11, జనవరి 2011, మంగళవారం

ఎగురుతావ్...తప్పక ఎగురుతావ్!

అబ్బే! ఇప్పుడు మనకంత సినిమా లేదులెండి.ప్లేన్లో కూర్చొని....ఎప్పుడు డెస్టినేషన్ వస్తుందా అని ఎదురు చూసే బాపతు నేను! ఇప్పుడు కాదుగానీ...చిన్నప్పుడు నాకు ఎగరాలని బహుకోరికగా ఉండేది.ఆ సంగతులు కొన్ని చెప్తానే!

మా చిన్నపుడు అంటే...సుమారు...ఐదు...ఆరు తరగతులనుకోండి....అప్పుడు ఆటలు తెగ ఆడేవాళ్ళం.కరెంట్ షాక్,దాగుడుమూతలు.....కలర్-కలర్....అలా అన్నమాట.ఇవన్నీ స్కూల్ అయ్యాక....సాయంత్రం ఇంటిముందు ఉన్న పెద్ద ప్లే గ్రౌండ్లో ఆ వీధిలో ఉన్న పిల్లలందరం ఆడుకునే వాళ్ళం.కానీ రోజు రాత్రి ఏడింటికి ఠంచనుగా కరెంటు పోయేది.ఆ టైం నాకు భలే ఇష్టం.పిల్లలందరం కలిసి బాగా ఆడుకునే వాళ్ళం.కానీ రాను రాను అమ్మ...రోడ్ మీదకి వెళ్లోద్దని...డాబా మీద ఆడుకోమని అనేది.పాపం కదా అంతగా అడుగుతుంటే కాదనలేం కదా...అందుకే డాబా మీదా..మా ముందు ఇంటి పిల్లలైన కిరణ్,గాయత్రిలతో ఆడుకోవడం మొదలుపెట్టాం.ఆ చిన్న డాబా మీద ఎంత సేపు కరెంట్ షాక్ ఆడుకుంటాం? అందుకే ఇక మెల్లగా అంత్యాక్షరిలోకి దిగేవాళ్ళం.అలా కొద్దిరోజులు సాగిపోయింది.

రోజు వెన్నెల్లో....లేకపోతె నక్షత్రాల వెలుగులో...అలా ఆకాశంలోకి చూస్తూ పాటలు పాడుకోవడం అలవాటైపోయింది.కొద్దిరోజులకి ఆకాశం మీద ఇష్టం పెరిగింది.అక్కడక్కడ మినుకుమినుకుమని మెరిసే మిణుగురులు....అప్పుడప్పుడు దారి తప్పి లేటుగా ఇంటికి వెళ్ళే పాలపిట్టలు.....చూసి....చూసి...నాకు ఆకాశం లో ఎగరాలని కోరిక పుట్టింది.వాటికి నాకు ఏంటి తేడా? ఆ...రెక్కలు....ఎస్! రెక్కలు వచ్చేస్తే....నేను ఎగరోచ్చు అనుకున్నా! వెంటనే కిందకెళ్ళి రెండు టవల్స్ తీసుకొచ్చా! గాయత్రిని పిలిచా! విషయం చెప్పా! నమ్మేసింది పిచ్చిమోహంది.సరే అంది.ఇక ఇద్దరం టవల్స్ వెనక వీపుకి కట్టుకున్నాం.ఆ టవల్స్ అంచులని మా చేతుల మీద వేసుకున్నాం.అవి రెక్కలన్నమాట.అవి ఆడిస్తే...ఇక పైకి ఎగిరేసినట్టే అని చెప్పా గాయత్రికి.

ఇద్దరం  ఆ టవల్స్ కట్టుకుని...ఒంటి కాలు మీద నిల్చొని....రెక్కలు ఆడిస్తూ...(అదే! మా చేతులతో...టవల్ అంచులు ఆడిస్తూ) పైకి ఎగరడానికి సాధ్యమైనంత ప్రయత్నించాం.అబ్బే! ఇంచి కూడ పైకి లేవలేదు.అపుడు నాకొక ఐడియా వచ్చింది.ఏరోప్లేన్ ఎలా ఎగురుతుంది? చాలా దూరం రన్వే మీద పరిగెత్తి....పరిగెత్తి....అప్పుడు జింగ్ మని పైకి ఎగురుతుంది.సో! సేం ప్రిన్సిపిల్. మనం కూడ అలాగే పరిగెత్తుకుంటూ గాల్లో లేద్దాం....అంతే....మనం కూడా ఎగిరేస్తాం! అని చెప్పి గాయత్రికి గీతోపదేశం చేశా! నాకంటే తింగరిది.ఇది కూడ నమ్మేసింది.ఇక ఇద్దరం డాబా ఆ చివర నుండి...ఈ చివరకి పరిగెట్టడం మొదలుపెట్టాం. పరిగెత్తాం.. పరిగెత్తాం.. .నేను ముందు..గాయత్రీ వెనుక.డాబా చివరకి వచ్చేస్తోంది....ఇక ఎగరడమే తరువాయి..అని గాల్లోకి జంప్ చేశా! ఇక ఎగిరినదాన్ని అలాగే పైకి వెళ్ళిపోతాను అనుకున్నా! అదేంటో మరి ఏరోప్లేన్ ప్లాన్ వికటించింది.అక్కడే డాబా మీద ధబీల్మని పడ్డాను.రెండు మోకాలు చిప్పలు పగిలాయి.నేను 'కుయ్యో మర్రో' అని మూలిగేలోగా.....ఏనుగుతల్లి  సైజులో ఉన్న ఆ గాయత్రి దేవి వచ్చి ఎలకపిల్లలా ఉన్న నామీద పడింది.నేను ఇంకా పాతాళంలోకి కూరుకుపోయాను.'ఇదేంటబ్బా? గాల్లో ఉండాల్సింది....ఇలా పాతాళం లో ఉన్నాను?' అని డౌట్ వచ్చి చూసుకుంటే...ఏముంది...ఎక్కడ వేసిన గొంగళి అక్కడే....ఎక్కడ ఎగిరిన మనుషులం అక్కడే కూలబడ్దాం.ఏనుగుతల్లి...సారీ గాయత్రీ వల్ల అణచబడ్డ నేను మెల్లగా అలాగే కుంటుకుంటూ లేచి.....లేవలేక గిలగిలా కొట్టుకుంటున్న  మా గాయత్రిని కూడా లేపి కూర్చోబెట్టా!

కాసేపు ఏంజరిగిందో అర్ధం కాలేదు తనకి.గుక్కెడు నీళ్ళు తాగించి....డిప్పమీద ఒక్కటిస్తే....దెబ్బకి ఈ లోకంలోకి వచ్చింది.సరే! వచ్చింది ఊరుకొవచ్చు కదా! వాడకుండా తుప్పట్టిపోయిన బుర్రని బయటకు తీసి....ఆయిల్ పోసి ఆడించడం మొదలుపెట్టింది.
'అవును ఇందు!? అలా పరిగెత్తుకుంటూ వస్తే ఏరోప్లేన్ లా ఎగురుతాం అన్నావ్!? మరి ఇలా కూలిపోయమేంటి?అసలు నువ్వు చెప్పింది నిజమేనా?మనం ఏరోప్లేన్లా ఎగరగలమా?'....అని అడిగింది.
(అలా మరీ డైరెక్ట్ గా అడిగితే ఏం చెప్తాం??...ఇక నా షార్ప్ బ్రెయిన్ ని నేను బూజు దులిపా!)
'మానవుడు సాధించలేనిది ఏది లేదు గాయత్రీ! జస్ట్ మన మీద మనకి నమ్మకం ముఖ్యం.అంతే! సంకల్పమే సగం బలం.నేను ఎగరగలను అనుకుంటే తప్పకుండా ఏదో ఒకరోజున ఎగురుతావు గాయత్రీ....ఎగురుతావ్!'('నువ్వు నాకు నచ్చావ్' లో  సునీల్ డైలాగ్ లా లేదు! హ్మ్! నా డైలాగే కాపీ కొట్టేసాడు త్రివిక్రమ్ ఏం చేస్తాం! కలికాలం!)
ఇలా మళ్లీ చిన్న సైజ్ గీతోపదేశం చేసి.....రెండు తువ్వాళ్ళు మీదేసుకుని.....కుంటుకుంటూ......మా అమ్మ చేత తిట్లు తినడానికి   ఇంటికి బయలుదేరాను.నేను వెనక్కి తిరిగి చూడలేదు కానీ....మళ్లీ 'ధబీల్' మని పడుంటుంది గాయత్రీ. అదన్నమాట సంగతి.చూసారా...నేనెంత గ్రేటో! :))

20 కామెంట్‌లు:

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా. ఇందు గరు, అద్దిరింది టపా.. ఇంకా నయం, డాబా మీదే పడ్డారు. డాబా నుండి కింద పడలేదు;)

భాను చెప్పారు...

సూపరో..సూపర్ కాసేపు నవ్వుకునేలా చేశారు

SHANKAR.S చెప్పారు...

పాపం మీ గాయత్రి ఆ తరవాత చాలా కాలం "ఎగిరిపోతే ఎంత బావుంటుంది" అని పాడుకుని ఉంటారు.:)

మేమూ చిన్నప్పుడు గాలిపటాలు తయారు చేసుకుంటున్నప్పుడు ఇలాంటి ఆలోచనే వచ్చేదండీ. పది న్యూస్ పేపర్స్ అంత పెద్ద గాలిపటం చేసుకుని దాని దారం పట్టుకుంటే మనమూ సులువుగా గాల్లోకి ఎగిరేయచ్చని చాలా బలంగా నమ్మేవాళ్ళం.

Ennela చెప్పారు...

"గుక్కెడు నీళ్ళు తాగించి....డిప్పమీద ఒక్కటిస్తే....దెబ్బకి ఈ లోకంలోకి వచ్చింది"...super... we used to do this to old radio and some times to TV....hahaha...meereomo ekangaa gaaytri meeda...poor gayatree, i pity you...

kiran చెప్పారు...

హహ్హ...ఇందు..నేను మీకు చిన్నప్పుడే తెల్సన్న మాట.. :)
అనవసరంగా గీత చదువుతున్న అండి..
మీ దగ్గరికి వస్తే మొత్తం కాన్ఫిడెన్సు ని encouragement ని జీవిత సత్యాల ని చెప్పేస్తారు కదా... :)
అయ్యో..మన personaltiy ఉన్న వాళ్ళని చుస్కునే ఆడుకోవలండి.. :)
ఎగరాలి..ఏదో ఒక రోజు మా ఇందు ఎగరాలి... :)

ఇందు చెప్పారు...

@ మనసు పలికే:హీహీహీ!! లేదండీ...పిట్టగోడ కొంచెం పెద్దది కదా! ఆక్కడే పడ్డాం! నేను దీనికి కూడా ముందే స్కెచ్ గీసా! పడకుండా ఎగరడం ఎలా? అని :))

@ భాను :థాంక్యూ భానుగారు :)

@SHANKAR.S:ఆ నామొహంలేండీ ఆ పిల్లకి ఎంతసేపటికీ అచ్చినగిల్లాలు ఆడడం తప్ప ఏమీ రాదు :))

మీకు వచ్చిందా? అంతేనండీ...రైట్ బ్రదర్స్ మనలాంటి ఆలొచనలతొనే కదా ఏరొప్లెన్ కనుక్కుందీ :) అసలు మనమూ కనుక్కునేవాళ్ళమే...కానీ ఆల్రెడీ కనుక్కున్న విష్యాన్ని మళ్ళి కనుక్కుంటే బాగోదని వదిలేసం అంతే :)

@ రాధిక(నాని ) : :)

@ Ennela:హ్హహ్హహ్హా! మరే! మనతో ఫ్రెండ్షిప్ అంటే అంతే!(ఇందులో మీకు మినహాయింపు కలదు) :))

లత చెప్పారు...

భలే ఉందండీ ఈ ఐడియా ఎలా వచ్చిందో మీ చిన్న బుర్రకి.నిజంగానే గ్రేట్ మీరు.
ఎక్కడ డాబా మీదనుండీ పడిపొయారో అని టెన్షన్ గా చదివాను.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ ఇందుగారు మీరు నిజంగా గ్రేట్ అండీ.. అసలు ఆ ఐడియాకీ పైగా మీ నేస్తానికి మీరిచ్చిన ప్రోత్సాహానికి జోహార్ అంతే :-)

Padmarpita చెప్పారు...

భలే ఉందండీ:):)

ఇందు చెప్పారు...

@ లత:థాంక్యూ...థాంక్యూ..ఏదో అంతా మీ అభిమనం :) నేనెప్పుడూ అంతే! అలా కంగారు పెట్టేస్తా!

@ వేణూ శ్రీకాంత్:హిహి! థాంక్యూ...థాంక్యూ వేణూగారు...నేనెప్పుడూ గ్రేటే! ఏంటో ఎవరూ నా గ్రేట్నెస్ గుర్తించరూ!

@'Padmarpita': Thnakyouuuuuuuu Padmarpita garu :)

స్నిగ్ధ చెప్పారు...

ఇందు గారు, నేనూ అనుకున్నాను మీరు డాబా మీద నుంచి పడిపోయారేమో అని...
ఏం కాలేదు కదా...
మీరు ఇంత అల్లరి వారా? అస్స్సలు నమ్మబుద్దవడం లేదు....
:)

మంచు చెప్పారు...

అయ్యో... మీరు కాటన్ టవల్ వాడారా... అక్కడే సమస్య...మీరు టర్కి టవల్ తొ ట్రై చెస్తే మీ ప్రయోగం ఫలించేది..మిస్స్ అయిపొయారు. అయినా అలా ఒక్కసారికే అలా నిరుత్సాహ పడకుండా ఇంకొంచెం ప్రాక్టీస్ చేసుండాల్సింది కదా... ఇప్పుడు ఫ్రీ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికెల్దురు :-)

Ram Krish Reddy Kotla చెప్పారు...

నిజమే ఆకాశంలో ఎగిరితే ఎంత బాగుంటుందో.. హాయిగా ఈ టికెట్లు.. పాస్పోర్టులు... వీసాలు లేకుండా ఏ దేశానికైనా స్వేచ్చగా వెళ్లిపోవచ్చు ... ఈ విషయాన్ని పరిశీలించి పక్షులులాగా మానవులకి కూడా త్వరలోనే రెక్కలు కూడా ఇంక్లూడ్ చేస్తాడని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా...

Unknown చెప్పారు...

ఇందు గారు మీరు చాలా టూ మచ్ పాపం గాయత్రీ ఎక్కడున్నా ఒక్కసారి ఇలా వచ్చి నాకు కనిపిస్తే .. ఇందు గారితో ఎలా అడుకోవలో నేను చెప్తా :)

శివరంజని చెప్పారు...

ఇందు గారు భలే రాశారండి .. నాకయితే ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంటుంది ..... "ఎగురుతావ్...తప్పక ఎగురుతావ్!"

మాలా కుమార్ చెప్పారు...

బాగుంది :)

కృష్ణప్రియ చెప్పారు...

:)) పోస్ట్ ఎప్పటిలాగే సూపర్.. మీ ప్రొఫైల్, టైటిల్ పక్క కాప్షన్.. చాలా అందం గా ఉన్నాయి..

ఇందు చెప్పారు...

@ snigdha:హిహిహి! అంతా మీ భ్రమ :) నేనెప్పుడూ ఇంతే! భయంకరమైన అల్లరి.కాని ఎక్కడా శ్రుతి మించదు :)

@ మంచు:కాటన్ టవల్ కాబట్టి డాబామీదే పడ్డా! అదే మీరు చెప్పినట్టు టర్కీ టవల్ ఐతే డాబా మీదనించి కింద పడేదాన్ని :)) అబ్బా! నన్ను కిందపడేయాలని ఎంత ఆశో మీకు :)) ఆ! అందుకేగా గాయత్రికి చెప్పా! కంటిన్యు చేయమని :))


@ Kishen Reddy:అవును కిషన్! హాయిగా ఆ ఏర్పాటు ఉంటే ఎంత బాగుండో! జింగ్ జింగ్ అని ఎగురుకుంటూ వెల్లిపోవచ్చు :)

ఇందు చెప్పారు...

@kavya: Kavya is a gudgirl.Ala cheppadugaa :)


@ శివరంజని :Hihihi! Thankyou Siva!

@ మాలా కుమార్ :Thankyou Malakumar garu :)

@ కృష్ణప్రియ:Thankyou Krishnapriya garu :)

స్నిగ్ధ చెప్పారు...

మీరిచ్చిన రిప్లై చూడలేదండీ...ఇప్పుడే చూస్తున్నాను. మీరు చెప్పింది కరెక్ట్..
అల్లరి చేయాలి కానీ శృతి మించకూడదు...
:)