18, జనవరి 2011, మంగళవారం

అద్దం అబధ్ధం చెప్పదు

పొద్దున్నే అద్దం లో మన మొహం చూసుకుని....ఏదో ఒకటి అనుకుంటాం.ఇలా ఉందే.....అలా ఉందే అని.అలాగే ప్రతి మనిషి తనకి తాను అందంగానే కనిపిస్తాడు.ఇక ఆడవాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు.....అలా అని మగవారు దీనికి ఏమి తీసిపోవట్లేదు ఈ మధ్య....కానీ అసలు అందం అంటే ఏమిటి? దీనికి కొలమానం ఏమన్నా ఉందా చెప్మా??

'పొడవైన జుట్టు,అందమైన వేళ్ళు,సుతిమెత్తని పాదాలు,పెద్ద పెద్ద కళ్ళు,పాల వంటి మేనిచ్చాయ కలిగిన అమ్మాయిలు.....
వంకీలు తిరిగిన జుట్టు,తీరైన కనుముక్కు,చక్కని ఒడ్డు-పొడవు,కొంచెం స్టయిల్ కలిగిన అబ్బాయిలు....'
ఇదేనా అందం కొలబద్ద???

నాకు తెలిసిన చాలా మంది అమ్మాయిలు...పౌడర్లు,స్నోలు,లిపిస్టిక్కులు(పోకిరి మహేష్ బాబు  డవిలాగులా),ఐలాషులు తెగ వాడేస్తుంటారు.....పొద్దున్నే ఒక రౌండ్ ఫేస్ వాష్ తో కడుగుతారు...స్క్రబ్బరుతో తోముతారు...ఫేస్ క్రీం తో పెయింట్  వేసి.....పౌడర్ తో వార్నిష్ వేస్తారు.....ఇది బేసిక్.ఇక దానికి అప్డేటెడ్ వెర్షన్స్ చాలా ఉంటాయి.చెబితే నమ్మరు కానీ నేను బెంగుళూరు లో ఒకసారి నా ఫ్రెండ్ హాస్టల్ కి తోడు వెళ్ళా.అక్కడ తన రూంమేట్ షాపింగ్ కి రెడీ అవుతోంది.నేను అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నా.ఆమె తన కప్ బోర్డు తలుపు తీసింది.నా కళ్ళు తిరిగాయి.ఎన్నెన్ని ఫేస్ వాష్లు,క్రీంలు(డే టైం+నైట్ టైం అట), లోషన్లు, పౌడర్లు, లిప్స్టిక్, లిప్గ్లాస్,ఐబ్రో పెన్సిల్,కాజల్,......వామ్మో! నేను చెప్పలేను.ఒక చిన్న కాస్మెటిక్ దుకాణం పెట్టేసింది.ఇక బైటికివెళ్ళేటప్పుడు  ఆ వస్తువులన్నీ ఉపయోగించి  అర అంగుళం మందాన మేకప్ కొట్టింది.'అయ్యబాబోయ్!' అనుకున్నా.పగలు చూస్తే పగలే కల్లోకొచ్చి దడుచుకునేల ఉంది.ఇంకొంతమంది ఉంటారు.'నేచురల్ కేర్...నేచురల్ కేర్' అని అంటారు.కానీ వారికి మాత్రమె తెలుసు ఏమేం చేస్తున్నారో.ఐబ్రోస్ షేప్ చేయిస్తారు....నేచురల్ అంటారు.ఫేషియల్ చేయిస్తారు... నేచురల్ అంటారు.వాక్సింగ్ చేయిస్తారు నేచురల్ అంటారు.అదేమంటే ఎదుటివారిమీదకి కయ్యిన లేస్తారు. ఇదేమి నేచురలో!

ఇక అబ్బాయిలు....ఈ మధ్య బ్యూటి సెలూన్స్ లో వీరి హడావిడి ఎక్కువైపోతోంది.అమ్మాయిలకి మల్లె వీరు ఫేషియల్స్  గట్రా చేయిస్తున్నారు.ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు.'అనూస్ ఫేస్ పాక్' అమ్మాయిలకంటే అబ్బాయిలే ఎక్కువ వాడుతున్నారట.అదీ కాక ఈమధ్య వీరికోసం కొత్తగా మగవారి ఫేస్ క్రీమ్స్ కూడా వచ్చాయి. కానీ వీరిని ఒకరకంగా ఒప్పుకోవచ్చు.కేవలం స్కిన్ కేర్ వరకు ఆపేస్తారు.అంతే కానీ....కళ్ళ నించి పళ్ళ దాకా పట్టించుకునే సహనం వీరికి ఉండదు.అబ్బాయిలు లిప్స్టిక్లు,ఐలాష్లూ వేసుకునే విపరీతాలు ఇప్పటిదాకా నాకైతే కంటపడలేదు.కానీ వీరు కండలకోసం జిమ్ముల చుట్టు మాత్రం తెగ తిరుగుతారు.హ హ హ! అలాగే కొత్త కొత్త హెయిర్ స్టయిల్స్ ట్రై చేస్తుంటారు.షర్టు మీద షర్టు...బ్రాండెడ్ షూస్....కాస్ట్లీ పర్ఫ్యుం.....ట్రెండీ వాచ్.....ఇదీ వారి స్టయిల్ మంత్రా.కానీ అమ్మాయిలు సాధారణంగా బ్రాండ్ల జోలికి పోరు.'టాప్ టు టో' అన్నీ మాచింగ్ కావాలి.అందుకోసం ఎంత శోధన అయినా చేస్తారు.

గ్లామర్ ప్రపంచమైన సినిమా రంగంలో...అందానికే అగ్రస్థానం అయినా....అభినయం లేని అందమైన మొహాలను ఎన్నిసార్లు తిప్పికోట్టలేదు? ఆత్మవిశ్వాసం,పట్టుదల,శ్రమ లేకుండా...కేవలం అందం మీద కొట్టుకొచ్చిన వారు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? అందం అనేది ప్రాధమిక గుర్తింపు మాత్రమె.ఆ గుర్తింపుని పది కాలాలపాటు నిలబెట్టేది చక్కని వ్యక్తిత్వం.అయినా శాశ్వతం కానీ అందం కోసం పాట్లు పడి...దాన్ని శాశ్వతంగా చేసుకోవాలని తాపత్రయపడి....ఎందుకో ఇంత ప్రాకులాడతారు??

ఎన్ని రకాలుగా దేహాన్ని అలంకరించినా.....మన అందం ప్రతిఫలించేది మనం చేసే పనిలోనే అని గుర్తించరు చాలా మంది.అందమైన వ్యక్తిత్వం ముందు ఎటువంటి అవకరమైనా కనపడదు.నోటికి వచ్చినది మాట్లాడేవాళ్ళు.....బైటికి సైలెంట్ గా కనిపించి లోపల వైలెంట్ గా ఆలోచించేవాళ్ళు.....తాము అందంగా వుంటాం అని ఫీల్ అయిపోతు...ఏది చేసినా చెల్లుతుంది అనుకునే వాళ్ళు.....ఒక్కసారి అద్దం ముందుకెళ్ళి తాము ఉన్నంత అందంగా తమ మనసు ఉందా అని అడగగలరా?? అద్దం అబధ్ధం చెప్పదు.అది ముఖానికైనా,మనసుకైనా అద్దమే.అందులో కనిపించేది మన ప్రతిబింబమే.అందం అనేది చూసే మనిషిలో కాక అతని నడవడికలో,ప్రవర్తనలో,బుద్ధిలో ఉంటుంది. గొప్ప గొప్ప వాళ్ళలో అందగాళ్ళు చాలా తక్కువమంది.కాని ఎందుకో చాలా మంది మనిషి అందాన్ని బట్టి అతన్ని /ఆమెని బేరీజు వేస్తారు.

ఈమధ్య ఒక అమ్మాయితో మాట్లాడా!ముందు చాలా మంచి అమ్మాయి అనే అభిప్రాయం కలిగింది నాకు. తనకి బ్యూటి కాన్షియస్ చాలా ఎక్కువనుకుంటా.....సరేలే....ఈరోజుల్లో లేనిది ఎవరికీ అనుకున్నా!! కానీ రాను రాను....తన ప్రవర్తనలో తేడా అర్ధమయింది.తను మాత్రమె అందంగా ఉంటుంది అని....ఇతరులు తనకన్నా లీస్ట్ అన్నట్లు ఉంటాయ్ తన మాటలు.నాకు తెలిసిన ఇంకో అమ్మాయి గురించి...ఆమె అవకరాల గురించి చాలా హేళనగా మాట్లాడిన తరువాత నాకు అర్ధమయింది....ఈ అమ్మాయి చూసినంత అందంగా మాత్రం లేదు.....పైకి ఎలా ఉంటేనేం....మనసంతా కుళ్లే అని! నా ప్రాధమిక అంచనా తప్పైనందుకు బాధగా ఉన్నా...తన అసలు రూపం బైటపడ్డందుకు ఒకింత సంతోషంగానూ ఉంది.అలాంటివారికి దూరంగా ఉండొచ్చు కదా! :)

తను ఈ బ్లాగ్ చదువుతుందో లేదో కానీ...ఒక్కటే చెప్పాలనుకున్నా....బాహ్యసౌందర్య వెలుగు ఒక్క క్షణకాలం మాత్రమె. అంతఃసౌందర్యం శాశ్వతం. అది ఏ పౌడర్లకు,క్రీములకు దొరకని చిరునామా :)

హ్మ్!! ఈ టపాతో నేను అర్ధసెంచురీ చేశా! గంగూలీ సెంచురీ కొట్టినంత ఆనందంగా ఉంది.ఐదు నెలల్లో...ఐదుపదుల టపాలు రాసానంటే నమ్మబుద్దవడంలేదు!! బెరుకు బెరుకుగా.....ఏమి రాయాలో...ఏమి రాయకూడదో తెలియక....ఏదో తప్పటడుగులతో బ్లాగ్ మొదలెట్టిన నేను....ఇన్ని రోజులు దాన్ని కొనసాగిస్తా అని కల్లో కూడా అనుకోలేదు.మీ అందరి ప్రోత్సాహం,ఆదరణ లేకపోతె ఇది సాధ్యమయ్యేదే కాదు.ఇలాగే మీ అందరి ఆదరాభిమానాలతో...సంవత్సరం అయ్యేలోగా సెంచురీ కొట్టేయాలని నా బ్లాగ్ని ఆశీర్వదించేయండే! :)

41 కామెంట్‌లు:

kiran చెప్పారు...

కంగ్రాట్స్ ఇందు..!! :)
చాలా సంతోషం...ఇలాగె బాలుడు పోస్ట్ లు రాసేసి....మా చప్పట్లు వినేసి...మాకు choclate లు పంచేయండి.. :)...
మీరు అందం గురించి రాసిన ప్రతి అక్షరం నిజం... :)..
కొంత మంది అంతే అండి...బాహ్య సౌందర్యాన్ని లెక్క చేస్తారు.... ఇప్పుడు చూడండి...నేను ఎంత మంచి దాన్ని...నా మనసు ఎంత అందమైనదో.. :P ..కానీ అల కనిపించమే.. :P

sivaprasad చెప్పారు...

congrats indu garu for half century ... nice narration :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

>>అంతఃసౌందర్యం శాశ్వతం.<<
చాలా బాగా చెప్పారు ఇందు. యాభై టపాల మైలురాయి చేరుకున్నందుకు అభినందనలు :-) మీరిదే స్పీడ్ తో వందటపాలు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను.

కిరణ్ గారు :-)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అర్ధ శతకానికి శుభాభివందనములు. ఇంకా మరిన్ని శతకాల టపాలు అందంగా,ఆహ్లాదంగా వ్రాయాలని మనసారా కోరుకుంటున్నాను.

లత చెప్పారు...

అభినందనలు ఇందూ
చాలా బాగా రాస్తారు మీరు
త్వరగా సెంచరీ కొట్టెయ్యండి మరి

జయ చెప్పారు...

చక్కటి విషయాలు చెప్పారు. శుభాభినందనలు కూడా అందుకోండి.

Mauli చెప్పారు...

ఎ౦త కష్టపడి ..అ౦త టపా టైప్ చేశారు ఇ౦దు గారు ..కాబట్టి నాకు మీరు అ౦ద౦గా నే కనిపిస్తు ఉన్నారు :)

Unknown చెప్పారు...

ఇందు సూపర్ .. అద్దం అస్సలు అబద్దం చెప్పదు .. అలాగే మన మనసు తెలుపదు కూడా ..
నా దృష్టిలో ఒక నిజమైన ఫ్రెండ్ ఒక అద్దం లాంటిది ... మనకున్న లోపాలు కూడా ఎత్తి చుపగలిగితేనే మనం నమ్మాలి వాళ్ళని :)

కిరణ్ ఊరుకో నువ్వు మరి చెప్తావ్ .. నువ్వు నేను మంచోల్లంటే తీస్కెళ్ళి జూ లో పెట్టేస్తారు .. .. :p

భాను చెప్పారు...

congrats for half century...expecting century in a short time

3g చెప్పారు...

కంగ్రాట్స్ ఇందుగారు....... హాఫ్ సెంచురీకి తగ్గ పోస్టు. బాగా రాసారు.

స్నిగ్ధ చెప్పారు...

ఇందు గారు,బాగా రాసారు,
అర్ధ సెంచురి కొట్టినందుకు కంగ్రాట్స్...

మనసు పలికే చెప్పారు...

ముందుగా అర్థశతకానికి అభినందనలు ఇందు గారు..:)
టపా మాత్రం చాలా బాగా రాసారు. కిరణ్ అన్నట్లుగా మీరు అందం గురించి రాసిన ప్రతి అక్షరం నిజం.

>>కిరణ్ ఊరుకో నువ్వు మరి చెప్తావ్ .. నువ్వు నేను మంచోల్లంటే తీస్కెళ్ళి జూ లో పెట్టేస్తారు .. .. :P
హహ్హహ్హా కావ్యా.. నువ్వసలు కేక:)))

శివరంజని చెప్పారు...

ఇందు గారు అర్ధ సెంచరీ చేసినందుకు ముందుగా అందుకోండి నా అభినందనలు ....మంచి విషయం టచ్ చేసారు

అశోక్ పాపాయి చెప్పారు...

మీకు అభినందనలు త్వరగా సెంచరి చెయ్యండి మరి:))

హరే కృష్ణ చెప్పారు...

wow..
పోస్ట్ లో నీతి చాలా బావుంది

మీరు మరో ఆరు నెలల్లో వంద కొడతారు ఇందు గారు.. వంద కొడతారు
hearty congratulations on completing half century!

Mauli చెప్పారు...

అద్ద౦ మన౦ అనుకొన్నదే చెబుతు౦ది కదా ..మన౦(మనసే) సూపర్ అనే కదా అనుకు౦టా౦ ..మీ కొప౦ అర్ద౦ అయ్యి౦ది కాని, అద్ద౦ కా౦సెప్టు ..ఉహూ....

అ౦ద౦ గురి౦చి యెన్ని చెప్పినా ..గడ్డి పువ్వు తొక్కేస్తా౦ ..గులాబి నెత్తికెక్కి౦చు కు౦టా౦..

@గొప్ప గొప్ప వాళ్ళలో అందగాళ్ళు చాలా తక్కువమంది
అ౦ద౦, డబ్బు, కీర్తి కిక్ ఇస్తాయి .. సొ గొప్ప గొప్ప వాల్ల లొ వీటి లో యెదో ఒహటి ఉ౦డు౦టు౦ది...

కాబట్టి పోల్చలేము ...ప్రతి ఒక్కరూ (మీరు చెప్పిన అమ్మాయి తొ సహా ) ప్రత్యేక౦ అనుకోవడ౦ మన వల్ల అయ్యే పనేనా ...అనుకోవాలి అ౦టారు ..


మొత్తానికి అ౦దానికి రాజీవ్ గా౦ధీ నిర్వచనమే పైనల్ :)

ఇందు చెప్పారు...

@ kiran:థాంక్యూ కిరణ్! నీకు స్పెషల్ చాక్స్ కొరియర్ చేస్తాలే! అంతే కిరణ్...కొంతమంది మనసు చూడరు...కేవలం బాహ్యసౌందర్యం మాత్రమే చూస్తారు! అయినా నీకేంటి కిరణ్...నీ బొమ్మలాగే ఉంటావ్ క్యుట్ గా!

@ sivaprasad:థాంక్యూ శివగారు :)

@వేణూ శ్రీకాంత్:థాంక్యూ వేణు! అలాగే వందటపాలు పూర్తి చేస్తే మీకో స్వీట్ పాకెట్ విద్ ఇడ్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ!!

ఇందు చెప్పారు...

@ బులుసు సుబ్రహ్మణ్యం:మీ ఆశీర్వాదాలు ఉంటే చాలు సుబ్రమణ్యం గారు...త్వరలోనే వంద కొట్టేస్తా!

@ లత :థాంక్యూ లతగారూ...అలాగే తప్పకుండా!

@ జయ:చాలా థాంక్స్ జయగారూ!

@ Mauli :ఇది పెద్ద టపానా? మీరు మరీనండీ!! థాంక్స్...థాంక్స్...

ఇందు చెప్పారు...

@ కావ్య :కావ్యా...నేను అద్దంలో మనల్ని మన మన్సులోకి తొంగి చూసుకుని మన మానసిక సౌందర్యాన్ని గుర్తించమని అంటున్నా! ఇక్కడ మేటర్ అద్దం కాదు...మనసు! ఆత్మవిమర్శని మించిన సద్విమర్శ లేదు అంటారు.అలా మన గురించి ఎదుటివారు చెప్పేముందే మనం గ్రహించగలగాలి అంటున్నా! అర్ధమయిందా????


@ భాను :థాంక్స్ అండీ...తప్పకుండా భాను గారూ!!


@ 3g :థాంక్స్ 3gగారూ!

ఇందు చెప్పారు...

@ snigdha :థాంక్యూ స్నిగ్ధగారూ!

@మనసు పలికే:థాంక్స్ అప్పూ! మీరు కామెంటలేదేంటబ్బా అనుకుంటున్నా :) పెట్టేసారు :) థాంక్యూ వేరీమచ్!

@ శివరంజని:థాంక్యూ రంజనీ...అభినందనలకు...టపా నచ్చినందుకూ!

@ అశోక్ పాపాయి :అలాగే అశోక్ గారూ! తప్పకుండా!! :)

@ హరే కృష్ణ :హ్హహ్హా! భలే చెప్పారు.పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు :)

ఇందు చెప్పారు...

@ Mauli:అసలు మీకు 'అద్దం అబధ్ధం చెప్పదు ' అనే సూక్తే అర్ధం కాలేదనుకుంటా! మనం ఎలా ఉన్నా...అద్దం అలాగే చూపిస్తుంది.కానీ దానికి మనమే ఏదొ ఒక ఊహ తగిలించుకుని...ఇంత బాగున్నం...అంత బాగున్నాం అనుకుంటాం.అలా కాకుండా నిజాన్ని చూడాలంటే అద్దంలాగా నిజాయితీగా ఉండాలి.

ఇక నేను చెప్పినదేంటి అంటే...'అద్దం లో మనం మొహం బాగున్నా...బాగోకపోయినా...ఒక్కసారి మన మనసుని అద్దం ముందు నిలిపి బాగుందా బాలెదా అన్నది చూడండీ....అద్దం ఎటూ అబధ్ధం చెప్పదు అనుకున్నాం కాబట్టీ...మనం మనసుని కూడా నిజాయితీగా అందులో చూసుకుని...మనం ఉన్నంత అందంగా మన మనసు ఉందా?' అని ప్రశ్నించుకోమంటున్నాను!

అర్ధం అయిందా అండీ??

గడ్డిపువ్వు తొక్కేసినా....దాని అందం దానిదే! రోజా పువ్వు అందంగా ఉన్నా...మనసులొ అంత అందగా ఉందొ...ముళ్ళులా కరుకుగా ఉందో ఎలా తెలుసు????

గొప్పగొప్పవాళ్ళు అంటే ఎవరో కాదు...సామాన్యులే వారి వ్యక్తిత్వం వల్ల గొప్పవారవుతారు :) అందం వల్ల కాదు అని నా అభిప్రాయం.ఇక మీరు చెప్పిన కారణాలు అందరికీ వర్తించవు!

Ennela చెప్పారు...

అయ్యయ్యో మేకప్పు చేసుకుంటూ పదహారు కామెంట్ల లేట్ అయ్యానా? ...ఎంత లేటొచ్చినా సరే, నేను అందంగా ఉన్నట్టే....ఒప్పుకోవాలంతే..మరి నా అద్దం అలాగే చెప్పింది.

చిన్నప్పుడు అమ్మ ఒక కథ చెప్పింది...అద్దం బ్రహ్మ దేవుడి దగ్గరకెళ్ళి యేడ్చిందట నాకు చాలా స్వల్పాయుష్షు ఇచ్చావెందుకూ అని!అద్దం లొ మొహం చూసుకున్న వాళ్ళందరూ అద్దాన్ని విసిరి కొడుతున్నారట...బ్రహ్మ కూడా చూసుకుని...అబ్బా నాలుగు మొహాలతో ఎంత చెండాలంగా ఉన్నానొ అని ఫీల్ అయ్యాట్ట. ఆయనకీ అందంగా కనిపించాలని కోరిక పుట్టిందిట. దాంతో అద్దానికి వరం ఇచ్చాడట..ఇప్పటి నుంచీ ఎవ్వరు నీలో చూసినా వాళ్ళకి వాళ్ళు మిస్స్ యునివర్స్ లాగానో , మిస్టర్ భూమండలం లాగో కనబడతారు పో అని...

ఇందూ గారు పాపం మమ్మల్ని వదిలెయ్యండీ..అంతా బ్రహ్మ దేవుడిచ్చిన వరం వల్ల అల్లా ఫీల్ అవుతామంతే....పాపం యెవర్ని అనుకుని ఏం లాభం...ఫాల్ట్ అంతా బ్రహ్మ గారిది. ఆ వరం వల్ల కాకి బింబం కాకికి ముద్దు...(నేనూ అందగత్తెనే అని చెప్పా కదా ..నా అద్దంలో)

కాకీక కాకికి కాక కేకికా...యేదో బాగుందని వాడానంతే..దీనికీ పయిన ప్రస్తావించిన కాకి బింబం కాకులకీ(అంటే అందమయిన నాకూ) ఎలాంటి సంబంధం లేదని గమనించ ప్రార్థన.....

ఇందు గారు ఇంత పెద్ద కామెంటు ఏంటీ అంటారా? మీ అర్థ శతానికి శుభాకాంక్షలండీ.....

చందు చెప్పారు...

ఇందు,
కంగ్రాట్స్. త్వరలో సచిన్ లా సెంచురీ పూర్తి చేసేయ్యచ్చు. అర్ధ శత టపాల అభినందన మాల మీకు. మీరు చెప్పింది అక్షరాల నిజం. కానీ ఎం చేస్తాము, అందంగా ఉండేవాళ్ళకు కొంచెం పొగరు సహజం.

kavitha చెప్పారు...

congratulations Indu garu. You improved a lot from you first post to now, I like your style of narration.

Coming to the present post, nice observation, and I see your concern on people who behave as beasts in the name of beauty.

In all you are cool and very emotional and talented..I will write in Telugu next time...all the best...

మంచు చెప్పారు...

ఇందూ...ఆరునేలల్లొ హాఫ్ సెంచురీ నా...సూపర్ కదా...
Congratulations !!!

Unknown చెప్పారు...

ఇందు .. నేను అదే చెప్పా
నేను తెలుగులో చెప్పా నువ్వు హిందీ లో చెప్పావ్ అంతే కదా :p
అయినా నీకు నాకు అంత సీన్ లేదులే కానీ :) దా ఆడుకుందాం

ఇందు చెప్పారు...

@Ennela :నాకు ఒక్కముక్క అర్ధమైతే ఒట్టు! అసలే ఆ జావాతో పాట్లు పడుతున్నా! ఇది మీకు భావ్యమా? జావా నేర్పిస్తా అని జావ నేర్పిస్తారా చెప్తా! కెనడా వస్తగా అప్పుదు చూసుకుందాం...మీ ప్రతాపమో..నా ప్రతాపమో! :P Thnx for wishes :)


@ kavitha: Thankyou somuch Kavitha.For following my blog,observing my writing style and complementing me.Thankyou verymuch :)


@ మంచు:Yeppyy! Indu always rocks :)) Thnx Manchugaru :)


@ కావ్య:ఓహో! నీకు అలా అర్ధమయిందా?? సర్లే...మన ఇద్దరి బుర్రలు ఒకటేగా :P నే వచ్చేసా! పద ఆడుకుందాం :)క్యూటీ టీను :))

Unknown చెప్పారు...

ఆకాశం ఎర్రగా ఉంది (కోడ్ వర్డ్ కోడ్ వర్డ్)

ఇందు చెప్పారు...

నీ మొహం ఏడ్చినట్టు ఉంది(కోడ్ ప్రాసెస్డ్)

మనసు పలికే చెప్పారు...

మరి భూలోకం ఏంటబ్బా ఇలా ఉంది (ప్రీవియస్ కోడ్ రిజెక్టెడ్);)

రాధిక(నాని ) చెప్పారు...

>అంతఃసౌందర్యం శాశ్వతం.< అవునండి ..బాగుంది మీ టపా
అబినందనలు ఇందు:)) ..ఇలాగే మంచి మంచి పోస్ట్లు రాసి త్వరలోనే మీరు సెంచరి కొట్టేయాలి.

ఇందు చెప్పారు...

@ మనసు పలికే :అది బాలయ్య పీవీసి చూసిన మహత్యం వల్ల అయ్యుంటుంది ;) [కోడ్ ఆక్టివేటెడ్]

@ రాధిక(నాని ):ధన్యవాదాలు రాధికగారు :) అలాగేనండీ :) థాంక్యూ

ఇందు చెప్పారు...

@ చందు: థాంక్యూ చందుగారు! ప్రపంచంలో ప్రతి ఒక్కరు....కొద్దో,గొప్పో అందంగానే ఉంటారండీ...ఎవరికి వారే క్వీనూ,కింగూ.కానీ వేరే వారిని అవహేళన చేయకూడదు కదా!అందం అనేది మనం కొని తెచ్చుకోలేదు.అది ఎలా ఉన్నా మార్చే శక్తి లేదు.కానీ ఈ విషయం గుర్తించరు చాలామంది! ఏం చేస్తాం! ప్చ్!వారి బలహీనతకి జాలిపడడం తప్ప!

Ennela చెప్పారు...

choosaara choosaara! naa concept artham kaledu antoone...chandu gaariki clear ga explain chesesaaru..nenu adey cheppaa maa make up gaallani jaali padi vadileyyandee ani....artham chesukoru!

andentandee!...chakkaga java kaachadam nerpiste antha kopama? poneele kharchu petti java neruchukuntunnaarata..free ga nerpiddaamani prayatnichaa...tappa?

ఇందు చెప్పారు...

@Ennela: Ennela garu...me previous comment chadivesariki...kallu tirigi kinda padi...naa moham meeda nene neelu jallukuni....betty ni rendu titlu tittukuni :P ika lechi edo alaa mukkutu,moolugutu comment ki reply icha :D

Nenu annadi JAVA madamgaru...jaava kaadu :P ayina nenemi ekkadiko velli nerchukovatledu.intlo naku unnaduga ALL-IN-ONE :)) chandu nerpistunadu :) roju home wrok,assaignements kooda ;) cheyakapothe aa roju choclate cut :(

Ram Krish Reddy Kotla చెప్పారు...

Indu, neeku JAVA lo perfection ravalante, JAVA lo jateeyageetam nerchukovalante... contant Mr. Kittigadu :)

ఇందు చెప్పారు...

@Kishen Reddy: JAVA lo jateeyageetama? HAHAHA! hilarious :)) Alage Kishen :) Nenu job lo join ayyaka...nakemanna code kavalante google kante mundu ninnu aduguta :P vaake??

Ram Krish Reddy Kotla చెప్పారు...

JAVA lo jaateeyageetam teliyada.. ayite nuvvu ma kittigadi "Kittugadu loves edurinti ammai" story chadavaleda??.. ventane aa story chaduvu (At my Akasaveedhilo blog).. neeku JAVA lo enno concents easy ga vachestayi.. adanamaata... kittigadu ante emanukunnav.. :)

IT's MINE చెప్పారు...

avunu meeru emi chestuntaru

Sree చెప్పారు...

you have an award waiting at my blog, please let me do the honors :).

tankman చెప్పారు...

"అందం అనేది ప్రాధమిక గుర్తింపు మాత్రమె.ఆ గుర్తింపుని పది కాలాలపాటు నిలబెట్టేది చక్కని వ్యక్తిత్వం."..ఇలాంటి కామెంట్ music and lyrics మూవీ లో వస్తుంది....ఒక song లో melody imp or lyrics imp అన్న వాదన లో హీరోయిన్ explain చేస్తుంది "music is like personality of a man..the way he dresses, the way he behaves, and lyric is character of him...if you cant like the character you cant stick to him for a long time" అని... nice post