'యమునా తటిలో'....అనగానే ఎవరు గుర్తొస్తారు? రాధాకృష్ణులే కదా! నల్లని యమున ఒడ్డున....తెల్లని పండువెన్నెల కురుస్తున్న వేళ....చల్లని వేణుగానం చెవులకి సోకుతుంటే.....ఘల్లు..ఘల్లను గోపాలుని మృదుపదసవ్వడి కోసం ఎదురుచూస్తూ.....ఎంతకీ కానరాని నల్లనయ్యకై రాధాదేవి పడే బాధ ఏమని వర్ణింపనూ??
బృందావనంలో....ప్రతి ఆకు-కొమ్మ....పువ్వు-రెమ్మా.....నింగి-నేల.....చీమ-చిలుక కన్నుల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేది ఒక్కరికోసమే కదా! మోహనాంగుడు...మురళీధరుడు...లీలామనుషరూపుడు అయిన ఆ మాధవుని కోసమే కదా! మరి మాధవుడు రాకపోతే?? రాధ ఎదురు చూపులు అడవి కాసిన వెన్నెలైపోతే? ఆ భావాలను జయదేవుడు 'గీతాగోవిందం'లో ఎన్నో విరహకీర్తనల్లో వర్ణించాడు.....'సావిరహే' కీర్తన అందరికీ తెలిసే ఉంటుంది.
" నిందతి చందన ఇందు కిరణమను విందతి ఖేద మధీరం.....
వ్యాళనిలయ మిళనేన గరళమివ కలయతి మలయ సమీరం....
మాధవ మనసిజ విశిఖ భయాదివ భావనయా త్వయిలీనా.....
సావిరహే తవదీనా....సావిరహే తవదీనా....."
'సావిరహే తవదీన' అంటే తెలుసుకదా....ఈ పాటలో 'నీకై ఎదురుచూస్తున్న రాధ' అని అర్ధం.జయదేవుని అష్టపదులలో నాకు అత్యంత ఇష్టమైనది....కొంచెం కష్టమైనది కూడా ఇదే! మరి అంతే కదా.... కృష్ణుడు లేక రాధ పడుతున్న బాధను వర్ణిస్తూ.....ఆమె చెలి పాడే ఈ గీతం, రాధమనోవేదనను కళ్ళముందు నిలుపుతుంది.ఎంత బాధపడుతున్నదో కదా అనిపిస్తుంది.
జయదేవుని పాటల్లో రాధ బాధ ఎంత హృద్యంగా వర్ణించాడో.....అంతే అందంగా ఉంటుంది....ఇంకో విరహ గీతం. ఆ భావాన్ని కళ్ళకు కట్టినట్టు..... రాధాహృదయవాణిని కనిపెట్టినట్టు ఉన్న ఈ పాట కూడా నాకు చాలా చాలా ఇష్టం.ఎడబాటులో ఉన్న వేదన,తపన,వ్యధ,బాధ అన్నీ పొందుపరిచిన ఈ గేయం 'దళపతి' సినిమాలోనిది.ఈ పాటలో ఒకచోట....'పాపం రాధా' అనే వాక్యం వస్తుంది.నాకైతే అది వింటున్నప్పుడల్లా..... 'నిజమే! పాపం కదా! రాధా!' అనిపిస్తుంది.అంతే కాదు పైన చెప్పిన జయదేవుల అష్టపది జ్ఞప్తికి వస్తుంది.
" నిందతి చందన ఇందు కిరణమను విందతి ఖేద మధీరం.....
వ్యాళనిలయ మిళనేన గరళమివ కలయతి మలయ సమీరం....
మాధవ మనసిజ విశిఖ భయాదివ భావనయా త్వయిలీనా.....
సావిరహే తవదీనా....సావిరహే తవదీనా....."
'సావిరహే తవదీన' అంటే తెలుసుకదా....ఈ పాటలో 'నీకై ఎదురుచూస్తున్న రాధ' అని అర్ధం.జయదేవుని అష్టపదులలో నాకు అత్యంత ఇష్టమైనది....కొంచెం కష్టమైనది కూడా ఇదే! మరి అంతే కదా.... కృష్ణుడు లేక రాధ పడుతున్న బాధను వర్ణిస్తూ.....ఆమె చెలి పాడే ఈ గీతం, రాధమనోవేదనను కళ్ళముందు నిలుపుతుంది.ఎంత బాధపడుతున్నదో కదా అనిపిస్తుంది.
జయదేవుని పాటల్లో రాధ బాధ ఎంత హృద్యంగా వర్ణించాడో.....అంతే అందంగా ఉంటుంది....ఇంకో విరహ గీతం. ఆ భావాన్ని కళ్ళకు కట్టినట్టు..... రాధాహృదయవాణిని కనిపెట్టినట్టు ఉన్న ఈ పాట కూడా నాకు చాలా చాలా ఇష్టం.ఎడబాటులో ఉన్న వేదన,తపన,వ్యధ,బాధ అన్నీ పొందుపరిచిన ఈ గేయం 'దళపతి' సినిమాలోనిది.ఈ పాటలో ఒకచోట....'పాపం రాధా' అనే వాక్యం వస్తుంది.నాకైతే అది వింటున్నప్పుడల్లా..... 'నిజమే! పాపం కదా! రాధా!' అనిపిస్తుంది.అంతే కాదు పైన చెప్పిన జయదేవుల అష్టపది జ్ఞప్తికి వస్తుంది.
ఈ పాట వినడానికి ఎంత బాగుంటుందో....చూడడానికి అంతే ఆహ్లాదంగా ఉంటుంది.నది ఒడ్డున చిన్నపిల్లలకి సంగీతం నేర్పిస్తూ శోభన పాడే ఈ గేయం..... ఎంత బాగున్నా....ఒక బాధావీచిక అలా గుండెని తాకి వెళ్ళిపోతుంది.ఇళయరాజా గారి సంగీతం గురించి నేనిప్పుడు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక ఇంత చిన్ని పాట....అంత అందంగా వ్రాసిన 'రాజశ్రీ' గారికి హాట్సాఫ్! డబ్బింగ్ సినిమా అయినా.... శోభన ముఖకవళికలకి అతికినట్టు సరిపోయే లిరిక్స్ వ్రాసారు.మధురమైన ఈ గేయాన్ని మధురాతిమదురంగా ఆలపించారు స్వర్ణలత.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సాహిత్యం:
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురుచూసెనే రాధా!
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా!
రేయి గడిచెను....పగలు గడిచెను....మాధవుండు రాలేదే!
రాసలీలలా...రాజు-రాణిదే రాగబంధమే లేదే!!
యదుకుమారుడే లేని వేళలో.....వెతలు రగిలెనే రాధ గుండెలో.....
పాపం.......రాధా...
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురుచూసెనే రాధా!
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఈ పాట వీడియో క్రింద ఇస్తున్నా....చూడండీ....ఎంత బాగుంటుందో!
ఇక,ఈ పాట డౌన్లోడ్ లింక్ ఇక్కడ.(ఇది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది.)
స్లో గా ఉన్నది వినాలనుకుంటే ఇక్కడ
ఈ పాట ఆన్లైన్లో వినాలనుకుంటే....ఇక్కడ.
ఇక ఈ పాట విడియో....ఇదిగో!
35 కామెంట్లు:
ఈ పాట నాక్కూడా ఇష్టం. :)
ఇందు గారూ !
మంచి పాట..... మంచి వ్యాఖ్యానం.... ధన్యవాదాలు.
ఇందు ..నాకు ఈ పాట ఎంత ఇష్టమో చెప్పలేను.. :)
repeat పెట్టేసి కొన్ని వందల సార్లు వినేదాన్ని..:)
ఇక ఆ పాపం రాధా,...దగ్గర ఆ చిన్న వణుకు ఉంటుంది అదంటే చాలా ఇష్టం...:)
బాగుంది నీ పోస్ట్...కృష్ణుడు నీ దగ్గరికి వచ్చేస్తాడు ఈ రోజు...చాలా బాగా చెప్పావ్ కదా మరి.. :)
బావుంది.
భానుమతి పాడిన వెర్షను సలలితంగా ఉంటుంది. పాట ముగింపులో వచ్చే ఆలాపనలో ఆవిడగొంతు నిజంగా తీగలౌ సాగుతుంది. అదే దర్బారీ కానడ రాగంలో ప్రముఖ విద్వాంసులు టి. ఎన్. శేషగోపాలన్ గారు పాడే పద్ధతి అయితే ఆ రాధపడే మనోవేదనకి అద్దం పట్టినట్టుగా ఉంటుంది.
యమునా తటిలో అంటే సుశీల పాడిన ఒక పాత పాట - వేణుగాన లోలుని గన వేయికనులు చాలవులే (రాగం దేశ్ అనుకుంటా) గుర్తొచ్చింది. అందులో సుందర యమునా తటిలో అనే పాదం పై నెరవులు వేసి పాడారు.
చాలా బాగా రాశారు
@ మధురవాణి :మధురగారూ...మీకు ఇష్టమేనా :) Gud gud.
@ SRRao: మీకు బోలెడు థాంకూలు అండీ.నా బ్లాగుకి వచ్చి టపా చదివి,అది మీకు నచ్చి కామెంటినందుకు :)
@ kiran: అవును కిరణ్.నేను కూడా....అన్ని పాటల్లాగా ఒకసారి విని వదిలేయబుధ్ధి కాదు కదా! ఎన్ని సార్లు వింటే అంత మనసుకి హత్తుకుంటుంది.అదేమి చిత్రమో! హ్హహ్హా కృష్ణుడు వచ్చేస్తాడంటావా? అంతకంటే ఏంకావాలి చెప్పూ? :)
@ కొత్త పాళీ :అవునండీ! నేను భానుమతిగారిది విన్నాను.శేషకుమార్ గారు పాడినది వినలేదు.మీకు బోలెడు రాగాలు తెలుసండోయ్! :) ఏమిటండీ ఈ మధ్య బొత్తిగా నల్లపూసయిపోయారు! బ్లాగుల్లో ఎక్కడా చడీచప్పుడు లేదు అసలు?
చాలా మంచి పాటండి . నాకూ చాలా ఇష్టం .
మీ వివరణ బాగుంది .
థాంక్స్ ఫర్ షేరింగ్ ఎ గుడ్ సాంగ్. జయదేవుని అష్టపదులు చదవాలని పుస్తకం ఎప్పుడో తెచ్చా. మీ టపా చదివాక అర్జెంట్ గా చదివేయ్యాలనిపించింది
అవును, ఈ మధ్య పని వత్తిడి బాగా ఎక్కువైంది. ఇప్పుడైనా, ఒక కాన్ఫరెన్సు కాల్ కోసం ఎదురు చూస్తూ చిన్న టైం పాస్. 22 న డీటీయేకి వచ్చారా? బైదవే, శేషకుమార్ కాదు, శేషగోపాలన్. నాకు ఆన్లైన్లో సంగీతం వెదకడం చేతకాదు. మీకు చేతనై ఆయన పాడిన వెర్షను దొరికితే తప్పక వినండి.
@ లత :థాంక్యూ లత గారూ :)
@ మాలా కుమార్:ధన్యవాదాలు మాలాకుమార్ గారూ! మీ డిస్ప్లె పిక్ లో చిలకలు బాగున్నాయ్! ముద్దుముద్దుగా! :)
@ భాను :థాంక్యూ భానుగారు! ఏం పుస్తకం తెచ్చారు? నాదగ్గర ఒక బుక్ ఉంది.ప్రతి పాటకి అంత వివరంగా కాకపోయినా కొంచెం విశదీకరించిన అర్ధం ఉంటుంది.మీదగ్గర ఉన్న పుస్తకం పేరు...పబ్లికెషన్స్ చెబుతారా?
@కొత్త పాళీ: అవునా! ఓకే! సారి...ఆయనెవరో తెలియదు కదా అందుకే అలా మిస్టేక్! నేను వెదుకుతాలేండీ... :) డీటీయేకి రాలేదందీ....ముందుగా నాకు ఆ సభ్యత్వం అదీ తీసుకోవడం తెలీదు :( అందుకే ఆ సమావేసాలకి రావొచ్చో,లేదొ తెలీదు :( వచ్చినా...అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా! అందులో మనల్ని పిపీలికాల్ల చూస్తారేమో అని భయం కూడా :(
ఇందూ ,బాగా వ్రాసారు.
నిందతి చందన ఇందు కిరణమను విందతి ఖేద మధీరం...సావిరహే తవదీనా,
వేణుగాన లోలుని గన వేయికనులు చాలవులే....
పాడవేల రాధికా, ప్రణయ సుధా గీతికా
యమునా తీరమునా సంధ్యా సమయమునా...
యమునా తటిలో నల్లనయ్యకై ...
వెన్న దొంగా...మా తొలి గురువు..తొలి నుంచి మా కుల గురువు..
ఇలా యే పాట తీసుకున్నా కృష్ణుడిదయితే చాలు ఒక స్పెషాలిటీ వచ్చేస్తుంది..కొన్ని సార్లు..అయ్యొ, ఇంకా రాలేదా అనిపిస్తే, ఇంకో సారి..వచ్చేసాడొచ్చేసాడొయ్...వెన్నెల్లు తెచ్చేసాడోయ్ అనిపిస్తుంది...మరి కిరణ్ చెప్పినట్టు..వచ్చేస్తున్నాడు మీ ఇంటికి..బాగా చూసుకోండి...
బ్లాగ్ టెంప్లేట్ అచ్చంగా వెన్నెలతరకలా ఉంది. శుభాకాంక్షలు.
గీతాగోవిందం పదచ్చేద,టీకాతాత్పర్యాలతో, చాలా మంచి భాష్యంతో, సాహిత్య గుణవిశేషాల వివరణతో ఇక్కడ చూడగలరు. కాపోతే ఒక్కటే బాధ తెలుగు లిపిలో లేదు. అయితేనేం? ఆ చంద్రకళ కోసం చాతకాలు ఆ మాత్రం శ్రమించకపొతే ఎలా?
http://www.giirvaani.net/
ఇందులో ఉన్నంత మంచి resource గీతాగోవిందామృతానికి నాకిన్కొకటి దొరకలేదు.
Enjoy
మీ టపాలో మంచి పాటను గుర్తు చేసారు థాంక్స్.
హాహహహ్హ :(( ఇందు నేను ఒప్పుకోను అంటే ఒప్పుకోను (just kidding ), 2 day's back ఈ సాంగ్ ఫై నేను పోస్ట్ కొంచం రాసుకున్నా.. పాట సాహిత్యం కూడా నోట్ చేసి పక్కన పెట్టా..పోస్ట్ చేద్దాం అనుకున్నా ..కుదరలేదు :(( what a co:incidence yaa :)) చాల బాగా రాసావ్ :) నాకు ఈ పాట అంటే పిచ్చి ఇష్టం :)
@ Ennela:అబ్బ! ఎన్ని పాటలు గుర్తుచేసారండీ! అవును కృష్ణుడుంటే ఆ స్పెషాలిటీయే వేరు! హ్హహ్హహా! కృష్ణుడు మా ఇంటికొస్తే....ఎన్నెలగారి బ్లాగ్ చూపించేస్తా! అక్కద ఉన్న బుడుగుగాడితో ఆడేసుకుంటూ ఇక మీ బ్లాగ్ వదిలి రాడేమో!
@భావకుడన్ :ధన్యవాదాలండీ మీకు నా బ్లాగ్ అంతగా నచ్చినందుకు...ఇంకా అంత మంచి లింక్ ఇచ్చినందుకు.నేను ఆ బుక్ ఇండియాలో పెట్టివచ్చేసా! ఇప్పుడు ఈ సైట్ తెలిసింది...థాంక్స్ అండీ :)
@ విరిబోణి:హేయ్ విరిబోణి....అవునా! మీరు రాదామనుకున్నా? ఒకపని చేయండీ...ఒక్క వారం ఆగి మీరు పోస్ట్ చేసేయండీ....వెన్నెల అందరికి ఉంటుంది.కాని అది చూసే విధానంలో తేడా ఉన్నట్టే....మీరు రాసే విధానం వేరుగా ఉండొచ్చుగా! పాట అందరికీ తెలుసు...అది మీకు ఎలా,ఎందుకు నచ్చింది..మీ ఫీలింగ్ ఏంటీ అన్నది ముఖ్యం కదా! మీ టపా కోసం ఎదురుచూస్తు ఉంటా..తప్పకుండా వేయాలి మరి :)
ఏమోనండీ ఈ పాట ఎప్పుడు విన్నా నాకు "యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధ వేచి ఉన్నది కాదా?" అనే పాటే మనసులో మెదులుతుంది. మళ్ళీ ఆ పాటని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
అన్నట్టు మర్చేపోయాను ఆ కృష్ణుడిని మా(మన) "భూమ్మీది సరస్వతీదేవి" "గిరిధర గోపాలా బాలా" అని ఆలపిస్తుంటే ఈ పాటలన్నీ ఏ మూలకి?
లింక్ ఇస్తున్నా చూడండి. నాకయితే ఆ గొంతు విని ఆ నల్లనయ్య నిలువెల్లా పులకరించి పోతాడనిపిస్తుంది.
http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_24.html
indu pampicheyyandi..naa blog lo budugu to paatu intlo unna budugulu baaga aadistaaru kuda...intlo andarikee ishtam..maa seetayya gaarikee vishayam cheppaanantey..ippati kippudu mee intiki vachchestaaru...vetukkOdaaniki....
@ SHANKAR.S:అవునండీ ఆమె నిజంగా భూలోక సరస్వతే! కానీ ఆమె పాడిన వేంకటేశ్వర సుప్రభాతం,భజ గోవిందం ముందు నాకు ఇంకేవీ కనపడవు! అసలు రోజు పొద్దున్నే ఆ సుప్రభాతం పెట్టుకుని వింటూ పనులు చేసుకుంటుంటే...అలుపే తెలీదు.తిరుపతిలో ఉన్నామా...ఇంట్లో ఉన్నమా అన్నట్లు ఉంటుంది.దేవుడు కూడా మనలాగే అంతే మైమరచిపోయి వింటాడేమో కదా!అందుకే తన దగ్గరకి రప్పించేసుకుని దాచిపెట్టేసుకుని రోజు పాడించుకుంటున్నాడేమో...వైకుంఠంలో!:)
@Ennela:అమ్మా! మా కిట్టయ్యని అట్టేపెట్టేసుకుందామనే!! ఆశ!దోశ!వడ!అప్పడం! ఇల్ల..ఇల్ల...[తమిళంలో] ఏదొ కాసేపు ఎన్నెల్లొ ఆడుకుని రావదానికి మీ బ్లాగ్‌కి పంపిస్తా అన్నా! అంతే! ఆయ్! మా కిట్టయ్యని మంచు ఖండం కెనడా పంపడమె! NO WAY :P
పాట ఇష్టమే కాని సినిమాని తలుచుకుంటేనే కష్టం .. :(
చిన్నప్పుడు "ఆడ జన్మకు ఎన్ని సోకాలో .. చిన్ని నాన్నకు ఎన్ని సాపాలో " కెవ్వ్ .. బాబోయ్ ఎడిచేసేదాన్ని ఈ సినిమా చూసి ..
బాగా రాసావ్ ఇందు ..మంచి టాలెంట్ ఉంది ...
chhala rojula tarvata ee paata gurochindi mee blog chadavagane....
ఇందు గారూ ఓ సారి పుస్తకాలు చూస్తుంటే ఇది కనిపించింది. ఇంటరెస్ట్ తో తీసుకున్న మీరన్నట్టు పూర్తిగా కాకున్నా క్లుప్తంగా వివరించారు ఇది "G.V.S.SON Fortgate, Rajahmundry-1 వాళ్ళది రచయితా కోట రవికుమార్. టైట్లేమో జయదేవుని అష్టపదులు. సింపుల్ గా బాగుంది.చదవాలి
వావ్.. ఇందు గారు, ఎంత మంచి పాటని గుర్తు చేసారు:) నాకు చాలా చాలా ఇష్టమైన పాట. ఈ పాట వింటూ ఉంటే నాకు కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. అవన్నీ ఒక టపా రాస్తా:) మీ టపా మాత్రం సూ..పరు..
నాకూ ఈ పాట ఇష్టం...కానీ సావిరహే మాత్రం పాడితే భానుమతిగాతే పాడాలి. విప్రనారాయణలో ఆవిడ పాడిన పాట వింటే మైమరచి ఏవో లోకాలకి వెళ్ళిపోతాం.....చివర్లో "విరహే తవదీనగాధ" అని పాడే ఆలాపన..ఓహ్ అద్భుతం.
ఈ పాట నాక్కూడా ఇష్టం. :)
ఇందు గారూ !
apidiya...(tamil)
meeru aafeesukellinappudu memu aadukuni...meeru intikochche time ki pampinchestaamuley...ok na?
చాలామంచి పాటకి చాలా బాగారాసారు.ఈ పాట నాకు చాలా ఇష్టం .
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురుచూసెనే రాధా!
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా!
ఇందు గారూ నాకు ఈ పాట ఎంత ఇష్టమో చెప్పలేను..
మీ వివరణ బాగుంది .
చాలా మంచి పాట గుర్తు చేసారు
kudos to రాజశ్రీ&ఇళయరాజా
@కావ్య:నిజమే! కానీ మనం చెడులో కూడా మంచిని చూడాలికదా! ఈ పాట మాత్రం సూపరులే!
@ sanju -The king!!!: Thanq Sanju :)
@ భాను:ధన్యవదాలు భానుగారు :) ఇక్కడ ఒక బ్లాగరు వెబ్సైట్ ఇచ్చారండీ.అది కూడా చాలా బాగుంది.ఐతే తెలుగులో లేదు :(
@ మనసు పలికే:అవునా! వావ్! ఐతే రాసేయండి ఒక టపా! :)
@ ఆ.సౌమ్య:అవును సౌమ్యగారు....ఆమె చాలా అద్భుతమైన పాటాలు పడారు.పెక్యులియర్ వాయిస్.ఈ పాట నిజంగా ఎంత అందంగా పాడారో!
@ చెప్పాలంటే......: అవునా! వెరీగుడ్ చెప్పాలంటేగారు :)
@ Ennela:ఈ ఒప్పందమేదో బానే ఉంది.ఐతే వాకే! :))
@ రాధిక(నాని ):ధన్యవాదాలు రాధికగారు :)
@ శివరంజని:థాంక్యూ రంజనీ :)
చాల బావుంది ఇందు గారు.....
ఒక మంచి పాట గుర్తు చేసారు......
Thankyou Ramakrishna garu :)
namsthey INDHU garu,
chinna sandheham...
" Raasaleelala Raju-Rani(queen)dhe raaga bhandhame ledhe.."
ani meru ichaaru..
kaani ippati varaku nenu aa pata sahityanni vere vidham ga ardham cheskunaa...
" Raasaleelala Raaju raaanidhe raaga bhandhame ledhe... " ani.
Ante Na udhesyamlo, Ikada Raasaleelala raju ayina Krishnudu raakapothe(raanidhe) raagabandham anedhe ledhu ani anukunna...
Manchi Post sumandee..!
కామెంట్‌ను పోస్ట్ చేయండి