekunda yekkadiki velataarandee....kalisi vellamane kadaa...em mohamaata padakandi sardukondi mari....

సుజాత వేల్పూరి చెప్పారు...

నేస్తం, :-))

అదంతా చదువుకునే రోజుల్లో! ఇప్పుడు అయిదింటికే మెలకువ వచ్చేస్తుంది. సెలవు రోజుల్లో అయినా అదే టైముకు లేచి వాకింగ్ కి పరిగెడతా! ఇప్పుడైనా చదువుకోవాలి(పరీక్షల కోసం) అంటే రాత్రి పూటే! ఐదింటికి లేచినా సరే... చదవడాల్లేవ్!

అలాగే ముందు రోజంతా నిద్ర లేకపోయినా సరే మధ్యాహ్నం ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. నా వల్ల కానిది ఇదొక్కటే!

అజ్ఞాత చెప్పారు...

ఇందూ
మీరు అచ్చంగా నా కధే రాసారు, ఒక్క ఆ కల తప్ప. ఆ కల మా అమ్మది, బయటకు చెప్పని మా అత్త గారిది. ఇంకా అయితే మా ఆయినదీ అయ్యుండొచ్చు.
నాకు కూడా నిద్రే దైవం, తిండి, ఇహము, పరము అన్నీను. కాదే టైమూ నిద్రకనర్హం.

పాపం మా ఆయన కూడా మీ చందు లాగే లేపకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడైనా పొరపాటున నేను ముసుగు తీసి టైము చూసుకుంటే, ఇంకా నువ్వు లేచే టైము అవ్వలేదులే పడుకో అని వెళ్ళిపోతారు. :-). పిల్లలు కూడా అలాగే లేచి నిశ్శబ్దంగా గుసగుసలాడుతూ చెయ్యకూడని పనులన్నీ చేస్తుంటారు.

చిన్నప్పుడు నేను కూడా పరీక్షల టైములో ఉదయాన్నే లేచి, చదువు మొదలు పెట్టి, అందరూ హాయిగా నిద్ర పోతుంటే, ఛీ అనుకొని, ముసుగేసి మళ్ళీ పడుకోనేదాన్ని. నాకు కూడా తెల్లవారు ఝామునే లేవటం అసలు ఇష్టం ఉండదు. నిద్ర రాకపోయినా ముసుగు పెట్టి, కళ్ళు మూసుకొని మత్తుగా పడుకోవటంలో ఉన్న హాయి, వేరెక్కడను లేనే లేదని ...నిజము నాకు తెలిసింది...
నాకు నిజంగా నిద్ర పోవటం కన్నా, నిద్ర పోతున్నాను అన్నా ఫీలింగ్ ఎక్కువ ఇష్టం అనుకుంటా.

సౌమ్య గారి నిద్ర సూక్తులు బాగున్నాయి. నా డైలాగు కూడా సుజాత గారి లాగే "కావాలంటే రాత్రి రెండింటివరకూ చదువుతా కానీ తెల్లవారుజామున ప్రైమ్ మినిస్టరొచ్చి లేపినా లేవను". కాక పోతే నా డైలాగ్ " దేవుడు కూడా నిద్ర తరువాతే అని". కానీ క్రిందటి ఏడాది కొన్ని నెలల పాటు ఉదయాన్నే 4 : 30 కి లేచి ఆరుగురు ఫ్రెండ్స్ కలిసి జాగింగ్ చేసే వాళ్ళము. సో, నా ఇంకో డైలాగ్ " నేను చెయ్యాలని అనుకుంటే చేస్తాను, కానీ అలా అస్తమాను అనుకోను". అన్నట్టు చెప్పడం మరిచి పోయాను. నా ఇంకో పేరు "సీతమ్మ".
పద్మవల్లి

ఇందు చెప్పారు...

@ సిరిసిరిమువ్వ:మీరందరూ పొద్దున్నే లేచేసి...మధ్యహ్నాలు కునుకు తీస్తారు...నేనేమో...ఆ నిద్ర కూడా పొద్దునే పోయి...మధ్యహ్నాలు నిద్రపోను.అంతే తేడా :)) మా అమ్మ కూడా మీలాగే! అలాగే అంటుంది...మళ్ళి పొద్దున్నే లేచి అన్నీ తనే చేసుకుంటుందీ :)

@ భాను:అబ్బా!అబ్బా! ఏం సమర్ధన మీ మగవారిని??!! హ్హహ్హహ్హా! భలే వ్రాసారే మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నా భానుగారు...అంటే ఇండైరెక్ట్ గా నా కల నెరవేరుతుంది అన్నమాట :)


@ Ennela:అదీ నిజమే! చందు లేకుండా పెళ్ళయ్యాక ఇంతవరకు ఎక్కడికీ వెళ్ళలేదు...బోలెడు థాంకూలు మీక్కూడా!


@ సుజాత:అంతేనండీ...పిల్లలు...భాద్యతలు వస్తే ఆటోమేటిక్గా మనమే లేచేస్తాం! రేపు నేనూ అంతే! అప్పుడు ఎటూ కుదరదనే ఇప్పుడే నిద్రపోతున్నా! నేనూ మీలాగే! మధ్యహ్నాలు అస్సలు నిద్ర రాదు :)

Ennela చెప్పారు...

maa seetayya gaariko chellelu dorikaaru ikkada...setamma gaaru..
teda yentante...vaaru cheppina maata vinaru...seetamma gaari diologue emo.." నేను చెయ్యాలని అనుకుంటే చేస్తాను, కానీ అలా అస్తమాను అనుకోను".
naaku meeru nachchesaarandee seetamma gaaru..
indu gaaru naaku relatives ni istunnanduku meeku kritajnatalu...

అజ్ఞాత చెప్పారు...

ఎన్నెల గారూ
మీకు ఈ సీతమ్మ నచ్చినందుకు చాలా సంతోషం.
"నేను చెయ్యాలని అనుకుంటే చేస్తాను, కానీ అలా అస్తమాను అనుకోను". ఇది నా ఒక డైలాగ్. కానీ నా సీతమ్మ అన్న పేరు
"ఒకరు చెప్తే నేను చెయ్యను, ఎవరి మాటా వినను" కాబట్టే.
మీ సీతయ్య గారి కథలు చదివాను. బాగున్నాయి. మరి మా అన్నగారిని అడిగినట్టు చెప్పండి.
పద్మవల్లి

Ennela చెప్పారు...

tappakunadaa cheptaanandee seetayyaa gaariki...tega sambara padataaru..mee diologues chebite...kaanee paapam nenu..yemchestaam...meeru vinaru kaabatti memu vintoo undadame..assalu chandu gaari daggara training ki pampudaamani anukunnaa...kaanee bhayam entante...seetayya gaaru chandu gaarini kuda ayanalaaga maarchestaarani...hahaha

హరే కృష్ణ చెప్పారు...

:-)
Superbly written!

చెప్పాలంటే...... చెప్పారు...

:-) మీకల త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాను.ఈ మద్య లేను లేట్ గా చూసాను మీ పోస్ట్ చందు దొరికినందుకు మీరు బాగా లక్కి

sphurita mylavarapu చెప్పారు...

ఈ టపా మా వారికి చూపించాలి అర్జెంటుగా...అంటే నేనేదో పొద్దున్నే లేచేస్తా అని కాదు. నా నిద్ర ప్రేమ గురించి ఇక్కడ చూడండి http://naarathalu.blogspot.com/2011/04/blog-post.html
మావారు పొద్దున్నే ఎనిమిందింటికే రోజూ లేపేస్తూ వుంటారు...పైగా అవకాశం దొరికినప్పుడల్లా దెప్పుతూ వుంటారు ఎప్పుడైనా నాకన్నా ముందు లేచావా అని...

అజ్ఞాత చెప్పారు...

మీలాంటి కలలే నాకు ఉన్నాయ్ అండి.పొద్దున్నే లేచి దేవుడి పాటలు పెట్టుకొని , ఇల్లు చిమ్మి ,వాకిట్లో ముగ్గేసి ,పాలు కాంచి మంచి టీ మా ఆయనకి ఇచ్చి good morning అని చెప్పాలి .ఇంకా ఇళయరాజా సాంగ్స్ పెట్టుకొని వంటంతా చేసేసి మా ఆయనని లంచ్ బాక్స్ తో ఆఫీసుకి పంపాలి .అలాగే నేను కూడా వెల్తాననుకోండి ఆఫీసు కి .But ఈ కల్లం లో ఉండే speed కి ఇదంతా జరగదు .జరిగేల చెయ్య గలిగే శక్తి ఆ దేవుడు నాకిస్తే బాగుండు .